logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

గుగ్గిళ్ళ అంగన్వాడీ కేంద్రంలో చిన్నారులకు యూనిఫామ్ లను పంపిణీ చేసిన సర్పంచ్ బెజ్జంకి, ఆగస్టు 1: బెజ్జంకి మండలంలోని గుగ్గిళ్ల గ్రామ అంగన్వాడి కేంద్రం లో చిన్నారులకు యూనిఫాంల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. గ్రామ సర్పంచ్ గుగ్గిళ్ల మల్లయ్య ముఖ్య అతిథిగా పాల్గొని చిన్నారులకు యూనిఫాంలను అందజేశారు. అనంతరం కేంద్రంలో ఏర్పాటు చేసిన మినరల్ వాటర్ యంత్రాన్ని ప్రారంభించి, చిన్నారులకు నిత్యం స్వచ్ఛమైన తాగునీరు అందేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చిన్నారుల ఆరోగ్యం, పోషకాహారం, ప్రాథమిక విద్యాభివృద్ధిలో అంగన్‌వాడీ కేంద్రాల పాత్ర ఎంతో కీలకమని పేర్కొన్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకుని ప్రతి చిన్నారికి నాణ్యమైన సేవలు అందించాలని సూచించారు. కార్యక్రమంలో ఉపసర్పంచ్ దూగ్యాని లావణ్య–మోహన్, గ్రామపంచాయతీ కార్యదర్శి వంశీధర్, వార్డు సభ్యులు భూలక్ష్మి, ర్యాకం అనిత, అంగన్‌వాడీ టీచర్ భారతి, ఫీల్డ్ అసిస్టెంట్ రాజు, వీవోఏ లక్ష్మణ్, కరాబర్ అశోక్, ఆశా వర్కర్ రజిత, గుగ్గిళ్ల రాజేష్, అంగన్‌వాడీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

8 hrs ago
user_ప్రభాకర్
ప్రభాకర్
Farmer బెజ్జంకి, సిద్దిపేట, తెలంగాణ•
8 hrs ago
e9f1b6bc-f340-4327-afad-47aece243062

గుగ్గిళ్ళ అంగన్వాడీ కేంద్రంలో చిన్నారులకు యూనిఫామ్ లను పంపిణీ చేసిన సర్పంచ్ బెజ్జంకి, ఆగస్టు 1: బెజ్జంకి మండలంలోని గుగ్గిళ్ల గ్రామ అంగన్వాడి కేంద్రం లో చిన్నారులకు యూనిఫాంల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. గ్రామ సర్పంచ్ గుగ్గిళ్ల మల్లయ్య ముఖ్య అతిథిగా పాల్గొని చిన్నారులకు యూనిఫాంలను అందజేశారు. అనంతరం కేంద్రంలో

7f64a379-1a15-4fa1-af8c-e528c2f663eb

ఏర్పాటు చేసిన మినరల్ వాటర్ యంత్రాన్ని ప్రారంభించి, చిన్నారులకు నిత్యం స్వచ్ఛమైన తాగునీరు అందేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చిన్నారుల ఆరోగ్యం, పోషకాహారం, ప్రాథమిక విద్యాభివృద్ధిలో అంగన్‌వాడీ కేంద్రాల పాత్ర ఎంతో కీలకమని పేర్కొన్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకుని ప్రతి చిన్నారికి

dfcb8941-b0c9-4767-abc8-5dc0943d05ee

నాణ్యమైన సేవలు అందించాలని సూచించారు. కార్యక్రమంలో ఉపసర్పంచ్ దూగ్యాని లావణ్య–మోహన్, గ్రామపంచాయతీ కార్యదర్శి వంశీధర్, వార్డు సభ్యులు భూలక్ష్మి, ర్యాకం అనిత, అంగన్‌వాడీ టీచర్ భారతి, ఫీల్డ్ అసిస్టెంట్ రాజు, వీవోఏ లక్ష్మణ్, కరాబర్ అశోక్, ఆశా వర్కర్ రజిత, గుగ్గిళ్ల రాజేష్, అంగన్‌వాడీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

