logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

నేరడిగొండ మండలం ఆరేపల్లి గ్రామస్తుల ఆహ్వానం మేరకు బోథ్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి ఆడే గజేందర్ శుక్రవారం గ్రామాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన గ్రామ ప్రజలతో సమావేశమై వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. గ్రామస్తులు తాగునీటి సమస్యను ఆయన దృష్టికి తీసుకురాగా, వెంటనే స్పందించిన ఆడే గజేందర్ కొత్త బోర్ మంజూరు చేయించారు. అనంతరం నూతన బోర్ ఏర్పాటుకు భూమిపూజ నిర్వహించగా, గ్రామస్తులు ఆయనకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా ప్రజలు ఎప్పుడు పిలిచినా అందుబాటులో ఉండి సమస్యలను పరిష్కరిస్తానని ఆడే గజేందర్ హామీ ఇచ్చారు. గ్రామంలో కొనసాగుతున్న ఎస్‌ఐఆర్ (SIR) ఎన్యూమరేషన్ ప్రక్రియను కూడా ఆడే గజేందర్ పరిశీలించారు. బీఎల్‌వోలతో మాట్లాడి నమోదు ప్రక్రియ వివరాలను తెలుసుకున్న ఆయన, ప్రతి అర్హుడి పేరు ఓటరు జాబితాలో నమోదయ్యేలా ఎలాంటి పొరపాట్లు లేకుండా విధులు నిర్వహించాలని సూచించారు. అర్హులైన ప్రతి ఒక్కరి ఓటు హక్కును పరిరక్షించేందుకు ఎన్యూమరేషన్‌లో అందరూ భాగస్వాములు కావాలని ఆయన పిలుపునిచ్చారు. అలాగే, అర్హులందరికీ ఇందిరమ్మ ఇళ్ల మంజూరు కోసం కృషి చేస్తామని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో తిత్రే నారాయణ్ సింగ్, మల్లేష్ పటేల్, శ్రీకాంత్, కమల్ సింగ్, బద్దం పోతరెడ్డి, గంగాప్రసాద్, సాబ్లే కైలాష్, ఆత్రం నగేష్, అందు సింగ్, పులి సురేష్‌తో పాటు పలువురు నాయకులు, కార్యకర్తలు మరియు గ్రామస్తులు పాల్గొన్నారు.

1 day ago
user_AlluriMahesh
AlluriMahesh
Local News Reporter Adilabad Urban, Telangana•
1 day ago
382ef713-ea15-4321-b5e7-a354700a9a57

నేరడిగొండ మండలం ఆరేపల్లి గ్రామస్తుల ఆహ్వానం మేరకు బోథ్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి ఆడే గజేందర్ శుక్రవారం గ్రామాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన గ్రామ ప్రజలతో సమావేశమై వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. గ్రామస్తులు తాగునీటి సమస్యను ఆయన దృష్టికి తీసుకురాగా, వెంటనే స్పందించిన ఆడే గజేందర్

d93fe86d-a9b9-4468-9d40-eb8266f7859c

కొత్త బోర్ మంజూరు చేయించారు. అనంతరం నూతన బోర్ ఏర్పాటుకు భూమిపూజ నిర్వహించగా, గ్రామస్తులు ఆయనకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా ప్రజలు ఎప్పుడు పిలిచినా అందుబాటులో ఉండి సమస్యలను పరిష్కరిస్తానని ఆడే గజేందర్ హామీ ఇచ్చారు. గ్రామంలో కొనసాగుతున్న ఎస్‌ఐఆర్ (SIR) ఎన్యూమరేషన్ ప్రక్రియను కూడా ఆడే గజేందర్ పరిశీలించారు.

