Shuru
Apke Nagar Ki App…
జహీరాబాద్ ఏరియా ఆసుపత్రి ఆవరణలో శనివారం సాయంత్రం 102, 108 అంబులెన్స్‌లను ఉమ్మడి జిల్లా ప్రోగ్రామ్ మేనేజర్ బోయిని సంపత్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ తనిఖీల్లో భాగంగా గర్భిణీలకు 102 ద్వారా అందుతున్న సేవలు, 108 అంబులెన్స్‌ల పరిశుభ్రత, వైద్య పరికరాల పనితీరు మరియు అత్యవసర సమయాల్లో అందించే ప్రథమ చికిత్స గురించి ఆయన సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. అత్యవసర సమయాల్లో 108 అంబులెన్స్ సిబ్బంది వెంటనే స్పందించి ఘటనా స్థలాలకు చేరుకోవాలని బోయిని సంపత్ సూచించారు. బాధితులకు తక్షణమే ప్రథమ చికిత్స అందిస్తూ ఆసుపత్రికి తరలించాలని ఆదేశించారు. ఈ తనిఖీల్లో 108, 102 సిబ్బంది ఈఎంటి పండరి, పైలెట్ శ్రీనివాస్, రవి, చంద్రకాంత్ పాల్గొన్నారు.
SRIRAMULA KIRANKUMAR
జహీరాబాద్ ఏరియా ఆసుపత్రి ఆవరణలో శనివారం సాయంత్రం 102, 108 అంబులెన్స్‌లను ఉమ్మడి జిల్లా ప్రోగ్రామ్ మేనేజర్ బోయిని సంపత్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ తనిఖీల్లో భాగంగా గర్భిణీలకు 102 ద్వారా అందుతున్న సేవలు, 108 అంబులెన్స్‌ల పరిశుభ్రత, వైద్య పరికరాల పనితీరు మరియు అత్యవసర సమయాల్లో అందించే ప్రథమ చికిత్స గురించి ఆయన సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. అత్యవసర సమయాల్లో 108 అంబులెన్స్ సిబ్బంది వెంటనే స్పందించి ఘటనా స్థలాలకు చేరుకోవాలని బోయిని సంపత్ సూచించారు. బాధితులకు తక్షణమే ప్రథమ చికిత్స అందిస్తూ ఆసుపత్రికి తరలించాలని ఆదేశించారు. ఈ తనిఖీల్లో 108, 102 సిబ్బంది ఈఎంటి పండరి, పైలెట్ శ్రీనివాస్, రవి, చంద్రకాంత్ పాల్గొన్నారు.
More news from Kamareddy and nearby areas
- తెలంగాణలో కరువు వస్తున్న నేపథ్యంలో పంటలకు, రైతులకు నీళ్ళు ఎలా అని ఒక జర్నలిస్ట్ అడిగిన ప్రశ్నకు సీఎం రేవంత్ రెడ్డి వివాదాస్పద సమాధానం ఇచ్చారు. ఏముంది వాళ్ళను కోసి పంటల మీద రక్తం చల్లితే అదే పండుతుంది అంటూ సీఎం రేవంత్ రెడ్డి బదులిచ్చారు.1
- సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు పరిధిలోని బొల్లారం ప్రాంతంలో ప్రస్తుతం ఓటర్ల ప్రత్యేక పరిశీలన (SIR – Special Intensive Revision) ప్రక్రియ కొనసాగుతోంది. ఈ ప్రక్రియలో భాగంగా బీఎల్‌ఓలు (BLOs) ఇంటింటికీ వెళ్లి ఎస్ఐఆర్ ఫారాలను పంపిణీ చేస్తున్నారు. అయితే, చాలా మందికి ఈ ఫారం ఎలా నింపాలో తెలియక ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఈ ఫారాలను అందుకున్న ఓటర్లు కొన్ని ముఖ్యమైన విషయాలను గుర్తుంచుకోవాలి. బీఎల్‌ఓల నుంచి ఫారం అందుకున్న రెండు రోజుల్లోపు దానిని పూర్తిగా పూర్తి చేసి తిరిగి వారికే అందజేయాల్సి ఉంటుంది. ఒకవేళ ఫారం నింపడంలో ఏవైనా సందేహాలు ఉంటే సహాయం అందుబాటులో ఉంది. దీని కోసం బొల్లారంలోని బీజేపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన హెల్ప్ డెస్క్ లేదా ప్రభుత్వ అధికారులు ఏర్పాటు చేసిన కేంద్రాలను సంప్రదించి సహాయం పొందవచ్చు.1
