logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

*కోవూరు నియోజకవర్గాన్ని వరద ముప్పు నుంచి కాపాడండి* - కనిగిరి రిజర్వాయర్ క్రస్ట్ గేట్లు మరమత్తులు, పెన్నా డెల్టా పరిధిలోని సాగునీటి కాలువలో పూడికతీత పనులకు నిధులు కేటాయించండి. - సాగునీటి రంగంలో కీలక పాత్ర పోషించే లష్కర్లకు జీతాలు చెల్లించండి. - రహదారులు రక్తమోడుతున్నాయి, రోడ్డు ప్రమాదాల నివారణకు చర్యలు చేపట్టండి. - సాంకేతిక సమస్యల కారణంగా ప్రభుత్వ సంక్షేమ పధకాలు అర్హులైన లబ్దిదారులకు అందడంలో జరుగుతున్న జాప్యాన్ని నివారించండి. - సమీక్షలతో జాప్యం చేయకుండా పేదల ఇళ్ళు, ఇంటి స్థలాల సమస్యకు పరిష్కారం చూపండి. - డెల్టా ప్రాంత వరి కోతల సీజన్ ను దృష్టిలో వుంచుకొని ధాన్య సేకరణ కేంద్రాలు ఏర్పాటు చేయండి. - గతంలోలా 75 శాతం సబ్సిడీతో మత్స్యకారులకు బోట్లు, వలలు యివ్వండి. - ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తానని కలెక్టెర్ హిమాన్షు శుక్లా హామి. - జిల్లా అభివృద్ధి సమీక్షా సమావేశంలో ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి. పెన్నా డెల్టా ఆధునీరణకు నిధులు కేటాయించి రైతులను ఆదుకోవాలని కోరారు కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి గారు. నెల్లూరు నగరంలోని జెడ్ పి సమావేశ మందిరంలో నిర్వహించిన జిల్లా అభివృద్ధి సమీక్షా సమావేశంలో ఆమె మాట్లాడుతూ పెన్నా నది పరివాహక ప్రాంతమైన కోవూరు నియోజకవర్గ భౌగోళిక పరిస్థితులు, 2021 లో వచ్చిన వరదలను దృష్టిలో వుంచుకొని పెన్నానది పొర్లుకట్టలను బలోపేతం చేయాల్సిన అవసరాన్ని ఆమె మంత్రులు మరియు జిల్లా కలక్టర్ దృష్టికి తెచ్చారు. కనిగిరి రిజర్వాయర్ క్రస్ట్ గేట్లు మరమత్తులు చేయడంతో పాటు ప్రస్తుత రబీ సీజన్లో పెన్నా డెల్టా పరిధిలోని సాగునీటి కాలువలో పూడికతీత పనులకు నిధులు కేటాయించాలని కోరారు. పెన్నా నదికి వచ్చే వరదల సందర్భంగా కోతకు గురయ్యే ప్రాంతాలలో రిటైనింగ్ వాల్స్ కట్టి పరిహాక ప్రాంత ప్రజలను వరద ముప్పు నుంచి కాపాడవాల్సిందిగా ఆమె విజ్ఞప్తి చేశారు. ఆయకట్టు పరిధిలోని చివరి ఎకరాకు నీళ్లు అందించడంలో సాగునీటి రంగంలో కీలక పాత్ర పోషించే లష్కర్ల జీతాలు వెంటనే చెల్లించాలని ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి గారు కోరారు. కోవూరు నియోజకవర్గ పరిధిలో బోర్ల పై ఆధారపడి వ్యవసాయం చేసుకునే రైతుల కోసం నెల్లూరులోని పెన్నా బ్యారేజ్ ద్వారా దిగువకు నీరు విడుదల చేసి తీర ప్రాంత గ్రామాలలో భూగర్భ జలాల పెంపుకు కృషి చేసి వేసవిలో తాగు, సాగునీటికి ఇబ్బందులు లేకుండా చూడాలన్నారు. కోవూరు నియోజకవర్గ పరిధిలో కొడవలూరు మండలం టపాతోపు, చంద్రశేఖరపురం జంక్షన్, గండవరం బ్రిడ్జ్, కోవూరు మండలం రామన్నపాలెం, ఇనుమడుగు శివాలయం తదితర ప్రాంతాలలో నిత్యం జరిగే రోడ్డు ప్రమాదాలను అరికట్టే దిశగా హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాలని కోరారు. పేదలకు ఇళ్ళు, ఇంటి స్థలాల కేటాయింపులో జరుగుతున్న జాప్యాన్ని నియంత్రించాలని ఆమె మంత్రుల దృష్టికి తెచ్చారు. గత ప్రభుత్వం వేసిన లేఅవుట్లలో కనీస మౌలిక సదుపాయాలు లేక ప్రజలు అవస్థలు పడుతున్న విషయాన్ని ఆమె సమీక్షా సమావేశంలో ప్రస్తావించారు. కోవూరు నియోజకవర్గంలో 10 మందికి ఇళ్ళు అవసరముందని, సమీక్షల పేరుతొ జాప్యం చేయకుండా పేదలకు ఇళ్ళు, ఇంటి స్థలాల మంజూరు చేసేలా హోసింగ్ అధికారులు కృషి చేయాలనన్నారు. ప్రభుత్వ సంక్షేమ పధకాలు అర్హులైన లబ్దిదారులకు చేర్చడంలో సాంకేతిక సమస్యలు అడ్డంకిగా మారుతున్నాయన్నారు “అన్నదాత సుఖీభవ”, “మత్స్యకార సేవలో” లాంటి ప్రభుత్వ సంక్షేమ పధకాలు బ్యాంక్ లింకేజి, ఆధార్ కార్డులలో పొరపాట్లు తదితర కారణాలతో అర్హులైన లబ్దిదారులకు అందడంలో జరుగుతున్న జాప్యాన్ని అరికట్టాలని ఆమె జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్లా దృష్టికి తెచ్చారు. చిన్న, సన్న కారు రైతుల అవసరాలను దృష్టిలో వుంచుకొని ప్రభుత్వం యిస్తున్న యూరియా కార్డులు నాన్ డెల్టా, మరియు చెరువు భూముల్లో సాగుచేస్తున్న రైతులకు కూడా అందచేసేలా చర్యలో తీసుకోవాలని అధికారులను కోరారు. పెన్నా డెల్టా పరిధిలో రెండవ పంట ధాన్య సేకరణలో జరిగిన జాప్యం కారణంగా అన్నదాతలు నష్టపోయారని ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి గారు ఆవేదన వ్యక్తం చేశారు. జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్లా హామి డెల్టా ప్రాంత వరి కోతల సీజన్ ను దృష్టిలో వుంచుకొని ముందుగానే ధాన్య సేకరణ కేంద్రాలు ఏర్పాటు చేయాలని ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి గారు మంత్రులు మరియు కలెక్టర్ గార్ల దృష్టికి తెచ్చారు. మత్స్యకారులకు ప్రభుత్వం అందిస్తున్న బోట్లు, వలలను ప్రస్తుత 40 శాతం సబ్సిడీ కాకుండా 2014-19 మధ్య కాలంలో అమలులో వున్న 75 శాతం సబ్సిడీ వర్తించేలా కృషి చేయాలని ఆమె పేర్కొన్నారు. ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి గారు లేవనెత్తిన రైతాంగ సమస్యలు మరియు ప్రభుత్వ సంక్షేమ పధకాలు అమలులో ఎదురవుతున్న సాంకేతిక సమస్యలను పరిష్కరిస్తానని జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్లా హామీ యిచ్చారు. క్షేత్ర స్థాయిలో అధికారులు మరియు బ్యాంకర్లను అప్రమత్తం చేసి భవిషత్తులో అర్హులైన లబ్దిదారులకు ప్రభుత్వ పధకాలు చేర్చడంలో ఏటివంటి అవాంతరాలు రాకుండా చూస్తానన్నారు. జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్లా అధ్యక్షతన నిర్వహించిన జిల్లా అభివృద్ధి సమీక్షా సమావేశంలో జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి ఎన్ఎండి ఫరూఖ్, రాష్ట్ర దేవదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి పొంగూరు నారాయణ, పార్లమెంటు సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, బీద మస్తాన్ రావు, ఎమ్మెల్సీలు బల్లి కల్యాణ్ చక్రవర్తి, తూమాటి మాధవరావు, శాసన సభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, కాకర్ల సురేష్, కృష్ణా రెడ్డి, ఇంటూరి నాగేశ్వరరావులతో పాటు వివిధ శాఖల జిల్లా ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

