logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

💥విజయవాడలో తెల్లవారు జామున ప్రైవేట్ బస్సులో మంటలు భయం కలిగించాయి. బస్సు తగలబడుతుంటే చెప్పులు మర్చిపోయానని మళ్లీ లోపలకు వెళ్ళిన మహిళ. కలికిరి నేస్తం న్యూస్ 💥విజయవాడలో తెల్లవారు జామున ప్రైవేట్ బస్సులో మంటలు భయం కలిగించాయి. రావులపాలెం నుంచి హైదరాబాద్ వెళ్తున్న సాయిఆర్కే ట్రావెల్స్ బస్సు, బస్టాండ్ దగ్గరకు వచ్చాక చెలరేగిన మంటలతో కలకలం చెలరేగింది. ప్రమాద సమయంలో బస్సులో 35 మంది ప్రయాణికులు ఉన్నారు. వెంటనే అప్రమత్తమై మంటలను అదుపు చేసిన ఫైర్ సిబ్బంది, బ్యాటరీ షార్ట్ సర్క్యూట్ వల్ల మంటలు చెలరేగినట్టు గుర్తించారు. ఈ ఘటనపై పోలీసులు విచారణ చేస్తున్నారు. ఈ ఘటనలో విచిత్రం ఏమిటంటే, బస్సు తగలబడుతుంటే, ఓ మహిళ బస్సులో చెప్పులు మర్చిపోయానని మళ్లీ బస్సులోకి పోయి చెప్పులు తెచ్చుకోవడం.. కొసమెరుపు..

4 hrs ago
user_Venkat ramana
Venkat ramana
వాల్మీకిపురం, అన్నమయ్య, ఆంధ్రప్రదేశ్•
4 hrs ago
b47968af-9c0e-49a5-8294-94f0670dd081

💥విజయవాడలో తెల్లవారు జామున ప్రైవేట్ బస్సులో మంటలు భయం కలిగించాయి. బస్సు తగలబడుతుంటే చెప్పులు మర్చిపోయానని మళ్లీ లోపలకు వెళ్ళిన మహిళ. కలికిరి నేస్తం న్యూస్ 💥విజయవాడలో తెల్లవారు జామున ప్రైవేట్ బస్సులో మంటలు భయం కలిగించాయి. రావులపాలెం నుంచి హైదరాబాద్ వెళ్తున్న సాయిఆర్కే ట్రావెల్స్ బస్సు, బస్టాండ్ దగ్గరకు వచ్చాక చెలరేగిన మంటలతో కలకలం చెలరేగింది. ప్రమాద సమయంలో బస్సులో 35 మంది ప్రయాణికులు ఉన్నారు. వెంటనే అప్రమత్తమై మంటలను అదుపు చేసిన ఫైర్ సిబ్బంది, బ్యాటరీ షార్ట్ సర్క్యూట్ వల్ల మంటలు చెలరేగినట్టు గుర్తించారు. ఈ ఘటనపై పోలీసులు విచారణ చేస్తున్నారు. ఈ ఘటనలో విచిత్రం ఏమిటంటే, బస్సు తగలబడుతుంటే, ఓ మహిళ బస్సులో చెప్పులు మర్చిపోయానని మళ్లీ బస్సులోకి పోయి చెప్పులు తెచ్చుకోవడం.. కొసమెరుపు..

More news from ఆంధ్రప్రదేశ్ and nearby areas
  • మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కాన్వాయ్‌లో తృటిలో తప్పిన పెనుప్రమాదం* తిరుపతి–బెంగళూరు జాతీయ రహదారిపై మదనపల్లి పట్టణంలోని ఎస్టేట్ కరెంట్ ఆఫీస్ సమీపంలో మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కాన్వాయ్‌లో ప్రమాదం చోటుచేసుకుంది. కాన్వాయ్‌లో ఉన్న మూడు కార్లు ఒకదానికొకటి ఢీకొనడంతో ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. ఈ ఘటనలో మూడు వాహనాలు దెబ్బతిన్నప్పటికీ, ఎటువంటి ప్రాణ నష్టం జరగకపోవడంతో పెద్ద ప్రమాదం తృటిలో తప్పింది. కాన్వాయ్‌లో ఉన్న మదనపల్లి నియోజకవర్గ యువజన విభాగం అధ్యక్షుడు, వైసీపీ మదనపల్లి రూరల్ మండల పార్టీ పరిశీలకుడు హర్షవర్ధన్ రెడ్డి ప్రయాణిస్తున్న ఫార్చ్యూనర్ వాహనం కూడా తీవ్రంగా దెబ్బతింది.
