ఎన్టీఆర్ జిల్లా రెడ్డిగూడెం ఎస్సీ సోదరుల చిరకాల వాంఛ నెరవేర్చిన ఎం.ఎల్.ఎ వసంత వెంకటకృష్ణ ప్రసాద్ ఎస్సీ సోదరుల చిరకాల వాంఛ నెరవేర్చిన ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాదు . రూ.75 లక్షలతో కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి శంకుస్థాపన. ఎన్టీఆర్ జిల్లా, రెడ్డిగూడెం, సెప్టెంబర్ 16: రెడ్డిగూడెం ఎస్సీ సోదర సోదరీమణుల చిరకాల వాంఛ నెరవేరే దిశగా కీలక అడుగు పడింది. మైలవరం ఎమ్మెల్యే, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి వసంత వెంకట కృష్ణప్రసాదు గారి చొరవతో రెడ్డిగూడెంలోని సీఎస్ఐ చర్చి సమీపంలో డి.ఎం.ఎఫ్ నిధులు రూ.75 లక్షల అంచనా వ్యయంతో నిర్మించనున్న ఎస్సీ కమ్యూనిటీ హాల్‌కు బుధవారం శంకుస్థాపన జరిగింది. ఈ సందర్భంగా నిర్వహించిన ప్రత్యేక ప్రార్థనలలో పాల్గొన్నారు. ఇచ్చినమాటనిలబెట్టుకున్నవసంత.ఎస్సీ సోదర సోదరీమణులకు ఇచ్చిన హామీ మేరకు ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణప్రసాదు గారు స్వయంగా కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి శంకుస్థాపన చేసి పనులను ప్రారంభించారు. ఎన్నాళ్లుగానో ఎదురుచూస్తున్న కమ్యూనిటీ హాల్ నిర్మాణం కార్యరూపం దాల్చడంతో స్థానిక ఎస్సీ కుటుంబాల్లో ఆనందం వ్యక్తమైంది.అనేక సామాజిక కార్యక్రమాలకుఉపయోగకరం.కమ్యూనిటీ హాల్ నిర్మాణం పూర్తయితే రెడ్డిగూడెం ఎస్సీ కుటుంబాలకు ఎంతో ఉపయోగకరంగా మారనుంది. వివాహాలు, శుభకార్యాలు, సామాజిక కార్యక్రమాలు, సమావేశాలు తదితర కార్యక్రమాలను నిర్వహించుకునేందుకు ఈ భవనం అందుబాటులో ఉండనుంది. స్థానికుల సామాజిక అవసరాలను దృష్టిలో ఉంచుకుని అవసరమైన సౌకర్యాలతో కమ్యూనిటీ హాల్‌ను నిర్మించాలని ఎమ్మెల్యే కృష్ణప్రసాదు గారు సూచించారు. నాణ్యతలో రాజీ వద్దు.. సకాలంలో పూర్తి చేయాలి.కమ్యూనిటీ హాల్ నిర్మాణ పనుల్లో నాణ్యత విషయంలో ఎక్కడా రాజీపడకూడదని ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాదు గారు అధికారులను ఆదేశించారు. నిర్ణీత ప్రమాణాలకు అనుగుణంగా నిర్మాణ సామగ్రిని వినియోగించాలని, పనులను వేగవంతం చేసి సకాలంలో నిర్మాణాన్ని పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని సూచించారు. ప్రజల అవసరాలే అభివృద్ధికి ప్రాధాన్యం.రెడ్డిగూడెం గ్రామ అభివృద్ధిలో భాగంగా ప్రజల అవసరాలకు అనుగుణంగా మౌలిక వసతుల కల్పనకు ప్రాధాన్యం ఇస్తామని ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణప్రసాదు గారు తెలిపారు. అన్ని వర్గాల ప్రజలకు అవసరమైన సదుపాయాలను అందుబాటులోకి తీసుకురావడమే లక్ష్యంగా అభివృద్ధి కార్యక్రమాలను కొనసాగిస్తామని పేర్కొన్నారు.ఎమ్మెల్యేకు స్థానికుల కృతజ్ఞతలు.ఎస్సీ సోదర సోదరీమణుల చిరకాల కోరికను గుర్తించి రూ.75 లక్షలతో కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి నిధులు సమకూర్చి, పనులకు శంకుస్థాపన చేయడంపై స్థానికులు ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణప్రసాదు గారికి కృతజ్ఞతలు తెలిపారు. ఇచ్చిన మాటను నిలబెట్టుకుని తమకు అవసరమైన మౌలిక సదుపాయాన్ని కల్పిస్తున్నందుకు హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో మైలవరం నియోజకవర్గ జనసేన ఇంచార్జి అక్కల రామ్మోహనరావు (గాంధీ) గారు, తదితరులు పాల్గొన్నారు.
