Shuru
Apke Nagar Ki App…
ఈరిపోగు జయరావును పరామర్శించిన YSRCP అదనపు సమన్వయకర్త నల్లేరు విశ్వనాథ రెడ్డి. బద్వేలు, ఆగస్టు 01: బద్వేలు నియోజకవర్గం లోని శ్రీ అవధూత కాశీ నాయన మండలం, వడ్డమాను గ్రామపంచాయతీ కి చెందిన YSR కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు, వడ్డమాను గ్రామపంచాయతీ మాజీ సర్పంచ్ ఈరిపోగు అల్ఫోన్సమ్మ భర్త ఈరిపోగు జయరావుకి గుండెకు సంబంధించిన చికిత్స జరిగిందన్న విషయం తెలుసుకున్న బద్వేలు నియోజకవర్గ YSRCP అదనపు సమన్వయకర్త నల్లేరు విశ్వనాథ రెడ్డి వారి నివాసానికి వెళ్లి పరామర్శించారు. ఈ సందర్భంగా జయరావు ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు. ఈరిపోగు జయరావు త్వరగా పూర్తిగా కోలుకొని, యథావిధిగా తన దైనందిన కార్యక్రమాల్లో పాల్గొనాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో YSR కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
జీ.మౌలాలి.
ఈరిపోగు జయరావును పరామర్శించిన YSRCP అదనపు సమన్వయకర్త నల్లేరు విశ్వనాథ రెడ్డి. బద్వేలు, ఆగస్టు 01: బద్వేలు నియోజకవర్గం లోని శ్రీ అవధూత కాశీ నాయన మండలం, వడ్డమాను గ్రామపంచాయతీ కి చెందిన YSR కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు, వడ్డమాను గ్రామపంచాయతీ మాజీ సర్పంచ్ ఈరిపోగు అల్ఫోన్సమ్మ భర్త ఈరిపోగు జయరావుకి గుండెకు సంబంధించిన చికిత్స జరిగిందన్న విషయం తెలుసుకున్న బద్వేలు నియోజకవర్గ YSRCP అదనపు సమన్వయకర్త నల్లేరు విశ్వనాథ రెడ్డి వారి నివాసానికి వెళ్లి పరామర్శించారు. ఈ సందర్భంగా జయరావు ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు. ఈరిపోగు జయరావు త్వరగా పూర్తిగా కోలుకొని, యథావిధిగా తన దైనందిన కార్యక్రమాల్లో పాల్గొనాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో YSR కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
More news from ఆంధ్రప్రదేశ్ and nearby areas
- బద్వేలు, ఆగస్టు 01: స్మార్ట్ కిచెన్ పేరుతో బద్వేలు మండల పరిధిలోని ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల కడుపులు మాడ్చుతున్నారని భారత ప్రజాతంత్ర యువజన సమాఖ్య (డివైఎఫ్ఐ) పట్టణ కార్యదర్శి ఎస్.కె.ఆదిల్, భారత విద్యార్థి ఫెడరేషన్ (ఎస్ఎఫ్ఐ) నాయకులు టి.నాగేంద్ర బాబు ఆరోపించారు.బద్వేలులోని స్థానిక ఎమ్మార్సీ వద్ద ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థులకు వేలాపాలా లేకుండా నాణ్యతలేని భోజనాన్ని ఇష్టారాజ్యంగా అందజేయడాన్ని నిరసిస్తూ డివైఎఫ్ఐ, ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా డివైఎఫ్ఐ పట్టణ కార్యదర్శి ఎస్.కె.ఆదిల్, ఎస్ఎఫ్ఐ నాయకులు టి.