    2
    మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కాన్వాయ్‌లో తృటిలో తప్పిన పెనుప్రమాదం*
తిరుపతి–బెంగళూరు జాతీయ రహదారిపై మదనపల్లి పట్టణంలోని ఎస్టేట్ కరెంట్ ఆఫీస్ సమీపంలో మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కాన్వాయ్‌లో ప్రమాదం చోటుచేసుకుంది. కాన్వాయ్‌లో ఉన్న మూడు కార్లు ఒకదానికొకటి ఢీకొనడంతో ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. ఈ ఘటనలో మూడు వాహనాలు దెబ్బతిన్నప్పటికీ, ఎటువంటి ప్రాణ నష్టం జరగకపోవడంతో పెద్ద ప్రమాదం తృటిలో తప్పింది. కాన్వాయ్‌లో ఉన్న మదనపల్లి నియోజకవర్గ యువజన విభాగం అధ్యక్షుడు, వైసీపీ మదనపల్లి రూరల్ మండల పార్టీ పరిశీలకుడు హర్షవర్ధన్ రెడ్డి ప్రయాణిస్తున్న ఫార్చ్యూనర్ వాహనం కూడా తీవ్రంగా దెబ్బతింది.
    user_Kumar
    Kumar
    Photographer కుప్పం, చిత్తూరు, ఆంధ్రప్రదేశ్•
    2 hrs ago
  • బద్వేలు :నియోజకవర్గ ఇన్‌చార్జ్ కే. రితేష్ రెడ్డి ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ 44వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు అత్యంత వైభవంగా జరిగాయి. తొలుత స్థానిక టిడిపి కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే విజయమ్మ మరియు నియోజకవర్గ ఇన్‌చార్జ్ రితేష్ రెడ్డి పార్టీ పసుపు జెండాను గర్వంగా ఆవిష్కరించారు. అనంతరం బద్వేల్-నెల్లూరు రోడ్డులోని విశ్వవిఖ్యాత నటసార్వభౌమ నందమూరి తారక రామారావు విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆర్‌ఆర్ కళ్యాణ మండపంలో ఏర్పాటు చేసిన ఆవిర్భావ వేడుకల్లో భారీ సంఖ్యలో నాయకులు, కార్యకర్తలు పాల్గొని నినాదాలతో హోరెత్తించారు. వేదికపై ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి అంజలి ఘటించిన అనంతరం, నియోజకవర్గంలోని సీనియర్ నాయకులను రితేష్ రెడ్డి మరియు విజయమ్మ ఘనంగా సన్మానించారు. 44 ఏళ్లుగా పార్టీని నమ్ముకుని సేవ చేస్తున్న ప్రతి కార్యకర్తకు ధన్యవాదాలు తెలుపుతూ, సీనియర్ నాయకుల సేవలను తమ కుటుంబం ఎప్పటికీ మరువదని, వారికి ఎల్లప్పుడూ అండగా ఉంటామని రితేష్ రెడ్డి గారు ఈ సందర్భంగా భావోద్వేగంగా పేర్కొన్నారు. చివరగా, విచ్చేసిన సీనియర్ నాయకులందరితో కలిసి తమ నివాసంలో మధ్యాహ్న భోజనం చేసి ఈ వేడుకలను దిగ్విజయంగా ముగించారు.
    2
    బద్వేలు :నియోజకవర్గ ఇన్‌చార్జ్  కే. రితేష్ రెడ్డి  ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ 44వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు అత్యంత వైభవంగా జరిగాయి. తొలుత స్థానిక టిడిపి కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే విజయమ్మ  మరియు నియోజకవర్గ ఇన్‌చార్జ్ రితేష్ రెడ్డి  పార్టీ పసుపు జెండాను గర్వంగా ఆవిష్కరించారు. 
అనంతరం బద్వేల్-నెల్లూరు రోడ్డులోని విశ్వవిఖ్యాత నటసార్వభౌమ నందమూరి తారక రామారావు  విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆర్‌ఆర్ కళ్యాణ మండపంలో ఏర్పాటు చేసిన ఆవిర్భావ వేడుకల్లో భారీ సంఖ్యలో నాయకులు, కార్యకర్తలు పాల్గొని నినాదాలతో హోరెత్తించారు. వేదికపై ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి అంజలి ఘటించిన అనంతరం, నియోజకవర్గంలోని సీనియర్ నాయకులను రితేష్ రెడ్డి మరియు విజయమ్మ  ఘనంగా సన్మానించారు. 