More news from తెలంగాణ and nearby areas
  • వేములవాడలోని తిప్పాపూర్ లో ఘనంగా ఆటో డ్రైవర్ల దినోత్సవం రాజన్న సిరిసిల్ల జిల్లా ఎలక్ట్రికల్ ఆటోలొస్తే మా బతుకులు రోడ్డున పడతాయి కంటతడి పెట్టిన సంద్రగిరి శ్రీనివాస్ గౌడ్ వేములవాడలోని తిప్పాపూర్ లో ఘనంగా ఆటో డ్రైవర్ల దినోత్సవం కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా మున్సిపల్ చైర్మన్ పుల్కం రాజు ఆటో కార్మికుల సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్తా : మున్సిపల్ ఛైర్మన్ ప్రయాణికుల భద్రతే ఆటో డ్రైవర్ల ప్రథమ కర్తవ్యం : డీటీఓ దేవునూరు శ్రీనివాస్ ఆటో కార్మికులకు ప్రత్యామ్నాయం చూపాలి : ఆటో యూనియన్ అధ్యక్షుడు సంద్రగిరి నిబంధనలు పాటిస్తేనే ప్రాణ రక్షణ : వేములవాడ ఆటో డ్రైవర్ల సమావేశంలో రవాణా శాఖ అధికారులు
    1
    వేములవాడలోని తిప్పాపూర్ లో ఘనంగా ఆటో డ్రైవర్ల దినోత్సవం
రాజన్న సిరిసిల్ల జిల్లా
ఎలక్ట్రికల్ ఆటోలొస్తే మా బతుకులు రోడ్డున పడతాయి కంటతడి పెట్టిన సంద్రగిరి శ్రీనివాస్ గౌడ్
వేములవాడలోని తిప్పాపూర్ లో ఘనంగా ఆటో డ్రైవర్ల దినోత్సవం
కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా మున్సిపల్ చైర్మన్ పుల్కం రాజు
ఆటో కార్మికుల సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్తా : మున్సిపల్ ఛైర్మన్
ప్రయాణికుల భద్రతే ఆటో డ్రైవర్ల ప్రథమ కర్తవ్యం : డీటీఓ దేవునూరు శ్రీనివాస్
ఆటో కార్మికులకు ప్రత్యామ్నాయం చూపాలి : ఆటో యూనియన్ అధ్యక్షుడు సంద్రగిరి
నిబంధనలు పాటిస్తేనే ప్రాణ రక్షణ : వేములవాడ ఆటో డ్రైవర్ల సమావేశంలో రవాణా శాఖ అధికారులు
    user_సిరిసిల్ల స్వరం
    సిరిసిల్ల స్వరం
    సిరిసిల్ల, రాజన్న సిరిసిల్ల, తెలంగాణ•
    30 min ago
  • ఒకే ఊరికి 100 ఇందిరమ్మ ఇల్లు ఇస్తే మేస్త్రీలు ఇసుక డైమండ్ పెరుగుతుంది: మంత్రి పోగులేటి శ్రీనివాస్ రెడ్డి ఒకేసారి ఒకే గ్రామంలో 100 ఇందిర ఇండ్లు ఇస్తే, మేస్త్రీలు, ఇసుక డిమాండ్ పెరుగుతుంది అందుకే దశలవారీగా ఇండ్లు మంజూరు చేస్తున్నాం -కలూరులో నిర్వహించిన ప్రజాదర్బార్ కార్యక్రమంలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు.
    1
    ఒకే ఊరికి 100 ఇందిరమ్మ ఇల్లు ఇస్తే మేస్త్రీలు ఇసుక డైమండ్ పెరుగుతుంది: మంత్రి పోగులేటి శ్రీనివాస్ రెడ్డి 
ఒకేసారి ఒకే గ్రామంలో 100 ఇందిర ఇండ్లు ఇస్తే, మేస్త్రీలు, ఇసుక డిమాండ్ పెరుగుతుంది అందుకే దశలవారీగా ఇండ్లు మంజూరు చేస్తున్నాం
-కలూరులో నిర్వహించిన ప్రజాదర్బార్ కార్యక్రమంలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు.