on 8 November
user_SRIHARI POONDLA
SRIHARI POONDLA
Nellore Urban, Spsr Nellore•
on 8 November
dcf16f17-a217-463c-946e-2b46ddf8efea

*కోవూరు నియోజకవర్గాన్ని వరద ముప్పు నుంచి కాపాడండి* - కనిగిరి రిజర్వాయర్ క్రస్ట్ గేట్లు మరమత్తులు, పెన్నా డెల్టా పరిధిలోని సాగునీటి కాలువలో పూడికతీత పనులకు నిధులు కేటాయించండి. - సాగునీటి రంగంలో కీలక పాత్ర పోషించే లష్కర్లకు జీతాలు చెల్లించండి. - రహదారులు రక్తమోడుతున్నాయి, రోడ్డు ప్రమాదాల నివారణకు చర్యలు చేపట్టండి. - సాంకేతిక సమస్యల కారణంగా ప్రభుత్వ సంక్షేమ పధకాలు అర్హులైన లబ్దిదారులకు అందడంలో జరుగుతున్న జాప్యాన్ని నివారించండి. - సమీక్షలతో జాప్యం చేయకుండా పేదల ఇళ్ళు, ఇంటి స్థలాల సమస్యకు పరిష్కారం చూపండి. - డెల్టా ప్రాంత వరి కోతల సీజన్ ను దృష్టిలో వుంచుకొని ధాన్య సేకరణ కేంద్రాలు ఏర్పాటు చేయండి. - గతంలోలా 75 శాతం సబ్సిడీతో మత్స్యకారులకు బోట్లు, వలలు యివ్వండి. - ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తానని కలెక్టెర్ హిమాన్షు శుక్లా హామి. - జిల్లా అభివృద్ధి సమీక్షా సమావేశంలో ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి. పెన్నా డెల్టా ఆధునీరణకు నిధులు కేటాయించి రైతులను ఆదుకోవాలని కోరారు కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి గారు. నెల్లూరు నగరంలోని జెడ్ పి సమావేశ మందిరంలో నిర్వహించిన జిల్లా అభివృద్ధి సమీక్షా సమావేశంలో ఆమె మాట్లాడుతూ పెన్నా నది పరివాహక ప్రాంతమైన కోవూరు నియోజకవర్గ భౌగోళిక పరిస్థితులు, 2021 లో వచ్చిన వరదలను దృష్టిలో వుంచుకొని పెన్నానది పొర్లుకట్టలను బలోపేతం చేయాల్సిన అవసరాన్ని ఆమె మంత్రులు మరియు జిల్లా కలక్టర్ దృష్టికి తెచ్చారు. కనిగిరి రిజర్వాయర్ క్రస్ట్ గేట్లు మరమత్తులు చేయడంతో పాటు ప్రస్తుత రబీ సీజన్లో పెన్నా డెల్టా పరిధిలోని సాగునీటి కాలువలో పూడికతీత పనులకు నిధులు కేటాయించాలని కోరారు. పెన్నా నదికి వచ్చే వరదల సందర్భంగా కోతకు గురయ్యే ప్రాంతాలలో రిటైనింగ్ వాల్స్ కట్టి పరిహాక ప్రాంత ప్రజలను వరద ముప్పు నుంచి కాపాడవాల్సిందిగా ఆమె విజ్ఞప్తి చేశారు. ఆయకట్టు పరిధిలోని చివరి ఎకరాకు నీళ్లు అందించడంలో సాగునీటి రంగంలో కీలక పాత్ర పోషించే లష్కర్ల జీతాలు వెంటనే చెల్లించాలని ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి గారు కోరారు. కోవూరు నియోజకవర్గ పరిధిలో బోర్ల పై ఆధారపడి వ్యవసాయం చేసుకునే రైతుల కోసం నెల్లూరులోని పెన్నా బ్యారేజ్ ద్వారా దిగువకు నీరు విడుదల చేసి తీర ప్రాంత గ్రామాలలో భూగర్భ జలాల పెంపుకు కృషి చేసి వేసవిలో తాగు, సాగునీటికి ఇబ్బందులు లేకుండా చూడాలన్నారు. కోవూరు నియోజకవర్గ పరిధిలో కొడవలూరు మండలం టపాతోపు, చంద్రశేఖరపురం జంక్షన్, గండవరం బ్రిడ్జ్, కోవూరు మండలం రామన్నపాలెం, ఇనుమడుగు శివాలయం తదితర ప్రాంతాలలో నిత్యం జరిగే రోడ్డు ప్రమాదాలను అరికట్టే దిశగా హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాలని కోరారు. పేదలకు ఇళ్ళు, ఇంటి స్థలాల కేటాయింపులో జరుగుతున్న జాప్యాన్ని నియంత్రించాలని ఆమె మంత్రుల దృష్టికి తెచ్చారు. గత ప్రభుత్వం వేసిన లేఅవుట్లలో కనీస మౌలిక సదుపాయాలు లేక ప్రజలు అవస్థలు పడుతున్న విషయాన్ని ఆమె సమీక్షా సమావేశంలో ప్రస్తావించారు. కోవూరు నియోజకవర్గంలో 10 మందికి ఇళ్ళు అవసరముందని, సమీక్షల పేరుతొ జాప్యం చేయకుండా పేదలకు ఇళ్ళు, ఇంటి స్థలాల మంజూరు చేసేలా హోసింగ్ అధికారులు కృషి చేయాలనన్నారు. ప్రభుత్వ సంక్షేమ పధకాలు అర్హులైన లబ్దిదారులకు చేర్చడంలో సాంకేతిక సమస్యలు అడ్డంకిగా మారుతున్నాయన్నారు “అన్నదాత సుఖీభవ”, “మత్స్యకార సేవలో” లాంటి ప్రభుత్వ సంక్షేమ పధకాలు బ్యాంక్ లింకేజి, ఆధార్ కార్డులలో పొరపాట్లు తదితర కారణాలతో అర్హులైన లబ్దిదారులకు అందడంలో జరుగుతున్న జాప్యాన్ని అరికట్టాలని ఆమె జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్లా దృష్టికి తెచ్చారు. చిన్న, సన్న కారు రైతుల అవసరాలను దృష్టిలో వుంచుకొని ప్రభుత్వం యిస్తున్న యూరియా కార్డులు నాన్ డెల్టా, మరియు చెరువు భూముల్లో సాగుచేస్తున్న రైతులకు కూడా అందచేసేలా చర్యలో తీసుకోవాలని అధికారులను కోరారు. పెన్నా డెల్టా పరిధిలో రెండవ పంట ధాన్య సేకరణలో జరిగిన జాప్యం కారణంగా అన్నదాతలు నష్టపోయారని ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి గారు ఆవేదన వ్యక్తం చేశారు. జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్లా హామి డెల్టా ప్రాంత వరి కోతల సీజన్ ను దృష్టిలో వుంచుకొని ముందుగానే ధాన్య సేకరణ కేంద్రాలు ఏర్పాటు చేయాలని ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి గారు మంత్రులు మరియు కలెక్టర్ గార్ల దృష్టికి తెచ్చారు. మత్స్యకారులకు ప్రభుత్వం అందిస్తున్న బోట్లు, వలలను ప్రస్తుత 40 శాతం సబ్సిడీ కాకుండా 2014-19 మధ్య కాలంలో అమలులో వున్న 75 శాతం సబ్సిడీ వర్తించేలా కృషి చేయాలని ఆమె పేర్కొన్నారు. ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి గారు లేవనెత్తిన రైతాంగ సమస్యలు మరియు ప్రభుత్వ సంక్షేమ పధకాలు అమలులో ఎదురవుతున్న సాంకేతిక సమస్యలను పరిష్కరిస్తానని జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్లా హామీ యిచ్చారు. క్షేత్ర స్థాయిలో అధికారులు మరియు బ్యాంకర్లను అప్రమత్తం చేసి భవిషత్తులో అర్హులైన లబ్దిదారులకు ప్రభుత్వ పధకాలు చేర్చడంలో ఏటివంటి అవాంతరాలు రాకుండా చూస్తానన్నారు. జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్లా అధ్యక్షతన నిర్వహించిన జిల్లా అభివృద్ధి సమీక్షా సమావేశంలో జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి ఎన్ఎండి ఫరూఖ్, రాష్ట్ర దేవదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి పొంగూరు నారాయణ, పార్లమెంటు సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, బీద మస్తాన్ రావు, ఎమ్మెల్సీలు బల్లి కల్యాణ్ చక్రవర్తి, తూమాటి మాధవరావు, శాసన సభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, కాకర్ల సురేష్, కృష్ణా రెడ్డి, ఇంటూరి నాగేశ్వరరావులతో పాటు వివిధ శాఖల జిల్లా ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

More news from ఆంధ్రప్రదేశ్ and nearby areas
  • ఒంటిమిట్ట శ్రీకోదండ_రామాలయం. పూర్తి వివరణ: ఏకశిలానగరి.. విశేషాల కోదండ రామయ్య ఆలయం ప్రత్యేకతలకు నిలయం. చారిత్రక , రాచరిక ఘట్టాలకు నిలువెత్తు దర్పణం. ఒకే శిలపై కొలువైన సీతారామలక్ష్మణుల మూలమూర్తుల దివ్య దర్శనం.. ఓ అద్భుతం. ఎత్తయిన గోపురాలు.. విశాలమైన ఆలయ రంగమంటపం.. శిల్పకళా వైభవం.. మహాద్భుతం. రామ , లక్ష్మణ తీర్థాలు జలసిరికి నిదర్శనం. హనుమ లేని రాముడి కోవెల.. పండువెన్నెల్లో సీతారాముల కల్యాణం.. విదేశీయులు మెచ్చిన దేవాలయం. ఇలా చెప్పుకుంటూ పోతే ఒంటిమిట్ట దివ్య క్షేత్రంలో ప్రతీదీ అపురూపమే.. రామతీర్థం.. నేటికీ పదిలం రామయ్య ఒంటిమిట్ట ప్రాంతంలో పర్యటించే సమయంలో పశుపక్షాదులు దాహం తీర్చుకునేందుకు నీరెట్టని సీతమ్మ ప్రశ్నించింది. సీతాదేవికి దప్పిక ఉన్నట్లు దాశరథి భావించాడు.. తన చేతిలో ఉన్న విల్లు నుంచి భూమిలోకి బాణం వదిలాడు. పుడమి ఒడి నుంచి బుగ్గ ఉవ్వెత్తున ఎగసిపడింది. జాంబవంతుడి ప్రతిష్ట, ఒంటిమిట్ట కోదండ రామాలయానికి పురాతన ప్రాశస్త్యం ఉంది. జాంబవంతుడు ఇక్కడ ఒక కొండపై ఆశ్రమం నిర్మించాడు. ఉత్తర దిశలో కూర్చుని రామతారక మంత్రాన్ని జపిస్తూ తప్పస్సు చేశాడు. జాంబవంతుడికి ఎదురుగా ఉన్న మరో గుట్టమీద నుంచి రఘురాముడు దివ్యదర్శనం ఇచ్చి వరాలు ప్రసాదించాడు. రామయ్యపై భక్తితో సీతారామలక్ష్మణ మూర్తులను ఒకే శిలపై మలచి.. జాంబవంతుడు ఇక్కడ ప్రతిష్టించినట్లు స్థలపురాణం చెబుతోంది. రామయ్య నడయాడిన నేల శ్రీరామచంద్రుడు తండ్రిమాట కోసం అరణ్యవాసం చేయాలని నిర్ణయం తీసుకున్నాడు. రామయ్య వెంట ధర్మ పత్ని సీతమ్మ , సోదరుడు లక్ష్మణుడు కదలి వచ్చారు. వనవాస కాలంలో దండకారణ్యంలో ఉన్న ఒంటిమిట్ట ప్రాంతంలో శ్రీ రాముడు పర్యటించాడు. ఆ దివ్య స్వరూపుడు పాద స్పర్శతో ఆధ్యాత్మిక క్షేత్రం పునీతమైంది. మృకుండ మహాముని ఆశ్రయంలో యజ్ఞాలు , యాగాలు జరిగేవి. రాక్షసులు ఆటంకాలు సృష్టించేవారు. ఆ రాక్షస బాధల నుంచి రామయ్య విముక్తి కల్పించినట్లు పురాణగాథ వాడుకలో ఉంది. హనుమ లేని రాముడి కోవెల హనుమంతుడు ఆగమనానికి మునుపే ఈ ప్రాంతంలో శ్రీ రామచంద్రమూర్తి సంచరించినట్లు పురాణాల ద్వారా అవగతమవుతోంది. అందుకే ఇక్కడి కోవెలలో ఆంజనేయస్వామి రామయ్య చెంత కనిపించలేదు.. వెన్నెల్లో కల్యాణం:-శ్రీరాముని కల్యాణం పగలు జరగడంతో ఆ అపురూప దృశ్యాన్ని చూసే అదృష్టం లభించలేదని విచారిస్తున్న చంద్రునికి..ఒంటిమిట్టలో జరిగే కల్యాణం తిలకించే అవకాశం కల్పిస్తానని రాముడు మాట ఇచ్చినట్లు పురాణ కథనం.పురాణ వేత్తల ప్రకారం వాల్మీకి రామాయణం బాలకాండ చివర సీతారాముల వివాహ ఘట్టం ఉంది. చైత్ర మాసంలో ఉత్తర ఫల్గుణి నక్షత్రంలో రాముడితోపాటు లక్ష్మణ , భరత , శత్రఘ్నల వివాహాలు కూడా జరిగాయి. అవన్నీ పగటిపూట జరిగాయి.చరిత్ర ప్రకారం బుక్కరాయులు ఒంటిమిట్టలో ఈ బ్రహ్మోత్సవాలను ప్రారంభించాడు. ఉత్సవాల్లో భాగంగా శ్రీరామ కల్యాణోత్సవం నిర్వహించాలి.రామాయణంలో శ్రీరామచంద్రుని కళ్యాణం జరిగిన నక్షత్రానికే ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలలో రామయ్య కళ్యాణం నిర్వహించేందుకు నిర్ణయం తీసుకున్నారు. అప్పట్లో ఉత్సవాల్లో తొలిసారిగా ఈ కళ్యాణం నిర్వహించేందుకు తలపెట్టిన ఉత్తర ఫల్గుణి నక్షత్రం రాత్రి పూట వచ్చింది. లగ్నశుద్ది చూసుకుని బుక్కరాయలు రాత్రిపూటే తొలిసారిగా బ్రహ్మోత్సవాల్లో శ్రీ సీతారాముల కల్యాణోత్సవం నిర్వహించారు. ఆ సంప్రదాయమే నేటికీ కొనసాగుతుండడం విశేషం.రాత్రి వేళ కల్యాణం జరగడంతో చంద్రునికి ఈ ఉత్సవాన్ని వీక్షించే భాగ్యం లభించింది.. బుక్కరాయలు చంద్రవంశానికి చెందిన వారు. తమ వంశ మూల పురుషుడు చంద్రుడు చూస్తూ ఆనందిస్తుండగా శ్రీ సీతారామ కళ్యాణ నిర్వహణ సంతోషాన్ని పొందేందుకు బుక్కరాయలు రాత్రి కల్యాణాలను ఆ తర్వాత కూడా కొనసాగించారు. ఒంటిమిట్ట ప్రాంతం 1340లో అరణ్యంగా ఉండేది. ఆ ప్రాంతంలో కేవలం మృకుండాశ్రమం మాత్రమే ఉండేది. ఆ ప్రాంత బోయ నాయకులైన ఒంటడు - మిట్టడు అక్కడికి వచ్చిన కంపరాయులుకు అక్కడి రామతీర్థంలోని నీటిని ఇచ్చి దాహం తీర్చి ఉపచారాలు చేశారు. అప్పటికే శిథిలమై ఉన్న గుడిని చూపి అభివృద్ధి చేయాలని వారు రాజును కోరారు. కంపరాయలు అంగీకరించి గుడి నిర్మాణంతోపాటు ఊరికి , ప్రజలకు ఆదరువుగా ఉంటుందని భావించి సమీపంలో చెరువు నిర్మాణం తలపెట్టారు. ఈ నిర్మాణ బాధ్యతలను ఒంటడు , మిట్టడులకు అప్పగించారు.