44 ఏళ్లుగా పార్టీని నమ్ముకుని సేవ చేస్తున్న ప్రతి కార్యకర్తకు ధన్యవాదాలు తెలుపుతూ, సీనియర్ నాయకుల సేవలను తమ కుటుంబం ఎప్పటికీ మరువదని, వారికి ఎల్లప్పుడూ అండగా ఉంటామని రితేష్ రెడ్డి గారు ఈ సందర్భంగా భావోద్వేగంగా పేర్కొన్నారు. చివరగా, విచ్చేసిన సీనియర్ నాయకులందరితో కలిసి తమ నివాసంలో మధ్యాహ్న భోజనం చేసి ఈ వేడుకలను దిగ్విజయంగా ముగించారు.
    user_జీ.మౌలాలి.
    జీ.మౌలాలి.
    Photographer బద్వేల్, వై.ఎస్.ఆర్., ఆంధ్రప్రదేశ్•
    18 hrs ago
  • కర్నూలు జిల్లా ఆదోని పట్టణంలో భవన నిర్మాణానికి అనుమతుల పేరుతో భారీ లంచం డిమాండ్ చేశారంటూ ఆదోని ఎమ్మెల్యే పార్థసారథిపై టీడీపీ ముస్లిం మైనార్టీ సీనియర్ నాయకుడు సౌదీ రవూఫ్ సంచలన ఆరోపణలు చేశారు. బిల్డింగ్ కట్టేందుకు రూ.50 లక్షలు డిమాండ్ చేసి, అందులో ఇప్పటికే రూ.10 లక్షలు తీసుకున్నారని ఆయన తీవ్ర ఆరోపణలు గుప్పించారు. భగవద్గీత, ఖురాన్, బైబిల్ సాక్షిగా ప్రమాణం చేసి చెప్పడానికి సిద్ధంగా ఉన్నానని స్పష్టం చేశారు. ఆదోని పట్టణంలోని ఎమ్మిగనూరు రోడ్డులో ట్రెండ్స్ సమీపంలో ప్లాట్లు విక్రయించిన సౌదీ రవూఫ్ ప్రస్తుతం అక్కడ భవనం నిర్మాణం చేపడుతున్నారు. ఈ సందర్భంగా మున్సిపల్ అధికారులు నిర్మాణంపై అభ్యంతరాలు వ్యక్తం చేయగా, ఎమ్మెల్యేకు డబ్బులు ఇవ్వాలని సూచించారని రవూఫ్ ఆరోపించారు. తన భవన నిర్మాణానికి ఎలాంటి అడ్డంకులు లేకుండా చూడాలంటే రూ.50 లక్షలు ఇవ్వాలని ఎమ్మెల్యే డిమాండ్ చేశారని, అంత మొత్తాన్ని ఇవ్వలేనని చెప్పి వెళ్లిపోయానని తెలిపారు. అయితే తరువాత ఎమ్మెల్యే ఫోన్ చేసి రూ.40 లక్షలు ఇవ్వాలని ఒత్తిడి తెచ్చారని, మధ్యవర్తి ద్వారా ఇప్పటికే రూ.10 లక్షలు, మరో రూ.1 లక్ష కమిషన్‌గా ఇవ్వాల్సి వచ్చిందని బాధితుడు పేర్కొన్నారు. డబ్బులు ఇవ్వకపోతే పనులు ఆపేస్తామని బెదిరించారని, ఒకసారి కాదు పదేపదే డబ్బులు అడుగుతూ వేధిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ నాయకుడిననే కారణంతోనే కావాలనే టార్గెట్ చేస్తున్నారని మండిపడ్డారు.
    1
    కర్నూలు జిల్లా ఆదోని పట్టణంలో భవన నిర్మాణానికి అనుమతుల పేరుతో భారీ లంచం డిమాండ్ చేశారంటూ ఆదోని ఎమ్మెల్యే పార్థసారథిపై టీడీపీ ముస్లిం మైనార్టీ సీనియర్ నాయకుడు సౌదీ రవూఫ్ సంచలన ఆరోపణలు చేశారు. బిల్డింగ్ కట్టేందుకు రూ.50 లక్షలు డిమాండ్ చేసి, అందులో ఇప్పటికే రూ.10 లక్షలు తీసుకున్నారని ఆయన తీవ్ర ఆరోపణలు గుప్పించారు. భగవద్గీత, ఖురాన్, బైబిల్ సాక్షిగా ప్రమాణం చేసి చెప్పడానికి సిద్ధంగా ఉన్నానని స్పష్టం చేశారు.
