logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

రాష్ట్రంలో సంతానోత్ప‌త్తి క్షీణ‌త‌తో త్వ‌ర‌లో విస్పోట‌నం కానున్న కొత్త 'టైం బాంబు' త‌గు చ‌ర్య‌లు తీసుకోకుంటే తీవ్ర‌మైన అన‌ర్ధాలన్న ఆరోగ్య శాఖా మంత్రి శ్రీ స‌త్య‌కుమార్ యాద‌వ్‌ జ‌నాభా స్థిరీక‌ర‌ణ కోసం కొత్త విధానాన్ని రూపొందించిన రాష్ట్ర ప్ర‌భుత్వం ముఖ్య‌మంత్రి ఆదేశంతో విస్తృత చ‌ర్చ కోసం ప్ర‌జ‌ల ముందుకు జ‌నాభా స్ధిరీక‌ర‌ణ విధాన ప‌త్రం రాష్ట్రంలో సంతానోత్ప‌త్తి రేటు కేవ‌లం 1.50 2.10 రేటుతో 2035 నాటికి జ‌నాభా స్థిరీక‌ర‌ణ ల‌క్ష్యం అన్న మంత్రి *సంతాన హీన‌త‌తో భారీగా త‌గ్గ‌నున్న ప్ర‌గ‌తి కార‌క శ్రామిక శ‌క్తి-రెండింత‌లు కానున్న వృద్ధుల సంఖ్య‌* *అనుకూల ప‌రిస్థితుల క‌ల్ప‌న‌తో స్వ‌చ్ఛందంగా అధిక మంది పిల్ల‌లు క‌నే దిశ‌గా బాట‌లు* *నూత‌న విధానం రూపురేఖ‌ల‌ను వివ‌రించిన మంత్రి* ఆందోళ‌నక‌ర రీతిలో రాష్ట్రంలో సంతానోత్ప‌త్తి రేటు క్షీణించ‌డంతో కొత్త ర‌కం పాపులేష‌న్ 'టైం బాంబు' విస్పోట‌నం జ‌రిగి అన‌ర్ధ‌క‌ర‌మైన ప‌రిణామాలేర్ప‌డే అవ‌కాశంపై రాష్ట్ర ప్ర‌జ‌ల్ని వైద్యారోగ్య శాఖా మంత్రి శ్రీ స‌త్య‌కుమార్ యాద‌వ్ హెచ్చ‌రించారు. సోమ‌వారంనాడు విడుద‌ల చేసిన ఒక వివ‌ర‌ణాత్మ‌క ప్ర‌క‌ట‌నలో రాష్ట్రంలో సంతానోత్ప‌త్తి రేటు (జీవిత‌కాలంలో మ‌హిళ‌లు జ‌న్మనిచ్చే పిల్ల‌ల సంఖ్య‌) క్ర‌మేణా అతి త‌క్కువ‌గా 1.50కు ప‌డిపోవ‌డం, దాని ప‌రిణామాల‌పై మంత్రి తీవ్ర ఆందోళ‌న‌ను వెలిబుచ్చారు. ఈ స‌మ‌స్య‌ను స‌మిష్టిగా ఎదుర్కోడానికి ప్ర‌జ‌లు, మీడియా, ఇత‌ర భాగ‌స్వాములు ఒక ప్ర‌జా ఉద్య‌మాన్ని నిర్మించడానికి న‌డుం బిగించాల‌ని ఆయ‌న పిలుపునిచ్చారు. జ‌నాభా స్థిరీక‌ర‌ణ‌కు సంతానోత్ప‌త్తి రేటు 2.10 అవ‌స‌రం కాగా...ప‌లు ద‌శాబ్దాలుగా అనుస‌రించ‌బ‌డిన జ‌నాభా నియంత్ర‌ణ విధానంతో ఈ రేటు నేటికి 1.50 శాతానికి ప‌డిపోయింద‌ని, ఇక‌నైనా దిద్దుబాటు చ‌ర్య‌ల్ని చేప‌ట్ట‌కుంటే ప్ర‌జ‌లు మ‌రియు రాష్ట్ర ఆర్థిక ప్ర‌గ‌తికి తీవ్ర విఘాతం ఏర్ప‌డ‌నుంద‌ని మంత్రి హెచ్చ‌రించారు. తీరు మార‌కుంటే అధిక యువశ‌క్తితో కూడిన జ‌నాభాతో ల‌భించే ప్ర‌యోజ‌నం (పాపులేష‌న్ డివిడెండ్‌) 2040 నాటికి క‌నుమ‌రుగై అధిక శాతం వృద్ధుల‌తో కూడిన జ‌నాభా భారంగా (పాపులేష‌న్ డెట్‌) మార‌నుంద‌ని మంత్రి స్ప‌ష్టం చేశారు. సంతానోత్ప‌త్తి క్షీణ‌త‌తో ఆర్థిక ప్ర‌గ‌తికి ఊత‌మిచ్చే కార్మిక శ‌క్తి (వ‌ర్క్‌ఫోర్స్‌) త‌గ్గిపోయి భారీగా పెర‌గ‌నున్న వ‌యో వృద్ధుల భారాన్ని మోయాల్సి ఉంటుంద‌ని మంత్రి వెల్ల‌డించారు. ఈ నేప‌థ్యంలో...2035 నాటికి రాష్ట్రంలో జ‌నాభా స్థిరీక‌ర‌ణ ల‌క్ష్యంగా రాష్ట్ర ప్ర‌భుత్వం ఒక నూత‌న ప్ర‌ణాళిక‌ను (ఫ్రేంవ‌ర్క్‌) రూపొందించింద‌ని...ప్ర‌భుత్వం నిర్దేశించిన కుటుంబ నియంత్ర‌ణ ల‌క్ష్యాల సాధ‌నంగా అమ‌లైన జ‌నాభా నియంత్ర‌ణ విధానానికి స్వ‌స్తి ప‌లికి, జనాభా సంర‌క్ష‌ణ‌తో కూడిన సానుకూల వాతావ‌ర‌ణంలో ఇద్ద‌రు కంటే ఎక్కువ మంది పిల్ల‌ల్ని క‌నేలా కుటుంబాలు స్వ‌చ్ఛంద నిర్ణ‌యాలు తీసుకునే అనుకూల ప‌రిస్థితుల్ని క‌ల్పించ‌డం ఈ నూత‌న విధానం ల‌క్ష్య‌మ‌ని మంత్రి శ్రీ స‌త్య‌కుమార్ యాద‌వ్ త‌న ప్ర‌క‌ట‌న‌లో వివ‌రించారు. త‌ల్లికి పూర్తి ఆరోగ్య భ‌ద్ర‌త క‌ల్పించి ఆరోగ్య‌క‌ర‌మైన శిశువుల‌కు జ‌న్మ‌నివ్వ‌డం, వారి