logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

కేంద్రంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలోని ప్రభుత్వం విజయవంతంగా 12 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా, మెదక్ జిల్లా భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో శనివారం యువ సమ్మేళనం నిర్వహించారు. బీజేపీ యువమోర్చా జిల్లా అధ్యక్షుడు సతీష్ పటేల్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి బీజేపీ మెదక్ జిల్లా అధ్యక్షుడు వళ్దాస్ మల్లేష్ గౌడ్, బీజేపీ యువమోర్చా రాష్ట్ర కార్యదర్శి అరవింద్ రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరై ప్రసంగించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, గత 12 సంవత్సరాలుగా ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో దేశం అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో ముందుకు సాగుతోందని పేర్కొన్నారు. ముఖ్యంగా యువత సాధికారతకు కేంద్ర ప్రభుత్వం అనేక చారిత్రాత్మక నిర్ణయాలు తీసుకుని, ఉపాధి, నైపుణ్యాభివృద్ధి, స్వయం ఉపాధి అవకాశాలను విస్తృతంగా కల్పిస్తోందన్నారు. ప్రధానమంత్రి కౌశల్ వికాస్ యోజన, స్కిల్ ఇండియా మిషన్, దీన్ దయాళ్ ఉపాధ్యాయ గ్రామీణ కౌశల్య యోజన, మై భారత్, పీఎం ఇంటర్న్‌షిప్ పథకం, నేషనల్ అప్రెంటిస్‌షిప్ ప్రమోషన్ స్కీమ్, పీఎం-సేతు, పీఎం-దక్ష్, నేషనల్ కెరీర్ సర్వీస్ వంటి పథకాల ద్వారా యువతకు అనేక అవకాశాలు కల్పిస్తున్నట్లు వివరించారు. అదేవిధంగా స్టార్టప్ ఇండియా, డిజిటల్ ఇండియా, మేక్ ఇన్ ఇండియా, స్టాండ్ అప్ ఇండియా వంటి కార్యక్రమాల ద్వారా యువతలో ఆవిష్కరణలకు, పారిశ్రామికవేత్తలుగా ఎదగడానికి విశేష ప్రోత్సాహం అందుతోందని తెలిపారు. దేశ భవిష్యత్తుకు యువతే వెన్నెముక అని, వారి శక్తి సామర్థ్యాలను దేశాభివృద్ధికి వినియోగించుకోవడమే మోదీ ప్రభుత్వ లక్ష్యమని వారు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ జిల్లా అధ్యక్షుడు గడ్డం శ్రీనివాస్, ఎంఎల్‌ఎన్ రెడ్డి, కో-కన్వీనర్ శ్రీనివాస్ గౌడ్, బీజేపీ యువమోర్చా నాయకులు అరవింద్ గౌడ్, అసెంబ్లీ కన్వీనర్లు కంచం సాయి, పోతారాజు అనిల్, జిల్లా యువమోర్చా పదాధికారులు, మండల అధ్యక్షులు, మండల ఇన్‌చార్జీలు, యువ నాయకులు తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

8 hrs ago
user_MERCY
MERCY
Local News Reporter మెదక్, మెదక్, తెలంగాణ•
8 hrs ago
cef01bff-aa60-427d-9b84-53dcfecf9fc4

కేంద్రంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలోని ప్రభుత్వం విజయవంతంగా 12 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా, మెదక్ జిల్లా భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో శనివారం యువ సమ్మేళనం నిర్వహించారు. బీజేపీ యువమోర్చా జిల్లా అధ్యక్షుడు సతీష్ పటేల్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి బీజేపీ మెదక్ జిల్లా అధ్యక్షుడు వళ్దాస్ మల్లేష్ గౌడ్, బీజేపీ యువమోర్చా రాష్ట్ర కార్యదర్శి అరవింద్ రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరై ప్రసంగించారు. ఈ

fcc88f14-4275-4dce-93e9-16efe2a8b2ac

సందర్భంగా వారు మాట్లాడుతూ, గత 12 సంవత్సరాలుగా ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో దేశం అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో ముందుకు సాగుతోందని పేర్కొన్నారు. ముఖ్యంగా యువత సాధికారతకు కేంద్ర ప్రభుత్వం అనేక చారిత్రాత్మక నిర్ణయాలు తీసుకుని, ఉపాధి, నైపుణ్యాభివృద్ధి, స్వయం ఉపాధి అవకాశాలను విస్తృతంగా కల్పిస్తోందన్నారు. ప్రధానమంత్రి కౌశల్ వికాస్ యోజన, స్కిల్ ఇండియా మిషన్, దీన్ దయాళ్ ఉపాధ్యాయ గ్రామీణ కౌశల్య యోజన, మై భారత్,

