logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

ఇంజినీర్లు దేశ ప్రగతికి మార్గదర్శకులు ఏపీ నిట్ డీన్ రీసెర్చ్ అండ్ కన్సల్టెన్సీ డాక్టర్ జి.రవి కిరణ్ శాస్త్రి దేశ అభివృద్ధి, సాంకేతిక పురోగతిలో ఇంజినీర్ల పాత్ర ఎంతో కీలకమని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఆంధ్రప్రదేశ్ (ఏపీ నిట్) డీన్ రీసెర్చ్ అండ్ కన్సల్టెన్సీ డాక్టర్ జి.రవి కిరణ్ శాస్త్రి తెలిపారు. మౌలిక వసతుల కల్పన నుంచి ఆధునిక సాంకేతిక ఆవిష్కరణల వరకు ఇంజినీర్లు అందిస్తున్న సేవలు దేశ ప్రగతికి ఎంతో దోహదపడుతున్నాయని కొనియాడారు. ఏపీ నిట్ లోని డీన్ స్టూడెంట్స్ వెల్ఫేర్ డాక్టర్ హిమబిందు ఆధ్వర్యంలో సంస్థ ప్రాంగణంలోని పరిపాలనా భవనం వద్ద మంగళవారం ఇంజినీర్స్ డే వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్బంగా డీన్ రీసెర్చ్ అండ్ కన్సల్టెన్సీ డాక్టర్ రవి కిరణ్ శాస్త్రి మాట్లాడుతూ దేశ నిర్మాణం, అభివృద్ధిలో ఇంజినీర్లు పోషిస్తున్న పాత్ర ఎంతో అమూల్యమైనదని కోనియాడారు.ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఆధునిక సాంకేతికత, స్థిరమైన అభివృద్ధి, పర్యావరణ పరిరక్షణ వంటి రంగాల్లో వినూత్న పరిష్కారాలను అందించాల్సిన బాధ్యత ఇంజినీర్లపై ఉందని తెలిపారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానానికి అనుగుణంగా ఇంజినీర్లు నైపుణ్యాలను పెంపొందించుకుంటూ దేశ ప్రగతికి మరింతగా సేవలందించాలని సూచించారు. సమాజ అవసరాలను గుర్తించి ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరిచే సాంకేతిక పరిష్కారాలపై యువ ఇంజినీర్లు దృష్టి సారించాలని సూచించారు. భారతదేశపు ప్రముఖ ఇంజినీర్, దార్శనికుడు, రాజనీతిజ్ఞుడు సర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య జయంతినే ప్రతి ఏటా ఇంజినీర్స్ డే గా నిర్వహించుకోవటం ఆనవాయితీగా వస్తుందని తెలిపారు. విశ్వేశ్వరయ్య చూపిన క్రమశిక్షణ, నిబద్ధత,, దేశసేవా స్ఫూర్తిని నేటి ఇంజినీర్లు ఆదర్శంగా తీసుకుని మరింత మెరుగైన, సుస్థిరమైన, అభివృద్ధి చెందిన భారతదేశ నిర్మాణానికి తమ వంతు కృషి చేయాలని వివరించారు. డీన్ స్టూడెంట్స్ వెల్ఫేర్ డాక్టర్ హిమబిందు మాట్లాడుతూ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. ముందుగా మోక్షగుండం విశ్వేశ్వరయ్య చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో డీన్ ప్లానింగ్ అండ్ డెవలప్మెంట్ డాక్టర్ వి.సందీప్, ఆచార్యులు డాక్టర్ రమేష్, డాక్టర్ కూర్మయ్య, డాక్టర్ రాముడు, డాక్టర్ గుర్రాల కిరణ్ కుమార్, డాక్టర్ శారదా ప్రసన్న మాలిక్ తదితరులు పాల్గొన్నారు.

