హస్మత్‌పేట్‌లో మిలాద్-ఉన్-నబీ ఊరేగింపు మార్గాన్ని పరిశీలించిన మల్కాజ్‌గిరి డీసీపీ మల్కాజ్‌గిరి: మిలాద్-ఉన్-నబీ సందర్భంగా నిర్వహించనున్న ఊరేగింపు ప్రశాంతంగా, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా సజావుగా సాగేందుకు మల్కాజ్‌గిరి డీసీపీ శ్రీధర్, ఇతర పోలీసు అధికారులతో కలిసి హస్మత్‌పేట్‌లోని బడి మసీదును సందర్శించారు. ఈ సందర్భంగా ప్రతిపాదిత మిలాద్-ఉన్-నబీ ఊరేగింపు మార్గాన్ని అధికారులు క్షుణ్ణంగా పరిశీలించారు. స్థానిక మత పెద్దలు, కమ్యూనిటీ నాయకులతో మాట్లాడి ఊరేగింపు ఏర్పాట్లు, భద్రతా చర్యలు, ట్రాఫిక్ నియంత్రణ తదితర అంశాలపై సమీక్ష నిర్వహించారు. ఊరేగింపు శాంతియుతంగా, క్రమబద్ధంగా నిర్వహించేందుకు అవసరమైన అన్ని భద్రతా చర్యలు తీసుకోవాలని అధికారులు సూచించారు. పోలీసులు, స్థానిక కమ్యూనిటీ నాయకులు పరస్పర సమన్వయంతో పనిచేసి పండుగను ప్రశాంత వాతావరణంలో విజయవంతం చేయాలని డీసీపీ కోరారు.

- మల్కాజ్‌గిరి శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా మల్కాజ్‌గిరి: మల్కాజ్‌గిరిలోని శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు బుధవారం భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించగా, స్వామివారి దర్శనానికి స్థానిక ప్రజలు, మహిళలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. భక్తుల రద్దీతో ఆలయ ప్రాంగణం ఆధ్యాత్మిక వాతావరణంతో నిండిపోయింది. ప్రత్యేక పూజల్లో భక్తులు పాల్గొని స్వామివారి ఆశీస్సులు పొందారు. ఈ కార్యక్రమంలో మల్కాజ్‌గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి, మాజీ కార్పొరేటర్ జగదీష్ గౌడ్ పాల్గొన్నారు. ఆలయ నిర్వాహకులు, భక్తులు, స్థానికులు పెద్ద సంఖ్యలో హాజరై బ్రహ్మోత్సవాలను విజయవంతం చేశారు.1
- బ్రాహ్మణుల సమస్యల పరిష్కారానికి మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ మద్దతు తెలంగాణ బ్రాహ్మణ సంక్షేమ పరిషత్ కార్యాలయం ఎదుట బ్రాహ్మణుల సమస్యల పరిష్కారం కోసం నిరాహార దీక్ష చేస్తున్న దేశపాండేకు మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ సంపూర్ణ మద్దతు ప్రకటించారు. షామీర్‌పేట్ నివాసంలో దేశపాండేను కలిసిన ఈటల, బ్రాహ్మణ పరిషత్‌కు నిధులు, ఓవర్సీస్ స్కాలర్‌షిప్‌లు అందించాలని కోరారు. పేద బ్రాహ్మణుల అభివృద్ధికి ప్రభుత్వం సానుకూలంగా చర్యలు తీసుకోవాలని అన్నారు. దీక్ష పోస్టర్‌ను ఆవిష్కరించారు.1
- ANS Comfort Mattresses Manufacturers in Hyderabad Call Now: 9912524242 Orthopedic Mattresses Mattresses Manufacturers company #Hyderabad sleep mattress manufacturers1
- కాంగ్రెస్ నుండి తీన్మార్ మల్లన్నను సస్పెండ్ చేయడానికి కారణం...👆🏻 కాంగ్రెస్ నుండి తీన్మార్ మల్లన్నను సస్పెండ్ చేయడానికి కారణం...👆🏻 #genz #genzaddawithteenmarmallanna #trp #bccm1
