logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

హిందూపురం పార్లమెంట్ పరిధిలోని మున్సిపాలిటీల కు సంబంధించిన పలు అంశాలపై ఎన్డీఏ కూటమి పార్టీలో ముఖ్య నాయకులతో హిందూపురం పార్లమెంటు సమన్వయకర్త మధుసూదన్ రెడ్డి ముఖ్య నాయకులతో కీలక చర్చలు నిర్వహించారు స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో హిందూపురం పార్లమెంట్ పరిధిలోని మున్సిపాలిటీలకు సంబంధించిన పలు అంశాలపై ఈరోజు అనంతపురంలోని NDA కూటమి పార్టీల ముఖ్య నాయకులతో హిందూపురం పార్లమెంట్ సమన్వయకర్త చిలకం మధుసూదన్ రెడ్డి, మడకశిర ఎమ్మెల్యే ఎమ్మెస్ రాజు కీలక చర్చలు నిర్వహించారు. ఈ సమావేశంలో రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో NDA కూటమి పార్టీల మధ్య సమన్వయంతో ముందుకు సాగడం, కూటమి అభ్యర్థులు పోటీ చేసే ప్రతి స్థానంలో విజయం సాధించేలా కార్యాచరణ రూపొందించడం వంటి అంశాలపై అదేవిధంగా కూటమి పార్టీల నాయకులు ఎక్కడెక్కడ పోటీ చేస్తారో, ఆ ప్రాంతాల్లో సమష్టిగా పనిచేసి ప్రతి ఒక్క స్థానాన్ని కైవసం చేసుకోవడంతో పాటు 100% స్ట్రైక్ రేట్ సాధించడమే లక్ష్యంగా ముందుకు సాగాలని చర్చించారు. ఈ కార్యక్రమంలో సత్యసాయి జిల్లా ఎన్నికల అబ్జర్వర్ సోముశెట్టి వెంకటేశ్వర్లు, నేషనల్ ఆల్ సెల్స్ కోఆర్డినేటర్ విష్ణువర్ధన్ గారు, బిజెపి ఎక్స్ ఎమ్మెల్యే పార్థసారధి, కోఆర్డినేషన్ టీమ్ కమిటీ సభ్యులు ఆకుల ఉమేష్ గారు, పత్తి చంద్రశేఖర్ గారు, శ్రీదేవి తదితరులు పాల్గొన్నారు.

1 day ago
user_పుట్టపర్తి మల్లికార్జున
పుట్టపర్తి మల్లికార్జున
చెన్నెకొత్తపల్లె, శ్రీ సత్య సాయి, ఆంధ్రప్రదేశ్•
1 day ago
0d554c27-4f80-478b-a2d0-12fdcad90873

హిందూపురం పార్లమెంట్ పరిధిలోని మున్సిపాలిటీల కు సంబంధించిన పలు అంశాలపై ఎన్డీఏ కూటమి పార్టీలో ముఖ్య నాయకులతో హిందూపురం పార్లమెంటు సమన్వయకర్త మధుసూదన్ రెడ్డి ముఖ్య నాయకులతో కీలక చర్చలు నిర్వహించారు స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో హిందూపురం పార్లమెంట్ పరిధిలోని మున్సిపాలిటీలకు సంబంధించిన పలు అంశాలపై ఈరోజు అనంతపురంలోని NDA కూటమి పార్టీల ముఖ్య నాయకులతో హిందూపురం పార్లమెంట్ సమన్వయకర్త చిలకం మధుసూదన్ రెడ్డి, మడకశిర ఎమ్మెల్యే ఎమ్మెస్ రాజు కీలక చర్చలు నిర్వహించారు. ఈ సమావేశంలో రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో NDA కూటమి పార్టీల మధ్య సమన్వయంతో ముందుకు సాగడం, కూటమి అభ్యర్థులు పోటీ చేసే ప్రతి స్థానంలో విజయం సాధించేలా కార్యాచరణ రూపొందించడం వంటి అంశాలపై అదేవిధంగా కూటమి పార్టీల నాయకులు ఎక్కడెక్కడ పోటీ చేస్తారో, ఆ ప్రాంతాల్లో సమష్టిగా పనిచేసి ప్రతి ఒక్క స్థానాన్ని కైవసం చేసుకోవడంతో పాటు 100% స్ట్రైక్ రేట్ సాధించడమే లక్ష్యంగా ముందుకు సాగాలని చర్చించారు. ఈ కార్యక్రమంలో సత్యసాయి జిల్లా ఎన్నికల అబ్జర్వర్ సోముశెట్టి వెంకటేశ్వర్లు, నేషనల్ ఆల్ సెల్స్ కోఆర్డినేటర్ విష్ణువర్ధన్ గారు, బిజెపి ఎక్స్ ఎమ్మెల్యే పార్థసారధి, కోఆర్డినేషన్ టీమ్ కమిటీ సభ్యులు ఆకుల ఉమేష్ గారు, పత్తి చంద్రశేఖర్ గారు, శ్రీదేవి తదితరులు పాల్గొన్నారు.

