logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

అధికారుల నిర్లక్ష్యంపై గ్రామస్తులు, గిరిజన విద్యార్థి సంఘం ఆగ్రహం శిథిలావస్థలో కిండలం ప్రభుత్వ పాఠశాల చందాలు వేసుకుని మరమ్మతులు చేసిన గ్రామస్తులు అల్లూరి సీతారామరాజు జిల్లా పెదబయలు మండలం కుంతుర్ల పంచాయతీ పరిధిలోని కిండలం గ్రామ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల (ఎంపీపీ స్కూల్) తీవ్ర శిథిలావస్థకు చేరుకోవడంతో ఆదివాసీ విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పాఠశాల భవనం పైకప్పులోని ఐరన్ రేకులు పూర్తిగా దెబ్బతిని పెద్ద పెద్ద రంధ్రాలు ఏర్పడటంతో వర్షపు నీరు నేరుగా తరగతి గదుల్లోకి చేరుతోంది. దీంతో సుమారు 36 మంది విద్యార్థులు చదువుకునే పరిస్థితి లేకుండా పోయిందని ఆ గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వర్షాకాలంలో తరగతి గదులన్నీ నీటితో నిండిపోవడంతో విద్యార్థులు కూర్చోవడానికి కూడా వీలు లేకుండా పోయిందని, ఉపాధ్యాయులు పాఠాలు బోధించడానికే ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. ఈ సమస్యపై పలుమార్లు విద్యాశాఖ అధికారులకు, సంబంధిత శాఖలకు వినతిపత్రాలు సమర్పించినప్పటికీ ఎలాంటి చర్యలు తీసుకోలేదని గ్రామస్తులు ఆరోపించారు. అధికారుల నిర్లక్ష్యంతో విసిగిపోయిన గ్రామస్తులు చివరకు తమ సొంత నిధులతో చందాలు సేకరించి టార్పాలిన్ కొనుగోలు చేసి, శుక్రవారం పాఠశాల పైకప్పుకు కప్పి తాత్కాలిక మరమ్మతులు చేపట్టారు. ప్రభుత్వ పాఠశాల మరమ్మతులకు ప్రజలే చందాలు వేసుకోవాల్సిన పరిస్థితి రావడం దురదృష్టకరమని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా గిరిజన విద్యార్థి సంఘం (GSU) జిల్లా అధ్యక్షుడు మణుగూరు బాబుజీ మాట్లాడుతూ, కిండలం పాఠశాల సమస్యపై పాడేరు ఐటీడీఏ గ్రీవెన్స్‌లో పలుమార్లు ఫిర్యాదులు చేసినప్పటికీ స్పందన లేదన్నారు. వార్తాపత్రికల్లో సమస్య వెలుగులోకి వచ్చినా అధికారులు పట్టించుకోకపోవడం బాధాకరమన్నారు. కిండలం గ్రామమే కాకుండా ఏజెన్సీలోని అనేక గిరిజన పాఠశాలలు ఇదే దుస్థితిని ఎదుర్కొంటున్నాయని పేర్కొన్నారు. జిల్లా కలెక్టర్, ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి తక్షణమే స్పందించి కిండలం పాఠశాల భవనాన్ని మరమ్మతు చేయడంతో పాటు ఏజెన్సీలోని శిథిలావస్థలో ఉన్న అన్ని గిరిజన పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పించాలని గిరిజన విద్యార్థి సంఘం డిమాండ్ చేసింది.

