తుడా చైర్మన్ డాలర్స్ దివాకర్ రెడ్డి చే ఘనంగా ప్రారంభమైన. స్కిన్ వేద సైబర్ సెక్యూరిటీ వర్క్ షాప్. తిరుపతిలోని స్కిల్‌వేద కార్యాలయంలో రెండు రోజుల జాతీయ స్థాయి సైబర్ సెక్యూరిటీ & ఎథికల్ హ్యాకింగ్ వర్క్‌షాప్ నేడు అత్యంత ఘనంగా ప్రారంభమైంది. ఈ వర్క్‌షాప్‌ను టూడా చైర్మన్ మరియు టీటీడీ బోర్డు సభ్యుడు శ్రీ డాలర్స్ దివాకర్ రెడ్డి లాంఛనంగా ప్రారంభించారు. ఈ వర్క్‌షాప్‌ను బహుళజాతి కంపెనీ ప్రికస్ గ్రూప్ ఆధ్వర్యంలోని స్కిల్‌వేద మరియు నిజారూప ఫిన్‌టెక్ సంయుక్తంగా నిర్వహిస్తున్నాయి. తిరుపతిలోని వివిధ డిగ్రీ మరియు ఇంజినీరింగ్ కళాశాలల నుండి వంద మందికి పైగా విద్యార్థులు ఇందులో పాల్గొని విశేష స్పందన తెలిపారు. ప్రారంభోత్సవ సభలో మాట్లాడుతూ శ్రీ డాలర్స్ దివాకర్ రెడ్డి తిరుపతిలో ఇలాంటి ప్రతిష్టాత్మక సైబర్ సెక్యూరిటీ వర్క్‌షాప్ నిర్వహించడం గర్వకారణమని పేర్కొన్నారు. నేటి రోజుల్లో సైబర్ నేరాలు వేగంగా పెరుగుతున్న నేపథ్యంలో యువత ఈ వేదిక ద్వారా పొందే జ్ఞానాన్ని సమాజానికి మేలు చేసే దిశగా వినియోగించుకోవాలని ఆయన సూచించారు. టెక్నాలజీ ఎల్లప్పుడూ సానుకూల దిశలోనే ఉపయోగించబడాలని హితవు పలికారు. ఈ వర్క్‌షాప్‌ను తిరుపతిలోకి తీసుకువచ్చినందుకు ప్రమీల్ అర్జున్ బృందం మరియు స్కిల్‌వేద చేసిన కృషిని ఆయన ప్రత్యేకంగా అభినందించారు. కార్యక్రమంలో నిజారూప ఫిన్‌టెక్ ప్రతినిధి శ్రీ ఆదం ప్రసాద్ రెడ్డి కూడా పాల్గొని విద్యార్థులను ఉత్సాహపరిచారు. అలాగే ప్రికస్ గ్రూప్ నుండి శ్రీ రాధే శ్యం, శ్రీ సందీప్ అవుటపల్లి, శ్రీ ధనుష్ కుమార్, శ్రీ అవినాష్, శ్రీ కృష్ణ తేజ, శ్రీ అభినయ్ రెడ్డి గార్లు కూడా హాజరై కార్యక్రమానికి మరింత ప్రత్యేకతను తీసుకువచ్చారు. నిర్వాహకుల తరఫున మాట్లాడుతూ శ్రీ ప్రమీల్ అర్జున్, స్కిల్‌వేద కార్యాలయంలో ఇంత భారీ స్థాయిలో వర్క్‌షాప్ నిర్వహించడం గర్వకారణమని, దివాకర్ రెడ్డి గారి ప్రోత్సాహం మరింత ఉత్సాహాన్ని ఇచ్చిందని తెలిపారు. విద్యార్థులకు సైబర్ సెక్యూరిటీపై ప్రాక్టికల్ అవగాహన కల్పించడం, భవిష్యత్తులో వారికి మంచి కెరీర్ అవకాశాలు కల్పించడం తమ ప్రధాన ఉద్దేశమని ఆయన అన్నారు. వర్క్‌షాప్‌లో ఎథికల్ హ్యాకింగ్ బేసిక్స్, మొబైల్ & వెబ్ అప్లికేషన్ సెక్యూరిటీ, వై-ఫై హ్యాకింగ్, రియల్ టైమ్ థ్రెట్ అనాలిసిస్, సైబర్ లాస్ వంటి అంశాలపై నిపుణులు ప్రత్యక్ష ప్రదర్శనలు ఇస్తున్నారు. పాల్గొన్న విద్యార్థులకు సర్టిఫికేట్లు, ఇంటర్న్‌షిప్ అవకాశాలు మరియు కెరీర్ మార్గదర్శనం అందించబడనుంది. ఈ వర్క్‌షాప్ రేపటితో ముగియనుంది.