పోష‌ణ మ‌రియు పెంపు, పూర్తి ఆరోగ్యంతో కూడిన స‌మ‌ర్ధులైన కౌమార మ‌రియు యువ‌శక్తి కి దారులు వేయ‌డం,సాంఘిక భ‌ద్ర‌త‌తో కూడిన, గౌర‌వ ప్ర‌ద‌మైన మ‌రియు ఉత్పాద‌క అవ‌కాశాల‌తో కూడిన వార్ధ‌క్య జీవితానికి గ‌ట్టి పునాదులు వేయ‌డం ఈ నూత‌న ప్ర‌ణాళిక ల‌క్ష్య‌మ‌ని మంత్రి విపులీక‌రించారు. *నేటి ఆందోళ‌నక‌ర ప‌రిస్థితి* ఇప్ప‌టి వ‌ర‌కు అమ‌లు చేసిన జ‌నాభా నియంత్రణ విధానంతో రాష్ట్రంలో జ‌నాభా వృద్ధి రేటు 2011-15 కాలంలో ఉన్న 7.10 శాతం నుండి నేటికి 1.70 శాతానికి త‌గ్గింద‌ని, ఇదే మార్గంలో 2035 నాటికి మ‌రింతగా త‌గ్గి 0.30 శాతానికి ప‌డిపోతుంద‌ని మంత్రి శ్రీ స‌త్య‌కుమార్ యాద‌వ్ ఆందోళ‌న వెలిబుచ్చారు. ఈ ప‌రిణామానికి స‌మాంత‌రంగా సంతానోత్ప‌త్తి రేటు 1.68 నుండి 1.50కు ప‌డిపోయి స‌వ‌ర‌ణ చ‌ర్య‌లు చేప‌ట్ట‌కుంటే ఇంకా క్షీణించే అవ‌కాశ‌ముంద‌ని మంత్రి స్ప‌ష్టం చేశారు. ఈ ప‌రిణామాల ప‌ర్య‌వ‌సానాల‌ను వివ‌రిస్తూ...ప్ర‌స్తుత రాష్ట్ర జ‌నాభా మ‌ధ్య‌స్త వ‌య‌సు(మీడియ‌న్ ఏజ్‌) 32.50 సంవ‌త్స‌రాలుండ‌గా...దేశ స్థాయిలో ఇది నాలుగున్న‌రేళ్ల త‌క్కువ‌గా కేవ‌లం 28 సంవ‌త్స‌రాలు మాత్ర‌మే ఉంద‌ని...ప్ర‌స్తుత తీరు కొన‌సాగిస్తే ఈ వ్య‌త్యాసం ఇంకా పెరుగుతుంద‌ని, రాష్ట్రంలో వ‌య‌సు మ‌ళ్లే వారి సంఖ్య భారీగా ఇనుమ‌డించే అవ‌కాశ‌ముంద‌ని మంత్రి ఆందోళ‌న వ్య‌క్తం చేశారు. మీడియ‌న్ ఏజ్ నిర్వ‌చ‌నం ప్ర‌కారం రాష్ట్రంలో స‌గం జ‌నాభా 32.50 సంవ‌త్స‌రాల లోపు వ‌య‌సులో ఉండ‌గా...దేశంలో సగం జ‌నాభా 28 ఏళ్ల లోపు వ‌య‌సులో ఉన్నార‌ని, దీంతో రాష్ట్రంలో సంతానోత్ప‌త్తి క్షీణ‌త ప‌రిణామం వెల్ల‌డ‌వుతోంద‌ని మంత్రి వ్యాఖ్యానించారు. దేశ జ‌నాభా కంటే వేగంగా రాష్ట్ర జ‌నాభా వార్ధ‌క్యం వైపు వెళుతోంద‌ని ఈ సంఖ్య‌లు స్ప‌ష్టం చేస్తున్నాయ‌ని, దీన్ని అడ్డుకోవాల్సిన అవ‌స‌రం ఉంద‌ని మంత్రి అన్నారు. సంతానోత్ప‌త్తి క్షీణ‌త కారణంగా రాష్ట్రంలో 14 ఏళ్ల లోపు జ‌నాభా 2011లో మొత్తం జ‌నాభాలో 25 శాతం ఉండ‌గా ఇది 2036 నాటికి 15 శాతానికి త‌గ్గ‌నుంద‌ని, దీనికి సమాంత‌రంగా 60 ఏళ్లు దాటిన వారి జ‌నాభా 10 శాతం నుండి దాదాపు రెట్టింపై 2036 నాటికి 19 శాతానికి, 2047 నాటికి 23 శాతానికి పెరిగి స్వ‌ర్ణాంధ్ర సాధ‌న ల‌క్ష్యానికి తీవ్ర విఘాత‌మేర్ప‌డనుంద‌ని మంత్రి ఆందోళ‌న వెలిబుచ్చారు. *ఈ నేప‌థ్యంలో...స్వ‌ర్ణాంధ్ర ల‌క్ష్య సాధ‌న‌కు రానున్న 10 సంవ‌త్స‌రాలు అత్యంత కీల‌క‌మ‌ని, 2035 నాటికి 2.10 సంతానోత్ప‌త్తి రేటును సాధించి జనాభా స్థిరీక‌ర‌ణ‌కు బాటులు వేయాల్సిన అవ‌స‌ర‌ముంద‌ని మంత్రి స్ప‌ష్టం చేశారు*. *మ‌హిళా సాధికారత అత్యంత కీల‌కం* జ‌నాభా స్థిరీక‌ర‌ణ సాధ‌న‌కు మ‌హిళల సాధికార‌త అత్యంత కీల‌క‌మ‌ని, ఈ దిశ‌గా నూత‌న ప్ర‌ణాళిక రూపొందించ‌బ‌డింద‌ని మంత్రి శ్రీ స‌త్య‌కుమార్ యాద‌వ్ స్ప‌ష్టం చేశారు. మాతృత్వ మ‌రియు న‌వ‌జాత శిశువుల ఆరోగ్య భ‌ద్ర‌త‌, కౌమారుల ఆరోగ్య ర‌క్ష‌ణ, నైపుణ్య సామ‌ర్ధ్యాల పెంపు, గౌర‌వ‌ప్ర‌ద‌మైన వృద్ధాప్య ద‌శ‌ల వ‌ర‌కు మ‌హిళ‌ల‌కు పూర్తిగా అండ‌గా ఉండే విధంగా నూత‌న ప్ర‌ణాళిక అమ‌లు చేయబ‌డుతుంద‌ని మంత్రి తెలిపారు. లింగ వివ‌క్ష‌ను, వివిధ రూపాల్లో మ‌హిళా సాధిర‌కార‌త‌కు ఎదుర‌య్యే అవ‌రోధాల‌ను పూర్తిగా తొల‌గిస్తూ రానున్న ప‌దేళ్ల‌లో ఆర్థిక ప్ర‌గ‌తికి దోహ‌ద‌ప‌డే