Shuru
Apke Nagar Ki App…
ఉప్పల్ డివిజన్ అధ్యక్షులు శ్రీ ఫణీంద్ర ఆదేశాల మేరకు, ఉప్పల్ గిరిజన మోర్చా అధ్యక్షులు బానోత్ రాజు నాయక్ ఆధ్వర్యంలో ఈ రోజు ఉప్పల్ గాంధీ బొమ్మ పక్కన ప్రైవేట్ స్కూల్ ఫీజుల నియంత్రణపై నిరసన దీక్ష కార్యక్రమం నిర్వహించబడింది. ఈ దీక్షను బీజేపీ ఉప్పల్ డివిజన్ ఆధ్వర్యంలో చేపట్టారు. ఈ కార్యక్రమంలో ఉప్పల్ మాజీ ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి, బిజెపి రాష్ట్ర మహిళా మోర్చా అధ్యక్షురాలు డాక్టర్ శిల్పారెడ్డి, తాడూరి శ్రీనివాస్ అన్న, ధర్మారెడ్డి జి, బిజెపి ఓబీసీ మోర్చా గీత సెల్ రాష్ట్ర మాజీ కన్వీనర్ పంజాల శ్రవణ్ కుమార్ గౌడ్, మహేష్ జి, విఠల్జి, శైలేష్ రెడ్డి, శ్రీధర్ గుప్తా తదితరులు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు.
Journalist Madhu
ఉప్పల్ డివిజన్ అధ్యక్షులు శ్రీ ఫణీంద్ర ఆదేశాల మేరకు, ఉప్పల్ గిరిజన మోర్చా అధ్యక్షులు బానోత్ రాజు నాయక్ ఆధ్వర్యంలో ఈ రోజు ఉప్పల్ గాంధీ బొమ్మ పక్కన ప్రైవేట్ స్కూల్ ఫీజుల నియంత్రణపై నిరసన దీక్ష కార్యక్రమం నిర్వహించబడింది. ఈ దీక్షను బీజేపీ ఉప్పల్ డివిజన్ ఆధ్వర్యంలో చేపట్టారు. ఈ కార్యక్రమంలో ఉప్పల్ మాజీ ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి, బిజెపి రాష్ట్ర మహిళా మోర్చా అధ్యక్షురాలు డాక్టర్ శిల్పారెడ్డి, తాడూరి శ్రీనివాస్ అన్న, ధర్మారెడ్డి జి, బిజెపి ఓబీసీ మోర్చా గీత సెల్ రాష్ట్ర మాజీ కన్వీనర్ పంజాల శ్రవణ్ కుమార్ గౌడ్, మహేష్ జి, విఠల్జి, శైలేష్ రెడ్డి, శ్రీధర్ గుప్తా తదితరులు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు.
More news from Sangareddy and nearby areas
- మెదక్ జిల్లా పాపన్నపేట మండల పరిధిలోని నాగసానుపల్లి గ్రామంలో ఉన్న ప్రముఖ పుణ్యక్షేత్రమైన ఏడుపాయల వన దుర్గ భవాని అమ్మవారి ఆలయంలో ఆదివారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించి, అభిషేకాలు, హారతులు ఘనంగా జరిపారు. ఏడుపాయల శ్రీ వన దుర్గా భవాని అమ్మవారికి ప్రత్యేక మంగళహారతి కూడా ఇచ్చారు.1
- మెదక్ జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ ఆదివారం నాడు మెదక్‌లో నిర్వహించిన 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె యోగా కేవలం శారీరక వ్యాయామం మాత్రమే కాదని, జీవిత లక్ష్యాలను చేరుకునే మార్గాన్ని చూపే శక్తివంతమైన సాధనమని స్పష్టం చేశారు. యోగా మనసును ప్రశాంతంగా ఉంచి ఆలోచనా సామర్థ్యాన్ని పెంచుతుందని కలెక్టర్ వివరించారు. ప్రతిరోజూ కనీసం 15 నిమిషాలు యోగా సాధన చేయడం వల్ల శారీరక ఆరోగ్యంతో పాటు మానసిక దృఢత్వం కూడా పెరుగుతుందని, తద్వారా సరైన నిర్ణయాలు తీసుకునే సామర్థ్యం మెరుగుపడుతుందని ఆమె అన్నారు. యోగాను ప్రతి ఒక్కరూ తమ దైనందిన జీవితంలో భాగం చేసుకోవాలని కలెక్టర్ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో అధికారులు, ఉద్యోగులు, క్రీడాకారులు, యువత, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొని యోగా ఆసనాలు వేశారు.1
