Shuru
Apke Nagar Ki App…
భిక్కనూరు మండలం : రామేశ్వర్ పల్లిలో ఇందిరమ్మ ఇళ్ళను ప్రారంభించిన పిసిసి ప్రధాన కార్యదర్శి ఇంద్రకరణ్ రెడ్డి కామారెడ్డి జిల్లా బిక్కనూరు మండలం రామేశ్వర్పల్లిలో ఇందిరమ్మ ఇళ్లను పీసీసీ ప్రధాన కార్యదర్శి ఇంద్రకరణ్ రెడ్డి ప్రారంభించారు. సొంత ఇల్లు లేని నిరుపేదలకు ఇందిరమ్మ ఇళ్లు ఒక గొప్ప వరమని పేర్కొన్నారు. నిరుపేదల సొంతింటి కల నెరవేర్చడమే ప్రభుత్వ లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు. అర్హులైన ప్రతి పేద కుటుంబానికి ప్రభుత్వం గృహవసతి కల్పిస్తుందని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ రాణి, పాలకవర్గ సభ్యులు పాల్గొన్నారు.
Narmala Swapna
భిక్కనూరు మండలం : రామేశ్వర్ పల్లిలో ఇందిరమ్మ ఇళ్ళను ప్రారంభించిన పిసిసి ప్రధాన కార్యదర్శి ఇంద్రకరణ్ రెడ్డి కామారెడ్డి జిల్లా బిక్కనూరు మండలం రామేశ్వర్పల్లిలో ఇందిరమ్మ ఇళ్లను పీసీసీ ప్రధాన కార్యదర్శి ఇంద్రకరణ్ రెడ్డి ప్రారంభించారు. సొంత ఇల్లు లేని నిరుపేదలకు ఇందిరమ్మ ఇళ్లు ఒక గొప్ప వరమని పేర్కొన్నారు. నిరుపేదల సొంతింటి కల నెరవేర్చడమే ప్రభుత్వ లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు. అర్హులైన ప్రతి పేద కుటుంబానికి ప్రభుత్వం గృహవసతి కల్పిస్తుందని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ రాణి, పాలకవర్గ సభ్యులు పాల్గొన్నారు.
More news from తెలంగాణ and nearby areas
- భారత ప్రభుత్వ యువజన వ్యవహారాలు మరియు క్రీడల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని లక్ష్మీబాయి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్, గ్వాలియర్ 2026-27 విద్యా సంవత్సరానికి ఈ క్రింది కోర్సులకు ప్రవేశ పరీక్షను నిర్వహిస్తోంది: 1. డిప్లొమా ఇన్ స్పోర్ట్స్ కోచింగ్ 2. పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిప్లొమా ఇన్ స్పోర్ట్స్ కోచింగ్ 3. పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ ఫిట్నెస్ మేనేజ్ మెంట్ 4. పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ స్ట్రెంత్ అండ్ స్పోర్ట్స్ కండిషనింగ్ 5. బ్యాచిలర్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ 6. మాస్టర్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ 7. ఎమ్మెస్సీ (స్పోర్ట్స్ సైన్స్) ৪. ఎం,ఏ ( యోగ) 9. ఎంఎసత ఎం 10. ఎం.ఏ. (క్రీడా జర్నలిజం) 11. ఫిట్నెస్ నిర్వహణలో పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా కావున ఆసక్తి, అర్హత కలిగిన అభ్యర్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అర్హత, ఫీజు మరియు ఇతర పూర్తి వివరాలకు వెబ్ సైట్ ను పరిశీలించాలని మరియు ఏవైనా ఇతర సందేహాలకు 0751,4000887 ఫోన్ నంబర్ ను సంప్రదించగలరని తెలిపారు. ఆసక్తి మరియు అర్హత గల అభ్యర్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోనగలరని జిల్లా యువజన మరియు క్రీడల శాఖ అధికారి జి.రమేష్ ఒక ప్రకటనలో తెలిపారు.1
- రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని రాజీవ్ నగర్ కు చెందిన కూన లక్ష్మీ అనే మహిళ ఈ నెల 13వ తేదీన హత్యకు గురికాగా పోలీసులు హత్య కేసును ఛేదించి నిందితుడి వివరాలను సిరిసిల్ల డిఎస్పి కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించి వెల్లడించారు. ఈ సందర్భంగా నాగేంద్ర చారి మాట్లాడుతూ.. ఒంటరిగా ఉంటున్న కూనలక్ష్మిని గమనించిన గడీల రాజు అనే వ్యక్తి మద్యానికి బానిసై జల్సాలకు డబ్బులు సరిపోనందున ఎలా అయినా డబ్బులు సంపాదించాలనుకుని కొంత కాలం నుండి రాజీవ్ నగర్ లో ఇంటిలో లక్ష్మీ ఒక్కతే ఉండడాన్ని గమనించి ఇంట్లోకి వెళ్లి కత్తెరతో హత్య చేసి 2000 రూపాయలు నగదు, రెండు చీరలు, బ్యాంకు పాసుబుక్కులు, రాజీవ్ ఆరోగ్యశ్రీ కార్డు, హ్యాండీక్యాప్డ్ సర్టిఫికెట్ లు తీసుకెళ్లినట్లు చెవులకు ఉన్న బంగారు పుల్లలు తీయడానికి ప్రయత్నించగా అవి రాకపోవడంతో తన వద్ద ఉన్న కత్తెరతో రెండు చెవులను కత్తిరించి ఇంటికి తీసుకుపోయి అవి కడిగే ప్రయత్నం చేయగా ఆ బంగారు పోగులు పడిపోయాయని తెలిపారు. సాంకేతికత ఆధారంగా నిందితుని పట్టుకోవడం జరిగిందని అతని వద్ద నుండి హత్యకు ఉపయోగించిన కత్తెర రెండు చీరలు బ్యాంకు పాసుబుక్కులు రాజీవ్ ఆరోగ్యశ్రీ హ్యాండీక్యాప్డ్ సర్టిఫికెట్లు 2000 రూపాయలను స్వాధీనం చేసుకోవడం జరిగిందని తెలిపారు.1
- Post by Vishwamber Rao1
- Post by Solanke Ravi4
- lగన్నేరువరం: మండలం మైలారం గ్రామంలోని మున్నూరు కాపు సంఘం భవనంలో గురువారం హిందూ సమ్మేళన కమిటీ సభ్యులు సమావేశం నిర్వహించారు. ఈనెల 23న జరగనున్న హిందూ సమ్మేళన కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు తరలి రావాలి అవసరమైన ఏర్పాట్లపై చర్చించారు. కార్యక్రమానికి విస్తృత స్థాయిలో ప్రజలను ఆకర్షించేలా చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు. హిందువులందరూ కులమతాలకు అతీతంగా ఐక్యంగా ఉండాలని కమిటీ సభ్యులు పిలుపునిచ్చారు.1
- బెజ్జంకి మండలంలోని రైతు వేదికలో ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన మండల సభ గురువారం ముగిసింది. సమావేశం ప్రారంభానికి ముందు తెలంగాణ గేయాన్ని ఆలపించగా, అనంతరం మండల ప్రత్యేక అధికారి ప్రవీణ్ సీఎం సందేశాన్ని చదివి వినిపించారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న రైతు భరోసా, ఇందిరమ్మ ఇళ్లు, మహాలక్ష్మి, గృహ జ్యోతి, భువన చేయూత, పెన్షన్లు, కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ తదితర పథకాల అమలు తీరును అధికారులు వివరించారు. గ్రామ స్థాయిలో సమస్యలు, పరిష్కారాలపై సర్పంచులు, అధికారులు చర్చించారు. అంగన్వాడి ఐసిడిఎస్ ప్రాజెక్టు అధికారి భావన నాగరాణి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక స్టాల్ ఆకర్షణగా నిలిచింది. కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ పులి కృష్ణ, ఎంపీడీవో కడవెర్గు ప్రవీణ్, తహసిల్దార్ శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.1
