చైత్ర పౌర్ణమి వేల సలేశ్వరంలో జన మేళ సలేశ్వరంలో చైత్ర పున్నమి వేళ లో భక్తుల జాతర సలేశ్వరం లింగమయ్య ఆలయం లో తర తరాలుగా చెంచులే పూజారులు అచ్చంపేట, ఏప్రిల్ 12:నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట నియోజకవర్గం లింగాల మండలం అప్పాపూర్ పెంట గ్రామ సమీపంలో దట్టమైన లోతైన అడవి ప్రాంతంలో స్వయంభువు గా కొలువై ఉన్న శ్రీ సలేశ్వరం లింగమయ్య స్వామి దర్శనానికి జాతర కు భక్తులు పోటెత్తారు. ప్రతి సంవత్సరం వేసవికాలంలో ఉగాది తర్వాత వచ్చే పౌర్ణమి రోజు సలేశ్వరంలింగమయ్య స్వామిని దర్శించుకునిభక్తులుతరించిపరవశించిపోతారు.ఈ ఆలయంలో చెంచులే పూజారులుగా కొనసాగుతున్న సలేశ్వరం లింగమయ్య దేవాలయం ఇక్కడ చెంచులే పూజారులుగా నిర్వహిస్తున్న ఆనవాయితీ తరతరాలుగా వస్తుందిఅమ్రాబాద్ మండలం మన్ననూరు గ్రామం నుండి పరహాబాద్ చౌరస్తా వరకు శ్రీశైలం రోడ్డులో వెళ్లి అక్కడి నుండి 16 కిలోమీటర్ నంబర్ రాయి దగ్గర ఫారెస్ట్ అధికారుల చెక్‌పోస్ట్ దాటి మట్టి రోడ్డులో ప్రయాణంచేయవలసిఉంటుంది.అటవీ అధికారుల ఆంక్షల మేరకు రెండు చోట్ల చెక్‌పోస్టులు పెట్టి పరహాబాద్ చౌరస్తా నుండి రాంపూర్ పెంట వరకు వాహనాలను అనుమతిస్తారు. ఆ తర్వాతకాలినడకన లోతైన కొండలు లోయలు గుట్టలు రాళ్లను దాటుకొని అత్యంతసాహసోపేతంగాఈయాత్రనుకొనసాగించవలసి ఉంటుంది చిన్న పెద్ద తేడా లేకుండా అందరూవస్తున్నాం లింగమయ్య స్మరణ ఘోష చేసుకుంటూ ఆ శివయ్య పై భారం వేసి కాలినడకను ప్రారంభిస్తారు మోకాళ్ళ కురువ అనే ప్రదేశం వద్ద ఏమాత్రంఏమరపాటుగా ఉన్నప్రాణాల మీదికివచ్చేఅవకాశం ఉంటుందికాలు జారితేలోయలోపడే అవకాశం కూడా ఉంటుంది.ధైర్యం తో ఇవన్నీటిని దాటుకొనిసలేశ్వరం లింగమయ్యను దర్శించుకుని మొక్కులుచెల్లించుకొనిభక్తులుఆనందంతోపరవశించిపోతారు. ఈ జాతరను దర్శించుకోవడానికి ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాల నుండే కాక పలు జిల్లాల నుండి కూడా భక్తులు అధికంగా వచ్చి దర్శనం చేసుకుంటారు. సలేశ్వరం లింగమయ్య క్షేత్రాన్ని చేరుకోవడానికి జిల్లాలోని పలు డిపోల నుండి కూడా ఆర్టీసీ యాజమాన్యం ప్రత్యేక బస్సులను వేసి భక్తులను అక్కడికి చేరుస్తున్నారు. భారీగా వాహనాలు ఇక్కట్లలో అధికారులు: పరహాబాద్ నుండి రాంపూర్ పెంట వరకు వాహనాలు భారీగా రావడంతో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది అధికారులుపోలీసులువాహనదారులతోకలిసిసమన్వయంతో ట్రాఫిక్ జామ్ ను సరి చేశారు. పౌర్ణమి రోజు రాత్రి వేళలో స్వామి వారి గుండం లో స్నాన మాచరించి మొక్కులను చెల్లించి లింగమయ్య దర్శనం చేసు కుంటేభక్తుల కష్టాలు ఉండవని భక్తులనమ్మకం అధికారుల పర్యవేక్షణలో. జిల్లా యంత్రాంగం పోలీస్& ఆరోగ్య, అటవీశాఖ, అధికారులందరి