పాఠశాలలకు దసరా సెలవులు ఖరారు - ఏపీ, తెలంగాణలో ఇలా..... అక్టోబర్ నెల ఏకంగా 13 రోజులు వరుస సెలవులు. తెలుగు రాష్ట్రాల్లో ప్రధానంగా భావించే దసరా సెలవుల పైన ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.సెలవుల క్యాలెండర్ ను ప్రకటించారు. 2026-27 విద్యా సంవత్సరానికి గాను అకడమిక్ క్యాలెండర్ ప్రకారం ఏపీతో పాటుగా తెలంగాణలోని పాఠశాలలకు అక్టోబర్ 10 నుంచి అక్టోబర్ 22 వరకు దసరా సెలువు వస్తున్నాయి. అక్టోబర్ 23న తిరిగి పాఠశాలలు తిరిగి ప్రారంభం కానున్నాయి. విద్యార్ధులకు దసరా సెలవుల పైన స్పష్టత వచ్చింది. తెలంగాణ ప్రభుత్వం అధికారికంగా సెలవుల తో పాటుగా పరీక్షల షెడ్యూల్ ను ప్రకటించింది. ఏపీలోనూ దసరా ఉత్సవాలు ఘనంగా జరుపుకుంటారు. దీంతో.. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ పాఠశాలలకు అక్టోబర్ 10 నుంచి అక్టోబర్ 22 వరకు దసరా సెలువు వస్తున్నాయి. ఈ ఏడాది దసరా అక్టోబర్ 20వ తేదీ మంగళవారం జరగనుంది. దసరా వేళ తెలుగు రాష్ట్రాల్లో నవరాత్రి వేడుకలు, తెలంగాణలో బతుకమ్మ సంబురాలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. పండగకు కుటుంబ సభ్యులతో కలిసి సొంత ఊర్లకు వెళ్లాలనుకునే విద్యార్థులు, ఉద్యోగులు ముందుగానే ప్రయాణ ప్లాన్ రెడీ చేసుకుంటున్నారు. ఈ సమయంలో సెలవుల పైన విద్యా శాఖ స్పష్టత ఇచ్చింది. అక్టోబర్ 9 చివరి పనిదినం ఉంటుంది. సెలవుల తర్వాత అక్టోబర్ 23న స్కూల్లు తిరిగి ప్రారంభం అవుతాయి. ప్రభుత్వ, ఎయిడెడ్, ప్రైవేట్ స్కూల్లకు అకడమిక్ క్యాలెండర్ ప్రకారం ఈ షెడ్యూల్ అమలు చేయాల్సి ఉంటుంది.ఏకంగా 13 రోజుల సెలవులు.

- సర్దార్ గౌతు లచ్చన్న ప్రధాన రహదారిపై వేంచేసి ఉన్న విగ్నేశ్వరుడు, సర్దార్ గౌతు లచ్చన్న ప్రధాన రహదారిపై వేంచేసి ఉన్న విగ్నేశ్వరుడుకి మహిళలు పూజా కార్యక్రమం చేసి పిల్లలచే ఆటపాటలు చేయించుచున్న కమిటీ వారికి ధన్యవాదాలు.2
- దేశ ప్రగతి కోసం నిరంతరం కృషి చేస్తున్న వ్యక్తి ప్రధాని నరేంద్ర మోదీ , ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జన్మదిన వేడుకలు భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జన్మదినాన్ని పురస్కరించుకుని తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ బొలిశెట్టి శ్రీనివాస్ క్యాంపు కార్యాలయంలో ఎన్‌డీఏ కూటమి నాయకులు, బిజెపి ఇన్చార్జ్, ఈతకోట తాతాజీ, నరిసే సోమేశ్వరరావు, కార్యకర్తలతో కలిసి జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నరేంద్ర మోదీకి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఆయనకు ఆయురారోగ్యాలు, సుఖసంతోషాలు కలగాలని ఆకాంక్షించారు. దేశ ప్రగతి కోసం నిరంతరం కృషి చేస్తున్న ప్రధాని నరేంద్ర మోదీ కి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ మాట్లాడుతూ నరేంద్ర మోడీ ప్రధాని అయిన నుంచి భారతదేశాన్ని అభివృద్ధి పథంలో నడిపిన ఏకైక వ్యక్తి నరేంద్ర మోది అన్నారు. అటువంటి వ్యక్తి బాగుండాలని భారతీయులందరూ బాగుంటారని పేర్కొన్నారు మన దేశాన్ని మతాన్ని గౌరవించాలని పేర్కొన్నారు వికసిప్ భారత్ సంకల్పంలో భాగంగా 2047వ సంవత్సరంలో ప్రతి కుటుంబంలో ఉద్యోగం ఉండాలని భారతీయులందరూ సంపన్నులు అవ్వాలని ఆలోచించి దేశం కోసం నిరంతరం శ్రమిస్తు ,కృషి చేస్తున్న వ్యక్తి ప్రధాని నరేంద్ర మోదీ అని ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ కొనియాడారు.2