2 hrs ago
user_అయితం ప్రసాద్
అయితం ప్రసాద్
తాడేపల్లిగూడెం, పశ్చిమ గోదావరి, ఆంధ్రప్రదేశ్•
2 hrs ago
51f45e24-8a48-4474-96d2-0306d03247a0

ఇంజినీర్లు దేశ ప్రగతికి మార్గదర్శకులు ఏపీ నిట్ డీన్ రీసెర్చ్ అండ్ కన్సల్టెన్సీ డాక్టర్ జి.రవి కిరణ్ శాస్త్రి దేశ అభివృద్ధి, సాంకేతిక పురోగతిలో ఇంజినీర్ల పాత్ర ఎంతో కీలకమని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఆంధ్రప్రదేశ్ (ఏపీ నిట్) డీన్ రీసెర్చ్ అండ్ కన్సల్టెన్సీ డాక్టర్ జి.రవి కిరణ్ శాస్త్రి తెలిపారు. మౌలిక వసతుల కల్పన నుంచి ఆధునిక సాంకేతిక ఆవిష్కరణల వరకు ఇంజినీర్లు అందిస్తున్న సేవలు దేశ ప్రగతికి ఎంతో దోహదపడుతున్నాయని కొనియాడారు. ఏపీ నిట్ లోని డీన్ స్టూడెంట్స్ వెల్ఫేర్ డాక్టర్ హిమబిందు ఆధ్వర్యంలో సంస్థ ప్రాంగణంలోని పరిపాలనా భవనం వద్ద మంగళవారం ఇంజినీర్స్ డే వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్బంగా డీన్ రీసెర్చ్ అండ్ కన్సల్టెన్సీ డాక్టర్ రవి కిరణ్ శాస్త్రి మాట్లాడుతూ దేశ నిర్మాణం, అభివృద్ధిలో ఇంజినీర్లు పోషిస్తున్న పాత్ర ఎంతో అమూల్యమైనదని కోనియాడారు.ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఆధునిక సాంకేతికత, స్థిరమైన అభివృద్ధి, పర్యావరణ పరిరక్షణ వంటి రంగాల్లో వినూత్న పరిష్కారాలను అందించాల్సిన బాధ్యత ఇంజినీర్లపై ఉందని తెలిపారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానానికి అనుగుణంగా ఇంజినీర్లు నైపుణ్యాలను పెంపొందించుకుంటూ దేశ ప్రగతికి మరింతగా సేవలందించాలని సూచించారు. సమాజ అవసరాలను గుర్తించి ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరిచే సాంకేతిక పరిష్కారాలపై యువ ఇంజినీర్లు దృష్టి సారించాలని సూచించారు. భారతదేశపు ప్రముఖ ఇంజినీర్, దార్శనికుడు, రాజనీతిజ్ఞుడు సర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య జయంతినే ప్రతి ఏటా ఇంజినీర్స్ డే గా నిర్వహించుకోవటం ఆనవాయితీగా వస్తుందని తెలిపారు. విశ్వేశ్వరయ్య చూపిన క్రమశిక్షణ, నిబద్ధత,, దేశసేవా స్ఫూర్తిని నేటి ఇంజినీర్లు ఆదర్శంగా తీసుకుని మరింత మెరుగైన, సుస్థిరమైన, అభివృద్ధి చెందిన భారతదేశ నిర్మాణానికి తమ వంతు కృషి చేయాలని వివరించారు. డీన్ స్టూడెంట్స్ వెల్ఫేర్ డాక్టర్ హిమబిందు మాట్లాడుతూ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. ముందుగా మోక్షగుండం విశ్వేశ్వరయ్య చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో డీన్ ప్లానింగ్ అండ్ డెవలప్మెంట్ డాక్టర్ వి.సందీప్, ఆచార్యులు డాక్టర్ రమేష్, డాక్టర్ కూర్మయ్య, డాక్టర్ రాముడు, డాక్టర్ గుర్రాల కిరణ్ కుమార్, డాక్టర్ శారదా ప్రసన్న మాలిక్ తదితరులు పాల్గొన్నారు.

