ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా, కర్నూలు జిల్లా ఆదోని నియోజకవర్గంలో రెండేళ్ల సుపరిపాలన విజయోత్సవ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర కురుబ కురుమ కార్పొరేషన్ చైర్మన్ మాన్వి దేవేంద్రప్ప, ఇంచార్జ్ మీనాక్షి నాయుడు, ఎమ్మెల్యే పార్థసారథి, జనసేన ఇంచార్జ్ మల్లప్ప, జిల్లా అధ్యక్షురాలు గుడిసె ఆదికృష్ణమ్మ, సీనియర్ నాయకులు శ్రీకాంత్ రెడ్డి, ఉమ్మి సలీం సహా కూటమి నాయకులు, కార్యకర్తలు, ప్రజలు భారీ ఎత్తున హాజరయ్యారు. ఈ సందర్భంగా చైర్మన్ మాన్వి దేవేంద్రప్ప మాట్లాడుతూ, ఆంధ్రప్రదేశ్‌లో తెలుగుదేశం పార్టీ ప్రజల పార్టీ అని, బడుగు బలహీన వర్గాల పార్టీ అని అన్నారు. ప్రజల సంక్షేమం, రాష్ట్ర అభివృద్ధి చంద్రబాబు నాయుడు నాయకత్వంలోనే సాధ్యమని నిరూపించారని, ప్రజల అవసరాలను, యువతకు ఉద్యోగాలను దృష్టిలో పెట్టుకొని శ్రమిస్తున్న ఏకైక నాయకుడు చంద్రన్న అని కొనియాడారు. అందుకే తెలుగు ప్రజలు చంద్రబాబు నాయుడుకి నాలుగోసారి ముఖ్యమంత్రిగా సేవ చేసే అవకాశం అందించారని, ప్రజలకు ఎల్లప్పుడూ తెలుగుదేశం పార్టీ తోడు ఉంటుందని తెలిపారు. ప్రజలకు సంక్షేమం అందించడంలో దేశంలోనే ఆంధ్రప్రదేశ్ మొదటి స్థానంలో నిలిచిందని పేర్కొంటూ, వృద్ధులకు ₹4000, వికలాంగులకు ₹6000, జీవిత వ్యాధిగ్రస్తులకు ₹10000, మహిళలకు సంవత్సరానికి మూడు ఉచిత సిలిండర్లు, ఉచిత బస్ ప్రయాణం, రైతులకు అన్నదాత సుఖీభవ కింద ఏడాదికి ₹20000, తల్లికి వందనం కింద ప్రతి విద్యార్థికి ఏడాదికి ₹13000 వంటి సంక్షేమ పథకాలు అమలవుతున్నాయని వివరించారు. ఈ సంక్షేమ పథకాలతో పాటు రాష్ట్ర అభివృద్ధి కూడా పరుగులు పెడుతోందని, దేశ అభివృద్ధిలో ఆంధ్ర రాష్ట్రం 26% పెట్టుబడులు పెట్టడానికి వస్తున్నాయంటే అది చంద్రన్న విజనరీ ఫలితమేనని ఉద్ఘాటించారు. యువ నేత, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ యువ ఆలోచనలతో రాష్ట్రానికి ఎన్నడూ లేని విధంగా ఎన్నో పెట్టుబడులను, పరిశ్రమలను తీసుకురావడం తెలుగు ప్రజలు చేసుకున్న అదృష్టమని, DSC, కానిస్టేబుల్ ఉద్యోగాలు వంటివి యువతకు రోల్ మోడల్‌గా లోకేష్ నిలిచారని దేవేంద్రప్ప పేర్కొన్నారు. అంతేకాకుండా, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నాయకత్వంలో దేశంలో పంచాయతీరాజ్ శాఖలో మొదటి ఐదు స్థానాల్లో రెండు స్థానాలు ఆంధ్ర రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖకు వచ్చాయని, ఇది గ్రామ ప్రజల పట్ల ఉన్న అభిమానానికి నిదర్శనమని అన్నారు. ఇలా చెప్పుకుంటూ పోతే మరో మూడు సంవత్సరాల్లో ఆంధ్ర రాష్ట్ర రూపురేఖలు మారిపోతాయని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. గత ఐదు సంవత్సరాల్లో YCP పార్టీ నాయకులు తమకు కేటాయించిన పదవులకు న్యాయం చేయకుండా, పదవులను అడ్డం పెట్టుకొని ఆంధ్ర ప్రజలను ఎంత ఇబ్బంది పెట్టారో ప్రజలకు బాగా తెలుసని, అందుకే ప్రజలు YCP పార్టీని ప్రతిపక్ష హోదా కూడా లేకుండా ఓడించారని విమర్శించారు. కొద్దిరోజుల్లో స్థానిక ఎన్నికలు వస్తున్నాయని, కూటమి నాయకులు, కార్యకర్తలు కష్టపడి కూటమి పార్టీని గెలిపించుకుందామని పిలుపునిచ్చారు. ప్రజల నమ్మకంతో చంద్రన్న నాలుగు సార్లు ముఖ్యమంత్రిగా సేవలు అందిస్తున్నారని ఆయన గుర్తు చేశారు.

