యురేకా సైన్స్ ఎక్స్పో- 2026 లో రాష్ట్ర స్థాయి విజేతలు గా జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాల విద్యార్థులు. శ్రీ సత్యసాయి జిల్లా, ధర్మవరం :-జనవిజ్ఞాన వేదిక నిర్వహించిన యురేకా సైన్స్ ఎక్స్పో -2026 సైన్స్ ప్రయోగాల పోటీలలో స్థానిక జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాల విద్యార్థులు రాష్ట్ర, మరియు జిల్లా స్థాయిలో ప్రథమ స్థానంలో నిలిచారని జనవిజ్ఞాన వేదిక రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ ఆదిశేషు, జిల్లా ప్రధాన కార్యదర్శి లోకేష్ , సత్యనిర్ధారన్ లు తెలిపారు.ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఉపాధ్యాయులు అరుణా దేవి, కల్యాణి,పద్మశ్రీ, కవిత , ఉమాదేవి లతో కలిసి విద్యార్థులకు సర్టిఫికెట్స్ మరియు బహుమతులను ప్రధానం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ *మూఢనమ్మకాల విభాగంలో ప్రమదవాణి పంపిన వీడియో రాష్ట్ర స్థాయిలో మొదటి స్థానంలోనూ, ఎన్విరాన్మెంట్ మరియు సుస్థిర అభివృద్ది విభాగంలో ప్రమదవాణి, రుక్సానాలు పంపిన వీడియో జిల్లా స్థాయిలో మొదటి స్థానంలో* నిలిచాయన్నారు. విద్యార్థులు ప్రయోగాలు చేయడం ద్వారా కొత్త జ్ఞానాన్ని, కొత్త పద్ధతులను కనుగొంటారన్నారు. ఈ ప్రక్రియ వ్యక్తిగత మరియు శాస్త్రీయ అభివృద్ధికి పునాది వేస్తుందన్నారు. పిల్లలు చేసే ప్రయోగాలు భవిషత్ లో ఈ దేశ అభివృద్ధికి ముఖ్యమైన మెట్లు అన్నారు.. సమాజం అభివృద్ధి చెందాలంటే ప్రజలు మూఢనమ్మకాలు విడనాడి శాస్త్రీయ దృక్పథం వైపు నడవాలన్నారు..అది సాధ్యం కావాలంటే విద్యారి దశలోనే శాస్త్రీయ దృక్పథాన్ని, ప్రశ్నించే తత్వాన్ని అలవర్చుకోవాలన్నారు. అందులో భాగంగానే జనవిజ్ఞాన వేదిక ప్రతీ సంవత్సరం చెకుముకి సైన్స్ సంబరాలు, యురేకా సైన్స్ ఎక్స్పో లాంటి కార్యక్రమాలను నిర్వహిస్తోందన్నారు... పిల్లలను ఇలాంటి వినూత్నమైన కార్యక్రమాల్లో పాల్గొనేలా ప్రోత్సహిస్తున్న ఉపాధ్యాయులను ,అదేవిధంగా రాష్ట్ర, జిల్లా స్థాయిలో మొదటి స్థానంలో నిలిచిన విద్యార్థులను జెవివి ప్రతినిధులు అభినందించారు..విద్యార్థులను ప్రోత్సహించడం కోసం సత్యనిర్ధారన్ ప్రత్యేక బహుమతులు అందించారు.

- ఆపరేషన్ నైట్ సేఫ్టీ.. అనంతపురంలో అనవసరంగా బయటికి వస్తె అంతే సంగతులు1
- వైయస్‌ఆర్‌సీపీ మీడియా వ్యవహారాలు చూస్తున్న పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పూడి శ్రీహరి గారి అరె*స్ట్‌ను తీవ్రంగా ఖండిస్తున్నాం కూటమి ప్రభుత్వం దుర్మా*ర్గంగా వ్యవహరిస్తోంది అని చెప్పడానికి ఈ అ*రెస్ట్ సాక్ష్యం రాష్ట్రంలో ప్రశ్నించే హక్కు కూడా ప్రజలకు లేదా? -వరుదు కళ్యాణి గారు, వైయస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్సీ.....1
