Shuru
Apke Nagar Ki App…
మందమర్రి: ప్రజల క్షేమం కోసం అమ్మవారి సన్నిధిలో ఎమ్మెల్యే ప్రత్యేక పూజలు మందమర్రి పట్టణంలోని త్రిశక్తి అష్టలక్ష్మి మహంకాళి కామాఖ్య అమ్మవారి ఆలయంలో ఎమ్మెల్యే గడ్డం వినోద్ వెంకటస్వామి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమ్మవారిని దర్శించుకుని నియోజకవర్గ ప్రజలు సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని ప్రార్థించారు. ఆలయ పండితులు ఎమ్మెల్యేకు పూర్ణకుంభ స్వాగతం పలికి శాలువాతో సత్కరించారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, భక్తులు పాల్గొన్నారు.
M S SRIDHAR
మందమర్రి: ప్రజల క్షేమం కోసం అమ్మవారి సన్నిధిలో ఎమ్మెల్యే ప్రత్యేక పూజలు మందమర్రి పట్టణంలోని త్రిశక్తి అష్టలక్ష్మి మహంకాళి కామాఖ్య అమ్మవారి ఆలయంలో ఎమ్మెల్యే గడ్డం వినోద్ వెంకటస్వామి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమ్మవారిని దర్శించుకుని నియోజకవర్గ ప్రజలు సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని ప్రార్థించారు. ఆలయ పండితులు ఎమ్మెల్యేకు పూర్ణకుంభ స్వాగతం పలికి శాలువాతో సత్కరించారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, భక్తులు పాల్గొన్నారు.
More news from తెలంగాణ and nearby areas
- మురుగునీరు నిల్వ ఉండకుండా చూడాలని బిఆర్ఎస్ నాయకుడి వినతి జన్నారంలోని ప్రధాన రహదారికి ఇరువైపులా ఉన్న దుకాణాల ముందు మురుగు నీరు నిలువ ఉండకుండా చర్యలు తీసుకోవాలని బిఆర్ఎస్ నాయకులు సాయికిరణ్ కోరారు. మంగళవారం ఆయన మాట్లాడుతూ జన్నారంలో ప్రతి మంగళవారం వారసంత జరుగుతుందన్నారు. అయితే ఇటీవల కురిసిన వర్షాలకు రోడ్డుకు ఇరువైపులా మురుగునీరు నిలిచి దుర్వాసన వస్తుందన్నారు. దీంతో చిరు వ్యాపారులు ప్రజలు ఇబ్బంది పడుతున్నారని, నీరు నిలవకుండా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు.1
- జన్నారం మండలంలోని వినాయక ఉత్సవాలపై పోలీసుల దిశానిర్దేశం జన్నారం: వినాయక చవితి వేడుకలు ప్రశాంతంగా, స్నేహపూర్వక వాతావరణంలో జరిగేలా జన్నారం పోలీస్ స్టేషన్‌లో పీస్ కమిటీ సమావేశం నిర్వహించారు. మండలంలోని ఉత్సవ నిర్వాహకులు, కమిటీ సభ్యులతో పోలీసులు సమావేశమై పలు కీలక సూచనలు చేశారు. వినాయక మండపాల ఏర్పాటు నుంచి నిమజ్జన ఊరేగింపుల వరకు ప్రతి దశలో నిబంధనలు పాటించాలని సూచించారు. డీజేలు, లౌడ్‌స్పీకర్ల వినియోగం, ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు, విద్యుత్ తీగలు–అగ్ని ప్రమాదాల నివారణపై నిర్వాహకులు ప్రత్యేక శ్రద్ధ వహించాలన్నారు. ఇతర మతాల మనోభావాలను గౌరవిస్తూ ఉత్సవాలు జరుపుకోవాలని, రెచ్చగొట్టే వ్యాఖ్యలు, వివాదాలకు దారితీసే చర్యలకు దూరంగా ఉండాలని స్పష్టం చేశారు. మండపాల వద్ద అనుమానాస్పద వస్తువులు లేదా వ్యక్తులు కనిపించినా, ఎలాంటి అవాంఛనీయ పరిస్థితి ఎదురైనా వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని కోరారు. ప్రజలు, ఉత్సవ కమిటీల సహకారంతో శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా వేడుకలు విజయవంతం చేయాలని పోలీసులు పిలుపునిచ్చారు.1
