logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

ఆర్టీసీ సమ్మెకు కాంగ్రెస్ మినహా అన్ని రాజకీయ పార్టీలు మద్దతు...కరీంనగర్ బస్ స్టేషన్ లో ధర్నా చేసిన తెలంగాణ రాజ్యాధికార పార్టీ నాయకుల అరెస్టు ఆర్టీసీ ఉద్యోగుల సమ్మెకు అధికార పార్టీ కాంగ్రెస్ మినహా అన్ని రాజకీయ పార్టీలు మద్దతు తెలిపాయి. సమ్మెకు సంఘీభావంగా కరీంనగర్లో ఆర్టీసీ ఉద్యోగుల ధర్నాలో బిజెపి బిఆర్ఎస్ తోపాటు రాజకీయ పార్టీల నాయకులు పాల్గొన్నారు.‌ రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ఆర్టీసీ ఉద్యోగుల సమస్యలు వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఆర్టీసీని ప్రైవేటీకరించేందుకే ప్రభుత్వం కుట్రపూరితంగా వ్యవహరిస్తుందని ఆరోపించారు.‌ ఆర్టీసీ ఉద్యోగుల ధర్నాలో తెలంగాణ రాజ్యాధికార పార్టీ నాయకులు పాల్గొని ఆందోళన వ్యక్తం చేశారు. కరీంనగర్ వన్ డిపో ముందు ధర్నాతో బస్సులను అడ్డుకునేందుకు ప్రయత్నించడంతో పోలీసులు భారీగా మోహరించి పలువురిని అరెస్టు చేశారు. ఉద్యోగుల సమ్మెలో శాంతియతంగా రాజకీయ పార్టీలు పాల్గొంటే ఎవరికి అభ్యంతరం ఉండదని ధర్నా రాస్తారోకోలతో బస్సులను అడ్డుకోవాలని చూస్తే చట్టపకారం చర్యలు తీసుకోక తప్పదని సిపి గౌస్ ఆలం హెచ్చరించారు. డిపో ముందు ధర్నాకు దిగిన తెలంగాణ రాజ్యాధికార పార్టీ జిల్లా అధ్యక్షులు అఖిల్ పాషాతో సహా పలువుర్ని అరెస్టు చేసి స్టేషన్ కు తరలించారు. ఉద్యోగులు శాంతియుత నిరసన ఆందోళన చేస్తే ఎవరికి అభ్యంతరం లేదని రాజకీయ పార్టీలు వచ్చి ఆందోళన చేస్తు బస్సులను అడ్డుకోవాలని ప్రయత్నిస్తే చర్యలు తీసుకోక తప్పదని పోలీసులు హెచ్చరించారు.

5 hrs ago
user_K.V.REDDY
K.V.REDDY
చిగురుమామిడి, కరీంనగర్, తెలంగాణ•
5 hrs ago

ఆర్టీసీ సమ్మెకు కాంగ్రెస్ మినహా అన్ని రాజకీయ పార్టీలు మద్దతు...కరీంనగర్ బస్ స్టేషన్ లో ధర్నా చేసిన తెలంగాణ రాజ్యాధికార పార్టీ నాయకుల అరెస్టు ఆర్టీసీ ఉద్యోగుల సమ్మెకు అధికార పార్టీ కాంగ్రెస్ మినహా అన్ని రాజకీయ పార్టీలు మద్దతు తెలిపాయి. సమ్మెకు సంఘీభావంగా కరీంనగర్లో ఆర్టీసీ ఉద్యోగుల ధర్నాలో బిజెపి బిఆర్ఎస్

తోపాటు రాజకీయ పార్టీల నాయకులు పాల్గొన్నారు.‌ రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ఆర్టీసీ ఉద్యోగుల సమస్యలు వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఆర్టీసీని ప్రైవేటీకరించేందుకే ప్రభుత్వం కుట్రపూరితంగా వ్యవహరిస్తుందని ఆరోపించారు.‌ ఆర్టీసీ ఉద్యోగుల ధర్నాలో తెలంగాణ రాజ్యాధికార పార్టీ నాయకులు పాల్గొని ఆందోళన వ్యక్తం చేశారు. కరీంనగర్ వన్ డిపో

ముందు ధర్నాతో బస్సులను అడ్డుకునేందుకు ప్రయత్నించడంతో పోలీసులు భారీగా మోహరించి పలువురిని అరెస్టు చేశారు. ఉద్యోగుల సమ్మెలో శాంతియతంగా రాజకీయ పార్టీలు పాల్గొంటే ఎవరికి అభ్యంతరం ఉండదని ధర్నా రాస్తారోకోలతో బస్సులను అడ్డుకోవాలని చూస్తే చట్టపకారం చర్యలు తీసుకోక తప్పదని సిపి గౌస్ ఆలం హెచ్చరించారు. డిపో ముందు ధర్నాకు దిగిన

తెలంగాణ రాజ్యాధికార పార్టీ జిల్లా అధ్యక్షులు అఖిల్ పాషాతో సహా పలువుర్ని అరెస్టు చేసి స్టేషన్ కు తరలించారు. ఉద్యోగులు శాంతియుత నిరసన ఆందోళన చేస్తే ఎవరికి అభ్యంతరం లేదని రాజకీయ పార్టీలు వచ్చి ఆందోళన చేస్తు బస్సులను అడ్డుకోవాలని ప్రయత్నిస్తే చర్యలు తీసుకోక తప్పదని పోలీసులు హెచ్చరించారు.