1dea84d9-6d0a-41aa-971e-cacfac106528

బీఎల్‌వోలతో మాట్లాడి నమోదు ప్రక్రియ వివరాలను తెలుసుకున్న ఆయన, ప్రతి అర్హుడి పేరు ఓటరు జాబితాలో నమోదయ్యేలా ఎలాంటి పొరపాట్లు లేకుండా విధులు నిర్వహించాలని సూచించారు. అర్హులైన ప్రతి ఒక్కరి ఓటు హక్కును పరిరక్షించేందుకు ఎన్యూమరేషన్‌లో అందరూ భాగస్వాములు కావాలని ఆయన పిలుపునిచ్చారు. అలాగే, అర్హులందరికీ ఇందిరమ్మ ఇళ్ల మంజూరు

a50b460f-d67f-4b48-9b31-e35a61eab63c

కోసం కృషి చేస్తామని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో తిత్రే నారాయణ్ సింగ్, మల్లేష్ పటేల్, శ్రీకాంత్, కమల్ సింగ్, బద్దం పోతరెడ్డి, గంగాప్రసాద్, సాబ్లే కైలాష్, ఆత్రం నగేష్, అందు సింగ్, పులి సురేష్‌తో పాటు పలువురు నాయకులు, కార్యకర్తలు మరియు గ్రామస్తులు పాల్గొన్నారు.

More news from తెలంగాణ and nearby areas
  • ఆదిలాబాద్ పట్టణంలోని రైతు బజార్ పరిసర ప్రాంతాలు ప్రస్తుతం తీవ్ర అపరిశుభ్రతతో నిండిపోయాయి. మార్కెట్ చుట్టుపక్కల పేరుకుపోయిన చెత్తాచెదారం కారణంగా స్థానికులు దుర్వాసనతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రస్తుతం వర్షాకాలం కొనసాగుతున్న నేపథ్యంలో, ఈ అపరిశుభ్రత వల్ల అంటువ్యాధులు ప్రబలే ప్రమాదం ఉందని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తక్షణమే స్పందించి పరిసర ప్రాంతాల నుండి చెత్తను తొలగించాలని స్థానికులు అధికారులను కోరుతున్నారు.
    1
    ఆదిలాబాద్ పట్టణంలోని రైతు బజార్ పరిసర ప్రాంతాలు ప్రస్తుతం తీవ్ర అపరిశుభ్రతతో నిండిపోయాయి. మార్కెట్ చుట్టుపక్కల పేరుకుపోయిన చెత్తాచెదారం కారణంగా స్థానికులు దుర్వాసనతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

ప్రస్తుతం వర్షాకాలం కొనసాగుతున్న నేపథ్యంలో, ఈ అపరిశుభ్రత వల్ల అంటువ్యాధులు ప్రబలే ప్రమాదం ఉందని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తక్షణమే స్పందించి పరిసర ప్రాంతాల నుండి చెత్తను తొలగించాలని స్థానికులు అధికారులను కోరుతున్నారు.
    user_Mallaiah Potta
    Mallaiah Potta
    ఆదిలాబాద్ అర్బన్, ఆదిలాబాద్, తెలంగాణ•
    15 hrs ago
  • ఆదిలాబాద్ పట్టణంలోని బడ్కా మొహల్లాలో ఉన్న మోతీ మసీదు ప్రాంగణంలో విద్యార్థులు మరియు నిరుద్యోగ యువత కోసం ఒక ఉచిత కోచింగ్ సెంటర్‌తో పాటు లైబ్రరీని ఏర్పాటు చేస్తున్నట్లు వ్యవస్థాపకుడు ఇంటేఖాబ్ ఆలం ప్రకటించారు. ఐఏఎస్, ఇతర సివిల్ సర్వీసులు, వివిధ ప్రభుత్వ ఉద్యోగాలు మరియు ప్రవేశ పరీక్షలకు సిద్ధమవుతున్న అభ్యర్థులకు ఇక్కడ నాణ్యమైన శిక్షణ అందించనున్నారు. ఈ కేంద్రంలో పోటీ పరీక్షలకు అవసరమైన పుస్తకాలను అందుబాటులో ఉంచడంతో పాటు, నిపుణుల మార్గదర్శకత్వం మరియు ప్రశాంతమైన అధ్యయన వాతావరణాన్ని కల్పిస్తామని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమానికి మాజీ డీసీసీ అధ్యక్షుడు సాజిద్ ఖాన్ ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. ఆర్థిక ఇబ్బందుల కారణంగా కోచింగ్ పొందలేకపోతున్న విద్యార్థులకు ఈ కేంద్రం ఎంతో ఉపయోగపడుతుందని ఆయన పేర్కొన్నారు. విద్యావంతులైన యువతకు మెరుగైన అవకాశాలు కల్పించడమే ఈ కార్యక్రమం యొక్క ప్రధాన లక్ష్యమని చెబుతూ, యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ఉన్నత లక్ష్యాలను సాధించాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రముఖులు, మసీదు కమిటీ సభ్యులు, యువత మరియు విద్యార్థులు పాల్గొని, ఈ ప్రయత్నాన్ని అభినందించారు.
    3
    ఆదిలాబాద్ పట్టణంలోని బడ్కా మొహల్లాలో ఉన్న మోతీ మసీదు ప్రాంగణంలో విద్యార్థులు మరియు నిరుద్యోగ యువత కోసం ఒక ఉచిత కోచింగ్ సెంటర్‌తో పాటు లైబ్రరీని ఏర్పాటు చేస్తున్నట్లు వ్యవస్థాపకుడు ఇంటేఖాబ్ ఆలం ప్రకటించారు. ఐఏఎస్, ఇతర సివిల్ సర్వీసులు, వివిధ ప్రభుత్వ ఉద్యోగాలు మరియు ప్రవేశ పరీక్షలకు సిద్ధమవుతున్న అభ్యర్థులకు ఇక్కడ నాణ్యమైన శిక్షణ అందించనున్నారు. ఈ కేంద్రంలో పోటీ పరీక్షలకు అవసరమైన పుస్తకాలను అందుబాటులో ఉంచడంతో పాటు, నిపుణుల మార్గదర్శకత్వం మరియు ప్రశాంతమైన అధ్యయన వాతావరణాన్ని కల్పిస్తామని ఆయన తెలిపారు.