- అక్షిత రాణి మృతికి కారణమైన ఓవర్‌మన్‌పై వెంటనే చర్యలు తీసుకోవాలి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని MRPS, నాయకులు దళిత సంఘాలు మరియు 1630/1982 ఎస్సీ, ఎస్టీ వెల్ఫేర్ అసోసియేషన్ డిమాండ్ గోదావరిఖని, సెప్టెంబర్ 14 (జన తెలంగాణ ప్రతినిధి కాంపల్లి రాజేష్ కుమార్): GDK-2 ఇన్క్లైన్‌లో శిక్షణార్థిగా పనిచేస్తున్న తాండ్ర అక్షిత రాణి తనపై అత్యాచారం జరిగిందని సూసైడ్ నోట్‌లో పేర్కొని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన తీవ్ర విషాదాన్ని నింపిందని MRPS, దళిత సంఘాలు మరియు 1630/1982 ఎస్సీ, ఎస్టీ వెల్ఫేర్ అసోసియేషన్ చీఫ్ అడ్వైజర్ పులి మోహన్ ఆవేదన వ్యక్తం చేశారు. అక్షిత రాణి మృతికి కారణమైన ఓవర్‌మన్‌పై వెంటనే చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఘటనపై అధికారులు సమగ్ర విచారణ జరిపి, వాస్తవాలను వెలుగులోకి తీసుకురావడంతో పాటు బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. బాధిత కుటుంబానికి న్యాయం జరిగేలా ప్రభుత్వం, సంబంధిత అధికారులు తక్షణమే స్పందించాలని విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా అసోసియేషన్ జనరల్ సెక్రటరీ గంగారపు లింగమూర్తి, సెంట్రల్ వైస్ ప్రెసిడెంట్ బడికెల కృష్ణ, సెంట్రల్ నాయకుడు ఆరెపల్లి రామచందర్, సెంట్రల్ సోషల్ మీడియా ఆర్గనైజేషన్ సెక్రటరీ కాంపల్లి రాజేష్ కుమార్ MRPS,నాయకులు దళిత సంఘాలతో పాటు పలువురు నాయకులు పాల్గొని బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. “అక్షిత రాణి కుటుంబానికి న్యాయం జరిగే వరకు పోరాటం కొనసాగిస్తాం. బాధ్యులను చట్టపరంగా శిక్షించే వరకు వెనక్కి తగ్గేది లేదు” అని MRPS,నాయకులు అసోసియేషన్ నాయకులు స్పష్టం చేశారు.1
- ఇంజనీర్లు పాత్ర కీలకం. ఇంజినీర్లను లయన్స్ క్లబ్ ఆఫ్ రామగుండం సౌజన్యంతో సత్కరించిన రామగుండం మేయర్ మహంకాళి స్వామి రామగుండం పునర్నిర్మాణంలో ఇంజనీర్లు పోషిస్తున్న పాత్ర కీలకమని మేయర్ మహంకాళి స్వామి అన్నారు. ఇంజనీర్స్ డే పురస్కరించుకొని మంగళ వారం రామగుండం నగర పాలక సంస్థ కార్యాలయంలో పని చేస్తున్న ఇంజినీర్లను లయన్స్ క్లబ్ ఆఫ్ రామగుండం సౌజన్యంతో సత్కరించారు. ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ నగర పాలక సంస్థ కార్యాలయంలో పని చేస్తున్న ఇంజనీరింగ్ సిబ్బంది శక్తి కి మించి శ్రమిస్తూ అభివృద్దిలో చురుగ్గా పాలు పంచుకుంటున్నారని ఆయన కొనియాడారు. ప్రస్తుత ఇంజినీర్లు చిత్త శుద్దితో సేవలందిస్తూ నాణ్యత లో ఏ మాత్రం రాజీ పడకుండా మన్నికగా సుదీర్ఘ కాలం నిలిచి ఉండేలా రోడ్లు , కాలువల నిర్మాణం చేపడుతున్నారని అభినందించారు. రామగుండం నగరాన్ని అధ్భుతoగా తీర్చి దిద్దాలనే స్థానిక ఎం ఎల్ ఎ లక్ష్యానికి