More news from ఆంధ్రప్రదేశ్ and nearby areas
  • కళ్యాణదుర్గం మున్సిపాలిటీ పరిధిలోని ముదిగల్లు గ్రామంలో చిరుత సంచారం కలకలం అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం ముదిగల్లు శివారులోని కొండపై చిరుత సంచారం కలకలం రేపింది. గమనించిన స్థానికులు భయంతో పరుగులు తీశారు. ఈ విషయాన్ని స్థానికులు ఫారెస్ట్ అధికారులకు సమాచారం ఇచ్చారు. గత కొన్ని రోజులుగా గ్రామ శివారులోని కొండ గుట్టలో చిరుతలు సంచరిస్తున్నట్లు స్థానిక ప్రజలు చెప్పారు. చిరుతల సంచారంతో రైతులు, వ్యవసాయ కూలీలు పొలాలకు వెళ్లాలంటే భయపడుతున్నారు. అటవీ శాఖ అధికారులు వెంటనే స్పందించి చిరుతల నుంచి రక్షించాలని రైతులు కోరుతున్నారు.
    1
    కళ్యాణదుర్గం మున్సిపాలిటీ పరిధిలోని ముదిగల్లు గ్రామంలో చిరుత సంచారం కలకలం
అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం ముదిగల్లు శివారులోని కొండపై చిరుత సంచారం కలకలం రేపింది. గమనించిన స్థానికులు భయంతో పరుగులు తీశారు. ఈ విషయాన్ని స్థానికులు ఫారెస్ట్ అధికారులకు సమాచారం ఇచ్చారు. గత కొన్ని రోజులుగా గ్రామ శివారులోని కొండ గుట్టలో చిరుతలు సంచరిస్తున్నట్లు స్థానిక ప్రజలు చెప్పారు. చిరుతల సంచారంతో రైతులు, వ్యవసాయ కూలీలు పొలాలకు వెళ్లాలంటే భయపడుతున్నారు. అటవీ శాఖ అధికారులు వెంటనే స్పందించి చిరుతల నుంచి రక్షించాలని రైతులు కోరుతున్నారు.
    user_Merzaa Tv
    Merzaa Tv
    Local News Reporter కళ్యాణదుర్గ్, అనంతపురం, ఆంధ్రప్రదేశ్•
    9 hrs ago
  • పులివెందుల లోని మైత్రి లే ఔట్ వినాయక స్వామి విగ్రహం వద్ద ఘర్షణ కడప జిల్లా..... పులివెందుల..... పులివెందుల లోని మైత్రి లే ఔట్ వినాయక స్వామి విగ్రహం వద్ద ఘర్షణ....... టిడిపికి చెందిన ఇద్దరు నాయకుల మధ్య ఘర్షణ..... గాలి లోకి ఒక రౌండ్ కాల్పులు చేసిన హజ్ కమిటీ డైరెక్టర్ మాహబూబ్ భాష గన్మెన్.... టిడిపి పార్టీ కి చెందిన పుష్ప నాథ్ రెడ్డి, విజయ్ కుమార్ రెడ్డి ల మధ్య ఘర్షణ...... విజయ్ కుమార్ ఇంటి వద్ద ఉన్న 3 వాహనాలు ధ్వంసం.....