- భారత్ మాత కి జై 🇮🇳1
- జై హొ సనాతన ధర్మం3
- *అయ్యప్ప స్వామి పడిపూజలో కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు* డిసెంబర్ 13 : కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు దంపతులు శనివారం నాడు శ్రీకాకుళంలోని తన స్వగృహంలో జరిగిన అయ్యప్ప పడిపూజ, భజన కార్యక్రమాల్లో పాల్గొన్నారు. మంత్రి అచ్చెన్నాయుడు తో పాటు, శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్, తదితరులు ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. శ్రీకాకుళం నగరంలోని ధర్మశాస్త సన్నిధానంలో ప్రధాన అర్చకులుగా ఉన్న శంకర శర్మ బృందం ఆధ్వర్యంలో పడిపూజ మహోత్సవం, విశేష అభిషేకాలు శాస్త్రోక్తంగా జరిగాయి. అయ్యప్ప మాలధారుల శరణు ఘోష మధ్య అత్యంత భక్తి శ్రద్ధలతో కార్యక్రమం జరిగింది. వివిధ సన్నిధానల నుండి పాల్గొన్న అయ్యప్ప మాలధారులు పడిపూజ, భజన కార్యక్రమాల్లో పాల్గొన్నారు. వేద మంత్రోచ్ఛారణ మధ్య పడిపూజ ఘనంగా పూర్తయిన తరువాత అయ్యప్ప భజన రెట్టించిన ఉత్సాహంతో జరిగింది. మణికంఠుడిని కీర్తిస్తూ గొంతెత్తిన స్వామి భక్తులు.. ఆధ్యాత్మికతను ఉట్టిపడేలా అయ్యప్ప కీర్తనలు పాడారు. మధ్యలో కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు కూడా అయ్యప్ప కీర్తనలు, నామ సంకీర్తనను భక్తితో ఆలపించారు. కఠిన నియమాల మధ్య జరిగే అయ్యప్ప స్వామి మాలధారణ ఎంతో మానసిక ప్రశాంతతను అందిస్తుందని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు అన్నారు. తాను కూడా గతంలో అయ్యప్ప మాలను వేసి ఆ ఆధ్యాత్మిక అనుభవాన్ని పొందానని తెలిపారు. దేశ వ్యాప్తంగా అయ్యప్ప మాల ధారణ వేసిన భక్తులు వారి దీక్షను నిర్విఘ్నంగా పూర్తి చేసుకుని ఆ మణికంఠుడు ఆశీస్సులు పొందాలని ఆకాంక్షించారు.4
- *ఆదిత్యుని దర్శించుకున్న కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు* - సూర్య దేవుని ఆశీస్సులు తీసుకున్న శివాన్ ఎర్రంనాయుడు - వైకుంఠ ఏకాదశి, రథసప్తమి ఏర్పాట్లపై ఆరా తీసిన రామ్మోహన్ నాయుడు. డిసెంబర్ : కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు దంపతులు.. తమ కుమారుడు శివాన్ ఎర్రంనాయుడు తో కలసి ఆదివారం నాడు శ్రీకాకుళంలోని ప్రముఖ సూర్య దేవాలయం అరసవల్లి ఆదిత్యుని దర్శించుకున్నారు. ఆలయానికి విచ్చేసిన కేంద్ర మంత్రిని వేద మంత్రోచ్ఛారణ, మంగళ వాయిద్యాల నడుమ పూర్ణ కుంభ స్వాగతాన్ని పలికారు. అనంతరం ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ ప్రాంగణంలోని వినాయక, శైవ క్షేత్రాలను ఈ సందర్భంగా రామ్మోహన్ నాయుడు దంపతులు దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆలయ అనివెట్టి మండపంలో వేద ఆశీర్వదాన్ని, సూర్యదేవుని చిత్రపటాన్ని అర్చక బృందం, దేవాదాయ శాఖ అధికారులు అందించారు. ఈ సందర్భంగా త్వరలో జరగబోయే వైకుంఠ ద్వార దర్శనం, రథసప్తమి ఉత్సవ ఏర్పాట్ల గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బంది రాకుండా వైభవంగా నిర్వహించాలని అదేశించారు. అరసవల్లి సూర్యదేవుని దర్శించుకోవడం ఆనందంగా ఉందని, ఎప్పుడూ ఆ ఆదిత్యుని తలచుకున్నా.. విశేష మానసిక ప్రశాంతత లభిస్తుందని తెలిపారు. దేశ ప్రజలందరికీ భాస్కరుని ఆశీస్సులు ఉండాలని ఆకాంక్షించారు.1