7da6d32a-0db1-45ad-a9e2-60c3d46d4b39

పీఎం ఇంటర్న్‌షిప్ పథకం, నేషనల్ అప్రెంటిస్‌షిప్ ప్రమోషన్ స్కీమ్, పీఎం-సేతు, పీఎం-దక్ష్, నేషనల్ కెరీర్ సర్వీస్ వంటి పథకాల ద్వారా యువతకు అనేక అవకాశాలు కల్పిస్తున్నట్లు వివరించారు. అదేవిధంగా స్టార్టప్ ఇండియా, డిజిటల్ ఇండియా, మేక్ ఇన్ ఇండియా, స్టాండ్ అప్ ఇండియా వంటి కార్యక్రమాల ద్వారా యువతలో ఆవిష్కరణలకు, పారిశ్రామికవేత్తలుగా ఎదగడానికి విశేష ప్రోత్సాహం అందుతోందని తెలిపారు. దేశ భవిష్యత్తుకు యువతే వెన్నెముక అని, వారి శక్తి

0843c3ad-ab05-448a-b6eb-ce144483e966

సామర్థ్యాలను దేశాభివృద్ధికి వినియోగించుకోవడమే మోదీ ప్రభుత్వ లక్ష్యమని వారు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ జిల్లా అధ్యక్షుడు గడ్డం శ్రీనివాస్, ఎంఎల్‌ఎన్ రెడ్డి, కో-కన్వీనర్ శ్రీనివాస్ గౌడ్, బీజేపీ యువమోర్చా నాయకులు అరవింద్ గౌడ్, అసెంబ్లీ కన్వీనర్లు కంచం సాయి, పోతారాజు అనిల్, జిల్లా యువమోర్చా పదాధికారులు, మండల అధ్యక్షులు, మండల ఇన్‌చార్జీలు, యువ నాయకులు తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

More news from Telangana and nearby areas
  • తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం రైతలకు వెన్నుపోటు పొడిచిందని బీఆర్ఎస్ పార్టీ తీవ్రంగా విమర్శించింది. కేంద్రం నిర్దేశించిన కోటా మేరకే పంటల కొనుగోళ్లను పరిమితం చేయడం రైతు వ్యతిరేక నిర్ణయమని, కేంద్రంపై ఒత్తిడి తేవడంలో ప్రభుత్వం విఫలమైందని బీఆర్ఎస్ ఆరోపించింది. మెదక్ జిల్లాలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో మాజీ డిప్యూటీ స్పీకర్ యం. పద్మ దేవేందర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ శేరి సుభాష్ రెడ్డితో కలిసి మీడియా సమావేశంలో మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ రైతుల పట్ల పూర్తిగా నిర్లక్ష్య వైఖరిని అవలంబిస్తోందని ఆమె విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం ఈ ప్రకటనతో 70 లక్షల మంది రైతులకు తీవ్ర అన్యాయం చేస్తోందని పేర్కొన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో రైతు సంక్షేమానికి పెద్దపీట వేయగా, ఇప్పుడు రైతులను సంక్షోభంలోకి నెట్టే నిర్ణయాలు తీసుకుంటున్నారని ఆరోపించారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలోని బీఆర్ఎస్ హయాంలో రైతే కేంద్రబిందువుగా పాలన సాగిందని, రైతుబంధు, రైతుబీమా, 24 గంటల ఉచిత విద్యుత్, కాళేశ్వరం ప్రాజెక్టు, మిషన్ కాకతీయ వంటి పథకాలతో తెలంగాణ వ్యవసాయ రంగం దేశానికే ఆదర్శంగా నిలిచిందని వివరించారు. రైతుల ఖాతాల్లో లక్ష కోట్లకు పైగా జమ చేసి, రైతు సంక్షేమానికి పెద్దపీట వేసిన ఘనత బీఆర్ఎస్ ప్రభుత్వానిదేనని తెలిపారు. ఎన్నికల సమయంలో అన్ని పంటలను చివరి గింజ వరకు కొనుగోలు చేస్తామని, బోనస్ ఇస్తామని హామీ ఇచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు చేతులెత్తేయడం రైతులను మోసం చేయడమేనని బీఆర్ఎస్ నాయకులు దుయ్యబట్టారు. పంటల కొనుగోళ్ల విషయంలో ఇచ్చిన హామీలను అమలు చేయకుండా రైతులను దళారుల దయాదాక్షిణ్యాలకు వదిలేస్తోందని ఆరోపించారు. గతంలో కేంద్రం కొనుగోలు చేయని పంటలను కూడా బీఆర్ఎస్ రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేసి రైతులకు అండగా నిలిచిందని గుర్తు చేశారు. రైతుల ప్రయోజనాల కోసం కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాల్సిన బాధ్యత నుండి రాష్ట్ర ప్రభుత్వం తప్పించుకోవడం సరికాదని అన్నారు. తెలంగాణ రైతులు పండించిన ప్రతి పంటను చివరి గింజ వరకు కొనుగోలు చేయాలని బీఆర్ఎస్ డిమాండ్ చేసింది. ప్రభుత్వం తన వైఖరిని మార్చుకోకపోతే, బీఆర్ఎస్ పార్టీ రైతులతో కలిసి రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తుందని హెచ్చరించింది. ఈ మీడియా సమావేశంలో జిల్లా పరిషత్ మాజీ ఉపాధ్యక్షురాలు యం. లావణ్య రెడ్డి, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ లు బట్టి. జగపతి, అకిరెడ్డి. కృష్ణారెడ్డి, పట్టణ పార్టీ కన్వీనర్ కౌన్సిలర్ మామిళ్ళ ఆంజనేయులు, మెదక్ మండల పార్టీ అధ్యక్షులు యం. అంజ గౌడ్, మున్సిపల్ కౌన్సిలర్లు బట్టి. ఉదయ్ కుమార్, జుబెర్ అహ్మద్, నాయకులు కృష్ణ గౌడ్, లింగారెడ్డి, కిష్టయ్య, భీమరి. కిషోర్, పట్లోరి. రాజు, మోహన్ నాయక్, సాయి, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
    1
    తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం రైతలకు వెన్నుపోటు పొడిచిందని బీఆర్ఎస్ పార్టీ తీవ్రంగా విమర్శించింది. కేంద్రం నిర్దేశించిన కోటా మేరకే పంటల కొనుగోళ్లను పరిమితం చేయడం రైతు వ్యతిరేక నిర్ణయమని, కేంద్రంపై ఒత్తిడి తేవడంలో ప్రభుత్వం విఫలమైందని బీఆర్ఎస్ ఆరోపించింది.