More news from తెలంగాణ and nearby areas
  • రాజన్న సిరిసిల్ల జిల్లాలో గాలివాన వర్షం బీభత్సం సృష్టించింది. గోడ కూలి ఆరుగురు గాయపడగా ఇద్దరు పరిస్థితి విషమంగా ఉంది. అకాల వర్షం గాలివాన సిరిసిల్ల ప్రజలను ఆందోళన గురిచేస్తుంది. ఒక్కసారి కురిసిన గాలి వాన బీభత్సం సృష్టించింది. గాలికి చెట్లు విరిగిపడ్డాయి. ఇంటి పైకప్పులు లేచిపోయాయి. విద్యుత్ స్తంభాలు విరిగి, కరెంట్ వైరస్లు తెగి పవర్ సప్లై నిలిచిపోయింది. కటౌట్లు, బారీగేట్లు, ఫ్లెక్సీలు గాలికి కొట్టుకొచ్చి రోడ్లపై పడిపోయాయి. రోడ్లపై చెట్లు అస్తవ్యస్తంగా పడిపోవడంతో ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది. గాలివానకు ఓ ఇల్లు ధ్వంసమైంది. గోడ కూలి ఆరుగురు గాయపడ్డారు. స్థానికులు వెంటనే ఆసుపత్రికి తరలించగా అందులో ఇద్దరు పరిస్థితి విషమంగా ఉందని కరీంనగర్ ఆసుపత్రికి తరలించారు. సిరిసిల్ల బైపాస్ రోడ్డు పరిసర ప్రాంతాల్లో గాలివాన ధాటిక రేకులు గాల్లోకి ఎగిరి రోడ్డుపై పడటంతో వాహనదారులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. ఉధృతమైన గాలులకు పలు చోట్ల వృక్షాలు నేలకూలగా, మరికొన్ని చోట్ల భారీ చెట్ల కొమ్మలు విరిగి రోడ్లపై పడ్డాయి. మున్సిపల్, విపత్తు నిర్వహణ అధికారులు తక్షణమే స్పందించి సహాయక చర్యలు చేపట్టారు. రోడ్లపై అడ్డంగా ఉన్న చెట్లను, శిథిలాలను తొలగించి రాకపోకలను పునరుద్ధరించారు. కాలి వానకు తోడు అకాల వర్షం అన్నదాతలు అందులో గురిచేస్తుంది. కల్లాల్లో దాన్యం తడిసిపోగా చేతికందే దశలో ఉన్న పంటలకు నష్టం వాటిల్లే పరిస్థితి ఏర్పడింది.‌ అకాల వర్షం ఆగం చేస్తుందని అన్నదాతలు ఆవేదనతో ఆందోళన చెందుతున్నారు.
