గుమ్మనూరులో అంబరాన్నంటిన వినాయక సంబరాలు యువత, చిన్నారులకు ఆటల పోటీలు.. విజేతలకు బహుమతులు గుమ్మనూరులో అంబరాన్నంటిన వినాయక సంబరాలు యువత, చిన్నారులకు ఆటల పోటీలు.. విజేతలకు బహుమతులు గుమ్మనూరు, సెప్టెంబర్ 15: ఆలూరు నియోజకవర్గంలోని చిప్పగిరి మండలం గుమ్మనూరు గ్రామంలో వినాయక చవితి వేడుకలు మంగళవారం అంగరంగ వైభవంగా నిర్వహించారు. గుమ్మనూరు నారాయణ ఆధ్వర్యంలో, గుమ్మనూరు పి. బసప్ప సహకారంతో నిర్వహించిన వినాయక ఉత్సవాలు భక్తిశ్రద్ధలతో పాటు సందడి వాతావరణంలో కొనసాగాయి. ఈ సందర్భంగా గ్రామంలోని యువత, చిన్నారులు, మహిళలను ఉత్సాహపరిచేలా వివిధ రకాల ఆటల పోటీలు నిర్వహించారు. చిన్నారులు, యువత ఉత్సాహంగా పోటీల్లో పాల్గొని తమ ప్రతిభను ప్రదర్శించారు. పోటీల్లో విజయం సాధించిన వారికి గ్రామ పెద్దలు, నిర్వాహకుల చేతుల మీదుగా వివిధ రకాల బహుమతులను అందజేశారు. వినాయక చవితి సందర్భంగా గ్రామంలోని వినాయక మండపాల వద్ద ప్రత్యేక పూజలు, భక్తి కార్యక్రమాలు నిర్వహించారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. గ్రామంలో పండుగ వాతావరణం నెలకొనడంతో చిన్నారులు, యువత, మహిళలు ఉత్సాహంగా వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా గుమ్మనూరు నారాయణ మాట్లాడుతూ.. వినాయక చవితి పండుగను గ్రామ ప్రజలంతా ఐకమత్యంతో, భక్తిశ్రద్ధలతో జరుపుకోవడం ఆనందంగా ఉందన్నారు. యువత, చిన్నారుల్లో ఉత్సాహాన్ని పెంపొందించడంతో పాటు గ్రామంలో సోదరభావం, ఐక్యతను చాటేలా ఇటువంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో గ్రామ పెద్దలు, యువకులు, మహిళలు, భక్తులు, ఉత్సవ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
గుమ్మనూరులో అంబరాన్నంటిన వినాయక సంబరాలు యువత, చిన్నారులకు ఆటల పోటీలు.. విజేతలకు బహుమతులు గుమ్మనూరులో అంబరాన్నంటిన వినాయక సంబరాలు యువత, చిన్నారులకు ఆటల పోటీలు.. విజేతలకు బహుమతులు గుమ్మనూరు, సెప్టెంబర్ 15: ఆలూరు నియోజకవర్గంలోని చిప్పగిరి మండలం గుమ్మనూరు గ్రామంలో వినాయక చవితి వేడుకలు మంగళవారం అంగరంగ వైభవంగా నిర్వహించారు. గుమ్మనూరు నారాయణ ఆధ్వర్యంలో, గుమ్మనూరు పి. బసప్ప సహకారంతో నిర్వహించిన వినాయక ఉత్సవాలు భక్తిశ్రద్ధలతో పాటు సందడి వాతావరణంలో కొనసాగాయి. ఈ సందర్భంగా గ్రామంలోని యువత, చిన్నారులు, మహిళలను ఉత్సాహపరిచేలా వివిధ రకాల ఆటల పోటీలు నిర్వహించారు. చిన్నారులు, యువత ఉత్సాహంగా పోటీల్లో పాల్గొని తమ ప్రతిభను ప్రదర్శించారు. పోటీల్లో విజయం సాధించిన వారికి గ్రామ పెద్దలు, నిర్వాహకుల చేతుల