సమన్వయం తో గట్టిభద్రతాఏర్పాట్లను ఏర్పాటు చేశారు. నిరంతరం భక్తులవాహనాలనుభక్తులనుపర్యవేక్షించారు రాంపూర్ పెంట శనేశ్వర క్షేత్రం వరకు గట్టి పోలీస్,బందోబస్తునుఏర్పాటుచేసినట్లు డీఎస్పీ, శ్రీనివాస్ తెలిపారు ప్రస్తుతం 5 మంది సీఐలు 22 మంది ఎస్సైలు 375 మంది పోలీస్, హోంగార్డులుబందోబస్తు పర్యవేక్షణలో ఉన్నట్లు ఆయన తెలిపారు అటవీ అధికారి డి ఎఫ్ ఓ రోహిత్ రెడ్డి గోపిడి ఆధ్వర్యంలో 130 మందిచెంచువాలంటీర్లు అటవీ శాఖ సిబ్బంది విధులు నిర్వన్నట్లుతెలిపారు. సలేశ్వరం వచ్చే భక్తులకు ప్లాస్టిక్ నిషేధం గురించి భద్రతల గురించి సూచనలుతెలిపారు. సలేశ్వరానికి 32 ప్రత్యేకమైన బస్సులు సలేశ్వరం జాతర మొదటి రోజు శుక్రవారం నుండి అచ్చంపేట డిపో నుండి 32 ట్రిప్పులు నాగర్ కర్నూల్ నుండి 15 ట్రిప్పులు ప్రయాణికులతో పు ల్లాయపల్లి పెంట వరకు బస్సులలో చేరవేశారు అక్కడి నుండి లోకల్ ఆటోల ద్వారా మోకాళ్ళ కురువ వరకుప్రయాణికులను చేరవేశారు. భక్తులకు నిత్య అన్న ప్రసాదం, నీటి వసతి ప్రతి సంవత్సరం సలేశ్వరం వచ్చే వేలాది భక్తులకు మోకాళ్ళ కురువ వద్ద స్వచ్ఛంద సంస్థలు నాగర్ కర్నూల్ కు చెందిన భక్తులు గత 25 సంవత్సరాల నుండి ఉదయం పూట అల్పాహారం మంచినీరుమధ్యాహ్నంవేలభోజనము మజ్జిగ రాత్రి వేళ అల్పాహారము భోజనముఏర్పాటు చేశారు.పర్యావరణ హితమైన పేపర్ ప్లేట్లు పేపర్ గ్లాసులువాడుతున్నట్లు తెలిపారు. వాసవి సేవా సమితి వారు సలేశ్వరంలింగమయ్య వద్ద నిత్య అన్న ప్రసాదం ప్రతి సంవత్సరంఏర్పా టు చేస్తారు. సలేశ్వరం స్వామి వారి సన్నిధి లో జన జాతర. సుమారు60వేల నుండి లక్ష మంది వరకు పౌర్ణమి రోజు సలేశ్వరం లింగమయ్యదర్శనానికి వస్తారని అధికారులు వెల్లడించారు స్థల చరిత్ర : సలేశ్వరం యాత్ర (జాతర) ను సాహసో పేతమైన మరో తెలంగాణ అమర్నాథ్ యాత్రగా అభి వర్ణిస్తారుప్రసిద్ధిగాంచిన శ్రీ సలేశ్వరం లింగమయ్య జాతర చరిత్ర ప్రకారం క్రీస్తు శకం ఆరవ శతాబ్దానికి చెందిన పురాతన శ్రీ రామలింగేశ్వర స్వామి దేవాలయం మొదటగాప్రాచుర్యంలో ఉండేది కాలక్రమంగాశైలేశ్వర తీర్థంగా తర్వాత సర్వేశ్వర తీర్థంగా తర్వాతనేటిఉచ్చరణలో సలేశ్వరం తీర్థంగా మారింది చత్రపతి శివాజీ సలేశ్వర క్షేత్రంలో ఈ శివలింగాన్ని పునఃప్రతిష్టించినట్లు చరిత్రలు చెబుతున్నాయి. శ్రీశైలంలో ఉన్నటువంటి జ్యోతిర్లింగం& సలేశ్వర శివలింగం ఒకే మాదిరిగా ఉండటం ఒక విశేషం .ఇక్కడ దాదాపుగా 1000 అడుగుల నుండి నీరు ధారగా పడి ప్రకృతిరమణయానికి అద్దం పట్టేలా ఉంటుందినాలుగున్నర అడుగుల ముందు చతుర్ముఖ వీరభద్రస్వామివెలసి ఉన్నట్లు చరిత్ర చెబుతుంది చైత్ర పున్నమి వేల ఈ శివలింగాన్నిదర్శించుకున్న వారి కోరికలునెరవేరుతాయని భక్తుల ప్రగాఢ నమ్మకం.