ఎన్టీఆర్ జిల్లా రెడ్డిగూడెం ఎస్సీ సోదరుల చిరకాల వాంఛ నెరవేర్చిన ఎం.ఎల్.ఎ వసంత వెంకటకృష్ణ ప్రసాద్ ఎస్సీ సోదరుల చిరకాల వాంఛ నెరవేర్చిన ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాదు . రూ.75 లక్షలతో కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి శంకుస్థాపన. ఎన్టీఆర్ జిల్లా, రెడ్డిగూడెం, సెప్టెంబర్ 16: రెడ్డిగూడెం ఎస్సీ సోదర సోదరీమణుల చిరకాల వాంఛ నెరవేరే దిశగా కీలక అడుగు పడింది. మైలవరం ఎమ్మెల్యే, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి వసంత వెంకట కృష్ణప్రసాదు గారి చొరవతో రెడ్డిగూడెంలోని సీఎస్ఐ చర్చి సమీపంలో డి.ఎం.ఎఫ్ నిధులు రూ.75 లక్షల అంచనా వ్యయంతో నిర్మించనున్న ఎస్సీ కమ్యూనిటీ హాల్‌కు బుధవారం శంకుస్థాపన జరిగింది. ఈ సందర్భంగా నిర్వహించిన ప్రత్యేక ప్రార్థనలలో పాల్గొన్నారు. ఇచ్చినమాటనిలబెట్టుకున్నవసంత.ఎస్సీ సోదర సోదరీమణులకు ఇచ్చిన హామీ మేరకు ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణప్రసాదు గారు స్వయంగా
కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి శంకుస్థాపన చేసి పనులను ప్రారంభించారు. ఎన్నాళ్లుగానో ఎదురుచూస్తున్న కమ్యూనిటీ హాల్ నిర్మాణం కార్యరూపం దాల్చడంతో స్థానిక ఎస్సీ కుటుంబాల్లో ఆనందం వ్యక్తమైంది.అనేక సామాజిక కార్యక్రమాలకుఉపయోగకరం.కమ్యూనిటీ హాల్ నిర్మాణం పూర్తయితే రెడ్డిగూడెం ఎస్సీ కుటుంబాలకు ఎంతో ఉపయోగకరంగా మారనుంది. వివాహాలు, శుభకార్యాలు, సామాజిక కార్యక్రమాలు, సమావేశాలు తదితర కార్యక్రమాలను నిర్వహించుకునేందుకు ఈ భవనం అందుబాటులో ఉండనుంది. స్థానికుల సామాజిక అవసరాలను దృష్టిలో ఉంచుకుని అవసరమైన సౌకర్యాలతో కమ్యూనిటీ హాల్‌ను నిర్మించాలని ఎమ్మెల్యే కృష్ణప్రసాదు గారు సూచించారు. నాణ్యతలో రాజీ వద్దు.. సకాలంలో పూర్తి చేయాలి.కమ్యూనిటీ హాల్ నిర్మాణ పనుల్లో నాణ్యత విషయంలో ఎక్కడా రాజీపడకూడదని ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాదు గారు అధికారులను ఆదేశించారు. నిర్ణీత ప్రమాణాలకు అనుగుణంగా నిర్మాణ సామగ్రిని వినియోగించాలని, పనులను వేగవంతం చేసి సకాలంలో నిర్మాణాన్ని పూర్తి
చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని సూచించారు. ప్రజల అవసరాలే అభివృద్ధికి ప్రాధాన్యం.రెడ్డిగూడెం గ్రామ అభివృద్ధిలో భాగంగా ప్రజల అవసరాలకు అనుగుణంగా మౌలిక వసతుల కల్పనకు ప్రాధాన్యం ఇస్తామని ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణప్రసాదు గారు తెలిపారు. అన్ని వర్గాల ప్రజలకు అవసరమైన సదుపాయాలను అందుబాటులోకి తీసుకురావడమే లక్ష్యంగా అభివృద్ధి కార్యక్రమాలను కొనసాగిస్తామని పేర్కొన్నారు.ఎమ్మెల్యేకు స్థానికుల కృతజ్ఞతలు.ఎస్సీ సోదర సోదరీమణుల చిరకాల కోరికను గుర్తించి రూ.75 లక్షలతో కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి నిధులు సమకూర్చి, పనులకు శంకుస్థాపన చేయడంపై స్థానికులు ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణప్రసాదు గారికి కృతజ్ఞతలు తెలిపారు. ఇచ్చిన మాటను నిలబెట్టుకుని తమకు అవసరమైన మౌలిక సదుపాయాన్ని కల్పిస్తున్నందుకు హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో మైలవరం నియోజకవర్గ జనసేన ఇంచార్జి అక్కల రామ్మోహనరావు (గాంధీ) గారు, తదితరులు పాల్గొన్నారు.
