హైదరాబాద్‌లో వోక్స్‌వ్యాగన్ ఇండియా తన ప్రముఖ సెడాన్ వర్చస్ (Virtus) భారత మార్కెట్లో నాలుగు సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా దేశవ్యాప్తంగా ప్రత్యేక వేడుకలను నిర్వహిస్తోంది. ఈ మైలురాయిని పురస్కరించుకుని వినియోగదారుల కోసం కంపెనీ ఆకర్షణీయమైన ఆఫర్లు, ప్రత్యేక ప్రయోజనాలను ప్రకటించింది. 2022లో భారత మార్కెట్లోకి ప్రవేశించిన వర్చస్, వోక్స్‌వ్యాగన్ ఇండియా మోడళ్లలో అత్యంత ప్రజాదరణ పొందిందిగా నిలిచింది. గత రెండేళ్లుగా ప్రీమియం సెడాన్ విభాగంలో ఇది వరుసగా అగ్రస్థానంలో కొనసాగుతోంది. ఈ వార్షికోత్సవ వేడుకలలో భాగంగా వర్చస్ అన్ని వేరియంట్లపై ప్రత్యేక ఆఫర్లను కంపెనీ అందిస్తోంది. ఇందులో భాగంగా "ఇప్పుడే కొనండి – తర్వాత చెల్లించండి" (Buy Now & Pay Later) పథకం, ప్రస్తుతం ఉన్న వినియోగదారులకు లాయల్టీ బెనిఫిట్స్, అలాగే వైద్యులు మరియు చార్టర్డ్ అకౌంటెంట్ల కోసం ప్రత్యేక రాయితీలను ప్రవేశపెట్టింది. గత నాలుగు సంవత్సరాల్లో దేశవ్యాప్తంగా సగటున ప్రతి 24 నిమిషాలకు ఒక వర్చస్ కారు అమ్ముడుపోయిందని కంపెనీ గణాంకాలను వెల్లడించింది. ఈ విజయవంతమైన ప్రయాణంపై వోక్స్‌వ్యాగన్ ఇండియా బ్రాండ్ డైరెక్టర్ నితిన్ కోహ్లీ మాట్లాడుతూ, వర్చస్ నాలుగు సంవత్సరాల ప్రయాణాన్ని పూర్తి చేసుకోవడం సంస్థకు ఎంతో గర్వకారణమని హర్షం వ్యక్తం చేశారు. తమ బ్రాండ్‌పై వినియోగదారులు ఉంచిన నమ్మకానికి, ఈ కారుకు లభిస్తున్న నిరంతర ఆదరణకు ఈ మైలురాయే నిదర్శనమని ఆయన పేర్కొన్నారు.

- తెలంగాణ మేధావులు, రిటైర్డ్ ఇంజనీర్లపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేస్తూ బూతుల పర్వం లంకించుకున్నారు. కన్నెపల్లి మోటార్లను వెంటనే ఆన్ చేయాలని లేఖ రాసినందుకు రిటైర్డ్ ఇంజనీర్లపై ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. రిటైర్డ్ ఇంజనీర్లు వచ్చి తనకు బేవకూఫ్ సలహాలు ఇస్తున్నారని మండిపడ్డారు. వీళ్ళని బొక్కలో వేయకపోవడమే తాను చేసిన తప్పని, తెలంగాణ మేధావులను, రిటైర్డ్ ఇంజనీర్లను బొక్కలో వేయాలని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.1
- Post by Assalamualikumjj3
- బాలికపై నిందితుడు అఘాయిత్యం చేసిన సమయంలో అతడిని పట్టుకోకుండా, అతనికి యాంటిసిపేటరీ బెయిల్ వచ్చేలా పోలీసులతో పాటు ప్రభుత్వమే సహకరించిందని హరీష్ రావు తీవ్ర ఆరోపణలు చేశారు. ఈ రోజు ఏకంగా ఆరుగురిని అతి దారుణంగా హత్య చేసినప్పటికీ, పోలీసులు ఇంకా ఆ నిందితుడిని పట్టుకోవడంలో విఫలమయ్యారని ఆయన మండిపడ్డారు. ఈ దారుణ ఉదంతం తర్వాత ఆ బాలిక కుటుంబంలో ఇప్పుడు ఒకే ఒక అమ్మాయి మిగిలిందని హరీష్ రావు ఆవేదన వ్యక్తం చేశారు. మూగ, చెవిటి, మరియు నడవలేని స్థితిలో ఉంటూ పూర్తిగా కుటుంబంపైనే ఆధారపడిన ఆ అమ్మాయి పరిస్థితిని తలుచుకుంటేనే తీవ్ర బాధగా ఉందంటూ ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.1
- మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కూకట్‌పల్లిలో బయోటెక్ పరిశ్రమ కోసం టాప్సే (Topse) సంస్థ తన అధునాతన టర్న్‌కీ ప్రాసెస్ సొల్యూషన్స్‌ను ప్రదర్శించింది.1
- మెదక్ జిల్లాలోని ఏడుపాయల వనదుర్గాభవానీ ఆలయం ఆషాఢ మాసం ఆదివారం సందర్భంగా భక్తజనంతో కిటకిటలాడింది. తెల్లవారుజాము నుంచే వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన భక్తులు దుర్గమ్మ నామస్మరణలతో ఆలయ ప్రాంగణాన్ని ఆధ్యాత్మిక వాతావరణంతో నింపేశారు. భక్తులు మంజీర నదిలో పవిత్ర స్నానాలు ఆచరించిన అనంతరం అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. కుటుంబ సౌఖ్యం, ఆయురారోగ్యం, శ్రేయస్సు కలగాలని ప్రార్థిస్తూ పలువురు భక్తులు అమ్మవారికి ఒడిబియ్యం సమర్పించి తమ మొక్కులు తీర్చుకున్నారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ఆలయ అధికారులు తగిన చర్యలు చేపట్టారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా దర్శనం, క్యూలైన్లు, తాగునీరు తదితర సౌకర్యాలను సమకూర్చారు. దీంతో ఏడుపాయల క్షేత్రం రోజంతా భక్తి పారవశ్యంతో, ఆధ్యాత్మిక సందడితో కళకళలాడింది.1
- రంగారెడ్డి జిల్లా కేశంపేట మండల కేంద్రంలోని ఏఆర్‌కే బంకెట్ సమీపంలో పూర్తిగా ఎండిపోయిన ఒక చెట్టు అత్యంత ప్రమాదకరంగా నిలిచింది. ఈ రహదారి గుండా నిత్యం భారీగా రాకపోకలు సాగుతుండటంతో, బలమైన గాలులు వీచే సమయంలో ఈ చెట్టు ఎప్పుడు కూలిపోతుందోనని స్థానికులు, బాటసారులు, వాహనదారులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఏ క్షణంలోనైనా ఇక్కడ ప్రమాదం జరిగే అవకాశం ఉందని వారు ఆవేదన చెందుతున్నారు. ఎలాంటి ప్రాణనష్టం లేదా ఆస్తినష్టం సంభవించకముందే సంబంధిత అధికారులు తక్షణమే స్పందించి, ప్రజల భద్రతను దృష్టిలో ఉంచుకుని ఆలస్యం చేయకుండా ఆ ఎండిన చెట్టును తొలగించాలని స్థానికులు గట్టిగా విజ్ఞప్తి చేస్తున్నారు.1
- 😋😋😋1
- జిన్నారం మండలం బొల్లారం ఐడీఏలోని సెంచరీ పరుపుల పరిశ్రమ గోడౌన్‌లో శనివారం రాత్రి భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంపై సమాచారం అందుకున్న పటాన్‌చెరు అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చారు. ఫైర్ ఇంజిన్ ఆలస్యంగా చేరుకోవడం వల్ల ఆస్తి నష్టం భారీగా జరిగి ఉండొచ్చని సమాచారం. అయితే, ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. ఈ అగ్నిప్రమాదంపై పోలీసులు రంగంలోకి దిగి, షార్ట్‌సర్క్యూట్ కారణంగానే ఇది జరిగిందా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాదం జరిగిన ప్రాంతానికి సమీపంలోనే రసాయన పరిశ్రమ ఉన్నప్పటికీ, మంటలు అటువైపు వ్యాపించకపోవడంతో ఒక పెను ప్రమాదం తప్పింది.1