logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

గౌడన్నలకి ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలి: టీఆర్పీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ మాదం రజిని కుమార్ యాదవ్..* ప్రెస్ నోట్: 31/07/2026 *● గౌడన్నలకి ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలి: టీఆర్పీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ మాదం రజిని కుమార్ యాదవ్..* *● కల్లుగీత కార్మిక సంఘం 'బస్సు యాత్ర' వాల్ పోస్టర్ ఆవిష్కరణ...* *● ఆగస్టు 2 నుండి 18 వరకు సాగనున్న యాత్రకు టీఆర్పీ సంపూర్ణ మద్దతు..* హన్మకొండ:తెలంగాణలో గౌడ సామాజిక వర్గానికి ఇచ్చిన ఎన్నికల హామీలను అమలు చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని తెలంగాణ రాజ్యాధికార పార్టీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ మాదం రజిని కుమార్ యాదవ్ తీవ్రస్థాయిలో విమర్శించారు. కల్లుగీత కార్మిక సంఘం ఆధ్వర్యంలో ఆగస్టు 2వ తేదీ నుండి 18వ తేదీ వరకు రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించనున్న 'బస్సు యాత్ర'కు టీఆర్పీ పార్టీ సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నట్లు ఆయన తెలిపారు.హన్మకొండ జిల్లాలోని టీఆర్పీ ప్రధాన కార్యాలయంలో జిల్లా కల్లుగీత కార్మిక సంఘం నాయకులతో కలిసి బస్సు యాత్రకు సంబంధించిన వాల్ పోస్టర్‌ను ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాదం రజిని కుమార్ యాదవ్ మాట్లాడుతూ, బీసీలను ఓటు బ్యాంకుగా వాడుకుంటూ వారిని మోసం చేయడంలో ప్రధాన రాజకీయ పార్టీలన్నీ ముందుంటాయని మండిపడ్డారు. ప్రాణాలకు తెగించి ఆకాశమంత ఎత్తులో ఉండే తాటి, ఈత చెట్లెక్కి కల్లు గీసే కార్మికులు నిత్యం ప్రమాదాల బారిన పడుతున్నా ప్రభుత్వం పట్టించుకోకపోవడం దారుణమన్నారు. రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా వెనుకబడిన గౌడన్నలపై పాలకులు ఎందుకు చిన్నచూపు చూస్తున్నారని ఆయన ప్రశ్నించారు. హక్కుల సాధన కోసం గౌడన్నలంతా ఏకమై, రాష్ట్రంలోని అగ్రవర్ణ పార్టీలకు బుద్ధి చెప్పాలని ఈ సందర్భంగా ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో టీఆర్పీ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు కోమల మంజుల గౌడ్, యువజన విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పోలు రాజు ముదిరాజ్, కల్లుగీత కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు బుర్ర శ్రీనివాస్ గౌడ్, ప్రధాన కార్యదర్శి బండి రంజిత్ కుమార్ గౌడ్, గడ్డం యాదగిరి గౌడ్, రాష్ట్ర కమిటీ సభ్యులు కోతి సాంబరాజు గౌడ్, మోటపోతుల రాజు గౌడ్, కారంగుల రవి గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

3 hrs ago
user_NIMMANAGANTI ANIL BABU
NIMMANAGANTI ANIL BABU
Local News Reporter డోర్నకల్, మహబూబాబాద్, తెలంగాణ•
3 hrs ago
fa2a089e-6c0d-4262-9e4f-b41d6585467a

గౌడన్నలకి ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలి: టీఆర్పీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ మాదం రజిని కుమార్ యాదవ్..* ప్రెస్ నోట్: 31/07/2026 *● గౌడన్నలకి ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలి: టీఆర్పీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ మాదం రజిని కుమార్ యాదవ్..* *● కల్లుగీత కార్మిక సంఘం 'బస్సు యాత్ర' వాల్ పోస్టర్ ఆవిష్కరణ...* *● ఆగస్టు 2 నుండి 18 వరకు సాగనున్న యాత్రకు టీఆర్పీ సంపూర్ణ మద్దతు..