గుడి అర్చకుల సౌకర్యం కోసం గుడిలోని ఇతర పెద్ద , చిన్న ఉద్యోగుల కోసం గ్రామంలోని 72 రకాల సేవలు అందించే ప్రజల కోసం ఆయన చెరువును పంచారు. చెరువు సహకారంతో పొలాల ద్వారా వచ్చే ఫలసాయాన్ని అనుభవిస్తూ ఆలయంలో రామునికి సేవలు అందిస్తూ అభివృద్ధి చేయాలని శాసనం చేశారు.కమనీయం.. ఎదుర్కోలు ఉత్సవం ఒంటిమిట్ట కోదండ రామాలయంలో నవమి వేడుకలు ముగిసిన తరువాత పౌర్ణమి రోజు రాత్రి పండు వెన్నెల్లో జానకి రాముల పరిణయ ఘట్టాని అట్టహాసంగా నిర్వహించడం తరతరాలుగా ఆనవాయతీగా వస్తోంది.పెళ్లికి మునుపు సద్గుణ సంపన్నుడైన కళ్యాణరాముడు , లోకోత్తమ సౌందర్యవతి సీతమ్మను అందంగా ముస్తాబు చేస్తారు. కోదండ రామాలయంలో రెండు చిన్న మండపాలు ఉన్నాయి. వీటిని ఎదుర్కోలు మంటపాలని పిలుస్తారు.కళ్యాణం రోజు ఈ రెండు మంటపాలను సుందరంగా ముస్తాబు చేస్తారు. పడమర వైపున్న మండపంలో రామయ్య , తూర్పున ఉన్న మండపంలో సీతమ్మను కొలువుదీర్చి ఎదుర్కోలు కార్యక్రమాన్ని కనులపండువగా నిర్వహిస్తారు. ఆ తరువాత కళ్యాణ వేదికపై కళ్యాణం నిర్వహిస్తారు. .రామయ్య రథం కథ ఇదీ ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయం ముఖ్యంగా ప్రధాన (రాజ)గోపురం ఎంత గంభీరంగా ఉంటుందో ఆలయ వార్షికోత్సవాలలో వినియోగించే రథం కూడా అంతే గంభీరంగా ఉంటుంది.ఈ రథం వెనుక ఆసక్తికరమైన చారిత్రక గాథ ప్రచారంలో ఉంది. కడప కైఫీయత్తుల్లో కూడా ఈ వివరాలు ఉన్నాయి.1605–1700 ప్రాంతంలో ఈ ప్రాంతాన్ని మట్లి అనంతరాజు పాలించేవారు. బ్రహ్మోత్సవాలలో ఆయనే కొత్తగా రథం చేయించి రథోత్సవాన్ని తొలిసారిగా ఏర్పాటు చేయించినట్లు సమాచారం. దీన్ని అత్యంత సుందరంగా ఉండేటట్లు శిల్పకళా నైపుణ్యం ఉట్టిపడేలా తయారు చేసిన రథ శిల్పులకు ప్రజల్లో ఎంతో గౌరవముండేది. రథోత్సవ సమయంలో ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలలో రథంపై రథ శిల్పులు కూడా ఉండే అవకాశం లభించింది.ఆలయంలో తూర్పు ఎదుర్కోలు మండపం వద్ద గల తూర్పు మహా ప్రాకారంపై ఓ బండపై వివరాలు గల శాసనాన్ని గమనించవచ్చు. కడప కైఫీయత్తులలో శాసనం గురించి ప్రస్తావన కూడా ఉంది.రామ మందిరం.. సాహితీ సౌరభం ఒంటిమిట్ట రామయ్య సేవలో ఎందరో కవులు తరించారు. అయ్యల రాజు తిప్పయ్య సా.శ. 1440లో జగదభిరాముడికి సాహితీ సేవ చేసి చరిత్ర పుటల్లో చిరస్థాయిగా నిలిచిపోయారు. ఒంటిమిట్ట రఘువీర జానకీనాయక మకుటంతో ఆయన వెలువడించిన శతకం లభ్యమైంది. అయ్యల రాజు రామభద్రుడు ఒంటిమిట్టలో నివాసం ఉన్నట్లు చారిత్రక ఆధారాలు చెబుతున్నాయి. రామాభ్యుదయం కావ్యం ఆయన కలం నుంచి జాలువారింది. బమ్మెర పోతనామాత్యుడు మహాకవి. భోగని దండకం రచించారు. ఆ తరువాత భక్తితో భాగవతం రచన చేసి జగదభిరాముడికి అంకితం చేశారు. ఇంకా పలు గ్రంథాలను రాశారు. వావిలి కొలను సుబ్బారావు(వాసుదాసు) వాల్మీకి మహర్షి సంస్కృతంలో రచించిన రామాయణాన్ని తెలుగులోకి అనువాదం చేశారు. కోదండ రామస్వామిని పదకవితా పితామహుడు తాళ్లపాక అన్నమయ్య దర్శించి తన్మయం పొందారు. రాముడిపై అద్భుతమైన కీర్తనలను గానం చేశారు. వర కవి నల్లకాలువ అయ్యప్ప , ఉప్పు గొండూరు వెంకట కవి , మాల ఓబన్న తదితర కవులు రాముడిని ఆరాధించి సాహితీ కృషి చేశారు. రాచరికం.. రాజసం సా.శ. 1356–77 వరకు విజయనగర సామ్రాజ్య పాలకుడు బుక్కరాయల సా.శ. 1600–1648 మధ్య కాలంలో సిద్దవటాన్ని పాలించిన మట్లిరాజులు ఈ ఆలయాన్ని అభివృద్ధి చేశారు. మట్లి అనంతరాజు పర్యవేక్షణలో ఆలయ అభివృద్ధి విశేష స్థాయిలో జరిగింది. అద్భుత శిల్పకళా చాతుర్యం ఆ నాటి శిల్పుల ప్రావీణ్యానికి అద్దం పడుతోంది. ఆ తర్వాత మట్లి కుమార అనంతరాజు పర్యవేక్షణలో కల్యాణ మండపం , ఎదుర్కోలు మండపాలు , ప్రసాద శాల నిర్మాణానికి చొరవ తీసుకున్నారు.
    2
    ఒంటిమిట్ట శ్రీకోదండ_రామాలయం.
పూర్తి వివరణ:
ఏకశిలానగరి.. విశేషాల  కోదండ రామయ్య ఆలయం ప్రత్యేకతలకు నిలయం. 
చారిత్రక , రాచరిక ఘట్టాలకు నిలువెత్తు దర్పణం. ఒకే శిలపై కొలువైన సీతారామలక్ష్మణుల మూలమూర్తుల దివ్య దర్శనం.. ఓ అద్భుతం. 
ఎత్తయిన గోపురాలు.. విశాలమైన ఆలయ రంగమంటపం.. శిల్పకళా వైభవం.. మహాద్భుతం. రామ , లక్ష్మణ తీర్థాలు జలసిరికి నిదర్శనం.
హనుమ లేని రాముడి కోవెల.. పండువెన్నెల్లో సీతారాముల కల్యాణం.. విదేశీయులు మెచ్చిన దేవాలయం.
ఇలా చెప్పుకుంటూ పోతే ఒంటిమిట్ట దివ్య క్షేత్రంలో ప్రతీదీ అపురూపమే.. 
రామతీర్థం.. నేటికీ పదిలం
రామయ్య ఒంటిమిట్ట ప్రాంతంలో పర్యటించే సమయంలో పశుపక్షాదులు దాహం తీర్చుకునేందుకు నీరెట్టని సీతమ్మ ప్రశ్నించింది. సీతాదేవికి దప్పిక ఉన్నట్లు దాశరథి భావించాడు..
తన చేతిలో ఉన్న విల్లు నుంచి భూమిలోకి బాణం వదిలాడు. పుడమి ఒడి నుంచి బుగ్గ ఉవ్వెత్తున ఎగసిపడింది.
జాంబవంతుడి ప్రతిష్ట,
ఒంటిమిట్ట కోదండ రామాలయానికి పురాతన ప్రాశస్త్యం ఉంది.
జాంబవంతుడు ఇక్కడ ఒక కొండపై ఆశ్రమం నిర్మించాడు. ఉత్తర దిశలో కూర్చుని రామతారక మంత్రాన్ని జపిస్తూ తప్పస్సు చేశాడు. జాంబవంతుడికి ఎదురుగా ఉన్న మరో గుట్టమీద నుంచి రఘురాముడు దివ్యదర్శనం ఇచ్చి వరాలు ప్రసాదించాడు. రామయ్యపై భక్తితో సీతారామలక్ష్మణ మూర్తులను ఒకే శిలపై మలచి.. జాంబవంతుడు ఇక్కడ ప్రతిష్టించినట్లు స్థలపురాణం చెబుతోంది.
రామయ్య నడయాడిన నేల
శ్రీరామచంద్రుడు తండ్రిమాట కోసం అరణ్యవాసం చేయాలని నిర్ణయం తీసుకున్నాడు. రామయ్య వెంట ధర్మ పత్ని సీతమ్మ , సోదరుడు లక్ష్మణుడు కదలి వచ్చారు. 
వనవాస కాలంలో దండకారణ్యంలో ఉన్న ఒంటిమిట్ట ప్రాంతంలో శ్రీ రాముడు పర్యటించాడు.
ఆ దివ్య స్వరూపుడు పాద స్పర్శతో ఆధ్యాత్మిక క్షేత్రం పునీతమైంది. మృకుండ మహాముని ఆశ్రయంలో యజ్ఞాలు , యాగాలు జరిగేవి. రాక్షసులు ఆటంకాలు సృష్టించేవారు.