- 22 అడుగుల ఎత్తు గల వినాయక విగ్రహం రేపల్లె ఆర్యవైశ్య యువత ఆధ్వర్యంలో ఏర్పడిన గణేష ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో రేపల్లె పట్టణంలోని కన్యకాపరమేశ్వరి అమ్మవారి గుడి ప్రాంగణంలో గత 22 సంవత్సరాలుగా గణేష్ ఉత్సవాలు అత్యంత వైభవంగా ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈనెల 14 నుండి ప్రారంభమైన గణేష్ మహోత్సవాలు 7 రోజులపాటు నిర్వహిస్తున్నట్లు ఆర్యవైశ్య యువత అధ్యక్షులు గణేష్ ఉత్సవ కమిటీ అధ్యక్షులు మాజీ కౌన్సిలర్ బొలిశెట్టి సత్యనారాయణ తెలిపారు. ఈ సందర్భంగా ప్రతిరోజు ఉదయం సాయంత్రం వేళల్లో ప్రత్యేక పూజా కార్యక్రమాలు లలిత సహస్రనామ పారాయణం సంపత్ గణపతి గానామృతం సౌందర్యలహరి పారాయణం పంచ హారతులు తీర్థప్రసాదాలు వినియోగము జరుగుతున్నాయని ఆయన తెలిపారు. ఈనెల 20వ తేదీ వరకు జరిగే ఈ కార్యక్రమాల్లో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రులు అవుతున్నారని, 20వ తేదీ అన్న ప్రసాద వితరణ స్వామి వారి లడ్డు వేలం పాట సాయంత్రం 4 గంటలకు వినాయక నిమర్జనం ఊరేగింపు కార్యక్రమం అంగరంగ వైభవంగా కేరళ వారిచే అందకాసురుడు, రోబోటిక్ ప్రోగ్రాం, సరస్వతీ నాదస్వర బృందం, పామరు వారిచే క్లాసికల్ సన్నాయి మేళం లతో గణేష్ నిమజ్జనాన్ని రేపల్లె పెనుమూడి కృష్ణ నది వద్ద నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు.2
- పెనుగొండలో వీఆర్ఏల కదంతొక్కిన ర్యాలీ డిమాండ్ల పరిష్కారానికి అంబేద్కర్ విగ్రహానికి వినతిపత్రం ఏపీ వీఆర్ఏ సంఘాల జాయింట్ యాక్షన్ కమిటీ (VRA JAC) పిలుపు మేరకు వీఆర్ఏలు రెండో రోజు గురువారం పెనుగొండలో ర్యాలీ నిర్వహించారు. నరసాపురం డివిజన్ వీఆర్ఏల సంఘం అధ్యక్షుడు తానేటి నాగరాజు ఆధ్వర్యంలో గాంధీ బొమ్మల సెంటర్ నుంచి గ్రామపంచాయతీ కార్యాలయం వద్దనున్న డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ విగ్రహం వరకు ర్యాలీ సాగింది. అనంతరం అంబేద్కర్ విగ్రహానికి వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా తానేటి నాగరాజు మాట్లాడుతూ గ్రామస్థాయిలో రెవెన్యూ వ్యవస్థకు వెన్నుదన్నుగా పనిచేస్తున్న వీఆర్ఏల సమస్యలపై ప్రభుత్వం తక్షణం స్పందించాలని కోరారు. ఏళ్ల తరబడి విధులు నిర్వహిస్తున్నా వేతనాలు, ఉద్యోగ భద్రత, పదోన్నతులకు సంబంధించిన సమస్యలు పరిష్కారం కాకపోవడంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని తెలిపారు.వీఆర్ఏలకు పేస్కేల్ అమలు చేయడంతో పాటు నామినీ వీఆర్ఏలను క్రమబద్ధీకరించాలని డిమాండ్ చేశారు. అర్హత కలిగిన వీఆర్ఏలకు వన్‌టైమ్ సెటిల్‌మెంట్ విధానంలో వీఆర్‌ఓలుగా పదోన్నతులు కల్పించాలని కోరారు. వీఆర్‌ఓ, అటెండర్, నైట్‌వాచ్‌మన్ పోస్టుల్లో వీఆర్ఏలకు ఉన్న పదోన్నతి కోటాను 20 శాతం నుంచి 70 శాతానికి పెంచాలని విజ్ఞప్తి చేశారు.ప్రభుత్వం తమ డిమాండ్లను సానుకూలంగా పరిశీలించి న్యాయం చేయాలని నాగరాజు కోరారు. ర్యాలీలో మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన 30 మందికి పైగా వీఆర్ఏలు, మహిళా ఉద్యోగులు పాల్గొన్నారు.1