చైత్ర పౌర్ణమి వేల సలేశ్వరంలో జన మేళ సలేశ్వరంలో చైత్ర పున్నమి వేళ లో భక్తుల జాతర సలేశ్వరం లింగమయ్య ఆలయం లో తర తరాలుగా చెంచులే పూజారులు అచ్చంపేట, ఏప్రిల్ 12:నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట నియోజకవర్గం లింగాల మండలం అప్పాపూర్ పెంట గ్రామ సమీపంలో దట్టమైన లోతైన అడవి ప్రాంతంలో స్వయంభువు గా కొలువై ఉన్న శ్రీ సలేశ్వరం లింగమయ్య స్వామి దర్శనానికి జాతర కు భక్తులు పోటెత్తారు. ప్రతి సంవత్సరం వేసవికాలంలో ఉగాది తర్వాత వచ్చే పౌర్ణమి రోజు సలేశ్వరంలింగమయ్య స్వామిని దర్శించుకునిభక్తులుతరించిపరవశించిపోతారు.ఈ ఆలయంలో చెంచులే పూజారులుగా కొనసాగుతున్న సలేశ్వరం లింగమయ్య దేవాలయం ఇక్కడ చెంచులే పూజారులుగా నిర్వహిస్తున్న ఆనవాయితీ తరతరాలుగా వస్తుందిఅమ్రాబాద్ మండలం మన్ననూరు గ్రామం నుండి పరహాబాద్ చౌరస్తా వరకు శ్రీశైలం రోడ్డులో వెళ్లి అక్కడి నుండి 16 కిలోమీటర్ నంబర్ రాయి దగ్గర ఫారెస్ట్ అధికారుల చెక్‌పోస్ట్ దాటి మట్టి రోడ్డులో ప్రయాణంచేయవలసిఉంటుంది.అటవీ అధికారుల ఆంక్షల మేరకు రెండు చోట్ల చెక్‌పోస్టులు పెట్టి పరహాబాద్ చౌరస్తా నుండి రాంపూర్ పెంట వరకు వాహనాలను అనుమతిస్తారు. ఆ తర్వాతకాలినడకన లోతైన కొండలు లోయలు గుట్టలు రాళ్లను దాటుకొని అత్యంతసాహసోపేతంగాఈయాత్రనుకొనసాగించవలసి ఉంటుంది చిన్న పెద్ద తేడా లేకుండా అందరూవస్తున్నాం లింగమయ్య స్మరణ ఘోష చేసుకుంటూ ఆ శివయ్య పై భారం వేసి కాలినడకను ప్రారంభిస్తారు మోకాళ్ళ కురువ అనే ప్రదేశం వద్ద ఏమాత్రంఏమరపాటుగా ఉన్నప్రాణాల మీదికివచ్చేఅవకాశం ఉంటుందికాలు జారితేలోయలోపడే అవకాశం కూడా ఉంటుంది.ధైర్యం తో ఇవన్నీటిని దాటుకొనిసలేశ్వరం లింగమయ్యను దర్శించుకుని మొక్కులుచెల్లించుకొనిభక్తులుఆనందంతోపరవశించిపోతారు. ఈ జాతరను దర్శించుకోవడానికి ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాల నుండే కాక పలు జిల్లాల నుండి కూడా భక్తులు అధికంగా వచ్చి దర్శనం చేసుకుంటారు. సలేశ్వరం లింగమయ్య క్షేత్రాన్ని చేరుకోవడానికి జిల్లాలోని పలు డిపోల నుండి కూడా ఆర్టీసీ యాజమాన్యం ప్రత్యేక బస్సులను వేసి భక్తులను అక్కడికి చేరుస్తున్నారు. భారీగా వాహనాలు ఇక్కట్లలో అధికారులు: పరహాబాద్ నుండి రాంపూర్ పెంట వరకు వాహనాలు భారీగా రావడంతో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది అధికారులుపోలీసులువాహనదారులతోకలిసిసమన్వయంతో ట్రాఫిక్ జామ్ ను సరి చేశారు. పౌర్ణమి రోజు రాత్రి వేళలో స్వామి వారి గుండం లో స్నాన మాచరించి మొక్కులను చెల్లించి లింగమయ్య దర్శనం చేసు కుంటేభక్తుల కష్టాలు ఉండవని భక్తులనమ్మకం అధికారుల పర్యవేక్షణలో. జిల్లా యంత్రాంగం పోలీస్& ఆరోగ్య, అటవీశాఖ, అధికారులందరి సమన్వయం తో గట్టిభద్రతాఏర్పాట్లను ఏర్పాటు చేశారు. నిరంతరం భక్తులవాహనాలనుభక్తులనుపర్యవేక్షించారు రాంపూర్ పెంట
