Shuru
Apke Nagar Ki App…
జన్నారం మండలంలో పలు కుటుంబాలను పరామర్శించిన ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్... జన్నారం మండలంలోని కవ్వాల్ సర్పంచ్ సక్రూ నాయక్ కుమారుడు ఇటీవల మృతి చెందగా, ఆ విషయాన్ని తెలుసుకున్న నిర్మల్ డిసిసి అధ్యక్షులు మరియు ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ గారు సర్పంచ్ కుటుంబాన్ని పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కుటుంబ సభ్యులు ధైర్యంగా ఉండాలని, తాము ఎల్లప్పుడూ అండగా ఉంటామని ఓదార్చారు. అనంతరం, ఇటీవల మృతి చెందిన కాంగ్రెస్ కార్యకర్త సత్తెన్నగౌడ్ నివాసానికి చేరుకుని వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. పార్టీ మరియు ప్రభుత్వం వారికి అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, స్థానికులు మరియు పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
Naveen journalist
జన్నారం మండలంలో పలు కుటుంబాలను పరామర్శించిన ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్... జన్నారం మండలంలోని కవ్వాల్ సర్పంచ్ సక్రూ నాయక్ కుమారుడు ఇటీవల మృతి చెందగా, ఆ విషయాన్ని తెలుసుకున్న నిర్మల్ డిసిసి అధ్యక్షులు మరియు ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ గారు సర్పంచ్ కుటుంబాన్ని పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కుటుంబ సభ్యులు ధైర్యంగా ఉండాలని, తాము ఎల్లప్పుడూ అండగా ఉంటామని ఓదార్చారు. అనంతరం, ఇటీవల మృతి చెందిన కాంగ్రెస్ కార్యకర్త సత్తెన్నగౌడ్ నివాసానికి చేరుకుని వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. పార్టీ మరియు ప్రభుత్వం వారికి అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, స్థానికులు మరియు పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
More news from తెలంగాణ and nearby areas
- రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని రాజీవ్ నగర్ కు చెందిన కూన లక్ష్మీ అనే మహిళ ఈ నెల 13వ తేదీన హత్యకు గురికాగా పోలీసులు హత్య కేసును ఛేదించి నిందితుడి వివరాలను సిరిసిల్ల డిఎస్పి కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించి వెల్లడించారు. ఈ సందర్భంగా నాగేంద్ర చారి మాట్లాడుతూ.. ఒంటరిగా ఉంటున్న కూనలక్ష్మిని గమనించిన గడీల రాజు అనే వ్యక్తి మద్యానికి బానిసై జల్సాలకు డబ్బులు సరిపోనందున ఎలా అయినా డబ్బులు సంపాదించాలనుకుని కొంత కాలం నుండి రాజీవ్ నగర్ లో ఇంటిలో లక్ష్మీ ఒక్కతే ఉండడాన్ని గమనించి ఇంట్లోకి వెళ్లి కత్తెరతో హత్య చేసి 2000 రూపాయలు నగదు, రెండు చీరలు, బ్యాంకు పాసుబుక్కులు, రాజీవ్ ఆరోగ్యశ్రీ కార్డు, హ్యాండీక్యాప్డ్ సర్టిఫికెట్ లు తీసుకెళ్లినట్లు చెవులకు ఉన్న బంగారు పుల్లలు తీయడానికి ప్రయత్నించగా అవి రాకపోవడంతో తన వద్ద ఉన్న కత్తెరతో రెండు చెవులను కత్తిరించి ఇంటికి తీసుకుపోయి అవి కడిగే ప్రయత్నం చేయగా ఆ బంగారు పోగులు పడిపోయాయని తెలిపారు. సాంకేతికత ఆధారంగా నిందితుని పట్టుకోవడం జరిగిందని అతని వద్ద నుండి హత్యకు ఉపయోగించిన కత్తెర రెండు చీరలు బ్యాంకు పాసుబుక్కులు రాజీవ్ ఆరోగ్యశ్రీ హ్యాండీక్యాప్డ్ సర్టిఫికెట్లు 2000 రూపాయలను స్వాధీనం చేసుకోవడం జరిగిందని తెలిపారు.1
- కామారెడ్డి జిల్లా బీర్కూర్ మండల కార్యాలయంలో ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక సభలో రెండువర్గాల మధ్య ఉద్రిక్తత వాతావరణం నెలకొంది.ఓ వర్గానికి చెందిన మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ ను అధికారులు వేదిక పై పిలిచి సర్పంచును వేదిక పై పిలవకపోవడంతో అధికారులను సర్పంచ్ ప్రథమ పౌరుని అయిన మాకు ఎందుకు పిలవలేదనీ సర్పంచ్ ధర్మతేజ అధికారులను నిలదీశాడు.అంతలోనే ఇరువర్గాల మధ్య వాగ్వివాదం జరిగింది. ధర్మ తేజ,మండల సర్పంచ్ లు క్రింద నేల పై కూర్చుండి నిరసన తెలిపారు.వారిని పోలీసులు సముదాయించి కుర్చీల్లో కూర్చోపెట్టారు.1