12 hrs ago
user_Nava surya
Nava surya
జర్నలిస్ట్ డుంబ్రిగూడ, అల్లూరి సీతారామ రాజు, ఆంధ్రప్రదేశ్•
12 hrs ago
6c12ca6e-3943-49de-bb48-be1f0e3874b6

అధికారుల నిర్లక్ష్యంపై గ్రామస్తులు, గిరిజన విద్యార్థి సంఘం ఆగ్రహం శిథిలావస్థలో కిండలం ప్రభుత్వ పాఠశాల చందాలు వేసుకుని మరమ్మతులు చేసిన గ్రామస్తులు అల్లూరి సీతారామరాజు జిల్లా పెదబయలు మండలం కుంతుర్ల పంచాయతీ పరిధిలోని కిండలం గ్రామ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల (ఎంపీపీ స్కూల్) తీవ్ర శిథిలావస్థకు చేరుకోవడంతో ఆదివాసీ విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పాఠశాల భవనం పైకప్పులోని ఐరన్ రేకులు పూర్తిగా దెబ్బతిని పెద్ద పెద్ద రంధ్రాలు ఏర్పడటంతో వర్షపు నీరు నేరుగా తరగతి గదుల్లోకి చేరుతోంది. దీంతో సుమారు 36 మంది విద్యార్థులు చదువుకునే పరిస్థితి లేకుండా పోయిందని ఆ గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వర్షాకాలంలో తరగతి గదులన్నీ నీటితో నిండిపోవడంతో విద్యార్థులు కూర్చోవడానికి కూడా వీలు లేకుండా పోయిందని, ఉపాధ్యాయులు పాఠాలు బోధించడానికే ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. ఈ సమస్యపై పలుమార్లు విద్యాశాఖ అధికారులకు, సంబంధిత శాఖలకు వినతిపత్రాలు సమర్పించినప్పటికీ ఎలాంటి చర్యలు తీసుకోలేదని గ్రామస్తులు ఆరోపించారు. అధికారుల నిర్లక్ష్యంతో విసిగిపోయిన గ్రామస్తులు చివరకు తమ సొంత నిధులతో చందాలు సేకరించి టార్పాలిన్ కొనుగోలు చేసి, శుక్రవారం పాఠశాల పైకప్పుకు కప్పి తాత్కాలిక మరమ్మతులు చేపట్టారు. ప్రభుత్వ పాఠశాల మరమ్మతులకు ప్రజలే చందాలు వేసుకోవాల్సిన పరిస్థితి రావడం దురదృష్టకరమని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా గిరిజన విద్యార్థి సంఘం (GSU) జిల్లా అధ్యక్షుడు మణుగూరు బాబుజీ మాట్లాడుతూ, కిండలం పాఠశాల సమస్యపై పాడేరు ఐటీడీఏ గ్రీవెన్స్‌లో పలుమార్లు ఫిర్యాదులు చేసినప్పటికీ స్పందన లేదన్నారు. వార్తాపత్రికల్లో సమస్య వెలుగులోకి వచ్చినా అధికారులు పట్టించుకోకపోవడం బాధాకరమన్నారు. కిండలం గ్రామమే కాకుండా ఏజెన్సీలోని అనేక గిరిజన పాఠశాలలు ఇదే దుస్థితిని ఎదుర్కొంటున్నాయని పేర్కొన్నారు. జిల్లా కలెక్టర్, ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి తక్షణమే స్పందించి కిండలం పాఠశాల భవనాన్ని మరమ్మతు చేయడంతో పాటు ఏజెన్సీలోని శిథిలావస్థలో ఉన్న అన్ని గిరిజన పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పించాలని గిరిజన విద్యార్థి సంఘం డిమాండ్ చేసింది.

More news from ఆంధ్రప్రదేశ్ and nearby areas
  • ప్రతి గ్రామంలో తాగునీటి సమస్యలు తీరుస్తాం: ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం గిరిజన ప్రాంతాల్లో తాగునీటి సమస్యల పరిష్కారమే తమ లక్ష్యమని అరకు ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం అన్నారు. మడగడ పంచాయతీలో 15వ ఆర్థిక సంఘం నిధులు రూ.1.50 లక్షలతో నిర్మించనున్న చేతిపంపు బోరుకు ఆయన శంకుస్థాపన చేశారు. నియోజకవర్గంలోని ప్రతి గ్రామంలో తాగునీటి కష్టాలను దశలవారీగా తీరుస్తామని స్పష్టం చేశారు. కార్యక్రమంలో వైసీపీ నేతలు, గ్రామస్తులు పాల్గొన్నారు.