- తెలంగాణ విభజనను అగౌరవపరుస్తూ మాట్లాడిన భారతీయ జనతా పార్టీ (బీజేపీ) ఎంపీ తేజస్వి సూర్యను తెలంగాణ రాష్ట్రంలో తిరగనివ్వబోమని కాంగ్రెస్ ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ హెచ్చరించారు. శనివారం హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడుతూ, తేజస్వి సూర్య చేసిన వ్యాఖ్యలు తెలంగాణ ప్రజల మనోభావాలను దెబ్బతీశాయని ఆయన స్పష్టం చేశారు. తెలంగాణలో అడుగు పెట్టాలంటే ఎంపీ తేజస్వి సూర్య ముందుగా తెలంగాణ ప్రజలకు బహిరంగ క్షమాపణ చెప్పాలని బల్మూరి వెంకట్ డిమాండ్ చేశారు. క్షమాపణ చెప్పని పక్షంలో ఆయనను రాష్ట్రంలోకి అనుమతించబోమని ఆయన తేల్చిచెప్పారు.1
- తెలంగాణ పంచాయతీ రాజ్ మరియు గ్రామీణ అభివృద్ధి శాఖ మంత్రి ధనసరి సీతక్క, అలాగే ఆలేరు ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య శనివారం యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారిని దర్శించుకున్నారు. స్వామి వారిని దర్శించుకోవడం తన అదృష్టమని మంత్రి సీతక్క ఈ సందర్భంగా తెలిపారు. కొండపైకి చేరుకున్న మంత్రి సీతక్కకు కలెక్టర్ అనురాగ్ జయంతి, అడిషనల్ కలెక్టర్ భాస్కర్ రావు పూల మొక్కను ఇచ్చి స్వాగతం పలికారు. అనంతరం ఆలయ చైర్మన్ నరసింహమూర్తి ఆధ్వర్యంలో అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. మంత్రి సీతక్క, ఎమ్మెల్యే ఐలయ్య గర్భాలయంలోని స్వయంభూమూర్తులను దర్శించుకుని, ఆలయ అర్చకులు నిర్వహించిన ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. అలాగే ప్రధానాలయ ముఖమంటపంలోని ఉత్సవ మూర్తులను దర్శించుకుని ప్రత్యేక సువర్ణ పుష్పార్చనలో పాల్గొన్నారు. వేద పండితులు, ఆలయ అర్చకులు వారికి ఆశీర్వచనం చేయగా, ఆలయ చైర్మన్ నరసింహమూర్తి స్వామి వారి లడ్డు ప్రసాదం, చిత్రపటాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ డీఈవో నవీన్ కుమార్, సూపర్డెంట్ రాజన్ బాబు, ఆలయ ప్రధానార్చకులు సురేంద్రచార్యులు, ఉప ప్రధాన అర్చకులు లక్ష్మణాచార్యులు, అర్చకులు మురళి, అడిషనల్ కలెక్టర్ భాస్కర్ రావు, ఎస్పీఎఫ్ ఆర్‌ఐ శేషగిరిరావు, ఆర్డీవో కృష్ణారెడ్డి, తహసిల్దార్ గణేష్ నాయక్, యాదగిరిగుట్ట మున్సిపల్ చైర్మన్ గుండ్లపల్లి వాణి భరత్ గౌడ్, మహిళా నాయకురాలు బండ్రు శోభారాణి, ఆలేరు మార్కెట్ కమిటీ చైర్మన్ చైతన్య మహేందర్ రెడ్డి, యాదగిరిగుట్ట మున్సిపల్ కౌన్సిలర్లు ముక్కెర్ల మల్లేష్, బూడిద మధు, నాయకులు గౌలికర్ రాజేష్, సుధాకర్, భిక్షపతి, గుండ్లపల్లి రాము, అజయ్ తదితరులు పాల్గొన్నారు.1
- ఆదివారం జనగామ జిల్లాలో జరిగిన నీట్ పరీక్షకు హాజరైన అశ్విని అనే విద్యార్థిని, జనగామ పట్టణంలోని ఏబీవీ డిగ్రీ కళాశాల సెంటర్‌కు పొరపాటున చేరుకుంది. అయితే, ఆమెకు కేటాయించిన అసలు పరీక్షా కేంద్రం పెంబర్తి గ్రామంలోని ఒక కళాశాలలో ఉంది. హాల్ టికెట్ పరిశీలించిన విధుల్లో ఉన్న పోలీసులు, ఆమె తప్పుడు సెంటర్‌కు వచ్చినట్లు గుర్తించి తెలియజేశారు. ఈ విషయం తెలిసి తీవ్ర కంగారుతో కన్నీటిపర్యంతమైన విద్యార్థినిని చూసి, పోలీసులు వెంటనే స్పందించి విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లారు. పరిస్థితిని అర్థం చేసుకున్న అధికారులు, ఏమాత్రం ఆలస్యం చేయకుండా విద్యార్థినిని వెంటనే పోలీస్ వాహనంలో అసలు సెంటర్‌కు తరలించాలని ఆదేశించారు. పోలీసు ఉన్నతాధికారుల ఆదేశాలతో, సదరు విద్యార్థినిని అధికారిక పోలీస్ వాహనంలో ఎక్కించుకొని, జనగామ పట్టణం నుండి పెంబర్తిలోని నీట్ పరీక్షా కేంద్రానికి సైరన్ మోగిస్తూ మెరుపు వేగంతో వెళ్లి, పరీక్ష ప్రారంభానికి 9 నిమిషాల ముందే చేర్చారు. పోలీసుల ఈ వేగవంతమైన, మానవతా దృక్పథంతో కూడిన చర్యకు వారు ప్రజలచే శభాష్ అనిపించుకోగా, విద్యార్థినితో పాటు పలువురు పోలీసులకు కృతజ్ఞతలు తెలిపారు.1