మీదుగా వివిధ రకాల బహుమతులను అందజేశారు. వినాయక చవితి సందర్భంగా గ్రామంలోని వినాయక మండపాల వద్ద ప్రత్యేక పూజలు, భక్తి కార్యక్రమాలు నిర్వహించారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. గ్రామంలో పండుగ వాతావరణం నెలకొనడంతో చిన్నారులు, యువత, మహిళలు ఉత్సాహంగా వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా గుమ్మనూరు నారాయణ మాట్లాడుతూ.. వినాయక చవితి పండుగను గ్రామ ప్రజలంతా ఐకమత్యంతో, భక్తిశ్రద్ధలతో జరుపుకోవడం ఆనందంగా ఉందన్నారు. యువత, చిన్నారుల్లో ఉత్సాహాన్ని పెంపొందించడంతో పాటు గ్రామంలో సోదరభావం, ఐక్యతను చాటేలా ఇటువంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో గ్రామ పెద్దలు, యువకులు, మహిళలు, భక్తులు, ఉత్సవ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
- గణపతిని తెస్తుండగా జరిగిన దుర్ఘటన పటాస్ లకు దూరంగా ఉండండి డీజే మరియు త్రా గుడ కు ప్రమాదకర మైన వాటికి దూరంగా ఉండండి విషయం పటాస్ ల దాటికి సౌండ్ దాటికి లైటింగ్ దాటికి డ్రైవర్ కి కనబడక ఈ విషాదం జరిగింది అందరూ అన్నిటికీ దూరంగా ఉండి జాగ్రత్త వహించాలని కో రడ మై నది4
- భారత్ మాల రోడ్డు నుండి రాజోలి మండల కేంద్రానికి వెళ్లేందుకు కనెక్టివిటీ రోడ్డు నిర్మించాలి. రాజోలి మీదుగా వెళ్తున్న భారత్‌మాల రోడ్డు నిర్మాణ పనులు దాదాపు పూర్తయ్యాయని అయితే మండల కేంద్రమైన రాజోలికి కనెక్టివిటీ రోడ్డు లేకుండా నిర్మాణం జరుగుతోందని మండల కేంద్రానికి తప్పనిసరిగా కనెక్టివిటీ రోడ్డు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ రాజోలి గ్రామస్తులు భారత్‌మాల రోడ్డుపై బైఠాయించి నిరసన వ్యక్తం చేస్తూ నిరంతరాయంగా మండల కేంద్రానికి ప్రజలు రాత్రి పగలు అని తేడా లేకుండా రాకపోకలు సాగిస్తుంటారు కాబట్టి మండల కేంద్రానికి కనెక్టివ్ రోడ్డు ను నిర్మించాలని డిమాండ్ చేశారు.1
- వినాయక నిమజ్జనం వేడుకలు ప్రశాంతంగా జరుపుకోవాలి. డిజెలకు అనుమతి లేదు గణేష్ నిమజ్జన ఉత్సవాలు ప్రశాంతంగా జరుపుకోవాలని మహానంది ఎస్ఐఎన్ రామ్మోహన్ రెడ్డి సూచించారు. మంగళవారం అర్ధరాత్రి మహానంది మండలంలోని మండపాల నిర్వాహకులతో పలు సూచనలు చేశారు. నిమజ్జనాల సమయంలో డీజే లకు అనుమతి లేదన్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా జాగ్రత్తలు పాటించాలన్నారు. పోలీసుల సూచనలు పాటిస్తూ నిమజ్జన వేడుకలు జరుపుకోవాలని అన్నారు.1
- జూపాడుబంగ్లా మండల పరిధిలోని పోతిరెడ్డిపాడు 9వ గేటు మరమ్మతు పనులు పూర్తి జూపాడు బంగ్లా మండల పరిధిలోని పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ వద్ద 9వ గేటుకు అధికారులు మరమ్మతు పనులు చేపట్టారు. రూ.2.40 లక్షలతో మరమతు పనులు పూర్తి చేసినట్లు ఇరిగేషన్ అధికారులు వెల్లడించారు. భవిష్యత్తులో రైతులకు ఎటువంటి తాగునీటి ఇబ్బందులు తలెత్తకుండా ఈ సమస్యకు ఉన్నతాధికారుల సహకారంతో సమస్యకు పరిష్కారం చూసినట్లు ఇరిగేషన్ అధికారులు తెలిపారు.1
