బుచ్చి : సమస్యలు పరిష్కరించాలని అధికారులకు వినతి...... బుచ్చిరెడ్డిపాలెం పట్టణం,రూరల్ లోని పలు సమస్యలను ఎస్. డి.పి.ఐ నియోజవర్గ ఇన్చార్జ్ మహబూబ్ బాషా అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. ఈ సందర్భంగా సమస్యలపై కమిషనర్ చిన్న బాబుకు, ఎంపీడీవో రంతులయ్య కు వినతి పత్రాలు అందజేశారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. పట్టణంలోని బెజవాడ బుజ్జమ్మ బాలికల ఉన్నత పాఠశాల వెనకాల ఉన్న కాలనీలో తాగునీటి బోర్లు వేస్తే మంచినీళ్లు రాకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. ఆ కాలనీలో తాగునీటి పైప్లైన్ ఏర్పాటు చేసి, వీధిలైట్లు ఏర్పాటు చేయాలని కమిషనర్ కి వినతి పత్రం అందించడం జరిగిందన్నారు. రేబాల పంచాయతీలోని నెహ్రూ కాలనీలో డ్రైనేజీ లేకపోవడంతో కాలనీవాసులు సుమారు 40 సంవత్సరాలుగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. మురికి నీరు ఇంకుడు గుంటలు నిండి రోడ్లపైకి వస్తుందన్నారు. మురికినీరు రోడ్డుపై రావడంతో దుర్వాసనతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని డ్రైనేజీ నిర్మాణం చేపట్టాలని ఎంపీడీవోకు వినతిపత్రం అందించడం జరిగిందన్నారు. అధికారులు స్పందించి సమస్యను పరిష్కరించాలని కోరారు.
బుచ్చి : సమస్యలు పరిష్కరించాలని అధికారులకు వినతి...... బుచ్చిరెడ్డిపాలెం పట్టణం,రూరల్ లోని పలు సమస్యలను ఎస్. డి.పి.ఐ నియోజవర్గ ఇన్చార్జ్ మహబూబ్ బాషా అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. ఈ సందర్భంగా సమస్యలపై కమిషనర్ చిన్న బాబుకు, ఎంపీడీవో రంతులయ్య కు వినతి పత్రాలు అందజేశారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. పట్టణంలోని బెజవాడ బుజ్జమ్మ బాలికల ఉన్నత పాఠశాల వెనకాల ఉన్న కాలనీలో తాగునీటి బోర్లు వేస్తే మంచినీళ్లు రాకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. ఆ కాలనీలో తాగునీటి పైప్లైన్ ఏర్పాటు చేసి, వీధిలైట్లు ఏర్పాటు చేయాలని కమిషనర్ కి వినతి పత్రం అందించడం జరిగిందన్నారు. రేబాల పంచాయతీలోని నెహ్రూ కాలనీలో డ్రైనేజీ లేకపోవడంతో కాలనీవాసులు సుమారు 40 సంవత్సరాలుగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. మురికి నీరు ఇంకుడు గుంటలు నిండి రోడ్లపైకి వస్తుందన్నారు. మురికినీరు రోడ్డుపై రావడంతో దుర్వాసనతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని డ్రైనేజీ నిర్మాణం చేపట్టాలని ఎంపీడీవోకు వినతిపత్రం అందించడం జరిగిందన్నారు. అధికారులు స్పందించి సమస్యను పరిష్కరించాలని కోరారు.