    user_Bachannapet, Jangoan, Telangan
    Bachannapet, Jangoan, Telangan
    Local News Reporter బచ్చన్నపేట, జనగాం, తెలంగాణ•
    2 hrs ago
  • *పత్రిక మరియు మీడియా మిత్రులకు నమస్కారములు* 🙏🙏🙏🙏🙏 *ఢిల్లీ లోని తెలంగాణ భవన్ అమరవీరుల స్తూపం దగ్గర పెద్ది సుదర్శన్ రెడ్డి చిత్రపటనికి నివాళులు అర్పించిన కాజిపేట్ బి ఆర్ యస్ పార్టీ నాయకులు *ఢిల్లీ లోని తెలంగాణ భవన్ అమరవీరుల స్తూపం దగ్గర పెద్ది సుదర్శన్ రెడ్డి చిత్రపటానికి నివాళులు* ఈరోజు ఢీల్లి లోని తెలంగాణ భవన్ అమరవీరుల స్థూపం దగ్గర పెద్ది సుదర్శన్ రెడ్డి చిత్రపటానికి నివాళులు అర్పించిన కాజిపేట్ బి ఆర్ ఎస్ పార్టీ నాయకులు ఈ కార్యక్రమం లో ఉద్దేశించి బి ఆర్ ఎస్ పార్టీ రాష్ట్ర మాజీ కార్యదర్శి *నార్లగిరి రమేష్* మాజీ కార్పొరేటర్ *జోరిక రమేష్* గార్లు మాట్లాడుతూ పెద్ది సుదర్శన్ రెడ్డి గారి మరణం ఉమ్మడి వరంగల్ జిల్లాకే కాకుండా బి ఆర్ ఎస్ పార్టీ కి తీరని నష్టమని పెద్ది సుదర్శన్ రెడ్డి తెలంగాణ మలిదిశ ఉద్యమాన్ని నడిపిన ఉద్యమ నాయకుడు అని మచ్చలేని ఎమ్మెల్యేగా సివిల్ సప్లై కార్పొరేషన్ చైర్మన్ గా ప్రజలకు ఎన్నో సేవలు చేశాడని పెద్దికి రైతుల పట్ల ఉద్యమకారుల పట్ల ఏదో ఒకటి చేయాలనే తపన ఉండేదని 2001 నుండి పెద్ది సుదర్శన్ రెడ్డితో ఉద్యమంలో కలిసి పనిచేసినమని పెద్దన్న మరణం నాలాంటి ఉద్యమకారులకు బి ఆర్ ఎస్ పార్టీకి తీవ్ర నష్టమని వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూన్నాము అని తెలియజేసినారు ఇంకా ఈ కార్యక్రమంలో బి ఆర్ ఎస్ పార్టీ అర్బన్ జిల్లా మాజీ ప్రధాన కార్యదర్శి *గబ్బెట శ్రీనివాస్* శిరుమల్ల దశరథం సంకు నర్సింగ రావు MD ఆఫ్జాల్ MD హుస్సేన్ సుంచు అశోక్ కోండ్ర శంకర్ తండమళ్ళ వేణు కుమ్మరి రాజ్ కుమార్ పోలేపల్లి రామ్మూర్తి గడ్డం రఘు వంశీ మాచర్ల గణేష్ కనకం రమేష్ మారపాక గణేష్ రాబర్ట్ అయాన్ జుబేర్ తదితరులు పాల్గొన్నారు *మీ.. గబ్బేట శ్రీనివాస్ బి ఆర్ యస్ పార్టీ అర్బన్ జిల్లా ప్రధాన కార్యదర్శి* 8686618664
    2
    *పత్రిక మరియు మీడియా మిత్రులకు నమస్కారములు* 
🙏🙏🙏🙏🙏
*ఢిల్లీ లోని తెలంగాణ భవన్ అమరవీరుల స్తూపం  దగ్గర పెద్ది సుదర్శన్ రెడ్డి చిత్రపటనికి నివాళులు అర్పించిన కాజిపేట్ బి ఆర్ యస్ పార్టీ నాయకులు 
*ఢిల్లీ లోని తెలంగాణ భవన్ అమరవీరుల స్తూపం  దగ్గర పెద్ది సుదర్శన్ రెడ్డి చిత్రపటానికి నివాళులు* 