More news from ఆంధ్రప్రదేశ్ and nearby areas
  • ఇంజనీరింగ్ రంగంలో మహోన్నత సేవలు అందించిన మహనీయుడు శ్రీ మోక్షగుండం విశ్వేశ్వరయ్య తాడేపల్లిగూడెం, మండల పరిషత్ కార్యాలయంలో ఇంజనీర్స్ డే కార్యక్రమాన్ని నిర్వహించారు. అందులో భాగంగా రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో ,రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు, 20 మంది రక్తదానం చేశారు. ఇంజనీర్స్ డే. వేడుకలు భారత దేశానికి ఇంజనీరింగ్ రంగంలో మహోన్నత సేవలు అందించిన మహనీయుడుశ్రీ మోక్షగుండం విశ్వేశ్వరయ్య అని ఆధునిక మైసూర్. కర్ణాటక రూప కల్పనే కాక భారత దేశంలో అనేక ప్రాంతాలలో సేవలు అందించిన భారతరత్న సర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య 165 వ జయంతి సందర్బంగా ఇంజనీర్ వ్యవస్థ ని వారి సేవలు ను గుర్తు చేసుకుంటూ ఇంజినీర్స్ ని గౌరవించు కోవడం స్ఫూర్తి దాయకం అని పలువురు వక్తలు పేర్కొన్నారు. పంచాయితీ రాజ్ విభాగం లో మున్సిపల్ విభాగం లో విశేష సేవలు అందిస్తున్న పలువురు ఇంజినీర్స్ ని ఇంజనీర్స్ డే. వేడుకలలో జి .త్రినాథ్ బాబు రిటైర్డ్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్, మాట్లాడుతూ భారత దేశానికి ఇంజనీరింగ్ రంగంలో మహోన్నత సేవలు అందించిన మహనీయుడు శ్రీ మోక్షగుండం విశ్వేశ్వరయ్య అని అన్నారు . ఈ కార్యక్రమంలో విశ్వనాథరెడ్డి ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఏలూరు జి త్రినాథ్ బాబు, రిటైర్డ్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్, సిహెచ్ వర్మ ఏపీ ఆర్డబ్ల్యూఎస్ ఈఏ అధ్యక్షులు, శ్రీకాంత్ ప్రధాన కార్యదర్శి, కే.ధణానంద్ ఏపీ ఆర్డబ్ల్యూఎస్ ఈఏ పశ్చిమగోదావరి అధ్యక్షులు, శ్రీనివాస్ ప్రధాన కార్యదర్శి, రెడ్ క్రాస్ సొసైటీ పీఆర్వో కెవి రమణ, పెద్ద ఎత్తున ఇంజనీర్స్ పాల్గొన్నారు.
    1
    ఇంజనీరింగ్ రంగంలో మహోన్నత సేవలు అందించిన  మహనీయుడు శ్రీ మోక్షగుండం విశ్వేశ్వరయ్య 
తాడేపల్లిగూడెం, మండల పరిషత్ కార్యాలయంలో ఇంజనీర్స్ డే కార్యక్రమాన్ని నిర్వహించారు. అందులో భాగంగా రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో ,రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు, 20 మంది రక్తదానం చేశారు. ఇంజనీర్స్ డే. వేడుకలు  భారత దేశానికి ఇంజనీరింగ్ రంగంలో మహోన్నత సేవలు అందించిన  మహనీయుడుశ్రీ మోక్షగుండం విశ్వేశ్వరయ్య అని  ఆధునిక మైసూర్. కర్ణాటక రూప కల్పనే కాక భారత దేశంలో అనేక ప్రాంతాలలో సేవలు అందించిన భారతరత్న సర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య 165 వ జయంతి సందర్బంగా ఇంజనీర్ వ్యవస్థ ని వారి సేవలు ను గుర్తు చేసుకుంటూ  ఇంజినీర్స్ ని గౌరవించు కోవడం స్ఫూర్తి దాయకం అని పలువురు వక్తలు పేర్కొన్నారు. పంచాయితీ రాజ్ విభాగం  లో మున్సిపల్ విభాగం లో విశేష సేవలు అందిస్తున్న పలువురు ఇంజినీర్స్ ని  ఇంజనీర్స్ డే. వేడుకలలో  జి .త్రినాథ్ బాబు రిటైర్డ్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్, మాట్లాడుతూ  భారత దేశానికి ఇంజనీరింగ్ రంగంలో మహోన్నత సేవలు అందించిన  మహనీయుడు శ్రీ మోక్షగుండం విశ్వేశ్వరయ్య అని అన్నారు . ఈ కార్యక్రమంలో విశ్వనాథరెడ్డి ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఏలూరు జి త్రినాథ్ బాబు, రిటైర్డ్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్, సిహెచ్ వర్మ ఏపీ ఆర్డబ్ల్యూఎస్ ఈఏ అధ్యక్షులు, శ్రీకాంత్ ప్రధాన కార్యదర్శి, కే.ధణానంద్ ఏపీ ఆర్డబ్ల్యూఎస్ ఈఏ పశ్చిమగోదావరి అధ్యక్షులు, శ్రీనివాస్ ప్రధాన కార్యదర్శి, రెడ్ క్రాస్ సొసైటీ పీఆర్వో కెవి రమణ, పెద్ద ఎత్తున ఇంజనీర్స్ పాల్గొన్నారు.