ఆ రాక్షస బాధల నుంచి రామయ్య విముక్తి కల్పించినట్లు పురాణగాథ వాడుకలో ఉంది.
హనుమ లేని రాముడి కోవెల
హనుమంతుడు ఆగమనానికి మునుపే ఈ ప్రాంతంలో శ్రీ రామచంద్రమూర్తి సంచరించినట్లు పురాణాల ద్వారా అవగతమవుతోంది. అందుకే ఇక్కడి కోవెలలో ఆంజనేయస్వామి రామయ్య చెంత కనిపించలేదు..
వెన్నెల్లో కల్యాణం:-శ్రీరాముని కల్యాణం
పగలు జరగడంతో ఆ అపురూప దృశ్యాన్ని చూసే అదృష్టం లభించలేదని విచారిస్తున్న చంద్రునికి..ఒంటిమిట్టలో జరిగే కల్యాణం తిలకించే అవకాశం కల్పిస్తానని రాముడు మాట ఇచ్చినట్లు పురాణ కథనం.పురాణ వేత్తల ప్రకారం వాల్మీకి రామాయణం బాలకాండ చివర సీతారాముల వివాహ ఘట్టం ఉంది. చైత్ర మాసంలో ఉత్తర ఫల్గుణి నక్షత్రంలో రాముడితోపాటు లక్ష్మణ , భరత , శత్రఘ్నల వివాహాలు కూడా జరిగాయి. అవన్నీ పగటిపూట జరిగాయి.చరిత్ర ప్రకారం బుక్కరాయులు ఒంటిమిట్టలో ఈ బ్రహ్మోత్సవాలను ప్రారంభించాడు. ఉత్సవాల్లో భాగంగా శ్రీరామ కల్యాణోత్సవం నిర్వహించాలి.రామాయణంలో శ్రీరామచంద్రుని కళ్యాణం జరిగిన నక్షత్రానికే ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలలో రామయ్య కళ్యాణం నిర్వహించేందుకు నిర్ణయం తీసుకున్నారు. అప్పట్లో ఉత్సవాల్లో తొలిసారిగా ఈ కళ్యాణం నిర్వహించేందుకు తలపెట్టిన ఉత్తర ఫల్గుణి నక్షత్రం రాత్రి పూట వచ్చింది. లగ్నశుద్ది చూసుకుని బుక్కరాయలు రాత్రిపూటే తొలిసారిగా బ్రహ్మోత్సవాల్లో శ్రీ సీతారాముల కల్యాణోత్సవం నిర్వహించారు. ఆ సంప్రదాయమే నేటికీ కొనసాగుతుండడం విశేషం.రాత్రి వేళ కల్యాణం జరగడంతో చంద్రునికి ఈ ఉత్సవాన్ని వీక్షించే భాగ్యం లభించింది.. బుక్కరాయలు చంద్రవంశానికి చెందిన వారు. తమ వంశ మూల పురుషుడు చంద్రుడు చూస్తూ ఆనందిస్తుండగా శ్రీ సీతారామ కళ్యాణ నిర్వహణ సంతోషాన్ని పొందేందుకు బుక్కరాయలు రాత్రి కల్యాణాలను ఆ తర్వాత కూడా కొనసాగించారు.
ఒంటిమిట్ట ప్రాంతం  1340లో అరణ్యంగా ఉండేది. ఆ ప్రాంతంలో కేవలం మృకుండాశ్రమం మాత్రమే ఉండేది. ఆ ప్రాంత బోయ నాయకులైన ఒంటడు - మిట్టడు అక్కడికి వచ్చిన కంపరాయులుకు అక్కడి రామతీర్థంలోని నీటిని ఇచ్చి దాహం తీర్చి ఉపచారాలు చేశారు. అప్పటికే శిథిలమై ఉన్న గుడిని చూపి అభివృద్ధి చేయాలని వారు రాజును కోరారు. కంపరాయలు అంగీకరించి గుడి నిర్మాణంతోపాటు ఊరికి , ప్రజలకు ఆదరువుగా ఉంటుందని భావించి సమీపంలో చెరువు నిర్మాణం తలపెట్టారు. ఈ నిర్మాణ బాధ్యతలను ఒంటడు , మిట్టడులకు అప్పగించారు.గుడి అర్చకుల సౌకర్యం కోసం గుడిలోని ఇతర పెద్ద , చిన్న ఉద్యోగుల కోసం గ్రామంలోని 72 రకాల సేవలు అందించే ప్రజల కోసం ఆయన చెరువును పంచారు. చెరువు సహకారంతో పొలాల ద్వారా వచ్చే ఫలసాయాన్ని అనుభవిస్తూ ఆలయంలో రామునికి సేవలు అందిస్తూ అభివృద్ధి చేయాలని శాసనం చేశారు.కమనీయం.. ఎదుర్కోలు ఉత్సవం
ఒంటిమిట్ట కోదండ రామాలయంలో నవమి వేడుకలు ముగిసిన తరువాత పౌర్ణమి రోజు రాత్రి పండు వెన్నెల్లో జానకి రాముల పరిణయ ఘట్టాని అట్టహాసంగా నిర్వహించడం తరతరాలుగా ఆనవాయతీగా వస్తోంది.పెళ్లికి మునుపు సద్గుణ సంపన్నుడైన కళ్యాణరాముడు , లోకోత్తమ సౌందర్యవతి సీతమ్మను అందంగా ముస్తాబు చేస్తారు. కోదండ రామాలయంలో రెండు చిన్న మండపాలు ఉన్నాయి. వీటిని ఎదుర్కోలు మంటపాలని పిలుస్తారు.కళ్యాణం రోజు ఈ రెండు మంటపాలను సుందరంగా ముస్తాబు చేస్తారు. పడమర వైపున్న మండపంలో రామయ్య , తూర్పున ఉన్న మండపంలో సీతమ్మను కొలువుదీర్చి ఎదుర్కోలు కార్యక్రమాన్ని కనులపండువగా నిర్వహిస్తారు. ఆ తరువాత కళ్యాణ వేదికపై కళ్యాణం నిర్వహిస్తారు. 
.రామయ్య రథం కథ ఇదీ
ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయం ముఖ్యంగా ప్రధాన (రాజ)గోపురం ఎంత గంభీరంగా ఉంటుందో ఆలయ వార్షికోత్సవాలలో వినియోగించే రథం కూడా అంతే గంభీరంగా ఉంటుంది.ఈ రథం వెనుక ఆసక్తికరమైన చారిత్రక గాథ ప్రచారంలో ఉంది. కడప కైఫీయత్తుల్లో కూడా ఈ వివరాలు ఉన్నాయి.1605–1700 ప్రాంతంలో ఈ ప్రాంతాన్ని మట్లి అనంతరాజు పాలించేవారు. బ్రహ్మోత్సవాలలో ఆయనే కొత్తగా రథం చేయించి రథోత్సవాన్ని తొలిసారిగా ఏర్పాటు చేయించినట్లు సమాచారం. దీన్ని అత్యంత సుందరంగా ఉండేటట్లు శిల్పకళా నైపుణ్యం ఉట్టిపడేలా తయారు చేసిన రథ శిల్పులకు ప్రజల్లో ఎంతో గౌరవముండేది.  
రథోత్సవ  సమయంలో ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలలో రథంపై రథ శిల్పులు కూడా ఉండే అవకాశం లభించింది.ఆలయంలో తూర్పు ఎదుర్కోలు మండపం వద్ద గల తూర్పు మహా ప్రాకారంపై ఓ బండపై వివరాలు గల శాసనాన్ని గమనించవచ్చు. కడప కైఫీయత్తులలో శాసనం గురించి ప్రస్తావన కూడా ఉంది.రామ మందిరం.. సాహితీ సౌరభం ఒంటిమిట్ట  రామయ్య సేవలో ఎందరో కవులు తరించారు.  అయ్యల రాజు తిప్పయ్య సా.శ. 1440లో జగదభిరాముడికి సాహితీ సేవ చేసి చరిత్ర పుటల్లో చిరస్థాయిగా నిలిచిపోయారు. ఒంటిమిట్ట రఘువీర జానకీనాయక మకుటంతో ఆయన వెలువడించిన శతకం లభ్యమైంది.
అయ్యల రాజు రామభద్రుడు ఒంటిమిట్టలో  నివాసం ఉన్నట్లు చారిత్రక ఆధారాలు చెబుతున్నాయి. రామాభ్యుదయం కావ్యం ఆయన కలం నుంచి జాలువారింది.