ఈ కార్యక్రమానికి మాజీ డీసీసీ అధ్యక్షుడు సాజిద్ ఖాన్ ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. ఆర్థిక ఇబ్బందుల కారణంగా కోచింగ్ పొందలేకపోతున్న విద్యార్థులకు ఈ కేంద్రం ఎంతో ఉపయోగపడుతుందని ఆయన పేర్కొన్నారు. విద్యావంతులైన యువతకు మెరుగైన అవకాశాలు కల్పించడమే ఈ కార్యక్రమం యొక్క ప్రధాన లక్ష్యమని చెబుతూ, యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ఉన్నత లక్ష్యాలను సాధించాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రముఖులు, మసీదు కమిటీ సభ్యులు, యువత మరియు విద్యార్థులు పాల్గొని, ఈ ప్రయత్నాన్ని అభినందించారు.
    user_AlluriMahesh
    AlluriMahesh
    Local News Reporter Adilabad Urban, Telangana•
    23 hrs ago
  • జగిత్యాలలో కేంద్రీయ విద్యాలయం ఏర్పాటు కోసం తాను చేసిన ప్రయత్నాలకు సంబంధించిన ఆధారాలు తన వద్ద ఉన్నాయని ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ స్పష్టం చేశారు. జగిత్యాల మోతే రోడ్డులోని జిల్లా పార్టీ కార్యాలయంలో శనివారం మధ్యాహ్నం 2:30 గంటల ప్రాంతంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఆదివారం జరగనున్న కేంద్రీయ విద్యాలయం భూమి పూజ కార్యక్రమం గురించి ఆయన ఈ సందర్భంగా వివరాలు వెల్లడించారు. జగిత్యాలలో కేంద్రీయ విద్యాలయం ఏర్పాటు కోసం తామే పోరాటం చేశామని కొందరు చెప్పుకోవడం హాస్యాస్పదంగా ఉందని ఎమ్మెల్యే ఎద్దేవా చేశారు. కేంద్రీయ విద్యాలయం భవన నిర్మాణాన్ని త్వరగా పూర్తి చేయడానికి స్థానిక ఎంపీ కృషి చేయాలని, అలాగే విద్యార్థులకు రెగ్యులర్ సిబ్బందితో బోధన సాగేలా చొరవ చూపాలని ఆయన కోరారు. అభివృద్ధి పనుల విషయంలో తనకు ఎలాంటి భేషజాలు లేవని, విద్యార్థులకు నాణ్యమైన విద్య అందడమే తనకు ముఖ్యమని ఆయన స్పష్టం చేశారు. మంత్రులు, ఎంపీతో కలిసి పనిచేస్తూ జగిత్యాల అభివృద్ధికి శ్రమిస్తానని, రేపటి భూమి పూజ కార్యక్రమం గురించి ఇప్పటికే వారితో మాట్లాడడం జరిగిందని ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ వివరించారు.
    1
    జగిత్యాలలో కేంద్రీయ విద్యాలయం ఏర్పాటు కోసం తాను చేసిన ప్రయత్నాలకు సంబంధించిన ఆధారాలు తన వద్ద ఉన్నాయని ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ స్పష్టం చేశారు. జగిత్యాల మోతే రోడ్డులోని జిల్లా పార్టీ కార్యాలయంలో శనివారం మధ్యాహ్నం 2:30 గంటల ప్రాంతంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఆదివారం జరగనున్న కేంద్రీయ విద్యాలయం భూమి పూజ కార్యక్రమం గురించి ఆయన ఈ సందర్భంగా వివరాలు వెల్లడించారు.