- వినాయక చవితి సందర్భంగా బద్వేలు కు విచ్చేసిన జబర్దస్త్ టీం బద్వేలు, సెప్టెంబర్ 15:వినాయక చవితి పండుగ శోభతో బద్వేలు పట్టణం కోలాహలంగా మారింది. ఈ పండుగ వేడుకల్లో భాగంగా ప్రముఖ జబర్దస్త్ టీం బద్వేలు కు విచ్చేసింది.బద్వేలు పట్టణంలోని శేఖర్ రాయల్ నివాసంలో ఏర్పాటు చేసిన వినాయక మండపాన్ని జబర్దస్త్ ఆర్టిస్టులు సందర్శించారు. స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి, భక్తులతో కలిసి సందడి చేశారు. తమదైన కామెడీ పంచ్ లతో అక్కడికి వచ్చిన అభిమానులను, చిన్నారులను అలరించారు. ఈ సందర్భంగా శేఖర్ రాయల్ కుటుంబ సభ్యులు జబర్దస్త్ టీంను ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో స్థానికులు, చుట్టుపక్కల వాసులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.1
- పండగ రోజు పారిశుద్ధ్య కార్మికుల కుటుంబాల్ని పస్తులు పెట్టిన కూటమి ప్రభుత్వం నెల్లూరు జిల్లాలోని అల్లూరు నగర పంచాయతీ పరిధిలో పనిచేస్తున్న పారిశుద్ధ్య కార్మికులకి 2 నెలలుగా అందని వేతనాలు వినాయక చవితి రోజు కనీసం పండగ సరుకులు కొనుగోలు చేయడానికి కూడా తమ వద్ద డబ్బులు లేవని.. ఆఖరికి దేవుడికి కూడా సంతోషంగా కొబ్బరికాయ కొట్టలేకపోయామని కార్మికులు ఆవేదన వేతనాలు అందే వరకూ విధుల్లోకి వచ్చేది లేదంటూ కార్మికులు విధులు బహిష్కరణ ఠంచనుగా ఒకటో తారీఖున జీతాలు/వేతనాలు ఇచ్చేస్తామంటూ బీరాలు పలికావు.. మరి ఇదేంటి చంద్రబాబు ? పండగ రోజు పారిశుద్ధ్య కార్మికుల కుటుంబాల్ని పస్తులు పెట్టిన కూటమి ప్రభుత్వం నెల్లూరు జిల్లాలోని అల్లూరు నగర పంచాయతీ పరిధిలో పనిచేస్తున్న పారిశుద్ధ్య కార్మికులకి 2 నెలలుగా అందని వేతనాలు వినాయక చవితి రోజు కనీసం పండగ సరుకులు కొనుగోలు చేయడానికి కూడా తమ వద్ద డబ్బులు లేవని.. ఆఖరికి దేవుడికి కూడా సంతోషంగా కొబ్బరికాయ కొట్టలేకపోయామని కార్మికులు ఆవేదన వేతనాలు అందే వరకూ విధుల్లోకి వచ్చేది లేదంటూ కార్మికులు విధులు బహిష్కరణ ఠంచనుగా ఒకటో తారీఖున జీతాలు/వేతనాలు ఇచ్చేస్తామంటూ బీరాలు పలికావు.. మరి ఇదేంటి చంద్రబాబు ?1
- వెలుగోడు నుంచి రోజుకు 4 వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేసి తెలుగు గంగ SR1, SR2 లను నింపాలి - రైతు సేవా సమితి డిమాండ్ కడప జిల్లాలో నీరు లేకుండా అడుగంటిపోయిన తెలుగు గంగ SR1, SR2 ప్రాజెక్టులకు వెలుగోడు నుండి రోజుకు నాలుగు వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేసి, కడప జిల్లా ప్రజలకు, రైతులకు తాగునీటి సమస్యలు లేకుండా చూడాలని రైతు సేవా సమితి కడప జిల్లా సమితి డిమాండ్ చేసింది. రైతు సేవా సమితి ఆధ్వర్యంలో సెప్టెంబర్ 1వ తేదీ నుండి కడప జిల్లా రైతులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం కోసం నిర్వహిస్తున్న "రైతు గ్రామబాట" కార్యక్రమం ఈరోజు 15వ రోజుకు చేరుకుంది. ఇందులో భాగంగా ఈరోజు మైదుకూరు ఎమ్మార్వో కార్యాలయ ఆవరణలో నిరసన తెలియజేసి, ఎమ్మార్వో గారు లేకపోవడంతో డిప్యూటీ ఎమ్మార్వో నరసింహ గారికి వినతి పత్రాన్ని