ఈరోజు ఢీల్లి లోని తెలంగాణ భవన్  అమరవీరుల స్థూపం దగ్గర పెద్ది సుదర్శన్ రెడ్డి చిత్రపటానికి నివాళులు అర్పించిన కాజిపేట్ బి ఆర్ ఎస్ పార్టీ నాయకులు ఈ కార్యక్రమం లో ఉద్దేశించి బి ఆర్ ఎస్ పార్టీ రాష్ట్ర మాజీ కార్యదర్శి *నార్లగిరి రమేష్* మాజీ కార్పొరేటర్ *జోరిక రమేష్* గార్లు  మాట్లాడుతూ పెద్ది సుదర్శన్ రెడ్డి గారి మరణం ఉమ్మడి వరంగల్ జిల్లాకే కాకుండా బి ఆర్ ఎస్ పార్టీ కి తీరని నష్టమని పెద్ది సుదర్శన్ రెడ్డి తెలంగాణ మలిదిశ ఉద్యమాన్ని నడిపిన ఉద్యమ నాయకుడు అని మచ్చలేని ఎమ్మెల్యేగా సివిల్ సప్లై కార్పొరేషన్ చైర్మన్ గా ప్రజలకు ఎన్నో సేవలు చేశాడని పెద్దికి రైతుల పట్ల ఉద్యమకారుల పట్ల ఏదో ఒకటి చేయాలనే తపన ఉండేదని 2001 నుండి పెద్ది సుదర్శన్ రెడ్డితో ఉద్యమంలో కలిసి పనిచేసినమని పెద్దన్న మరణం నాలాంటి ఉద్యమకారులకు బి ఆర్ ఎస్ పార్టీకి తీవ్ర నష్టమని వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూన్నాము అని తెలియజేసినారు ఇంకా ఈ కార్యక్రమంలో బి ఆర్ ఎస్ పార్టీ అర్బన్ జిల్లా మాజీ ప్రధాన కార్యదర్శి *గబ్బెట శ్రీనివాస్* శిరుమల్ల దశరథం సంకు నర్సింగ రావు MD ఆఫ్జాల్ MD హుస్సేన్ సుంచు అశోక్  కోండ్ర శంకర్  తండమళ్ళ వేణు కుమ్మరి రాజ్ కుమార్ పోలేపల్లి రామ్మూర్తి గడ్డం రఘు వంశీ మాచర్ల గణేష్ కనకం రమేష్ మారపాక గణేష్ రాబర్ట్ అయాన్ జుబేర్ తదితరులు పాల్గొన్నారు
*మీ.. గబ్బేట శ్రీనివాస్ బి ఆర్ యస్ పార్టీ అర్బన్ జిల్లా ప్రధాన కార్యదర్శి* 8686618664
    user_గబ్బేట శ్రీనివాస్
    గబ్బేట శ్రీనివాస్
    ఖాజీపేట, హనుమకొండ, తెలంగాణ•
    23 hrs ago
  • తెలంగాణ రక్షణ సేన కార్మికుల ఫ్రెండ్లీ పార్టీ.. అధికారంలోకి వచ్చాక కార్మికుల ఫ్రెండ్లీ ప్రభుత్వంగా ఉంటది : టిఆర్ఎస్ ఛీఫ్ కవిత హైదరాబాద్ : ప్రైవేటు సంస్థలు శ్రమ దోపిడీ చేస్తే కొరడా జులిపించాల్సిన ప్రభుత్వమే అదే కార్మికుల శ్రమను దోపిడీ చేస్తుందని తెలంగాణ రక్షణ సేన ఛీఫ్ కవిత అన్నారు. శుక్రవారం బంజారా హిల్స్ పార్టీ కార్యాలయంలో కార్మికులతో సమావేశం నిర్వహించారు. అనంతరం తెలంగాణ రక్షణ సేన ట్రేడ్ యూనియన్ ప్రారంభించారు. ఈ సందర్బంగా కవిత మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వంలో కార్మికులు రోడ్లమీదకు వచ్చి హక్కుల కోసం ధర్నాలు చేసే పరిస్థితి వచ్చింది. తెలంగాణ రక్షణ సేన ట్రేడ్ యూనియన్ ఎట్టి పరిస్థితుల్లో కార్మికులు, ఉద్యోగులు, టీచర్లకు అన్యాయం జరుగనివ్వదు.