- మెదక్ జిల్లా రామాయంపేట మున్సిపాలిటీ 8వ వార్డులో ప్రత్యేక సమగ్ర ఓటరు జాబితా సవరణ (ఎస్‌ఐఆర్) ప్రక్రియ వేగంగా సాగుతోంది. బూత్ నంబర్-78 పరిధిలో మొత్తం 688 మంది ఓటర్లు ఉండగా, వారిలో ఇప్పటికే 390 మంది వివరాల డిజిటలైజేషన్ పూర్తయిందని వార్డు కౌన్సిలర్ శంకర్ గౌడ్ వెల్లడించారు. మిగిలిన ఓటర్లు కూడా గడువు ముగిసేలోపు తమ వివరాలను నమోదు చేసుకునేలా బూత్ లెవల్ ఏజెంట్లు (బీఎల్ఏలు) ఇంటింటికీ వెళ్లి అవగాహన కల్పిస్తున్నారు. ప్రతి అర్హ ఓటరు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని, ఓటరు జాబితాలో తమ వివరాలు సక్రమంగా నమోదయ్యేలా సహకరించాలని ఆయన కోరారు.1
- మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కూకట్‌పల్లిలో బయోటెక్ పరిశ్రమ కోసం టాప్సే (Topse) సంస్థ తన అధునాతన టర్న్‌కీ ప్రాసెస్ సొల్యూషన్స్‌ను ప్రదర్శించింది.1
- కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండలం పుల్కల్ గ్రామంలో వర్షాల కోసం రైతులు ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. సర్పంచ్ సంతోష్ పటేల్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో, గ్రామంలోని ప్రతి రైతు నిండు కుండలతో నీటిని తీసుకువచ్చి, ఊరిలోని దేవతలకు ఆ నీటిని పోస్తూ వర్షాలు కురవాలని వేడుకున్నారు. వర్షం కోసం పుల్కల్ గ్రామంలోనే కాకుండా, చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలు కూడా అనేక రకాల ప్రయత్నాలు చేస్తున్నారు. వర్షాలు కురిస్తేనే అన్నదాతలు ఆనందంగా ఉంటారని ఈ ప్రాంత రైతులు చెబుతున్నారు.1
- తెలంగాణ మేధావులు, రిటైర్డ్ ఇంజనీర్లపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేస్తూ బూతుల పర్వం లంకించుకున్నారు. కన్నెపల్లి మోటార్లను వెంటనే ఆన్ చేయాలని లేఖ రాసినందుకు రిటైర్డ్ ఇంజనీర్లపై ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. రిటైర్డ్ ఇంజనీర్లు వచ్చి తనకు బేవకూఫ్ సలహాలు ఇస్తున్నారని మండిపడ్డారు. వీళ్ళని బొక్కలో వేయకపోవడమే తాను చేసిన తప్పని, తెలంగాణ మేధావులను, రిటైర్డ్ ఇంజనీర్లను బొక్కలో వేయాలని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.1
- మెదక్ జిల్లా తూప్రాన్ మున్సిపాలిటీకి చెందిన సుమారు రూ.20 కోట్ల విలువైన ఆస్తిని కబ్జా చేసేందుకు కాంగ్రెస్ ప్రయత్నిస్తోందని గజ్వేల్ నియోజకవర్గ బీఆర్ఎస్ ఇన్‌చార్జ్ వంటేరు ప్రతాపరెడ్డి ఆరోపించారు. తూప్రాన్‌లో మీడియాతో మాట్లాడిన ఆయన, ఈ భూమిని 1972లోనే అప్పటి గ్రామపంచాయతీ కొనుగోలు చేసిందని వివరించారు. ప్రస్తుతం ఈ మున్సిపల్ భూమిని ఆక్రమించేందుకు జరుగుతున్న ప్రయత్నాలను బీఆర్ఎస్ తీవ్రంగా వ్యతిరేకిస్తూ పోరాటం చేస్తుందని ఆయన స్పష్టం చేశారు. మున్సిపల్ ఆస్తులను వెంటనే పరిరక్షించాలని, ఈ వ్యవహారంపై ప్రభుత్వం తక్షణమే స్పందించాలని ఆయన డిమాండ్ చేశారు.1
- వికారాబాద్ జిల్లా ఎస్పీ స్నేహ మెహ్రా ఆదేశాల మేరకు జిల్లా టాస్క్ ఫోర్స్ పోలీసులు, కోటపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని ఒక పేకాట స్థావరంపై దాడి చేశారు. విశ్వసనీయ సమాచారం మేరకు జరిపిన ఈ దాడిలో పేకాట ఆడుతున్న ఏడుగురు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి పేక ముక్కలతో పాటు రూ. 35,570 నగదును స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. జిల్లాలో పేకాట, జూదం వంటి ఇతర చట్టవిరుద్ధ కార్యకలాపాలపై టాస్క్ ఫోర్స్ బృందం నిరంతరం ప్రత్యేక నిఘా కొనసాగిస్తుందని ఎస్పీ స్నేహ మెహ్రా స్పష్టం చేశారు. ఇటువంటి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆమె హెచ్చరించారు.1