    4
    రాజన్న సిరిసిల్ల జిల్లాలో గాలివాన వర్షం బీభత్సం సృష్టించింది. గోడ కూలి ఆరుగురు గాయపడగా ఇద్దరు పరిస్థితి విషమంగా ఉంది. అకాల వర్షం గాలివాన సిరిసిల్ల ప్రజలను ఆందోళన గురిచేస్తుంది. ఒక్కసారి కురిసిన గాలి వాన బీభత్సం సృష్టించింది. గాలికి చెట్లు విరిగిపడ్డాయి.  ఇంటి పైకప్పులు లేచిపోయాయి. విద్యుత్ స్తంభాలు విరిగి, కరెంట్ వైరస్లు తెగి పవర్ సప్లై  నిలిచిపోయింది. కటౌట్లు, బారీగేట్లు, ఫ్లెక్సీలు గాలికి కొట్టుకొచ్చి రోడ్లపై పడిపోయాయి. రోడ్లపై చెట్లు అస్తవ్యస్తంగా పడిపోవడంతో ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది. గాలివానకు ఓ ఇల్లు ధ్వంసమైంది. గోడ కూలి ఆరుగురు గాయపడ్డారు. స్థానికులు వెంటనే ఆసుపత్రికి తరలించగా అందులో ఇద్దరు పరిస్థితి విషమంగా ఉందని కరీంనగర్ ఆసుపత్రికి తరలించారు. సిరిసిల్ల బైపాస్ రోడ్డు పరిసర ప్రాంతాల్లో గాలివాన ధాటిక రేకులు గాల్లోకి ఎగిరి రోడ్డుపై పడటంతో వాహనదారులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. ఉధృతమైన గాలులకు పలు చోట్ల వృక్షాలు నేలకూలగా, మరికొన్ని చోట్ల భారీ చెట్ల కొమ్మలు విరిగి రోడ్లపై పడ్డాయి. మున్సిపల్, విపత్తు నిర్వహణ అధికారులు తక్షణమే స్పందించి సహాయక చర్యలు చేపట్టారు. రోడ్లపై అడ్డంగా ఉన్న చెట్లను, శిథిలాలను తొలగించి రాకపోకలను పునరుద్ధరించారు. కాలి వానకు తోడు అకాల వర్షం అన్నదాతలు అందులో గురిచేస్తుంది. కల్లాల్లో దాన్యం తడిసిపోగా చేతికందే దశలో ఉన్న పంటలకు నష్టం వాటిల్లే పరిస్థితి ఏర్పడింది.‌
అకాల వర్షం ఆగం చేస్తుందని అన్నదాతలు ఆవేదనతో ఆందోళన చెందుతున్నారు.
    user_K.V.REDDY
    K.V.REDDY
    చిగురుమామిడి, కరీంనగర్, తెలంగాణ•
    1 hr ago
  • బెజ్జంకి మండల కేంద్రంలోని మార్కెట్ యార్డ్‌లో ధాన్యం కొనుగోలు కేంద్రాలను మానకొండూరు మాజీ ఎమ్మెల్యే డా. రసమయి బాలకిషన్ పరిశీలించారు. ఈ సందర్భంగా రైతులతో మాట్లాడిన ఆయన, మక్క మరియు ప్రొద్దుతిరుగుడు కొనుగోళ్లు నత్తనడకన సాగుతున్నాయని విమర్శించారు. తూకం ప్రక్రియలో ఆలస్యం, కోటా పేరుతో పరిమిత కొనుగోళ్లు, మాయిశ్చర్ కారణంగా ఇబ్బందులు పెడుతున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. మార్కెట్ యార్డ్‌లో త్రాగునీరు, విశ్రాంతి గదులు వంటి కనీస వసతులు లేకపోవడం దురదృష్టకరమని ఆయన పేర్కొన్నారు. కొనుగోళ్లు వేగవంతం చేసి రైతులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. రైతుల సమస్యలు పరిష్కారం అయ్యే వరకు వారి పక్షాన నిలుస్తామని తెలిపారు.
    1
    బెజ్జంకి మండల కేంద్రంలోని మార్కెట్ యార్డ్‌లో ధాన్యం కొనుగోలు కేంద్రాలను మానకొండూరు మాజీ ఎమ్మెల్యే డా. రసమయి బాలకిషన్ పరిశీలించారు. ఈ సందర్భంగా రైతులతో మాట్లాడిన ఆయన, మక్క మరియు ప్రొద్దుతిరుగుడు కొనుగోళ్లు నత్తనడకన సాగుతున్నాయని విమర్శించారు. తూకం ప్రక్రియలో ఆలస్యం, కోటా పేరుతో పరిమిత కొనుగోళ్లు, మాయిశ్చర్ కారణంగా ఇబ్బందులు పెడుతున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు.