    2
    తెలంగాణ రక్షణ సేన కార్మికుల ఫ్రెండ్లీ పార్టీ.. అధికారంలోకి వచ్చాక కార్మికుల ఫ్రెండ్లీ ప్రభుత్వంగా ఉంటది : టిఆర్ఎస్ ఛీఫ్ కవిత 
హైదరాబాద్ : ప్రైవేటు సంస్థలు శ్రమ దోపిడీ చేస్తే కొరడా జులిపించాల్సిన ప్రభుత్వమే అదే కార్మికుల శ్రమను దోపిడీ చేస్తుందని తెలంగాణ రక్షణ సేన ఛీఫ్ కవిత అన్నారు. శుక్రవారం బంజారా హిల్స్ పార్టీ కార్యాలయంలో కార్మికులతో సమావేశం నిర్వహించారు. అనంతరం తెలంగాణ రక్షణ సేన ట్రేడ్ యూనియన్ ప్రారంభించారు. ఈ సందర్బంగా కవిత మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వంలో కార్మికులు రోడ్లమీదకు వచ్చి హక్కుల కోసం ధర్నాలు చేసే పరిస్థితి వచ్చింది. తెలంగాణ రక్షణ సేన ట్రేడ్ యూనియన్ ఎట్టి పరిస్థితుల్లో కార్మికులు, ఉద్యోగులు, టీచర్లకు అన్యాయం జరుగనివ్వదు.
    user_P Jithender, Sr Reportar
    P Jithender, Sr Reportar
    Local News Reporter జనగాం, తెలంగాణ•
    12 hrs ago
  • కరీంనగర్ అభివృద్ధికి మరిన్ని నిధులు తీసుకొస్తా...విమర్శించే వారికి అభివృద్ధి పనులతో సమాధానం చెప్పాలి- కేంద్ర మంత్రి బండి సంజయ్ కరీంనగర్ కార్పొరేషన్ పరిధిలోని గల్లీగల్లీని అభివృద్ధి చేస్తానని కేంద్రహోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ స్పష్టం చేశారు. గతంలో తప్పులు చేసి ఇప్పుడు అభివృద్ధి చేస్తున్న వారిని విమర్శించే వారిపై చర్యలు తీసుకునేలా కృషి చేయాలని మేయర్ డిప్యూటీ మేయర్ ను ఆదేశించారు. కరీంనగర్ పర్యటనలో భాగంగా కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు, పరామర్శలతో బిజీబిజీగా గడిపారు. ఉదయం తన నివాసం వద్దకు వచ్చిన సందర్శకులను కలుసుకుని వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం కార్పొరేటర్లు, బీజేపీ నాయకులతో కలిసి పలు అభివ్రుద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. 48వ డివిజన్ లోని విద్యానగర్ కురుమవాడలో కోటి రూపాయల అంచనా వ్యయంతో చేపట్టిన సీసీ రోడ్డు, డ్రెయిన్ పనులకు మేయర్ కొలగాని శ్రీనివాస్, డిప్యూటీ మేయర్ సునీల్ రావు, మున్సిపల్ కమిషనర్ ప్రఫుల్ దేశాయ్ తోపాటు స్థానిక కార్పొరేటర్ కర్ర పద్మ అనిల్ తో కలిసి శంకుస్థాపన చేశారు. ఈ నిధుల్లో 80 లక్షలు యూఐడీఎఫ్ నిధులు కాగా, మిగిలిన రూ.20 లక్షలు మున్సిపల్ సాధారణ ఫండ్ కు సంబంధించినవని తెలిపారు. 19వ డివిజన్ లోని రేకుర్తి ముదిరాజ్ కాలనీకి వెళ్లిన కేంద్ర మంత్రి 40 లక్షల అంచనా వ్యయంతో సీసీ రోడ్డు, పైప్ లైన్ పనులకు శంకుస్థాపన చేశారు. లక్ష్మీ నరసింహ కాలనీలో 57 లక్షల అంచనా వ్యయంతో సీసీ రోడ్డు, పైప్ లైన్ పనులకు శ్రీకారం చుట్టారు. అక్కడి నుండి మొగ్దుంపూర్ వెళ్లిన కేంద్ర మంత్రి 10 లక్షల జాతీయ ఉపాధి హామీ నిధులతో నిర్మించిన మహిళాశక్తి ధరణి గ్రామైఖ్య సంఘ భవనాన్ని స్థానిక సర్పంచ్ శివకుమార్ తో కలిసి ప్రారంభించారు. 