- వినాయక నిమజ్జన ఘాట్‌లను పరిశీలించిన జిల్లా ఎస్పీ శ్రీ సునీల్ షొరాణ్, అవాంఛనీయ సంఘటనలకు తావులేకుండా పటిష్ట భద్రతా చర్యలు చేపట్టాలని అధికారులకు ఆదేశం.. వినాయక నిమజ్జనం కార్యక్రమాలు ప్రశాంత వాతావరణంలో, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా నిర్వహించేందుకు జిల్లా పోలీస్ శాఖ ముందస్తు చర్యలు చేపడుతోంది. ఈ నేపథ్యంలో జిల్లా ఎస్పీ సునీల్ షొరాణ్, ఆత్మకూరు సబ్ డివిజన్ పరిధిలోని వెలుగోడు, ఆత్మకూరు, పాములపాడు జూపాడుబంగ్లా మొదలగు పోలీస్ స్టేషన్ల పరిధిలో ఉన్న వినాయక నిమజ్జన ఘాట్‌లను, మరియు ఊరేగింపు జరిగే ప్రధాన ప్రాంతాలను స్వయంగా ఎస్పీ సందర్శించి భద్రతా ఏర్పాట్లను పరిశీలించారు. నిమజ్జన ఘాట్‌ల వద్ద ఏర్పాటు చేసిన భద్రతా చర్యలు, ప్రజల రాకపోకలు, వాహనాల నియంత్రణ, పోలీస్ బందోబస్తు తదితర అంశాలపై సంబంధిత అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. వినాయక నిమజ్జనం సందర్భంగా భక్తులు, ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తగిన చర్యలు చేపట్టాలని, ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేయాలని జిల్లా ఎస్పీ సంబంధిత పోలీస్ అధికారులను ఆదేశించారు. నిమజ్జన కార్యక్రమాలు సజావుగా జరిగేలా ఘాట్‌ల వద్ద నిరంతరం పోలీస్ సిబ్బంది అందుబాటులో ఉండాలని, రద్దీని క్రమబద్ధీకరించడంతో పాటు ప్రజల భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. అలాగే నిమజ్జన కార్యక్రమాల్లో పాల్గొనే ప్రజలు పోలీసులకు సహకరించి, పోలీస్ శాఖ సూచించిన భద్రతా నిబంధనలను పాటించాలని జిల్లా ఎస్పీ గారు కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ గారితో పాటు ఆత్మకూరు డిఎస్పి రామంజి నాయక్ గారు ,స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ అశోక్, సంబంధిత పోలీస్ అధికారులు పాల్గొన్నారు.2
- వినాయక చవితి వేడుకల సందర్భంగా బద్వేల్లో జబర్దస్త్ కళాకారుల సందడి వినాయక చవితి వేడుకల సందర్భంగా బద్వేల్ పట్టణానికి ప్రముఖ జబర్దస్త్ కళాకారుల బృందం విచ్చేసింది. పట్టణంలోని శేఖర్ రాయల్ నివాసంలో ఏర్పాటు చేసిన వినాయక మండపాన్ని సందర్శించిన కళాకారులు, స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం స్థానిక భక్తులు, అభిమానులతో సరదాగా ముచ్చటిస్తూ హాస్య ప్రదర్శనలతో అలరించారు. శేఖర్ రాయల్ కుటుంబసభ్యులు జబర్దస్త్ బృందాన్ని ఘనంగా సత్కరించి జ్ఞాపికలను అందజేశారు.1
- మీడియా పై దౌర్జన్యాన్ని పరిశీలించండి ప్రతి ఒక సమస్య తెలిపేది మీడియా అలాంటి మీడియాని అనగా తొ క్కాల ని చూస్తే మీడియా మిత్రులకు పాత్రికేయులకు అని అర్థం పోతుంది విషయం ఎంత ప్రమాదం ఉన్న కవరేజ్ కి వెళ్లే వాళ్ళం ఆ విషయాలు తెలియజేసే వాళ్ళం మాపై దౌర్జన్యానికి వస్తే ఇంకెవరు తెలియజేస్తారు అందుకని మాకు రక్షణ కల్పించండి ప్రభుత్వాలని కోరేది మీడియా మిత్రులు1