- Post by Vishwamber Rao1
- lగన్నేరువరం: మండలం మైలారం గ్రామంలోని మున్నూరు కాపు సంఘం భవనంలో గురువారం హిందూ సమ్మేళన కమిటీ సభ్యులు సమావేశం నిర్వహించారు. ఈనెల 23న జరగనున్న హిందూ సమ్మేళన కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు తరలి రావాలి అవసరమైన ఏర్పాట్లపై చర్చించారు. కార్యక్రమానికి విస్తృత స్థాయిలో ప్రజలను ఆకర్షించేలా చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు. హిందువులందరూ కులమతాలకు అతీతంగా ఐక్యంగా ఉండాలని కమిటీ సభ్యులు పిలుపునిచ్చారు.1
- కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలో రెబ్బెన మండలంజిల్లాలోని ఇందిరానగర్ సమీపంలో కాగజ్‌నగర్ ఎక్స్ రోడ్ వద్ద బొలెరో వాహనం మేకల మందను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 18 మేకలు అక్కడికక్కడే మృతి చెందగా, మరో నాలుగు మేకలు గాయపడ్డాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని పరిస్థితిని పరిశీలించారు. వాహనం వేగం కారణంగానే ప్రమాదం జరిగినట్లు అనుమానం వ్యక్తమవుతోంది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.1
- అడ్వకేట్ సుబ్బారావు సింగర్ మంగ్లీకి సవాల్ విసిరారు. ట్రేడింగ్ వ్యాపారాల్లో పెట్టుబడుల పేరుతో 150 మంది నుంచి కోట్లు వసూలు చేసిన స్కామ్‌లో సింగర్ మంగ్లీ ప్రమేయం లేకపోతే గురువారం బషీర్‌బాగ్ ప్రెస్ క్లబ్‌కు రావాలన్నారు. ఈ స్కామ్‌లో మంగ్లీ, ఆమె సోదరుడికి ప్రమేయం ఉన్న ఆధారాలు తాను బయటపెట్టానని, కావాలంటే మరోసారి చూపిస్తానని సుబ్బారావు తెలిపారు. మంగ్లీ తనను 10 లక్షలు డిమాండ్ చేసిందని, తాను సైలెంట్ అయితే రూ.10 లక్షలు ఇస్తానని ఆఫర్ ఇచ్చిందని ఆయన ఆరోపించారు.1
- పత్రిక ప్రకటన తేది: 16.04.2026 కామారెడ్డి జిల్లా గురువారం జిల్లా కేంద్రంలోని ఇందిరాగాంధీ స్టేడియం పక్కన నిర్మాణంలో ఉన్న ఇండోర్ స్టేడియం పనులను జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ గురువారం ఉదయం పరిశీలించారు. ఈ సందర్భంగా నిర్మాణ పనుల పురోగతిని సమీక్షించి, జరుగుతున్న పనుల నాణ్యతను అంచనా వేసి, ప్రాజెక్టును నిర్ణీత గడువులో పూర్తి చేయడానికి అవసరమైన మార్గదర్శకాలను సంబంధిత అధికారులకు అందించారు. అలాగే అక్కడ నిర్వహిస్తున్న కబడ్డీ సమ్మర్ కోచింగ్ క్యాంపును సందర్శించి, విద్యార్థులతో కలిసి కబడ్డీ ఆడి వారిని ప్రోత్సహించారు. ఈ ఇండోర్ స్టేడియంలో 4 షటిల్ బ్యాడ్మింటన్ కోర్టులు, యోగా హాల్, ఇండోర్ గేమ్స్ సదుపాయాలు, జిమ్, రైఫిల్ షూటింగ్, స్క్వాష్ కోర్ట్ వంటి ఆధునిక సౌకర్యాలు ఏర్పాటు చేయబడుతున్నాయి. జిల్లాలో యువతకు క్రీడలు, వినోద కార్యక్రమాలను ప్రోత్సహించేందుకు మౌలిక వసతుల అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తామని కలెక్టర్ తెలిపారు. ఇందిరాగాంధీ స్టేడియాన్ని అన్ని రకాల క్రీడా సదుపాయాలతో అభివృద్ధి చేయడానికి కృషి చేస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కామారెడ్డి ఆర్‌డీవో ఎన్.వై. గిరి, పబ్లిక్ హెల్త్ డీఈ సంతోష్, కాంట్రాక్టర్ ఏజెన్సీ సభ్యుడు వెంకటరమణ, జిల్లా యువజన క్రీడల శాఖ అధికారి తదితరులు పాల్గొన్నారు.1
- రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలోని శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం లో గురువారం మాస శివరాత్రి సందర్భంగా విశేష పూజా కార్యక్రమాలు ఘనంగా నిర్వహించబడ్డాయి.ఈ సందర్భంగా ఉదయం స్వామివారికి మహన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకం శాస్త్రోక్తంగా నిర్వహించారు. అనంతరం పరివార దేవతలకు ప్రత్యేక అర్చనలు నిర్వహించారు. సాయంత్రం మహా లింగార్చన కార్యక్రమంలో భాగంగా 365 జ్యోతులను వెలిగించి భక్తి శ్రద్ధలతో పూజలు చేశారు. ఈ కార్యక్రమాలను ఆలయ ప్రధాన అర్చకులు ఈశ్వర్ గారు, సురేష్ గారి ఆధ్వర్యంలో అర్చకులు, వేద పండితులు ఏకాంతంగా నిర్వహించారు.1
- Post by Vishwamber Rao1