నాగేంద్ర బాబు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఈ ఏడాది అమలు చేసిన స్మార్ట్ కిచెన్ విధానంలో భాగంగా బద్వేలు మండల పరిధిలోని చిన్నకేశం పల్లె జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆవరణలో స్మార్ట్ కిచెన్ ను ఏర్పాటు చేశారన్నారు. స్మార్ట్ కిచెన్ ఏర్పాటు చేసినప్పటి నుండి విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందడం లేదన్నారు. అలాగే సమయపాలన లేకుండా ఇష్టారాజ్యంగా భోజనాన్ని పాఠశాలలకు సరఫరా చేస్తున్నారని పేర్కొన్నారు. పాఠశాలల షెడ్యూల్ ప్రకారం 12.15 నిమిషాలకు విద్యార్థులకు భోజనాన్ని అందజేయాల్సి ఉండగా పలు పాఠశాలల్లో 2 గంటలు దాటిన తర్వాత కూడా భోజనం సరఫరా చేస్తున్నారన్నారు. స్మార్ట్ కిచెన్ వారు భోజన సరఫరాకు తగినన్ని వాహనాలు, తగినన్ని వంట పాత్రలు ఏర్పాటు చేసుకోకపోవడం మూలాన దూర ప్రాంతాలకు చాలా ఆలస్యంగా భోజనం అందుతున్నదన్నారు. భోజనం ఆలస్యం కారణంగా విద్యార్థులు ఆకలితో అలమటిస్తూ పలు పాఠశాలల్లో కళ్ళు తిరిగి పడిపోయిన సందర్భాలున్నాయని ఆయన ఆరోపించారు. గ్రామీణ ప్రాంతాల్లో విద్యార్థుల తల్లిదండ్రులు వ్యవసాయ పనులకు వెళ్తారని, భోజనం ఆలస్యమైనప్పుడు విద్యార్థులు ఇళ్లకు వెళ్లి తినే అవకాశం కూడా లేదన్నారు. బద్వేల్ మండలంలో స్మార్ట్ కిచెన్ ప్రారంభించిన కొద్ది రోజుల్లోనే ఐదారుసార్లు మండల పరిధిలోని విద్యార్థులకు మధ్యాహ్నం 2 గంటలు దాటిన తర్వాత భోజనం సరఫరా చేశారన్నారు. భోజనం కోసం పిల్లలు గంటలు గంటలు నిరీక్షించాల్సి రావడం దారుణమన్నారు. స్మార్ట్ కిచెన్ నిర్వాహకులు మెనూ కూడా సక్రమంగా అనుసరించడం లేదని, వారి ఇష్టారాజ్యంగా భోజనం పెడుతున్నారని ఆరోపించారు. విద్యార్థులకు నాణ్యమైన పౌష్టిక ఆహారం అందించాలనే ప్రభుత్వ లక్ష్యం స్మార్ట్ కిచెన్ ద్వారా నెరవేరడం లేదని పేర్కొన్నారు. రుచి లేని ఆహార పదార్థాలను విద్యార్థులకు వడ్డిస్తున్నారని వారు ఆరోపించారు. గంటలు గంటలు ఆలస్యం కావడం వల్ల పాఠశాలల్లో తరగతులు కూడా విద్యార్థులు నష్టపోతున్నారన్నారు. ఈ విషయంపై ఇప్పటికే పత్రికల్లో కథనాలు వచ్చాయని, సాక్షాత్తు జిల్లా విద్యాశాఖ అధికారి ఆరోపణలపై విచారణకు వచ్చారని తెలిపారు. అయినప్పటికీ పరిస్థితులలో ఎలాంటి మార్పులు లేవని వారు ఆరోపించారు. మెనూ ప్రకారం వారంలో రెండు మార్లు గుడ్డు కూర, మూడు సార్లు ఉడకబెట్టిన గుడ్డును అందజేయాల్సి ఉండగా, గుడ్డు కూర ఇవ్వకుండా ఉడకబెట్టిన గుడ్డును అందజేస్తున్నారన్నారు. ఈ విషయంలో బద్వేలు మండల విద్యాశాఖ అధికారి సక్రమంగా స్పందించడం లేదని ఆరోపించారు. ఇప్పటికైనా జిల్లా విద్యాశాఖ అధికారులు జోక్యం చేసుకొని నాణ్యమైన భోజనాన్ని, కాలంలో అందించేందుకు చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో జిల్లా కలెక్టర్, విద్యా శాఖ మంత్రి కి ఫిర్యాదు చేయడంతో పాటు ఆందోళనను తీవ్రతరం చేస్తామని వారు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో డివైఎఫ్ఐ పట్టణ సహాయ కార్యదర్శి సి.సుధాకర్, నాయకులు రామాంజనేయులు, అబ్దుల్ రెహమాన్, రాజు, భాష తదితరులు పాల్గొన్నారు.1