మెదక్ జిల్లాలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో మాజీ డిప్యూటీ స్పీకర్ యం. పద్మ దేవేందర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ శేరి సుభాష్ రెడ్డితో కలిసి మీడియా సమావేశంలో మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ రైతుల పట్ల పూర్తిగా నిర్లక్ష్య వైఖరిని అవలంబిస్తోందని ఆమె విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం ఈ ప్రకటనతో 70 లక్షల మంది రైతులకు తీవ్ర అన్యాయం చేస్తోందని పేర్కొన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో రైతు సంక్షేమానికి పెద్దపీట వేయగా, ఇప్పుడు రైతులను సంక్షోభంలోకి నెట్టే నిర్ణయాలు తీసుకుంటున్నారని ఆరోపించారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలోని బీఆర్ఎస్ హయాంలో రైతే కేంద్రబిందువుగా పాలన సాగిందని, రైతుబంధు, రైతుబీమా, 24 గంటల ఉచిత విద్యుత్, కాళేశ్వరం ప్రాజెక్టు, మిషన్ కాకతీయ వంటి పథకాలతో తెలంగాణ వ్యవసాయ రంగం దేశానికే ఆదర్శంగా నిలిచిందని వివరించారు. రైతుల ఖాతాల్లో లక్ష కోట్లకు పైగా జమ చేసి, రైతు సంక్షేమానికి పెద్దపీట వేసిన ఘనత బీఆర్ఎస్ ప్రభుత్వానిదేనని తెలిపారు.

ఎన్నికల సమయంలో అన్ని పంటలను చివరి గింజ వరకు కొనుగోలు చేస్తామని, బోనస్ ఇస్తామని హామీ ఇచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు చేతులెత్తేయడం రైతులను మోసం చేయడమేనని బీఆర్ఎస్ నాయకులు దుయ్యబట్టారు. పంటల కొనుగోళ్ల విషయంలో ఇచ్చిన హామీలను అమలు చేయకుండా రైతులను దళారుల దయాదాక్షిణ్యాలకు వదిలేస్తోందని ఆరోపించారు. గతంలో కేంద్రం కొనుగోలు చేయని పంటలను కూడా బీఆర్ఎస్ రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేసి రైతులకు అండగా నిలిచిందని గుర్తు చేశారు. రైతుల ప్రయోజనాల కోసం కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాల్సిన బాధ్యత నుండి రాష్ట్ర ప్రభుత్వం తప్పించుకోవడం సరికాదని అన్నారు. తెలంగాణ రైతులు పండించిన ప్రతి పంటను చివరి గింజ వరకు కొనుగోలు చేయాలని బీఆర్ఎస్ డిమాండ్ చేసింది. ప్రభుత్వం తన వైఖరిని మార్చుకోకపోతే, బీఆర్ఎస్ పార్టీ రైతులతో కలిసి రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తుందని హెచ్చరించింది.

