లంచం తీసుకుంటూ ACB కి చిక్కిన లైన్‌మన్ పల్నాడు జిల్లా నకరికల్లు మండలం చేజర్ల గ్రామంలో అవినీతి నిరోధక శాఖ ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించి లైన్‌మన్ నక్కబోయిన నాగేంద్రబాబును పట్టుకున్నారు. చేజర్లకు చెందిన గుండాల యోహాన్ తన పొలంలో ట్రాన్స్‌ఫార్మర్ ఏర్పాటు చేయాలని కోరగా, ఇందుకు నాగేంద్రబాబు రూ. 70 వేలు లంచం డిమాండ్ చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. లైన్ మెన్ గా విధులు నిర్వహిస్తున్న అతడు తన తండ్రి ద్వారా డబ్బుల లావాదేవీలు జరిపినట్లు ఏసీబీ అధికారులు వెల్లడించారు. డబ్బుల డిమాండ్‌తో విసిగిపోయిన రైతు విజయవాడలోని ఏసీబీ కార్యాలయాన్ని ఆశ్రయించి ఫిర్యాదు చేయడంతో అధికారులు పక్కా ప్రణాళికతో కాపుకాసి లంచం స్వీకరిస్తుండగా అదుపులోకి తీసుకున్నారు. ఏసీబీ ఎస్పీ మహేంద్ర మత్తె ఆధ్వర్యంలో ముగ్గురు సీఐలు, ఎస్ఐలు దాడుల్లో పాల్గొన్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

- Post by మీ శ్రేయోభిలాషి1
- బద్వేలు : మల్లా రెడ్డి వయస్సు 80 సం,, అను వ్యక్తి వై. ఎస్. ఆర్ కడప జిల్లా బద్వేలు మండలంలోని గొడుగునూరు గ్రామం నందు సగిలేరు చెక్ డ్యామ్ నందు నీటిలో ప్రమాదవసత్తు పడి చనిపోయారు. చెక్ డ్యామ్ నీటిలో నుండి బాడీ ని తిసి పోలీస్ వారికి S. F. O బద్వేలు ఫైర్ సిబ్బంది అప్పగించారు. వివరాలు లోకి వెళ్తే పుట్టాయిపల్లె పంచాయతీ గొడుగునూరు గ్రామంలో ఉండే బైసాని మల్లారెడ్డి వయసు( 80 )సంవత్సరాలు నీటిలో ప్రమాదవసత్తు పడి మరణించారు.ఆయనకి ఇద్దరు కుమారులు ఇద్దరు కుమార్తెలు. ఆయన పెద్ద అల్లుడు వంకెల పెద్దపోలి రెడ్డి ప్రముఖ వైఎస్ఆర్సిపి రాష్ట్ర సంయుక్త కార్యదర్శి గా . ఆయన అన్నకుమారుడు ప్రస్తుతం బైసాని ప్రతాప్ రెడ్డి కడప జిల్లా తెలుగుదేశం పార్లమెంటరీ ఆర్గనైజింగ్ సెక్రటరీగా ఉన్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది..1
- Post by Chand Basha (సప్తమందిర సముదాయం) official1
- తిరుపతి నడిబొడ్డు లక్ష్మీపురం సర్కిల్ వద్ద అగ్ని ప్రమాదం. ఈ ప్రమాదంలో ఎవరికి ఎటువంటి ప్రాణహాని లేకపోవడం చాలా సంతోషకరమైన విషయం అని స్థానికులు తెలియజేస్తున్నారు.1
- కడప అల్లాహ్ 23 24 251