మార్కెట్ యార్డ్‌లో త్రాగునీరు, విశ్రాంతి గదులు వంటి కనీస వసతులు లేకపోవడం దురదృష్టకరమని ఆయన పేర్కొన్నారు. కొనుగోళ్లు వేగవంతం చేసి రైతులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. రైతుల సమస్యలు పరిష్కారం అయ్యే వరకు వారి పక్షాన నిలుస్తామని తెలిపారు.
    user_ప్రభాకర్
    ప్రభాకర్
    Farmer బెజ్జంకి, సిద్దిపేట, తెలంగాణ•
    3 hrs ago
  • Post by User4017 Budhiya Kan ke
    2
    Post by User4017 Budhiya Kan ke
    user_User4017 Budhiya Kan ke
    User4017 Budhiya Kan ke
    నంగ్నూర్, సిద్దిపేట, తెలంగాణ•
    23 min ago
  • తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు గౌరవనీయులు రేవంత్ రెడ్డి శ్రీవాసవి కన్యకా పరమేశ్వరి మాత జయంతిని రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా ప్రకటించినందుకు కరీంనగర్ జిల్లా ఆర్యవైశ్య మహోత్సవం అధ్యక్షులు కన్న కృష్ణ ఆధ్వర్యంలో రాష్ట్ర ముఖ్యమంత్రి కి కృతజ్ఞతలు తెలియజేయడం జరిగింది కార్యక్రమంలో రాష్ట్ర నాయకులతోపాటు జిల్లా నాయకులు సేవాదళ్ నాయకులు జిల్లా యువజన నాయకులు పాల్గొని కృతజ్ఞతలు తెలియజేశారు
    1
    తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు గౌరవనీయులు రేవంత్ రెడ్డి 
శ్రీవాసవి కన్యకా పరమేశ్వరి మాత జయంతిని రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా ప్రకటించినందుకు కరీంనగర్ జిల్లా ఆర్యవైశ్య మహోత్సవం అధ్యక్షులు కన్న కృష్ణ ఆధ్వర్యంలో రాష్ట్ర ముఖ్యమంత్రి కి కృతజ్ఞతలు తెలియజేయడం జరిగింది 
కార్యక్రమంలో రాష్ట్ర నాయకులతోపాటు జిల్లా నాయకులు సేవాదళ్ నాయకులు 
జిల్లా యువజన నాయకులు పాల్గొని కృతజ్ఞతలు తెలియజేశారు
    user_OM NAMSHIVAYA
    OM NAMSHIVAYA
    Karimnagar, Telangana•
    2 hrs ago
  • మండల కేంద్రంలోని శ్రీ వెంకటేశ్వర ఫంక్షన్ హాల్‌లో నిర్వహించిన శ్రీ హనుమాన్ హిందూ సమ్మేళనం ఘనంగా, ఉత్సాహభరిత వాతావరణంలో విజయవంతంగా జరిగింది. ఈ కార్యక్రమానికి మండలంలోని వివిధ హిందూ సంఘాల ప్రతినిధులు, పెద్ద సంఖ్యలో భక్తులు, యువత పాల్గొని కార్యక్రమానికి ప్రత్యేక శోభను తీసుకువచ్చారు. కార్యక్రమం భక్తి, ఆధ్యాత్మికత, ఐక్యత సందేశాలతో నిండి సాగింది. ప్రారంభంలో హనుమాన్ స్వామి ఆశీర్వాదాలతో ప్రారంభమైంది.