ఈ మీడియా సమావేశంలో జిల్లా పరిషత్ మాజీ ఉపాధ్యక్షురాలు యం. లావణ్య రెడ్డి, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ లు బట్టి. జగపతి, అకిరెడ్డి. కృష్ణారెడ్డి, పట్టణ పార్టీ కన్వీనర్ కౌన్సిలర్ మామిళ్ళ ఆంజనేయులు, మెదక్ మండల పార్టీ అధ్యక్షులు యం. అంజ గౌడ్, మున్సిపల్ కౌన్సిలర్లు బట్టి. ఉదయ్ కుమార్, జుబెర్ అహ్మద్, నాయకులు కృష్ణ గౌడ్, లింగారెడ్డి, కిష్టయ్య, భీమరి. కిషోర్, పట్లోరి. రాజు, మోహన్ నాయక్, సాయి, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
    user_మెదక్ న్యూస్
    మెదక్ న్యూస్
    Medak, Telangana•
    13 hrs ago
  • కామారెడ్డి జిల్లా భిక్కనూరులోని ప్రభుత్వ ప్రైమరీ పాఠశాలలో శనివారం అక్షరాభ్యాస కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన గ్రామ సర్పంచ్ రేఖ చిన్నారులతో అక్షరాలు దిద్దించారు. ఈ సందర్భంగా సర్పంచ్ రేఖ మాట్లాడుతూ, ప్రతి ఒక్కరూ ప్రభుత్వ పాఠశాలల్లోనే చదువుకోవాలని పిలుపునిచ్చారు. సర్కారు బడుల్లో ప్రభుత్వం మెరుగైన వసతులు కల్పిస్తోందని ఆమె స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, సిబ్బంది పాల్గొన్నారు.
    1
    కామారెడ్డి జిల్లా భిక్కనూరులోని ప్రభుత్వ ప్రైమరీ పాఠశాలలో శనివారం అక్షరాభ్యాస కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన గ్రామ సర్పంచ్ రేఖ చిన్నారులతో అక్షరాలు దిద్దించారు.

ఈ సందర్భంగా సర్పంచ్ రేఖ మాట్లాడుతూ, ప్రతి ఒక్కరూ ప్రభుత్వ పాఠశాలల్లోనే చదువుకోవాలని పిలుపునిచ్చారు. సర్కారు బడుల్లో ప్రభుత్వం మెరుగైన వసతులు కల్పిస్తోందని ఆమె స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, సిబ్బంది పాల్గొన్నారు.
    user_Narmala Swapna
    Narmala Swapna
    Tour operator బిర్కూర్, కామారెడ్డి, తెలంగాణ•
    7 hrs ago
  • చిన్న శంకరంపేట మండల కేంద్రంలోని మండల విద్యా వనరుల కేంద్రం (ఎంఈఆర్సీ) లో ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు విద్యా సంవత్సరం ప్రారంభం నుంచే 100 శాతం పాఠ్యపుస్తకాలు అందుబాటులో ఉంచాలని బీఆర్ఎస్వీ నాయకులు గట్టిగా డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా జిల్లా విద్యార్థి విభాగం నాయకుడు నాగరాజు, కార్యాలయ సిబ్బందికి వినతిపత్రాన్ని సమర్పించారు. అంతేకాకుండా, ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతుల కొరతను తక్షణమే పరిష్కరించాలని నాగరాజు విజ్ఞప్తి చేశారు. తరగతి గదులు, తాగునీరు, మరుగుదొడ్లు, ఫర్నిచర్ వంటి సౌకర్యాలను అన్ని పాఠశాలల్లో సమృద్ధిగా కల్పించాలని ఆయన స్పష్టం చేశారు. అలాగే, ప్రైవేట్ పాఠశాలలు అధిక ఫీజులు వసూలు చేస్తున్నాయని, వాటిపై ప్రభుత్వం నియంత్రణ చర్యలు చేపట్టి తల్లిదండ్రులపై ఆర్థిక భారం తగ్గించాలని కూడా బీఆర్ఎస్వీ నాయకులు కోరారు. విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని, విద్యారంగ సమస్యల పరిష్కారానికి అధికారులు తక్షణ చర్యలు తీసుకోవాలని బీఆర్ఎస్వీ నాయకులు మరోసారి విజ్ఞప్తి చేశారు.
    1
    చిన్న శంకరంపేట మండల కేంద్రంలోని మండల విద్యా వనరుల కేంద్రం (ఎంఈఆర్సీ) లో ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు విద్యా సంవత్సరం ప్రారంభం నుంచే 100 శాతం పాఠ్యపుస్తకాలు అందుబాటులో ఉంచాలని బీఆర్ఎస్వీ నాయకులు గట్టిగా డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా జిల్లా విద్యార్థి విభాగం నాయకుడు నాగరాజు, కార్యాలయ సిబ్బందికి వినతిపత్రాన్ని సమర్పించారు.

