Shuru
Apke Nagar Ki App…
శ్రీ లక్ష్మీ గణపతి ఆలయం లో శ్రీ పరాభవ నామ సంవత్సర ఉగాది వేడుకలు శాంతి ధ్వజా రోహణ ఆవిష్కరణ... జగిత్యాల పట్టణంలోని శ్రీ లక్ష్మీ గణపతి ఆలయంలో ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకొని గురువారం ఉదయం స్వామివారికి ప్రత్యేక పూజలను నిర్వహించారు. ఈ సందర్భంగా విశేష సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు.
Venu Gopal
శ్రీ లక్ష్మీ గణపతి ఆలయం లో శ్రీ పరాభవ నామ సంవత్సర ఉగాది వేడుకలు శాంతి ధ్వజా రోహణ ఆవిష్కరణ... జగిత్యాల పట్టణంలోని శ్రీ లక్ష్మీ గణపతి ఆలయంలో ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకొని గురువారం ఉదయం స్వామివారికి ప్రత్యేక పూజలను నిర్వహించారు. ఈ సందర్భంగా విశేష సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు.
More news from తెలంగాణ and nearby areas
- దక్షిణ కాశీగా పేరుగాంచిన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారిని భీమన్న ఆలయంలో భక్తులు ఉగాది సందర్భంగా దర్శించుకుని మొక్కలను చెల్లించుకున్నారు1
- Post by KR NEWS 3691
- జగిత్యాల జిల్లా మాదాపూర్ లో యూట్యూబర్ వైష్ణవి హత్య కేసులో మరో ముగ్గురిని పోలీసులు అరెస్టు చేశారు. కోరుట్ల మండలం మాదాపూర్ కు చెందిన యూట్యూబర్ వైష్ణవి ని కోరుట్లకు చెందిన యువకుడు చిత్తారి హరిబాబు ప్రేమించి ఏడాది క్రితం పెళ్ళి చేసుకున్నాడు. ఇటీవలే వైష్ణవి గర్భం దాల్చగా వరకట్నం కోసం భర్త వేధించి చివరకు 17న కత్తితో దాడి చేసి గొంతు నులిమి హత్య చేశాడు. హత్య జరిగిన మరుసటి రోజే పోలీసులు భర్త హరిబాబును అరెస్టు చేశారు. వైష్ణవి హత్య కేసులో హరిబాబు తల్లిదండ్రులతోపాటు సోదరుల ప్రమేయం ఉందని నిర్థారించిన పోలీసులు హరిబాబు తల్లి చిత్తారి లక్ష్మి ఇద్దరు అన్నలు ఆనంద్, అశోక్ లను అరెస్టు చేశారు. వైష్ణవి హత్య కేసులో భర్త తోపాటు నలుగురిని కటకటాల వెనక్కి పంపించినట్లు డిఎస్పీ రాములు తెలిపారు.1
- కామారెడ్డి జిల్లా గాంధారి మండలంలోని పలు గ్రామాల్లో ఉగాది పండుగ సందర్భంగా ముదిరాజ్ సంఘాల ఆధ్వర్యంలో జెండా పండుగ ఘనంగా నిర్వహించారు. మండల కేంద్రంలో కొత్త కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా సాయిరెడ్డి, కార్యదర్శిగా గుర్జాల్ స్వామిని ఎంపిక చేశారు. నాయకుల ఆధ్వర్యంలో జెండా ఎగురవేసి, పెద్దమ్మ ఆలయంలో పూజలు నిర్వహించారు. అనంతరం ఉగాది పచ్చడి సేవిస్తూ సంబరాలు జరుపుకున్నారు. నాయకులు, సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.1
- Post by Solanke Ravi2
- తెలంగాణ రాష్ట్రంలో ప్రసిద్ధి చెందిన పుణ్యక్షేత్రం స్వయంభుగా వెలిసిన శ్రీ ఏడుపాయల వన దుర్గ భవాని మాదాలయంలో గురువారం తెల్లవారుజామున ఆలయ పూజారులు శంకర్ శర్మ ఆధ్వర్యంలో మంజీరా నది జలాలతో అభిషేకం పంచామృత అభిషేకం పట్టు వస్త్రలంకరణ పుష్పలంకరణ గ్రహించారు పరాభవనామ ఉగాది సందర్భంగా అమ్మవారి వేపాకులు మామిడాకులతో వివిధ రకాల పుష్పాలతో అందంగా అలంకరించారు పుష్పార్చన గావించారు అనంతరం నక్షత్ర హారతి ఇచ్చారు అనంతరం భక్తులకు దివ్యదర్శభాగ్యం కలిగించారు. ఆలయవో వీరేశం ఆధ్వర్యంలో ఆలయసిబ్బంది భక్తులకు మౌలిక సదుపాయాలు కల్పించారు. భక్తులకు తీర్థ వితరణగావించారు. కోరిక కోరికలు తీరనభక్తులు అమ్మవారికి ఓడిబియ్యం,1