    1
    మండల కేంద్రంలోని శ్రీ వెంకటేశ్వర ఫంక్షన్ హాల్‌లో నిర్వహించిన శ్రీ హనుమాన్ హిందూ సమ్మేళనం ఘనంగా, ఉత్సాహభరిత వాతావరణంలో విజయవంతంగా జరిగింది. ఈ కార్యక్రమానికి మండలంలోని వివిధ హిందూ సంఘాల ప్రతినిధులు, పెద్ద సంఖ్యలో భక్తులు, యువత పాల్గొని కార్యక్రమానికి ప్రత్యేక శోభను తీసుకువచ్చారు. కార్యక్రమం భక్తి, ఆధ్యాత్మికత, ఐక్యత సందేశాలతో నిండి సాగింది. ప్రారంభంలో హనుమాన్ స్వామి ఆశీర్వాదాలతో ప్రారంభమైంది.
    user_Vodnala thirupthi
    Vodnala thirupthi
    గన్నేరువరం, కరీంనగర్, తెలంగాణ•
    4 hrs ago
  • కొనుగోలు కేంద్రాల్లోనే మద్దతు ధర రైతులు సన్నరకం వడ్లు సాగు చేయాలి జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ తంగళ్లపల్లి మండలం గోపాలరావుపల్లెలో ఐకేపీ కొనుగోలు కేంద్రంలో పరిశీలన ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లోనే రైతులకు మద్దతు ధర అందుతుందని జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ తెలిపారు. తంగళ్లపల్లి మండలం గోపాలరావుపల్లె గ్రామంలో ఐకేపీ ఆద్వర్యంలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాన్ని గురువారం జిల్లా కలెక్టర్ తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కొనుగోలు కేంద్రంలో కల్పించిన వసతులను పరిశీలించారు. ఎంత ధాన్యం వస్తుందని, గన్ని బ్యాగ్స్ పై నిర్వాహకులను ఆరా తీశారు. ధాన్యం తేమ శాతం పరిశీలించారు. హమాలీలు ఎందరు ఉన్నారో అడిగి తెలుసుకున్నారు. జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ మాట్లాడుతూ.. కొనుగోలు కేంద్రంలో అన్ని వివరాలతో ఫ్లెక్సీ ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ధాన్యాన్ని ప్యాడీ క్లీనర్ తో శుభ్రం చేయించాలని సూచించారు. టార్పాలిన్లు అందుబాటులో ఉండాలని తెలిపారు. ధాన్యం కొనుగోలు చేసిన వివరాలు ఎప్పటికప్పుడు ఆన్లైన్లో నమోదు చేయాలని ఆదేశించారు. నిబంధనల ప్రకారం అన్ని వసతులు కల్పించాలని సూచించారు. కేటాయించిన మిల్లులకు ధాన్యం తరలించేందుకు ఏర్పాట్లు చేసుకోవాలని సూచించారు. రానున్న సీజన్ లో రైతులు సన్నరకం వడ్లు సాగు చేయాలని పిలుపు నిచ్చారు. రైతులు కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ సూచించారు.పరిశీలనలో జిల్లా పౌర సరఫరాల అధికారి బుచ్చిబాబు, మేనేజర్ నరసింహ, తహసీల్దార్ విజయ్ ప్రకాశ్ రావు, ఏపీఎం, ఏవో తదితరులు పాల్గొన్నారు.
    1
    కొనుగోలు కేంద్రాల్లోనే మద్దతు ధర
రైతులు సన్నరకం వడ్లు సాగు చేయాలి
జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్
తంగళ్లపల్లి మండలం గోపాలరావుపల్లెలో ఐకేపీ కొనుగోలు కేంద్రంలో పరిశీలన
ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లోనే రైతులకు మద్దతు ధర అందుతుందని జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ తెలిపారు. తంగళ్లపల్లి మండలం గోపాలరావుపల్లె గ్రామంలో ఐకేపీ ఆద్వర్యంలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాన్ని గురువారం జిల్లా కలెక్టర్ తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కొనుగోలు కేంద్రంలో కల్పించిన వసతులను పరిశీలించారు. ఎంత ధాన్యం వస్తుందని, గన్ని బ్యాగ్స్ పై నిర్వాహకులను ఆరా తీశారు. ధాన్యం తేమ శాతం పరిశీలించారు. హమాలీలు ఎందరు ఉన్నారో అడిగి తెలుసుకున్నారు. జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ మాట్లాడుతూ.. కొనుగోలు కేంద్రంలో అన్ని వివరాలతో ఫ్లెక్సీ ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ధాన్యాన్ని ప్యాడీ క్లీనర్ తో శుభ్రం చేయించాలని సూచించారు. టార్పాలిన్లు అందుబాటులో ఉండాలని తెలిపారు. ధాన్యం కొనుగోలు చేసిన వివరాలు ఎప్పటికప్పుడు ఆన్లైన్లో నమోదు చేయాలని ఆదేశించారు. నిబంధనల ప్రకారం అన్ని వసతులు కల్పించాలని సూచించారు.