* హన్మకొండ:తెలంగాణలో గౌడ సామాజిక వర్గానికి ఇచ్చిన ఎన్నికల హామీలను అమలు చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని తెలంగాణ రాజ్యాధికార పార్టీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ మాదం రజిని కుమార్ యాదవ్ తీవ్రస్థాయిలో విమర్శించారు. కల్లుగీత కార్మిక సంఘం ఆధ్వర్యంలో ఆగస్టు 2వ తేదీ నుండి 18వ తేదీ వరకు రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించనున్న 'బస్సు యాత్ర'కు టీఆర్పీ పార్టీ సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నట్లు ఆయన తెలిపారు.హన్మకొండ జిల్లాలోని టీఆర్పీ ప్రధాన కార్యాలయంలో జిల్లా కల్లుగీత కార్మిక సంఘం నాయకులతో కలిసి బస్సు యాత్రకు సంబంధించిన వాల్ పోస్టర్‌ను ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాదం రజిని కుమార్ యాదవ్ మాట్లాడుతూ, బీసీలను ఓటు బ్యాంకుగా వాడుకుంటూ వారిని మోసం చేయడంలో ప్రధాన రాజకీయ పార్టీలన్నీ ముందుంటాయని మండిపడ్డారు. ప్రాణాలకు తెగించి ఆకాశమంత ఎత్తులో ఉండే తాటి, ఈత చెట్లెక్కి కల్లు గీసే కార్మికులు నిత్యం ప్రమాదాల బారిన పడుతున్నా ప్రభుత్వం పట్టించుకోకపోవడం దారుణమన్నారు. రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా వెనుకబడిన గౌడన్నలపై పాలకులు ఎందుకు చిన్నచూపు చూస్తున్నారని ఆయన ప్రశ్నించారు. హక్కుల సాధన కోసం గౌడన్నలంతా ఏకమై, రాష్ట్రంలోని అగ్రవర్ణ పార్టీలకు బుద్ధి చెప్పాలని ఈ సందర్భంగా ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో టీఆర్పీ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు కోమల మంజుల గౌడ్, యువజన విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పోలు రాజు ముదిరాజ్, కల్లుగీత కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు బుర్ర శ్రీనివాస్ గౌడ్, ప్రధాన కార్యదర్శి బండి రంజిత్ కుమార్ గౌడ్, గడ్డం యాదగిరి గౌడ్, రాష్ట్ర కమిటీ సభ్యులు కోతి సాంబరాజు గౌడ్, మోటపోతుల రాజు గౌడ్, కారంగుల రవి గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

More news from తెలంగాణ and nearby areas
  • అడిగేవాడు లేడని,ప్రభుత్వం అండతో ఫీజుల పేరుతో జనాల రక్తాన్ని జలగల్లా పీల్చి పిప్పి చేస్తున్న నారాయణ కాలేజీకి నేరుగా వెళ్లి *వీందో డ్రామా... వాందో డ్రామా😤* అడిగేవాడు లేడని,ప్రభుత్వం అండతో ఫీజుల పేరుతో జనాల రక్తాన్ని జలగల్లా పీల్చి పిప్పి చేస్తున్న నారాయణ కాలేజీకి నేరుగా వెళ్లి యాజమాన్యాన్ని ఏకిపారేసిన *ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న🔥* దొంగ ర్యాంకుల పేరుతో అడ్వర్టైజ్మెంట్లు ఇచ్చి జనాన్ని మోసం చేస్తే చూస్తూ ఊరుకోవడానికి అక్కడ ఉన్నది చేతకాని రేవంత్ రెడ్డి కాదు,దోపిడిదారి కేసీఆర్ కాదు.....దమ్మున్న తీన్మార్ మల్లన్న....ఒక్కొకడికి ఇక తీన్మారే ఇలాంటి నాయకులు కదా మనకు కావాల్సింది....
    1
    అడిగేవాడు లేడని,ప్రభుత్వం అండతో ఫీజుల పేరుతో జనాల రక్తాన్ని జలగల్లా పీల్చి పిప్పి చేస్తున్న నారాయణ కాలేజీకి నేరుగా వెళ్లి
*వీందో డ్రామా... వాందో డ్రామా😤*
అడిగేవాడు లేడని,ప్రభుత్వం అండతో ఫీజుల పేరుతో జనాల రక్తాన్ని జలగల్లా పీల్చి పిప్పి చేస్తున్న నారాయణ కాలేజీకి నేరుగా వెళ్లి యాజమాన్యాన్ని  ఏకిపారేసిన *ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న🔥*
దొంగ ర్యాంకుల పేరుతో అడ్వర్టైజ్మెంట్లు ఇచ్చి జనాన్ని మోసం చేస్తే చూస్తూ ఊరుకోవడానికి అక్కడ ఉన్నది చేతకాని రేవంత్ రెడ్డి కాదు,దోపిడిదారి కేసీఆర్ కాదు.....దమ్మున్న తీన్మార్ మల్లన్న....ఒక్కొకడికి ఇక తీన్మారే 
ఇలాంటి నాయకులు కదా మనకు కావాల్సింది....