    1
    పులివెందుల లోని మైత్రి లే ఔట్  వినాయక స్వామి విగ్రహం వద్ద ఘర్షణ

కడప జిల్లా.....
పులివెందుల.....
పులివెందుల లోని మైత్రి లే ఔట్  వినాయక స్వామి విగ్రహం వద్ద ఘర్షణ.......
టిడిపికి చెందిన ఇద్దరు నాయకుల మధ్య ఘర్షణ.....
గాలి లోకి ఒక రౌండ్ కాల్పులు చేసిన హజ్ కమిటీ డైరెక్టర్ మాహబూబ్ భాష గన్మెన్....
టిడిపి పార్టీ కి చెందిన పుష్ప నాథ్ రెడ్డి, విజయ్ కుమార్ రెడ్డి ల మధ్య ఘర్షణ...... 
విజయ్ కుమార్ ఇంటి వద్ద ఉన్న 3 వాహనాలు ధ్వంసం.....
    user_K. Ravi Sekhar
    K. Ravi Sekhar
    పులివెందుల, వై.ఎస్.ఆర్., ఆంధ్రప్రదేశ్•
    12 hrs ago
  • రాయదుర్గంలో అందర్నీ ఆకట్టుకున్న స్కూలుకు వెళ్తున్న గణనాథుడి ప్రతిమ రాయదుర్గం పట్టణంలో నిన్నటి దినం వివిధ ఆకృతులలో గణనాథులు కొలువు తీరాయి. అందులో భాగంగానే రైల్వే స్టేషన్ సమీపాన వరసిద్ధి వినాయక గ్రూప్ వారు ఏర్పాటు చేసిన ప్రత్యేక గణనాథుడు అందరినీ ఆకట్టుకున్నాడు. వీపుకి బ్యాగు తగిలించుకొని, యూనిఫామ్ దుస్తులు ధరించి చేతిలో వాటర్ బాటిల్ ధరించిన గణనాథుడు అందరిని ఆకట్టుకున్నారు. ప్రతి ఏటా ఏదో ఒక ప్రత్యేక విధానంలో గణనాథులను వరసిద్ధి వినాయక సంఘం సభ్యులు గణనాధులను కొలువు తీరుస్తున్నారు.
    1
    రాయదుర్గంలో అందర్నీ ఆకట్టుకున్న స్కూలుకు వెళ్తున్న గణనాథుడి ప్రతిమ
రాయదుర్గం పట్టణంలో నిన్నటి దినం వివిధ ఆకృతులలో గణనాథులు కొలువు తీరాయి. అందులో భాగంగానే రైల్వే స్టేషన్ సమీపాన వరసిద్ధి వినాయక గ్రూప్ వారు ఏర్పాటు చేసిన ప్రత్యేక గణనాథుడు అందరినీ ఆకట్టుకున్నాడు. వీపుకి బ్యాగు తగిలించుకొని, యూనిఫామ్ దుస్తులు ధరించి చేతిలో వాటర్ బాటిల్ ధరించిన గణనాథుడు అందరిని ఆకట్టుకున్నారు. ప్రతి ఏటా ఏదో ఒక ప్రత్యేక విధానంలో గణనాథులను వరసిద్ధి వినాయక సంఘం సభ్యులు గణనాధులను కొలువు తీరుస్తున్నారు.