- అభివృద్ధి, థింసా నృత్యంతో చరిత్ర సృష్టించాం: మోదీ AP: అల్లూరి సీతారామరాజు నడయాడిన గొప్ప నేల ఉత్తరాంధ్ర అని ప్రధాని మోదీ కొనియాడారు. ఇక్కడ కొత్త ఎయిర్పోర్టు ప్రారంభంతో ఈ ప్రాంత ప్రగతికి బాట పడుతుందని చెప్పారు. 'ఇవాళ అభివృద్ధి, థింసా నృత్యంతో చరిత్ర సృష్టించాం. ఒకేసారి 13వేల మందికి పైగా గిరిజనులు థింసా నృత్యం చేయడం అద్భుతం. ఈ నృత్యంలో మన తరతరాల వారసత్వం కనిపించింది. ఇందుకు కారణమైన చంద్రబాబు విజన్కు అభినందనలు' అని పేర్కొన్నారు. అభివృద్ధి, థింసా నృత్యంతో చరిత్ర సృష్టించాం: మోదీ AP: అల్లూరి సీతారామరాజు నడయాడిన గొప్ప నేల ఉత్తరాంధ్ర అని ప్రధాని మోదీ కొనియాడారు. ఇక్కడ కొత్త ఎయిర్పోర్టు ప్రారంభంతో ఈ ప్రాంత ప్రగతికి బాట పడుతుందని చెప్పారు. 'ఇవాళ అభివృద్ధి, థింసా నృత్యంతో చరిత్ర సృష్టించాం. ఒకేసారి 13వేల మందికి పైగా గిరిజనులు థింసా నృత్యం చేయడం అద్భుతం. ఈ నృత్యంలో మన తరతరాల వారసత్వం కనిపించింది. ఇందుకు కారణమైన చంద్రబాబు విజన్కు అభినందనలు' అని పేర్కొన్నారు.1
- ప్రొద్దుటూరు పట్టణంలోని పప్పుల బట్టి వీధిలో నూతనంగా నిర్మించిన గంగమ్మ ఆలయంలో ఆషాఢ మాసం శనివారం సందర్భంగా ప్రత్యేక పూజలు జరిగాయి. ఆలయ అర్చకులు అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించారు.భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో భక్తులకు అన్నప్రసాద వితరణ చేపట్టారు.1
- కోవూరు ఏఎంసీ చైర్మన్ ని బెజవాడ వంశీ కృష్ణారెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసిన టిడిపి నాయకులు, అభినందన వెల్లువ కోవూరు ఏఎంసీ చైర్మన్ ని బెజవాడ వంశీ కృష్ణారెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసిన టిడిపి నాయకులు కోవూరు నియోజకవర్గం కోవూరు వ్యవసాయ మార్కెటింగ్ చైర్మన్ గా నూతన బాధ్యతలు స్వీకరించిన బెజవాడ వంశీకృష్ణారెడ్డిని మిడవలూరు మండలం టీడీపీ నాయకులు మర్యాదపూర్వకంగా కలిసి ఆయన్ని శాలువాతో సత్కరించి, పూలమాలవేసి బాణాసంచా పేల్చి శుభాకాంక్షలు తెలపటం జరిగింది. టిడిపి నాయకులు మాట్లాడుతూ ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డికి, ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డికి నాయకులంతా కృతజ్ఞతలు తెలిపారు. ఎప్పుడు పార్టీ కోసం కష్టపడుతుంటాడనిఇలాంటి పదవి ఇవ్వటం మాకెంతో సంతోషంగా ఉందని తెలిపారు.4
- వర్షాభావంతో రైతు కన్నీరు: సీపీఐ యం ఎల్ లిబరేషన్ పార్టీ నేత వెంకటేశ్వర్లు జూపాడు బంగ్లాకు చెందిన కౌలు రైతు రవీంద్ర అయితే ఎకరాల్లో మొక్కజొన్న సాగు చేశారు. వర్షాభావంతో పంట పూర్తిగా దెబ్బతింది. చేతికి వచ్చే దశలో ఉన్న పంట ఎండిపోవడంతో చివరికి చేసేదేమీ లేక ట్రాక్టర్‌తో దున్నవలసి వచ్చిందని రైతు వాపోయాడు. దీంతో ఆర్థికంగా ఎంతో నష్టపోయానని రైతు విలపించాడు. ప్రభుత్వం నష్టపరిహారం ఇవ్వాలన్నారు. జూపాడుబంగ్లాను కరువు మండలంగా ప్రకటించాలని సీపీఐ (యం ఎల్) నేత వెంకటేశ్వర్లు కోరారు1