ఆదోని పట్టణంలోని ఎమ్మిగనూరు రోడ్డులో ట్రెండ్స్ సమీపంలో ప్లాట్లు విక్రయించిన సౌదీ రవూఫ్ ప్రస్తుతం అక్కడ భవనం నిర్మాణం చేపడుతున్నారు. ఈ సందర్భంగా మున్సిపల్ అధికారులు నిర్మాణంపై అభ్యంతరాలు వ్యక్తం చేయగా, ఎమ్మెల్యేకు డబ్బులు ఇవ్వాలని సూచించారని రవూఫ్ ఆరోపించారు. తన భవన నిర్మాణానికి ఎలాంటి అడ్డంకులు లేకుండా చూడాలంటే రూ.50 లక్షలు ఇవ్వాలని ఎమ్మెల్యే డిమాండ్ చేశారని, అంత మొత్తాన్ని ఇవ్వలేనని చెప్పి వెళ్లిపోయానని తెలిపారు.
అయితే తరువాత ఎమ్మెల్యే ఫోన్ చేసి రూ.40 లక్షలు ఇవ్వాలని ఒత్తిడి తెచ్చారని, మధ్యవర్తి ద్వారా ఇప్పటికే రూ.10 లక్షలు, మరో రూ.1 లక్ష కమిషన్‌గా ఇవ్వాల్సి వచ్చిందని బాధితుడు పేర్కొన్నారు. డబ్బులు ఇవ్వకపోతే పనులు ఆపేస్తామని బెదిరించారని, ఒకసారి కాదు పదేపదే డబ్బులు అడుగుతూ వేధిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ నాయకుడిననే కారణంతోనే కావాలనే టార్గెట్ చేస్తున్నారని మండిపడ్డారు.
    user_VIJAY RAJ
    VIJAY RAJ
    Local News Reporter ఆదోని, కర్నూలు, ఆంధ్రప్రదేశ్•
    5 hrs ago
  • ఎమ్మిగనూరు ఎంపీడీఓ కార్యాలయంలో P4 MBK 10-20 కార్యక్రమం స్వర్ణ ఆంధ్ర @2027 లక్ష్యంతో అవగాహన కార్యక్రమం కార్యక్రమంలో ఎమ్మెల్యే డాక్టర్ బీ.వీ. జయ నాగేశ్వర్ రెడ్డి పాల్గొన్నారు ఒకే సంవత్సరంలో 2.1 లక్షల కుటుంబాలకు లబ్ధి – ఎమ్మెల్యే ప్రజలు–ప్రభుత్వం–ప్రైవేట్ భాగస్వామ్యంతో అభివృద్ధి P4 ద్వారా సమిష్టి అభివృద్ధి లక్ష్యం సంక్షేమం నుంచి స్వయం పోషక వ్యవస్థ వైపు రాష్ట్రం ప్రతి కుటుంబాన్ని “బంగారు కుటుంబం”గా తీర్చిదిద్దే ప్రయత్నం క్రియాశీలక మార్గదర్శకులకు సన్మానం అధికారుల, ప్రజాప్రతినిధుల, లబ్ధిదారుల పాల్గొనడం జరిగింది.
    1
    ఎమ్మిగనూరు ఎంపీడీఓ కార్యాలయంలో P4 MBK 10-20 కార్యక్రమం
స్వర్ణ ఆంధ్ర @2027 లక్ష్యంతో అవగాహన కార్యక్రమం
కార్యక్రమంలో ఎమ్మెల్యే డాక్టర్ బీ.వీ. జయ నాగేశ్వర్ రెడ్డి పాల్గొన్నారు
ఒకే సంవత్సరంలో 2.1 లక్షల కుటుంబాలకు లబ్ధి – ఎమ్మెల్యే
ప్రజలు–ప్రభుత్వం–ప్రైవేట్ భాగస్వామ్యంతో అభివృద్ధి
P4 ద్వారా సమిష్టి అభివృద్ధి లక్ష్యం
సంక్షేమం నుంచి స్వయం పోషక వ్యవస్థ వైపు రాష్ట్రం
ప్రతి కుటుంబాన్ని “బంగారు కుటుంబం”గా తీర్చిదిద్దే ప్రయత్నం
క్రియాశీలక మార్గదర్శకులకు సన్మానం
అధికారుల, ప్రజాప్రతినిధుల, లబ్ధిదారుల పాల్గొనడం జరిగింది.
    user_K AMPAIAH ACHARI
    K AMPAIAH ACHARI
    Local News Reporter ఎమ్మిగనూరు, కర్నూలు, ఆంధ్రప్రదేశ్•
    8 hrs ago
  • ఫీజు రీయింబర్స్‌మెంట్, ఉద్యోగ భర్తీపై అసెంబ్లీలో నిలదీసిన బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలను సస్పెండ్ చేయడం దుర్మార్గమని ఆర్.ఎస్. ప్రవీణ్ కుమార్ మండిపడ్డారు. సోమవారం గద్వాలలో జరిగిన 'పోరు దీక్ష'లో ఆయన పాల్గొన్నారు. పేద ప్రజల బతుకులు మారాలంటే మళ్లీ కేసీఆర్ ప్రభుత్వం రావాలని ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రభుత్వ వైఫల్యాలపై పోరాటం కొనసాగిస్తామని పేర్కొన్నారు.