- నందికొట్కూరు మున్సిపాలిటీలోని విద్యానగర్‌లో సీసీ రోడ్డు పనులు ప్రారంభం నందికొట్కూరు మున్సిపాలిటీ పరిధిలోని విద్యానగర్ 11వ వార్డులో 15వ ఆర్థిక సంఘం నిధుల ద్వారా రూ.7.50 లక్షల వ్యయంతో చేపట్టనున్న నూతన సీసీ రోడ్డు నిర్మాణ పనులను ఎమ్మెల్యే గిత్త జయసూర్య ప్రారంభించారు. పట్టణంలోని ప్రతి వార్డులో అవసరమైన అభివృద్ధి పనులను దశలవారీగా చేపట్టి మెరుగైన మౌలిక వసతులు కల్పించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు.1
- పత్రికా ప్రకటన నంద్యాల జిల్లా 15.09.2026 వినాయక నిమజ్జన ఘాట్‌లను పరిశీలించిన జిల్లా ఎస్పీ సునీల్ షొరాణ్, IPS. అవాంఛనీయ సంఘటనలకు తావులేకుండా పటిష్ట భద్రతా చర్యలు చేపట్టాలని అధికారులకు ఆదేశం. ఆత్మకూరు:నంద్యాల జిల్లా. వినాయక నిమజ్జనం కార్యక్రమాలు ప్రశాంత వాతావరణంలో, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా నిర్వహించేందుకు జిల్లా పోలీస్ శాఖ ముందస్తు చర్యలు చేపడుతోంది. ఈ నేపథ్యంలో జిల్లా ఎస్పీ సునీల్ షొరాణ్, IPS నేడు ఆత్మకూరు సబ్ డివిజన్ పరిధిలోని *వెలుగోడు, ఆత్మకూరు, పాములపాడు జూపాడుబంగ్లా* మొదలగు పోలీస్ స్టేషన్ల పరిధిలో ఉన్న వినాయక నిమజ్జన ఘాట్‌లను, మరియు ఊరేగింపు జరిగే ప్రధాన ప్రాంతాలను స్వయంగా ఎస్పీ సందర్శించి భద్రతా ఏర్పాట్లను పరిశీలించారు. నిమజ్జన ఘాట్‌ల వద్ద ఏర్పాటు చేసిన భద్రతా చర్యలు, ప్రజల రాకపోకలు, వాహనాల నియంత్రణ, పోలీస్ బందోబస్తు తదితర అంశాలపై సంబంధిత అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. వినాయక నిమజ్జనం సందర్భంగా భక్తులు, ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తగిన చర్యలు చేపట్టాలని, ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేయాలని జిల్లా ఎస్పీ సంబంధిత పోలీస్ అధికారులను ఆదేశించారు. నిమజ్జన కార్యక్రమాలు సజావుగా జరిగేలా ఘాట్‌ల వద్ద నిరంతరం పోలీస్ సిబ్బంది అందుబాటులో ఉండాలని, రద్దీని క్రమబద్ధీకరించడంతో పాటు ప్రజల భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. అలాగే నిమజ్జన కార్యక్రమాల్లో పాల్గొనే ప్రజలు పోలీసులకు సహకరించి, పోలీస్ శాఖ సూచించిన భద్రతా నిబంధనలను పాటించాలని జిల్లా ఎస్పీ కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ తో పాటు ఆత్మకూరు డిఎస్పి రామంజి నాయక్ ,స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ అశోక్, సంబంధిత పోలీస్ అధికారులు పాల్గొన్నారు. జిల్లా పోలీస్ కార్యాలయం నంద్యాల.4