    1
    ప్రతి గ్రామంలో తాగునీటి సమస్యలు తీరుస్తాం: ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం


గిరిజన ప్రాంతాల్లో తాగునీటి సమస్యల పరిష్కారమే తమ లక్ష్యమని అరకు ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం అన్నారు. మడగడ పంచాయతీలో 15వ ఆర్థిక సంఘం నిధులు రూ.1.50 లక్షలతో నిర్మించనున్న చేతిపంపు బోరుకు ఆయన శంకుస్థాపన చేశారు. నియోజకవర్గంలోని ప్రతి గ్రామంలో తాగునీటి కష్టాలను దశలవారీగా తీరుస్తామని స్పష్టం చేశారు. కార్యక్రమంలో వైసీపీ నేతలు, గ్రామస్తులు పాల్గొన్నారు.
    user_Shyam
    Shyam
    Department of Social Services పాడేరు, అల్లూరి సీతారామ రాజు, ఆంధ్రప్రదేశ్•
    7 hrs ago
  • నాడు కొబ్బరికాయ కొట్టింది మనమే... నేడు గుమ్మడికాయ కట్టిందీ మనమే 2015లో ప్రధాని మోదీ నాయకత్వంలో భోగాపురం విమానాశ్రయం ప్రకటించాం. అనుమతులు తెచ్చి 2019లో శంకుస్థాపన చేశాం భోగాపురం విమానాశ్రయానికి నాడు కొబ్బరికాయ కొట్టింది మనమే... నేడు గుమ్మడికాయ కట్టిందీ మనమే రెండేళ్లలో ఉత్తరాంధ్రకు 189 ప్రాజెక్టులతో 6.13 లక్షల పెట్టుబడులు తెచ్చాం. ఇవి పూర్తైతే 5.57 లక్షల మందికి ఉద్యోగాలు వస్తాయి
    1
    నాడు కొబ్బరికాయ కొట్టింది మనమే... నేడు గుమ్మడికాయ కట్టిందీ మనమే
2015లో ప్రధాని మోదీ నాయకత్వంలో భోగాపురం విమానాశ్రయం ప్రకటించాం. అనుమతులు తెచ్చి 2019లో శంకుస్థాపన చేశాం
భోగాపురం విమానాశ్రయానికి నాడు కొబ్బరికాయ కొట్టింది మనమే... నేడు గుమ్మడికాయ కట్టిందీ మనమే
రెండేళ్లలో ఉత్తరాంధ్రకు 189 ప్రాజెక్టులతో 6.13 లక్షల పెట్టుబడులు తెచ్చాం. ఇవి పూర్తైతే 5.57 లక్షల మందికి ఉద్యోగాలు వస్తాయి
    user_Kumar
    Kumar
    Reporter విజయనగరం, విజయనగరం, ఆంధ్రప్రదేశ్•
    1 hr ago
  • కామ్రేడ్ అల్తి అప్పలనాయుడు వర్ధంతి సందర్భంగా నివాళులు అర్పించిన కార్మికులు గజపతినగరంలో కామ్రేడ్ అల్తి అప్పలనాయుడు వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి శనివారం కార్మిక సంఘాల నాయకులు ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ కార్మికులను సంఘటితం చేసి వారి హక్కుల సాధన కోసం జీవితాంతం అనేక పోరాటాలు చేసిన ప్రజానాయకుడు అల్తి అప్పలనాయుడని కొనియాడారు. కార్మిక సంక్షేమం కోసం ఆయన చేసిన సేవలు నేటి తరానికి ఆదర్శమని పేర్కొన్నారు. ఆయన ఆశయాలను కొనసాగిస్తూ కార్మికుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని ప్రతిజ్ఞ చేశారు. ఈ కార్యక్రమంలో కార్మిక సంఘాల నాయకులు ఓమ్మి రమణ, పురం అప్పారావు, బెల్లాన శ్రీను, కోట అప్పారావు, కర్రి సురేష్, కనిమెరక శేషగిరి, తమ్మినేని కృష్ణ, లెంక ఆది, మంత్రి రామారావు తదితరులు పాల్గొన్నారు.