శ్రామిక శ‌క్తిలో మ‌హిళ‌ల భాగ‌స్వామ్యాన్ని 25 శాతానికి పైగా అద‌నంగా పెంచి 60 శాతానికి చేర్చ‌డం నూత‌న విధానం ప్ర‌ధాన ల‌క్ష్య‌మ‌ని, దీనిద్వారా రాష్ట్ర స్థూల ఆర్థిక సంప‌ద (జియ‌స్‌డిపి)లో 15 శాతం పెంపుద‌ల సాధిస్తామ‌ని మంత్రి వివ‌రించారు. మ‌హిళా వ్య‌తిరేక సాంఘిక నియ‌మాల నిర్మూల‌న, పిల్ల‌ల పెంప‌కంలో పురుషుల భాగ‌స్వామ్యం, మ‌హిళ‌ల ఆర్థిక స్వావ‌లంబ‌న దిశ‌గా ఉద్యోగాలు చేసేందుకు అనువైన వాతావ‌ర‌ణాన్ని క‌ల్పించ‌డం, స‌డ‌లింపుల‌తో కూడిన ప‌ని స‌మ‌యాలు, నైపుణ్య పెంపుద‌ల ద్వారా మ‌హిళ‌ల సాధికార‌త‌కు నూత‌న ప్ర‌ణాళిక వీలు క‌ల్పిస్తుంద‌ని మంత్రి తెలిపారు. *5 మూల స్తంభాలు* ఐదు ప్ర‌ధాన స్తంభాల ఆధారంగా జ‌నాభా స్థిరీక‌ర‌ణ దిశ‌గా నూత‌న ప్ర‌ణాళిక అమ‌లు చేయ‌బ‌డుతుంద‌ని తెలిపిన మంత్రి శ్రీ స‌త్య‌కుమార్ యాద‌వ్ వాటిని వివ‌రించారు: *మాతృత్వ:* ఆరోగ్య‌క‌ర శిశువుల‌కు జ‌న్మ‌నివ్వ‌డం మ‌రియు త‌ల్లీపిల్ల‌ల‌ ఆరోగ్య భ‌ద్ర‌త మ‌హిళ‌ల హ‌క్కుగా గుర్తిస్తూ ఆ మేర‌కు త‌గు చ‌ర్య‌ల్ని చేప‌ట్ట‌డం, 12 ల‌క్ష‌ల కుటుంబాలు ఎదుర్కొంటున్న వ్యంధ్య‌త్వ స‌మ‌స్య (పిల్ల‌లు పుట్ట‌క పోవ‌డం) ప‌రిష్కారానికి త‌గు సేవ‌లు ఉచితంగా అందించ‌డం, మ‌హిళ‌ల్లో కుటుంబ నియంత్ర‌ణ ఆప‌రేష‌న్లు చేయించుకుంటున్న వారి శాతాన్ని ప్ర‌స్తుత‌మున్న 70 శాతం నుంచి ఐదేళ్ల‌లో 50 శాతానికి త‌గ్గించ‌డం, శిశు ర‌క్ష‌ణ కోర్సుల ప్రారంభం ఈ అంశం ప్ర‌ధానాంశాలు *సంజీవ‌ని:* ప్ర‌తి పౌరుని హెల్త్ రికార్డుల‌ను త‌యారు చేసి, వ్యాధుల నివార‌ణ‌, హెచ్చ‌రిక‌లు మ‌రియు వివిధ స‌మ‌యాల్లో తీసుకోవాల్సిన ఆరోగ్య సేవ‌ల గురించి స‌మాచారం ద్వారా నిరంత‌ర ప‌ర్య‌వేక్ష‌ణ‌తో అన్ని జీవ‌న ద‌శ‌ల్లో ఆరోగ్య భ‌ద్ర‌త క‌ల్పించ‌డం సంజీవ‌ని ప్ర‌ధానోద్దేశం *శ‌క్తి:* వివిధ మార్గాల ద్వారా మ‌హిళా సాధికారత‌కు బ‌ల‌మైన పునాదులు వేయ‌డం *క్షేమ‌:* సామాజిక భ‌ద్ర‌త‌తో గౌర‌వప్ర‌ద‌మైన, ఆరోగ్య‌వంత‌మైన, ఆర్థిక ప్ర‌గ‌తికి తోడ్ప‌డే వార్ధ‌క్యానికి బాట‌లు వేయ‌డం క్షేమ అంశం ప్ర‌ధానోద్దేశం. ఈ ద‌శ‌లో ఎదుర‌య్యే మాన‌సిక ఆరోగ్య స‌మ‌స్య‌ల ప‌రిష్కారం ఇందులో ప్ర‌ధాన భాగం. *నైపుణ్యం:* వివిధ జీవ‌న ద‌శ‌ల్లో అవ‌స‌రాల మేర‌కు నైపుణ్య‌త‌ను పెంపొందిస్తూ, ఆత్మ గౌర‌వంతో స్వావ‌లంబ‌న దిశ‌గా ప్ర‌జ‌ల్ని స‌మాయ‌త్తం చేయ‌డం ఈ 5 అంశాల ప‌టిష్ట‌మైన అమ‌లు ఒక‌దానికొక‌టి ఊత‌మిచ్చే దిశ‌గా రూపొందించ‌బ‌డ్డాయ‌ని, ఈ 5 మూల స్తంభాల స‌మ‌ర్ధ అమ‌లు జ‌నాభా స్థిరీక‌ర‌ణ‌కు అత్యంత కీల‌క‌మ‌ని మంత్రి శ్రీ స‌త్య‌కుమార్ యాద‌వ్ వివ‌రించారు. *ముఖ్య‌మంత్రి దూరదృష్టి* దీర్ఘ కాలంలో ఎదురుకానున్న స‌మ‌స్య‌లు, స‌వాళ్ల‌ను ఎంతో ముందుగానే ప‌సిగ‌ట్టి త‌గు చ‌ర్య‌లు చేప‌ట్టే దిశ‌గా బాట‌లు వేసే ముఖ్య‌మంత్రి శ్రీ నారా చంద్ర‌బాబు నాయుడు ఆలోచ‌నల నుంచి ఈ నూత‌న ప్ర‌ణాళిక రూపొందింద‌ని మంత్రి శ్రీ స‌త్య‌కుమార్ యాద‌వ్ అన్నారు. స‌మ‌గ్ర‌మైన ఈ ప్ర‌ణాళిక‌ను ముఖ్య‌మంత్రి ఆదేశం మేర‌కు విస్తృత చ‌ర్చ కోసం త్వ‌ర‌లో ప్ర‌జ‌ల ముందు ఉంచుతామ‌ని మంత్రి తెలిపారు. ప్ర‌జ‌లు, మీడియా మ‌రియు ఇత‌ర భాగ‌స్వాములు ఈ ప్ర‌ణాళిక‌పై విస్తృత చ‌ర్చ‌కు వీలు క‌ల్పించి జ‌నాభా స్థిరీక‌ణ దిశ‌గా ప్ర‌జా ఉద్య‌మాన్ని నిర్మించ‌డానికి స‌హ‌క‌రించాల‌ని మంత్రి విజ్ఞ‌ప్తి చేశారు.