- *ఎన్టీఆర్ జిల్లా కొత్తూరు తాడేపల్లి* *విద్యుత్ వైర్లు తగిలి లారీ దగ్ధం* మట్టి లోడ్ తో భారీ లారీ కొత్తూరు తాడేపల్లి గ్రామంలో 11కెవి విద్యుత్ వైర్ తగిలి దగ్ధం క్షేమంగా బయటపడ్డ లారీ డ్రైవర్ కొత్తూరు తాడేపల్లిలో సంఘటన అక్రమంగా మట్టి తరలింపు పై ఇప్పటికే పలు ఆరోపణలు అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని స్థానికుల విమర్శలు అక్రమ మట్టి రవాణా ఇబ్బందులు పడుతున్నామని పలుమార్లు నిరసనలు దిగిన స్థానికులు ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించాలని డిమాండ్1
- వేధింపులంటూ పోలీస్‌స్టేషన్ ఎదుట కుటుంబం మందు డబ్బతో ఆందోళన *దంతాలపల్లి ఎస్సై రవికుమార్ వేధింపులంటూ పోలీస్‌స్టేషన్ ఎదుట కుటుంబం మందు డబ్బతో ఆందోళనకి దిగారు.ఇంటి దారి, భూవివాదంలో శంకర్ కేసు పెట్టినట్లు బాధితుల ఆరోపణకేసుకు సంబంధించిన ఆధారాలు పరిశీలించకుండానే తమను ఇబ్బందులకు గురిచేస్తున్నారని వారన్నారుఎస్సై బి. రవికుమార్ తమను అసభ్య పదజాలంతో దూషించారని బాధితుల ఆవేదన పోలీస్‌స్టేషన్‌కు పిలిపించి తీవ్రంగా వేధిస్తున్నారని మహబూబాబాద్ జిల్లా దంతాలపల్లి మండలం తూర్పు తండా గ్రామానికి చెందిన కుటుంబ సభ్యులు గూగులోత్ రూప్సింగ్ మరియు వారి కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు ఎస్సై వేధింపులు తట్టుకోలేక మందు డబ్బాతో పోలీస్‌స్టేషన్ ఎదుట నిరసన తమకు ప్రాణహాని ఉందని ఆందోళన వ్యక్తం చేసిన రూప్‌సింగ్ కుటుంబ సభ్యులు ఎస్సైపై సమగ్ర విచారణ జరిపి న్యాయం చేయాలని డిమాండ్ బాధితుల ఉన్నతాధికారులు స్పందించాలని విజ్ఞప్తి.1
- *డోర్ టు డోర్ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన పశ్చిమ టీడీపీ శ్రేణులకు వెలిగొండ – శ్రీశైలం పర్యటన* *ఎమ్మెల్యే గళ్ళా మాధవి ఆధ్వర్యంలో 10 బస్సుల్లో 450 మంది నాయకులు, కార్యకర్తల సందర్శన* ప్రకాశం, రాయలసీమలను కొనసీమగా మార్చగల నాయకుడు వాటర్ మ్యాన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, అపరభగీరథుడు నారా చంద్రబాబు నాయుడు అని గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే గళ్ళా మాధవి తెలిపారు. గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో నిర్వహించిన “ఇంటింటికి కూటమి ప్రభుత్వం – సంక్షేమ విజయాలు” డోర్ టు డోర్ కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తి చేసిన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నాయకులకు ఎమ్మెల్యే గళ్ళా మాధవి ప్రత్యేక ప్రోత్సాహకంగా వెలిగొండ ప్రాజెక్టు, శ్రీశైలం దేవస్థానం పర్యటనను ఏర్పాటు చేశారు. ఆదివారం శ్రీనివాసరావుపేటలోని