    user_PHANI JOURNALIST
    PHANI JOURNALIST
    Local News Reporter రాయదుర్గం, అనంతపురం, ఆంధ్రప్రదేశ్•
    10 hrs ago
  • వెలుగోడు నుంచి రోజుకు 4 వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేసి తెలుగు గంగ SR1, SR2 లను నింపాలి - రైతు సేవా సమితి డిమాండ్ కడప జిల్లాలో నీరు లేకుండా అడుగంటిపోయిన తెలుగు గంగ SR1, SR2 ప్రాజెక్టులకు వెలుగోడు నుండి రోజుకు నాలుగు వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేసి, కడప జిల్లా ప్రజలకు, రైతులకు తాగునీటి సమస్యలు లేకుండా చూడాలని రైతు సేవా సమితి కడప జిల్లా సమితి డిమాండ్ చేసింది. రైతు సేవా సమితి ఆధ్వర్యంలో సెప్టెంబర్ 1వ తేదీ నుండి కడప జిల్లా రైతులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం కోసం నిర్వహిస్తున్న "రైతు గ్రామబాట" కార్యక్రమం ఈరోజు 15వ రోజుకు చేరుకుంది. ఇందులో భాగంగా ఈరోజు మైదుకూరు ఎమ్మార్వో కార్యాలయ ఆవరణలో నిరసన తెలియజేసి, ఎమ్మార్వో గారు లేకపోవడంతో డిప్యూటీ ఎమ్మార్వో నరసింహ గారికి వినతి పత్రాన్ని అందజేసి రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేయాలని కోరారు. ఏలినో ప్రభావంతో జిల్లాలో ఈ సంవత్సరం వర్షాలు లేక నష్టపోతున్న రైతులను ఆదుకునేందుకు కడప జిల్లాను కరువు జిల్లాగా ప్రకటించి, ప్రతి రైతు కుటుంబానికి రూ.30 వేలు సహాయం అందించాలని, అలాగే జిల్లాలో పెండింగ్‌లో ఉన్న రాజోలి, జొలదరాశి, తెలుగు గంగ తదితర సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేసేందుకు నిధులు కేటాయించాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ కార్యక్రమంలో రైతు సేవా సమితి మైదుకూరు నియోజకవర్గ కార్యదర్శి మాడి శెట్టి సహదేవుడు, మైదుకూరు పట్టణ, మండల నాయకులు, రైతులు దాశ రెడ్డి గారి సుబ్బరాయుడు, రాజా, మూలే రామచంద్రారెడ్డి, కోటయ్య గారి గుర్రప్ప, రాజాల రామచంద్రుడు, పసల పుల్లయ్య, అంకిరెడ్డిపల్లి నారాయణరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
    1
    వెలుగోడు నుంచి రోజుకు 4 వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేసి తెలుగు గంగ SR1, SR2 లను నింపాలి - రైతు సేవా సమితి డిమాండ్
కడప జిల్లాలో నీరు లేకుండా అడుగంటిపోయిన తెలుగు గంగ SR1, SR2 ప్రాజెక్టులకు వెలుగోడు నుండి రోజుకు నాలుగు వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేసి, కడప జిల్లా ప్రజలకు, రైతులకు తాగునీటి సమస్యలు లేకుండా చూడాలని రైతు సేవా సమితి కడప జిల్లా సమితి డిమాండ్ చేసింది.
రైతు సేవా సమితి ఆధ్వర్యంలో సెప్టెంబర్ 1వ తేదీ నుండి కడప జిల్లా రైతులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం కోసం నిర్వహిస్తున్న "రైతు గ్రామబాట" కార్యక్రమం ఈరోజు 15వ రోజుకు చేరుకుంది. ఇందులో భాగంగా ఈరోజు మైదుకూరు ఎమ్మార్వో కార్యాలయ ఆవరణలో నిరసన తెలియజేసి, ఎమ్మార్వో గారు లేకపోవడంతో డిప్యూటీ ఎమ్మార్వో నరసింహ గారికి వినతి పత్రాన్ని అందజేసి రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేయాలని కోరారు.
ఏలినో ప్రభావంతో జిల్లాలో ఈ సంవత్సరం వర్షాలు లేక నష్టపోతున్న రైతులను ఆదుకునేందుకు కడప జిల్లాను కరువు జిల్లాగా ప్రకటించి, ప్రతి రైతు కుటుంబానికి రూ.30 వేలు సహాయం అందించాలని, అలాగే జిల్లాలో పెండింగ్‌లో ఉన్న రాజోలి, జొలదరాశి, తెలుగు గంగ తదితర సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేసేందుకు నిధులు కేటాయించాలని ప్రభుత్వాన్ని కోరారు.