అనుగుణంగా ఇదే ఒరవడి కొనసాగిస్తూ ఇంజనీర్లు పని చేసి పాలవర్గానికి మంచి పేరు తీసుకు రావాలని ఆశిస్తున్నామని అన్నారు. అందరికీ ఇంజనీర్స్ డే శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా నగర పాలక సంస్థ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ శాంతి స్వరూప్ , ఎ ఇ లు మీర్ , తేజస్విని , సౌమ్య , మనోజ్ , అన్వేష్ , నవీన్ పట్టణ ప్రణాళికా విభాగం అధికారులు నవీన్ , అశోక్ , కళ్యాణ్ , శ్రావణ్ , సూపరింటెండెంట్ పబ్బాల శ్రీనివాస్ సత్కారం అందుకున్న వారిలో ఉన్నారు. ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ ప్రతినిధి కజంపురం రాజేందర్ తో పాటు , నగర పాలక సంస్థ కార్పొరేటర్లు గట్ల రమేష్ , వడ్లూరి రవి , కొలని కవిత , బాలసాని తిరుపతి తదితరులు పాల్గొన్నారు.1
- *బీసీలకు అన్యాయం చేస్తున్న కేంద్ర బీజేపీ ప్రభుత్వం** *కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మ దహనానికి యత్నం – బీసీ నాయకులను అడ్డుకున్న పోలీసులు* *బీసీల హక్కుల కోసం పోరాటం ఆపేది లేదు: బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు రూప్నార్ రమేష్* ఆసిఫాబాద్: బీసీ కులగణన విషయంలో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో మంగళవారం కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలో బీజేపీ దిష్టిబొమ్మ దహనానికి యత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు రూప్నార్ రమేష్ మాట్లాడుతూ.. దేశవ్యాప్తంగా చేపట్టే జనగణనలో బీసీ కులగణన చేస్తామని కేంద్ర ప్రభుత్వం 2025 మే 1న ప్రకటించినప్పటికీ, ప్రస్తుతం శాస్త్రీయ పద్ధతిలో కులగణన చేపట్టకుండా బీసీలకు అన్యాయం చేస్తోందని ఆరోపించారు. ఓబీసీ కుటుంబాలను సమగ్రంగా లెక్కించి, ప్రత్యేక బీసీ కాలమ్ ఏర్పాటు చేసి, ప్రతి కులానికి ప్రత్యేక యూనిక్ కోడ్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. బీసీ కాలమ్ కోసం రాష్ట్ర అసెంబ్లీలో తీర్మానం ప్రవేశపెట్టిన సమయంలో బీజేపీ మద్దతు ఇవ్వకుండా అసెంబ్లీని బహిష్కరించడం బీసీల పట్ల ఆ పార్టీ వైఖరికి నిదర్శనమన్నారు. పోలీసులు అడ్డుకున్నా బీసీల హక్కుల కోసం తమ పోరాటం ఆగదని, కేంద్ర ప్రభుత్వం స్పందించి బీసీ కులగణనను శాస్త్రీయంగా నిర్వహించే వరకు ఉద్యమాలను మరింత ఉధృతం చేస్తామని రూప్నార్ రమేష్ హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బీసీ యువజన సంఘం జిల్లా అధ్యక్షులు ఆవిడపు ప్రణయ్ బీసీ విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షులు లోబడే లాహు కుమార్, బీసీ సంక్షేమ సంఘం ఆసిఫాబాద్ మండల అధ్యక్షులు సాయి కృష్ణ నాయకులు, అసద్, జయరాజ్, వెంకన్న,ముబీన్,కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.1
