ఛత్రపతి శివాజీ మహారాజ్ గారి జయంతి శ్రీ ఛత్రపతి శివాజీ మహారాజ్ గారి జయంతి శివాజీ మహారాజ్ మహానుభావుడు, ఆయన ఈ దేశానికి రెండు గొప్ప సేవలు అందించారు. ఒకటి ఆర్ష ధర్మాన్ని నిలబెట్టడానికి గోవులను రక్షించారు. గోవధ యధేఛ్ఛగా జరుగుతున్న రోజుల్లో, గోవులను రక్షించడాన్ని జీవన కర్తవ్యంగా పెట్టుకుని గోవులను కాపాడిన వారు శివాజీ. అలాగే రెండవది స్త్రీలను రక్షించి, వారికి నమస్కరించటం. ఆయన శత్రువులు వివాహం అయిపోయినటువంటి స్త్రీలను కూడా తీసుకెళ్ళి మానభంగం చేస్తుంటే, ఆ స్త్రీలను రక్షించి, కనపడిన ప్రతీ స్త్రీనీ అమ్మవారిగా చూసి పసుపు, కుంకుమ, గాజులు ఇచ్చి, నమస్కరించినటువంటి ఘనత శివాజి మహరాజ్ దే... యుధ్ధములో తన శత్రువులు అయినటువంటి పరమతానికి చెందినటువంటి స్త్రీలు తనకి దొరికితే, ఖైదీలుగా బంధించకుండా, వాళ్ళు పెట్టుకొకపోయినా వాళ్ళకీ ఐదోతనపు చిహ్నాలుగా వారికి చీరా, పసుపు, కుంకుమ ఇచ్చి, వారిని తన తల్లిగా భావించి, నమస్కరించి, పల్లకీలో తెరలు వేసి వెనక్కి పంపించినటువంటివాడు శివాజీ మహారాజ్, మహానుభావుడు, సమర్థ రామదాసు గారు ఆయన గురువు. శివాజీ సనాతన ధర్మాన్ని నిలబెట్టడానికి కోటలు నిర్మించి, హైందవ సామ్రాజ్య ఏర్పాటుకి ఆయనకు కార్యసిధ్ధి కొరకు శక్తి యొక్క అండ, అంటే అమ్మవారి అండ కావలసివచ్చింది. శివాజీ మహారాజ్ యొక్క చరిత్ర చదివితే తెలుస్తుంది - అటువంటి రోజులలో శ్రీశైల క్షేత్రానికి వెళ్ళి ఆ రోజులలో శివాజీ అమ్మవారి అనుగ్రహానికై ధ్యానమగ్నులయ్యారు. మంత్రులు, సేనాధిపతులు "ఇదేమిటి, శివాజీ మహారాజ్ ఇంత ప్రౌఢమైన వయస్సులో, ఇంత యుధ్ధ సమయములో అకస్మాత్తుగా వెళ్లి ధ్యానం లో కూర్చుంటున్నారు, అసలు బయటికి రావట్లేద"ని హడిలిపోయారు. భ్రమరాంబికా అమ్మవారిని ధ్యానం చేస్తూ శివాజీ మహారాజ్ కూర్చుంటే, అమ్మవారు ప్రత్యక్షమై, "నీకు నేను ఒక ఖడ్గాన్ని బహుకరిస్తున్నాను. ఇది నువ్వు పట్టుకున్నంత కాలం ఇక యుధ్ధంలో నీకు ఎదురు లేదు, ఈ ఖడ్గాన్ని పట్టుకుని హైందవ సామ్రాజ్యాన్ని స్థాపించ"మని కటాక్షించింది. ఆ భవానీ ఖడ్గాన్ని చేత పట్టుకునే శివాజీ హైందవ సామ్రాజ్యాన్ని స్థాపించారు. ఇప్పటికీ శ్రీశైలం మల్లికార్జున స్వామి దేవాలయంలోకి వెళ్ళినప్పుడు, ఎడమ పక్కగా వెడుతూ దర్శనానికి కుడి పక్కకి తిరగవలసిన చోట తిరగకుండా మెట్లుఎక్కితే వీర శైవ మఠం కనబడుతుంది. ఆ మఠం మెట్ల మీద నిలబడి చూస్తే ఎన్నో చమత్కారములు కనబడతాయి. అక్కడే కిందకి దిగి కుడి పక్కకి తిరిగితే, శివాజీ మహారాజ్ మోకాలు మీద కూర్చుంటే భ్రమరాంబ అమ్మవారు ఆయనికి ఖడ్గాన్ని బహుకరిస్తున్న సన్నివేశం చెక్కబడిన శిల్పము కనిపిస్తుంది.