అంతేకాకుండా, ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతుల కొరతను తక్షణమే పరిష్కరించాలని నాగరాజు విజ్ఞప్తి చేశారు. తరగతి గదులు, తాగునీరు, మరుగుదొడ్లు, ఫర్నిచర్ వంటి సౌకర్యాలను అన్ని పాఠశాలల్లో సమృద్ధిగా కల్పించాలని ఆయన స్పష్టం చేశారు. అలాగే, ప్రైవేట్ పాఠశాలలు అధిక ఫీజులు వసూలు చేస్తున్నాయని, వాటిపై ప్రభుత్వం నియంత్రణ చర్యలు చేపట్టి తల్లిదండ్రులపై ఆర్థిక భారం తగ్గించాలని కూడా బీఆర్ఎస్వీ నాయకులు కోరారు.

విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని, విద్యారంగ సమస్యల పరిష్కారానికి అధికారులు తక్షణ చర్యలు తీసుకోవాలని బీఆర్ఎస్వీ నాయకులు మరోసారి విజ్ఞప్తి చేశారు.
    user_Priya
    Priya
    నర్సాపూర్, మెదక్, తెలంగాణ•
    8 hrs ago
  • జిన్నారం మున్సిపల్ కేంద్రంలోని కోర్టులో జడ్జ్ తేజశ్రీ ఆధ్వర్యంలో శనివారం జాతీయ లోక్ అదాలత్ నిర్వహించారు. ఈ సందర్భంగా న్యాయవాదులు మాట్లాడుతూ, లోక్ అదాలత్ ద్వారా కేసులు త్వరితగతిన పరిష్కారమై సత్వర న్యాయం అందుతుందని తెలిపారు. కక్షిదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని పరస్పర రాజీ ద్వారా వివాదాలను పరిష్కరించుకోవడం అభినందనీయమని వారు పేర్కొన్నారు.
    1
    జిన్నారం మున్సిపల్ కేంద్రంలోని కోర్టులో జడ్జ్ తేజశ్రీ ఆధ్వర్యంలో శనివారం జాతీయ లోక్ అదాలత్ నిర్వహించారు. ఈ సందర్భంగా న్యాయవాదులు మాట్లాడుతూ, లోక్ అదాలత్ ద్వారా కేసులు త్వరితగతిన పరిష్కారమై సత్వర న్యాయం అందుతుందని తెలిపారు. కక్షిదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని పరస్పర రాజీ ద్వారా వివాదాలను పరిష్కరించుకోవడం అభినందనీయమని వారు పేర్కొన్నారు.
    user_KUMAR
    KUMAR
    Patancheru, Sangareddy•
    10 hrs ago
  • శనివారం నాడు గంబీరావుపేట పోలీస్ స్టేషన్ పరిధిలోని "మా" అభాగ్యుల వృద్ధాశ్రమాన్ని జిల్లా ఎస్పీ మహేష్ బి.గితే సందర్శించారు. ఈ సందర్భంగా, ఎస్పీ వృద్ధాశ్రమంలో నివసిస్తున్న వృద్ధులతో ఆప్యాయంగా మాట్లాడి, వారి ఆరోగ్య పరిస్థితులు మరియు అవసరాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం, వృద్ధులకు పండ్లు, బియ్యం, కిరాణా సరుకులు, ఇతర నిత్యావసర వస్తువులను పంపిణీ చేశారు. ఈ పర్యటనలో ఎస్పీ వెంట డిఎస్పీ నాగేంద్రచారి, సి.ఐ వెంకటేష్, ఎస్.ఐ శ్రీకాంత్ మరియు వృద్ధాశ్రమ సభ్యులు ఉన్నారు. ఈ సందర్శనలో భాగంగా, ఎస్పీ మాట్లాడుతూ సమాజంలో వృద్ధులు, నిరాశ్రయులు, అనాథల సంక్షేమం పట్ల ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని సూచించారు. వృద్ధులకు సేవ చేయడం గొప్ప మానవతా ధర్మమని, వారికి అండగా నిలబడటం ప్రతి ఒక్కరి సామాజిక బాధ్యత అని ఆయన అన్నారు. అవసరమైన వారికి సేవలు అందించడంలో జిల్లా పోలీసు శాఖ ఎల్లప్పుడూ ముందుంటుందని మహేష్ బి.గితే స్పష్టం చేశారు, మానవతా సేవలో పోలీసు శాఖ యొక్క నిబద్ధతను తెలియజేశారు.
    4
    శనివారం నాడు గంబీరావుపేట పోలీస్ స్టేషన్ పరిధిలోని "మా" అభాగ్యుల వృద్ధాశ్రమాన్ని జిల్లా ఎస్పీ మహేష్ బి.గితే సందర్శించారు. ఈ సందర్భంగా, ఎస్పీ వృద్ధాశ్రమంలో నివసిస్తున్న వృద్ధులతో ఆప్యాయంగా మాట్లాడి, వారి ఆరోగ్య పరిస్థితులు మరియు అవసరాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం, వృద్ధులకు పండ్లు, బియ్యం, కిరాణా సరుకులు, ఇతర నిత్యావసర వస్తువులను పంపిణీ చేశారు. ఈ పర్యటనలో ఎస్పీ వెంట డిఎస్పీ నాగేంద్రచారి, సి.ఐ వెంకటేష్, ఎస్.ఐ శ్రీకాంత్ మరియు వృద్ధాశ్రమ సభ్యులు ఉన్నారు.