శనేశ్వర క్షేత్రం వరకు గట్టి పోలీస్,బందోబస్తునుఏర్పాటుచేసినట్లు డీఎస్పీ, శ్రీనివాస్ తెలిపారు ప్రస్తుతం 5 మంది సీఐలు 22 మంది ఎస్సైలు 375 మంది పోలీస్, హోంగార్డులుబందోబస్తు పర్యవేక్షణలో ఉన్నట్లు ఆయన తెలిపారు అటవీ అధికారి డి ఎఫ్ ఓ రోహిత్ రెడ్డి గోపిడి ఆధ్వర్యంలో 130 మందిచెంచువాలంటీర్లు అటవీ శాఖ సిబ్బంది విధులు నిర్వన్నట్లుతెలిపారు. సలేశ్వరం వచ్చే భక్తులకు ప్లాస్టిక్ నిషేధం గురించి భద్రతల గురించి సూచనలుతెలిపారు. సలేశ్వరానికి 32 ప్రత్యేకమైన బస్సులు సలేశ్వరం జాతర మొదటి రోజు శుక్రవారం నుండి అచ్చంపేట డిపో నుండి 32 ట్రిప్పులు నాగర్ కర్నూల్ నుండి 15 ట్రిప్పులు ప్రయాణికులతో పు ల్లాయపల్లి పెంట వరకు బస్సులలో చేరవేశారు అక్కడి నుండి లోకల్ ఆటోల ద్వారా మోకాళ్ళ కురువ వరకుప్రయాణికులను చేరవేశారు. భక్తులకు నిత్య అన్న ప్రసాదం, నీటి వసతి ప్రతి సంవత్సరం సలేశ్వరం వచ్చే వేలాది భక్తులకు మోకాళ్ళ కురువ వద్ద స్వచ్ఛంద సంస్థలు నాగర్ కర్నూల్ కు చెందిన భక్తులు గత 25 సంవత్సరాల నుండి ఉదయం పూట అల్పాహారం మంచినీరుమధ్యాహ్నంవేలభోజనము మజ్జిగ రాత్రి వేళ అల్పాహారము భోజనముఏర్పాటు చేశారు.పర్యావరణ హితమైన పేపర్ ప్లేట్లు పేపర్ గ్లాసులువాడుతున్నట్లు తెలిపారు. వాసవి సేవా సమితి వారు సలేశ్వరంలింగమయ్య వద్ద నిత్య అన్న ప్రసాదం ప్రతి సంవత్సరంఏర్పా టు చేస్తారు. సలేశ్వరం స్వామి వారి సన్నిధి లో జన జాతర. సుమారు60వేల నుండి లక్ష మంది వరకు పౌర్ణమి రోజు సలేశ్వరం లింగమయ్యదర్శనానికి వస్తారని అధికారులు వెల్లడించారు స్థల చరిత్ర : సలేశ్వరం యాత్ర (జాతర) ను సాహసో పేతమైన మరో తెలంగాణ అమర్నాథ్ యాత్రగా అభి వర్ణిస్తారుప్రసిద్ధిగాంచిన శ్రీ సలేశ్వరం లింగమయ్య జాతర చరిత్ర ప్రకారం క్రీస్తు శకం ఆరవ శతాబ్దానికి చెందిన పురాతన శ్రీ రామలింగేశ్వర స్వామి దేవాలయం మొదటగాప్రాచుర్యంలో ఉండేది కాలక్రమంగాశైలేశ్వర తీర్థంగా తర్వాత సర్వేశ్వర తీర్థంగా తర్వాతనేటిఉచ్చరణలో సలేశ్వరం తీర్థంగా మారింది చత్రపతి శివాజీ సలేశ్వర క్షేత్రంలో ఈ శివలింగాన్ని పునఃప్రతిష్టించినట్లు చరిత్రలు చెబుతున్నాయి. శ్రీశైలంలో ఉన్నటువంటి జ్యోతిర్లింగం& సలేశ్వర శివలింగం ఒకే మాదిరిగా ఉండటం ఒక విశేషం .ఇక్కడ దాదాపుగా 1000 అడుగుల నుండి నీరు ధారగా పడి ప్రకృతిరమణయానికి అద్దం పట్టేలా ఉంటుందినాలుగున్నర అడుగుల ముందు చతుర్ముఖ వీరభద్రస్వామివెలసి ఉన్నట్లు చరిత్ర చెబుతుంది చైత్ర పున్నమి వేల ఈ శివలింగాన్నిదర్శించుకున్న వారి కోరికలునెరవేరుతాయని భక్తుల ప్రగాఢ నమ్మకం.