    1
    ఫీజు రీయింబర్స్‌మెంట్, ఉద్యోగ భర్తీపై అసెంబ్లీలో నిలదీసిన బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలను సస్పెండ్ చేయడం దుర్మార్గమని ఆర్.ఎస్. ప్రవీణ్ కుమార్ మండిపడ్డారు. సోమవారం గద్వాలలో జరిగిన 'పోరు దీక్ష'లో ఆయన పాల్గొన్నారు. పేద ప్రజల బతుకులు మారాలంటే మళ్లీ కేసీఆర్ ప్రభుత్వం రావాలని ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రభుత్వ వైఫల్యాలపై పోరాటం కొనసాగిస్తామని పేర్కొన్నారు.
    user_Azmath
    Azmath
    గద్వాల్, జోగులాంబ గద్వాల్, తెలంగాణ•
    15 hrs ago
  • ప్రజలకు ఉపాధిని దూరం చేసి సామాజిక న్యాయానికి పాత రేయడమే బిజెపి చెబుతున్న దేశ భక్తా అని సిపిఎం జిల్లా కార్యదర్శి ఏ.వెంకటస్వామి కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు? . విబిజి రాంజీ బిల్లును రద్దు చేయాలని, మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని కొనసాగించాలని డిమాండ్ చేస్తూ సోమవారం జిల్లా కేంద్రంలోని పాత కలెక్టర్ కార్యాలయం నుండి కొత్త కలెక్టర్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించి కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలోని గ్రామీణ ప్రాంతాలలో వలసలను నివారించి ప్రజల ఆదాయాన్ని పెంచి ఆర్థిక అసమానతలను తగ్గించేందుకు ఉపయోగపడే గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని రద్దుచేసి కేంద్ర ప్రభుత్వం దేశంలో సామాజిక న్యాయానికి పాతరేసిందని విమర్శించారు. ఒక చట్టాన్ని రద్దు చేసేటప్పుడు కనీసం చర్చలు జరపాలన్న ప్రజాస్వామ్య విలువలను బీజేపీ పాటించడం లేదని విమర్శించారు. విబిజి రాంజీల ద్వారా కేంద్రం ఉపాధి కూలీలకు భారీగా కోతలు విధించిందని, రాష్ట్ర ప్రభుత్వాలపై భారాలు పెంచిందని, జాబ్ కార్డులు ఇవ్వకుండా, చేసిన పనులకు డబ్బులు ఇవ్వకుండా పని ప్రదేశాలలో కనీస సౌకర్యాలను గాలికి వదిలేసిందని, సాంకేతిక సమస్యలను సకాలంలో పరిష్కరించకుండా కూలీలకు ఉపాధిని దూరం చేసిందని విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం సైతం విబిజి రాంజీ బిల్లును రద్దు చేయాలని అసెంబ్లీలో తీర్మానం చేయాలని, ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి ఖర్చులు 5 లక్షల నుండి 10 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. జిల్లాలో వేల సంఖ్యలో భూ సమస్యలు పెండింగ్లో ఉన్నాయని ప్రజావాణిలో ఎన్నిసార్లు అధికారుల దృష్టికి తీసుకువచ్చిన పరిష్కారం కావడం లేదని, భూ సమస్యల పరిష్కారం కోసం ప్రత్యేక కమిటీని నియమించి సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. జిల్లాలో సిపిఎం కార్యకర్తలు ఉపాధి కూలీల దగ్గరికి వెళ్ళిన సందర్భంగా జిల్లాలో గత మూడు నెలలుగా కూలీలకు డబ్బులు రాలేదని, ఫోటో ఫ్యాక్చరింగ్ సరిగా రావడం లేదని, డబ్బులు రాకపోవడంతో కూలీలు పనికి రావడం లేదని పనిచేయడానికి అవసరమైన పని ముట్లు ఇవ్వడం లేదని, గర్భిణీలకు బాలింతలకు వృద్ధులకు ప్రత్యేక సౌకర్యాలు కల్పించడం లేదని తమ దృష్టికి తీసుకువచ్చారని అన్నారు. తక్షణమే అధికార యంత్రాంగం క్షేత్రస్థాయిలో పర్యటించి ఉపాధి కూలీల సమస్యలు పరిష్కరించాలని లేనిపక్షంలో ఉద్యమిస్తామని హెచ్చరించారు. అనంతరం డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని కలెక్టర్ కు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఏ వెంకటస్వామి సిపిఎం జిల్లా కార్యదర్శి , సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు జీ. రాజు, ఉప్పేర్ నరసింహ, నాయకులు రవి, సవారన్న, పాంటన్న,తిరుపతన్న, బాలకృష్ణ, రామక్రిష్ణ రంగన్న, రామాంజనేయులు తదితరులు పాల్గొన్నారు.