ఈ సందర్శనలో భాగంగా, ఎస్పీ మాట్లాడుతూ సమాజంలో వృద్ధులు, నిరాశ్రయులు, అనాథల సంక్షేమం పట్ల ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని సూచించారు. వృద్ధులకు సేవ చేయడం గొప్ప మానవతా ధర్మమని, వారికి అండగా నిలబడటం ప్రతి ఒక్కరి సామాజిక బాధ్యత అని ఆయన అన్నారు. అవసరమైన వారికి సేవలు అందించడంలో జిల్లా పోలీసు శాఖ ఎల్లప్పుడూ ముందుంటుందని మహేష్ బి.గితే స్పష్టం చేశారు, మానవతా సేవలో పోలీసు శాఖ యొక్క నిబద్ధతను తెలియజేశారు.
    user_సిరిసిల్ల స్వరం
    సిరిసిల్ల స్వరం
    సిరిసిల్ల, రాజన్న సిరిసిల్ల, తెలంగాణ•
    6 hrs ago
  • రాజన్న సిరిసిల్ల జిల్లాలోని గర్జనపల్లి ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఇంచార్జి ప్రధానోపాధ్యాయులు కులేరి ప్రేమ్ సాగర్, విద్యార్థుల్లో అభ్యసన సామర్థ్యాలను పెంపొందించడంలో బోధనోపకరణలు ఎంతో ఉపయోగపడతాయని స్పష్టం చేశారు. లెర్నింగ్ ఇంప్రూవ్మెంట్ ప్రోగ్రాం లో భాగంగా, అభ్యసన ప్రక్రియలో వెనకబడిన విద్యార్థులను గుర్తించి వారికి సులభరీతిలో బోధించడానికి వీలుగా, విద్యార్థులతో కలిసి బోధనోపకరణలను తయారు చేసినట్టు ఆయన తెలిపారు. ఇది రాజన్న సిరిసిల్ల జిల్లా ఉపాధ్యాయుల బోధనోపకరణల వర్క్ షాప్‌లో భాగంగా జరిగింది. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు మంజుల, శ్రీనివాస్, కవిత, కార్తీక్ లు పాల్గొన్నారు.
    2
    రాజన్న సిరిసిల్ల జిల్లాలోని గర్జనపల్లి ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఇంచార్జి ప్రధానోపాధ్యాయులు కులేరి ప్రేమ్ సాగర్, విద్యార్థుల్లో అభ్యసన సామర్థ్యాలను పెంపొందించడంలో బోధనోపకరణలు ఎంతో ఉపయోగపడతాయని స్పష్టం చేశారు.

లెర్నింగ్ ఇంప్రూవ్మెంట్ ప్రోగ్రాం లో భాగంగా, అభ్యసన ప్రక్రియలో వెనకబడిన విద్యార్థులను గుర్తించి వారికి సులభరీతిలో బోధించడానికి వీలుగా, విద్యార్థులతో కలిసి బోధనోపకరణలను తయారు చేసినట్టు ఆయన తెలిపారు. ఇది రాజన్న సిరిసిల్ల జిల్లా ఉపాధ్యాయుల బోధనోపకరణల వర్క్ షాప్‌లో భాగంగా జరిగింది.

ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు మంజుల, శ్రీనివాస్, కవిత, కార్తీక్ లు పాల్గొన్నారు.
    user_Sai
    Sai
    Local News Reporter కోనరావుపేట, రాజన్న సిరిసిల్ల, తెలంగాణ•
    7 hrs ago
  • రాజన్న సిరిసిల్ల జిల్లాలో ప్రభుత్వ ధాన్యం కొనుగోలు ప్రక్రియలో నకిలీ ట్రక్ చిట్లు సృష్టించి సుమారు ₹91 లక్షల ప్రభుత్వ నిధులను దుర్వినియోగం చేసిన Cr.No.351/2026 U/Sec. 61(2), 318(4), 316(2), 316(5) r/w 3(5) BNS కేసులో ఆరుగురు నిందితులను సిరిసిల్ల టౌన్ పోలీసులు అరెస్ట్ చేసినట్లు జిల్లా ఎస్పీ మహేష్ బి. గితే వెల్లడించారు. సిరిసిల్ల పట్టణంలోని పెద్దూర్ అపారెల్ పార్క్ గోదాంలో మేనేజర్‌గా పనిచేస్తున్న కరీంనగర్ నివాసి ఉత్కం విజయ్ (A1), అతనితో పనిచేస్తున్న వేములవాడ రూరల్ అచ్చనపల్లి గ్రామానికి చెందిన వాసాల గణేష్ (A5)తో కలిసి ఐకేపీ కేంద్రాల నుంచి ధాన్యం వచ్చినట్లు నకిలీ ట్రక్ షీట్లు తయారు చేశారు. ఈ మోసంలో భాగంగా రుద్రంగి ఐకేపీ కేంద్రం ఇన్‌చార్జ్ గడ్డం స్వామి (A3) రెండు లారీలకు నకిలీ ట్రక్ చీటీలు జారీ చేయగా, ఉత్కం విజయ్ వాటిని సివిల్ సప్లై వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేసి నిధులను పంచుకున్నారు. అదేవిధంగా, డీఎంఓ కార్యాలయంలో మండల స్థాయి కో-ఆర్డినేటర్‌గా పనిచేస్తున్న కమ్మరి రాజశేఖర్ (A2), బద్దెనపల్లి పీఏసీఎస్ కేంద్రం ఇన్‌చార్జ్ గాజుల నవీన్ (A6)తో కలిసి ఒక లారీ ధాన్యానికి నకిలీ ట్రక్ చీటీ రూపొందించి ఉత్కం విజయ్‌కు అందించారు. అతను దాన్ని సివిల్ సప్లై వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేయగా, రాజశేఖర్ ఆమోదం తెలిపారు. విడుదలైన నిధులను ముగ్గురు పంచుకున్నారు. అంతేకాకుండా, వివిధ ఐకేపీ కేంద్రాల నుంచి అపారెల్ పార్క్ గోదాంకు వచ్చిన 10 లారీల ధాన్యాన్ని గోదాంలో దించకుండా, ఆన్‌లైన్‌లో దించినట్లు నమోదు చేశారు. అనంతరం ఆ ధాన్యాన్ని వేములవాడకు చెందిన చెపూరి మధుకర్ (A4)కు అప్పగించగా, అతను సిద్ధిపేటకు చెందిన కమిషన్ ఏజెంట్ చిటుకుల శ్రీకాంత్ (A7) ద్వారా వివిధ రైస్ మిల్లులకు విక్రయించి వచ్చిన మొత్తాన్ని పరస్పరం పంచుకున్నారు. ఈ మోసాలను గుర్తించిన జిల్లా సివిల్ సప్లై మేనేజర్ ఎస్. నరసింహ సిరిసిల్ల పట్టణ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసి డిఎస్పీ నాగేంద్రచారి ఆధ్వర్యంలో ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసి దర్యాప్తు చేపట్టారు. దర్యాప్తులో సుమారు ₹91 లక్షల ప్రభుత్వ నిధులు అక్రమంగా మళ్లించినట్లు తేలింది. నిందితులు ఉత్కం విజయ్ (A1), కమ్మరి రాజశేఖర్ (A2), చెపూరి మధుకర్ (A4), వాసాల గణేష్ (A5), గాజుల నవీన్‌లను ఈరోజు అరెస్ట్ చేసి వారి వద్ద నుంచి మొబైల్ ఫోన్లు, సంబంధిత పత్రాలు, ₹14,16,800 నగదు స్వాధీనం చేసుకున్నారు. వారి బ్యాంకు ఖాతాల్లో ఉన్న ₹46,21,358 మొత్తాన్ని ఫ్రీజ్ చేసి నిందితులను రిమాండ్‌కు తరలించారు. ఈ కేసులో మరింత దర్యాప్తు కొనసాగుతోందని జిల్లా ఎస్పీ సిరిసిల్ల పట్టణ పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఈ వివరాలను వెల్లడించారు.
    4
    రాజన్న సిరిసిల్ల జిల్లాలో ప్రభుత్వ ధాన్యం కొనుగోలు ప్రక్రియలో నకిలీ ట్రక్ చిట్లు సృష్టించి సుమారు ₹91 లక్షల ప్రభుత్వ నిధులను దుర్వినియోగం చేసిన Cr.No.351/2026 U/Sec. 61(2), 318(4), 316(2), 316(5) r/w 3(5) BNS కేసులో ఆరుగురు నిందితులను సిరిసిల్ల టౌన్ పోలీసులు అరెస్ట్ చేసినట్లు జిల్లా ఎస్పీ మహేష్ బి. గితే వెల్లడించారు. సిరిసిల్ల పట్టణంలోని పెద్దూర్ అపారెల్ పార్క్ గోదాంలో మేనేజర్‌గా పనిచేస్తున్న కరీంనగర్ నివాసి ఉత్కం విజయ్ (A1), అతనితో పనిచేస్తున్న వేములవాడ రూరల్ అచ్చనపల్లి గ్రామానికి చెందిన వాసాల గణేష్ (A5)తో కలిసి ఐకేపీ కేంద్రాల నుంచి ధాన్యం వచ్చినట్లు నకిలీ ట్రక్ షీట్లు తయారు చేశారు. ఈ మోసంలో భాగంగా రుద్రంగి ఐకేపీ కేంద్రం ఇన్‌చార్జ్ గడ్డం స్వామి (A3) రెండు లారీలకు నకిలీ ట్రక్ చీటీలు జారీ చేయగా, ఉత్కం విజయ్ వాటిని సివిల్ సప్లై వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేసి నిధులను పంచుకున్నారు.