- జలధార జల హారతి పనులను వేగవంతం చేయాలి : కలెక్టర్ నిశాంత్ కుమార్ మండలంలో జరుగుతున్న జలధార జలహారతి పనులను వేగవంతం చేయాలని అన్నమయ్య జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ అన్నారు బుధవారం మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయాన్ని ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు ఈ సందర్భంగా జలధర జలహారతి కార్యక్రమం లో భాగంగా చేపట్టిన వందరోజుల పనుల ప్రగతిపై మండల అధికారులతో సమీక్షించారు అనంతరం మండలంలోని దిగువపల్లి కాకతి పంచాయతీలలో చెరువులను సప్లై చానల్స్ లను పర్యవేక్షించారు అదేవిధంగా మండలంలో భూ సమస్యల పరిష్కారం పై చెరువుల వద్ద రైతులతో ఆయన మాట్లాడారు చెరువుకు అటవీ ప్రాంతం నుంచి వచ్చే నీటి ప్రవాహాన్ని అడ్డుకుంటున్న కట్టను తొలగించాలని రైతుల అభ్యర్థనపై స్పందిస్తూ విషయాన్ని పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో తహసిల్దార్ పార్వతి ఎంపీడీవో లీలా మాధవి పుంగనూరు రూరల్ సీఐ సాయి ప్రసాద్ మండలంలోని అధికారులు పాల్గొన్నారు4
- అక్రిడేషన్ ఉంటేనే విలేకరులు అనే భావంతో ఉన్న వారికి ఇది కనువిప్పు కావాలి..* *ఆర్టికల్ 19 A(1) ప్రకారం ప్రతి ఒక్కరికీ భావ స్వేచ్ఛ ప్రకటన హక్కుంది..* 👉అధికారులరా..!! పోలీసులారా..!! తోటి విలేకరులారా..!!తెలుసుకొండి.. 👉అక్రిడేషన్ లేకపోతే విలేకరి కానప్పుడు. మరి కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన RNI/MCO పబ్లిషింగ్ సర్టిఫికెట్స్ కి విలువ లేదా..? వారు సంపాదకులు కారా..? 👉అక్రిడేషన్ కన్నా కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసిన RNI Certificate కే విలువ ఎక్కువ. తెలుసుకోండి, కాదని మీరైనా గ్యారంటీ ఇస్తారా..? 👉 అక్రిడేషన్ కార్డులు ప్రభుత్వ రాయితీలకు మాత్రమే ఉపయోగ పడుతుంది. అక్రిడేషన్లు బ్రహ్మ పదార్థమైనట్లు, అవి ఉంటేనే జర్నలిస్టులు అనే సంప్రదాయం ఏదైతో ఉందో అది మనిషి యొక్క ప్రాథమిక విధులను భంగం కలిగించడమే అవుతుంది. 👉ప్రభుత్వమైనా, ప్రభుత్వ అధికారులైన, సంస్థలైనా, ఆయా సంస్థల్లో పనిచేసే వారెవరైనా అక్రిడేషన్ లేదని రిపోర్టర్లను/జర్నలిస్టులను అడ్డుకుంటే, అలాంటి వారి పై న్యాయస్థానాల ద్వారా చట్ట పరమైన చర్యలు తీసుకోవచ్చు. ఈ రోజు అక్రిడేషన్ ఉంటేనే నిజమైన రిపోర్టర్ లేకపోతే నకిలీ రిపోర్టర్ అని పోలీసులను, ప్రజలను ప్రక్క తోవ పట్టించి అక్రిడియేషన్స్ లేని తోటి రిపోర్టర్స్ ని కించపరిచే విధంగా మాట్లాడడం Publishing Act కి విరుద్ధం.. ఇది తెలుసా..? 👉అక్రిడియేషన్స్ ఉన్న విలేకరులారా...అక్రిడియేషన్స్ లేకపోతే రిపోర్టర్స్ కాదని ఎక్కడైనా.. ఏమైనా రూల్ రాసి పెట్టి ఉందా…? ఉంటే కొంచెం చూపించండి..? INDIAN CONSTITUTION లో FOURTH ESTATE కు ఉన్న నియమ, నిబంధనలు ఎప్పుడైనా చదివారా…? 👉PRINT MEDIA, ELECTRONIC MEDIA లకు ఆయా జిల్లాల్లోని జిల్లా కలెక్టర్, DPRO లు ప్రభుత్వ నిబంధనలకు లోబడి అక్రిడేషన్లు జారిచేస్తారు. సంస్థలో పని చేసే రిపోర్టర్లందరికి అక్రిడేషన్లు ఇవ్వరు. మరి అక్రిడియేషన్స్ లేని వారందరు రిపోర్టర్స్ కారా..? ఆయా జిల్లా కలెక్టర్లు, DPRO లకు RNI పబ్లిషింగ్ యక్ట్ రూల్స్ వారికి తెలియవు అని మీ అభిప్రాయం. వారికి లేని అభ్యంతరాలు మీకెందుకు..? 👉నకిలీ రిపోర్టర్స్ అని నెత్తి, నోరు కొట్టు కుంటున్నారు. రిపోర్టర్లకి సంస్థ గుర్తింపు కార్డ్ ఉండగా నకిలీ అని ఎలా అంటారు…? 👉రిపోర్టర్లకు వుండవలసింది ఆ సంస్థ జారి చేసిన ఐడి కార్డు. 