15 లక్షల అంచనా వ్యయంతో నిర్మించిన సీసీ రోడ్డు, డ్రెయిన్ ను ప్రారంభించారు. చింతకుంట వెళ్లిన కేంద్ర మంత్రి బండి సంజయ్ అంబేద్కర్ భవన్ సమీపంలో నిర్వహించిన ‘‘వన మహోత్సవం-2026’’లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా బండి సంజయ్ కు అధికారులతోపాటు మహిళలు పెద్ద ఎత్తున ఘన స్వాగతం పలికారు. వారితో కలిసి స్వయంగా మొక్కలను నాటారు. కరీంనగర్ కార్పొరేషన్ తోపాటు తన పార్లమెంట్ నియోజకవర్గ అభివ్రుద్ధి కోసం కేంద్రం నుండి మరిన్ని నిధులు తీసుకొస్తానని స్పష్టం చేశారు. పార్లమెంట్ నియోజకవర్గ అభివృద్ధిలో భాగంగా ఇప్పటికే 22 వేల కోట్లు నిధులు ఖర్చు పెట్టామని త్వరలోనే వివిధ కేంద్ర పథకాల కింద మరిన్ని నిధులు తీసుకొచ్చేందుకు ప్రతిపాదనలు రూపొందిస్తున్నామని తెలిపారు.
    1
    కరీంనగర్ అభివృద్ధికి మరిన్ని నిధులు తీసుకొస్తా...విమర్శించే వారికి అభివృద్ధి పనులతో సమాధానం చెప్పాలి- కేంద్ర మంత్రి బండి సంజయ్
కరీంనగర్ కార్పొరేషన్ పరిధిలోని గల్లీగల్లీని అభివృద్ధి చేస్తానని కేంద్రహోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ స్పష్టం చేశారు. గతంలో తప్పులు చేసి ఇప్పుడు అభివృద్ధి చేస్తున్న వారిని విమర్శించే వారిపై చర్యలు తీసుకునేలా కృషి చేయాలని మేయర్ డిప్యూటీ మేయర్ ను ఆదేశించారు. కరీంనగర్ పర్యటనలో భాగంగా కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు, పరామర్శలతో బిజీబిజీగా గడిపారు. ఉదయం తన నివాసం వద్దకు వచ్చిన సందర్శకులను కలుసుకుని వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం కార్పొరేటర్లు, బీజేపీ నాయకులతో కలిసి పలు అభివ్రుద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. 48వ డివిజన్ లోని విద్యానగర్ కురుమవాడలో కోటి రూపాయల అంచనా వ్యయంతో చేపట్టిన సీసీ రోడ్డు, డ్రెయిన్ పనులకు మేయర్ కొలగాని శ్రీనివాస్, డిప్యూటీ మేయర్ సునీల్ రావు, మున్సిపల్ కమిషనర్ ప్రఫుల్ దేశాయ్ తోపాటు స్థానిక కార్పొరేటర్ కర్ర పద్మ అనిల్ తో కలిసి శంకుస్థాపన చేశారు. ఈ నిధుల్లో 80 లక్షలు యూఐడీఎఫ్ నిధులు కాగా, మిగిలిన రూ.20 లక్షలు మున్సిపల్ సాధారణ ఫండ్ కు సంబంధించినవని తెలిపారు. 19వ డివిజన్ లోని రేకుర్తి ముదిరాజ్ కాలనీకి వెళ్లిన కేంద్ర మంత్రి 40 లక్షల అంచనా వ్యయంతో సీసీ రోడ్డు, పైప్ లైన్ పనులకు శంకుస్థాపన చేశారు. లక్ష్మీ నరసింహ కాలనీలో 57 లక్షల అంచనా వ్యయంతో సీసీ రోడ్డు, పైప్ లైన్ పనులకు శ్రీకారం చుట్టారు. అక్కడి నుండి మొగ్దుంపూర్ వెళ్లిన కేంద్ర మంత్రి 10 లక్షల జాతీయ ఉపాధి హామీ నిధులతో నిర్మించిన మహిళాశక్తి ధరణి గ్రామైఖ్య సంఘ భవనాన్ని స్థానిక సర్పంచ్ శివకుమార్ తో కలిసి ప్రారంభించారు. 