    user_NIMMANAGANTI ANIL BABU
    NIMMANAGANTI ANIL BABU
    Local News Reporter డోర్నకల్, మహబూబాబాద్, తెలంగాణ•
    1 hr ago
  • పాత కూరగాయలమార్కెట్ నిర్మాణాల కూల్చివేతలపై వ్యాపారులు, రాజకీయ నాయకుల నిరసన .. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు... పాత కూరగాయలమార్కెట్ నిర్మాణాల కూల్చివేతలపై వ్యాపారులు, రాజకీయ నాయకుల నిరసన .. ఇల్లందు పట్టణంలో గత ఐదు దశాబ్దాలుగా వినియోగించుకున్న పాత కూరగాయల మార్కెట్ ప్రాంగణంలోని కొన్ని దుకాణ సముదాయాలను మున్సిపల్ సిబ్బంది జేసీబీ సహాయంతో కూల్చివేతలను ప్రారంభించడంతో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. తమకు ఎటువంటి నోటీసులు ఇవ్వకుండా కూల్చివేతలు చేయడం పట్ల కొందరు చిరు వ్యాపారులు ఆందోళన వ్యక్తం చేయగా వారికి పలురాజకీయ పార్టీల నాయకులు సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా పలుపార్టీల నాయకులు మాట్లాడుతూ ఆక్రమణలు ఏమైనా ఉంటే వ్యాపారులకు నోటీసులు అందజేసి తొలగిస్తే తమకు అభ్యంతరం లేదని కానీ ఇల్లందు పట్టణంలో ఎన్నో అక్రమ నిర్మాణాలు ఉన్నప్పటికీ కేవలం కూరగాయలు అమ్ముకునే చిరువ్యాపార నిర్మాణాలను తొలగించడం సరికాదన్నారు. కూల్చివేతలను నిరసిస్తూ రోడ్డుపై బయటాయించి నిరసన వ్యక్తం చేశారు. ఈ అంశంలో అన్ని రాజకీయ పార్టీలతో కలసి కార్యాచరణ రూపొందిస్తామని వెంటనే ఆక్రమణల పేరుతో చిరువ్యాపారులను ఇబ్బందులకు గురి చేయవద్దని డిమాండ్ చేశారు.. కూరగాయల వ్యాపారుల రాజకీయ నాయకుల నిరసనలతో కూల్చివేత పనులను మున్సిపల్ సిబ్బంది నిలిపివేశారు
    1
    పాత కూరగాయలమార్కెట్ నిర్మాణాల కూల్చివేతలపై వ్యాపారులు, రాజకీయ నాయకుల నిరసన ..
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు...
పాత కూరగాయలమార్కెట్ నిర్మాణాల కూల్చివేతలపై వ్యాపారులు, రాజకీయ నాయకుల నిరసన ..