- విశ్వేశ్వరయ్య ఆశయ సాధనే ఇంజనీర్లకు నివాళి గ్రంధాలయ చైర్మన్ సత్తు మల్లేశం అన్నారు భారతరత్న మోక్షగుండం విశ్వేశ్వరయ్య ఆశయాలను ప్రతి ఒక్కరూ స్ఫూర్తిగా తీసుకోవాలని కరీంనగర్ గ్రంథాలయ చైర్మన్ సత్తు మల్లేశం పిలుపునిచ్చారు. లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ ఇంజనీర్స్ డే వేడుకల్లో ఆయన ముఖ్య అతిథిగా మాట్లాడారు. చదువు కేవలం ఉద్యోగానికే పరిమితం కాకుండా, సమాజంలోని సమస్యలను పరిష్కరించే సాధనంగా మారాలని విశ్వేశ్వరయ్య నమ్మారన్నారు. నీటిపారుదల, రోడ్లు, నిర్మాణ రంగాల్లో ఆయన అందించిన సేవలు దేశానికే ఆదర్శమని కొనియాడారు. ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు, లయన్స్ క్లబ్ ప్రతినిధులు పాల్గొన్నారు.3
- కిమ్స్ విద్యా సంస్థల చైర్మన్ కు అమెరికాలో అపురూపమైన స్వాగతం పలికిన పూర్వ విద్యార్థులు అమెరికాలోని టెక్సాస్ రాష్ట్రంలోని డల్లాస్ నగరంలో కిమ్స్ విద్యాసంస్థల ఛైర్మెన్ డా. పేర్యాల రవిందర్ రావుకు ఘన స్వాగతం పలికారు. ఇండియా నుంచి అమెరికా టెక్సాస్ లోని డల్లాస్ లో జరిగిన ఓ కార్యక్రమానికి వెళ్ళిన ఆయనకు టెక్సాస్ రాష్ట్రంలో కిమ్స్ పూర్వ విద్యార్థులు అయిన గుడి విష్ణువర్ధన్ రెడ్డి, మరియు YSRCP ఇంచార్జ్ నాయకులు రమణారెడ్డి ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా డా.పి. రవీందర్ రావు ప్రవాస భారతీయులను ఉద్దేశించి మాట్లాడుతూ మీరందరూ కలిసి మెలిసి ఉండాలని, అమెరికా అభి వృద్ధితో పాటు మన దేశ అభివృద్ధిలో పాలు పంచుకోవాలని అదే విధంగా మన భారత దేశానికి ఏదో ఒక విధంగా 'సేవలందించాలని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేశారు. మనం ఎంత ఎత్తుకు ఎదిగినా కన్నా తల్లి దండ్రులను మరియు కన్న తల్లిలాంటి మన మాతృ దేశాన్ని మరువకుండా సాధ్యమైనంత మేరకు సేవలు అందించాలని కోరారు. ఈ రెండు దేశాల అభివృద్ధి మీలాంటి యువత మీదనే ఆధారపడి ఉన్నందున కష్టపడి ఇష్టంగా మనస్ఫూర్తిగా సేవలందించాలని చాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో కిమ్స్ పూర్వ అధ్యాపకులు బత్తిని గంగాధర్, బి.ఆర్. ఎస్ పార్టీ సభ్యులు సూర్యపుకాష్, వేల్బురి అజయ్, శ్రీకాంత్ రెడ్డి, కొండూరి సుమన్, ముప్పాల శరత్ ఫైనాన్సియల్ అడ్వైజర్, శరత్ రెడ్డి దేశీ చౌరస్తా పౌండE శేషావతారం, సునీల్ బ్రిస్టా రెస్టారెంటు, చెన్నోజ్వల ఆదిత్స బ్రిస్టా రెస్టారెంట్ పౌండర్, అజయ్ కలువాల ప్రముఖ పారిశ్రామిక వెత్త, మరియు 250 కి పైగా ప్రవాస భారతీయులు ఈ కార్యక్ర మంలో పాల్గొన్నారు.1
- లక్షెట్టిపేటలో కొలువుదీరిన గణనాథులు, ప్రత్యేక పూజలు చేసిన భక్తులు లక్షెట్టిపేట పట్టణంతో పాటు అన్ని గ్రామాలలో కొలువుదీరిన గణనాథులు, భక్తుల ప్రత్యేక పూజలను అందుకుంటున్నాయి. వినాయక చవితి కావడంతో లక్షెట్టిపేట మున్సిపాలిటీతో పాటు మండలంలోని వెంకట్రావుపేట, బలరావ్ పేట, రామారావు పేట, కొత్తూరు,, కొత్త కొమ్ముగూడెం, పాత కొమ్ముగూడెం తదితర గ్రామాలలో వినాయక మండపాలను ఏర్పాటు చేసి గణనాధులను ప్రతిష్టించారు. ఈ సందర్భంగా వేద పండితులు, భక్తులు గణనాధులకు ప్రత్యేక పూజలు నిర్వహించారు.1