బమ్మెర పోతనామాత్యుడు మహాకవి.   భోగని దండకం రచించారు. ఆ తరువాత భక్తితో భాగవతం రచన చేసి జగదభిరాముడికి అంకితం చేశారు. ఇంకా పలు గ్రంథాలను రాశారు.
వావిలి కొలను సుబ్బారావు(వాసుదాసు)  వాల్మీకి మహర్షి సంస్కృతంలో రచించిన రామాయణాన్ని తెలుగులోకి అనువాదం చేశారు.
కోదండ రామస్వామిని పదకవితా పితామహుడు తాళ్లపాక అన్నమయ్య దర్శించి తన్మయం పొందారు. రాముడిపై అద్భుతమైన కీర్తనలను గానం చేశారు. 
వర కవి నల్లకాలువ అయ్యప్ప ,  ఉప్పు గొండూరు వెంకట కవి , మాల ఓబన్న తదితర కవులు రాముడిని ఆరాధించి సాహితీ కృషి చేశారు.  
రాచరికం.. రాజసం
సా.శ. 1356–77 వరకు విజయనగర సామ్రాజ్య పాలకుడు బుక్కరాయల
సా.శ. 1600–1648 మధ్య కాలంలో సిద్దవటాన్ని పాలించిన మట్లిరాజులు ఈ ఆలయాన్ని అభివృద్ధి చేశారు. మట్లి అనంతరాజు పర్యవేక్షణలో ఆలయ అభివృద్ధి విశేష స్థాయిలో జరిగింది. అద్భుత శిల్పకళా చాతుర్యం ఆ నాటి శిల్పుల ప్రావీణ్యానికి అద్దం పడుతోంది. ఆ తర్వాత మట్లి కుమార అనంతరాజు పర్యవేక్షణలో కల్యాణ మండపం , ఎదుర్కోలు మండపాలు , ప్రసాద శాల నిర్మాణానికి చొరవ తీసుకున్నారు.
    user_జీ.మౌలాలి.
    జీ.మౌలాలి.
    Photographer బద్వేల్, వై.ఎస్.ఆర్., ఆంధ్రప్రదేశ్•
    15 hrs ago
  • Post by Syyed taher
    1
    Post by Syyed taher
    user_Syyed taher
    Syyed taher
    Local News Reporter Repalle, Bapatla•
    15 hrs ago
  • కదిరి అప్గ్రేడ్ పోలీస్ స్టేషన్ సమీపాన పోలీసు శాఖ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు చేశారు. జిల్లా ఎస్పీ సతీష్ కుమార్, ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ ప్రారంభించారు. వేసవి కాలాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రజలకు మంచినీటి సౌకర్యం ఏర్పాటు చేయడం అభినందినియమని ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ పోలీస్ శాఖకు అభినందించారు. డీఎస్సీ శివనారాయణ స్వామి, సిఐ నిరంజన్ రెడ్డి, నాగేంద్ర, నారాయణరెడ్డి పాల్గొన్నారు.
    1
    కదిరి అప్గ్రేడ్ పోలీస్ స్టేషన్ సమీపాన పోలీసు శాఖ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు చేశారు. జిల్లా ఎస్పీ సతీష్ కుమార్, ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ ప్రారంభించారు. వేసవి కాలాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రజలకు మంచినీటి సౌకర్యం ఏర్పాటు చేయడం అభినందినియమని ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ పోలీస్ శాఖకు అభినందించారు. డీఎస్సీ శివనారాయణ స్వామి, సిఐ నిరంజన్ రెడ్డి, నాగేంద్ర, నారాయణరెడ్డి పాల్గొన్నారు.
    user_Srivartha news
    Srivartha news
    Kadiri, Sri Sathya Sai•
    41 min ago
  • నరసరావుపేట–గుంటూరు రోడ్డుపై ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందినట్లు సమాచారం. మృతులు గుండాలపాడు గ్రామానికి చెందిన వారిగా గుర్తించారు. ప్రమాదం ఎలా జరిగింది అనే వివరాలు ఇంకా పూర్తిగా తెలియాల్సి ఉంది. ఘటన స్థలానికి పోలీసులు చేరుకుని దర్యాప్తు చేపట్టారు. మృతదేహాలను పోస్టుమార్టం కోసం ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనతో గుండాలపాడు గ్రామంలో విషాద వాతావరణం నెలకొంది. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
    1
    నరసరావుపేట–గుంటూరు రోడ్డుపై ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందినట్లు సమాచారం. మృతులు గుండాలపాడు గ్రామానికి చెందిన వారిగా గుర్తించారు.
ప్రమాదం ఎలా జరిగింది అనే వివరాలు ఇంకా పూర్తిగా తెలియాల్సి ఉంది. ఘటన స్థలానికి పోలీసులు చేరుకుని దర్యాప్తు చేపట్టారు. మృతదేహాలను పోస్టుమార్టం కోసం ఆసుపత్రికి తరలించారు.
ఈ ఘటనతో గుండాలపాడు గ్రామంలో విషాద వాతావరణం నెలకొంది. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
    user_Kumar
    Kumar
    Photographer కుప్పం, చిత్తూరు, ఆంధ్రప్రదేశ్•
    22 hrs ago
  • జిల్లా కేంద్రమైన కర్నూలు పట్టణంలోని స్టేట్ గెస్ట్ హౌస్‌లో మంగళవారం ఇంచార్జి మంత్రి నిమ్మల రామానాయుడు, మంత్రి టీజీ భరత్ ఆధ్వర్యంలో కూటమి పార్టీల ముఖ్య నేతలు, ఎమ్మెల్యేలు మరియు అసెంబ్లీ ఇన్‌ఛార్జ్‌లతో సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ఎమ్మిగనూరు అసెంబ్లీ తరపున దేశాయ్ నెట్‌వర్క్ అధినేత, జిల్లా అధికార ప్రతినిధి గురురాజ్ దేశాయ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మంత్రులను మర్యాదపూర్వకంగా కలుసుకుని… ఎమ్మిగనూరు నియోజకవర్గంలో అర్హులైన బీజేపీ కార్యకర్తలకు పథకాలు అందడం లేదని తెలిపారు. అధికారుల నిర్లక్ష్యం కారణంగా ఈ పరిస్థితి ఏర్పడిందని పేర్కొంటూ… అర్హులైన ప్రతి కార్యకర్తకు ప్రభుత్వ పథకాలు తక్షణమే అందేలా చర్యలు తీసుకోవాలని మంత్రులను కోరారు. ఇంచార్జి మంత్రి నిమ్మల రామానాయుడు మాట్లాడుతూ… ఈ సమావేశం ప్రధాన ఉద్దేశ్యం కూటమిలో భాగమైన బీజేపీ, టీడీపీ, జనసేన పార్టీలు సమన్వయంతో పనిచేయడం అని తెలిపారు. కూటమి ధర్మాలను పాటిస్తూ… అన్ని పార్టీల నాయకులు, కార్యకర్తలకు సమాన న్యాయం జరిగేలా ముందుకు సాగాలని స్పష్టం చేశారు.
    1
    జిల్లా కేంద్రమైన కర్నూలు పట్టణంలోని స్టేట్ గెస్ట్ హౌస్‌లో మంగళవారం ఇంచార్జి మంత్రి నిమ్మల రామానాయుడు, మంత్రి టీజీ భరత్ ఆధ్వర్యంలో కూటమి పార్టీల ముఖ్య నేతలు, ఎమ్మెల్యేలు మరియు అసెంబ్లీ ఇన్‌ఛార్జ్‌లతో సమన్వయ సమావేశం నిర్వహించారు.
ఈ సమావేశానికి ఎమ్మిగనూరు అసెంబ్లీ తరపున దేశాయ్ నెట్‌వర్క్ అధినేత, జిల్లా అధికార ప్రతినిధి గురురాజ్ దేశాయ్ హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఆయన మంత్రులను మర్యాదపూర్వకంగా కలుసుకుని… ఎమ్మిగనూరు నియోజకవర్గంలో అర్హులైన బీజేపీ కార్యకర్తలకు పథకాలు అందడం లేదని తెలిపారు.
అధికారుల నిర్లక్ష్యం కారణంగా ఈ పరిస్థితి ఏర్పడిందని పేర్కొంటూ… అర్హులైన ప్రతి కార్యకర్తకు ప్రభుత్వ పథకాలు తక్షణమే అందేలా చర్యలు తీసుకోవాలని మంత్రులను కోరారు.
ఇంచార్జి మంత్రి నిమ్మల రామానాయుడు మాట్లాడుతూ… ఈ సమావేశం ప్రధాన ఉద్దేశ్యం కూటమిలో భాగమైన బీజేపీ, టీడీపీ, జనసేన పార్టీలు సమన్వయంతో పనిచేయడం అని తెలిపారు.