- డౌన్.. డౌన్.. గొట్టిపాటి రవికుమార్ నారా లోకేష్ వస్తాడో.. చంద్రబాబు వస్తాడో.. రవికుమార్ వస్తాడో రండి.. వినాయక నిమజ్జనంలో డీజేకి పర్మిషన్ ఇవ్వలేదని టీడీపీ శ్రేణుల ఆందోళన అద్దంకి నియోజకవర్గం సంతమాగులూరు మండలం మక్కెనవారిపాలెంలో టీడీపీ ఆందోళన నిమజ్జనంలో డీజే పర్మిషన్ ఇవ్వలేదని తిరగబడిన సొంత పార్టీ నేతలు1
- *మత్తు పదార్థాలు, సైబర్ క్రైమ్స్‌పై విద్యార్థులకు అవగాహన* అంబేద్కర్ కోనసీమ జిల్లా అంబాజీపేట మండలం ముక్కామల జిల్లా పరిషత్ హైస్కూల్‌లో విద్యార్థినీ విద్యార్థులకు మత్తు పదార్థాలు, గంజాయి, సైబర్ క్రైమ్స్‌పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఏరియా ఆసుపత్రి అమలాపురం డి-అడిక్షన్ సెంటర్ సిబ్బంది, పోలీస్ ఈగల్ విభాగం ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో ఇంటర్నెట్ మార్కెటింగ్, ఫేక్ యాప్స్, ఓటీపీ మోసాలు, గుడ్ టచ్–బ్యాడ్ టచ్, మాదకద్రవ్యాల దుష్ప్రభావాలు, NDPS చట్టం, ఆపరేషన్ గరుడ వంటి అంశాలపై అవగాహన కల్పించారు. అలాగే డి-అడిక్షన్ సెంటర్ అందించే చికిత్స, కౌన్సెలింగ్ మరియు ఇతర సేవల గురించి వివరించారు. కార్యక్రమంలో సెంటర్ కోఆర్డినేటర్ శ్రీనుబాబు, పీర్ ఎడ్యుకేటర్ లలిత, పోలీస్ ఈగల్ విభాగం సిబ్బంది రఘు , సత్య, పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, విద్యార్థినీ విద్యార్థులు పాల్గొన్నారు.1
- మాజీ మంత్రి, వైసీపీ నేత కారుమూరి నాగేశ్వరరావును ఏసీబీ కోర్టుకు తీసుకువచ్చిన సిట్ అధికారులు మాజీ మంత్రి, వైసీపీ నేత కారుమూరి నాగేశ్వరరావును సిట్ అధికారులు విజయవాడ ఏసీబీ కోర్టుకు తీసుకోచ్చారు. మద్యం రవాణా టెండర్లలో అక్రమాల కేసు'లో నిందితుడిగా ఉన్న కారుమూరి నాగేశ్వరరావు.పీటీ వారెంట్‌పై కారుమూరి నాగేశ్వరరావును చంచల్‌గూడ జైలు నుంచి విజయవాడకు తరలింపు.మద్యం రవాణా టెండర్లలో అక్రమాల కేసులో ఇప్పటికే కారుమూరి నాగేశ్వరరావును అరెస్టు చేసిన ఈడీ అధికారులు.1
- జమ్వాసు గ్రామంలో బొలెరోతో గుద్ది వృద్ధురాలి ప్రాణం తీసిన భూ వివాదం భూ వివాదం నేపథ్యంలో బొలెరోతో గుద్ది వృద్ధురాలి ప్రాణం తీసిన సంఘటన మహారాష్ట్రలోని జమ్వాసు గ్రామంలో జరిగింది. భూ వివాదం ఓ వృద్దురాలి ప్రాణం తీసింది. ప్రత్యర్థులు ముసలావిడ ఉంటున్న ఇంటిని బొలెరో వాహనంతో 4-5 సార్లు గుద్దారు. దీంతో 75 ఏళ్ల సోనాబాయి మఖారం జాదవ్ స్పాట్‌లోనే చనిపోయింది. మరో ముగ్గురికి తీవ్ర గాయాలు అయ్యాయి. వృద్ధురాలు ఇళ్లు పూర్తిగా ధ్వంసమైంది. ముగ్గురు అనుమానితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వాహనాన్ని సీజ్ చేసి దర్యాప్తు చేస్తున్నారు.1