- తిరుమల మెట్ల మార్గంలో ఓ వృద్ధ దంపతుల మధ్య చోటుచేసుకున్న అపురూప దృశ్యం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. భార్య మెట్లు ఎక్కలేక ఇబ్బంది పడుతుండటాన్ని గమనించిన భర్త, ఆమెకు సాయం చేసేందుకు తన టవల్‌ను ఓవైపు చేతికి కట్టుకున్నారు. భార్య ఆ టవల్ మరొక భాగాన్ని పట్టుకుని ఒక్కో మెట్టూ ఎక్కుతూ ముందుకు సాగింది. భార్యాభర్తల మధ్య కనిపించిన ఈ హృదయపూర్వకమైన సీన్ ప్రస్తుతం తిరుమలలో హాట్ టాపిక్‌గా మారింది.1
- జిన్నారం మున్సిపల్ కేంద్రంలోని కోర్టులో జడ్జ్ తేజశ్రీ ఆధ్వర్యంలో శనివారం జాతీయ లోక్ అదాలత్ నిర్వహించారు. ఈ సందర్భంగా న్యాయవాదులు మాట్లాడుతూ, లోక్ అదాలత్ ద్వారా కేసులు త్వరితగతిన పరిష్కారమై సత్వర న్యాయం అందుతుందని తెలిపారు. కక్షిదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని పరస్పర రాజీ ద్వారా వివాదాలను పరిష్కరించుకోవడం అభినందనీయమని వారు పేర్కొన్నారు.1
- అల్లాదుర్గం ప్రాంతానికి చెందిన సీనియర్ జర్నలిస్టు మరియు టీయూడబ్ల్యూజే జిల్లా ఉపాధ్యక్షుడు భూమయ్యను రాష్ట్ర మంత్రి దామోదర్ రాజనరసింహ పరామర్శించారు. ఇటీవల బ్రెయిన్ స్ట్రోక్‌కు గురై ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న భూమయ్యను మంత్రి స్వయంగా కలిసి ఆయన ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు. ఈ సందర్భంగా, మంత్రి కుటుంబ సభ్యులతో మాట్లాడి వారికి ధైర్యం చెప్పడమే కాకుండా, చికిత్స అందిస్తున్న వైద్యులతో ప్రత్యేకంగా చర్చించి మెరుగైన వైద్య సేవలు అందేలా చూడాలని సూచించారు. భూమయ్య త్వరగా కోలుకుని మళ్లీ సాధారణ జీవితంలోకి రావాలని ఆకాంక్షిస్తూ మంత్రి ఆయనకు మనోధైర్యం కల్పించారు.1
- జనగామ జిల్లాలోని పాలకుర్తిలో నందిని సూపర్ మార్కెట్‌లో షార్ట్ సర్క్యూట్ కారణంగా పెను ప్రమాదం తృటిలో తప్పింది. ఈ ఘటనలో సీసీ కెమెరాల ఛానల్ బాక్స్ దగ్ధమైంది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఫైర్ ఇంజన్‌తో మంటలను వెంటనే ఆర్పివేశారు. అయితే, ఈ నందిని సూపర్ మార్కెట్‌లో ఫైర్ సేఫ్టీ వ్యవస్థ లేకపోవడం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. పాలకుర్తిలోని షాపింగ్ మాల్స్, సూపర్ మార్కెట్లలో ఫైర్ సేఫ్టీ పూర్తిగా కొరవడిందని, ఈ విషయంలో సంబంధిత అధికారులు నిద్రమత్తులో ఉన్నారని విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఫైర్ సేఫ్టీ లేని షాపింగ్ మాల్స్, సూపర్ మార్కెట్లపై అధికారులు ఎలాంటి కేసులు నమోదు చేయకపోవడంపై తీవ్ర నిరసన వ్యక్తమవుతోంది. ఇలాంటి నిర్లక్ష్యం కొనసాగితే, భవిష్యత్తులో పెను ప్రమాదం జరిగితే దానికి బాధ్యులు ఎవరు అనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది.1