    1
    కామ్రేడ్ అల్తి అప్పలనాయుడు వర్ధంతి సందర్భంగా నివాళులు అర్పించిన కార్మికులు 
గజపతినగరంలో కామ్రేడ్ అల్తి అప్పలనాయుడు వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి శనివారం కార్మిక సంఘాల నాయకులు ఘనంగా నివాళులర్పించారు.
ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ కార్మికులను సంఘటితం చేసి వారి హక్కుల సాధన కోసం జీవితాంతం అనేక పోరాటాలు చేసిన ప్రజానాయకుడు అల్తి అప్పలనాయుడని కొనియాడారు. కార్మిక సంక్షేమం కోసం ఆయన చేసిన సేవలు నేటి తరానికి ఆదర్శమని పేర్కొన్నారు. ఆయన ఆశయాలను కొనసాగిస్తూ కార్మికుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని ప్రతిజ్ఞ చేశారు.
ఈ కార్యక్రమంలో కార్మిక సంఘాల నాయకులు ఓమ్మి రమణ, పురం అప్పారావు, బెల్లాన శ్రీను, కోట అప్పారావు, కర్రి సురేష్, కనిమెరక శేషగిరి, తమ్మినేని కృష్ణ, లెంక ఆది, మంత్రి రామారావు తదితరులు పాల్గొన్నారు.
    user_Venkata Satyanarayana
    Venkata Satyanarayana
    Vizianagaram, Andhra Pradesh•
    4 hrs ago
  • నెల్లిమర్ల నగరం నుండి 18 బస్సులలో భోగాపురానికి ప్రజలు ఉత్సాహంగా .. నెల్లిమర్ల నగర పంచాయతీ పరిధిలో ప్రజలు శనివారం ఉదయం 18 బస్సులలో బోగాపురం ఎయిర్పోర్ట్ కు ఉత్సాహంగా బయలుదేరారు. నగర కమిషనర్ కిల్లాన అప్పలరాజు ఆధ్వర్యంలో సచివాలయ సిబ్బంది సహకారంతో నగర ప్రజలను బస్సులలో ఎక్కించి తీసుకు వెళ్లడం జరుగుతుందని కమిషనర్ తెలిపారు. విజయనగరం జిల్లాకి అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయo ప్రారంభోత్సవం కాబోతుండటంతోనే ప్రజలు ఆనందంగా బయలుదేరుతున్నామని అన్నారు.
    1
    నెల్లిమర్ల నగరం నుండి 18 బస్సులలో  భోగాపురానికి ప్రజలు ఉత్సాహంగా ..
నెల్లిమర్ల నగర పంచాయతీ పరిధిలో ప్రజలు శనివారం ఉదయం 18 బస్సులలో బోగాపురం ఎయిర్పోర్ట్ కు ఉత్సాహంగా బయలుదేరారు. నగర కమిషనర్ కిల్లాన  అప్పలరాజు ఆధ్వర్యంలో సచివాలయ సిబ్బంది సహకారంతో నగర ప్రజలను బస్సులలో ఎక్కించి తీసుకు వెళ్లడం జరుగుతుందని కమిషనర్ తెలిపారు. విజయనగరం జిల్లాకి  అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయo ప్రారంభోత్సవం కాబోతుండటంతోనే  ప్రజలు ఆనందంగా బయలుదేరుతున్నామని అన్నారు.
    user_Vijay Bhaskar
    Vijay Bhaskar
    Local News Reporter నెల్లిమర్ల, విజయనగరం, ఆంధ్రప్రదేశ్•
    13 hrs ago
  • *భోగాపురం ఎయిర్‌పోర్ట్‌ను జాతికి అంకితం చేసిన ప్రధాని మోడీ..* VSP..భోగాపురం ఎయిర్ పోర్ట్ పాల్గొన్న సీఎం చంద్రబాబు, పవన్‌ కల్యాణ్‌, రామ్మోహన్‌ నాయుడు.. 15 నిమిషాల పాటు ఎయిర్‌పోర్ట్‌ ను పరిశీలించిన మోడీ.. ఓపెన్‌ టాప్‌ కారులో థింసా నృత్యాన్ని తిలకించిన మోడీ.. రికార్డుస్థాయిలో 13,500 మందితో థింసా నృత్యం.. మోడీకి బొబ్బిలి వీణను బహూకరించిన సీఎం చంద్రబాబు...