- పాములపాడు లో కులాంతర వివాహం చేసిన ఎమ్మార్పీఎస్ మరియు మాల మహానాడు నాయకులు కోటా ప్రభాకర్ మాదిగ, నల్లమల్ల అబ్రహం మాల నంద్యాల జిల్లా ఎమ్ ఎస్ పి అధికార ప్రతినిధి మరియు నందికొట్కూరు నియోజకవర్గ ఎమ్మార్పీఎస్ అనుబంధ సంఘాల ఇన్చార్జి కోట ప్రభాకర్ మాదిగారు మరియు మాల మహానాడు జాతీయ నాయకులు నల్లమల్ల అబ్రహం మాల గార్ల సమక్షంలో పాములపాడు మండల కేంద్రం చౌడమ్మ గుడి దగ్గర ఎరుకల కులానికి చెందిన దినారి రామకృష్ణ కొడుకు వేణుగోపాల్ నందికొట్కూరు మారుతి నగర్ కు చెందినటువంటి ఓనమాల లక్ష్మీదేవి కుమార్తె శ్రావణి ఇద్దరు గత నాలుగు సంవత్సరాల నుంచి ప్రేమించుకుంటున్నారు. ఫిబ్రవరి 13వ తారీకు అబ్బాయి అమ్మాయి ఇంట్లో నుంచి వెళ్ళిపోయి పోలీస్ స్టేషన్ కి వెళ్లడంతో ఈ విషయం తెలుసుకున్న పెద్దలు కులాలు వేరు కావడంతో ఇరుకుటుంబంలో కొంతవరకు ఘర్షణ వాతావరణం నెలకొంది. అమ్మాయి అబ్బాయికి కొన్ని రోజులు కౌన్సెలింగ్కు పంపించారు. అయినా మేము ఒకరికి ఒకరు ఇష్టపడ్డాం మేం కలిసే ఉంటాం అని చెప్పడంతో అమ్మాయి అబ్బాయి ఇద్దరు మేజర్లు కావడంతో రెండు కులాల పెద్దల తో మాట్లాడి వారికి కులాంతర వివాహాన్ని జరిపించడం జరిగింది. ఈ కార్యక్రమంలో నందికొట్కూరు నియోజకవర్గం ఎమ్మార్పీఎస్ సీనియర్ నాయకులు , జడల శ్రీనివాసులు మాదిగారు, మిడుతూరు మండల ఇంచార్జ్ భూపనుపాడు సతీష్ మాదిగ గారు, మిడుతూరు మండలం ఎమ్మెస్పీ అధ్యక్షులు గోపాల వెంకటరమణ గారు, పాములపాడు మండలం ఎమ్మార్పీఎస్ ఉపాధ్యక్షులు కనకం మరిస్వామి గారు చవిటి వెంకటరమణ మరియు ఎరుకల సంఘం కుల పెద్దలు ఎంఆర్పిఎస్ నాయకులు పాల్గొనడం జరిగింది.5
- పులిచెర్ల మండలం కల్లూరు, పాల్యం పంచాయతీలలో ప్రతిరోజు వేకువజామున ఒంటరి ఏనుగు పంటలపై దాడి చేస్తుందని బుధవారం స్థానిక ప్రజలు, రైతులు తెలిపారు. ఈ దాడిలో మామిడి, టమోటా పంటలకు అపార నష్టం వాటిల్లుతోందని, ఏనుగు సమీపంలోని అటవీ ప్రాంతంలోకి వెళ్లిపోతుందని వారు పేర్కొన్నారు. ఏనుగు దారి మళ్ళించడానికి అధికారులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.1
- బద్వేలు:రంజాన్ పవిత్ర మాసం ప్రారంభం కావడంతో బద్వేలు పట్టణంలోని పెద్ద మజీద్ ను మునిసిపల్ కమీషనర్ నరసింహారెడ్డి సందర్శించారు.ఈ సందర్భంగా మసీదు పరిసరాలను పరిశీలించిన కమీషనర్ నరసింహారెడ్డి, మత పెద్దల విజ్ఞప్తి మేరకు రంజాన్ మాసం మొత్తం లైటింగ్, శానిటేషన్, వాటర్ సప్లై సంబంధిత ఎలాంటి సమస్యలు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.ముఖ్యంగా రాత్రి ప్రార్థనల సమయంలో సరిపడా వీధి దీపాలు పనిచేసేలా చూడాలని, మసీదు చుట్టుపక్కల పారిశుధ్య పనులు క్రమం తప్పకుండా నిర్వహించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో శానిటేషన్ ఇంచార్జి ఇన్స్పెక్టర్ రమణయ్య, ఇంచార్జి టిపిబిఓ నరసయ్య ముస్లిం మత పెద్దలు మహుబూబ్ భాష (బిగ్ బాస్), నూరుల్లా, మస్తాన్ మౌలాలి, భాష తదితరులు పాల్గొన్నారు.1