జగిత్యాలలో కేంద్రీయ విద్యాలయం ఏర్పాటు కోసం తామే పోరాటం చేశామని కొందరు చెప్పుకోవడం హాస్యాస్పదంగా ఉందని ఎమ్మెల్యే ఎద్దేవా చేశారు. కేంద్రీయ విద్యాలయం భవన నిర్మాణాన్ని త్వరగా పూర్తి చేయడానికి స్థానిక ఎంపీ కృషి చేయాలని, అలాగే విద్యార్థులకు రెగ్యులర్ సిబ్బందితో బోధన సాగేలా చొరవ చూపాలని ఆయన కోరారు. అభివృద్ధి పనుల విషయంలో తనకు ఎలాంటి భేషజాలు లేవని, విద్యార్థులకు నాణ్యమైన విద్య అందడమే తనకు ముఖ్యమని ఆయన స్పష్టం చేశారు. మంత్రులు, ఎంపీతో కలిసి పనిచేస్తూ జగిత్యాల అభివృద్ధికి శ్రమిస్తానని, రేపటి భూమి పూజ కార్యక్రమం గురించి ఇప్పటికే వారితో మాట్లాడడం జరిగిందని ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ వివరించారు.
    user_Sk chaitanya
    Sk chaitanya
    జగిత్యాల, జగిత్యాల, తెలంగాణ•
    4 hrs ago
  • నిర్మల్ జిల్లా బాసరలోని సుప్రసిద్ధ జ్ఞాన సరస్వతి అమ్మవారి ఆలయ పునర్నిర్మాణ పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. ఈ ప్రాజెక్టులో భాగంగా మొదటి విడతలో హైదరాబాద్‌కు చెందిన సూర్యమనేని సునంద్ మరియు పద్మప్రియ దంపతులు సుమారు ₹31 కోట్ల పైచిలుకు సొంత నిధులతో ఆలయ గర్భగుడి విస్తరణ మరియు నిర్మాణ పనులను చేపట్టారు. గత ఐదు రోజులుగా ఆలయానికి సంబంధించి ఉత్తరద్వార గోపురంతో పాటు, వెయ్యి రూపాయల ప్రధాన అక్షరాభ్యాసం మండపాన్ని కూల్చివేసి పునర్నిర్మాణ ప్రక్రియను వేగవంతం చేశారు. ప్రస్తుతం భక్తుల దర్శనాల కోసం ఆలయం పక్కనే ప్రత్యేకంగా బాలాలయాన్ని ఏర్పాటు చేశారు. ఇక్కడ సరస్వతీ, మహాలక్ష్మి, మహాకాళి అమ్మవారిని దర్శించుకోవడంతో పాటు, భక్తులు తమ చిన్నారులకు అక్షరాభ్యాస పూజలను నిర్వహిస్తున్నారు.
    1
    నిర్మల్ జిల్లా బాసరలోని సుప్రసిద్ధ జ్ఞాన సరస్వతి అమ్మవారి ఆలయ పునర్నిర్మాణ పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. ఈ ప్రాజెక్టులో భాగంగా మొదటి విడతలో హైదరాబాద్‌కు చెందిన సూర్యమనేని సునంద్ మరియు పద్మప్రియ దంపతులు సుమారు ₹31 కోట్ల పైచిలుకు సొంత నిధులతో ఆలయ గర్భగుడి విస్తరణ మరియు నిర్మాణ పనులను చేపట్టారు.