    2
    ప్రజలకు ఉపాధిని దూరం చేసి సామాజిక న్యాయానికి పాత రేయడమే బిజెపి చెబుతున్న దేశ భక్తా అని సిపిఎం జిల్లా కార్యదర్శి ఏ.వెంకటస్వామి కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు? . విబిజి రాంజీ బిల్లును రద్దు చేయాలని, మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని కొనసాగించాలని డిమాండ్ చేస్తూ సోమవారం జిల్లా కేంద్రంలోని పాత కలెక్టర్ కార్యాలయం నుండి  కొత్త కలెక్టర్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించి కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలోని గ్రామీణ ప్రాంతాలలో వలసలను నివారించి ప్రజల ఆదాయాన్ని పెంచి ఆర్థిక అసమానతలను తగ్గించేందుకు ఉపయోగపడే గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని రద్దుచేసి కేంద్ర ప్రభుత్వం దేశంలో సామాజిక న్యాయానికి పాతరేసిందని విమర్శించారు. ఒక చట్టాన్ని రద్దు చేసేటప్పుడు కనీసం చర్చలు జరపాలన్న ప్రజాస్వామ్య విలువలను బీజేపీ పాటించడం లేదని విమర్శించారు. విబిజి రాంజీల ద్వారా కేంద్రం ఉపాధి కూలీలకు భారీగా కోతలు విధించిందని, రాష్ట్ర ప్రభుత్వాలపై భారాలు పెంచిందని, జాబ్ కార్డులు ఇవ్వకుండా, చేసిన పనులకు డబ్బులు ఇవ్వకుండా పని ప్రదేశాలలో కనీస సౌకర్యాలను గాలికి వదిలేసిందని, సాంకేతిక సమస్యలను సకాలంలో పరిష్కరించకుండా కూలీలకు ఉపాధిని దూరం చేసిందని విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం సైతం విబిజి రాంజీ బిల్లును రద్దు చేయాలని అసెంబ్లీలో తీర్మానం చేయాలని, ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి ఖర్చులు 5 లక్షల నుండి 10 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. జిల్లాలో వేల సంఖ్యలో భూ సమస్యలు పెండింగ్లో ఉన్నాయని ప్రజావాణిలో ఎన్నిసార్లు అధికారుల దృష్టికి తీసుకువచ్చిన పరిష్కారం కావడం లేదని, భూ సమస్యల పరిష్కారం కోసం ప్రత్యేక కమిటీని నియమించి సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. జిల్లాలో సిపిఎం కార్యకర్తలు ఉపాధి కూలీల దగ్గరికి వెళ్ళిన సందర్భంగా జిల్లాలో గత మూడు నెలలుగా కూలీలకు డబ్బులు రాలేదని, ఫోటో ఫ్యాక్చరింగ్ సరిగా రావడం లేదని, డబ్బులు రాకపోవడంతో కూలీలు పనికి రావడం లేదని పనిచేయడానికి అవసరమైన పని ముట్లు ఇవ్వడం లేదని, గర్భిణీలకు బాలింతలకు వృద్ధులకు ప్రత్యేక సౌకర్యాలు కల్పించడం లేదని తమ దృష్టికి తీసుకువచ్చారని అన్నారు. తక్షణమే అధికార యంత్రాంగం క్షేత్రస్థాయిలో పర్యటించి ఉపాధి కూలీల సమస్యలు పరిష్కరించాలని లేనిపక్షంలో ఉద్యమిస్తామని హెచ్చరించారు. అనంతరం 
డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని కలెక్టర్ కు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఏ వెంకటస్వామి సిపిఎం జిల్లా కార్యదర్శి , సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు జీ. రాజు, ఉప్పేర్ నరసింహ, నాయకులు రవి, సవారన్న, పాంటన్న,తిరుపతన్న, బాలకృష్ణ, రామక్రిష్ణ రంగన్న, రామాంజనేయులు తదితరులు పాల్గొన్నారు.
