logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

కూకట్‌పల్లిలో నల్ల చెరువు పునరుద్ధరణ ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి అభివృద్ధికి నిధులు ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధం – ఆక్రమణల తొలగింపుతో నగరాన్ని అభివృద్ధి పథంలోకి తీసుకెళ్తాం మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కూకట్‌పల్లిలో పునరుద్ధరించిన నల్ల చెరువును ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించారు. ముఖ్యమంత్రి హోదాలో మల్కాజ్‌గిరి పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని కూకట్‌పల్లికి రావడం సంతోషంగా ఉందని ఆయన పేర్కొన్నారు. రాజకీయాలకు అతీతంగా మల్కాజ్‌గిరి పార్లమెంట్ పరిధిలోని అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల అభివృద్ధికి నిధులు మంజూరు చేస్తామని స్పష్టం చేశారు. రాజకీయాలతో సంబంధం లేకుండా అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్లడమే తమ ప్రభుత్వ విధానమని సీఎం తెలిపారు. చెరువుల పునరుద్ధరణకు ప్రభుత్వం పూనుకున్నప్పుడు ఎన్నో విమర్శలు, ఆరోపణలు ఎదురైనా మౌనంగా భరించానని చెప్పారు. నల్ల చెరువు అభివృద్ధిని చూసి ప్రజల ముఖాల్లో కనిపిస్తున్న ఆనందం ఆ విమర్శలను ఆశీర్వాదాలుగా మార్చిందని వ్యాఖ్యానించారు.పేదవారిని ఇబ్బంది పెట్టడం లేదా ఇండ్లు కూలగొట్టడం ప్రభుత్వ ఉద్దేశం కాదని సీఎం స్పష్టం చేశారు. వరదల సమయంలో ప్రజలు ముంపు బాధితులుగా మారకుండా ఉండేందుకు చెరువులు, నాలాలను పునరుద్ధరించడం అవసరమని తెలిపారు. చెరువులు, నాలాలను ఆక్రమించుకున్న వారికి న్యాయం చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పారు. పునరుద్ధరించిన చెరువుల వద్ద మహిళలకు స్టాల్స్ ఏర్పాటు చేసే అవకాశాలు కల్పిస్తామని తెలిపారు. చిన్నారుల కోసం చెరువుల ఒడ్డున ఆటస్థలాలను కూడా అభివృద్ధి చేయాలని సూచించారు. నగరంలోని చెరువులన్నింటినీ పునరుద్ధరించి ప్రకృతిని కాపాడుకోవాలని పిలుపునిచ్చారు. దేశంలోని మహానగరాలు అనేక సమస్యలతో సతమతమవుతున్నాయని, హైదరాబాద్ నగరంలో చెరువులను సంరక్షిస్తూ అభివృద్ధిని కొనసాగించాల్సిన అవసరం ఉందన్నారు. మూసీ నది ప్రక్షాళనతో పాటు కోర్ అర్బన్ రీజియన్‌లోని చెరువులన్నీ పునరుద్ధరించేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. నాలాల ఆక్రమణలు తొలగించి రోడ్ల విస్తరణ చేపట్టి హైదరాబాద్‌ను మంచి నగరంగా తీర్చిదిద్దుతామని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.అభివృద్ధికి అవసరమైన నిధులు ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని, అభివృద్ధిని అడ్డుకోకుండా ప్రజలు సహకరించాలని కోరారు. కష్టకాలంలో ఈ ప్రాంత ప్రజలు తనకు అండగా నిలిచారని గుర్తుచేసుకున్న సీఎం, ప్రజల సహకారంతో నగరాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళతానని తెలిపారు.