- పత్రిక ప్రకటన తేది: 16.04.2026 కామారెడ్డి జిల్లా గురువారం జిల్లా కేంద్రంలోని ఇందిరాగాంధీ స్టేడియం పక్కన నిర్మాణంలో ఉన్న ఇండోర్ స్టేడియం పనులను జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ గురువారం ఉదయం పరిశీలించారు. ఈ సందర్భంగా నిర్మాణ పనుల పురోగతిని సమీక్షించి, జరుగుతున్న పనుల నాణ్యతను అంచనా వేసి, ప్రాజెక్టును నిర్ణీత గడువులో పూర్తి చేయడానికి అవసరమైన మార్గదర్శకాలను సంబంధిత అధికారులకు అందించారు. అలాగే అక్కడ నిర్వహిస్తున్న కబడ్డీ సమ్మర్ కోచింగ్ క్యాంపును సందర్శించి, విద్యార్థులతో కలిసి కబడ్డీ ఆడి వారిని ప్రోత్సహించారు. ఈ ఇండోర్ స్టేడియంలో 4 షటిల్ బ్యాడ్మింటన్ కోర్టులు, యోగా హాల్, ఇండోర్ గేమ్స్ సదుపాయాలు, జిమ్, రైఫిల్ షూటింగ్, స్క్వాష్ కోర్ట్ వంటి ఆధునిక సౌకర్యాలు ఏర్పాటు చేయబడుతున్నాయి. జిల్లాలో యువతకు క్రీడలు, వినోద కార్యక్రమాలను ప్రోత్సహించేందుకు మౌలిక వసతుల అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తామని కలెక్టర్ తెలిపారు. ఇందిరాగాంధీ స్టేడియాన్ని అన్ని రకాల క్రీడా సదుపాయాలతో అభివృద్ధి చేయడానికి కృషి చేస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కామారెడ్డి ఆర్‌డీవో ఎన్.వై. గిరి, పబ్లిక్ హెల్త్ డీఈ సంతోష్, కాంట్రాక్టర్ ఏజెన్సీ సభ్యుడు వెంకటరమణ, జిల్లా యువజన క్రీడల శాఖ అధికారి తదితరులు పాల్గొన్నారు.1
- : ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా మెదక్ పట్టణంలోని బాలాజీ ఫంక్షనల్ లో అరైవు-అలైవ్ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్, జిల్లా ఎస్పీ శ్రీనివాసరావు, పాల్గొని రోడ్డు భద్రత నియమాలను ఉల్లంఘించొద్దు ,సురక్షితంగా గమ్యాన్ని చేరాలని సూచించారు.ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ నగేష్,జిల్లా వైద్య అధికారి శ్రీరామ్,జిల్లా ట్రాన్స్ పోర్ట్ అధికారి వెంకట స్వామి, డి ఎస్పీ ప్రసన్న కుమార్,మున్సిపల్ చైర్మన్ కనుగుల రాధిక భూపతి రాజ్,వైస్ ఛైర్మన్ దొంతి నరేష్ గౌడ్,అధికారులు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.1
- రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలోని శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం లో గురువారం మాస శివరాత్రి సందర్భంగా విశేష పూజా కార్యక్రమాలు ఘనంగా నిర్వహించబడ్డాయి.ఈ సందర్భంగా ఉదయం స్వామివారికి మహన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకం శాస్త్రోక్తంగా నిర్వహించారు. అనంతరం పరివార దేవతలకు ప్రత్యేక అర్చనలు నిర్వహించారు. సాయంత్రం మహా లింగార్చన కార్యక్రమంలో భాగంగా 365 జ్యోతులను వెలిగించి భక్తి శ్రద్ధలతో పూజలు చేశారు. ఈ కార్యక్రమాలను ఆలయ ప్రధాన అర్చకులు ఈశ్వర్ గారు, సురేష్ గారి ఆధ్వర్యంలో అర్చకులు, వేద పండితులు ఏకాంతంగా నిర్వహించారు.1