కూటమి ధర్మాలను పాటిస్తూ… అన్ని పార్టీల నాయకులు, కార్యకర్తలకు సమాన న్యాయం జరిగేలా ముందుకు సాగాలని స్పష్టం చేశారు.
    user_K AMPAIAH ACHARI
    K AMPAIAH ACHARI
    Local News Reporter ఎమ్మిగనూరు, కర్నూలు, ఆంధ్రప్రదేశ్•
    6 hrs ago
  • నకిరేకల్ మున్సిపాలిటీ:- నకిరేకల్ మున్సిపాలిటీ పరిధిలోని నిమ్మకాయల మార్కెట్ యార్డులో దడువాయులకు పని కల్పించాలని డిమాండ్ చేస్తూ చేపట్టిన మహాధర్నా 20వ రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా దడువాయులు తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ నిరసన కార్యక్రమాన్ని కొనసాగించారు. ఈ మహాధర్నా కార్యక్రమానికి అధ్యక్షుడు వంటిపాక లక్ష్మయ్య ఆధ్వర్యంలో నిర్వహించగా, ఉపాధ్యక్షుడు మచ్చ నరసింహ, కార్యదర్శి కొండ వెంకన్న పాల్గొన్నారు. కార్యక్రమంలో సభ్యులు సిహెచ్ వెంకన్న, ఏం వెంకన్న, బి శంకరయ్య, వి పాండు, వి వెంకన్న, ఎస్ రాజు, వి సైదులు, బి రమేష్, ఎస్ ధీరజ్, కే వెంకన్న, ఆర్ కృష్ణ, జి ఐలయ్య, బి యాదగిరి, జి శంకర్ తదితరులు పాల్గొని తమ డిమాండ్లను ప్రభుత్వానికి తెలియజేశారు. దడువాయులకు తగిన ఉపాధి అవకాశాలు కల్పించే వరకు తమ నిరసన కొనసాగిస్తామని వారు స్పష్టం చేశారు.
    3
    నకిరేకల్ మున్సిపాలిటీ:-
నకిరేకల్ మున్సిపాలిటీ పరిధిలోని నిమ్మకాయల మార్కెట్ యార్డులో దడువాయులకు పని కల్పించాలని డిమాండ్ చేస్తూ చేపట్టిన మహాధర్నా 20వ రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా దడువాయులు తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ నిరసన కార్యక్రమాన్ని కొనసాగించారు.
ఈ మహాధర్నా కార్యక్రమానికి అధ్యక్షుడు వంటిపాక లక్ష్మయ్య ఆధ్వర్యంలో నిర్వహించగా, ఉపాధ్యక్షుడు మచ్చ నరసింహ, కార్యదర్శి కొండ వెంకన్న పాల్గొన్నారు.
కార్యక్రమంలో సభ్యులు సిహెచ్ వెంకన్న, ఏం వెంకన్న, బి శంకరయ్య, వి పాండు, వి వెంకన్న, ఎస్ రాజు, వి సైదులు, బి రమేష్, ఎస్ ధీరజ్, కే వెంకన్న, ఆర్ కృష్ణ, జి ఐలయ్య, బి యాదగిరి, జి శంకర్ తదితరులు పాల్గొని తమ డిమాండ్లను ప్రభుత్వానికి తెలియజేశారు.
దడువాయులకు తగిన ఉపాధి అవకాశాలు కల్పించే వరకు తమ నిరసన కొనసాగిస్తామని వారు స్పష్టం చేశారు.
    user_Nagesh Kothapalli
    Nagesh Kothapalli
    Local News Reporter నక్రేకల్, నల్గొండ, తెలంగాణ•
    16 hrs ago
  • పార్లపల్లిలో విపిఆర్ ఫౌండేషన్ 'అమృత ధార' వాటర్ ప్లాంట్‌ ప్రారంభం - విపిఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా 200 వాటర్ ప్లాంట్ల ద్వారా ప్రజలకు సురక్షిత తాగునీరు. - కోవూరు నియోజకవర్గంలో ఇది 26 వ వాటర్ ప్లాంట్‌. - పార్లపల్లిలో గ్రామంలో 20 నెలల్లో 1 కోటి 2 లక్షలతో అభివృద్ధి పనులు - ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి. రాజకీయాల్లోకి రాకముందు నుంచే తాము ప్రజా సేవకులమని పదవుల కోసం కాకుండా ప్రజలకు మరింత చేరువై సేవ చేయాలన్న ఉద్దేశంతోనే రాజకీయాల్లోకి వచ్చామన్నారు కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి విడవలూరు మండలం పార్లపల్లి గ్రామంలో విపిఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన 'అమృత ధార' ఆర్వో వాటర్ ప్లాంట్‌ను ఆమె ప్రారంభించారు.ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి మాట్లాడుతూ, ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి పవిత్ర సంకల్పంతో 2016లో ఉదయగిరిలో ప్రారంభమైన అమృత ధార ప్రస్థానం నేడు జిల్లా అంతటా విస్తరించిందని తెలిపారు. ప్రస్తుతం జిల్లా వ్యాప్తంగా సుమారు 200 వాటర్ ప్లాంట్ల ద్వారా ప్రజల దాహార్తిని తీరుస్తున్నామన్నారు. కోవూరు నియోజకవర్గంలో ఇది 26వ ప్లాంట్ అని, దీని నిర్వహణ బాధ్యతను కూడా విపిఆర్ ఫౌండేషనే చూసుకుంటుందని ఆమె హామీ ఇచ్చారు. విడవలూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో రాత్రులు డాక్టర్లు ఉండడం లేదని స్థానికుల ఫిర్యాదుతో స్పందించిన ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి జిల్లా వైద్యాధికారి తో ఫోన్లో మాట్లాడి హాస్పిటల్లో నైట్ షిఫ్ట్ లో డాక్టర్లను కొనసాగించాలని కోరారు. కూటమి ప్రభుత్వం అధికారంలోనికి వచ్చాక పార్లపల్లి గ్రామంలో చేసిన అభివృద్ధి పనులను వివరిస్తూ జల్ జీవన్ మిషన్ ద్వారా 36 లక్షలతో ఓవర్ హెడ్ ట్యాంక్, 11 లక్షలతో డ్రెయిన్ల నిర్మాణం, 3 లక్షలతో సామాజిక మరుగుదొడ్ల నిర్మాణం చేసిన విషయాన్ని ఆమె తెలిపారు. ఎంపీ లాడ్స్, ఉపాధి హామీ మరియు పంచాయతీ నిధులతో కలిపి మొత్తం 9 సి.సి. రోడ్ల నిర్మాణం చేసామన్నారు.ఆరగాణి కాలువపై 10 లక్షలతో కల్వర్టు, CSR నిధులతో స్మశాన వాటికల్లో షెల్టర్ల నిర్మాణం గురించి చెబుతూ ​గడిచిన 20 నెలల పార్లపల్లి గ్రామంలో 1 కోటి 2 లక్షలతో చేసిన అభివృద్ధి కార్యక్రమాలను ఆమె వివరించారు. దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న స్మశాన వాటిక భూమి సమస్య పరిష్కారానికి తన వంతుగా రూ. 2.50 లక్షల ఆర్థిక సాయం అందించినట్లు తెలిపారు. ముగ్గురు అనారోగ్య బాధితులకు CMRF ద్వారా రూ. 2 లక్షల 76 వేల ఆర్థిక సహాయం అందజేశామన్నారు. 1 కోటి 70లక్షల రూపాయలతో పార్లపల్లి నుండి చవటపాలెం వరకు కనెక్టింగ్ రోడ్డు మరియు కల్వర్టు నిర్మాణం కోసం ప్రతిపాదనలు సిద్ధం చేశామని, త్వరలోనే ఈ పనులను మంజూరు చేయించి ప్రారంభిస్తామని ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి ఈసందర్భంగా హామీ యిచ్చారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం కూటమి నాయకులు, కార్యకర్తలతో పాటు పెద్ద సంఖ్యలో గ్రామస్తులు పాల్గొన్నారు.
    4
    పార్లపల్లిలో విపిఆర్ ఫౌండేషన్  'అమృత ధార' వాటర్ ప్లాంట్‌ ప్రారంభం
- విపిఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా 200 వాటర్ ప్లాంట్ల ద్వారా ప్రజలకు సురక్షిత తాగునీరు.
- కోవూరు నియోజకవర్గంలో ఇది 26 వ వాటర్ ప్లాంట్‌.
