గణేష్ మండపాల వద్ద పటిష్ట భద్రత! భద్రతా చర్యలపై సీపీ గౌష్ ఆలం కీలక ఆదేశాలు.. చొప్పదండి, రామడుగు ప్రాంతాల్లోని గణేష్ మండపాలు, నిమజ్జన ప్రదేశాలను పోలీస్ కమిషనర్ గౌష్ ఆలం ఐపీఎస్ క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ముందుగా మండపాల వద్ద భద్రతపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు. ప్రధాన రహదారులు, రద్దీ ప్రాంతాలు, పరిసరాలను కవర్ చేసేలా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి నిరంతరం పర్యవేక్షించాలని ఆదేశించారు. విద్యుత్ భద్రత విషయంలో అప్రమత్తంగా ఉండాలని స్పష్టం చేశారు. షార్ట్ సర్క్యూట్‌కు అవకాశం లేకుండా నాణ్యమైన వైరింగ్‌నే ఉపయోగించాలని... ఇసుక, నీటి బకెట్లు, ఫైర్ ఎస్టింగ్విషర్లు అందుబాటులో ఉంచాలని సూచించారు. వర్షాల నేపథ్యంలో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు. మండపాల్లోకి నీరు చేరకుండా వాటర్‌ప్రూఫ్ షెడ్లు ఏర్పాటు చేయడంతో పాటు విద్యుత్ తీగలకు తగిన రక్షణ కల్పించాలని నిర్వాహకులకు సూచించారు. ఇక నిమజ్జన ప్రదేశాల్లో ప్రమాదాల నివారణకు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. బారికేడ్లు, తగినంత లైటింగ్ ఏర్పాటు చేసి... గజ ఈతగాళ్లను ముందుగానే సిద్ధంగా ఉంచాలని సూచించారు. పోలీస్, మున్సిపల్, అగ్నిమాపక శాఖలు పరస్పర సమన్వయంతో పనిచేయాలని సీపీ గౌష్ ఆలం ఆదేశించారు. ప్రజలు ప్రశాంత వాతావరణంలో భక్తిశ్రద్ధలతో ఉత్సవాలు నిర్వహించుకోవాలి... భద్రత విషయంలో ఎలాంటి నిర్లక్ష్యానికి తావివ్వొద్దని సీపీ స్పష్టం చేశారు!
గణేష్ మండపాల వద్ద పటిష్ట భద్రత! భద్రతా చర్యలపై సీపీ గౌష్ ఆలం కీలక ఆదేశాలు.. చొప్పదండి, రామడుగు ప్రాంతాల్లోని గణేష్ మండపాలు, నిమజ్జన ప్రదేశాలను పోలీస్ కమిషనర్ గౌష్ ఆలం ఐపీఎస్ క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ముందుగా మండపాల వద్ద భద్రతపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు. ప్రధాన రహదారులు, రద్దీ ప్రాంతాలు, పరిసరాలను కవర్ చేసేలా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి నిరంతరం
పర్యవేక్షించాలని ఆదేశించారు. విద్యుత్ భద్రత విషయంలో అప్రమత్తంగా ఉండాలని స్పష్టం చేశారు. షార్ట్ సర్క్యూట్‌కు అవకాశం లేకుండా నాణ్యమైన వైరింగ్‌నే ఉపయోగించాలని... ఇసుక, నీటి బకెట్లు, ఫైర్ ఎస్టింగ్విషర్లు అందుబాటులో ఉంచాలని సూచించారు. వర్షాల నేపథ్యంలో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు. మండపాల్లోకి నీరు చేరకుండా వాటర్‌ప్రూఫ్ షెడ్లు ఏర్పాటు చేయడంతో పాటు విద్యుత్ తీగలకు తగిన రక్షణ కల్పించాలని నిర్వాహకులకు సూచించారు. ఇక
నిమజ్జన ప్రదేశాల్లో ప్రమాదాల నివారణకు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. బారికేడ్లు, తగినంత లైటింగ్ ఏర్పాటు చేసి... గజ ఈతగాళ్లను ముందుగానే సిద్ధంగా ఉంచాలని సూచించారు. పోలీస్, మున్సిపల్, అగ్నిమాపక శాఖలు పరస్పర సమన్వయంతో పనిచేయాలని సీపీ గౌష్ ఆలం ఆదేశించారు. ప్రజలు ప్రశాంత వాతావరణంలో భక్తిశ్రద్ధలతో ఉత్సవాలు నిర్వహించుకోవాలి... భద్రత విషయంలో ఎలాంటి నిర్లక్ష్యానికి తావివ్వొద్దని సీపీ స్పష్టం చేశారు!