7 hrs ago
user_Mallikarjuna
Mallikarjuna
Farmer కర్నూలు అర్బన్, కర్నూలు, ఆంధ్రప్రదేశ్•

More news from తెలంగాణ and nearby areas
  • ఫీజు రీయింబర్స్‌మెంట్, ఉద్యోగ భర్తీపై అసెంబ్లీలో నిలదీసిన బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలను సస్పెండ్ చేయడం దుర్మార్గమని ఆర్.ఎస్. ప్రవీణ్ కుమార్ మండిపడ్డారు. సోమవారం గద్వాలలో జరిగిన 'పోరు దీక్ష'లో ఆయన పాల్గొన్నారు. పేద ప్రజల బతుకులు మారాలంటే మళ్లీ కేసీఆర్ ప్రభుత్వం రావాలని ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రభుత్వ వైఫల్యాలపై పోరాటం కొనసాగిస్తామని పేర్కొన్నారు.
    1
    ఫీజు రీయింబర్స్‌మెంట్, ఉద్యోగ భర్తీపై అసెంబ్లీలో నిలదీసిన బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలను సస్పెండ్ చేయడం దుర్మార్గమని ఆర్.ఎస్. ప్రవీణ్ కుమార్ మండిపడ్డారు. సోమవారం గద్వాలలో జరిగిన 'పోరు దీక్ష'లో ఆయన పాల్గొన్నారు. పేద ప్రజల బతుకులు మారాలంటే మళ్లీ కేసీఆర్ ప్రభుత్వం రావాలని ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రభుత్వ వైఫల్యాలపై పోరాటం కొనసాగిస్తామని పేర్కొన్నారు.
    user_Azmath
    Azmath
    గద్వాల్, జోగులాంబ గద్వాల్, తెలంగాణ•
    5 hrs ago
  • ప్రజలకు ఉపాధిని దూరం చేసి సామాజిక న్యాయానికి పాత రేయడమే బిజెపి చెబుతున్న దేశ భక్తా అని సిపిఎం జిల్లా కార్యదర్శి ఏ.వెంకటస్వామి కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు? . విబిజి రాంజీ బిల్లును రద్దు చేయాలని, మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని కొనసాగించాలని డిమాండ్ చేస్తూ సోమవారం జిల్లా కేంద్రంలోని పాత కలెక్టర్ కార్యాలయం నుండి కొత్త కలెక్టర్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించి కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలోని గ్రామీణ ప్రాంతాలలో వలసలను నివారించి ప్రజల ఆదాయాన్ని పెంచి ఆర్థిక అసమానతలను తగ్గించేందుకు ఉపయోగపడే గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని రద్దుచేసి కేంద్ర ప్రభుత్వం దేశంలో సామాజిక న్యాయానికి పాతరేసిందని విమర్శించారు. ఒక చట్టాన్ని రద్దు చేసేటప్పుడు కనీసం చర్చలు జరపాలన్న ప్రజాస్వామ్య విలువలను బీజేపీ పాటించడం లేదని విమర్శించారు. విబిజి రాంజీల ద్వారా కేంద్రం ఉపాధి కూలీలకు భారీగా కోతలు విధించిందని, రాష్ట్ర ప్రభుత్వాలపై భారాలు పెంచిందని, జాబ్ కార్డులు ఇవ్వకుండా, చేసిన పనులకు డబ్బులు ఇవ్వకుండా పని ప్రదేశాలలో కనీస సౌకర్యాలను గాలికి వదిలేసిందని, సాంకేతిక సమస్యలను సకాలంలో పరిష్కరించకుండా కూలీలకు ఉపాధిని దూరం చేసిందని విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం సైతం విబిజి రాంజీ బిల్లును రద్దు చేయాలని అసెంబ్లీలో తీర్మానం చేయాలని, ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి ఖర్చులు 5 లక్షల నుండి 10 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. జిల్లాలో వేల సంఖ్యలో భూ సమస్యలు పెండింగ్లో ఉన్నాయని ప్రజావాణిలో ఎన్నిసార్లు అధికారుల దృష్టికి తీసుకువచ్చిన పరిష్కారం కావడం లేదని, భూ సమస్యల పరిష్కారం కోసం ప్రత్యేక కమిటీని నియమించి సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. జిల్లాలో సిపిఎం కార్యకర్తలు ఉపాధి కూలీల దగ్గరికి వెళ్ళిన సందర్భంగా జిల్లాలో గత మూడు నెలలుగా కూలీలకు డబ్బులు రాలేదని, ఫోటో ఫ్యాక్చరింగ్ సరిగా రావడం లేదని, డబ్బులు రాకపోవడంతో కూలీలు పనికి రావడం లేదని పనిచేయడానికి అవసరమైన పని ముట్లు ఇవ్వడం లేదని, గర్భిణీలకు బాలింతలకు వృద్ధులకు ప్రత్యేక సౌకర్యాలు కల్పించడం లేదని తమ దృష్టికి తీసుకువచ్చారని అన్నారు. తక్షణమే అధికార యంత్రాంగం క్షేత్రస్థాయిలో పర్యటించి ఉపాధి కూలీల సమస్యలు పరిష్కరించాలని లేనిపక్షంలో ఉద్యమిస్తామని హెచ్చరించారు. అనంతరం డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని కలెక్టర్ కు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఏ వెంకటస్వామి సిపిఎం జిల్లా కార్యదర్శి , సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు జీ. రాజు, ఉప్పేర్ నరసింహ, నాయకులు రవి, సవారన్న, పాంటన్న,తిరుపతన్న, బాలకృష్ణ, రామక్రిష్ణ రంగన్న, రామాంజనేయులు తదితరులు పాల్గొన్నారు.