11 hrs ago
user_Suresh Sagar
Suresh Sagar
కాప్రా, మేడ్చల్ మల్కాజ్‌గిరి, తెలంగాణ•
11 hrs ago
8837daf6-6702-4065-9d6d-7211aa52f65e

కూకట్‌పల్లిలో నల్ల చెరువు పునరుద్ధరణ ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి అభివృద్ధికి నిధులు ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధం – ఆక్రమణల తొలగింపుతో నగరాన్ని అభివృద్ధి పథంలోకి తీసుకెళ్తాం మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కూకట్‌పల్లిలో పునరుద్ధరించిన నల్ల చెరువును ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించారు. ముఖ్యమంత్రి హోదాలో మల్కాజ్‌గిరి పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని కూకట్‌పల్లికి రావడం సంతోషంగా ఉందని ఆయన పేర్కొన్నారు. రాజకీయాలకు అతీతంగా మల్కాజ్‌గిరి పార్లమెంట్ పరిధిలోని అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల అభివృద్ధికి నిధులు మంజూరు చేస్తామని స్పష్టం చేశారు. రాజకీయాలతో సంబంధం లేకుండా అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్లడమే తమ ప్రభుత్వ విధానమని సీఎం తెలిపారు. చెరువుల పునరుద్ధరణకు ప్రభుత్వం పూనుకున్నప్పుడు ఎన్నో

d087149b-6f1c-4249-875d-c4dee5e23c56

విమర్శలు, ఆరోపణలు ఎదురైనా మౌనంగా భరించానని చెప్పారు. నల్ల చెరువు అభివృద్ధిని చూసి ప్రజల ముఖాల్లో కనిపిస్తున్న ఆనందం ఆ విమర్శలను ఆశీర్వాదాలుగా మార్చిందని వ్యాఖ్యానించారు.పేదవారిని ఇబ్బంది పెట్టడం లేదా ఇండ్లు కూలగొట్టడం ప్రభుత్వ ఉద్దేశం కాదని సీఎం స్పష్టం చేశారు. వరదల సమయంలో ప్రజలు ముంపు బాధితులుగా మారకుండా ఉండేందుకు చెరువులు, నాలాలను పునరుద్ధరించడం అవసరమని తెలిపారు. చెరువులు, నాలాలను ఆక్రమించుకున్న వారికి న్యాయం చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పారు. పునరుద్ధరించిన చెరువుల వద్ద మహిళలకు స్టాల్స్ ఏర్పాటు చేసే అవకాశాలు కల్పిస్తామని తెలిపారు. చిన్నారుల కోసం చెరువుల ఒడ్డున ఆటస్థలాలను కూడా అభివృద్ధి చేయాలని సూచించారు. నగరంలోని

5391721b-d81e-419d-8cd8-55b3097773ec

చెరువులన్నింటినీ పునరుద్ధరించి ప్రకృతిని కాపాడుకోవాలని పిలుపునిచ్చారు. దేశంలోని మహానగరాలు అనేక సమస్యలతో సతమతమవుతున్నాయని, హైదరాబాద్ నగరంలో చెరువులను సంరక్షిస్తూ అభివృద్ధిని కొనసాగించాల్సిన అవసరం ఉందన్నారు. మూసీ నది ప్రక్షాళనతో పాటు కోర్ అర్బన్ రీజియన్‌లోని చెరువులన్నీ పునరుద్ధరించేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. నాలాల ఆక్రమణలు తొలగించి రోడ్ల విస్తరణ చేపట్టి హైదరాబాద్‌ను మంచి నగరంగా తీర్చిదిద్దుతామని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.అభివృద్ధికి అవసరమైన నిధులు ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని, అభివృద్ధిని అడ్డుకోకుండా ప్రజలు సహకరించాలని కోరారు. కష్టకాలంలో ఈ ప్రాంత ప్రజలు తనకు అండగా నిలిచారని గుర్తుచేసుకున్న సీఎం, ప్రజల సహకారంతో నగరాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళతానని తెలిపారు.

More news from తెలంగాణ and nearby areas
  • ఖమ్మం అంబేద్కర్ భవన్ లో వెలుగుమట్ల బాధితులకు మద్దతుగా సోమవారం రాత్రి డీఎస్పీ అధ్యక్షుడు విశారదన్ మహరాజ్ తో కలిసి నిరవధిక నిరాహార దీక్ష చేపట్టిన జాగృతి అధ్యక్షురాలు. మంగళవారం ఉదయం కవిత, విశారదన్ తో పాటు నిరాహార దీక్ష చేపట్టిన వారిని అరెస్ట్ చేసిన పోలీసులు. కవితతో పాటు దీక్ష చేస్తున్న వారిని హైదరాబాద్ రోడ్డులో తరలిస్తున్న ఖమ్మం పోలీసులు.