- కరీంనగర్: గంజ్ హైస్కూల్ రోడ్డుపై లీకవుతున్న వాటర్ పైప్‌లైన్ కరీంనగర్ నగరంలోని గంజ్ హైస్కూల్ రోడ్డులో వాటర్ పైప్‌లైన్ లీకై నీరు రోడ్డుపై ఏరులై పారుతోంది. రహదారి మధ్యలోనే పైపు పగిలిపోవడంతో లక్షలాది లీటర్ల తాగునీరు వృథాగా పోతోంది. రోడ్డంతా నీరు నిలిచి బురదమయంగా మారడంతో అటుగా రాకపోకలు సాగించే వాహనదారులు, పాఠశాల విద్యార్థులు, పాదచారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ద్విచక్ర వాహనాలు జారి పడుతున్నాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా మున్సిపల్ అధికారులు స్పందించి, తక్షణమే మరమ్మతులు చేపట్టి సమస్యను పరిష్కరించాలని స్థానికులు కోరుతున్నారు.1
- రివెంజ్ హత్య...యూట్యూబర్ వైష్ణవి భర్త హరిబాబు దారుణహత్య జగిత్యాల జిల్లా కోరుట్ల మండలం మాదాపూర్ కు చెందిన యూట్యూబర్ గంధం వైష్ణవి భర్త చిత్తరి హరిబాబు (26) గురువారం నిజామాబాద్ లో దారుణ హత్యకు గురయ్యారు. కారులో వచ్చిన వ్యక్తులు హరిబాబుపై కొబ్బరి బొండాలు కొట్టే కత్తితో విచక్షణారహితంగా దాడి చేసి పారిపోయారు. తీవ్ర గాయాలతో హరిబాబు అక్కడికక్కడే మృతి చెందారు. హత్య అనంతరం నిందితులు కారులో అక్కడి నుంచి పరారైనట్లు సీసీ ఫుటేజ్ ద్వారా తెలుస్తోంది. హరిబాబు భార్య వైష్ణవి ని సరిగ్గా ఆరు మాసాల క్రితం మార్చి 17న హత్యకు గురయ్యారు. వైష్ణవిని భర్తనే హత్య చేయడంతో ప్రతికారంగా వైష్ణవి కుటుంబ సభ్యులు హత్య చేసినట్లు సమాచారం. వైష్ణవి హత్య జరిగిన సమయంలో ఎప్పటికైనా వాన్ని వదలమని శపథం చేశారు. అన్నంత పని చేసినట్లు తెలుస్తోంది. వైష్ణవి హత్య కేసులో హరిబాబు ఆయన తల్లిదండ్రులను పోలీసులు అరెస్టు చేసి జైలుకు పంపారు. ఇటీవల బెయిల్ పై విడుదల అయి నిజామాబాద్ లో ఉంటున్నాడు. హరిబాబు అక్కడ ఉంటున్నాడనే విషయం తెలుసుకొని వైష్ణవి కుటుంబ సభ్యులు కాపు కాసి హత్య చేసినట్లు స్థానికులు భావిస్తున్నారు.2
- వినాయక నిమజ్జనానికి పక్కాగా ఏర్పాట్లు చేయాలి జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ సిరిసిల్ల మానేరు తీరంలో నిమజ్జన వేడుకల ఏర్పాట్లను పరిశీలించిన జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్, ఎస్పీ మహేష్ బి గితె వినాయక నిమజ్జనానికి ఏర్పాట్లు పక్కాగా చేయాలని జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ ఆదేశించారు.వినాయక విగ్రహాల నిమజ్జనానికి సిరిసిల్లలోని మానేరు తీరంలోని ప్రేమ్ నగర్, బ్రిడ్జి వద్ద చేస్తున్న ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్, ఎస్పీ మహేష్ బి గితె పలు శాఖల అధికారుల తో కలిసి బుధవారం పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ మాట్లాడుతూ.. వినాయక మండపాల నిర్వాహకులు తమ విగ్రహాలను భక్తి శ్రద్ధల మధ్య వేడుకలు నిర్వహిస్తూ వైభవంగా తరలించాలని