*జర్నలిస్టుల డిమాండ్స్ డే సందర్భంగా మైలవరంలో ఏపీడబ్ల్యూజేఎఫ్, ఏపీబీజేఏ ర్యాలీ* *_ఇళ్ల స్థలాలు కేటాయించాలి , మీడియా కమిషన్ ఏర్పాటు చెయ్యాలి,అక్రమ కేసులు ఎత్తివేత పై డిమాండ్స్ _* *ఎన్టీఆర్ జిల్లా,మైలవరం జులై 31,* జర్నలిస్టుల డిమాండ్స్ డే సందర్భంగా ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ - ఏపీడబ్ల్యూజేఎఫ్ మరియు ఆంధ్రప్రదేశ్ బ్రాడ్ కాస్టింగ్ జర్నలిస్ట్స్ అసోసియేషన్ - ఏపీబీజేఏ ఆధ్వర్యంలో శుక్రవారం మైలవరంలో నిరసన ర్యాలీ నిర్వహించారు. మైలవరం పంచాయతీ కార్యాలయం నుండి తహసిల్దార్ కార్యాలయం వరకు జర్నలిస్టులు ర్యాలీగా వెళ్లారు. ఏపీడబ్ల్యూజేఎఫ్, ఏపీబీజేఏ "జర్నలిస్టుల డిమాండ్స్ ప్లకార్డులు పట్టుకుని నినాదాలు చేశారు. జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు, ఇళ్లు మంజూరు చేయాలని, మీడియా కమిషన్ ఏర్పాటు చేయాలని, జర్నలిస్టులపై పెట్టిన అక్రమ కేసులు వెంటనే ఎత్తివేయాలని వారు డిమాండ్ చేశారు. జర్నలిస్టుల సమస్యలపై తహసిల్దార్ కార్యాలయంలో వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో ఏపీడబ్ల్యూజేఎఫ్, ఏపీబీజేఏ,ఎన్టీఆర్ జిల్లా నాయకులు,మైలవరం నియోజకవర్గ నాయకులు, స్థానిక జర్నలిస్టులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

- ఎన్టీఆర్ జిల్లా మైలవరం నియోజకవర్గం మైలవరంలో కదం తొక్కిన ఏపీడబ్ల్యూజేఎఫ్, ఏపీబీజేఏ నాయకులు మైలవరం పంచాయతీ కార్యాలయం నుంచి తహసిల్దార్ కార్యాలయం వరకు ర్యాలీ... జర్నలిస్టు డిమాండ్స్ డే సందర్భంగా నిరసన కార్యక్రమం జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు, ఇల్లు ఇవ్వాలని, మీడియా కమిషన్ ఏర్పాటు చేయాలని, జర్నలిస్టులపై అక్రమ కేసులు ఎత్తివేయాలని నినాదాలు.... జర్నలిస్టుల సమస్యలపై తహసిల్దార్ కార్యాలయంలో వినతిపత్రం అందజేసిన ఏపీడబ్ల్యూజేఎఫ్, ఏపీ బీజేఏ నాయకులు3
- పత్తి మిరప సాగు చేసే రైతులు ఈ క్రాఫ్ట్ తప్పనిసరి - ఏటుకూరు బ్రహ్మయ్య. పెదకూరపాడు : రైతులు పండించే పంటకు ఈక్రాప్ చేసుకోవడం ద్వారా నష్టం వాటిల్లి నప్పుడు ప్రభుత్వం నష్టపరిహారం అందిస్తుందని మండల టిడిపి అధ్యక్షులు ఏటుకూరు బ్రహ్మయ్య అన్నారు. ఈ క్రాఫ్ట్ ఆన్లైన్ 31 తో ముగుస్తున్న కారణంగా ఈరోజు పత్తి మిరప సాగుచేసే రైతులు తప్పనిసరిగా ఈ క్రాఫ్ట్ చేయించుకోవాలని అది రైతులకు భరోసా అని ఆయన అన్నారు.1
- ద్వేషం గోడలను కడుతుంది ప్రేమ మాత్రం దారులను తెరుస్తుంది ప్రేమతో చేసిన చిన్న సహాయం వేల మాటల కంటే గొప్పది1
- తుళ్లూరులో శాకంబరీ దేవిగా భద్రకాళి అమ్మవారు........... తుళ్లూరు శ్రీ భద్రకాళి వీరభద్ర స్వామి దేవస్థానంలో ఆషాఢ మాసం సందర్భంగా అమ్మవారిని శాకంబరీ దేవిగా భక్తిశ్రద్ధలతో అలంకరించారు. మహిళలు సంప్రదాయబద్ధంగా విచ్చేసి అమ్మవారికి సారె సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. ప్రత్యేక పూజలు, అలంకరణలతో ఆలయం భక్తులతో కళకళలాడగా.. ప్రాంగణమంతా ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది.1
- ప్రభుత్వ సేవలు సకాలంలో ప్రజలకు అందించటమే కూటమి ప్రభుత్వ లక్ష్యం. ఎమ్మెల్యే నక్కా ఆనందబాబు. ప్రజలకు ప్రభుత్వ సేవలు సకాలంలో అందించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని వేమూరు ఎమ్మెల్యే నక్కా ఆనందబాబు పేర్కొన్నారు. శుక్రవారం అమృతలూరు ఎంపీడీవో కార్యాలయంలో జరిగిన PGRS కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొని ప్రజల నుండి ఫిర్యాదులను స్వీకరించారు. అమృతలూరు మండల పరిధిలోని వివిధ గ్రామాల నుంచి వచ్చిన ప్రజలు భూ సంబంధిత సమస్యలు ఆదాయ ధ్రువ పత్రాలు పింఛన్లు గృహ నిర్మాణం త్రాగునీటి సౌకర్యం రహదారులు ఇతర మౌలిక వసతులకు సంబంధించి వినతి పత్రాలు ఎమ్మెల్యేకి అందజేశారు.2
- ఎన్టీఆర్ జిల్లా మైలవరంలో ఏపీడబ్ల్యూజేఎఫ్,ఏ పి బీజేఏ ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ1
- భద్రాచలం వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక 44 అడుగులకు చేరిన గోదావరి వరద భద్రాచలంలో గోదావరి ఉప్పొంగుతోంది. శుక్రవారం ఉదయం 11 గంటలకు నీటిమట్టం 44 అడుగులకు చేరింది. 43 అడుగులు దాటడంతో మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. వరద ఉద్ధృతి క్రమంగా పెరుగుతుండటంతో, నేడు సాయంత్రానికి నీటిమట్టం 48 అడుగులకు చేరే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో అధికారులు లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేస్తూ, తగిన రక్షణ చర్యలు చేపట్టారు. భద్రాచాలంలో గోదావరి ప్రవాహం క్రమంగా పెరుగుతోంది. శుక్రవారం ఉదయం 10:14 గంటల సమయానికి నీటి మట్టం 43 అడుగులకు చేరింది. దీంతో అప్రమత్తమైన యంత్రాంగం మొదటి ప్రమాద హెచ్చరికను జారీ చేసింది. రానున్న గంటల్లో నీటిమట్టం మరింత పెరిగే అవకాశం ఉందని వాతావరణ హెచ్చరికలున్నాయి. ఈ నేపథ్యంలో వరద విధుల్లో ఉన్న అధికారులు అందరూ గోదావరి వరద మాన్యు వల్ ప్రకారం తక్షణమే తగిన చర్యలు చేపట్టాలని సబ్ కలెక్టర్ ఆదేశించారు.2