Shuru
Apke Nagar Ki App…
మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కీసరలోని రాంపల్లి ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల హెచ్ఎం సిహెచ్ విజయలక్ష్మి రోడ్డుపై చిత్తు కాగితాలు ఏరుకునే ముగ్గురు బాలురను చూసి బడికి తీసుకువెళ్లారు. అక్కడ చదువుకుంటున్న విద్యార్థులను చూపిస్తూ, వారిలాగే మీరు కూడా ప్రతిరోజూ స్కూల్ కి రావాలని ఆ బాలురను కోరారు. అనంతరం ఆ పిల్లల తల్లిదండ్రులకు ఫోన్ చేసి, బడి ఈడు పిల్లలను పనులకు పంపవద్దని హితబోధ చేశారు. ప్రభుత్వ స్కూల్లో భోజనం, పుస్తకాలు, డ్రెస్సులు ఉచితంగా ఇస్తారని, చదువు ద్వారానే మంచి భవిష్యత్తు లభిస్తుందని విజయలక్ష్మి వారికి వివరించారు.
Telangana news
మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కీసరలోని రాంపల్లి ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల హెచ్ఎం సిహెచ్ విజయలక్ష్మి రోడ్డుపై చిత్తు కాగితాలు ఏరుకునే ముగ్గురు బాలురను చూసి బడికి తీసుకువెళ్లారు. అక్కడ చదువుకుంటున్న విద్యార్థులను చూపిస్తూ, వారిలాగే మీరు కూడా ప్రతిరోజూ స్కూల్ కి రావాలని ఆ బాలురను కోరారు. అనంతరం ఆ పిల్లల తల్లిదండ్రులకు ఫోన్ చేసి, బడి ఈడు పిల్లలను పనులకు పంపవద్దని హితబోధ చేశారు. ప్రభుత్వ స్కూల్లో భోజనం, పుస్తకాలు, డ్రెస్సులు ఉచితంగా ఇస్తారని, చదువు ద్వారానే మంచి భవిష్యత్తు లభిస్తుందని విజయలక్ష్మి వారికి వివరించారు.
More news from తెలంగాణ and nearby areas
- తెలంగాణ మేధావులు, రిటైర్డ్ ఇంజనీర్లపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేస్తూ బూతుల పర్వం లంకించుకున్నారు. కన్నెపల్లి మోటార్లను వెంటనే ఆన్ చేయాలని లేఖ రాసినందుకు రిటైర్డ్ ఇంజనీర్లపై ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. రిటైర్డ్ ఇంజనీర్లు వచ్చి తనకు బేవకూఫ్ సలహాలు ఇస్తున్నారని మండిపడ్డారు. వీళ్ళని బొక్కలో వేయకపోవడమే తాను చేసిన తప్పని, తెలంగాణ మేధావులను, రిటైర్డ్ ఇంజనీర్లను బొక్కలో వేయాలని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.1
- మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కూకట్‌పల్లిలో బయోటెక్ పరిశ్రమ కోసం టాప్సే (Topse) సంస్థ తన అధునాతన టర్న్‌కీ ప్రాసెస్ సొల్యూషన్స్‌ను ప్రదర్శించింది.1
- Post by Assalamualikumjj3
- సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు పరిధిలోని బొల్లారం ప్రాంతంలో ప్రస్తుతం ఓటర్ల ప్రత్యేక పరిశీలన (SIR – Special Intensive Revision) ప్రక్రియ కొనసాగుతోంది. ఈ ప్రక్రియలో భాగంగా బీఎల్‌ఓలు (BLOs) ఇంటింటికీ వెళ్లి ఎస్ఐఆర్ ఫారాలను పంపిణీ చేస్తున్నారు. అయితే, చాలా మందికి ఈ ఫారం ఎలా నింపాలో తెలియక ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఈ ఫారాలను అందుకున్న ఓటర్లు కొన్ని ముఖ్యమైన విషయాలను గుర్తుంచుకోవాలి. బీఎల్‌ఓల నుంచి ఫారం అందుకున్న రెండు రోజుల్లోపు దానిని పూర్తిగా పూర్తి చేసి తిరిగి వారికే అందజేయాల్సి ఉంటుంది. ఒకవేళ ఫారం నింపడంలో ఏవైనా సందేహాలు ఉంటే సహాయం అందుబాటులో ఉంది. దీని కోసం బొల్లారంలోని బీజేపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన హెల్ప్ డెస్క్ లేదా ప్రభుత్వ అధికారులు ఏర్పాటు చేసిన కేంద్రాలను సంప్రదించి సహాయం పొందవచ్చు.1