👉అక్రిడేషన్ కొలమానం కాదు. అది కేవలం ప్రభుత్వ రాయతీలకు మాత్రమే.. 👉మావి పత్రికలు, ఛానెల్స్ కానప్పుడు గవర్నమెంట్ ఎందుకు రిజిస్ట్రేషన్స్ చేస్తున్నారు? వారికి లేని బాధ మీకెందుకు…? 👉అసలు అక్రిడియేషన్ అంటే ఏంటో, సంస్థ గుర్తింపు కార్డ్ అంటే ఏంటో ముందు తెలుసుకోండి. 🙏అయా.. ఈ ముఖ్య విషయాలు తెలుసుకోండి. 👉ఒక సంస్థ కొన్ని లక్షల పెట్టి ఛానల్ లేదా పత్రిక స్థాపించి,కేంద్ర ప్రభుత్వం చేత పర్మిషన్స్ తీసుకొని, పూర్తి అవగాహనతో ఉన్న రిపోర్టర్స్ ని నియమించుకొని, సంస్థ ఐడి కార్డ్ మరియు లోగో ఇచ్చి న్యూస్ కొరకు పంపిస్తే నకిలీ రిపోర్టర్స్ అని ఎలా చెప్పగలరు..?గమనించండి. 👉 ఒక ఛానల్ లో ఒక జిల్లాలో 100 మంది రిపోర్టర్లు పనిచేస్తారు. అయితే ఆయా జిల్లాల కలెక్టర్లు, DPRO లు ప్రభుత్వ నియమ, నిబంధనలకు లోబడి కొందరికి మాత్రమే అక్రెడిటషన్ కార్డులను మంజూరు చేస్తారు. ఆలాంటప్పుడు మిగిలిన వారు రిపోర్టర్స్ కాదా, వారందరు నకిలీలా…? 👉ముఖ్యంగా చెప్పవల్సింది ఏంటి అంటే “అక్రిడేషన్ ఎప్పటికీ జర్నలిస్టుకు ప్రామాణికం కాదు”. అతను రాసే వార్తలే ప్రామాణికం, వార్తలో సత్తా ఉండాలి.. ఇక మీ కలానికి/కెమెరాకి పదును పెట్టండి… కత్తిలా మార్చండి. 👉 జర్నలిజం అంటే మక్కువ ఉన్నవారికి, జర్నలిజంలోకి రావాలనుకునే వారికి.. అక్రిడేషన్ కార్డు జీవితం కాదు, జాబ్ కార్డ్ కాదు. మీరు రాబట్టిన సమాచారాన్ని, నిజాన్ని నిర్భయంగా ప్రజల ముందు పెట్టే ప్రతి ఒక్కడు జర్నలిస్టే.. అక్రిడేషన్ కార్డు ద్వారా సమావేశాలకి వెళితేనే మీకు సమాచారం అందుతుందా.. లేకపోతే మీకు అందదా.. అక్రిడేషన్ లేదు అని అవమానించిన వారికి.. ప్రతి జర్నలిస్టు ఆదిశక్తి లా ఉగ్రరూపం దాల్చి మీ జర్నలిజాన్ని చూపించండి.. *జై జర్నలిజం.. జై జై జర్నలిజం..* 🇮🇳 దేశం కోసం సామాన్య ప్రజల కోసం పనిచేసే జర్నలిజం రావాలి ధన్యవాదాలు మిత్రులారా *🇮🇳జర్నలిస్టు🇮🇳* *🇮🇳ఆంద్రప్రదేశ్&తెలంగాణా🇮🇳*1
- రైతు రాజన్నాడం తప్పు రైతుకు గిట్ట పట్టేలార కావాలి అంటూ ఆహ్వానిస్తున్నారు1
- బండిఆత్మకూరు ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లే రహదారిలో డ్రైనేజీ కాలువలు పూడిపోవడంతో మరియు గుండా పుల్లయ్య ఇంటి వద్ద డ్రైనేజీ బ్లాక్ అవ్వడం వల్ల రోడ్డుపై మురుగునీరు ప్రవహిస్తుండడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అధికారులకు మొరపెట్టుకున్నా పట్టించుకోవడం లేదని గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు స్పందించి, తక్షణమే కాలువల్లో పూడిక తీయించి సమస్యను పరిష్కరించాలని ప్రజలు కోరుతున్నారు.1
- బుట్టా ఫౌండేషన్ నుంచి తాగునీటి సహాయం – సోగునూరు, టీఎస్ కూలూరు గ్రామాలకు ట్యాంకర్ పంపిణీ1
- ప్రపంచ క్వాంటం దినోత్సవాన్ని పురస్కరించుకుని భారత మొట్టమొదటి క్వాంటం రిఫరెన్స్ ఫెసిలిటీని ప్రారంభించడం సంతోషంగా ఉంది. విజ్ఞానమే సామాజిక ప్రగతికి చిహ్నం అని చెప్పిన అంబేద్కర్ గారి జయంతిని పురస్కరించుకుని అమరావతిలో క్వాంటం చరిత్రను ప్రారంభించుకున్నాం. #QuantumRevolutionInAP #AmaravatiQuantumValley1