logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

బాలిక హత్య కేసులో కీలక పరిణామం రాయచోటి మదనపల్లి పట్టణంలో సంచలనం సృష్టించిన చిన్నారి హత్యాచారం కేసులో నిందితుడు మృతి చెందినట్లు జిల్లా ఎస్పీ శ్రీ ధీరజ్ కునుబిల్లి ఐపీఎస్ గారు బుధవారం మీడియా సమావేశంలో వెల్లడించారు. ముదివేడు పోలీస్ స్టేషన్ పరిధిలోని కనసానివారిపల్లె చెరువులో ఈరోజు నిందితుడు కులవర్థన్ మృతదేహం లభ్యమైంది. ప్రాథమిక విచారణ ప్రకారం, నిందితుడు కులవర్థన్ ఆత్మహత్య చేసుకుని ఉండవచ్చని భావిస్తున్నాము. నిందితుడు మరణించినప్పటికీ, ఈ కేసులోని ఆధారాలను సేకరించే ప్రక్రియ కొనసాగుతుందని ఎస్పీ గారు స్పష్టం చేశారు. జిల్లాలో ఇటువంటి అమానుష ఘటనలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకుంటామని, మహిళలు మరియు చిన్నారుల రక్షణకు అత్యంత ప్రాధాన్యత ఇస్తామని పేర్కొన్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించామని, నివేదిక అనంతరం మరిన్ని వివరాలు వెల్లడిస్తామని ఎస్పీ గారు తెలిపారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ (అడ్మిన్) యం. వెంకటాద్రి గారు, మదనపల్లి డిఎస్పీ యస్. మహేంద్ర గారు, పలువురు సీఐ లు, ఎస్ఐ లు పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

11 hrs ago
user_Rayachoti
Rayachoti
జర్నలిస్ట్ Rayachoti, Annamayya•
11 hrs ago
304a93bc-c332-4f18-894e-8e12b609e739

బాలిక హత్య కేసులో కీలక పరిణామం రాయచోటి మదనపల్లి పట్టణంలో సంచలనం సృష్టించిన చిన్నారి హత్యాచారం కేసులో నిందితుడు మృతి చెందినట్లు జిల్లా ఎస్పీ శ్రీ ధీరజ్ కునుబిల్లి ఐపీఎస్ గారు బుధవారం మీడియా సమావేశంలో వెల్లడించారు. ముదివేడు పోలీస్ స్టేషన్ పరిధిలోని కనసానివారిపల్లె చెరువులో ఈరోజు నిందితుడు కులవర్థన్ మృతదేహం లభ్యమైంది. ప్రాథమిక విచారణ ప్రకారం, నిందితుడు కులవర్థన్ ఆత్మహత్య చేసుకుని ఉండవచ్చని భావిస్తున్నాము. నిందితుడు మరణించినప్పటికీ, ఈ కేసులోని ఆధారాలను సేకరించే ప్రక్రియ కొనసాగుతుందని ఎస్పీ గారు స్పష్టం చేశారు. జిల్లాలో ఇటువంటి అమానుష ఘటనలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకుంటామని, మహిళలు మరియు చిన్నారుల రక్షణకు అత్యంత ప్రాధాన్యత ఇస్తామని పేర్కొన్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించామని, నివేదిక అనంతరం మరిన్ని వివరాలు వెల్లడిస్తామని ఎస్పీ గారు తెలిపారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ (అడ్మిన్) యం. వెంకటాద్రి గారు, మదనపల్లి డిఎస్పీ యస్. మహేంద్ర గారు, పలువురు సీఐ లు, ఎస్ఐ లు పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

More news from ఆంధ్రప్రదేశ్ and nearby areas
  • మదనపల్లి ఘటనపై స్పందించిన కర్నూల్ రేంజ్ DIG
    1
    మదనపల్లి ఘటనపై స్పందించిన కర్నూల్ రేంజ్ DIG
    user_SN MEDIA
    SN MEDIA
    మదనపల్లె, అన్నమయ్య, ఆంధ్రప్రదేశ్•
    23 hrs ago
  • పులిచెర్ల మండలం కల్లూరు, పాల్యం పంచాయతీలలో ప్రతిరోజు వేకువజామున ఒంటరి ఏనుగు పంటలపై దాడి చేస్తుందని బుధవారం స్థానిక ప్రజలు, రైతులు తెలిపారు. ఈ దాడిలో మామిడి, టమోటా పంటలకు అపార నష్టం వాటిల్లుతోందని, ఏనుగు సమీపంలోని అటవీ ప్రాంతంలోకి వెళ్లిపోతుందని వారు పేర్కొన్నారు. ఏనుగు దారి మళ్ళించడానికి అధికారులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.