    user_అయితం ప్రసాద్
    అయితం ప్రసాద్
    తాడేపల్లిగూడెం, పశ్చిమ గోదావరి, ఆంధ్రప్రదేశ్•
    5 hrs ago
  • పల్లె ప్రజల చెంతకే గౌతమీ హాస్పిటల్ .. వెస్ట్ విప్పర్రలో ఉచిత మెగా మెడికల్ క్యాంపు పెంటపాడు మండలంలోని వెస్ట్ విప్పర్ర గ్రామంలో వల్లి దేవసేన సంతాన నాగ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం, గౌతమి మల్టీస్పెషల్టీ హాస్పిటల్ ఆధ్వర్యంలో ఉచిత మెగా మెడికల్ క్యాంపు నిర్వహించారు. శిబిరాన్ని మాజీ ఎమ్మెల్యే పసల కనకసుందరం రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. గైనకాలజీ, పీడియాట్రిక్, ఆర్థోకేర్ అండ్ ట్రామా కేర్, జనరల్ మెడిసిన్ విభాగాల్లో వైద్య పరీక్షలు నిర్వహించి, అవసరమైన వారికి ఉచితంగా మందులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా పసల కనకసుందరం మాట్లాడుతూ గౌతమి మల్టీస్పెషల్టీ హాస్పిటల్ అందిస్తున్న సేవలు అభినందనీయమన్నారు. మరిన్ని గ్రామాల్లో వైద్య శిబిరాలు ఏర్పాటు చేసి ప్రజలకు ఉచిత వైద్య సేవలు అందించాలని కోరారు. ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడం ద్వారా హాస్పిటల్ మరింతగా రాణించాలని ఆకాంక్షించారు. హాస్పిటల్ మేనేజింగ్ డైరెక్టర్ సత్యనారాయణ మాట్లాడుతూ ప్రజా ఆరోగ్యానికి గౌతమి మల్టీస్పెషల్టీ హాస్పిటల్ పెద్దపీట వేస్తోందన్నారు. తాడేపల్లిగూడెంలో తక్కువ ఖర్చుతో వైద్య సేవలు అందించేందుకు హాస్పిటల్ కృషి చేస్తోందని తెలిపారు. మారుమూల గ్రామాల్లో అనారోగ్యంతో బాధపడుతున్నప్పటికీ వైద్యం పొందలేని ప్రజలకు వారి వద్దకే వెళ్లి ఉచిత వైద్య పరీక్షలు నిర్వహించి మందులు పంపిణీ చేస్తున్నామని చెప్పారు. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు పసల చంటి, పసల సత్తి కొండలు, పసల గంగన్న, నైనాల సూర్యచంద్రరావు, గౌతమి హాస్పిటల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
    1
    పల్లె ప్రజల చెంతకే గౌతమీ హాస్పిటల్ .. వెస్ట్ విప్పర్రలో ఉచిత మెగా మెడికల్ క్యాంపు
పెంటపాడు మండలంలోని వెస్ట్ విప్పర్ర గ్రామంలో వల్లి దేవసేన సంతాన నాగ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం, గౌతమి మల్టీస్పెషల్టీ హాస్పిటల్ ఆధ్వర్యంలో ఉచిత మెగా మెడికల్ క్యాంపు నిర్వహించారు. శిబిరాన్ని మాజీ ఎమ్మెల్యే పసల కనకసుందరం రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. గైనకాలజీ, పీడియాట్రిక్, ఆర్థోకేర్ అండ్ ట్రామా కేర్, జనరల్ మెడిసిన్ విభాగాల్లో వైద్య పరీక్షలు నిర్వహించి, అవసరమైన వారికి ఉచితంగా మందులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా పసల కనకసుందరం మాట్లాడుతూ గౌతమి మల్టీస్పెషల్టీ హాస్పిటల్ అందిస్తున్న సేవలు అభినందనీయమన్నారు. మరిన్ని గ్రామాల్లో వైద్య శిబిరాలు ఏర్పాటు చేసి ప్రజలకు ఉచిత వైద్య సేవలు అందించాలని కోరారు. ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడం ద్వారా హాస్పిటల్ మరింతగా రాణించాలని ఆకాంక్షించారు. హాస్పిటల్ మేనేజింగ్ డైరెక్టర్ సత్యనారాయణ మాట్లాడుతూ ప్రజా ఆరోగ్యానికి గౌతమి మల్టీస్పెషల్టీ హాస్పిటల్ పెద్దపీట వేస్తోందన్నారు. తాడేపల్లిగూడెంలో తక్కువ ఖర్చుతో వైద్య సేవలు అందించేందుకు హాస్పిటల్ కృషి చేస్తోందని తెలిపారు. మారుమూల గ్రామాల్లో అనారోగ్యంతో బాధపడుతున్నప్పటికీ వైద్యం పొందలేని ప్రజలకు వారి వద్దకే వెళ్లి ఉచిత వైద్య పరీక్షలు నిర్వహించి మందులు పంపిణీ చేస్తున్నామని చెప్పారు. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు పసల చంటి, పసల సత్తి కొండలు, పసల గంగన్న, నైనాల సూర్యచంద్రరావు, గౌతమి హాస్పిటల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
    user_Siva
    Siva
    Bhimavaram, West Godavari•
    4 hrs ago
  • యలమంచిలి ఊటాడ గ్రామాల్లో రూ.104.58 లక్షలతో అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు యలమంచిలి, ఊటాడ గ్రామాల్లో రూ 104.58 లక్షల అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవం పశ్చిమగోదావరి జిల్లా, యలమంచిలి మండలం, ఊటాడ, యలమంచిలి, గ్రామాల్లో మంత్రి నిమ్మల రామానాయుడు సారధ్యంలో రూ 104.58 లక్షల ప్రభుత్వ వ్యయంతో నిర్మించిన పలు అభివృద్ధి పనులను కూటమి నాయకులు ప్రారంభించారు. యలమంచిలి మండల టిడిపి అధ్యక్షుడు మామిడిశెట్టి పెద్దిరాజు దగ్గరుండి కార్యక్రమానికి పర్యవేక్షించారు
    1
    యలమంచిలి ఊటాడ గ్రామాల్లో రూ.104.58 లక్షలతో అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు
యలమంచిలి, ఊటాడ గ్రామాల్లో 
రూ 104.58 లక్షల అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవం 
పశ్చిమగోదావరి జిల్లా, యలమంచిలి మండలం, ఊటాడ, యలమంచిలి,  గ్రామాల్లో మంత్రి నిమ్మల రామానాయుడు సారధ్యంలో రూ 104.58 లక్షల ప్రభుత్వ వ్యయంతో నిర్మించిన పలు అభివృద్ధి పనులను కూటమి నాయకులు ప్రారంభించారు.