    user_Elluru Varaprasad
    Elluru Varaprasad
    Local News Reporter గద్వాల్, జోగులాంబ గద్వాల్, తెలంగాణ•
    18 hrs ago
  • అన్నం సరిపోలేదు మళ్లీ పెట్టమన్నందుకు ప్రిన్సిపాల్ దాష్టికం విద్యార్థినులను మోకాళ్ళ మీద కూర్చోబెట్టిన ప్రిన్సిపాల్ నల్గొండ జిల్లా దామరచర్ల బీసీ గురుకుల పాఠశాలలో విద్యార్థినిలు అన్నం సరిపోలేదు మళ్లీ పెట్టమన్నందుకు రాత్రి 8 గంటల నుండి 9 గంటల వరకు మోకాళ్ళ మీద కూర్చోబెట్టి పైశాచికంగా వ్యవహరించిన ప్రిన్సిపాల్ ఎక్కువ అన్నం ఎక్కువ కూరలు పెట్టలేమని.. విద్యార్థులు ఎవరైనా అన్నం సరిపోలేదు మళ్లీ పెట్టండి అంటే అందరికీ ఇదే గతని బెదిరింపులు విద్యార్థినులను చిత్రహింసలకు గురి చేస్తున్న ప్రిన్సిపాల్ ను డిస్మిస్ చేయాలని విద్యార్థి సంఘాల డిమాండ్
    1
    అన్నం సరిపోలేదు మళ్లీ పెట్టమన్నందుకు ప్రిన్సిపాల్ దాష్టికం
విద్యార్థినులను మోకాళ్ళ మీద కూర్చోబెట్టిన ప్రిన్సిపాల్
నల్గొండ జిల్లా దామరచర్ల బీసీ గురుకుల పాఠశాలలో విద్యార్థినిలు అన్నం సరిపోలేదు మళ్లీ పెట్టమన్నందుకు రాత్రి 8 గంటల నుండి 9 గంటల వరకు మోకాళ్ళ మీద కూర్చోబెట్టి పైశాచికంగా వ్యవహరించిన ప్రిన్సిపాల్
ఎక్కువ అన్నం ఎక్కువ కూరలు పెట్టలేమని.. విద్యార్థులు ఎవరైనా అన్నం సరిపోలేదు మళ్లీ పెట్టండి అంటే అందరికీ ఇదే గతని బెదిరింపులు
విద్యార్థినులను చిత్రహింసలకు గురి చేస్తున్న ప్రిన్సిపాల్ ను డిస్మిస్ చేయాలని విద్యార్థి సంఘాల డిమాండ్
    user_Kumar
    Kumar
    Photographer కుప్పం, చిత్తూరు, ఆంధ్రప్రదేశ్•
    17 hrs ago
  • బద్వేలు, మార్చి 30:శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామి స్పటిక శివాలయం తృతీయ వార్షికోత్సవ వేడుకల్లో ఎమ్మెల్సీ డీసీ గోవిందరెడ్డి , ఎమ్మెల్యే డాక్టర్ సుధమ్మ లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆలయ చైర్మన్ రామనబోయిన మురళి , గౌరవ అధ్యక్షులు వంకెల పెద్ద పోలిరెడ్డి మరియు ఆలయ వేద పండితులు బ్రహ్మశ్రీ సత్యనారాయణ శర్మ పూర్ణకుంభంతో వారికి ఘన స్వాగతం పలికారు. అనంతరం ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి, శాలువాలతో సత్కరించి స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ బూత్ కన్వీనర్లు సమన్వయకర్త కల్లూరి రమణారెడ్డి, మైదుకూరు నియోజకవర్గం అసెంబ్లీ పరిశీలకులు రాజగోపాల్ రెడ్డి, బద్వేలు జడ్పిటిసి పోలి రెడ్డి, డిఎ డి ఎల్ చైర్మన్ మాధవరెడ్డి, మాజీ కౌన్సిలర్లు సత్యనారాయణ, పద్మావతి, సర్పంచ్ జయరాం రెడ్డి, పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
    4
    బద్వేలు, మార్చి 30:శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామి స్పటిక శివాలయం తృతీయ వార్షికోత్సవ వేడుకల్లో ఎమ్మెల్సీ డీసీ గోవిందరెడ్డి , ఎమ్మెల్యే డాక్టర్ సుధమ్మ లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆలయ చైర్మన్ రామనబోయిన మురళి , గౌరవ అధ్యక్షులు వంకెల పెద్ద పోలిరెడ్డి  మరియు ఆలయ వేద పండితులు బ్రహ్మశ్రీ సత్యనారాయణ శర్మ  పూర్ణకుంభంతో వారికి ఘన స్వాగతం పలికారు. అనంతరం ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి, శాలువాలతో సత్కరించి స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ బూత్ కన్వీనర్లు సమన్వయకర్త కల్లూరి రమణారెడ్డి, మైదుకూరు నియోజకవర్గం అసెంబ్లీ పరిశీలకులు రాజగోపాల్ రెడ్డి, బద్వేలు జడ్పిటిసి పోలి రెడ్డి, డిఎ డి ఎల్ చైర్మన్ మాధవరెడ్డి, మాజీ కౌన్సిలర్లు  సత్యనారాయణ, పద్మావతి, సర్పంచ్ జయరాం రెడ్డి, పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
    user_జీ.మౌలాలి.