    1
    పులిచెర్ల మండలం కల్లూరు, పాల్యం పంచాయతీలలో ప్రతిరోజు వేకువజామున ఒంటరి ఏనుగు పంటలపై దాడి చేస్తుందని బుధవారం స్థానిక ప్రజలు, రైతులు తెలిపారు. ఈ దాడిలో మామిడి, టమోటా పంటలకు అపార నష్టం వాటిల్లుతోందని, ఏనుగు సమీపంలోని అటవీ ప్రాంతంలోకి వెళ్లిపోతుందని వారు పేర్కొన్నారు. ఏనుగు దారి మళ్ళించడానికి అధికారులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.
    user_MAA PUNGANUR NEWS
    MAA PUNGANUR NEWS
    Video Creator పుంగనూరు, చిత్తూరు, ఆంధ్రప్రదేశ్•
    2 hrs ago
  • తిరుపతి నడిబొడ్డు లక్ష్మీపురం సర్కిల్ వద్ద అగ్ని ప్రమాదం. ఈ ప్రమాదంలో ఎవరికి ఎటువంటి ప్రాణహాని లేకపోవడం చాలా సంతోషకరమైన విషయం అని స్థానికులు తెలియజేస్తున్నారు.
    1
    తిరుపతి నడిబొడ్డు లక్ష్మీపురం సర్కిల్ వద్ద అగ్ని ప్రమాదం. ఈ ప్రమాదంలో ఎవరికి ఎటువంటి ప్రాణహాని లేకపోవడం చాలా సంతోషకరమైన విషయం అని స్థానికులు తెలియజేస్తున్నారు.
    user_ప్రజాపతి న్యూస్
    ప్రజాపతి న్యూస్
    Local News Reporter Tirupati (Rural), Andhra Pradesh•
    9 hrs ago
  • బద్వేలు : మల్లా రెడ్డి వయస్సు 80 సం,, అను వ్యక్తి వై. ఎస్. ఆర్ కడప జిల్లా బద్వేలు మండలంలోని గొడుగునూరు గ్రామం నందు సగిలేరు చెక్ డ్యామ్ నందు నీటిలో ప్రమాదవసత్తు పడి చనిపోయారు. చెక్ డ్యామ్ నీటిలో నుండి బాడీ ని తిసి పోలీస్ వారికి S. F. O బద్వేలు ఫైర్ సిబ్బంది అప్పగించారు. వివరాలు లోకి వెళ్తే పుట్టాయిపల్లె పంచాయతీ గొడుగునూరు గ్రామంలో ఉండే బైసాని మల్లారెడ్డి వయసు( 80 )సంవత్సరాలు నీటిలో ప్రమాదవసత్తు పడి మరణించారు.ఆయనకి ఇద్దరు కుమారులు ఇద్దరు కుమార్తెలు. ఆయన పెద్ద అల్లుడు వంకెల పెద్దపోలి రెడ్డి ప్రముఖ వైఎస్ఆర్సిపి రాష్ట్ర సంయుక్త కార్యదర్శి గా . ఆయన అన్నకుమారుడు ప్రస్తుతం బైసాని ప్రతాప్ రెడ్డి కడప జిల్లా తెలుగుదేశం పార్లమెంటరీ ఆర్గనైజింగ్ సెక్రటరీగా ఉన్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది..
    1
    బద్వేలు : మల్లా రెడ్డి వయస్సు 80 సం,, అను వ్యక్తి  వై. ఎస్. ఆర్ కడప జిల్లా బద్వేలు మండలంలోని  గొడుగునూరు  గ్రామం నందు సగిలేరు చెక్ డ్యామ్ నందు నీటిలో ప్రమాదవసత్తు పడి చనిపోయారు. చెక్ డ్యామ్ నీటిలో నుండి బాడీ ని తిసి  పోలీస్ వారికి  S. F. O బద్వేలు ఫైర్ సిబ్బంది అప్పగించారు. వివరాలు లోకి వెళ్తే పుట్టాయిపల్లె  పంచాయతీ గొడుగునూరు గ్రామంలో ఉండే బైసాని మల్లారెడ్డి వయసు( 80 )సంవత్సరాలు నీటిలో ప్రమాదవసత్తు పడి మరణించారు.ఆయనకి ఇద్దరు కుమారులు ఇద్దరు కుమార్తెలు. ఆయన పెద్ద అల్లుడు వంకెల పెద్దపోలి రెడ్డి ప్రముఖ వైఎస్ఆర్సిపి రాష్ట్ర సంయుక్త కార్యదర్శి గా . ఆయన అన్నకుమారుడు ప్రస్తుతం బైసాని ప్రతాప్ రెడ్డి కడప జిల్లా తెలుగుదేశం పార్లమెంటరీ ఆర్గనైజింగ్ సెక్రటరీగా ఉన్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది..
    user_జీ.మౌలాలి.