యలమంచిలి మండల టిడిపి అధ్యక్షుడు మామిడిశెట్టి పెద్దిరాజు దగ్గరుండి కార్యక్రమానికి పర్యవేక్షించారు
    user_Gopi krishna Journalist
    Gopi krishna Journalist
    journalist (20yrs experience) పాలకొల్లు, పశ్చిమ గోదావరి, ఆంధ్రప్రదేశ్•
    1 hr ago
  • రోడ్డు వేయండి మహాప్రభో.. మా కష్టాలు తీర్చండి.......... అంబేద్కర్ కోనసీమ జిల్లా: పల్లంకూరు గ్రామపంచాయతీ పరిధిలోని దాసరి వారి పేటకు వెళ్లే రహదారి అత్యంత దయనీయంగా మారింది. గుంతలు, బురదతో రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రోడ్డు నిర్మాణం కోసం గ్రామస్తులు పలుమార్లు గ్రామపంచాయతీ కార్యాలయం, మండల కార్యాలయాల చుట్టూ తిరిగి అధికారులకు వినతులు సమర్పించినప్పటికీ ఇప్పటివరకు ఎలాంటి పరిష్కారం లభించలేదని తెలిపారు. ఈ రహదారిపై ఆధారపడి సుమారు 100 కుటుంబాలు నివసిస్తున్నాయని, వర్షాకాలంలో పరిస్థితి మరింత దారుణంగా మారుతుందని గ్రామస్తులు వాపోతున్నారు. అత్యవసర పరిస్థితుల్లో అంబులెన్స్‌లు, ఇతర వాహనాలు కూడా గ్రామానికి చేరుకోవడం కష్టంగా మారుతోందని తెలిపారు. తమ సమస్యను జిల్లా కలెక్టర్ గారు ప్రత్యేకంగా పరిశీలించి, దాసరి వారి పేట రహదారికి నూతన రోడ్డు నిర్మాణం చేపట్టేలా చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు విజ్ఞప్తి చేస్తున్నారు.
    1
    రోడ్డు వేయండి మహాప్రభో.. మా కష్టాలు తీర్చండి..........


అంబేద్కర్ కోనసీమ జిల్లా: పల్లంకూరు గ్రామపంచాయతీ పరిధిలోని దాసరి వారి పేటకు వెళ్లే రహదారి అత్యంత దయనీయంగా మారింది. గుంతలు, బురదతో రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
రోడ్డు నిర్మాణం కోసం గ్రామస్తులు పలుమార్లు గ్రామపంచాయతీ కార్యాలయం, మండల కార్యాలయాల చుట్టూ తిరిగి అధికారులకు వినతులు సమర్పించినప్పటికీ ఇప్పటివరకు ఎలాంటి పరిష్కారం లభించలేదని తెలిపారు.
ఈ రహదారిపై ఆధారపడి సుమారు 100 కుటుంబాలు నివసిస్తున్నాయని, వర్షాకాలంలో పరిస్థితి మరింత దారుణంగా మారుతుందని గ్రామస్తులు వాపోతున్నారు. అత్యవసర పరిస్థితుల్లో అంబులెన్స్‌లు, ఇతర వాహనాలు కూడా గ్రామానికి చేరుకోవడం కష్టంగా మారుతోందని తెలిపారు.
తమ సమస్యను జిల్లా కలెక్టర్ గారు ప్రత్యేకంగా పరిశీలించి, దాసరి వారి పేట రహదారికి నూతన రోడ్డు నిర్మాణం చేపట్టేలా చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు విజ్ఞప్తి చేస్తున్నారు.
    user_NITISH KUMAR
    NITISH KUMAR
    అమలాపురం, కోనసీమ, ఆంధ్రప్రదేశ్•
    10 min ago
  • లోకేష్ పర్యటన నీ విజయవంతం చేయాలి.. పెడన ఎమ్మెల్యే కాగిత పెడన నియోజకవర్గంలో ఈ నెల 17న రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ పాల్గొననున్న కార్యకర్తల సమావేశాన్ని విజయవంతం చేయాలని పెడన ఎమ్మెల్యే కాగిత కృష్ణ ప్రసాద్ పిలుపునిచ్చారు. కృత్తివెన్ను, బంటుమిల్లి, పెడన, గూడూరు మండలాల TDP నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. పార్టీ శ్రేణులు సమన్వయంతో ఏర్పాట్లు పూర్తి చేయాలని సూచించారు.
    1
    లోకేష్ పర్యటన నీ విజయవంతం చేయాలి.. పెడన ఎమ్మెల్యే కాగిత 
పెడన నియోజకవర్గంలో ఈ నెల 17న రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ పాల్గొననున్న కార్యకర్తల సమావేశాన్ని విజయవంతం చేయాలని పెడన ఎమ్మెల్యే కాగిత కృష్ణ ప్రసాద్ పిలుపునిచ్చారు. కృత్తివెన్ను, బంటుమిల్లి, పెడన, గూడూరు మండలాల TDP నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. పార్టీ శ్రేణులు సమన్వయంతో ఏర్పాట్లు పూర్తి చేయాలని సూచించారు.