ఈ కార్యక్రమంలో రైతు సేవా సమితి మైదుకూరు నియోజకవర్గ కార్యదర్శి మాడి శెట్టి సహదేవుడు, మైదుకూరు పట్టణ, మండల నాయకులు, రైతులు దాశ రెడ్డి గారి సుబ్బరాయుడు, రాజా, మూలే రామచంద్రారెడ్డి, కోటయ్య గారి గుర్రప్ప, రాజాల రామచంద్రుడు, పసల పుల్లయ్య, అంకిరెడ్డిపల్లి నారాయణరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
    user_VEMULURIMALAKONDAIAH
    VEMULURIMALAKONDAIAH
    Hindu temple ఖాజీపేట, వై.ఎస్.ఆర్., ఆంధ్రప్రదేశ్•
    5 hrs ago
  • గణేశులను భక్తిశ్రద్ధలతో దర్శించుకున్న గుమ్మనూరు నారాయణ, కమలమ్మ గణేశులను భక్తిశ్రద్ధలతో దర్శించుకున్న గుమ్మనూరు నారాయణ, కమలమ్మ గుంతకల్లు, సెప్టెంబర్ 15: వినాయక చవితి సందర్భంగా అనంతపురం జిల్లా గుంతకల్లు పట్టణంలోని వివిధ ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన గణేశ విగ్రహాలను ఆలూరు నియోజకవర్గ బీజేపీ బీఎల్‌ఓ-1 గుమ్మనూరు నారాయణ, గుమ్మనూరు కమలమ్మ మంగళవారం భక్తిశ్రద్ధలతో దర్శించుకున్నారు. గుంతకల్లు పట్టణానికి చెందిన ప్రదీప్‌ ప్రత్యేక ఆహ్వానం మేరకు ఆయన ఏర్పాటు చేసిన గణేశ మండపాన్ని సందర్శించిన గుమ్మనూరు నారాయణ, కమలమ్మ ప్రత్యేక పూజలు నిర్వహించి స్వామివారికి హారతి ఇచ్చారు. అనంతరం నిర్వాహకులను అభినందించారు. ఈ సందర్భంగా ప్రదీప్ ఏర్పాటు చేసిన గణేశ విగ్రహానికి గుమ్మనూరు నారాయణ రూ.50,000 విరాళాన్ని అందజేశారు. మరో గణేశ విగ్రహం నిర్వాహకులకు రూ.5,000 విరాళం అందించారు. వినాయక ఉత్సవాలు భక్తిశ్రద్ధలతో, ప్రశాంత వాతావరణంలో నిర్వహించుకోవాలని ఈ సందర్భంగా ఆయన ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో గుంతకల్లు పట్టణ యువత, గుమ్మనూరు నారాయణ అభిమానులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
    2
    గణేశులను భక్తిశ్రద్ధలతో దర్శించుకున్న గుమ్మనూరు నారాయణ, కమలమ్మ

గణేశులను భక్తిశ్రద్ధలతో దర్శించుకున్న గుమ్మనూరు నారాయణ, కమలమ్మ
గుంతకల్లు, సెప్టెంబర్ 15: వినాయక చవితి సందర్భంగా అనంతపురం జిల్లా గుంతకల్లు పట్టణంలోని వివిధ ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన గణేశ విగ్రహాలను ఆలూరు నియోజకవర్గ బీజేపీ బీఎల్‌ఓ-1 గుమ్మనూరు నారాయణ, గుమ్మనూరు కమలమ్మ మంగళవారం భక్తిశ్రద్ధలతో దర్శించుకున్నారు.
గుంతకల్లు పట్టణానికి చెందిన ప్రదీప్‌ ప్రత్యేక ఆహ్వానం మేరకు ఆయన ఏర్పాటు చేసిన గణేశ మండపాన్ని సందర్శించిన గుమ్మనూరు నారాయణ, కమలమ్మ ప్రత్యేక పూజలు నిర్వహించి స్వామివారికి హారతి ఇచ్చారు. అనంతరం నిర్వాహకులను అభినందించారు.