    1
    ఖమ్మం అంబేద్కర్ భవన్ లో వెలుగుమట్ల బాధితులకు మద్దతుగా సోమవారం రాత్రి డీఎస్పీ అధ్యక్షుడు విశారదన్ మహరాజ్ తో కలిసి నిరవధిక నిరాహార దీక్ష చేపట్టిన జాగృతి అధ్యక్షురాలు. మంగళవారం ఉదయం కవిత, విశారదన్ తో పాటు నిరాహార దీక్ష చేపట్టిన వారిని అరెస్ట్ చేసిన పోలీసులు. కవితతో పాటు దీక్ష చేస్తున్న వారిని హైదరాబాద్ రోడ్డులో తరలిస్తున్న ఖమ్మం పోలీసులు.
    user_దినేష్ కుమార్
    దినేష్ కుమార్
    సికింద్రాబాద్, హైదరాబాద్, తెలంగాణ•
    2 hrs ago
  • రాష్ట్ర చరిత్రలో తొలిసారి పోలీస్ ఆఫీసర్స్ రిట్రీట్
    1
    రాష్ట్ర చరిత్రలో తొలిసారి పోలీస్ ఆఫీసర్స్ రిట్రీట్
    user_Jtv9 News Network
    Jtv9 News Network
    బండ్లగూడ, హైదరాబాద్, తెలంగాణ•
    30 min ago
  • **గజ్వేల్, సిద్దిపేట జిల్లా మార్చి 9:** ప్రజా తెలంగాణ న్యూస్/ గజ్వేల్ నియోజకవర్గంలోని మల్లన్నసాగర్ రిజర్వాయర్ నుంచి కొండపోచమ్మ సాగర్‌కు నీటిని వెంటనే పంపాలని బీఆర్ఎస్ పార్టీ ఇన్‌చార్జ్ వంటేరు ప్రతాప్ రెడ్డి డిమాండ్ చేశారు. అకారం పంప్‌హౌస్‌ను తక్షణం స్టార్ట్ చేసి, కొండపోచమ్మ సాగర్‌లోకి నీళ్లు వదిలి, కెనాల్ ప్రాంతంలో 2-3 కిలోమీటర్ల రైతులకు సాగునీరు అందేలా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు. అదే సమయంలో, గజ్వేల్ ఏరియా 132 కెవీ సబ్‌స్టేషన్ ద్వారా రైతులకు 24 గంటల మెరుగైన విద్యుత్ సరఫరా చేయాలని కూడా డిమాండ్ చేశారు. ఈ రైతు సమస్యల పరిష్కారానికి గజ్వేల్ నియోజకవర్గ ముఖ్య నాయకులు అందరూ పాల్గొన్న సమావేశంలో ఈ తీర్మానాలు ఆమోదించబడ్డాయి. కాలేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్‌లో మల్లన్నసాగర్‌కు ప్రాధాన్యత ఉన్నప్పటికీ, స్థానిక రైతుల సాగునీటి అవసరాల కోసం ఈ నీటి రిలీజ్ అత్యవసరమని వంటేరు ప్రతాప్ రెడ్డి స్పష్టం చేశారు. ప్రభుత్వం వెంటనే స్పందించాలని ఆయన డిమాండ్ చేశారు.
    4
    **గజ్వేల్, సిద్దిపేట జిల్లా  మార్చి 9:** ప్రజా తెలంగాణ న్యూస్/
గజ్వేల్ నియోజకవర్గంలోని మల్లన్నసాగర్ రిజర్వాయర్ నుంచి కొండపోచమ్మ సాగర్‌కు నీటిని వెంటనే పంపాలని బీఆర్ఎస్ పార్టీ ఇన్‌చార్జ్ వంటేరు ప్రతాప్ రెడ్డి డిమాండ్ చేశారు. అకారం పంప్‌హౌస్‌ను తక్షణం స్టార్ట్ చేసి, కొండపోచమ్మ సాగర్‌లోకి నీళ్లు వదిలి, కెనాల్ ప్రాంతంలో 2-3 కిలోమీటర్ల రైతులకు సాగునీరు అందేలా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు.
అదే సమయంలో, గజ్వేల్ ఏరియా 132 కెవీ సబ్‌స్టేషన్ ద్వారా రైతులకు 24 గంటల మెరుగైన విద్యుత్ సరఫరా చేయాలని కూడా డిమాండ్ చేశారు. ఈ రైతు సమస్యల పరిష్కారానికి గజ్వేల్ నియోజకవర్గ ముఖ్య నాయకులు అందరూ పాల్గొన్న సమావేశంలో ఈ తీర్మానాలు ఆమోదించబడ్డాయి.
కాలేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్‌లో మల్లన్నసాగర్‌కు ప్రాధాన్యత ఉన్నప్పటికీ, స్థానిక రైతుల సాగునీటి అవసరాల కోసం ఈ నీటి రిలీజ్ అత్యవసరమని వంటేరు ప్రతాప్ రెడ్డి స్పష్టం చేశారు. ప్రభుత్వం వెంటనే స్పందించాలని ఆయన డిమాండ్ చేశారు.
    user_Gousuddin Md
    Gousuddin Md
    అంబర్‌పేట్, హైదరాబాద్, తెలంగాణ•
    10 hrs ago
  • Termites existence, not to be ignored, love your home.
    1
    Termites existence, not to be ignored, love your home.
    user_COOMAR AND COOMAR SERVICES
    COOMAR AND COOMAR SERVICES
    Pest control service అంబర్‌పేట్, హైదరాబాద్, తెలంగాణ•
    15 hrs ago
  • Amjad ullah khan (spokeman) #MBT Raidurgam ps limet 3 log #mar_peeta gaya Bin na waajen
    1
    Amjad ullah khan (spokeman) #MBT Raidurgam ps limet  3 log #mar_peeta gaya Bin na waajen
    user_Zulfaqar Hussain Khan
    Zulfaqar Hussain Khan
    Photographer గోల్కొండ, హైదరాబాద్, తెలంగాణ•
    15 hrs ago
  • గజ్వేల్ సిద్దిపేట జిల్లా మార్చు 10 ప్రజా తెలంగాణ న్యూస్/ విద్యతో పాటు, శాస్త్ర సాంకేతికత సమాజం పట్ల గౌరవం ఉండే విధంగా ప్రతి విద్యార్థి లక్ష్యంతో ముందుకు వెళ్లాలని కావేరి వ్యవసాయ యూనివర్సిటీ వ్యవస్థాపకులు భాస్కర్ రావు అన్నారు. సిద్దిపేట జిల్లా గౌరారం వద్ద గల కావేరి వ్యవసాయ కళాశాలలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా వివిధ రంగాలలో గుర్తింపు పొందిన మహిళలకు ఘనంగా సన్మానం చేశారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ విద్యార్థి దశ నుండే లక్ష్యంతో ఉన్నతమైన శిఖరాలకు చేరే విధంగా పట్టుదలతో చదువుకోవాలని సూచించారు అనంతరం వివిధ రంగాల్లో గుర్తింపు పైన మహిళలకు శాలువాలతో సన్మానం చేశారు విద్యార్థులచే వివిధ నాటక కళారూపాలు, నృత్య ప్రదర్శనలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో కళాశాల సిబ్బంది విద్యార్థులు పాల్గొన్నారు.
    4
    గజ్వేల్ సిద్దిపేట జిల్లా మార్చు 10 ప్రజా తెలంగాణ న్యూస్/
విద్యతో పాటు, శాస్త్ర సాంకేతికత సమాజం పట్ల గౌరవం ఉండే విధంగా ప్రతి విద్యార్థి లక్ష్యంతో ముందుకు వెళ్లాలని కావేరి వ్యవసాయ యూనివర్సిటీ  వ్యవస్థాపకులు భాస్కర్ రావు అన్నారు.
సిద్దిపేట జిల్లా గౌరారం వద్ద గల కావేరి వ్యవసాయ కళాశాలలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా వివిధ రంగాలలో గుర్తింపు పొందిన మహిళలకు ఘనంగా సన్మానం చేశారు.  ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ విద్యార్థి దశ నుండే లక్ష్యంతో ఉన్నతమైన శిఖరాలకు చేరే విధంగా పట్టుదలతో చదువుకోవాలని సూచించారు అనంతరం వివిధ రంగాల్లో గుర్తింపు పైన మహిళలకు శాలువాలతో సన్మానం చేశారు విద్యార్థులచే వివిధ నాటక కళారూపాలు, నృత్య ప్రదర్శనలు  నిర్వహించారు ఈ కార్యక్రమంలో కళాశాల సిబ్బంది విద్యార్థులు పాల్గొన్నారు.