- ఏడుపాయల శ్రీ వన దుర్గ భవాని అమ్మవారి ప్రత్యేక మంగళహారతి శ్రీ ఏడుపాయల మండల దుర్గ భవాని అమ్మవారిని బుధవారం ప్రత్యేకంగా అలంకరించారు. మెదక్ జిల్లా పాపన్నపేట మండల పరిధిలోని నాగసానుపల్లి గ్రామంలోని ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీ ఏడుపాయల వన దుర్గ భవాని అమ్మవారి ఆలయంలో అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించి, ప్రత్యేక పూజలు, అభిషేకాలు, ఆరుతులను నిర్వహించిన అనంతరం భక్తులకు దర్శనం కల్పించారు.1
- రాఖీ పౌర్ణమి పండుగ నేపథ్యంలో ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని మెదక్ రీజియన్ పరిధిలో 250 ప్రత్యేక బస్సులు రాఖీ పౌర్ణమి పండుగ నేపథ్యంలో ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని మెదక్ రీజియన్ పరిధిలో 250 ప్రత్యేక బస్సులను అందుబాటులోకి తీసుకురానున్నట్లు ఆర్టీసీ ఆర్ఎం భాస్కర్ తెలిపారు. పండుగ రద్దీకి అనుగుణంగా బస్సుల సంఖ్యను పెంచినట్లు పేర్కొన్నారు. ఈ ప్రత్యేక సర్వీసుల్లో 50 శాతం అదనపు ఛార్జీలు వసూలు చేయనున్నట్లు వెల్లడించారు. పండుగకు రెండు రోజుల ముందుగానే, బుధవారం నుంచి అదనపు ఛార్జీలు అమల్లోకి వస్తాయని తెలిపారు. అయితే మహాలక్ష్మి పథకం కింద మహిళలకు కల్పిస్తున్న ఉచిత ప్రయాణ సదుపాయం యథావిధిగా కొనసాగుతుందని ఆర్ఎం స్పష్టం చేశారు.1
- జమ్మిగడ్డలో గార్డెన్ల తొలగింపునకు కాలనీ వాసుల స్వచ్ఛంద నిర్ణయం జమ్మిగడ్డ సాయిలోక్ కాలనీలో ఇరుకైన రోడ్లపై ఇళ్ల ముందు ఏర్పాటు చేసిన గార్డెన్లతో వాహనాలు, అంబులెన్సుల రాకపోకలకు ఇబ్బందులు ఎదురవుతున్న నేపథ్యంలో కాలనీ అసోసియేషన్ ప్రత్యేక చర్యలు చేపట్టింది. అధ్యక్షుడు ఎన్. శంకర్, జనరల్ సెక్రటరీ ఎన్. సురేష్ ఆధ్వర్యంలో గార్డెన్ల తొలగింపు డ్రైవ్ ప్రారంభించారు. అసోసియేషన్ సభ్యులు, కాలనీ పెద్దల సూచనతో పలువురు తమ ఇళ్ల వద్ద గార్డెన్లను స్వచ్ఛందంగా తొలగించారు. ఇతర కాలనీలు కూడా ఇదే విధంగా ముందుకు రావాలని కోరారు.1
- హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిపై ఘోర బస్సు ప్రమాదం... ఐదుగురి మృతి హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారిపై తెల్లవారుజామున ఘోర ప్రమాదం జరిగింది. విజయవాడ వెళ్తున్న ప్రైవేట్ ట్రావెల్స్(ఫ్రెష్ బస్) బస్సు కోదాడ మండలం దుర్గాపురం స్టేజీ వద్ద కంటైనర్ DCM ను వెనక నుంచి ఢీకొట్టింది. దీంతో బస్సులో ఉన్న ఐదుగురు అక్కడికక్కడే మరణించారు. 20మంది తీవ్రంగా గాయపడ్డారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. ప్రమాద సమయంలో బస్సులో మొత్తం 42మంది ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం.1