- RTCని ప్రైవేటీకరణ చేస్తే సహించం: JAC గుంటూరు:ఎలక్ట్రిక్ బస్సుల ముసుగులో ఆర్టీసీని ప్రైవేటీకరించేందుకు కుట్ర జరుగుతోందని గుంటూరు-2 డిపో ఎంప్లాయిస్ JAC ఆరోపించింది. కమిటీ ఆధ్వర్యంలో బుధవారం APSRTC ఉద్యోగులు గుంటూరు NTR బస్టాండ్ వద్ద రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. ఎలక్ట్రిక్ బస్సులను RTC సంస్థ నేరుగా నడపాలన్నారు. ప్రైవేట్ వ్యక్తులకు అప్పగించవద్దని డిమాండ్ చేశారు. ప్రభుత్వం స్పందించకపోతే ఆమరణ నిరాహార దీక్షకు దిగుతామని పేర్కొన్నారు.1
- గుంటూరు జిల్లా:కొల్లిపర మండలంలోని గుదిబండి వారి పాలెంలో జరుగుతున్న ఆలయ వార్షికోత్సవాల్లో భాగంగా బుధవారం రెండో రోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీ గణపతి, నవగ్రహ, దుర్గాదేవి హోమాలతో పాటు కనకదుర్గాదేవికి కలశ పూజ, కుంకుమార్చనలు శాస్త్రోక్తంగా జరిపారు. ఈ పూజా కార్యక్రమాల్లో చుట్టుపక్కల గ్రామాల నుంచి వందలాది భక్తులు పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు.1
- విశాఖ తీరంలో జరుగుతున్న ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూలో, నేవీ సిబ్బంది గౌరవ వందనం స్వీకరించిన రాష్ట్రపతి. ఐఎఫ్ఆర్ కార్యక్రమంలో పాల్గొన్న గవర్నర్, సీఎం, డిప్యూటీ సీఎం.1
- ఆడపిల్ల గా పుట్టడం ఆ చిట్టి తల్లి చేసుకున్న కర్మ అని అందమా?.... సిగ్గుపడాలి ఈ సమాజం మన కంటే అడవిలో వుండే మృగాలు వంద రెట్లు బెటర్ గా వున్నాయి... తల్లి నీ మరణానికి కారణం ఈ సమాజమే ప్రతి ఒక్కరు బాద్యులే1
- *విజయవాడ 'మహాప్రస్థానం'లో ఉచితం మాయం.. డ్రైవర్ల ఇష్టారాజ్యం!* విజయవాడ ప్రభుత్వాసుపత్రిలో మానవత్వం మంటగలుస్తోంది. మృతదేహాలను శ్మశానవాటికలకు తరలించేందుకు ప్రభుత్వం ఉచితంగా ప్రవేశపెట్టిన 'మహాప్రస్థానం' సేవలు ఇప్పుడు కాసుల వేటగా మారాయి. వాహనాలపై ఉన్న 'ఉచితం' అనే అక్షరాలను చెరిపేసి, బాధిత కుటుంబాల నుంచి డ్రైవర్లు అందినకాడికి దండుకుంటున్నారు. డ్రైవర్ బేటా పేరిట ఒక్కో మృతదేహానికి 700 నుంచి 1,000 రూపాయల వరకు వసూలు చేస్తుండటంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.1
- మచిలీపట్నం పట్టణంలో ఆయుర్వేద వైద్య సేవలకు విశేష స్పందన లభిస్తోందని శుభకర ఆయుర్వేద వైద్యశాల వైద్యుడు రంగనాధ్ తెలిపారు. గత 18 సంవత్సరాలుగా నిరంతరంగా ప్రజలకు సేవలందించడం తనకు ఎంతో ఆనందంగా ఉందన్నారు. ప్రాచీన భారతీయ వైద్య విధానమైన ఆయుర్వేదాన్ని ఆధునిక చికిత్సా సదుపాయాలతో కలిపి ప్రజలకు చేరువ చేయడం తమ లక్ష్యమని చెప్పారు. ముఖ్యంగా కేరళ తరహా పంచకర్మ చికిత్సలు, క్షారసూత్ర విధానం ద్వారా మూలవ్యాధి నివారణ, జలూక చికిత్స ద్వారా రక్తశుద్ధి, శిరోధార ద్వారా మానసిక ఒత్తిడి తగ్గింపు వంటి ప్రత్యేక చికిత్సలను అందిస్తున్నామని వివరించారు. దీర్ఘకాలిక నొప్పులు, సంధివాతం, చర్మవ్యాధులు, జీర్ణ సంబంధ సమస్యలకు సహజసిద్ధమైన మందులతో మెరుగైన ఫలితాలు సాధిస్తున్నామన్నారు. అవసరమైన అన్ని ఆయుర్వేద ఔషధాలను స్థానికంగానే అందుబాటులో ఉంచి, తక్కువ ఖర్చుతో నాణ్యమైన సేవలు అందించడం తమ ప్రత్యేకతగా పేర్కొన్నారు. ఇకపై కూడా ప్రజల ఆరోగ్యమే ధ్యేయంగా మరింత మెరుగైన వైద్యసేవలు అందించేందుకు కృషి కొనసాగిస్తామని తెలిపారు.1
- Post by Sk Noori4
- గుంటూరు జిల్లా ప్రజలు సైబర్ నేరాలపట్ల అప్రమత్తంగా ఉండాలని మంగళవారం SP వకుల్ జిందాల్ సూచించారు. ట్రాఫిక్ చలాన్ల చెల్లింపుల పేరుతో వాట్సాప్, ఇతర సామాజిక మాధ్యమాల ద్వారా RTOchallan.APK, echallan.APK ລ້ అనధికార లింకులు వస్తున్నాయని అన్నారు. ప్రజలు తెలియక ఈ లింకులను క్లిక్, డౌన్లోడ్ చేయడంవల్ల వారి మొబైల్ ఫోన్లు హ్యాక్కు గురవుతున్నాయన్నారు. వ్యక్తిగత సమాచారం, బ్యాంకింగ్ వివరాలు చోరీ అవుతాయన్నారు.1