- యోగా డే వేడుకల సందర్భంగా మంత్రి నారా లోకేష్ యోగా సాధనలో పాల్గొన్నారు. ఆయన బాబా రామ్‌దేవ్‌తో కలిసి యోగాసనాలు వేశారు.1
- జోగులాంబ గద్వాల్ జిల్లాలోని గట్టు మండలంలో నేషనల్ హైవే రింగ్ రోడ్డు నిర్మాణం కోసం ప్రజలు ధర్నా చేస్తున్నారు. ముంబై నుండి చెన్నై మరియు బెంగళూరు వరకు వెళ్ళే నేషనల్ హైవే రింగ్ రోడ్డు తమ గట్టు మండలం పరిధిలో ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ, స్థానిక ప్రజలు వరహరా దీక్షకు దిగారు.1
- ఆదోనిలోని ఆర్ఆర్ లేబర్ కాలనీ సమీపంలో ఉన్న ఆవు దూడ వంకలో ఒక లారీ బోల్తా పడింది. ఈ ఘటనలో ఇద్దరు వ్యక్తులకు గాయాలయ్యాయి. స్థానికులు గతంలో పదిసార్లు అధికారులకు వినతులు సమర్పించినప్పటికీ, ఈ సమస్యపై ఎటువంటి స్పందన రాలేదని ఆరోపించారు. దాదాపు రెండు సంవత్సరాల క్రితం, ఆదోని ఎమ్మెల్యే పార్థసారధి ఈ ప్రాంతాన్ని సందర్శించి, సమస్యను పరిష్కరిస్తానని హామీ ఇచ్చారని, అయితే ఆ హామీని ఆయన మరిచిపోయారని కూడా వారు పేర్కొన్నారు.1
- మహబూబ్ నగర్ ఎంపీ డీకే అరుణ హన్వాడ మండలంలో అనేక అభివృద్ధి కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె స్థానిక ఎమ్మెల్యే శ్రీనివాస్ రెడ్డితో కలిసి లాల్యనాయక్ తండాలో కొత్త గ్రామ పంచాయతీ భవన నిర్మాణానికి భూమి పూజ చేసి శంకుస్థాపన చేశారు. వెంకటమ్మ కుంట తండాలో ₹20 లక్షల నిధులతో నిర్మించిన నూతన గ్రామ పంచాయతీ భవనాన్ని ఎంపీ అరుణ ప్రారంభించారు. అదే గ్రామంలో ₹10 లక్షల వ్యయంతో నిర్మించనున్న స్వయం సహాయక సంఘ భవనానికి కూడా ఆమె భూమి పూజ చేశారు.1
- మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని 21వ డివిజన్‌లోని శ్రీనివాస్ కాలనీ ప్రాంతంలో నివసిస్తున్న జిల్లా పరిషత్ ఉద్యోగి రవీందర్ గౌడ్ ఇంట్లోకి ఈ సాయంత్రం రసల్స్ వైపర్ అనే విషపూరిత పాము ప్రవేశించి ఓ సందులో దాక్కుంది. వెంటనే రవీందర్ గౌడ్ ఈ విషయాన్ని మహబూబ్నగర్ పట్టణానికి చెందిన స్నేక్ క్యాచర్ లోకేష్‌కు తెలియజేశారు. సమాచారం అందుకున్న లోకేష్ వెంటనే అక్కడికి చేరుకొని, తన నైపుణ్యంతో విషపూరిత రసల్స్ వైపర్ (రక్తపింజర) పామును చాకచక్యంగా పట్టుకున్నారు. దీంతో రవీందర్ గౌడ్ కుటుంబ సభ్యులు ఊపిరి పీల్చుకున్నారు.1
- నాగర్‌కర్నూల్ జిల్లాలోని బిజినపల్లి మండలం మంగనూరు గ్రామంలో శనివారం ఆకస్మికంగా కురిసిన వర్షం, గత నాలుగు రోజులుగా తీవ్ర ఆందోళనలో ఉన్న రైతులకు పెద్ద ఉపశమనాన్నిచ్చింది. ఎండల తీవ్రతకు ఎండిపోతాయని భయపడిన పంట మొలకలు ఈ వానతో తిరిగి జీవం పోసుకుంటాయని అన్నదాతలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. వర్షం కారణంగా ఒక్కసారిగా వాతావరణం చల్లబడటంతో పాటు, చేతికొచ్చే తరుణంలో ఉన్న మొలకలు ప్రాణం పోసుకుంటాయనే ధీమాతో రైతన్నల కళ్లల్లో ఆనందం వెల్లువిరిసింది. బిజినపల్లి మంగనూరులో పడిన ఈ చినుకు, నిజంగానే పంట మొలకలకు కొత్త జీవితాన్నిచ్చి, రైతన్నల మోమున చిరునవ్వులు పూయించింది.1
- పెద్ద ఎత్తున పాల్గొన్న వైసీపీ శ్రేణులు మరియు అభిమానులు, రేణుకకు ఆయురారోగ్యాలు ప్రసాదించాలని కోరుతూ ప్రార్థనలు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు 101 టెంకాయలతో మొక్కు చెల్లించారు.1
- మంత్రాలయం నియోజకవర్గంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన ఉరుకుంద శ్రీ లక్ష్మీ నరసింహ ఈరన్న స్వామి దేవస్థానంలో అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ఒక కార్యక్రమాన్ని నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వం జూన్ 21న ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలని తలపెట్టగా, డిప్యూటీ కమిషనర్ మరియు కార్యనిర్వహణాధికారి శ్రీమతి కె.వాణి ఆధ్వర్యంలో యోగాసనాలు, ప్రాణాయామం, ధ్యానం మొదలైన కార్యక్రమాలను చేపట్టారు. ఈ కార్యక్రమంలో ఆలయ అర్చకులు, పూజారులు, అధికారులు, సిబ్బందితో పాటు భక్తులు కూడా పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.1