- జలాదివాసంలోకి సంగమేశ్వరుడు..శివలింగానికి కృష్ణానది జలాలతో ప్రత్యేక అభిషేకాలు కొత్తపల్లి మండలం సప్తనదుల సంగమ క్షేత్రలోని సంగమేశ్వరుడిని కృష్ణ నది జలాలు తాకాయి.ఎగువ ప్రాంతాల నుంచి కృష్ణ నదికి వరద ఉధృతి పెరగడంతో కృష్ణా జలాలు ఆలయాన్ని చుట్టుముట్టాయి. ఈ శుభ సందర్భాన్ని పురస్కరించుకుని ఆలయ ప్రధాన పురోహితులు రఘురామ శర్మ సంగమేశ్వర స్వామి గర్భాలయంలో వేపదారు శివలింగానికి చివరిసారిగా కృష్ణానది జలాలతో ప్రత్యేక అభిషేకాలు చేసి పూజలు నిర్వహించారు . అనంతరం కృష్ణమ్మకు ప్రత్యేక పూజలు నిర్వహించి చీర సారె సమర్పించి గంగా హారతి ఇచ్చారు. తెలుగు రాష్ట్రాల్లో ఉన్న అత్యంత ప్రాచీన, ఆధ్యాత్మిక విశిష్టత కలిగిన పుణ్యక్షేత్రాలలో సంగమేశ్వరం ఒకటి. కృష్ణ, వేణి,తుంగ,భద్ర, భీమా, మలపహారిణి, భవనాసి అనే నదుల కలయికతో సప్తనదీ సంగమంగా ప్రఖ్యాతి గాంచింది. ద్వాపర యుగంలో పాండవులు వనవాస సమయంలో ధర్మరాజు ఇక్కడ వేప చెట్టును నరికి వేపదారు శివలింగాన్ని ప్రతిష్టించాడని, అందుకే స్వామి వారిని వేపదారు సంగమేశ్వరుడు అని కూడా పిలుస్తారు . శ్రీశైలం జలాశయం వెనుక జలాల్లో ఉండే ఈ దేవాలయం, ప్రతి సంవత్సరం నాలుగు నెలలు భక్తులకు దర్శనమిచ్చి మరో ఎనిమిది నెలలు శ్రీశైలం బ్యాక్ వాటర్లో మునిగిపోతుంది.ఈ సంవత్సరం మార్చి 22వ తారీఖున సంగమేశ్వరాలయం బయటపడగా ఆగస్టు ఒకటో తేదీ వరకు సంగమేశ్వరుడు 131 పూజలందుకొని జలాదివాసంలోకి వెళ్లినట్లు ఆలయ పురోహితులు రఘురామ శర్మ తెలుపారు. తెలుగు రాష్ట్రాలలో ఎలినో ప్రభావంతో వర్షాలు లేకపోవడంతో శ్రీశైలం జలాశయం పూర్తిగా అడుగంటింది. దీంతో సంగమేశ్వరుడు సుమారు ఐదు నెలల పాటు భక్తులచె పూజలు అందుకున్నాడు. శ్రీశైలం జలాశయంలో 840 అడుగులకు నీరు చేరుకోవడంతో ఆలయంలో కి కృష్ణానది జలాలు చేరడంతో సంగమేశ్వరుడు జలాదివాసములోకి వెళ్ళాడు.శ్రీశైలం జలాశయంలో నీరు 850 అడుగులకు చేరుకుంటే సంగమేశ్వర క్షేత్రం పూర్తిగా జలాధివాసంలోకి వెళుతుంది.1
- పలుకూరు విద్యార్థులకు నగదు పురస్కారాలు బ్రహ్మానంద చారి బనగానపల్లె మండలం పలుకూరు గ్రామం జిల్లా పరిషత్ పాఠశాల యందు జే కే ఆర్ సంక్షేమ సంఘం అధ్యక్షులు జే ఎస్ ఎస్ బ్రహ్మానంద చారి గత సంవత్సరం 10వ తరగతిలో ప్రతిభ కనిపించిన సాయి దీపిక ఎస్ చంద్ర హసన్ 1200 ప్రకారం 3600 ఇవ్వడం జరిగినది అలాగే అచ్చిత రేష్మ చరిత కమ్మరి శరణ్య అనే విద్యార్థులకు ₹1000 ప్రకారం 3000 రూపాయలు నగదు పురస్కారం ఇవ్వడం జరిగినది ఈ కార్యక్రమంలో విద్య యొక్క విశిష్టత పై మాట్లాడారు ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు నందప్ప పరమేశ్వరుడు కృష్ణారెడ్డి ఉపాధ్యాయ బృందం విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు హెచ్ఎం గౌరీ శంకర్ ను బ్రహ్మానంద చారి ఘనంగా సన్మానించి విద్యార్థులకు నగదు పురస్కారాలు అందజేశారు ఈ కార్యక్రమంలో విద్యార్థులు వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు.2
- కూటమి ప్రభుత్వంలోనే అన్ని వర్గాలకు భరోసా: రఘునాథ్ రెడ్డి సంక్షేమ, అభివృద్ధి పాలనపై కూటమి ప్రభుత్వంలోనే అన్ని వర్గాలకు భరోసా లభిస్తోందని టీడీపీ నేత రఘునాథ్ రెడ్డి అన్నారు. వేంపల్లి లోని పుల్లయ్య తోట ప్రాంతాల్లోని ప్రతి ఇంటికి వెళ్లి ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలుపై ఆరాతీసారు. అలాగే ఆ ప్రాంతంలోని వివిధ సమస్యలపై ప్రజలను అడిగి తెలుసుకున్నారు. సూపర్ సిక్స్ పథకాల అమలు ద్వారా ప్రతి ఇంటా ఆనందం వ్యక్తం అవుతోందన్నారు.1