గత ఐదు రోజులుగా ఆలయానికి సంబంధించి ఉత్తరద్వార గోపురంతో పాటు, వెయ్యి రూపాయల ప్రధాన అక్షరాభ్యాసం మండపాన్ని కూల్చివేసి పునర్నిర్మాణ ప్రక్రియను వేగవంతం చేశారు. ప్రస్తుతం భక్తుల దర్శనాల కోసం ఆలయం పక్కనే ప్రత్యేకంగా బాలాలయాన్ని ఏర్పాటు చేశారు. ఇక్కడ సరస్వతీ, మహాలక్ష్మి, మహాకాళి అమ్మవారిని దర్శించుకోవడంతో పాటు, భక్తులు తమ చిన్నారులకు అక్షరాభ్యాస పూజలను నిర్వహిస్తున్నారు.
    user_RP
    RP
    Academy బాసర, నిర్మల్, తెలంగాణ•
    19 hrs ago
  • బోధన్ పట్టణం మరియు మండల పరిధిలో కొనసాగుతున్న ఓటరు జాబితా ప్రత్యేక సవరణ కార్యక్రమాన్ని (ఎస్‌ఐఆర్) ప్రతి ఓటరు సద్వినియోగం చేసుకోవాలని తహసీల్దార్ విట్టల్ సూచించారు. ఎన్నికల సంఘం చేపట్టిన ఈ ప్రక్రియలో భాగంగా, ఓటర్లకు అందజేసిన దరఖాస్తు ఫారాలను పూర్తిగా నింపి నిర్ణీత గడువులోగా సంబంధిత అధికారులకు సమర్పించాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంపై నిర్లక్ష్యం వహించినా లేదా ఫారాలను సమర్పించకపోయినా, ఓటరు జాబితా నుండి పేర్లు తొలగిపోయే అవకాశం ఉందని, తద్వారా భవిష్యత్తులో ఓటు హక్కును కోల్పోయే ప్రమాదం ఉందని ఆయన హెచ్చరించారు. బోధన్ పట్టణంలో ఇప్పటివరకు కేవలం 45 శాతం ఫారాలు మాత్రమే అధికారులకు అందాయని, ఇంకా 55 శాతం దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయని ఆయన వెల్లడించారు. ప్రజలకు సౌలభ్యం కల్పించేందుకు రేషన్ దుకాణాల వద్ద ప్రత్యేక ఎన్యుమరేటర్లను నియమించామని ఆయన తెలిపారు. ప్రజాప్రతినిధులు, కౌన్సిలర్లు మరియు ప్రభుత్వ ఉద్యోగులు ప్రజల్లో అవగాహన కల్పించి, ఈ దరఖాస్తుల సమర్పణ ప్రక్రియను వేగవంతం చేయాలని తహసీల్దార్ విట్టల్ విజ్ఞప్తి చేశారు.
    1
    బోధన్ పట్టణం మరియు మండల పరిధిలో కొనసాగుతున్న ఓటరు జాబితా ప్రత్యేక సవరణ కార్యక్రమాన్ని (ఎస్‌ఐఆర్) ప్రతి ఓటరు సద్వినియోగం చేసుకోవాలని తహసీల్దార్ విట్టల్ సూచించారు. ఎన్నికల సంఘం చేపట్టిన ఈ ప్రక్రియలో భాగంగా, ఓటర్లకు అందజేసిన దరఖాస్తు ఫారాలను పూర్తిగా నింపి నిర్ణీత గడువులోగా సంబంధిత అధికారులకు సమర్పించాలని ఆయన కోరారు.