    user_Hareesh Gopu
    Hareesh Gopu
    బంటుమిల్లి, కృష్ణ, ఆంధ్రప్రదేశ్•
    6 hrs ago
  • శ్రీరంగపట్నం గ్రామంలో వినాయక చవితి సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు
    1
    శ్రీరంగపట్నం గ్రామంలో వినాయక చవితి సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు
    user_Surisetti Rambabu
    Surisetti Rambabu
    కొరుకొండ, తూర్పు గోదావరి, ఆంధ్రప్రదేశ్•
    23 hrs ago
  • తుమ్మలపల్లి రమేష్ ఆధ్వర్యంలో డొక్కా సీతమ్మ క్యాంటీన్ ద్వారా ప్రతి మంగళవారం 500 మందికి అన్నదానం *డొక్కా సీతమ్మ క్యాంటీన్ ద్వారా ప్రతి మంగళవారం 500 మందికి అన్నదానం* జనసేనాని పవన్ కళ్యాణ్ స్ఫూర్తితో.. తుమ్మలపల్లి రమేష్ సొంత నిధులతో నిర్వహణ కాకినాడ జిల్లా, జగ్గంపేట, సెప్టెంబర్ 15: జగ్గంపేట పట్టణంలోని పాత పోలీస్ స్టేషన్ ఆవరణలో తుమ్మలపల్లి సత్యనారాయణ భూపతి చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్, జగ్గంపేట జనసేన పార్టీ ఇంచార్జ్ తుమ్మలపల్లి రమేష్ ఆధ్వర్యంలో డొక్కా సీతమ్మ క్యాంటీన్ నిర్వహించారు. ముందుగా డొక్కా సీతమ్మ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించి క్యాంటీన్‌ను ప్రారంభించారు. అనంతరం సుమారు 500 మందికి ఉచితంగా భోజనం అందించారు. జనసేన పార్టీ అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రజా సేవా స్ఫూర్తితో ప్రతి మంగళవారం డొక్కా సీతమ్మ క్యాంటీన్ ద్వారా అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తుమ్మలపల్లి రమేష్ తెలిపారు. ఈ కార్యక్రమాన్ని తన సొంత నిధులతో నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. పేదలు, కూలీలు, వృద్ధులు, ప్రయాణికులు, ఆపదలో ఉన్న వారికి భోజనం అందించి అండగా నిలవాలనే ఉద్దేశంతో ఈ సేవా కార్యక్రమాన్ని నిరంతరం కొనసాగిస్తున్నామని రమేష్ తెలిపారు. అన్నదాన కార్యక్రమానికి వచ్చిన ప్రజలకు తుమ్మలపల్లి రమేష్ స్వయంగా భోజనం వడ్డించారు. భోజనం చేస్తున్న వారితో ఆప్యాయంగా మాట్లాడి వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో మాదారపు వీరబాబు, కురుమల్ల నాగేశ్వరరావు, పాఠం శెట్టి రమేష్, పులి ప్రసాద్, గోకేడ ప్రసాద్,అడబాల వీరబాబు,గుంటముక్కల పెద్ద, పబ్బిరెడ్డి మణికంఠ, డ్రిల్ మాస్టారు,కోలమూరు బుజ్జి జనసేన పార్టీ నాయకులు, జనసైనికులు, వీరమహిళలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు.
    3
    తుమ్మలపల్లి రమేష్ ఆధ్వర్యంలో డొక్కా సీతమ్మ క్యాంటీన్ ద్వారా ప్రతి మంగళవారం 500 మందికి అన్నదానం 
*డొక్కా సీతమ్మ క్యాంటీన్ ద్వారా ప్రతి మంగళవారం 500 మందికి అన్నదానం*
జనసేనాని పవన్ కళ్యాణ్ స్ఫూర్తితో.. తుమ్మలపల్లి రమేష్ సొంత నిధులతో నిర్వహణ
కాకినాడ జిల్లా, జగ్గంపేట, సెప్టెంబర్ 15:
జగ్గంపేట పట్టణంలోని పాత పోలీస్ స్టేషన్ ఆవరణలో తుమ్మలపల్లి సత్యనారాయణ భూపతి చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్, జగ్గంపేట జనసేన పార్టీ ఇంచార్జ్ తుమ్మలపల్లి రమేష్ ఆధ్వర్యంలో డొక్కా సీతమ్మ క్యాంటీన్ నిర్వహించారు. ముందుగా డొక్కా సీతమ్మ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించి క్యాంటీన్‌ను ప్రారంభించారు. అనంతరం సుమారు 500 మందికి ఉచితంగా భోజనం అందించారు.