అందజేసి రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేయాలని కోరారు. ఏలినో ప్రభావంతో జిల్లాలో ఈ సంవత్సరం వర్షాలు లేక నష్టపోతున్న రైతులను ఆదుకునేందుకు కడప జిల్లాను కరువు జిల్లాగా ప్రకటించి, ప్రతి రైతు కుటుంబానికి రూ.30 వేలు సహాయం అందించాలని, అలాగే జిల్లాలో పెండింగ్‌లో ఉన్న రాజోలి, జొలదరాశి, తెలుగు గంగ తదితర సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేసేందుకు నిధులు కేటాయించాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ కార్యక్రమంలో రైతు సేవా సమితి మైదుకూరు నియోజకవర్గ కార్యదర్శి మాడి శెట్టి సహదేవుడు, మైదుకూరు పట్టణ, మండల నాయకులు, రైతులు దాశ రెడ్డి గారి సుబ్బరాయుడు, రాజా, మూలే రామచంద్రారెడ్డి, కోటయ్య గారి గుర్రప్ప, రాజాల రామచంద్రుడు, పసల పుల్లయ్య, అంకిరెడ్డిపల్లి నారాయణరెడ్డి తదితరులు పాల్గొన్నారు.1
- పద్మశాలి యూత్ ఆధ్వర్యంలో వైభవంగా గణేష్ నవరాత్రి వేడుకలు. గుళ్ళపల్లి గ్రామంలో పద్మశాలి యూత్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న గణేష్ నవరాత్రి ద్వితీయ సంవత్సర వేడుకలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ, ఈ నెల 19వ తేదీన స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి, అనంతరం ప్రధాన ఆకర్షణగా 21 కేజీల మహా లడ్డూ వేలం పాట నిర్వహించనున్నట్లు తెలిపారు.లడ్డూ వేలం పాట పూర్తయిన తర్వాత స్వామివారి శోభాయాత్ర, నిమజ్జన కార్యక్రమం ఘనంగా జరగనుంది. ఈ భక్తిశ్రద్ధల కార్యక్రమంలో గ్రామ ప్రజలు, భక్తులు విశేష సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని, స్వామివారి కృపకు పాత్రులు కావాలని నిర్వాహకులు కోరారు.1
- పులివెందుల లోని మైత్రి లే ఔట్ వినాయక స్వామి విగ్రహం వద్ద ఘర్షణ కడప జిల్లా..... పులివెందుల..... పులివెందుల లోని మైత్రి లే ఔట్ వినాయక స్వామి విగ్రహం వద్ద ఘర్షణ....... టిడిపికి చెందిన ఇద్దరు నాయకుల మధ్య ఘర్షణ..... గాలి లోకి ఒక రౌండ్ కాల్పులు చేసిన హజ్ కమిటీ డైరెక్టర్ మాహబూబ్ భాష గన్మెన్.... టిడిపి పార్టీ కి చెందిన పుష్ప నాథ్ రెడ్డి, విజయ్ కుమార్ రెడ్డి ల మధ్య ఘర్షణ...... విజయ్ కుమార్ ఇంటి వద్ద ఉన్న 3 వాహనాలు ధ్వంసం.....1
- పుల్లలచెరువులో వినాయక చవితి వేడుకల్లో భాగంగా ఆకట్టుకున్న మహిళల కోలాట ప్రదర్శన వినాయక చవితి ఉత్సవాల్లో భాగంగా బ్రహ్మంగారి దేవాలయం వద్ద యూత్ ఆధ్వర్యంలో నిర్వహించిన కోలాట ప్రదర్శన అలరించింది.మహిళలు, చిన్నారులు సంయుక్తంగా చేసిన ఈ కోలాటాన్ని తిలకించేందుకు ప్రజలు ఆసక్తిగా పాల్గొన్నారు. మాస్టర్ కోటయ్య ఆధ్వర్యంలో కోలాటం చేశారు.ఈ సందర్బంగా కోలాటమాడిన మహిళలకు కమిటీ సభ్యులు చీరలను బహుమతిగా అందజేశారు. అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపారు.1