    జీ.మౌలాలి.
    Photographer బద్వేల్, వై.ఎస్.ఆర్., ఆంధ్రప్రదేశ్•
    19 hrs ago
  • ఎమ్మిగనూరు చేనేతల కో-ఆపరేటివ్ సొసైటీ సర్వసభ్య సమావేశం ఈనెల 31వ తేదీన జరగనుంది. ఈ సమావేశంలో సొసైటీని ఆప్కోలో విలీనం చేయాలనే ఉద్దేశపూర్వక ప్రయత్నాలు జరుగుతున్నాయనే సమాచారం నేపథ్యంలో సభ్యులు, చేనేత కార్మికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పద్మశ్రీ మాచాని సోమప్ప గారు స్థాపించిన ఈ చేనేత కో-ఆపరేటివ్ సొసైటీ ఎమ్మిగనూరుకు ప్రత్యేక గుర్తింపుగా నిలిచిందని, దీన్ని విలీనం చేయకుండా కాపాడుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యతగా భావించాలని పలువురు అభిప్రాయం వ్యక్తం చేశారు. సొసైటీని ఆప్కోలో విలీనం చేయకుండా నిలబెట్టేందుకు ప్రజాసంఘాలు, చేనేత కార్మికులు, స్థానిక ప్రజలు పార్టీలకతీతంగా ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ఈ మేరకు మార్చి 31న జరిగే సర్వసభ్య సమావేశంలో విలీనానికి వ్యతిరేకంగా గళమెత్తాలని కోరుతున్నారు. అలాగే అదే రోజు వివర్స్ కాలనీ మైదానం వద్ద, సొసైటీ కార్యాలయం ఎదురుగా నిర్వహించబడనున్న కార్యక్రమంలో పాల్గొని, చేనేత సొసైటీ పరిరక్షణకు సంఘీభావం తెలియజేయాలని విజ్ఞప్తి చేశారు. మాచాని సోమప్ప గారి సేవలను స్మరించుకుంటూ, ఆయన స్థాపించిన ఈ సొసైటీని భవిష్యత్తు తరాలకు అందించే బాధ్యత మన అందరిదని సభ్యులు పేర్కొన్నారు.
    1
    ఎమ్మిగనూరు చేనేతల కో-ఆపరేటివ్ సొసైటీ సర్వసభ్య సమావేశం ఈనెల 31వ తేదీన జరగనుంది. ఈ సమావేశంలో సొసైటీని ఆప్కోలో విలీనం చేయాలనే ఉద్దేశపూర్వక ప్రయత్నాలు జరుగుతున్నాయనే సమాచారం నేపథ్యంలో సభ్యులు, చేనేత కార్మికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
పద్మశ్రీ మాచాని సోమప్ప గారు స్థాపించిన ఈ చేనేత కో-ఆపరేటివ్ సొసైటీ ఎమ్మిగనూరుకు ప్రత్యేక గుర్తింపుగా నిలిచిందని, దీన్ని విలీనం చేయకుండా కాపాడుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యతగా భావించాలని పలువురు అభిప్రాయం వ్యక్తం చేశారు.
సొసైటీని ఆప్కోలో విలీనం చేయకుండా నిలబెట్టేందుకు ప్రజాసంఘాలు, చేనేత కార్మికులు, స్థానిక ప్రజలు పార్టీలకతీతంగా ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ఈ మేరకు మార్చి 31న జరిగే సర్వసభ్య సమావేశంలో విలీనానికి వ్యతిరేకంగా గళమెత్తాలని కోరుతున్నారు.
అలాగే అదే రోజు వివర్స్ కాలనీ మైదానం వద్ద, సొసైటీ కార్యాలయం ఎదురుగా నిర్వహించబడనున్న కార్యక్రమంలో పాల్గొని, చేనేత సొసైటీ పరిరక్షణకు సంఘీభావం తెలియజేయాలని విజ్ఞప్తి చేశారు.
మాచాని సోమప్ప గారి సేవలను స్మరించుకుంటూ, ఆయన స్థాపించిన ఈ సొసైటీని భవిష్యత్తు తరాలకు అందించే బాధ్యత మన అందరిదని సభ్యులు పేర్కొన్నారు.
    user_K AMPAIAH ACHARI
    K AMPAIAH ACHARI
    Local News Reporter ఎమ్మిగనూరు, కర్నూలు, ఆంధ్రప్రదేశ్•
    16 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.