జనసేన పార్టీ అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రజా సేవా స్ఫూర్తితో ప్రతి మంగళవారం డొక్కా సీతమ్మ క్యాంటీన్ ద్వారా అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తుమ్మలపల్లి రమేష్ తెలిపారు. ఈ కార్యక్రమాన్ని తన సొంత నిధులతో నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు.
పేదలు, కూలీలు, వృద్ధులు, ప్రయాణికులు, ఆపదలో ఉన్న వారికి భోజనం అందించి అండగా నిలవాలనే ఉద్దేశంతో ఈ సేవా కార్యక్రమాన్ని నిరంతరం కొనసాగిస్తున్నామని రమేష్ తెలిపారు.
అన్నదాన కార్యక్రమానికి వచ్చిన ప్రజలకు తుమ్మలపల్లి రమేష్ స్వయంగా భోజనం వడ్డించారు. భోజనం చేస్తున్న వారితో ఆప్యాయంగా మాట్లాడి వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు.
ఈ కార్యక్రమంలో మాదారపు వీరబాబు, కురుమల్ల నాగేశ్వరరావు, పాఠం శెట్టి రమేష్, పులి ప్రసాద్, గోకేడ ప్రసాద్,అడబాల వీరబాబు,గుంటముక్కల పెద్ద, పబ్బిరెడ్డి మణికంఠ, డ్రిల్ మాస్టారు,కోలమూరు బుజ్జి  జనసేన పార్టీ నాయకులు, జనసైనికులు, వీరమహిళలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు.
    user_S BUJJI
    S BUJJI
    జగ్గంపేట, కాకినాడ, ఆంధ్రప్రదేశ్•
    3 hrs ago
  • రూ.2కోట్ల 74 లక్షలతో సీసీ రోడ్డుకు మంత్రి నిమ్మల రామానాయుడు శంకుస్థాపన రూ.2కోట్ల 74 లక్షలతో నిర్మించబోయే సీసీ రోడ్డుకు మంత్రి నిమ్మల రామానాయుడు శంకుస్థాపన చేశారు పాలకొల్లు మండలం, పాలకొల్లు రూరల్ పంచాయతీ పరిధిలోని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గిడ్డంగుల సంస్థ గోడౌన్స్ వద్ద రూ.2కోట్ల 74 లక్షలతో నిర్మించబోయే సీసీ రోడ్డుకు మంత్రి నిమ్మల రామానాయుడు నిధులు మంజూరు చేశారు. శంకుస్థాపన అనంతరం మంత్రి నిమ్మల రామానాయుడు మాట్లాడుతూ..
    1
    రూ.2కోట్ల 74 లక్షలతో సీసీ రోడ్డుకు 
మంత్రి నిమ్మల రామానాయుడు శంకుస్థాపన
రూ.2కోట్ల 74 లక్షలతో నిర్మించబోయే సీసీ రోడ్డుకు 
మంత్రి నిమ్మల రామానాయుడు శంకుస్థాపన చేశారు 
పాలకొల్లు మండలం, పాలకొల్లు రూరల్ పంచాయతీ పరిధిలోని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గిడ్డంగుల సంస్థ గోడౌన్స్ వద్ద రూ.2కోట్ల 74 లక్షలతో నిర్మించబోయే సీసీ రోడ్డుకు మంత్రి నిమ్మల రామానాయుడు నిధులు మంజూరు చేశారు. శంకుస్థాపన అనంతరం మంత్రి నిమ్మల రామానాయుడు మాట్లాడుతూ..
    user_Gopi krishna Journalist
    Gopi krishna Journalist
    journalist (20yrs experience) పాలకొల్లు, పశ్చిమ గోదావరి, ఆంధ్రప్రదేశ్•
    21 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.