ఇల్లందు పట్టణంలో గత ఐదు దశాబ్దాలుగా వినియోగించుకున్న పాత కూరగాయల మార్కెట్ ప్రాంగణంలోని కొన్ని దుకాణ సముదాయాలను మున్సిపల్ సిబ్బంది జేసీబీ సహాయంతో కూల్చివేతలను ప్రారంభించడంతో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. తమకు ఎటువంటి నోటీసులు ఇవ్వకుండా కూల్చివేతలు చేయడం పట్ల కొందరు చిరు వ్యాపారులు ఆందోళన వ్యక్తం చేయగా వారికి పలురాజకీయ పార్టీల నాయకులు సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా పలుపార్టీల నాయకులు మాట్లాడుతూ ఆక్రమణలు ఏమైనా ఉంటే వ్యాపారులకు నోటీసులు అందజేసి తొలగిస్తే తమకు అభ్యంతరం లేదని కానీ ఇల్లందు పట్టణంలో ఎన్నో అక్రమ నిర్మాణాలు ఉన్నప్పటికీ కేవలం కూరగాయలు అమ్ముకునే చిరువ్యాపార నిర్మాణాలను తొలగించడం సరికాదన్నారు. కూల్చివేతలను నిరసిస్తూ రోడ్డుపై బయటాయించి నిరసన వ్యక్తం చేశారు. ఈ అంశంలో అన్ని రాజకీయ పార్టీలతో కలసి కార్యాచరణ రూపొందిస్తామని వెంటనే ఆక్రమణల పేరుతో చిరువ్యాపారులను ఇబ్బందులకు గురి చేయవద్దని డిమాండ్ చేశారు.. కూరగాయల వ్యాపారుల రాజకీయ నాయకుల నిరసనలతో కూల్చివేత పనులను మున్సిపల్ సిబ్బంది నిలిపివేశారు
    user_Shekar Thaduri
    Shekar Thaduri
    ఎల్లందు, భద్రాద్రి కొత్తగూడెం, తెలంగాణ•
    56 min ago
  • మహబూబాబాద్ లోని 22వ వార్డ్ లో రోడ్లు వేయాలని సిపిఐ వినూత్న నిరసన.. మహబూబాబాద్‌లోని 22వ వార్డులో రూ.50 లక్షలతో సీసీ రోడ్డు నిర్మాణ పనులను వెంటనే చేపట్టాలని డిమాండ్ చేస్తూ సీపీఐ నాయకులు, కార్యకర్తలు వినూత్న నిరసన చేపట్టారు. రోడ్డు అధ్వానంగా ఉండటంతో కాలనీలో వరి నాట్లు వేసి తమ నిరసన వ్యక్తం చేశారు. స్థానిక ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని అధికారులు, ప్రజాప్రతినిధులు వెంటనే స్పందించి సీసీ రోడ్డు నిర్మాణ పనులను ప్రారంభించాలని సీపీఐ శ్రేణులు కోరారు.
    1
    మహబూబాబాద్ లోని 22వ వార్డ్ లో రోడ్లు వేయాలని సిపిఐ వినూత్న నిరసన..
మహబూబాబాద్‌లోని 22వ వార్డులో రూ.50 లక్షలతో సీసీ రోడ్డు నిర్మాణ పనులను వెంటనే చేపట్టాలని డిమాండ్ చేస్తూ సీపీఐ నాయకులు, కార్యకర్తలు వినూత్న నిరసన చేపట్టారు. రోడ్డు అధ్వానంగా ఉండటంతో కాలనీలో వరి నాట్లు వేసి తమ నిరసన వ్యక్తం చేశారు. స్థానిక ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని అధికారులు, ప్రజాప్రతినిధులు వెంటనే స్పందించి సీసీ రోడ్డు నిర్మాణ పనులను ప్రారంభించాలని సీపీఐ శ్రేణులు కోరారు.
    user_మానుకోట వార్తలు
    మానుకోట వార్తలు
    మహబూబాబాద్, మహబూబాబాద్, తెలంగాణ•
    22 hrs ago
  • ఖమ్మం కలెక్టరేట్ ముట్టడి చేసిన PDSU....ఉద్రిక్తత పరిస్థితి పెండింగ్ లో ఉన్న ఫీజు రియంబర్స్మెంట్, స్కాలర్షిప్స్, బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ నిధులను విడుదల చేయాలని PDSU ఆధ్వర్యంలో శుక్రవారం ఖమ్మం కలెక్టరేట్ ని ముట్టడించారు. ముందుగా ప్రదర్శన ర్యాలీ నిర్వహించి, కలెక్టరేట్ లోపలికి వెళ్లేందుకు యత్నించగా పోలీసులు అడ్డుకొని అరెస్ట్ చేశారు. దీంతో అక్కడ కొంత ఉద్రిక్త నెలకొంది. జిల్లా అధ్యక్షుడు జి.మస్తాన్ మాట్లాడుతూ.. పెండింగ్ బకాయిలు వెంటనే విడుదల చేయాలని కోరారు.