    1
    *భోగాపురం ఎయిర్‌పోర్ట్‌ను జాతికి అంకితం చేసిన ప్రధాని మోడీ..*
VSP..భోగాపురం ఎయిర్ పోర్ట్ పాల్గొన్న సీఎం చంద్రబాబు, పవన్‌ కల్యాణ్‌, రామ్మోహన్‌ నాయుడు.. 15 నిమిషాల పాటు ఎయిర్‌పోర్ట్‌ ను పరిశీలించిన మోడీ.. ఓపెన్‌ టాప్‌ కారులో థింసా నృత్యాన్ని తిలకించిన మోడీ.. రికార్డుస్థాయిలో 13,500 మందితో థింసా నృత్యం.. మోడీకి బొబ్బిలి వీణను బహూకరించిన సీఎం చంద్రబాబు...
    user_Y.S.RAJ KUMAR PATNAIK
    Y.S.RAJ KUMAR PATNAIK
    Marketing Executive మహారాణిపేట, విశాఖపట్నం, ఆంధ్రప్రదేశ్•
    7 hrs ago
  • రాజాం:రాజాం లో ప్రభుత్వ కార్యాలయలో విద్యుత్ దీపాలంకరణ.. భోగాపురం అల్లూరి సీతారామరాజు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ప్రారంభోత్సవం సందర్భంగా రాజాం ప్రభుత్వ కార్యాలయాల్లో విద్యుత్ దీపాలంకరణలతో కళకళలాడుతున్నాయి. ప్రధాన రహదారి పై ఉన్న పురపాలక సంఘం, సబ్ రిజిస్టర్ కార్యాలయాలు కాంతుల విసిరితున్నాయి. దీపాలు చూసిన ప్రయాణికులు నిత్యం ఇలానే ఉంటే బాగుంటుదని అభిప్రాయపడుతున్నారు.
    1
    రాజాం:రాజాం లో ప్రభుత్వ కార్యాలయలో విద్యుత్ దీపాలంకరణ..
భోగాపురం అల్లూరి సీతారామరాజు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ప్రారంభోత్సవం సందర్భంగా రాజాం ప్రభుత్వ కార్యాలయాల్లో విద్యుత్ దీపాలంకరణలతో కళకళలాడుతున్నాయి. ప్రధాన రహదారి పై ఉన్న పురపాలక సంఘం, సబ్ రిజిస్టర్ కార్యాలయాలు కాంతుల విసిరితున్నాయి. దీపాలు చూసిన ప్రయాణికులు నిత్యం ఇలానే ఉంటే బాగుంటుదని అభిప్రాయపడుతున్నారు.
    user_HARIBABU  TALADA
    HARIBABU TALADA
    Farmer రాజాం, విజయనగరం, ఆంధ్రప్రదేశ్•
    22 hrs ago
  • ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు పంపిణీ చేసిన ఎమ్మెల్యే ఇంటింటికి ప్రచారంలో భాగంగా కాకినాడ జిల్లా తుని మండలం చామవరం గ్రామంలో శనివారం నాడు తుని నియోజకవర్గ ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ యనమల దివ్య ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమంలో పాల్గొన్నారు. వృద్ధులు, వికలాంగులు, వితంతువులు, కి ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు అందజేశారు. ఇంటింటికి వెళ్లి ప్రజల యొక్క సమస్యలను అడిగి తెలుసుకున్నారు. గ్రామంలోని వృద్ధులు మహిళలు వారి యొక్క సమస్యలను చెప్పిన వెంటనే ఎమ్మెల్యే స్థానిక అధికారులతో మాట్లాడి సమస్యలను పరిష్కరించాలని ఆదేశాలు జారీ చేస్తున్నారు.