ఈ కార్యక్రమంపై నిర్లక్ష్యం వహించినా లేదా ఫారాలను సమర్పించకపోయినా, ఓటరు జాబితా నుండి పేర్లు తొలగిపోయే అవకాశం ఉందని, తద్వారా భవిష్యత్తులో ఓటు హక్కును కోల్పోయే ప్రమాదం ఉందని ఆయన హెచ్చరించారు. బోధన్ పట్టణంలో ఇప్పటివరకు కేవలం 45 శాతం ఫారాలు మాత్రమే అధికారులకు అందాయని, ఇంకా 55 శాతం దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయని ఆయన వెల్లడించారు. ప్రజలకు సౌలభ్యం కల్పించేందుకు రేషన్ దుకాణాల వద్ద ప్రత్యేక ఎన్యుమరేటర్లను నియమించామని ఆయన తెలిపారు. ప్రజాప్రతినిధులు, కౌన్సిలర్లు మరియు ప్రభుత్వ ఉద్యోగులు ప్రజల్లో అవగాహన కల్పించి, ఈ దరఖాస్తుల సమర్పణ ప్రక్రియను వేగవంతం చేయాలని తహసీల్దార్ విట్టల్ విజ్ఞప్తి చేశారు.
    user_Purane Dileep
    Purane Dileep
    బోధన్, నిజామాబాద్, తెలంగాణ•
    12 hrs ago
  • మంచిర్యాల జిల్లా కేంద్రంలోని చార్వాక ట్రస్ట్ ప్రాంగణంలో బహుజన్ సమాజ్ పార్టీ జిల్లా కార్యవర్గ సమావేశం జిల్లా అధ్యక్షుడు ముల్కల్ల రాజేంద్రప్రసాద్ అధ్యక్షతన జరిగింది. ఈ కార్యక్రమానికి వరంగల్ జోన్-2 చీఫ్ జోనల్ ఇంచార్జ్ దాగిల్ల దయానందరావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. సమావేశం ప్రారంభంలో పార్టీ నాయకులు మహనీయుల చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో పెద్దపల్లి పార్లమెంట్ ఇంచార్జ్ కాదాసి రవీందర్, వర్కిల్ల మల్లేష్ విశిష్ట అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథి దాగిళ్ల దయానందరావు మాట్లాడుతూ, భారతదేశ చరిత్రను తిరగరాసేది బహన్ మాయావతి గారేనని స్పష్టం చేశారు. రాజ్యాంగ రక్షణ, అణగారిన వర్గాల అభివృద్ధి సాధించడమే బహుజన్ సమాజ్ పార్టీ లక్ష్యమని పేర్కొన్నారు. 2027లో ఉత్తరప్రదేశ్‌లో బీఎస్పీ అధికారాన్ని కైవసం చేసుకుంటుందని, అదే స్ఫూర్తితో 2028లో తెలంగాణలోనూ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ జెండా ఎగురవేయాలని పిలుపునిచ్చిన ఆయన, జిల్లాలో పార్టీ బలోపేతానికి నాయకులు, కార్యకర్తలు నిరంతరం కృషి చేయాలన్నారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్త పెట్టం చంద్రశేఖర్, మహనీయుల ఆలోచనలకు ఆకర్షితులై బహుజన సమాజ్ పార్టీలో చేరారు. ముఖ్య అతిథి దయానందరావు ఆయనకు పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించి, మంచిర్యాల నియోజకవర్గం ఇంచార్జిగా ప్రకటించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు బోయిన్పల్లి సంతోష్ కుమార్, జిల్లా ప్రధాన కార్యదర్శి రామిళ్ళ మురళి, బెల్లంపల్లి నియోజకవర్గ ఇంచార్జ్‌లు గోమాస బ్రహ్మానందం, గోలేటి నారాయణ, మంచిర్యాల నియోజకవర్గ అధ్యక్షులు బండారి రాజ్ కుమార్, చెన్నూరు నియోజకవర్గం అధ్యక్షులు గాజుల శంకర్, నియోజకవర్గ ఉపాధ్యక్షులు ఎండి మాతిన్ ఖాన్, నస్పూర్ మండల అధ్యక్షుడు వేముల కిరణ్, నాయకుడు జాగిరి రాజేష్ తదితరులు పాల్గొన్నారు.
    1
    మంచిర్యాల జిల్లా కేంద్రంలోని చార్వాక ట్రస్ట్ ప్రాంగణంలో బహుజన్ సమాజ్ పార్టీ జిల్లా కార్యవర్గ సమావేశం జిల్లా అధ్యక్షుడు ముల్కల్ల రాజేంద్రప్రసాద్ అధ్యక్షతన జరిగింది. ఈ కార్యక్రమానికి వరంగల్ జోన్-2 చీఫ్ జోనల్ ఇంచార్జ్ దాగిల్ల దయానందరావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. సమావేశం ప్రారంభంలో పార్టీ నాయకులు మహనీయుల చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో పెద్దపల్లి పార్లమెంట్ ఇంచార్జ్ కాదాసి రవీందర్, వర్కిల్ల మల్లేష్ విశిష్ట అతిథులుగా పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ముఖ్య అతిథి దాగిళ్ల దయానందరావు మాట్లాడుతూ, భారతదేశ చరిత్రను తిరగరాసేది బహన్ మాయావతి గారేనని స్పష్టం చేశారు. రాజ్యాంగ రక్షణ, అణగారిన వర్గాల అభివృద్ధి సాధించడమే బహుజన్ సమాజ్ పార్టీ లక్ష్యమని పేర్కొన్నారు. 2027లో ఉత్తరప్రదేశ్‌లో బీఎస్పీ అధికారాన్ని కైవసం చేసుకుంటుందని, అదే స్ఫూర్తితో 2028లో తెలంగాణలోనూ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ జెండా ఎగురవేయాలని పిలుపునిచ్చిన ఆయన, జిల్లాలో పార్టీ బలోపేతానికి నాయకులు, కార్యకర్తలు నిరంతరం కృషి చేయాలన్నారు.