- పార్లపల్లిలో గ్రామంలో 20 నెలల్లో 1 కోటి 2 లక్షలతో అభివృద్ధి పనులు
- ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి. 
రాజకీయాల్లోకి రాకముందు నుంచే తాము ప్రజా సేవకులమని పదవుల కోసం కాకుండా ప్రజలకు మరింత చేరువై సేవ చేయాలన్న ఉద్దేశంతోనే రాజకీయాల్లోకి వచ్చామన్నారు కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి  విడవలూరు మండలం పార్లపల్లి గ్రామంలో విపిఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన 'అమృత ధార' ఆర్వో వాటర్ ప్లాంట్‌ను ఆమె ప్రారంభించారు.ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి  మాట్లాడుతూ, ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి  పవిత్ర సంకల్పంతో 2016లో ఉదయగిరిలో ప్రారంభమైన అమృత ధార ప్రస్థానం నేడు జిల్లా అంతటా విస్తరించిందని తెలిపారు. ప్రస్తుతం జిల్లా వ్యాప్తంగా సుమారు 200 వాటర్ ప్లాంట్ల ద్వారా ప్రజల దాహార్తిని తీరుస్తున్నామన్నారు. కోవూరు నియోజకవర్గంలో ఇది 26వ ప్లాంట్ అని, దీని నిర్వహణ బాధ్యతను కూడా విపిఆర్ ఫౌండేషనే చూసుకుంటుందని ఆమె హామీ ఇచ్చారు. విడవలూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో రాత్రులు డాక్టర్లు ఉండడం లేదని స్థానికుల ఫిర్యాదుతో స్పందించిన ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి  జిల్లా వైద్యాధికారి తో ఫోన్లో మాట్లాడి హాస్పిటల్లో నైట్ షిఫ్ట్ లో డాక్టర్లను కొనసాగించాలని కోరారు. కూటమి ప్రభుత్వం అధికారంలోనికి వచ్చాక పార్లపల్లి గ్రామంలో చేసిన అభివృద్ధి పనులను వివరిస్తూ జల్ జీవన్ మిషన్ ద్వారా 36 లక్షలతో ఓవర్ హెడ్ ట్యాంక్, 11 లక్షలతో డ్రెయిన్ల నిర్మాణం, 3 లక్షలతో సామాజిక మరుగుదొడ్ల నిర్మాణం చేసిన విషయాన్ని ఆమె తెలిపారు. 
ఎంపీ లాడ్స్, ఉపాధి హామీ మరియు పంచాయతీ నిధులతో కలిపి మొత్తం 9 సి.సి. రోడ్ల నిర్మాణం చేసామన్నారు.ఆరగాణి కాలువపై 10 లక్షలతో కల్వర్టు, CSR నిధులతో స్మశాన వాటికల్లో షెల్టర్ల నిర్మాణం గురించి చెబుతూ ​గడిచిన 20 నెలల పార్లపల్లి గ్రామంలో  1 కోటి 2 లక్షలతో చేసిన అభివృద్ధి కార్యక్రమాలను ఆమె వివరించారు. దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న స్మశాన వాటిక భూమి సమస్య పరిష్కారానికి తన వంతుగా రూ. 2.50 లక్షల ఆర్థిక సాయం అందించినట్లు తెలిపారు.
ముగ్గురు అనారోగ్య బాధితులకు CMRF ద్వారా రూ. 2 లక్షల 76 వేల  ఆర్థిక సహాయం అందజేశామన్నారు. 1 కోటి 70లక్షల రూపాయలతో పార్లపల్లి నుండి చవటపాలెం వరకు కనెక్టింగ్ రోడ్డు మరియు కల్వర్టు నిర్మాణం కోసం ప్రతిపాదనలు సిద్ధం చేశామని, త్వరలోనే ఈ పనులను మంజూరు చేయించి ప్రారంభిస్తామని ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి ఈసందర్భంగా హామీ యిచ్చారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం కూటమి నాయకులు, కార్యకర్తలతో పాటు పెద్ద సంఖ్యలో గ్రామస్తులు పాల్గొన్నారు.
    user_Ravi Teja
    Ravi Teja
    Court reporter కోవూరు, ఎస్పీఎస్ఆర్ నెల్లూరు, ఆంధ్రప్రదేశ్•
    20 hrs ago
  • బద్వేలు:శ్రీ వెంకటేశ్వర స్వామి, అభయాంజనేయ స్వామి వారిని కుంకుమపువ్వు సీరియల్ హీరోయిన్ ప్రిన్సి బి, కృష్ణన్ దర్శించుకున్నారు. స్వామివారిని దర్శించుకున్న కుంకుమపువ్వు సీరియల్ హీరోయిన్ ప్రిన్సీ బి.కృష్ణన్ మాట్లాడుతూ స్వామివారిని దర్శించుకున్న సీరియల్ హీరోయిన్ ప్రిన్సి బి. కృష్ణన్ కు స్వామివారి సన్నిధిలో ప్రత్యేక పూజలు నిర్వహించి పూలమాల శాలువాతా సత్కరించి స్వామివారి ప్రసాదాలు అందజేయడం జరిగింది. మహాలక్ష్మి గోదాదేవి సహిత శ్రీ వెంకటేశ్వర స్వామి మరియు అభయాంజనేయ స్వామి వారిని ఈ మంగళవారం దర్శించుకోవడం నా పూర్వజన్మ సుకృతం. వేద పండితులు వీరేశ చార్యులు ఆధ్వర్యంలో స్వామివారి సన్నిధిలో జరిగిన ప్రత్యేక పూజల్లో పాల్గొనడం ఎంతో భక్తిని, ప్రశాంతతను ఇచ్చిందన్నారు,ఆలయ నిర్వాహకులు వల్లంకొండు వెంకటరమణ శాలువాతో సత్కరించి, స్వామివారి ప్రసాదాలు అందజేయడం చాలా సంతోషంగా అనిపించిందని.ఈ పుణ్యక్షేత్ర దర్శనం నాకు మరువలేని అనుభూతిని అందించిందని అన్నారు, ఈ కార్యక్రమంలో పోకల సుబ్బారెడ్డి వారి సతీమణి సుజాత పోకల నాగేశ్వర్ రెడ్డి మరియు పలువురు పాల్గొన్నారు.
    1
    బద్వేలు:శ్రీ వెంకటేశ్వర స్వామి, అభయాంజనేయ స్వామి వారిని  కుంకుమపువ్వు సీరియల్ హీరోయిన్ ప్రిన్సి బి, కృష్ణన్ దర్శించుకున్నారు.
స్వామివారిని దర్శించుకున్న కుంకుమపువ్వు సీరియల్ హీరోయిన్ ప్రిన్సీ బి.కృష్ణన్ మాట్లాడుతూ  స్వామివారిని దర్శించుకున్న సీరియల్ హీరోయిన్ ప్రిన్సి  బి. కృష్ణన్ కు స్వామివారి సన్నిధిలో ప్రత్యేక పూజలు నిర్వహించి పూలమాల  శాలువాతా సత్కరించి స్వామివారి ప్రసాదాలు అందజేయడం జరిగింది.
మహాలక్ష్మి గోదాదేవి సహిత శ్రీ వెంకటేశ్వర స్వామి మరియు అభయాంజనేయ స్వామి వారిని ఈ మంగళవారం దర్శించుకోవడం నా పూర్వజన్మ సుకృతం. వేద పండితులు వీరేశ చార్యులు ఆధ్వర్యంలో స్వామివారి సన్నిధిలో జరిగిన ప్రత్యేక పూజల్లో పాల్గొనడం ఎంతో భక్తిని, ప్రశాంతతను ఇచ్చిందన్నారు,ఆలయ నిర్వాహకులు వల్లంకొండు వెంకటరమణ శాలువాతో సత్కరించి, స్వామివారి ప్రసాదాలు అందజేయడం చాలా సంతోషంగా అనిపించిందని.ఈ పుణ్యక్షేత్ర దర్శనం నాకు మరువలేని అనుభూతిని అందించిందని అన్నారు, ఈ కార్యక్రమంలో పోకల సుబ్బారెడ్డి వారి సతీమణి సుజాత పోకల నాగేశ్వర్ రెడ్డి మరియు పలువురు పాల్గొన్నారు.
    user_జీ.మౌలాలి.
    జీ.మౌలాలి.
    Photographer బద్వేల్, వై.ఎస్.ఆర్., ఆంధ్రప్రదేశ్•
    15 hrs ago
  • Post by Syyed taher
    1
    Post by Syyed taher
    user_Syyed taher
    Syyed taher
    Local News Reporter Repalle, Bapatla•
    17 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.