అదేవిధంగా, డీఎంఓ కార్యాలయంలో మండల స్థాయి కో-ఆర్డినేటర్‌గా పనిచేస్తున్న కమ్మరి రాజశేఖర్ (A2), బద్దెనపల్లి పీఏసీఎస్ కేంద్రం ఇన్‌చార్జ్ గాజుల నవీన్ (A6)తో కలిసి ఒక లారీ ధాన్యానికి నకిలీ ట్రక్ చీటీ రూపొందించి ఉత్కం విజయ్‌కు అందించారు. అతను దాన్ని సివిల్ సప్లై వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేయగా, రాజశేఖర్ ఆమోదం తెలిపారు. విడుదలైన నిధులను ముగ్గురు పంచుకున్నారు. అంతేకాకుండా, వివిధ ఐకేపీ కేంద్రాల నుంచి అపారెల్ పార్క్ గోదాంకు వచ్చిన 10 లారీల ధాన్యాన్ని గోదాంలో దించకుండా, ఆన్‌లైన్‌లో దించినట్లు నమోదు చేశారు. అనంతరం ఆ ధాన్యాన్ని వేములవాడకు చెందిన చెపూరి మధుకర్ (A4)కు అప్పగించగా, అతను సిద్ధిపేటకు చెందిన కమిషన్ ఏజెంట్ చిటుకుల శ్రీకాంత్ (A7) ద్వారా వివిధ రైస్ మిల్లులకు విక్రయించి వచ్చిన మొత్తాన్ని పరస్పరం పంచుకున్నారు.

ఈ మోసాలను గుర్తించిన జిల్లా సివిల్ సప్లై మేనేజర్ ఎస్. నరసింహ సిరిసిల్ల పట్టణ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసి డిఎస్పీ నాగేంద్రచారి ఆధ్వర్యంలో ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసి దర్యాప్తు చేపట్టారు. దర్యాప్తులో సుమారు ₹91 లక్షల ప్రభుత్వ నిధులు అక్రమంగా మళ్లించినట్లు తేలింది. నిందితులు ఉత్కం విజయ్ (A1), కమ్మరి రాజశేఖర్ (A2), చెపూరి మధుకర్ (A4), వాసాల గణేష్ (A5), గాజుల నవీన్‌లను ఈరోజు అరెస్ట్ చేసి వారి వద్ద నుంచి మొబైల్ ఫోన్లు, సంబంధిత పత్రాలు, ₹14,16,800 నగదు స్వాధీనం చేసుకున్నారు. వారి బ్యాంకు ఖాతాల్లో ఉన్న ₹46,21,358 మొత్తాన్ని ఫ్రీజ్ చేసి నిందితులను రిమాండ్‌కు తరలించారు. ఈ కేసులో మరింత దర్యాప్తు కొనసాగుతోందని జిల్లా ఎస్పీ సిరిసిల్ల పట్టణ పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఈ వివరాలను వెల్లడించారు.
    user_Gampa mahesh
    Gampa mahesh
    వేములవాడ, రాజన్న సిరిసిల్ల, తెలంగాణ•
    7 hrs ago
  • కామారెడ్డి మాజీ ఎమ్మెల్యే గంప గోవర్ధన్ కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను దగా చేస్తోందని తీవ్రంగా ఆరోపించారు. శనివారం కామారెడ్డిలో మీడియాతో మాట్లాడిన ఆయన, రైతులకు సరిపడా యూరియా అందించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో, యూరియా యాప్‌ను వెంటనే తొలగించాలని డిమాండ్ చేసిన గంప గోవర్ధన్, రైతుల పక్షాన బీఆర్ఎస్ నిరంతరం పోరాటం చేస్తుందని స్పష్టం చేశారు.
    1
    కామారెడ్డి మాజీ ఎమ్మెల్యే గంప గోవర్ధన్ కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను దగా చేస్తోందని తీవ్రంగా ఆరోపించారు. శనివారం కామారెడ్డిలో మీడియాతో మాట్లాడిన ఆయన, రైతులకు సరిపడా యూరియా అందించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో, యూరియా యాప్‌ను వెంటనే తొలగించాలని డిమాండ్ చేసిన గంప గోవర్ధన్, రైతుల పక్షాన బీఆర్ఎస్ నిరంతరం పోరాటం చేస్తుందని స్పష్టం చేశారు.
    user_Narmala Swapna
    Narmala Swapna
    Tour operator బిర్కూర్, కామారెడ్డి, తెలంగాణ•
    7 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.