    1
    ఖమ్మం కలెక్టరేట్ ముట్టడి చేసిన PDSU....ఉద్రిక్తత పరిస్థితి
పెండింగ్ లో ఉన్న ఫీజు రియంబర్స్మెంట్, స్కాలర్షిప్స్, బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ నిధులను విడుదల చేయాలని PDSU ఆధ్వర్యంలో శుక్రవారం ఖమ్మం కలెక్టరేట్ ని ముట్టడించారు. ముందుగా ప్రదర్శన ర్యాలీ నిర్వహించి, కలెక్టరేట్ లోపలికి వెళ్లేందుకు యత్నించగా పోలీసులు అడ్డుకొని అరెస్ట్ చేశారు. దీంతో అక్కడ కొంత ఉద్రిక్త నెలకొంది. జిల్లా అధ్యక్షుడు జి.మస్తాన్ మాట్లాడుతూ.. పెండింగ్ బకాయిలు వెంటనే విడుదల చేయాలని కోరారు.
    user_Suresh Kumar
    Suresh Kumar
    సత్తుపల్లి, ఖమ్మం, తెలంగాణ•
    22 hrs ago
  • పాతర్లపాడు కూలిన కల్వర్టు తన సొంత ఖర్చులతో రహదారికి తాత్కాలిక మరమ్మతులు గ్రామ సర్పంచ్ జడల సుష్మ చేయించారు ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గం తిరుమలయపాలెం మండలంలోని పాతర్లపాడు కూలిన కల్వర్టు తన సొంత ఖర్చులతో రహదారికి తాత్కాలిక మరమ్మతులు గ్రామ సర్పంచ్ జడల సుష్మ చేయించారు. దీనితో రెండు గ్రామాలకు చెందిన రైతులు, ప్రజలకు రాకపోకల ఇబ్బందులు తొలగిపోయాయి. గ్రామస్థులు సర్పంచ్ కు కృతజ్ఞతలు తెలిపారు.
    1
    పాతర్లపాడు  కూలిన కల్వర్టు  తన సొంత ఖర్చులతో రహదారికి తాత్కాలిక మరమ్మతులు గ్రామ సర్పంచ్ జడల సుష్మ చేయించారు
ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గం తిరుమలయపాలెం మండలంలోని పాతర్లపాడు  కూలిన కల్వర్టు  తన సొంత ఖర్చులతో రహదారికి తాత్కాలిక మరమ్మతులు గ్రామ సర్పంచ్ జడల సుష్మ చేయించారు. దీనితో రెండు గ్రామాలకు చెందిన రైతులు, ప్రజలకు రాకపోకల ఇబ్బందులు తొలగిపోయాయి. గ్రామస్థులు సర్పంచ్ కు కృతజ్ఞతలు తెలిపారు.
    user_ARUNKUMAR
    ARUNKUMAR
    Local News Reporter నేలకొండపల్లి, ఖమ్మం, తెలంగాణ•
    3 hrs ago
  • వరంగల్ జిల్లా: ప్రతి శుక్రవారం... పార్టీ లోని ఒక కుటుంబంతో కలిసి భోజనం, ఒక కార్యకర్తకు అండగా మొత్తం పార్టీ కుటుంబం!*❤️ *✊ ప్రతి శుక్రవారం... పార్టీ లోని ఒక కుటుంబంతో కలిసి భోజనం, ఒక కార్యకర్తకు అండగా మొత్తం పార్టీ కుటుంబం!*❤️ *మాధం రజినీ కుమార్ యాదవ్ గారి అధ్యక్షతన, పల్లెబోయిన అశోక్ ముదిరాజ్ గారి పర్యవేక్షణలో ప్రతి శుక్రవారం రాత్రి @8 PM నిర్వహిస్తున్న TRP డిన్నర్ హోమ్ మీట్ కార్యక్రమం నిజంగా ఆదర్శప్రాయమైనది.* *పార్టీలోని కార్యకర్తలు, నాయకులు ప్రతి వారం ఒక TRP కుటుంబం ఇంటికి వెళ్లి కలిసి భోజనం చేస్తూ, "మీ కుటుంబానికి మేమంతా అండగా ఉన్నాం" అనే భరోసాను కల్పిస్తున్నారు.* *ఇది కేవలం భోజన కార్యక్రమం కాదు... కుటుంబాల మధ్య అనుబంధాన్ని పెంచే, కార్యకర్తలో ఆత్మవిశ్వాసాన్ని నింపే ఉద్యమం.* *ఉమ్మడి వరంగల్ జిల్లాలోని ప్రతి TRP నాయకుడు, కార్యకర్త వెనుక ఇంత పెద్ద కుటుంబం అండగా ఉందనే ధైర్యంతో ముందుకు సాగుతున్నాడు.* *ఇదే TRP కుటుంబం... ఇదే కార్యకర్తకు ఇచ్చే గౌరవం... ఇదే ఐక్యతకు నిదర్శనం! 🔥✊*