    2
    ప్రజలకు ఉపాధిని దూరం చేసి సామాజిక న్యాయానికి పాత రేయడమే బిజెపి చెబుతున్న దేశ భక్తా అని సిపిఎం జిల్లా కార్యదర్శి ఏ.వెంకటస్వామి కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు? . విబిజి రాంజీ బిల్లును రద్దు చేయాలని, మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని కొనసాగించాలని డిమాండ్ చేస్తూ సోమవారం జిల్లా కేంద్రంలోని పాత కలెక్టర్ కార్యాలయం నుండి  కొత్త కలెక్టర్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించి కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలోని గ్రామీణ ప్రాంతాలలో వలసలను నివారించి ప్రజల ఆదాయాన్ని పెంచి ఆర్థిక అసమానతలను తగ్గించేందుకు ఉపయోగపడే గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని రద్దుచేసి కేంద్ర ప్రభుత్వం దేశంలో సామాజిక న్యాయానికి పాతరేసిందని విమర్శించారు. ఒక చట్టాన్ని రద్దు చేసేటప్పుడు కనీసం చర్చలు జరపాలన్న ప్రజాస్వామ్య విలువలను బీజేపీ పాటించడం లేదని విమర్శించారు. విబిజి రాంజీల ద్వారా కేంద్రం ఉపాధి కూలీలకు భారీగా కోతలు విధించిందని, రాష్ట్ర ప్రభుత్వాలపై భారాలు పెంచిందని, జాబ్ కార్డులు ఇవ్వకుండా, చేసిన పనులకు డబ్బులు ఇవ్వకుండా పని ప్రదేశాలలో కనీస సౌకర్యాలను గాలికి వదిలేసిందని, సాంకేతిక సమస్యలను సకాలంలో పరిష్కరించకుండా కూలీలకు ఉపాధిని దూరం చేసిందని విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం సైతం విబిజి రాంజీ బిల్లును రద్దు చేయాలని అసెంబ్లీలో తీర్మానం చేయాలని, ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి ఖర్చులు 5 లక్షల నుండి 10 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. జిల్లాలో వేల సంఖ్యలో భూ సమస్యలు పెండింగ్లో ఉన్నాయని ప్రజావాణిలో ఎన్నిసార్లు అధికారుల దృష్టికి తీసుకువచ్చిన పరిష్కారం కావడం లేదని, భూ సమస్యల పరిష్కారం కోసం ప్రత్యేక కమిటీని నియమించి సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. జిల్లాలో సిపిఎం కార్యకర్తలు ఉపాధి కూలీల దగ్గరికి వెళ్ళిన సందర్భంగా జిల్లాలో గత మూడు నెలలుగా కూలీలకు డబ్బులు రాలేదని, ఫోటో ఫ్యాక్చరింగ్ సరిగా రావడం లేదని, డబ్బులు రాకపోవడంతో కూలీలు పనికి రావడం లేదని పనిచేయడానికి అవసరమైన పని ముట్లు ఇవ్వడం లేదని, గర్భిణీలకు బాలింతలకు వృద్ధులకు ప్రత్యేక సౌకర్యాలు కల్పించడం లేదని తమ దృష్టికి తీసుకువచ్చారని అన్నారు. తక్షణమే అధికార యంత్రాంగం క్షేత్రస్థాయిలో పర్యటించి ఉపాధి కూలీల సమస్యలు పరిష్కరించాలని లేనిపక్షంలో ఉద్యమిస్తామని హెచ్చరించారు. అనంతరం 
డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని కలెక్టర్ కు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఏ వెంకటస్వామి సిపిఎం జిల్లా కార్యదర్శి , సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు జీ. రాజు, ఉప్పేర్ నరసింహ, నాయకులు రవి, సవారన్న, పాంటన్న,తిరుపతన్న, బాలకృష్ణ, రామక్రిష్ణ రంగన్న, రామాంజనేయులు తదితరులు పాల్గొన్నారు.
    user_Elluru Varaprasad
    Elluru Varaprasad
    Local News Reporter గద్వాల్, జోగులాంబ గద్వాల్, తెలంగాణ•
    7 hrs ago
  • జోగులాంబ గద్వాల జిల్లా: జిల్లా కేంద్రంలోని కూరగాయల మార్కెట్ దగ్గర ఈరోజు తెల్లవారుజామున టెంకాయల షాప్ పక్కన షార్ట్ సర్క్యూట్ జరగడం జరిగింది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది..
    1
    జోగులాంబ గద్వాల జిల్లా: జిల్లా కేంద్రంలోని కూరగాయల మార్కెట్ దగ్గర ఈరోజు తెల్లవారుజామున టెంకాయల షాప్ పక్కన షార్ట్ సర్క్యూట్ జరగడం జరిగింది.
పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది..
    user_Ram  Ram
    Ram Ram
    Journalist గద్వాల్, జోగులాంబ గద్వాల్, తెలంగాణ•
    20 hrs ago
  • ఎమ్మిగనూరు చేనేతల కో-ఆపరేటివ్ సొసైటీ సర్వసభ్య సమావేశం ఈనెల 31వ తేదీన జరగనుంది. ఈ సమావేశంలో సొసైటీని ఆప్కోలో విలీనం చేయాలనే ఉద్దేశపూర్వక ప్రయత్నాలు జరుగుతున్నాయనే సమాచారం నేపథ్యంలో సభ్యులు, చేనేత కార్మికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పద్మశ్రీ మాచాని సోమప్ప గారు స్థాపించిన ఈ చేనేత కో-ఆపరేటివ్ సొసైటీ ఎమ్మిగనూరుకు ప్రత్యేక గుర్తింపుగా నిలిచిందని, దీన్ని విలీనం చేయకుండా కాపాడుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యతగా భావించాలని పలువురు అభిప్రాయం వ్యక్తం చేశారు. సొసైటీని ఆప్కోలో విలీనం చేయకుండా నిలబెట్టేందుకు ప్రజాసంఘాలు, చేనేత కార్మికులు, స్థానిక ప్రజలు పార్టీలకతీతంగా ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ఈ మేరకు మార్చి 31న జరిగే సర్వసభ్య సమావేశంలో విలీనానికి వ్యతిరేకంగా గళమెత్తాలని కోరుతున్నారు. అలాగే అదే రోజు వివర్స్ కాలనీ మైదానం వద్ద, సొసైటీ కార్యాలయం ఎదురుగా నిర్వహించబడనున్న కార్యక్రమంలో పాల్గొని, చేనేత సొసైటీ పరిరక్షణకు సంఘీభావం తెలియజేయాలని విజ్ఞప్తి చేశారు. మాచాని సోమప్ప గారి సేవలను స్మరించుకుంటూ, ఆయన స్థాపించిన ఈ సొసైటీని భవిష్యత్తు తరాలకు అందించే బాధ్యత మన అందరిదని సభ్యులు పేర్కొన్నారు.
    1
    ఎమ్మిగనూరు చేనేతల కో-ఆపరేటివ్ సొసైటీ సర్వసభ్య సమావేశం ఈనెల 31వ తేదీన జరగనుంది. ఈ సమావేశంలో సొసైటీని ఆప్కోలో విలీనం చేయాలనే ఉద్దేశపూర్వక ప్రయత్నాలు జరుగుతున్నాయనే సమాచారం నేపథ్యంలో సభ్యులు, చేనేత కార్మికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
పద్మశ్రీ మాచాని సోమప్ప గారు స్థాపించిన ఈ చేనేత కో-ఆపరేటివ్ సొసైటీ ఎమ్మిగనూరుకు ప్రత్యేక గుర్తింపుగా నిలిచిందని, దీన్ని విలీనం చేయకుండా కాపాడుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యతగా భావించాలని పలువురు అభిప్రాయం వ్యక్తం చేశారు.
సొసైటీని ఆప్కోలో విలీనం చేయకుండా నిలబెట్టేందుకు ప్రజాసంఘాలు, చేనేత కార్మికులు, స్థానిక ప్రజలు పార్టీలకతీతంగా ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ఈ మేరకు మార్చి 31న జరిగే సర్వసభ్య సమావేశంలో విలీనానికి వ్యతిరేకంగా గళమెత్తాలని కోరుతున్నారు.