ఈ సమావేశంలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్త పెట్టం చంద్రశేఖర్, మహనీయుల ఆలోచనలకు ఆకర్షితులై బహుజన సమాజ్ పార్టీలో చేరారు. ముఖ్య అతిథి దయానందరావు ఆయనకు పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించి, మంచిర్యాల నియోజకవర్గం ఇంచార్జిగా ప్రకటించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు బోయిన్పల్లి సంతోష్ కుమార్, జిల్లా ప్రధాన కార్యదర్శి రామిళ్ళ మురళి, బెల్లంపల్లి నియోజకవర్గ ఇంచార్జ్‌లు గోమాస బ్రహ్మానందం, గోలేటి నారాయణ, మంచిర్యాల నియోజకవర్గ అధ్యక్షులు బండారి రాజ్ కుమార్, చెన్నూరు నియోజకవర్గం అధ్యక్షులు గాజుల శంకర్, నియోజకవర్గ ఉపాధ్యక్షులు ఎండి మాతిన్ ఖాన్, నస్పూర్ మండల అధ్యక్షుడు వేముల కిరణ్, నాయకుడు జాగిరి రాజేష్ తదితరులు పాల్గొన్నారు.
    user_Thalapalli Ramesh
    Thalapalli Ramesh
    బెల్లంపల్లె, మంచిర్యాల, తెలంగాణ•
    7 hrs ago
  • జగిత్యాల నియోజకవర్గంలో వివిధ కారణాలతో ఆసుపత్రిలో చికిత్స పొంది, వైద్య ఖర్చుల నిమిత్తం సీఎం సహాయ నిధి సాయం కోసం ఉమ్మడి కరీంనగర్ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎల్ రమణకు బాధితులు దరఖాస్తు చేసుకున్నారు. ఈ దరఖాస్తులపై సానుకూలంగా స్పందించిన ఎమ్మెల్సీ ఎల్ రమణ, సీఎం సహాయ నిధి నుండి మొత్తం 9 మంది లబ్ధిదారులకు ఆర్థిక సహాయం మంజూరు చేయించారు. దీనికి సంబంధించి మంజూరైన రూ. 1 లక్షల 50 వేల విలువ గల చెక్కులను శనివారం సాయంత్రం 6:30 గంటల ప్రాంతంలో జగిత్యాల జిల్లా కేంద్రంలోని తన క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్సీ ఎల్ రమణ లబ్ధిదారులకు అందజేశారు. ఈ చెక్కుల పంపిణీ కార్యక్రమంలో జగిత్యాల పట్టణ కౌన్సిలర్లు కోరుకంటి రాము, తోట హరీష్, మాజీ జడ్పీటీసీ కొలుముల రమణ, రాయికల్ మండలం ప్రధాన కార్యదర్శి కొండపల్కల రత్నాకర్ రావు పాల్గొన్నారు. వీరితో పాటు వొళ్ళాల గంగాధర్, గంగిపెల్లి వేణుమాధవ్, పెండేం గంగాధర్, చిరంజీవి, నందు నాయక్ తదితరులు ఈ కార్యక్రమంలో భాగస్వామ్యమయ్యారు.
    1
    జగిత్యాల నియోజకవర్గంలో వివిధ కారణాలతో ఆసుపత్రిలో చికిత్స పొంది, వైద్య ఖర్చుల నిమిత్తం సీఎం సహాయ నిధి సాయం కోసం ఉమ్మడి కరీంనగర్ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎల్ రమణకు బాధితులు దరఖాస్తు చేసుకున్నారు. ఈ దరఖాస్తులపై సానుకూలంగా స్పందించిన ఎమ్మెల్సీ ఎల్ రమణ, సీఎం సహాయ నిధి నుండి మొత్తం 9 మంది లబ్ధిదారులకు ఆర్థిక సహాయం మంజూరు చేయించారు. దీనికి సంబంధించి మంజూరైన రూ. 1 లక్షల 50 వేల విలువ గల చెక్కులను శనివారం సాయంత్రం 6:30 గంటల ప్రాంతంలో జగిత్యాల జిల్లా కేంద్రంలోని తన క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్సీ ఎల్ రమణ లబ్ధిదారులకు అందజేశారు.