    user_GOUSE BEURO REPORTER
    GOUSE BEURO REPORTER
    రిపోర్టర్ వర్గల్, సిద్దిపేట, తెలంగాణ•
    8 hrs ago
  • అశోక్ నగర్ వినాయకుని ఆలయంలో చోరీ సంగారెడ్డి జిల్లాలోని రామచంద్రపురం పోలీస్ స్టేషన్ పరిధిలో ఆలయంలో చోరీ జరిగింది. అశోక్ నగర్ వినాయక ఆలయంలో మంగళ వారం తెల్లవారుజామున దొంగలు తాళాలు పగులగొట్టి లోపలికి ప్రవేశించారు. స్థానికుల సమాచారం ప్రకారం దొంగలు ఆలయంలోని సుమారు 3 తులాల బంగారు ఆభరణాలు, 8 కిలోల వెండి వస్తువులు అపహరించారు. అంతేకాకుండా ఆలయ హుండీని పగులగొట్టి అందులో ఉన్న సుమారు 90 వేల రూపాయల నగదును కూడా తీసుకెళ్లినట్లు తెలుస్తోంది. ఉదయం ఆలయానికి వచ్చిన స్థానికులు తాళాలు పగులగొట్టబడినట్టు గుర్తించి వెంటనే పోలీసులకు సమాచారం అందించారు.సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలనలు ప్రారంభించారు. క్లూస్ టీం సహాయంతో వేలిముద్రలు మరియు ఇతర ఆధారాలను సేకరిస్తున్నారు. ఆలయ పరిసరాల్లో ఉన్న సీసీటీవీ కెమెరాలను పోలీసులు పరిశీలిస్తూ దొంగల కోసం గాలింపు చర్యలు చేపట్టారు.ఈ ఘటనపై రామచంద్రాపురం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
    4
    అశోక్ నగర్ వినాయకుని ఆలయంలో చోరీ
సంగారెడ్డి జిల్లాలోని రామచంద్రపురం పోలీస్ స్టేషన్ పరిధిలో ఆలయంలో చోరీ జరిగింది. అశోక్ నగర్ వినాయక ఆలయంలో మంగళ వారం తెల్లవారుజామున దొంగలు తాళాలు పగులగొట్టి లోపలికి ప్రవేశించారు. స్థానికుల సమాచారం ప్రకారం దొంగలు ఆలయంలోని సుమారు 3 తులాల బంగారు ఆభరణాలు, 8 కిలోల వెండి వస్తువులు అపహరించారు. అంతేకాకుండా ఆలయ హుండీని పగులగొట్టి అందులో ఉన్న సుమారు 90 వేల రూపాయల నగదును కూడా తీసుకెళ్లినట్లు తెలుస్తోంది. ఉదయం ఆలయానికి వచ్చిన స్థానికులు తాళాలు పగులగొట్టబడినట్టు గుర్తించి వెంటనే పోలీసులకు సమాచారం అందించారు.సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలనలు ప్రారంభించారు. క్లూస్ టీం సహాయంతో వేలిముద్రలు మరియు ఇతర ఆధారాలను సేకరిస్తున్నారు. ఆలయ పరిసరాల్లో ఉన్న సీసీటీవీ కెమెరాలను పోలీసులు పరిశీలిస్తూ దొంగల కోసం గాలింపు చర్యలు చేపట్టారు.ఈ ఘటనపై రామచంద్రాపురం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
    user_PITLA KANAKA RAJU PRAJA PILUPU
    PITLA KANAKA RAJU PRAJA PILUPU
    Local News Reporter గజ్వేల్, సిద్దిపేట, తెలంగాణ•
    25 min ago