అలాగే అదే రోజు వివర్స్ కాలనీ మైదానం వద్ద, సొసైటీ కార్యాలయం ఎదురుగా నిర్వహించబడనున్న కార్యక్రమంలో పాల్గొని, చేనేత సొసైటీ పరిరక్షణకు సంఘీభావం తెలియజేయాలని విజ్ఞప్తి చేశారు.
మాచాని సోమప్ప గారి సేవలను స్మరించుకుంటూ, ఆయన స్థాపించిన ఈ సొసైటీని భవిష్యత్తు తరాలకు అందించే బాధ్యత మన అందరిదని సభ్యులు పేర్కొన్నారు.
    user_K AMPAIAH ACHARI
    K AMPAIAH ACHARI
    Local News Reporter ఎమ్మిగనూరు, కర్నూలు, ఆంధ్రప్రదేశ్•
    5 hrs ago
  • 30-03-2026 కర్నూల్ జిల్లా ఈరోజు ఆలూరు మండల కేంద్రంలో R&B గెస్ట్ హౌస్ నందు *_ఆలూరు నియోజకవర్గం MLA బుసినే విరుపాక్షి గారు_* మీడియా సమావేశంలో మాట్లాడుతూ... అమరావతి రాజధానికి మేము వ్యతిరేకం కాదు అని అన్నారు... అమరావతిలో ఇప్పుటీ వరకు అభివృద్ధి పనులు జరగలేదు అని అన్నారు.. నారా చంద్రబాబు బాబు నాయుడు, 7 సంవత్సరలు ముఖ్యమంత్రి గా ఉన్న అమరావతిని అభివృద్ధి చేయలేదు అని అన్నారు.. అమరావతిలో ఒక శాశ్వత భవనని కట్టలేదు చంద్రబాబు అని అన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత ఒక మెయిన్ రోడ్ కూడా వేయలేదు అని అన్నారు.... ఇక్కడ ఉన్న టీడీపీ ఇంచార్జ్ గారు మాటలు తప్ప ఆలూరు నియోజకవర్గని అభివృద్ధి చేయడం లేదు అన్నారు... *_మా నాయకుడు వైస్ జగన్ మోహన్ రెడ్డి గారి_* గురించి తప్పు గా మాట్లాడితే చూస్తూ ఊరుకోము అని హెచ్చరించారు.... రాజధాని అమరావతి పేరు తో కూటమి నాయకులు ఇస్టానుసారంగా దోచుకుంటున్నారు అని అన్నారు.... నారా చంద్రబాబు నాయుడు గారికి రాయలసీమ గురించి పట్టించుకోవడం లేదు అని తెలిపారు... ఈ కార్యక్రమం లో వైస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు, BVR అభిమానులు పాల్గొన్నారు.. 😎TEAM_BCS🇸🇱 #YSJagan #Busine_Virupakshi #Aluru_Constitunecy_MLA
    1
    30-03-2026
కర్నూల్ జిల్లా 
ఈరోజు ఆలూరు మండల కేంద్రంలో R&B గెస్ట్ హౌస్ నందు 
*_ఆలూరు నియోజకవర్గం MLA బుసినే విరుపాక్షి గారు_* మీడియా సమావేశంలో మాట్లాడుతూ...
అమరావతి రాజధానికి మేము వ్యతిరేకం కాదు అని అన్నారు...
అమరావతిలో ఇప్పుటీ వరకు అభివృద్ధి పనులు జరగలేదు అని అన్నారు..
నారా చంద్రబాబు బాబు నాయుడు, 7 సంవత్సరలు ముఖ్యమంత్రి గా ఉన్న అమరావతిని అభివృద్ధి చేయలేదు అని అన్నారు..
అమరావతిలో ఒక శాశ్వత  భవనని కట్టలేదు  చంద్రబాబు అని అన్నారు.
కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత ఒక మెయిన్ రోడ్ కూడా వేయలేదు అని అన్నారు....
ఇక్కడ ఉన్న టీడీపీ ఇంచార్జ్ గారు మాటలు తప్ప ఆలూరు నియోజకవర్గని అభివృద్ధి చేయడం లేదు అన్నారు...
*_మా నాయకుడు వైస్ జగన్ మోహన్ రెడ్డి గారి_* గురించి తప్పు గా మాట్లాడితే చూస్తూ ఊరుకోము అని హెచ్చరించారు....
రాజధాని అమరావతి పేరు తో కూటమి నాయకులు ఇస్టానుసారంగా దోచుకుంటున్నారు అని అన్నారు....
నారా చంద్రబాబు నాయుడు గారికి రాయలసీమ గురించి పట్టించుకోవడం లేదు అని తెలిపారు...
ఈ కార్యక్రమం లో వైస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు, BVR అభిమానులు పాల్గొన్నారు..
😎TEAM_BCS🇸🇱
#YSJagan
#Busine_Virupakshi #Aluru_Constitunecy_MLA
    user_G.NAGENDRA
    G.NAGENDRA
    NEWS reporter ఆదోని, కర్నూలు, ఆంధ్రప్రదేశ్•
    13 hrs ago
  • ప్రజల భద్రత దృష్టిలో ఉంచుకొని ఆపరేషన్ నైట్ సేఫ్టీ అమలు.రాత్రంతా SP వీధిలోనే. అనంవసరంగా రాత్రి వేళ బయట తిరిగితే చర్యలు తప్పవు, ట్రీట్మెంట్ తప్పదు
    1
    ప్రజల భద్రత దృష్టిలో ఉంచుకొని ఆపరేషన్ నైట్ సేఫ్టీ అమలు.రాత్రంతా SP వీధిలోనే. అనంవసరంగా రాత్రి వేళ బయట తిరిగితే చర్యలు తప్పవు, ట్రీట్మెంట్ తప్పదు
    user_Ananthapuram Anil Kumar
    Ananthapuram Anil Kumar
    Social services organisation అనంతపురం, అనంతపురం, ఆంధ్రప్రదేశ్•
    18 hrs ago