    1
    వరంగల్ జిల్లా: ప్రతి శుక్రవారం... పార్టీ లోని ఒక కుటుంబంతో కలిసి భోజనం, ఒక కార్యకర్తకు అండగా మొత్తం పార్టీ కుటుంబం!*❤️

*✊ ప్రతి శుక్రవారం... పార్టీ లోని ఒక కుటుంబంతో కలిసి భోజనం, ఒక కార్యకర్తకు అండగా మొత్తం పార్టీ కుటుంబం!*❤️
*మాధం రజినీ కుమార్ యాదవ్ గారి అధ్యక్షతన, పల్లెబోయిన అశోక్ ముదిరాజ్ గారి పర్యవేక్షణలో ప్రతి శుక్రవారం రాత్రి @8 PM నిర్వహిస్తున్న TRP డిన్నర్ హోమ్ మీట్ కార్యక్రమం నిజంగా ఆదర్శప్రాయమైనది.*
*పార్టీలోని కార్యకర్తలు, నాయకులు ప్రతి వారం ఒక TRP కుటుంబం ఇంటికి వెళ్లి కలిసి భోజనం చేస్తూ, "మీ కుటుంబానికి మేమంతా అండగా ఉన్నాం" అనే భరోసాను కల్పిస్తున్నారు.*
*ఇది కేవలం భోజన కార్యక్రమం కాదు... కుటుంబాల మధ్య అనుబంధాన్ని పెంచే, కార్యకర్తలో ఆత్మవిశ్వాసాన్ని నింపే ఉద్యమం.*
*ఉమ్మడి వరంగల్ జిల్లాలోని ప్రతి TRP నాయకుడు, కార్యకర్త వెనుక ఇంత పెద్ద కుటుంబం అండగా ఉందనే ధైర్యంతో ముందుకు సాగుతున్నాడు.*
*ఇదే TRP కుటుంబం... ఇదే కార్యకర్తకు ఇచ్చే గౌరవం... ఇదే ఐక్యతకు నిదర్శనం! 🔥✊*
    user_NIMMANAGANTI ANIL BABU
    NIMMANAGANTI ANIL BABU
    Local News Reporter డోర్నకల్, మహబూబాబాద్, తెలంగాణ•
    4 hrs ago
  • కే సముద్రం కల్వల గ్రామ శివారు గాంధీ నగర్ లో విషాదం. బావిలో పడి మహిళా అనుమానాస్పద మృతి మహబూబాబాద్ జిల్లా: మహబూబాబాద్ జిల్లా కేసముద్రము మండలం కల్వల గ్రామ శివారు గాంధీనగర్ లో విషాదం . ఉదయాన్నే పత్తిచేను కలుపు తీసిన మహిళ బానోత్ వెన్నెల (22)బావిలో పడి అనుమానస్పద మృతి . కాలుజారి బావిలో పడింద లేదా ఎవరైనా కావాలనే హత్య చేశారా అనే కోణంలో విచారణ చేస్తున్న పోలిసులు ..... పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది....
    3
    కే సముద్రం కల్వల గ్రామ శివారు గాంధీ నగర్ లో విషాదం. బావిలో పడి మహిళా అనుమానాస్పద మృతి
మహబూబాబాద్ జిల్లా:
మహబూబాబాద్ జిల్లా కేసముద్రము మండలం  కల్వల గ్రామ శివారు గాంధీనగర్ లో విషాదం .
ఉదయాన్నే పత్తిచేను కలుపు తీసిన మహిళ బానోత్ వెన్నెల (22)బావిలో పడి అనుమానస్పద మృతి .
కాలుజారి బావిలో పడింద లేదా ఎవరైనా కావాలనే హత్య చేశారా అనే కోణంలో విచారణ చేస్తున్న పోలిసులు .....
పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది....
    user_Mogulagani Mahendar Mogulagani Mahendar
    Mogulagani Mahendar Mogulagani Mahendar
    మహబూబాబాద్, మహబూబాబాద్, తెలంగాణ•
    19 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.