  • బాలికలు సర్వైకల్ క్యాన్సర్ బారిన పడకుండా కేంద్ర ప్రభుత్వం ఉచితంగా పంపిణీ చేస్తున్న హెచ్.పి.వి టీకా ను 14 ఏళ్ల వయస్సు గల బాలికలందరూ సద్వినియోగం చేసుకోవాలని బిజెపి రాష్ట్ర ఉపాధ్యక్షురాలు, మాజీ మేయర్ బండ కార్తిక చంద్రారెడ్డి అన్నారు. ఈ మేరకు లాలాపేటలోని పట్టణ సామాజిక ఆరోగ్య కేంద్రంలో ఈ టీకా పంపిణీ కార్యక్రమాన్ని ఆమె లాంచనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా కార్తిక రెడ్డి మాట్లాడుతూ ఆడబిడ్డల ఆరోగ్యం కోసం ప్రధాని నరేంద్ర మోడీ ప్రభుత్వం గొప్ప సంకల్పం తీసుకుందన్నారు. మార్కెట్ లో దాదాపు 4 వేలు విలువ చేసే వ్యాక్సిన్ ను కేంద్ర ప్రభుత్వం ఉచితంగా అందజేయడం ఎంతో అభినందనీయమని పేర్కొన్నారు. గతంలో కరోనా విపత్కర పరిస్థితిలో దేశ ప్రజలందరికీ భారత దేశంలో తయారైన వ్యాక్సిన్ ఉచితంగా పంపిణీ చేసిన విషయాన్ని గుర్తు చేశారు. ప్రజారోగ్యం పట్ల కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న శ్రద్ధకు ఇది నిదర్శనమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో స్వరూప గౌడ్, కనికట్ల హరి, అనిత, సత్యవతి, ఉపేందర్ యాదవ్ ,వీరన్న, వేణు యాదవ్ సికింద్రాబాద్ నియోజకవర్గ బిజెపి నాయకులు, కార్యకర్తలు, డిప్యూటీ డి ఎం హెచ్ ఓ డాక్టర్ జయశ్రీ, లాలాపేట ఆరోగ్య కేంద్రాల మెడికల్ ఆఫీసర్లు డాక్టర్ లావణ్య, డాక్టర్ వందన, ఆరోగ్య కేంద్రం వైద్య సిబ్బంది పాల్గొన్నారు.
    1
    బాలికలు సర్వైకల్ క్యాన్సర్ బారిన పడకుండా కేంద్ర ప్రభుత్వం ఉచితంగా పంపిణీ చేస్తున్న హెచ్.పి.వి టీకా ను 14 ఏళ్ల వయస్సు గల బాలికలందరూ సద్వినియోగం చేసుకోవాలని బిజెపి రాష్ట్ర ఉపాధ్యక్షురాలు, మాజీ మేయర్ బండ కార్తిక చంద్రారెడ్డి అన్నారు. ఈ మేరకు లాలాపేటలోని పట్టణ సామాజిక ఆరోగ్య కేంద్రంలో ఈ టీకా పంపిణీ కార్యక్రమాన్ని ఆమె లాంచనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా కార్తిక రెడ్డి మాట్లాడుతూ ఆడబిడ్డల ఆరోగ్యం కోసం ప్రధాని నరేంద్ర మోడీ ప్రభుత్వం గొప్ప సంకల్పం తీసుకుందన్నారు.  మార్కెట్ లో దాదాపు 4 వేలు విలువ చేసే వ్యాక్సిన్ ను కేంద్ర ప్రభుత్వం ఉచితంగా అందజేయడం ఎంతో అభినందనీయమని పేర్కొన్నారు. గతంలో కరోనా విపత్కర పరిస్థితిలో దేశ ప్రజలందరికీ భారత దేశంలో తయారైన వ్యాక్సిన్ ఉచితంగా పంపిణీ చేసిన విషయాన్ని గుర్తు చేశారు. ప్రజారోగ్యం పట్ల కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న శ్రద్ధకు ఇది నిదర్శనమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో స్వరూప గౌడ్, కనికట్ల హరి, అనిత, సత్యవతి, ఉపేందర్ యాదవ్ ,వీరన్న, వేణు యాదవ్ సికింద్రాబాద్ నియోజకవర్గ బిజెపి నాయకులు, కార్యకర్తలు, డిప్యూటీ డి ఎం హెచ్ ఓ డాక్టర్ జయశ్రీ, లాలాపేట ఆరోగ్య కేంద్రాల మెడికల్ ఆఫీసర్లు డాక్టర్ లావణ్య, డాక్టర్ వందన,  ఆరోగ్య కేంద్రం వైద్య సిబ్బంది పాల్గొన్నారు.
    user_దినేష్ కుమార్
    దినేష్ కుమార్
    సికింద్రాబాద్, హైదరాబాద్, తెలంగాణ•
    19 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.