- Post by Venu Gopal1
- రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలోని శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం అనుబంధ ఆలయమైన శ్రీ భీమేశ్వర స్వామి దేవాలయం లో శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉగాది పండుగను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గురువారం సాయంత్రం ఆలయ ప్రాంగణంలో పంచాంగ శ్రవణ కార్యక్రమం నిర్వహించారు.ఈ కార్యక్రమాన్ని ఆలయ ఉప ప్రధాన అర్చకులు చంద్రగిరి శరత్ నిర్వహించగా, ప్రభుత్వ విప్ వేములవాడ శాసనసభ్యులు ఆది శ్రీనివాస్ ఆలయ ఈవో రమాదేవి గార్ల చేతుల మీదుగా పండితులకు ,అర్చకులకు సన్మానం నిర్వహించారు.అనంతరం ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ గారికి స్వామివారి శేష వస్త్రం కప్పి ఆశీర్వచనాలు అందజేశారు. ఈ కార్యక్రమం లో ఆలయ ఉద్యోగులు, వేద పండితులు మరియు భక్తులు పాల్గొన్నారు.1
- ఉగాది పర్వదినం, తెలుగు నూతన సంవత్సరం పరాభవ నామ సంవత్సర వేడుకలు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఘనంగా జరిగాయి. ఉగాది పండుగ వేళ కరీంనగర్ లోనే ఆలయాలు భక్తులతో కిటకిటలాడాయి. వేకువ జాము నుంచే భక్తులు ఆలయాలకు చేరుకొని ప్రత్యేక పూజలు అభిషేకాలు నిర్వహించారు. పలు ఆలయాలతో పాటు ముఖ్య ప్రదేశాల్లో పంచాంగ శ్రవణాలు నిర్వహించారు. కరీంనగర్ లోని మంత్రి పొన్నం ప్రభాకర్ క్యాంపు కార్యాలయంలో కన్నులపండువలా పంచాంగ శ్రవణం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మంత్రి పొన్నం ప్రభాకర్ తో పాటు జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ సత్తు మల్లేశం సుడ చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి అల్ఫోర్స్ విద్యాసంస్థల చైర్మన్ నరేందర్ రెడ్డి నగర కాంగ్రెస్ అధ్యక్షులు అంజన్ కుమార్ అర్బన్ బ్యాంక్ చైర్మన్ కర్ర రాజశేఖర్ పాల్గొన్నారు. తెలుగు ప్రజలందరికీ మంత్రి పొన్నం శ్రీ పరాభవ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్రమంతా సమృద్ధి వర్షాలతో పాడిపంటలతో ప్రజలంతా ఆయురారోగ్యాలతో సుఖసంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు. ప్రజాపాలన ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు ఎలాంటి అవరోధాలు లేకుండా ప్రజలకు చేరాలని భగవంతుని కోరుకున్నట్లు చేప్పారు. ప్రజల ఆశీర్వాదంతో ఏర్పడిన కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం ప్రజల సంక్షేమం కోసం కృషి చేస్తుందని తెలిపారు. పేదలకు సంబంధించి అనేక కార్యక్రమాలు ప్రభుత్వం చేస్తుందని, గవర్నర్ ధన్యవాదాలు తీర్మానంలో ముఖ్యమంత్రి చెప్పినట్లు అన్ని వర్గాలకు సంబంధించి అన్ని కార్యక్రమాలు చేస్తుందని తెలిపారు.2