కేటాయించిన మిల్లులకు ధాన్యం తరలించేందుకు ఏర్పాట్లు చేసుకోవాలని సూచించారు. రానున్న సీజన్ లో రైతులు సన్నరకం వడ్లు సాగు చేయాలని పిలుపు నిచ్చారు. రైతులు కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ సూచించారు.పరిశీలనలో జిల్లా పౌర సరఫరాల అధికారి బుచ్చిబాబు, మేనేజర్ నరసింహ, తహసీల్దార్ విజయ్ ప్రకాశ్ రావు, ఏపీఎం, ఏవో తదితరులు పాల్గొన్నారు.
    user_Satheesh gangu
    Satheesh gangu
    జర్నలిస్ట్ సిరిసిల్ల, రాజన్న సిరిసిల్ల, తెలంగాణ•
    4 hrs ago
  • హనుమకొండ జిల్లా : కార్మికులను అడ్డుకున్న పోలీసులు.. హనుమకొండ లోకల్ డిపో ఎదురుగా నిరసన తెలిపేందుకు వెళుతున్న కార్మికులను పోలీసులు అడ్డుకున్నారు. ఆర్టీసీ ఐకాసా ఆధ్వర్యంలో సుమారు 200 మంది బస్సు డ్రైవర్లు, కండక్టర్లు, ఇతర సిబ్బంది ర్యాలీగా వెళుతుండగా పోలీసులు రాంనగర్ కూడలి వద్ద అడ్డుకున్నారు. తమ న్యాయమైన డిమాండ్ల కోసం శాంతియుతంగా నిరసన తెలిపేందుకు వెళ్తుండగా నియంత్రించడం సరికాదని ఐకాస నేతలు అన్నారు.
    1
    హనుమకొండ జిల్లా : 
కార్మికులను అడ్డుకున్న పోలీసులు..
హనుమకొండ లోకల్ డిపో ఎదురుగా నిరసన తెలిపేందుకు వెళుతున్న కార్మికులను పోలీసులు అడ్డుకున్నారు. ఆర్టీసీ ఐకాసా ఆధ్వర్యంలో సుమారు 200 మంది బస్సు డ్రైవర్లు, కండక్టర్లు, ఇతర సిబ్బంది ర్యాలీగా వెళుతుండగా పోలీసులు రాంనగర్ కూడలి వద్ద అడ్డుకున్నారు. తమ న్యాయమైన డిమాండ్ల కోసం శాంతియుతంగా నిరసన తెలిపేందుకు వెళ్తుండగా నియంత్రించడం సరికాదని ఐకాస నేతలు అన్నారు.
    user_Amar valmhikhi
    Amar valmhikhi
    ఎల్కతుర్తి, హనుమకొండ, తెలంగాణ•
    6 hrs ago
  • జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలం నమిలకొండ గ్రామంలో అధికారుల నిర్లక్ష్యం వల్ల 8 ఏళ్లుగా పింఛన్ నగదు పక్కదారి పట్టిన ఘటన వెలుగులోకి వచ్చింది. నమిలకొండ గ్రామానికి చెందిన మల్యాల లక్ష్మికి 2017 జూన్ 12న బీడీ కార్మికుల పింఛన్ మంజూరయింది. ఆమె ఖాతాలో జమ కావాల్సిన డబ్బులు గత 8 ఏళ్ళుగా అదే గ్రామానికి చెందిన మరో మహిళ ఖాతాలో జమ అవుతున్నట్లు తాజాగా బయటపడింది. పింఛన్ రాకపోవడంతో లక్ష్మి పలుమార్లు మండల పరిషత్ కార్యాలయాన్ని ఆశ్రయించి, అధికారుల సూచనల మేరకు పునఃదరఖాస్తులు చేసుకున్నప్పటికీ సమస్య పరిష్కారం కాలేదు. ఇదే సమయంలో 2019లో పింఛన్ మొత్తాన్ని 1000 నుంచి 2016కు పెంచిన ప్రొసిడింగ్ జారీ కావడం అనుమానాలకు తావిస్తోంది. తాజాగా