సూచించారు. ప్రతి ఒక్కరూ అధికారులకు సహకరించాలని కోరారు. అన్ని శాఖల అధికారులు సమన్వయంతో ముందుకు వెళ్ళి, వేడుకలను విజయవంతం చేయాలని పిలుపు నిచ్చారు. వినాయక నిమజ్జనానికి కావలసిన నీటి సౌకర్యం, స్టేజ్, విద్యుత్ దీపాలు ఏర్పాటు చేయాలని, వైద్య సేవలు, అగ్ని మాపక శాఖ అధికారులు సేవలు అందించాలని, పారిశుధ్య పనులు చేయించాలని, క్రేన్లు అందుబాటులో పెట్టాలని మున్సిపల్ అధికారులను ఆదేశించారు.ఇక్కడ మున్సిపల్ చైర్ పర్సన్ జిందం కళ, ఆర్డీఓ శ్రీధర్ బాబు, డీఎస్పీ నాగేంద్రాచారి, నీటి పారుదల శాఖ అధికారి దయాకర్, జిల్లా వైద్యాధికారి ఏంజెలా ఆల్ఫ్రెడ్, జిల్లా మత్స్య శాఖ అధికారి సౌజన్య, తహసీల్దార్ మహేష్, మున్సిపల్ కమిషనర్ ఖదీర్ పాషా, పోలీసులు తదితరులు పాల్గొన్నారు.1
- శ్రీ కోటేశ్వర స్వామి కోటిలింగాల ఆలయ అభివృద్ధి పనులు ప్రారంభం జగిత్యాల జిల్లా వెల్గటూర్ మండలం కోటిలింగాల శ్రీ పార్వతి కోటేశ్వర స్వామి దేవస్థానంలో 2027 గోదావరి పుష్కరాలను దృష్టిలో ఉంచుకుని ఆలయ అభివృద్ధి పనులు ప్రారంభమయ్యాయి. నూతన ఆలయ నిర్మాణానికి రూ.4.50 కోట్లు, రాజగోపురం నిర్మాణానికి రూ.1 కోటి మంజూరయ్యాయి. నూతన ఆలయ నిర్మాణంలో భాగంగా పురాతన ఆలయ శిఖరాలను యంత్రాల సాయంతో తొలగించారు.1
- సెప్టెంబర్ 17 ముమ్మాటికి విద్రోహ దినమే.! - సీ పీ ఐ (ఎం ఎల్) న్యూడెమోక్రసీ జిల్లా కార్యదర్శి రాజన్న తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట స్ఫూర్తితో ప్రజా ఉద్యమాల్ని బలోపేతం చేయాలి. కే రాజన్న. జిల్లా కార్యదర్శి సీ పీ ఐ (ఎం ఎల్) న్యూడెమోక్రసీ. ఈరోజు సిపిఐ (ఎం ఎల్) న్యూడెమోక్రసీ. జిల్లా కమిటీ ఆధ్వర్యంలో "సెప్టెంబర్ 17ను విద్రోహ దినంగా" పాటిస్తూ గోదావరిఖని ఐ ఎఫ్ టీ యు కార్యాలయంలో సభ నిర్వహించడం జరిగింది. ఈ సభలో *సీ పీ ఐ (ఎం ఎల్) న్యూడెమోక్రసీ. జిల్లా కార్యదర్శి కే రాజన్న* మాట్లాడుతూ... తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం 1946 నుంచి 1951 వరకు జరిగిందని. ఈ తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో 3000.గ్రామాలు విముక్తి చేసి పది లక్షల ఎకరాల భూమిని కమ్యూనిస్టుల నాయకత్వంలో ప్రజలకు పంచడం జరిగిందన్నారు. ఈ పోరాటంలో 4,000 మంది అమర వీరులైనారు.తొలి అమర వీరుడు కామ్రేడ్ దొడ్డి కొమరయ్య భూమి కోసం భుక్తి కోసం ఈ దేశ విముక్తి కోసం భూస్వాముల అరాచకం, వెట్టి చాకిరి విముక్తి కోసం, బానిసత్వం పై తిరగబడి విరోచితంగా రైతంగ సాయుధ పోరాటం సాగిందన్నారు. చరిత్రను మరచిన బిజెపి, కాంగ్రెస్ పార్టీలు అమర వీరుల త్యాగాలను పోరాటాలను పక్కదోవ పట్టిస్తూ, విలీనమని, విమోచ అని పాలకులు ఈ రోజు వక్రీకరిస్తున్నారని అన్నారు. "సెప్టెంబర్.17. ముమ్మాటికి విద్రోహమే" అని సిపిఐ (ఎం ఎల్) న్యూడెమోక్రసీ. భావిస్తుందన్నారు. ఈ దేశంలో పాలక ప్రభుత్వాలు అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై తెలంగాణ పోరాట స్ఫూర్తితో బలమైన ప్రజా ఉద్యమాలు నిర్మించాలని పిలుపునిచ్చారు. ఈ సభలో ఎస్ సి సి డబ్ల్యూ యు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఏ వెంకన్న,ఐ ఎఫ్ టీ యు. జిల్లా అధ్యక్షులు ఈ నరేష్,ఉపాధ్యక్షులు చిలుక శంకర్, ప్రధాన కార్యదర్శి బి అశోక్,ఏ ఐ కే ఎం ఎస్. జిల్లా అధ్యక్షులు గుండేటి మల్లేశం, ఉపాధ్యక్షులు మేరుగు చంద్రయ్య, నాయకులు ఐ రాజేశం,ఎం దుర్గయ్య, అరుణోదయ జిల్లా అధ్యక్షులు బతుకుల రాజన్న, కాసర్ల మల్లేష్,ఎం కొమరయ్య,కోట వెంకన్న , పోగుల శేఖర్, రామారావు, జనగామ రాజన్న, చంటి బానయ్య, సతీష్, సంతోష్ తదితరులు పాల్గొన్నారు.1
- గణేష్ నవరాత్రి ఉత్సవాల జగిత్యాల పట్టణంలో వీధి దీపాల అలంకరణ, నిమజ్జన చెరువు వద్ద ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని మున్సిపల్ మందు బిజేపి నాయకుల నిరసన కమిషనర్ కు బిజెపి నాయకుల వినతి1
- ఎమ్మెల్యే గడ్డం వినోద్ నిర్లక్ష్యం వల్లే జోగాపూర్-మైలారం రోడ్డు పనులు ఆలస్యం ఎమ్మెల్యే గడ్డం వినోద్ నిర్లక్ష్యం వల్లే నెన్నెల మండలం జోగాపూర్-మైలారం రోడ్డు పనులు నిలిచిపోయాయని బీఆర్ఎస్ నాయకులు ఆరోపించారు. గురువారం మండల కేంద్రంలో మాట్లాడుతూ కొబ్బరికాయ కొట్టి రెండు నెలలు గడిచినా రోడ్డు పనులు ప్రారంభించలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. తామే పనులను అడ్డుకుంటున్నామని కొందరు అసత్య ప్రచారం చేస్తున్నారని పేర్కొన్నారు1
- కరీంనగర్‌లో పాలిటెక్నిక్ విద్య పరిరక్షణ ఉద్యమం ఉధృతం..! 32వ రోజుకు చేరిన ఆందోళన... G.O.Ms.No.97 రద్దు చేయాలంటూ అధ్యాపకుల నిరసన..! కరీంనగర్ డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ జీఎంఆర్ మహిళల పాలిటెక్నిక్ కళాశాలలో... భోజన విరామ సమయంలో అధ్యాపక బృందం నల్ల దుస్తులు, నల్ల మాస్కులు ధరించి నిరసన చేపట్టింది. G.O.Ms.No.97ను వెంటనే రద్దు చేయాలని TPJAC నాయకులు డిమాండ్ చేశారు. అదే సమయంలో... కేంద్ర TPJAC నాయకులు, ఉద్యోగులతో మాట్లాడే సందర్భంలో టెక్నికల్ ఎడ్యుకేషన్ కమిషనర్ అనుచిత, అన్పార్లమెంటరీ భాష ఉపయోగించారని ఆరోపిస్తూ... తీవ్రంగా ఖండించారు. కమిషనర్ బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. మరోవైపు... రేపటి నుంచి ప్రారంభమయ్యే సెమిస్టర్ మిడ్ ఎగ్జామినేషన్స్ విధులను బహిష్కరిస్తున్నట్లు స్థానిక TPJAC యూనిట్ ప్రిన్సిపాల్‌కు రీప్రజెంటేషన్ అందజేసింది. ఉద్యమం 32వ రోజుకు చేరడంతో... ప్రభుత్వం స్పందిస్తుందా? G.O.Ms.No.97పై తదుపరి నిర్ణయం ఏంటి? అనే దానిపై ఉత్కంఠ కొనసాగుతోంది. పాలిటెక్నిక్ విద్య పరిరక్షణ కోసం తమ ఆందోళన కొనసాగిస్తామని స్థానిక TPJAC, కేంద్ర TPJAC స్పష్టం చేసింది.1