పారిశుద్ధ్య లోపం.. రోడ్డుపై మురుగునీరు.. దుర్వాసనతో ఇబ్బందులు పడుతున్న ప్రజలు.. పట్టించుకోని అధికారులు నంద్యాల జిల్లా బండి ఆత్మకూరు మండలకేంద్రంలో డ్రైనేజీ కాలువలు శుభ్రం చేయక మురుగునీరు సిసి రోడ్ల పై నిల్వ ఉంటూ దుర్వాసన వస్తుందని మరియు సిసి రోడ్డుపై మురుగునీరు ప్రవహిస్తోందని, రోడ్ల వెంట చెత్తాచెదారం పేరుకుపోయి దుర్వాసన వస్తుందని ప్రజలు ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామంలో పారిశుధ్యం లోపించి దోమలు వృద్ధి చెంది ప్రజలపై దాడి చేస్తూ డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్ వంటి విషజ్వరాల బారిన పడుతున్నట్లు స్థానికులు ఆరోపించారు. ప్రభుత్వం స్వర్ణ ఆంధ్ర స్వచ్చ ఆంధ్ర కార్యక్రమంలో భాగంగా ప్రతి నెలలో మూడవ శనివారం మరియు ప్రతి బుధవారం స్వచ్చ పథం కార్యక్రమంలో భాగంగా పారిశుద్ధ్య పనులపై దృష్టి సారించాలని, ప్రతిరోజు ఉదయం 7 గంటలకు పంచాయతీ కార్యదర్శులు గ్రామాలలో పర్యటించి సమస్యలను గుర్తించి సమస్యలను పరిష్కరించాలని ఉన్నతాధికారులు తెలియజేస్తున్నప్పటికీ పలు గ్రామాలలో పారిశుద్ధ్య పనులపై పంచాయతీ అధికారులు ఫోటోలకే పరిమితమవుతున్నారని ప్రజలు ఆరోపిస్తున్నారు. సంబంధిత అధికారులకు సమస్యలు తెలియజేస్తున్నప్పటికీ అధికారులు సమస్యలను పట్టించుకోవడంలేదని, చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారని ప్రజలు ఆరోపించారు. అధికారుల పర్యవేక్షణ లోపం ఉన్నట్లు అద్దం పట్టినట్లు కనిపిస్తుందని ఆరోపించారు. సోమవారం బండి ఆత్మకూరు గ్రామానికి చెందిన పి.ఇలియాస్ అనే అర్జీదారుడు ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం కు తహశీల్దార్ కార్యాలయం కు వెళ్లగా అధికారులు సమయానికి రాలేదని ఆరోపించారు. ఇప్పటికైనా జిల్లా ఉన్నతాధికారులు స్పందించి పారిశుద్ధ్యం పై చర్యలు తీసుకోవాలని, అధికారులు సమయపాలన పాటించే విధంగా చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరారు.

- కడపలో బీజేపీ నేతలపై పోలీసులు అమానుషంగా వ్యవహరించడంపై ఏపీ బీజేపీ చీఫ్ పీవీఎన్ మాధవ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కడప బీజేపీ జిల్లా అధ్యక్షుడిపై చేయి చేసుకున్న డీఎస్పీని వెంటనే సస్పెండ్ చేయాలని ఆయన డిమాండ్ చేస్తూ, పోలీసుల తీరును తీవ్రంగా ఖండించారు.1
- కాకినాడలోని గాంధీనగర్ ప్రాంతంలో అర్ధరాత్రి ఏపీఎస్పీ కానిస్టేబుల్ జి. నాగేశ్వరరావును గుర్తుతెలియని దుండగులు కత్తితో గొంతు కోసి దారుణంగా హత్య చేశారు. ఈ ఘటనతో స్థానికులు భయాందోళనలకు గురవ్వగా, పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. సీసీ కెమెరాల ఆధారంగా నిందితుల కోసం గాలింపు చర్యలు చేపడుతున్నారు.3
- తెలంగాణ రాష్ట్ర మంత్రి జూపల్లి కృష్ణారావు నాగర్‌కర్నూల్ జిల్లా, కోడేరు మండలంలో వరి కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. దళారుల చేతిలో మోసపోకుండా ప్రభుత్వ కేంద్రాల్లోనే ధాన్యం విక్రయించి మద్దతు ధర పొందాలని ఆయన రైతులకు సూచించారు. రైతు సంక్షేమమే ప్రభుత్వ ప్రధాన ధ్యేయమని ఈ సందర్భంగా మంత్రి స్పష్టం చేశారు.1
- తెలంగాణలో ఇప్పటివరకు జరిగిన వరి ధాన్యం కొనుగోళ్ల వివరాలపై స్పష్టమైన వీడియో విడుదలైంది. వరి పంట బోనస్ గురించిన పూర్తి సమాచారం కోసం రైతులు 'అగ్రికల్చర్ రఘురామ్' యూట్యూబ్ ఛానెల్‌ను చూడవచ్చు.1
- ఎమ్మెల్యే బీవీ జై నాగేశ్వర్ రెడ్డికి హాలహర్విలో ఘన స్వాగతం హాలహర్విలో శిఖర కలశ ప్రతిష్ట మహోత్సవం వైభవంగా1
- వైభవంగా ప్రారంభమైన హనుమాన్ జయంతి వేడుకలు. మారుతి రాయుడి ఆశీస్సులు అందరిపై ఉండాలి. బద్వేలు: పట్టణంలోని సిద్ధవటం రోడ్డు సుమిత్ర నగర్ లో గల శ్రీ మహాలక్ష్మి గోదాదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి మరియు అభయ ఆంజనేయ స్వామి దేవాలయం శ్రీ హనుమాన్ జయంతి మహోత్సవం సందర్భంగా ఆలయంలో అభయ ఆంజనేయ స్వామి వారికి సోమవారం సాయంత్రం అత్యంత వైభవంగా విశేష అభిషేకం నిర్వహించారు. స్వామి వారి కృపా కటాక్షాల కోసం భక్తులందరూ తమ శక్తి కొలది కాయ, కర్పూరం, పూలు మరియు పండ్లతో సకాలంలో విచ్చేసి, ఈ దివ్య అభిషేక సేవలో పాల్గొనవలసిందిగా ఆలయ కమిటీ నిర్వాహకులు వి వి రమణ కోరారు. ఆ మారుతి రాయుడి ఆశీస్సులు అందరిపై ఉండాలని మనసారా ఆశిస్తూ...అందరికీ ఆహ్వానం! పలికారు, జై శ్రీరామ్! జై శ్రీమన్నారాయణ!!,2
- ప్రభు యేసుక్రీస్తు నామములో అందరికీ ఉదయపు శుభాభివందనాలు తెలిపారు. మీ చేతి పనులకు ఎదురయ్యే ఆటంకాలు తొలగి, క్షేమకరమైన దీవెనలు పొందుకోవాలని ఆశీర్వదించారు. మీరు అనేకులకు వెలుగుగా, దీవెనగా ఉండాలని ప్రార్థన చేశారు.1
- ఆంధ్రప్రదేశ్‌లోని ఎమ్మిగనూరులో దళిత క్రైస్తవులు తమకు ఎస్సీ హోదా కొనసాగించాలని డిమాండ్ చేస్తూ భారీ ర్యాలీ చేపట్టారు. ప్రభుత్వం తమ న్యాయమైన డిమాండ్‌ను తక్షణమే నెరవేర్చాలని వారు ఈ సందర్భంగా నినదించారు.1