అధికారులను నిలదీయడంతో పింఛన్ ఐడీ ఆధారంగా విచారణ జరిపినప్పుడు, వేరే ఖాతాలో డబ్బులు జమ అవుతున్న విషయం స్పష్టమైంది. ఈ అనిర్లక్ష్యం కారణంగా లక్ష్మికి 1,88,296 రూపాయల నష్టం జరిగినట్లు ఆమె ఆరోపిస్తోంది. లక్ష్మి తన భర్తతో కలిసి సంబంధిత మహిళను సంప్రదించినప్పటికీ, “ఈ డబ్బులు ఇవ్వం… ఎవరికి చెప్పుకుంటారో చెప్పుకోండి” అంటూ దురుసుగా ప్రవర్తించినట్లు బాధితురాలు తెలిపారు. డబ్బులు మా గ్రామానికి చెందిన మరో మహిళ ఖాతాలో పడుతున్నాయి. ఎన్నిసార్లు అధికారుల చుట్టూ తిరిగినా ప్రయోజనం లేకపోయిందని, మా పరిస్థితి దయనీయంగా ఉందని న్యాయం చేసి పింఛన్ ఇప్పించాలని కోరారు. ఆమె ఖాతాలో జమ అయిన మొత్తాన్ని రికవరీ చేయాలని లక్ష్మి వేడుకున్నారు.
    1
    జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలం నమిలకొండ గ్రామంలో అధికారుల నిర్లక్ష్యం వల్ల 8 ఏళ్లుగా పింఛన్ నగదు పక్కదారి పట్టిన ఘటన వెలుగులోకి వచ్చింది. నమిలకొండ గ్రామానికి చెందిన మల్యాల లక్ష్మికి 2017 జూన్ 12న బీడీ కార్మికుల పింఛన్ మంజూరయింది. ఆమె ఖాతాలో జమ కావాల్సిన డబ్బులు గత 8 ఏళ్ళుగా అదే గ్రామానికి చెందిన మరో మహిళ ఖాతాలో జమ అవుతున్నట్లు తాజాగా బయటపడింది.
పింఛన్ రాకపోవడంతో లక్ష్మి పలుమార్లు మండల పరిషత్ కార్యాలయాన్ని ఆశ్రయించి, అధికారుల సూచనల మేరకు పునఃదరఖాస్తులు చేసుకున్నప్పటికీ సమస్య పరిష్కారం కాలేదు. ఇదే సమయంలో 2019లో పింఛన్ మొత్తాన్ని 1000 నుంచి 2016కు పెంచిన ప్రొసిడింగ్ జారీ కావడం అనుమానాలకు తావిస్తోంది.
తాజాగా అధికారులను నిలదీయడంతో పింఛన్ ఐడీ ఆధారంగా విచారణ జరిపినప్పుడు, వేరే ఖాతాలో డబ్బులు జమ అవుతున్న విషయం స్పష్టమైంది. ఈ అనిర్లక్ష్యం కారణంగా లక్ష్మికి 1,88,296 రూపాయల నష్టం జరిగినట్లు ఆమె ఆరోపిస్తోంది.
లక్ష్మి తన భర్తతో కలిసి సంబంధిత మహిళను సంప్రదించినప్పటికీ, “ఈ డబ్బులు ఇవ్వం… ఎవరికి చెప్పుకుంటారో చెప్పుకోండి” అంటూ దురుసుగా ప్రవర్తించినట్లు బాధితురాలు తెలిపారు. డబ్బులు మా గ్రామానికి చెందిన మరో మహిళ ఖాతాలో పడుతున్నాయి. ఎన్నిసార్లు అధికారుల చుట్టూ తిరిగినా ప్రయోజనం లేకపోయిందని, మా పరిస్థితి దయనీయంగా ఉందని న్యాయం చేసి పింఛన్ ఇప్పించాలని కోరారు. ఆమె ఖాతాలో జమ అయిన మొత్తాన్ని రికవరీ చేయాలని లక్ష్మి వేడుకున్నారు.
    user_K.V.REDDY
    K.V.REDDY
    చిగురుమామిడి, కరీంనగర్, తెలంగాణ•
    4 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.