  • బద్వేలు :రూరల్ పోలీస్ స్టేషన్ పరిదిలో చంపుతామని కతితో బెదిరించి వృద్దురాలి మెడలో నుండి బంగారు గోలుసు చోరీ చేసిన కేసులో కీలక నిందితుడిని అరెస్ చేసి, చోరీ సొతు, నేరానికి ఉపయోగించిన కారు, 2 బైకులను స్వాధీనం బద్వేలు రూరల్ పోలీసులు చేసుకున్నరు. కేసు వివరాలు: 27.03.2026 శ్రీరామనవమి పండుగ రోజున బద్వేలు రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని శ్రీనివాసపురం గ్రామంలో ఒక వృద్దురాలిని కతితో బెదిరించి, ఆమె మెడలోని బంగారు గొలుసును లాక్కొని పారిపోయిన ఘటనపై కేసు (Cr.No.30/2026 U/s 307 r/w 3(5) BNS) బద్వేలు రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ పర్యవేక్షణలో ఎస్.ఐ ఎం. రంగారావు మరియు వారి సిబ్బంది బృందాలుగా ఏర్పడి గాలింపు చర్యలు చేపట్టగా వారికి అందిన నమ్మకమైన సమాచారం మేరకు, 29.03.2026 తేదీన సాయంకాలము గోపవరం మండలం, ద్వారకనగర్ సమీపంలోని గరుడయ్య సత్రము వద్ద అనుమానాస్పదంగా ఉన్న షైక్ ఈసు మీరా వల్లి (23 సం||, మార్కాపురం టౌన్ & జిల్లా) అనే వ్యక్తిని అదుపులోకి తీసుకుని విచారించగా, సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. నేర చరిత్ర మరియు ముఠా వివరాలు: నిందితుడు మీరా వల్లి గతంలో మార్కాపురంలో దొంగతనం చేసి జైలుకు వెళ్ళాడు. జైలులో ఇతనికి మజీద్, అంజిరెడ్డి, వెంకటేశు అనే కరుడు గట్టిన పాత నేరస్థులతో పరిచయం ఏర్పడి, విరు నలుగురు ఒక గ్యాంగ్ ఏర్పడ్డారు. శ్రీరామనవమి సమయంలో జనసమ్మర్థం ఉన్న చోట, మహిళలు నగలు వేసుకొని వుంటారు కావున అక్కడ దొంగతనాలు చేయాలని, ఎవరైనా అడ్డుకుంటే కత్తులతో చంపడానికైనా సిద్ధపడాలని నిర్ణయించుకొని పథకం వేసుకొని, కత్తులు కొన్నారు. వీరందరూ కలిసి 25.03.2026 తేదీ పొదిలి సమీపంలో ఒక HF Deluxe బైకు, 26.03.2026 తేదీ నరసరావు పేట సమీపంలో ఒక యునికర్న్ బైకు, పామూరు సమీపంలో ఒక పల్సర్ బైకు దొంగిలించారు. ఈ క్రమంలో శ్రీనివాసపురం వద్ద ఒంటరిగా ఉన్న వృద్ధురాలిని, ఆమె కుమారుడిని కత్తులతో బెదిరించి సుమారు 2.5 లక్షల విలువైన బంగారు దొంగిలించుకొని పారిపోయినారు. స్వాధీనం చేసుకున్న సొత్తు: నిందితుని నుండి ఈ క్రింది వస్తువులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు: నిందితుని నుండి ఈ క్రింది వస్తువులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు: 1. బంగారు గొలుసు: సుమారు 18 గ్రాముల బరువున్న తెగిపోయిన బంగారు చైన్. 2. కారు: నేరానికి ఉపయోగించిన వోక్స్ వ్యాగన్ పోలో (Volkswagen Polo) కారు (AP07BT8543). 3. ద్విచక్ర వాహనాలు: నరసరావుపేట మరియు పొదిలి ప్రాంతాల్లో దొంగిలించిన ఒక హోండా యూనికార్న్ మరియు ఒక హెచ్.ఎఫ్ డీలక్స్ మోటార్ సైకిళ్ళు. 4. ఆయుధం: బెదిరింపులకు ఉపయోగించిన పదునైన కత్తి, అభినందనలు: నేరం గురించి తెలిసిన వెంటనే స్పందించి, బద్వేలు రూరల్ SI రంగారావు మరియు బి.. కోడూరు SI సూర్య నారాయణ రెడ్డి ల ఆధ్వర్యంలో రెండు బృందాలను ఏర్పాటు చేసి, తీవ్ర గాలింపు చర్యలు చేసి, జిల్లా దొంగల ముఠా గుట్టురట్టు చేసి, వారి నుండి బద్వేలు రూరల్ పరిధిలో దొంగిలించిన బంగారు చైన్ కాకుండా, ఇతర జిల్లాలో దొంగిలించిన మోటారు సైకిళ్ళను, నేరానికి ఉపయోగించిన కారును కుడా స్వాధీనం చేసుకొని వారి ఆట కట్టించిన బద్వేలు రూరల్ CI నద్యాల క్రిష్నయ్యను మరియు వారి సిబ్బందిని మైదుకూరు DSP రాజేంద్ర ప్రసాద్ అభినిందించారు. పోలీసుల హెచ్చరిక:నిందితుడు మీరా వల్లిని అరెస్ట్ చేసి రిమాండుకు తరలించడం జరిగింది. ఈ కేసులో పరారీలో ఉన్న మిగిలిన ముగ్గురు నిందితుల (మజీద్, అంజిరెడ్డి, వెంకటేశు) కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశామని ఎస్.ఐ రంగారావు తెలిపారు. నిందితులపై కొత్త చట్టం ప్రకారం (111 BNS) గ్యాంగ్ నేరాలకు సంబంధించిన కఠిన సెక్షన్లు నమోదు చేసినట్లు పేర్కొన్నారు.
    1
    బద్వేలు :రూరల్ పోలీస్ స్టేషన్ పరిదిలో చంపుతామని కతితో బెదిరించి వృద్దురాలి మెడలో నుండి బంగారు గోలుసు చోరీ చేసిన కేసులో కీలక నిందితుడిని అరెస్ చేసి, చోరీ సొతు, నేరానికి ఉపయోగించిన కారు, 2 బైకులను స్వాధీనం బద్వేలు రూరల్ పోలీసులు చేసుకున్నరు.
కేసు వివరాలు: 27.03.2026 శ్రీరామనవమి పండుగ రోజున బద్వేలు రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని శ్రీనివాసపురం గ్రామంలో ఒక వృద్దురాలిని కతితో బెదిరించి, ఆమె మెడలోని బంగారు గొలుసును లాక్కొని పారిపోయిన ఘటనపై కేసు (Cr.No.30/2026 U/s 307 r/w 3(5) BNS) బద్వేలు రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్  పర్యవేక్షణలో ఎస్.ఐ ఎం. రంగారావు మరియు వారి సిబ్బంది  బృందాలుగా ఏర్పడి గాలింపు చర్యలు చేపట్టగా వారికి అందిన నమ్మకమైన సమాచారం మేరకు, 29.03.2026 తేదీన సాయంకాలము గోపవరం మండలం, ద్వారకనగర్ సమీపంలోని గరుడయ్య సత్రము వద్ద అనుమానాస్పదంగా ఉన్న షైక్ ఈసు మీరా వల్లి (23 సం||, మార్కాపురం టౌన్ & జిల్లా) అనే వ్యక్తిని అదుపులోకి తీసుకుని విచారించగా, సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి.
నేర చరిత్ర మరియు ముఠా వివరాలు: నిందితుడు మీరా వల్లి గతంలో మార్కాపురంలో దొంగతనం చేసి జైలుకు వెళ్ళాడు.