- బద్వేలులో వైభవంగా 9వ వార్షిక వినాయక చవితి వేడుకలు. స్వామివారి సన్నిధిలో గొప్ప అన్నదాన కార్యక్రమం. బద్వేలు,సెప్టెంబర్ 15: బద్వేలు పట్టణంలోని 16వ వార్డు సుమిత్రానగర్ నందు శ్రీ వరసిద్ధి వినాయక చవితి 9వ వార్షికోత్సవ వేడుకలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన వినాయక మండపం భక్తులతో కిటకిటలాడుతోంది. ఈ ఉత్సవాలకు విచ్చేయుచున్న భక్తులందరికీ ఉత్సవ కమిటీ సభ్యులు స్వాగతం సుస్వాగతం పలుకుతున్నారు. ఉత్సవాలకు సహకరించిన దాతలు: వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు పలువురు దాతలు ముందుకు వచ్చి తమ వంతు సహాయ సహకారాలు అందించారు. -విగ్రహ దాత మరియు దేవుని పూజా సామాగ్రి దాత: కీ.శే. గాండ్ల వెంకటరమణ బాబు - శ్రీమతి కుమారి -అన్నదాన దాతలు: కీ.శే. కోడూరు వెంకట స్వామి రెడ్డి - శ్రీమతి విజయమ్మ, శ్రీ కోడూరు మల్లిఖార్జున రెడ్డి - శ్రీమతి అపర్ణ -లడ్డు దాత: శ్రీ వెలిగండ్ల నాగరాజు - శ్రీమతి ఉమాదేవి -పూలదండ దాత: శ్రీ నిమ్మకాయల గురివిరెడ్డి - శ్రీమతి రాజమ్మ -పటాకుల దాతలు: శ్రీ కోడూరు చంద్రశేఖర్ రెడ్డి - శ్రీమతి ప్రశాంతి, శ్రీ కీ.శే. సంసాని ఏరికలయ్య - శ్రీమతి ఆదిలక్షుమ్మ ఆర్థిక సహాయం అందించిన దాతలు: శ్రీ నాగినేని వెంకటసుబ్బయ్య - 6000/-, శ్రీ నిమ్మకాయల శేఖర్ రెడ్డి - 5000/-, శ్రీ ఇమామ్ ఖాసీమ్ - 4000/-, శ్రీ లకిడి విజయ్ భాస్కర్ - 2116/-, శ్రీ కోన రవిశంకర్ - 2016/-, శ్రీ చెరుకూరి సిద్ధయ్య (టైలర్) - 2000/-, శ్రీ కనిశెట్టి సతీష్ (టీచర్) - 2000/-, శ్రీ పిట్టా జయసింహ - 2000/-, శ్రీ ఓబుల్ రెడ్డి సాయి ప్రతాప్ రెడ్డి - 2000/-, శ్రీ మోరేపల్లె రామయ్య - 2000/-, శ్రీమతి కోటపాటి సావిత్రమ్మ - 2000/-, శ్రీ కీ.శే. పుల్లయ్య - 2000/-, శ్రీ రెడ్డిపల్లె శ్రీనివాసుల యాదవ్ - 2000/- ఈ సందర్భంగా ఉత్సవ కమిటీ సభ్యులు మాట్లాడుతూ, గత 9 సంవత్సరాలుగా సుమిత్రానగర్ లో వినాయక చవితి వేడుకలను ఐక్యమత్యంతో నిర్వహిస్తున్నామని, దాతల సహకారంతోనే ఈ వేడుకలు విజయవంతం అవుతున్నాయని తెలిపారు. భక్తులందరూ వచ్చి స్వామి వారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించాలని కోరారు. అనంతరం మధ్యాహ్నం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారి సన్నిధిలో కీ.శే. కోడూరు వెంకట స్వామి రెడ్డి - శ్రీమతి విజయమ్మ, కోడూరు మల్లిఖార్జున రెడ్డి - అపర్ణ, కొండూరు చంద్ర కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో గొప్ప అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. అనంతరం సాయంత్రం చెక్కభజన కార్యక్రమం కూడా ఉంటుందని తెలియజేశారు.2
- పులివెందుల పట్టణంలోని మైత్రి లేఔట్లో అర్ధరాత్రి ఇరు వర్గాల ఘర్షణ సీసీ ఫుటేజ్ కడప జిల్లా పులివెందుల పట్టణంలోని మైత్రి లేఔట్లో అర్ధరాత్రి ఇరు వర్గాల మధ్య తీవ్ర ఘర్షణ చోటుచేసుకున్న విషయం తెలిసిందే. ఈ ఘటనకు సంబంధించిన సీసీ టీవీ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఓ నాయకుడి ఇంటి వద్దకు జనాలు గుంపుగా వెళ్లి కర్రలతో వాహనాలను ధ్వంసం చేస్తున్న దృశ్యాలు సీసీ ఫుటేజ్లో చూడవచ్చు. విషయం తెలుసుకున్న పోలీసులు మెరుపు వేగంతో ఘటనా స్థలానికి చేరుకుని జనాలను చల్లాచెదురు చేశారు.1