ఈ సందర్భంగా ప్రదీప్ ఏర్పాటు చేసిన గణేశ విగ్రహానికి గుమ్మనూరు నారాయణ రూ.50,000 విరాళాన్ని అందజేశారు. మరో గణేశ విగ్రహం నిర్వాహకులకు రూ.5,000 విరాళం అందించారు. వినాయక ఉత్సవాలు భక్తిశ్రద్ధలతో, ప్రశాంత వాతావరణంలో నిర్వహించుకోవాలని ఈ సందర్భంగా ఆయన ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో గుంతకల్లు పట్టణ యువత, గుమ్మనూరు నారాయణ అభిమానులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
    user_చక్రం
    చక్రం
    Farmer ఆలూరు, కర్నూలు, ఆంధ్రప్రదేశ్•
    2 hrs ago
  • రామసముద్రం: హంద్రీనీవా కోసం వినతిపత్రం ఇచ్చేందుకు రైతాంగం కదలిక రావాలి మండలానికి హంద్రీ–నీవా సుజల స్రవంతి నీటి కనెక్టివిటీ కల్పించాలని డిమాండ్‌ చేస్తూ రైతాంగం కదులుతోంది. ఇందులో భాగంగా ఈ నెల 16న ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు రామసముద్రం తహశీల్దార్‌ కార్యాలయంలో వినతిపత్రం సమర్పించనున్నట్లు హంద్రీ–నీవా ఉద్యమకారులు తెలిపారు. కార్యక్రమాన్ని శాంతియుతంగా నిర్వహించేందుకు ముందస్తు సమాచారం అందిస్తూ రామసముద్రం పోలీస్‌స్టేషన్‌లో అనుమతి కోసం వినతిపత్రం సమర్పించినట్లు పేర్కొన్నారు. మండలంలోని రైతులు రాజకీయాలకు అతీతంగా ఏకతాటిపైకి వచ్చి కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. మండలంలోని చెరువులకు హంద్రీ–నీవా జలాల కనెక్టివిటీ సాధిస్తే తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం లభించడంతోపాటు సాగునీరు, భూగర్భ జలాల పెంపునకు దోహదపడుతుందని తెలిపారు.
    1
    రామసముద్రం: హంద్రీనీవా కోసం వినతిపత్రం ఇచ్చేందుకు రైతాంగం కదలిక రావాలి
మండలానికి హంద్రీ–నీవా సుజల స్రవంతి నీటి కనెక్టివిటీ కల్పించాలని డిమాండ్‌ చేస్తూ రైతాంగం కదులుతోంది. ఇందులో భాగంగా ఈ నెల 16న ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు రామసముద్రం తహశీల్దార్‌ కార్యాలయంలో వినతిపత్రం సమర్పించనున్నట్లు హంద్రీ–నీవా ఉద్యమకారులు తెలిపారు. కార్యక్రమాన్ని శాంతియుతంగా నిర్వహించేందుకు ముందస్తు సమాచారం అందిస్తూ రామసముద్రం పోలీస్‌స్టేషన్‌లో అనుమతి కోసం వినతిపత్రం సమర్పించినట్లు పేర్కొన్నారు. మండలంలోని రైతులు రాజకీయాలకు అతీతంగా ఏకతాటిపైకి వచ్చి కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. మండలంలోని చెరువులకు హంద్రీ–నీవా జలాల కనెక్టివిటీ సాధిస్తే తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం లభించడంతోపాటు సాగునీరు, భూగర్భ జలాల పెంపునకు దోహదపడుతుందని తెలిపారు.