15 లక్షల అంచనా వ్యయంతో నిర్మించిన సీసీ రోడ్డు, డ్రెయిన్ ను ప్రారంభించారు. చింతకుంట వెళ్లిన కేంద్ర మంత్రి బండి సంజయ్ అంబేద్కర్ భవన్ సమీపంలో నిర్వహించిన ‘‘వన మహోత్సవం-2026’’లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా బండి సంజయ్ కు అధికారులతోపాటు మహిళలు పెద్ద ఎత్తున ఘన స్వాగతం పలికారు. వారితో కలిసి స్వయంగా మొక్కలను నాటారు. కరీంనగర్ కార్పొరేషన్ తోపాటు తన పార్లమెంట్ నియోజకవర్గ అభివ్రుద్ధి కోసం కేంద్రం నుండి మరిన్ని నిధులు తీసుకొస్తానని స్పష్టం చేశారు. పార్లమెంట్ నియోజకవర్గ అభివృద్ధిలో భాగంగా ఇప్పటికే 22 వేల కోట్లు నిధులు ఖర్చు పెట్టామని త్వరలోనే వివిధ కేంద్ర పథకాల కింద మరిన్ని  నిధులు తీసుకొచ్చేందుకు ప్రతిపాదనలు రూపొందిస్తున్నామని తెలిపారు.
    user_K.V.REDDY
    K.V.REDDY
    చిగురుమామిడి, కరీంనగర్, తెలంగాణ•
    3 hrs ago
  • ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసి ధన్యవాదాలు తెలిపిన మంత్రి పొన్నం ప్రభాకర్ గౌరవెల్లి ప్రాజెక్టుతో పాటు పాలమూరు-రంగారెడ్డి, సీతమ్మ సాగర్ ప్రాజెక్టులకు గతంలో మంజూరైన పర్యావరణ అనుమతులను కొనసాగిస్తూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు పట్ల రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి ని ఆయన నివాసంలో కలిసి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ, తెలంగాణ ప్రజల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కేంద్ర ప్రభుత్వం తో సంప్రదింపులు జరుపుతూ , అభిషేక్ సింగ్వి లాంటి మంచి న్యాయవాదులను నియమించి సుప్రీంకోర్టు లో న్యాయపరంగా సమర్థవంతంగా పోరాడిన ఫలితంగానే ఈ తీర్పు వచ్చిందన్నారు. గౌరవెల్లి, పాలమూరు-రంగారెడ్డి, సీతమ్మ సాగర్ వంటి కీలక సాగునీటి ప్రాజెక్టులకు ఈ తీర్పు కొత్త ఊపునిస్తుందని పేర్కొన్నారు.ఈ ప్రాజెక్టులు పూర్తయితే లక్షల ఎకరాలకు సాగునీరు అందడంతో పాటు తాగునీటి అవసరాలు కూడా తీరనున్నాయని, రైతులకు, గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి ఇవి ఎంతో దోహదపడతాయని మంత్రి తెలిపారు.తెలంగాణ హక్కులను పరిరక్షించడంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తీసుకున్న చొరవ, ప్రభుత్వం చేసిన న్యాయపోరాటం రాష్ట్ర ప్రయోజనాలను కాపాడిందని మంత్రి పొన్నం ప్రభాకర్ అభినందించారు.
    2
    ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసి ధన్యవాదాలు తెలిపిన మంత్రి పొన్నం ప్రభాకర్
గౌరవెల్లి ప్రాజెక్టుతో పాటు పాలమూరు-రంగారెడ్డి, సీతమ్మ సాగర్ ప్రాజెక్టులకు గతంలో మంజూరైన పర్యావరణ అనుమతులను కొనసాగిస్తూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు పట్ల రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి  పొన్నం ప్రభాకర్ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి ని ఆయన నివాసంలో కలిసి కృతజ్ఞతలు తెలిపారు.
ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ, తెలంగాణ ప్రజల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కేంద్ర ప్రభుత్వం తో సంప్రదింపులు జరుపుతూ , అభిషేక్ సింగ్వి లాంటి మంచి న్యాయవాదులను నియమించి సుప్రీంకోర్టు లో న్యాయపరంగా సమర్థవంతంగా పోరాడిన ఫలితంగానే ఈ తీర్పు వచ్చిందన్నారు. గౌరవెల్లి, పాలమూరు-రంగారెడ్డి, సీతమ్మ సాగర్ వంటి కీలక సాగునీటి ప్రాజెక్టులకు ఈ తీర్పు కొత్త ఊపునిస్తుందని పేర్కొన్నారు.ఈ ప్రాజెక్టులు పూర్తయితే లక్షల ఎకరాలకు సాగునీరు అందడంతో పాటు తాగునీటి అవసరాలు కూడా తీరనున్నాయని, రైతులకు, గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి ఇవి ఎంతో దోహదపడతాయని మంత్రి తెలిపారు.తెలంగాణ హక్కులను పరిరక్షించడంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తీసుకున్న చొరవ, ప్రభుత్వం చేసిన న్యాయపోరాటం రాష్ట్ర ప్రయోజనాలను కాపాడిందని మంత్రి పొన్నం ప్రభాకర్ అభినందించారు.
    user_OM NAMSHIVAYA
    OM NAMSHIVAYA
    Karimnagar, Telangana•
    1 hr ago
  • కరీంనగర్ లో సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ దగ్ధం... పలువురు బిజేవైఎం నాయకుల అరెస్ట్ విద్యార్థుల పట్ల సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలను నిరసిస్తూ కరీంనగర్ లో బీజేవైఎం కార్యకర్తల ఆందోళన స్వల్ప ఉద్రిక్తతకు దారి తీసింది. విద్యార్థులను సీఎం క్రిమినల్స్ అన్నాడని బీజేవైఎం కార్యకర్తలు ఆందోళనకు దిగారు. తెలంగాణ చౌక్ లో ధర్నాకు దిగి సీఎంకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. విద్యార్థులకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. సీఎం దిష్టిబొమ్మ దగ్ధం చేసేందుకు యత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. పోలీసులకు బీజేవైఎం కార్యకర్తలకు మధ్య తోపులాట చోటుచేసుకుని స్వల్ప ఉద్రిక్తకు దారి తీసింది. పోలీసులు కళ్ళుగప్పి బీజేవైఎం కార్యకర్తలు సీఎం దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. దీంతో పోలీసులు దగ్ధమవుతున్న దిష్టిబొమ్మను స్వాధీనం చేసుకొని , బీజేవైఎం కార్యకర్తలను అరెస్టు చేసి స్టేషన్ కు తరలించారు.
    2
    కరీంనగర్ లో సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ దగ్ధం... పలువురు బిజేవైఎం నాయకుల అరెస్ట్
విద్యార్థుల పట్ల సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలను నిరసిస్తూ కరీంనగర్ లో బీజేవైఎం కార్యకర్తల ఆందోళన స్వల్ప ఉద్రిక్తతకు దారి తీసింది. విద్యార్థులను సీఎం క్రిమినల్స్ అన్నాడని బీజేవైఎం కార్యకర్తలు ఆందోళనకు దిగారు. తెలంగాణ చౌక్ లో ధర్నాకు దిగి సీఎంకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. విద్యార్థులకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. సీఎం దిష్టిబొమ్మ దగ్ధం చేసేందుకు యత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. పోలీసులకు బీజేవైఎం కార్యకర్తలకు మధ్య తోపులాట చోటుచేసుకుని స్వల్ప ఉద్రిక్తకు దారి తీసింది. పోలీసులు కళ్ళుగప్పి బీజేవైఎం కార్యకర్తలు సీఎం దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. దీంతో పోలీసులు దగ్ధమవుతున్న దిష్టిబొమ్మను స్వాధీనం చేసుకొని , బీజేవైఎం కార్యకర్తలను అరెస్టు చేసి స్టేషన్ కు తరలించారు.
    user_K.V.REDDY
    K.V.REDDY
    చిగురుమామిడి, కరీంనగర్, తెలంగాణ•
    3 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.