జైలులో ఇతనికి మజీద్, అంజిరెడ్డి, వెంకటేశు అనే కరుడు గట్టిన పాత నేరస్థులతో పరిచయం ఏర్పడి, విరు నలుగురు ఒక గ్యాంగ్ ఏర్పడ్డారు. శ్రీరామనవమి సమయంలో జనసమ్మర్థం ఉన్న చోట, మహిళలు నగలు వేసుకొని వుంటారు కావున అక్కడ దొంగతనాలు చేయాలని, ఎవరైనా అడ్డుకుంటే కత్తులతో చంపడానికైనా సిద్ధపడాలని నిర్ణయించుకొని పథకం వేసుకొని, కత్తులు కొన్నారు. వీరందరూ కలిసి 25.03.2026 తేదీ పొదిలి సమీపంలో ఒక HF Deluxe బైకు, 26.03.2026 తేదీ నరసరావు పేట సమీపంలో ఒక యునికర్న్ బైకు, పామూరు సమీపంలో ఒక పల్సర్ బైకు దొంగిలించారు. ఈ క్రమంలో శ్రీనివాసపురం వద్ద ఒంటరిగా ఉన్న వృద్ధురాలిని, ఆమె కుమారుడిని కత్తులతో బెదిరించి సుమారు 2.5 లక్షల విలువైన బంగారు దొంగిలించుకొని పారిపోయినారు.
స్వాధీనం చేసుకున్న సొత్తు: నిందితుని నుండి ఈ క్రింది వస్తువులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు:
నిందితుని నుండి ఈ క్రింది వస్తువులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు:
1. బంగారు గొలుసు: సుమారు 18 గ్రాముల బరువున్న తెగిపోయిన బంగారు చైన్.
2. కారు: నేరానికి ఉపయోగించిన వోక్స్ వ్యాగన్ పోలో (Volkswagen Polo) కారు (AP07BT8543).
3. ద్విచక్ర వాహనాలు: నరసరావుపేట మరియు పొదిలి ప్రాంతాల్లో దొంగిలించిన ఒక హోండా యూనికార్న్ మరియు ఒక హెచ్.ఎఫ్ డీలక్స్ మోటార్ సైకిళ్ళు.
4. ఆయుధం: బెదిరింపులకు ఉపయోగించిన పదునైన కత్తి,
అభినందనలు: నేరం గురించి తెలిసిన వెంటనే స్పందించి, బద్వేలు రూరల్ SI రంగారావు మరియు బి.. కోడూరు SI సూర్య నారాయణ రెడ్డి ల ఆధ్వర్యంలో రెండు బృందాలను ఏర్పాటు చేసి, తీవ్ర గాలింపు చర్యలు చేసి,  జిల్లా దొంగల ముఠా గుట్టురట్టు చేసి, వారి నుండి బద్వేలు రూరల్ పరిధిలో దొంగిలించిన బంగారు చైన్ కాకుండా, ఇతర జిల్లాలో దొంగిలించిన మోటారు సైకిళ్ళను, నేరానికి ఉపయోగించిన కారును కుడా స్వాధీనం చేసుకొని వారి ఆట కట్టించిన బద్వేలు రూరల్ CI నద్యాల క్రిష్నయ్యను మరియు వారి సిబ్బందిని మైదుకూరు DSP రాజేంద్ర ప్రసాద్  అభినిందించారు.
పోలీసుల హెచ్చరిక:నిందితుడు మీరా వల్లిని అరెస్ట్ చేసి రిమాండుకు తరలించడం జరిగింది. ఈ కేసులో పరారీలో ఉన్న మిగిలిన ముగ్గురు నిందితుల (మజీద్, అంజిరెడ్డి, వెంకటేశు) కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశామని ఎస్.ఐ రంగారావు తెలిపారు. నిందితులపై కొత్త చట్టం ప్రకారం (111 BNS) గ్యాంగ్ నేరాలకు సంబంధించిన కఠిన సెక్షన్లు నమోదు చేసినట్లు పేర్కొన్నారు.
    user_జీ.మౌలాలి.
    జీ.మౌలాలి.
    Photographer బద్వేల్, వై.ఎస్.ఆర్., ఆంధ్రప్రదేశ్•
    6 hrs ago
  • ఎమ్మిగనూరులో టిడ్కో గృహాల పంపిణీ ఘనంగా 🔴 సోగనూరు రోడ్‌లో 1008 ఇళ్లను లబ్ధిదారులకు అందజేత 🔴 కార్యక్రమంలో ఎమ్మెల్యే డా. బీ.వీ. జయ నాగేశ్వర్ రెడ్డి పాల్గొన్నారు 🔴 పేదల సొంతింటి కలలు నిజం అవుతున్నాయని ఎమ్మెల్యే వ్యాఖ్య 🔴 త్వరలో కమ్యూనిటీ కాంప్లెక్స్, మార్కెట్, పార్కులు ఏర్పాటు 🔴 గత ప్రభుత్వంపై ఎమ్మెల్యే విమర్శలు 🔴 “మన ఇల్లు – మన గౌరవం” కార్యక్రమం శివన్న నగర్‌లో నిర్వహణ 🔴 650 మందికి రూ.2.50 లక్షల సబ్సిడీ పత్రాల పంపిణీ 🔴 గృహ నిర్మాణం పూర్తి చేసిన ఇళ్ల ప్రారంభం 🔴 లబ్ధిదారులకు సాంప్రదాయ వస్త్రాల అందజేత 🔴 అధికారులు, స్థానిక నాయకులు భారీగా హాజరు
    1
    ఎమ్మిగనూరులో టిడ్కో గృహాల పంపిణీ ఘనంగా
🔴 సోగనూరు రోడ్‌లో 1008 ఇళ్లను లబ్ధిదారులకు అందజేత
🔴 కార్యక్రమంలో ఎమ్మెల్యే డా. బీ.వీ. జయ నాగేశ్వర్ రెడ్డి పాల్గొన్నారు
🔴 పేదల సొంతింటి కలలు నిజం అవుతున్నాయని ఎమ్మెల్యే వ్యాఖ్య
🔴 త్వరలో కమ్యూనిటీ కాంప్లెక్స్, మార్కెట్, పార్కులు ఏర్పాటు
🔴 గత ప్రభుత్వంపై ఎమ్మెల్యే విమర్శలు
🔴 “మన ఇల్లు – మన గౌరవం” కార్యక్రమం శివన్న నగర్‌లో నిర్వహణ
🔴 650 మందికి రూ.2.50 లక్షల సబ్సిడీ పత్రాల పంపిణీ
🔴 గృహ నిర్మాణం పూర్తి చేసిన ఇళ్ల ప్రారంభం
🔴 లబ్ధిదారులకు సాంప్రదాయ వస్త్రాల అందజేత
🔴 అధికారులు, స్థానిక నాయకులు భారీగా హాజరు
    user_K AMPAIAH ACHARI
    K AMPAIAH ACHARI
    Local News Reporter ఎమ్మిగనూరు, కర్నూలు, ఆంధ్రప్రదేశ్•
    9 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.