    user_SR
    SR
    రామసముద్రం, అన్నమయ్య, ఆంధ్రప్రదేశ్•
    7 hrs ago
  • వేపచీరల తో మొక్కులు తీర్చుకున్న భక్తులు..ఘనంగా ప్రారంభం అయిన వేడుకలు రాయదుర్గం పట్టణం మధు సినిమా థియేటర్ సమీపాన వెలసిన మహిమాన్విత దుగ్గిలమ్మ జాతర వేడుకలు వైభవంగా ప్రారంభం అయ్యాయి.ఉదయం నాలుగు గంటల నుండే అమ్మవారి దర్శనానికి భక్తులను అనుమతించారు.వేపాచీరలతో భక్తులు పెద్ద ఎత్తున వారి వారి మొక్కులను తీర్చుకున్నారు.ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా అర్బన్ సీఐ దేవానంద్ ఆధ్వర్యంలో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు.అమ్మవారు భక్తులకు ప్రత్యేక అలంకరణలో దర్శనం ఇచ్చింది.
    1
    వేపచీరల తో మొక్కులు తీర్చుకున్న భక్తులు..ఘనంగా ప్రారంభం అయిన వేడుకలు
రాయదుర్గం పట్టణం మధు సినిమా థియేటర్ సమీపాన వెలసిన మహిమాన్విత దుగ్గిలమ్మ జాతర వేడుకలు వైభవంగా ప్రారంభం అయ్యాయి.ఉదయం నాలుగు గంటల నుండే అమ్మవారి దర్శనానికి భక్తులను అనుమతించారు.వేపాచీరలతో భక్తులు పెద్ద ఎత్తున వారి వారి మొక్కులను తీర్చుకున్నారు.ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా అర్బన్ సీఐ దేవానంద్ ఆధ్వర్యంలో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు.అమ్మవారు భక్తులకు ప్రత్యేక అలంకరణలో దర్శనం ఇచ్చింది.
    user_PHANI JOURNALIST
    PHANI JOURNALIST
    Local News Reporter రాయదుర్గం, అనంతపురం, ఆంధ్రప్రదేశ్•
    12 hrs ago
  • పులివెందుల పట్టణంలోని మైత్రి లేఔట్లో అర్ధరాత్రి ఇరు వర్గాల ఘర్షణ సీసీ ఫుటేజ్ కడప జిల్లా పులివెందుల పట్టణంలోని మైత్రి లేఔట్లో అర్ధరాత్రి ఇరు వర్గాల మధ్య తీవ్ర ఘర్షణ చోటుచేసుకున్న విషయం తెలిసిందే. ఈ ఘటనకు సంబంధించిన సీసీ టీవీ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఓ నాయకుడి ఇంటి వద్దకు జనాలు గుంపుగా వెళ్లి కర్రలతో వాహనాలను ధ్వంసం చేస్తున్న దృశ్యాలు సీసీ ఫుటేజ్లో చూడవచ్చు. విషయం తెలుసుకున్న పోలీసులు మెరుపు వేగంతో ఘటనా స్థలానికి చేరుకుని జనాలను చల్లాచెదురు చేశారు.
    1
    పులివెందుల పట్టణంలోని మైత్రి లేఔట్లో అర్ధరాత్రి ఇరు వర్గాల ఘర్షణ సీసీ ఫుటేజ్
కడప జిల్లా పులివెందుల పట్టణంలోని మైత్రి లేఔట్లో అర్ధరాత్రి ఇరు వర్గాల మధ్య తీవ్ర ఘర్షణ చోటుచేసుకున్న విషయం తెలిసిందే. ఈ ఘటనకు సంబంధించిన సీసీ టీవీ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్
అవుతున్నాయి. ఓ నాయకుడి ఇంటి వద్దకు జనాలు గుంపుగా వెళ్లి కర్రలతో వాహనాలను ధ్వంసం చేస్తున్న దృశ్యాలు  సీసీ ఫుటేజ్లో చూడవచ్చు. విషయం
తెలుసుకున్న పోలీసులు మెరుపు వేగంతో ఘటనా స్థలానికి చేరుకుని జనాలను చల్లాచెదురు చేశారు.
    user_LAKKU SIVA SANKAR reddy
    LAKKU SIVA SANKAR reddy
    Court reporter పులివెందుల, వై.ఎస్.ఆర్., ఆంధ్రప్రదేశ్•
    9 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.