    జీ.మౌలాలి.
    Photographer బద్వేల్, వై.ఎస్.ఆర్., ఆంధ్రప్రదేశ్•
    11 hrs ago
  • Post by Chand Basha (సప్తమందిర సముదాయం) official
    1
    Post by Chand Basha (సప్తమందిర సముదాయం) official
    user_Chand Basha (సప్తమందిర సముదాయం) official
    Chand Basha (సప్తమందిర సముదాయం) official
    Hindu temple Tirupati (Urban), Andhra Pradesh•
    11 hrs ago
  • శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం కోర్టులో బాంబు కలకలం కోర్టు కాంప్లెక్స్ నుండి బయటకు వచ్చిన జ్యుడిషియల్ కోర్టు సిబ్బంది,కక్షిదారులు జిల్లా కోర్టు ఆదేశాల మేరకు మధ్యాహ్నం 12 గంటల 5 నిముషాల కు 12 ఆర్డి ఎక్స్ బాంబులు పేలుతుంది అనే మెయిల్ సమాచారం వచ్చినట్లు తెలిపిన కోర్టు అధికారులు. అయితే సమయం గడచిపోవడంతో ఉత్తిదేనని ఊపిరి పీల్చుకున్న అధికారులు. పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
    3
    శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం కోర్టులో బాంబు కలకలం కోర్టు కాంప్లెక్స్ నుండి బయటకు వచ్చిన జ్యుడిషియల్ కోర్టు సిబ్బంది,కక్షిదారులు 
జిల్లా కోర్టు ఆదేశాల మేరకు  మధ్యాహ్నం 12 గంటల 5 నిముషాల కు 12 ఆర్డి ఎక్స్ బాంబులు పేలుతుంది అనే మెయిల్ సమాచారం వచ్చినట్లు  తెలిపిన కోర్టు అధికారులు. అయితే సమయం గడచిపోవడంతో ఉత్తిదేనని ఊపిరి పీల్చుకున్న అధికారులు. పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
    user_Saddala Adi Narayana Reporter
    Saddala Adi Narayana Reporter
    ధర్మవరం, శ్రీ సత్య సాయి, ఆంధ్రప్రదేశ్•
    14 hrs ago
  • కడప అల్లాహ్ 23 24 25
    1
    కడప అల్లాహ్ 23 24 25
    user_Shaik nazeerbasha
    Shaik nazeerbasha
    Photographer ఆళ్లగడ్డ, నంద్యాల, ఆంధ్రప్రదేశ్•
    9 hrs ago
  • నిన్న జరిగిన బడ్జెట్ సమావేశంలో మైనార్టీల సంక్షేమానికి 6090 కోట్లు భారీ బడ్జెట్ 2026 2027 వార్షిక బడ్జెట్ ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం మైనార్టీల సబ్ ప్లాన్ ద్వారా విద్యా ఉపాధి గృహాల సోయం ఉపాధి హజ్ సహాయం వంటి అనేక రంగాల్లో మైనార్టీ పట్ల కూటమి ప్రభుత్వం కట్టుబాటుకు నిదర్శనం మైనార్టీ భవిష్యత్తులో బడ్జెట్ కాదు బలమైన భరోసా కల్పించిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి మరియు ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి మైనార్టీ శాఖ మంత్రివర్యులు ఎండి పారు గారికి మైనార్టీ తరఫున కృతజ్ఞతలు తెలుపుతున్నారు ఇట్లు రాజంపేట పార్లమెంట్ సెక్రటరీ పర్వీన్
    1
    నిన్న జరిగిన బడ్జెట్ సమావేశంలో మైనార్టీల సంక్షేమానికి 6090 కోట్లు భారీ బడ్జెట్ 2026 2027 వార్షిక బడ్జెట్ ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం మైనార్టీల సబ్ ప్లాన్ ద్వారా విద్యా ఉపాధి గృహాల సోయం ఉపాధి హజ్ సహాయం వంటి అనేక రంగాల్లో మైనార్టీ పట్ల కూటమి ప్రభుత్వం కట్టుబాటుకు నిదర్శనం మైనార్టీ భవిష్యత్తులో బడ్జెట్ కాదు బలమైన భరోసా కల్పించిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి మరియు ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి మైనార్టీ శాఖ మంత్రివర్యులు ఎండి పారు గారికి మైనార్టీ తరఫున కృతజ్ఞతలు తెలుపుతున్నారు ఇట్లు రాజంపేట పార్లమెంట్ సెక్రటరీ పర్వీన్
    user_MAA PUNGANUR NEWS
    MAA PUNGANUR NEWS
    Video Creator పుంగనూరు, చిత్తూరు, ఆంధ్రప్రదేశ్•
    8 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.