- మెదక్ జిల్లా రామాయంపేట మున్సిపాలిటీ 8వ వార్డులో ప్రత్యేక సమగ్ర ఓటరు జాబితా సవరణ (ఎస్‌ఐఆర్) ప్రక్రియ వేగంగా సాగుతోంది. బూత్ నంబర్-78 పరిధిలో మొత్తం 688 మంది ఓటర్లు ఉండగా, వారిలో ఇప్పటికే 390 మంది వివరాల డిజిటలైజేషన్ పూర్తయిందని వార్డు కౌన్సిలర్ శంకర్ గౌడ్ వెల్లడించారు. మిగిలిన ఓటర్లు కూడా గడువు ముగిసేలోపు తమ వివరాలను నమోదు చేసుకునేలా బూత్ లెవల్ ఏజెంట్లు (బీఎల్ఏలు) ఇంటింటికీ వెళ్లి అవగాహన కల్పిస్తున్నారు. ప్రతి అర్హ ఓటరు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని, ఓటరు జాబితాలో తమ వివరాలు సక్రమంగా నమోదయ్యేలా సహకరించాలని ఆయన కోరారు.1
- బాలికపై నిందితుడు అఘాయిత్యం చేసిన సమయంలో అతడిని పట్టుకోకుండా, అతనికి యాంటిసిపేటరీ బెయిల్ వచ్చేలా పోలీసులతో పాటు ప్రభుత్వమే సహకరించిందని హరీష్ రావు తీవ్ర ఆరోపణలు చేశారు. ఈ రోజు ఏకంగా ఆరుగురిని అతి దారుణంగా హత్య చేసినప్పటికీ, పోలీసులు ఇంకా ఆ నిందితుడిని పట్టుకోవడంలో విఫలమయ్యారని ఆయన మండిపడ్డారు. ఈ దారుణ ఉదంతం తర్వాత ఆ బాలిక కుటుంబంలో ఇప్పుడు ఒకే ఒక అమ్మాయి మిగిలిందని హరీష్ రావు ఆవేదన వ్యక్తం చేశారు. మూగ, చెవిటి, మరియు నడవలేని స్థితిలో ఉంటూ పూర్తిగా కుటుంబంపైనే ఆధారపడిన ఆ అమ్మాయి పరిస్థితిని తలుచుకుంటేనే తీవ్ర బాధగా ఉందంటూ ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.1
- గోదావరిలో కళ్ల ముందే లక్ష క్యూసెక్కుల నీరు వరదలా కిందకు పోతుంటే, అక్కడ ఎత్తిపోయడానికి నీళ్లు లేవని చెప్పడం బుర్రతక్కువతనం అని కేటీఆర్ విమర్శించారు. రైతుల కోసం ఈ పని చేయమన్నవాళ్లు తెలివిలేనివాళ్లా అని ఆయన ప్రశ్నించారు. కన్నెపల్లి వద్ద 93 మీటర్ల నుంచే నీళ్లు ఎత్తిపోసే అవకాశం ఉన్నప్పటికీ, రాజకీయ ద్వేషంతో కళ్లు మూసుకున్న రేవంత్ రెడ్డి బుర్రతక్కువ వాడో కాదో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. మేడిగడ్డ వద్ద 97 మీటర్ల ఎత్తులో నీరు ప్రవహిస్తుంటే, కళ్లుండి కూడా చూడలేని రేవంత్ రెడ్డి తెలివిలేనివాడా, లేక వాస్తవాలు చూపిస్తున్న తాము తెలివిలేనివాళ్లమా అని నిలదీశారు. పోలవరం ప్రాజెక్టు వల్ల మునిగిపోయే భద్రాచలాన్ని పట్టుకొని, మేడిగడ్డ వల్లే మునిగిపోతోందని అంటున్న రేవంత్ రెడ్డికి అస్సలు బుర్రలేదని కేటీఆర్ మండిపడ్డారు. రైతాంగం మొత్తం కన్నెపల్లి నుంచి నీళ్లివ్వాలని అడుగుతుంటే పట్టించుకోని వాడిని బుర్రతక్కువ వాడు అనాలా లేక లుచ్చా అనాలా అని ప్రశ్నించారు. తన గురువు కోసం నీళ్లను కిందకు వదులుతున్నావా అని రైతులు అడుగుతుంటే, దానికి సమాధానం చెప్పే దమ్ము లేని దద్దమ్మ అనాలా లేక దరిద్రుడు అనాలా అంటూ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.1
- మెదక్ జిల్లా చేగుంటలో ఒక హృదయ విదారక ఘటన చోటుచేసుకుంది. ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న క్రమంలో ఒక తల్లి కన్నుమూయగా, ఆ విషయం తెలియని ఆమె ఇద్దరు చిన్న పిల్లలు (ఒక బాబు, ఒక పాప) రోజంతా ఆమె మృతదేహం పక్కనే కూర్చుండిపోయారు. ఎవరైనా వచ్చి తమకు సహాయం చేస్తారేమోనని ఆ చిన్నారులు ఆశగా ఎదురుచూశారు. ఈ కుటుంబ పరిస్థితి అత్యంత దయనీయంగా మారింది. వీరి తండ్రి ఇదివరకే మరణించడంతో, ఇప్పుడు తల్లి కూడా దూరమై ఆ చిన్నారులు పూర్తిగా అనాథలయ్యారు. ఆసుపత్రిలో తక్షణమే ఆదుకునేందుకు బంధువులు ఎవరూ లేకపోవడంతో, ఉదయం నుండి సాయంత్రం వరకు ఆ చిన్నారులు మృతదేహం వద్దే దిక్కుతోచని స్థితిలో నిరీక్షించాల్సి వచ్చింది.1