👉గజ్వేల్ పట్టణంలో మెడిసిటీ ఆధ్వర్యంలో... మెగా వైద్య శిబిరం ప్రారంభించిన రాష్ట్ర యూత్ కాంగ్రెస్ నేత అంక్షారెడ్డి🌺 గజ్వేల్ సిద్దిపేట జిల్లా ఏప్రిల్ 17 ప్రజా తెలంగాణ న్యూస్/ పెద్ద ఎత్తున వైద్య సేవలు పొందిన రోగులు ఉచితంగా వైద్య పరీక్షలు నిర్వహించి మందులు పంపిణీ గజ్వేల్ పట్టణంలో బుధవారం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మెడిసిటీ ఆసుపత్రి వైద్యులు మెగా వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా గజ్వేల్ తోపాటు ప్రజ్ఞాపూర్, సంగాపూర్, సంగుపల్లి, క్యాసారం, ముట్రాజ్ పల్లి తదితర ప్రాంతాలకు చెందిన వేయి మందికి పైగా రోగులు వైద్య సేవలు పొందారు. కాగా మొదటగా యూత్ కాంగ్రెస్ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు ఆంక్షారెడ్డి వైద్య శిబిరాన్ని మార్కెట్ కమిటీ చైర్మన్ వంటేరు నరేందర్ రెడ్డి, వైస్ చైర్మన్ సర్దార్ ఖాన్ లతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్ర అభివృద్ధి, ప్రజా సంక్షేమానికి పెద్దపీట వేస్తుండగా, ఆరోగ్యశ్రీ పథకం ద్వారా పేదలకు రూ 10 లక్షల వరకు వైద్యం అందిస్తున్నట్లు స్పష్టం చేశారు. ఈ సందర్భంగా వివిధ రంగాలకు చెందిన ప్రముఖ వైద్యులు డాక్టర్ సాహితి, డాక్టర్ అనిమిషా, డాక్టర్ అమూల్య, డాక్టర్ రిషిత, డాక్టర్ హర్ష, డాక్టర్ సంతోష్, డాక్టర్ దీక్షిత, డాక్టర్ అఖిలేష్, డాక్టర్ డేనియల్, డాక్టర్ నవ్య, డాక్టర్ డింపుల్ తదితరులు గుండె, చెవి, ముక్కు, గొంతు, కీళ్ల నొప్పులు, చర్మ, దంత, నరాలు, సాధారణ, తదితర వ్యాధులకు సేవలందించి ఉచితంగా మందులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు రాజశేఖర్ రెడ్డి, మైనార్టీ సెల్ కాంగ్రెస్ జిల్లా నేతలు సమీర్, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు మొనగారి రాజు, కార్యదర్శి రాములు గౌడ్, నేతలు రమేష్ గౌడ్, సుఖేందర్ రెడ్డి, నంగునూరి సత్యనారాయణ, గుంటుకు శ్రీనివాస్, కర్ణాకర్ రెడ్డి, నర్సింహ రెడ్డి, యాదగిరి, డాక్టర్ వహీద్, అజ్గర్ , అంజాద్, కిష్టారెడ్డి, బాబురావు, అజహర్, జగ్గయ్యగారి శేఖర్ గుప్త, సురేష్, గణేష్ తదితరులు పాల్గొన్నారు. ఉచితంగా వైద్య సేవలు అందించిన మేడిసిటీ ఆసుపత్రి యాజమాన్యానికి కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కృతజ్ఞతలు తెలిపారు.

- మోడ్రన్ హరిదాసు : విష్ణు నామ సంకీర్తనలు పాడుచు వీధులు తిరుగుచున్న మోడరన్ హరిదాసు1
- సుపరిపాలనకు వాజ్‌పేయీ మార్గదర్శి మంత్రులు అచ్చెన్నాయుడు, సత్యకుమార్ యాదవ్ శ్రీకాకుళం, డిసెంబరు 19: దేశాభివృద్ధికి, సుపరిపాలనకు మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయీ మార్గదర్శకుడని రాష్ట్ర మంత్రులు కింజరాపు అచ్చెన్నాయుడు, సత్యకుమార్ యాదవ్ కొనియాడారు. శ్రీకాకుళం నగరం సూర్యమహాల్ కూడలిలో ఏర్పాటు చేసిన వాజ్‌పేయీ కాంస్య విగ్రహాన్ని వారు గురువారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రులు మాట్లాడుతూ.. వాజ్‌పేయీ ప్రవేశపెట్టిన ఆర్థిక సంస్కరణలు, స్వర్ణ చతుర్భుజి వంటి రవాణా వ్యవస్థల ఆధునీకరణే నేటి భారత్ పురోగతికి బలమైన పునాదులని పేర్కొన్నారు. ఆయన అడుగుజాడల్లోనే ప్రస్తుత కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నీతి, నిజాయితీతో కూడిన పాలనను అందిస్తున్నాయని, సుపరిపాలన ద్వారానే సామాన్యుడికి సంక్షేమ ఫలాలు అందుతాయని వివరించారు. వైద్య విద్యను సామాన్యుడికి చేరువ చేసేందుకు పీపీపీ: వైద్య విద్యను సామాన్యుడికి చేరువ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం పీపీపీ (ప్రభుత్వ-ప్రైవేటు భాగస్వామ్యం) విధానానికి ప్రాధాన్యత ఇస్తోందని మంత్రులు స్పష్టం చేశారు. ఈ విధానం ద్వారా తక్కువ సమయంలోనే ఎక్కువ వైద్య కళాశాలలను నిర్మించి, రాష్ట్రంలో డాక్టర్ల కొరతను తీర్చవచ్చని తెలిపారు. కళాశాలల నిర్వహణలో ప్రైవేటు భాగస్వామ్యం ఉన్నప్పటికీ, యాజమాన్య హక్కులు, సీట్ల కేటాయింపుపై పూర్తి నియంత్రణ ప్రభుత్వానిదే ఉంటుందని వారు స్పష్టం చేశారు. కేంద్ర ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగానే ఈ ప్రక్రియ సాగుతోందని, పేదలకు మెరుగైన వైద్య సేవలు అందించే క్రమంలో ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందని మంత్రులు పునరుద్ఘాటించారు.1