ఈ చెక్కుల పంపిణీ కార్యక్రమంలో జగిత్యాల పట్టణ కౌన్సిలర్లు కోరుకంటి రాము, తోట హరీష్, మాజీ జడ్పీటీసీ కొలుముల రమణ, రాయికల్ మండలం ప్రధాన కార్యదర్శి కొండపల్కల రత్నాకర్ రావు పాల్గొన్నారు. వీరితో పాటు వొళ్ళాల గంగాధర్, గంగిపెల్లి వేణుమాధవ్, పెండేం గంగాధర్, చిరంజీవి, నందు నాయక్ తదితరులు ఈ కార్యక్రమంలో భాగస్వామ్యమయ్యారు.
    user_Sk chaitanya
    Sk chaitanya
    జగిత్యాల, జగిత్యాల, తెలంగాణ•
    4 hrs ago
  • నిర్మల్ జిల్లా నర్సాపూర్ మండలంలోని ఎస్సీ బాయ్స్ హాస్టల్‌ను బిడిఎస్‌ఎఫ్ (BDSF) ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా కన్వీనర్ చాకటి ఆనంద్ కుమార్ సందర్శించారు. హాస్టల్ భవనం శిథిలావస్థకు చేరుకోవడంతో అది ఎప్పుడు కూలిపోతుందోనని విద్యార్థులు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారని ఆయన పేర్కొన్నారు. దీనిపై విద్యాశాఖ అధికారులు వెంటనే స్పందించి, తగిన చర్యలు తీసుకోవాలని మరియు విద్యార్థుల కోసం నూతన భవనాన్ని నిర్మించాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ పర్యటనలో భాగంగా పాఠశాల పరిస్థితులను పరిశీలించిన చాకటి ఆనంద్ కుమార్, విద్యార్థులు వివిధ వ్యాధులతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. విద్యార్థుల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రతి పాఠశాలలోనూ వ్యాధులకు సంబంధించిన ప్రాథమిక మందులను విద్యాశాఖ అధికారులు నిరంతరం అందుబాటులో ఉంచాలని ఆయన డిమాండ్ చేశారు.
    1
    నిర్మల్ జిల్లా నర్సాపూర్ మండలంలోని ఎస్సీ బాయ్స్ హాస్టల్‌ను బిడిఎస్‌ఎఫ్ (BDSF) ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా కన్వీనర్ చాకటి ఆనంద్ కుమార్ సందర్శించారు. హాస్టల్ భవనం శిథిలావస్థకు చేరుకోవడంతో అది ఎప్పుడు కూలిపోతుందోనని విద్యార్థులు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారని ఆయన పేర్కొన్నారు. దీనిపై విద్యాశాఖ అధికారులు వెంటనే స్పందించి, తగిన చర్యలు తీసుకోవాలని మరియు విద్యార్థుల కోసం నూతన భవనాన్ని నిర్మించాలని ఆయన డిమాండ్ చేశారు.

ఈ పర్యటనలో భాగంగా పాఠశాల పరిస్థితులను పరిశీలించిన చాకటి ఆనంద్ కుమార్, విద్యార్థులు వివిధ వ్యాధులతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. విద్యార్థుల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రతి పాఠశాలలోనూ వ్యాధులకు సంబంధించిన ప్రాథమిక మందులను విద్యాశాఖ అధికారులు నిరంతరం అందుబాటులో ఉంచాలని ఆయన డిమాండ్ చేశారు.
    user_చక్కటి ఆనంద్ కుమార్
    చక్కటి ఆనంద్ కుమార్
    Local News Reporter భైంసా, నిర్మల్, తెలంగాణ•
    14 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.