క్యాంపు కార్యాలయం వద్ద ఎమ్మెల్యే గళ్ళా మాధవి జెండా ఊపి 10 బస్సులను ప్రారంభించారు. ఈ పర్యటనలో సుమారు 450 మంది కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు. పర్యటనలో భాగంగా వెలిగొండ ప్రాజెక్టును సందర్శించిన కార్యకర్తలు ప్రధాన టన్నెల్ ప్రాంతం, నీటి ప్రవాహ మార్గాలు, ఫీడర్ కాలువలు, 40 కిలోమీటర్ల ప్రధాన కాలువ వ్యవస్థతో పాటు ప్రాజెక్టు నిర్మాణ విశేషాలను పరిశీలించారు. కరువు ప్రాంతాలకు జీవనాడిగా మారిన ఈ ప్రాజెక్టు ద్వారా చేరుతున్న నీటి ప్రవాహాన్ని ప్రత్యక్షంగా వీక్షించి ఆనందం వ్యక్తం చేశారు. అనంతరం శ్రీశైలం క్షేత్రంలో శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి వారి దర్శనం చేసుకున్నారు. *ఈ సందర్భంగా ఎమ్మెల్యే గళ్ళా మాధవి మాట్లాడుతూ....* కూటమి ప్రభుత్వం రెండేళ్ల పాలనలో అమలు చేసిన సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు పార్టీ అధినేత, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రూపొందించిన డోర్ టు డోర్ కార్యక్రమాన్ని గుంటూరు పశ్చిమ నియోజకవర్గ కార్యకర్తలు అత్యంత బాధ్యతతో నిర్వహించారని తెలిపారు. కేవలం 20 రోజుల్లోనే కార్యక్రమాన్ని పూర్తి చేసి రాష్ట్రవ్యాప్తంగా 7వ స్థానంలో నిలవడం పశ్చిమ నియోజకవర్గ టీడీపీ శ్రేణుల నిబద్ధతకు నిదర్శనమని కొనియాడారు. డోర్ టు డోర్ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన కార్యకర్తలకు కృతజ్ఞతగా ఈ పర్యటన ఏర్పాటు చేశామని, అభివృద్ధి అంటే కేవలం మాటలు కాదని, ప్రజల జీవితాల్లో శాశ్వత మార్పు తీసుకొచ్చే మహత్తర ప్రాజెక్టులేనని పేర్కొన్నారు. అందుకే అమరావతి కాకుండా వెలిగొండ ప్రాజెక్టును సందర్శనకు ఎంపిక చేశామని తెలిపారు. వెలిగొండ ప్రాజెక్టు అనేది కేవలం ఒక నీటిపారుదల ప్రాజెక్టు కాదని, అది చంద్రబాబు నాయుడు గారి దూరదృష్టి, పట్టుదల, ప్రజల పట్ల ఉన్న అంకితభావానికి ప్రతీక అని ఎమ్మెల్యే పేర్కొన్నారు. 1996లో శంకుస్థాపన జరిగిన ఈ ప్రాజెక్టు ఎన్నో అవరోధాలు ఎదుర్కొన్నప్పటికీ, చివరకు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలోనే ప్రజలకు అంకితం కావడం చారిత్రాత్మక ఘట్టమన్నారు. లక్షలాది మంది ప్రజలకు తాగునీరు, సాగునీరు అందించే ఈ ప్రాజెక్టు రాష్ట్ర అభివృద్ధి చరిత్రలో చిరస్థాయిగా నిలుస్తుందని తెలిపారు. "వెలిగొండ అనేది ఒక సాధారణ ప్రాజెక్టు కాదు. ఇది మూడు దశాబ్దాల కల, వేలాది కుటుంబాల ఆశల ప్రతిరూపం. ఈ ప్రాజెక్టు వెనుక స్థానిక ప్రజల త్యాగం, ఇంజనీర్ల అంకితభావం, ప్రభుత్వ నిబద్ధత, ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారి సంకల్పం ఉన్నాయి. అందుకే ప్రతి తెలుగు వ్యక్తి జీవితంలో ఒక్కసారైనా ఈ ప్రాజెక్టును సందర్శించాలి" అని ఎమ్మెల్యే గళ్ళా మాధవి అన్నారు. నదుల అనుసంధానం, జల సంరక్షణ, నీటి వనరుల సమర్థ వినియోగంలో చంద్రబాబు నాయుడు గారి దూరదృష్టి కారణంగానే ఆయనకు “ఆంధ్రప్రదేశ్ వాటర్ మ్యాన్”, “అపర భగీరథుడు” అనే గుర్తింపు వచ్చిందని ఎమ్మెల్యే పేర్కొన్నారు. వెలిగొండ ప్రాజెక్టు పూర్తి కావడంలో జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు, ఇంజనీర్లు, స్థానిక ప్రజలు, ముంపు గ్రామాల ప్రజలు అందించిన సహకారం మరువలేనిదని తెలిపారు. ఈ పర్యటనలో పాల్గొన్న కార్యకర్తలు మాట్లాడుతూ, వెలిగొండ వంటి మహత్తర ప్రాజెక్టును ప్రత్యక్షంగా సందర్శించడం ద్వారా చంద్రబాబు నాయుడు గారి అభివృద్ధి దృక్పథం ఎంత విస్తృతమైనదో అర్థమైందన్నారు. రాష్ట్ర భవిష్యత్తును మార్చగలిగే ప్రాజెక్టుల వెనుక ఉన్న కృషి, సంకల్పాన్ని తెలుసుకునే అవకాశం లభించిందని పేర్కొన్నారు. ఈ పర్యటన తమలో మరింత ఉత్తేజాన్ని నింపిందని, పార్టీ బలోపేతం కోసం రెట్టింపు ఉత్సాహంతో పని చేస్తామని తెలిపారు.1
- సత్తుపల్లిలో ఘనంగా గణపతి నవరాత్రులు ఘనంగా ప్రారంభించారు ఖమ్మం జిల్లా సత్తుపల్లి పట్టణంలో గణపతి నవరాత్రి ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి సరస్వతి దేవి ఆలయం పక్కన ఉన్న శ్రీ ప్రసన్న గణపతి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో, సత్తుపల్లి గణేష్ ఉత్సవ కమిటీ నిర్వహణలో మట్టి వినాయకుడిని ప్రతిష్ఠించి నవరాత్రి ఉత్సవాలకు శ్రీకారం చుట్టారు. గత 24 ఏళ్లుగా ఇక్కడ మట్టి వినాయకుడితోనే ఉత్సవాలు నిర్వహించడం విశేషం. అలాగే జూపల్లి కంటి ఆస్పత్రి రోడ్డు, హనుమాన్ నగర్, రామాలయం ప్రాంతాల్లోనూ వినాయక మండపాలను ప్రత్యేక అలంకరణలతో తీర్చిదిద్ది పూజా కార్యక్రమాలు ప్రారంభించారు. నవరాత్రుల అనంతరం వివిధ ఆకృతుల్లో తయారు చేసే గణపతి లడ్డూలకు ఘనంగా వేలం పాటలు నిర్వహించనున్నారు. ఈ ఉత్సవాల్లో ప్రతిరోజు అన్నదానం ఉత్సవ కమిటీలు ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు ఈ ఉత్సవాల్లో ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని గణనాథుడిని దర్శించుకుని స్వామివారి ఆశీస్సులు పొందుతున్నారు.1
- పూజలు లేకుండానే గంగమ్మ ఒడికి గణేశుడు.................. రంగారెడ్డి జిల్లా, జిల్లేడు చౌదరిగుడ మండలం, పీర్జాపూర్ గ్రామంలో ఘటన ఆంజనేయ స్వామి ఆలయంలో గణేశుడి విగ్రహం ప్రతిష్టించే విషయమై.. రెండు వర్గాల మధ్య వివాదం అదే ఆలయంలో తాము ఏర్పాటు చేసిన గణనాథుడు ఉండాలని ఓ వర్గం పట్టుబట్టడంతో ఘర్షణ పోలీసులు జోక్యం చేసుకొని.. విగ్రహాన్ని పెట్టొద్దని, వేరే చోట ఏర్పాటు చేయాలని సూచనలు దీంతో మనస్తాపానికి గురై.. పూజలు చేయకుండానే చెరువులో విగ్రహాన్ని నిమజ్జనం చేశారు1
- సుబ్లేడు లో తెలంగాణా విమోచన వారోత్సవాలలో భాగంగా తెలంగాణా సాయుధ పోరాట యోధుడు షోయబుల్లాఖాన్ విగ్రహానికి భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో జలాభిషేకం ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం మండలం సుబ్లేడు లో తెలంగాణా విమోచన వారోత్సవాలలో భాగంగా తెలంగాణా సాయుధ పోరాట యోధుడు షోయబుల్లాఖాన్ విగ్రహానికి భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో జలాభిషేకం చేశారు.ఈకార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర నాయకులు కొండపల్లి శ్రీధర్ రెడ్డి పాల్గొన్నారు.ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ స్వాతంత్రం వచ్చిన తరువాత తెలంగాణా ప్రాంతం నిజాం నవాబు కబంధ హస్తాలలో మగ్గిందన్నారు.తెలంగాణా ప్రాంతానికి కూడా విముక్తి కావాలని పోరాడిన అమర వీరులకు గౌరవం రావాలని బీజేపీ ఉద్యమం చేస్తుంది.ఖమ్మం జిల్లా లో తొలితరం పాత్రికేయుడు షోయబుల్లాఖాన్ నిజాం నవాబు కు వ్యతిరేకంగా సంపాదకీయం రాసినందుకు ఆయన్ను హతం చేశారని తెలిపారు. షోయబుల్లాఖాన్ జన్మించిన ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలని ఆయన విగ్రహాన్ని ఏర్పాటు చేసామని ఆయన చెప్పారు.1
- బంగారం, డబ్బు కోసం కన్నతల్లిని హతమార్చిన కూతురు, భర్త అరెస్టు పొన్నూరు: బంగారు గొలుసు, నగదు కోసం తల్లి ఈవూరి లక్ష్మి (44)ని కూతురు పుష్పలత, ఆమె భర్త రాకేశ్ కుమార్ కలిసి సెప్టెంబర్ 12న గొంతు నొక్కి హతమార్చారు. మృతురాలి మెడలోని బంగారు గొలుసు, రూ.5000, మొబైల్ ఫోన్లు దోచుకుని పరారయ్యారు. ఘటనను మృతురాలి మనమడు ప్రత్యక్షంగా చూశాడు. పొన్నూరు టౌన్ సీఐ ఆర్.ఎస్. కిషోర్ కుమార్ నేతృత్వంలోని బృందం మూడు రోజుల్లోనే నిందితులను అరెస్టు చేసి, దోచుకున్న సొత్తును పూర్తిగా రికవరీ చేసారు.1
- *కన్న నేరానికి....ఈ తల్లిదండ్రులకు తప్పలేదు... కొడుకు కర్కశం....కొడుకు, కోడలు గెంటేశారని.. ఇంటి ముందు ధర్నాకు దిగిన తల్లిదండ్రులు* హైదరాబాద్ మియాపూర్‌లోని ఇంద్రారెడ్డి ఆల్విన్ కాలనీలో కొడుకు, కోడలు తమను ఇంటి నుంచి గెంటేశారని ఆరోపిస్తూ బుధవారం వృద్ధ తల్లిదండ్రులు ధర్నా చేపట్టారు. తమకు తెలియకుండానే ఇల్లు అమ్మకానికి పెట్టారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘటనపై స్పందించిన తల్లిదండ్రులు తమకు వెంటనే న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.1