    1
    ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు పంపిణీ చేసిన ఎమ్మెల్యే ఇంటింటికి ప్రచారంలో భాగంగా
కాకినాడ జిల్లా తుని మండలం చామవరం గ్రామంలో శనివారం నాడు తుని నియోజకవర్గ ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ యనమల దివ్య ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమంలో పాల్గొన్నారు. వృద్ధులు, వికలాంగులు, వితంతువులు, కి ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు అందజేశారు. ఇంటింటికి వెళ్లి ప్రజల యొక్క సమస్యలను అడిగి తెలుసుకున్నారు. గ్రామంలోని వృద్ధులు మహిళలు వారి యొక్క సమస్యలను చెప్పిన వెంటనే ఎమ్మెల్యే స్థానిక అధికారులతో మాట్లాడి సమస్యలను పరిష్కరించాలని ఆదేశాలు జారీ చేస్తున్నారు.
    user_Machha Mallesh
    Machha Mallesh
    Taxi Driver తుని, కాకినాడ, ఆంధ్రప్రదేశ్•
    5 hrs ago
  • గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో స్థానం సంపాదించుకున్న థింసా నృత్యం ​భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయంలో శుక్రవారం దేశం లోనే అత్యధికంగా 13వేల మంది గిరిజన బాలికలతో ప్రదర్శించిన థింసా నృత్యం గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో నమోదయ్యింది. గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ సంస్థ ప్రతినిధులు ప్రత్యక్షంగా థింసా నృత్యాన్ని తిలకించి సంతృప్తినీ వ్యక్తం చేశారు. అనంతరం వరల్డ్ రికార్డ్స్ కు సంబంధించిన సర్టిఫికెట్ ను గిరిజన సంక్షేమ శాఖా మంత్రి గుమ్మిడి సంధ్యారాణి కి అందజేశారు. ఉత్తరాంధ్ర సంస్కృతి, సాంప్రదాయాల విశిష్టతను ప్రపంచానికి చాటిచెప్పేలా ఈ వేడుకను ఘనంగా నిర్వహించారు. ​13,000 మంది పైబడి గిరిజన మహిళలు మరియు విద్యార్థినులు ఏకకాలంలో సంప్రదాయ థింసా నృత్యాన్ని ప్రదర్శించారు.
    1
    గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో స్థానం సంపాదించుకున్న థింసా నృత్యం
​భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయంలో శుక్రవారం   దేశం లోనే అత్యధికంగా 13వేల మంది గిరిజన బాలికలతో ప్రదర్శించిన థింసా నృత్యం  గిన్నిస్  బుక్ ఆఫ్ రికార్డ్స్ లో నమోదయ్యింది.  గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్  సంస్థ ప్రతినిధులు ప్రత్యక్షంగా థింసా నృత్యాన్ని తిలకించి సంతృప్తినీ వ్యక్తం చేశారు. అనంతరం వరల్డ్ రికార్డ్స్ కు సంబంధించిన సర్టిఫికెట్ ను గిరిజన సంక్షేమ శాఖా మంత్రి గుమ్మిడి సంధ్యారాణి కి అందజేశారు. 
ఉత్తరాంధ్ర సంస్కృతి, సాంప్రదాయాల విశిష్టతను ప్రపంచానికి చాటిచెప్పేలా ఈ వేడుకను ఘనంగా నిర్వహించారు. ​13,000 మంది  పైబడి గిరిజన మహిళలు మరియు విద్యార్థినులు ఏకకాలంలో సంప్రదాయ థింసా  నృత్యాన్ని ప్రదర్శించారు.
    user_Kumar
    Kumar
    Reporter విజయనగరం, విజయనగరం, ఆంధ్రప్రదేశ్•
    22 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.