Shuru
Apke Nagar Ki App…
కాలి బూడిదైన పంట.. రైతన్నకు మిగిల్చిన కన్నీళ్లు! కళ్లముందే కాలిబూడిదైన పంట చేతికొచ్చిన పంట కళ్లముందే అగ్నికి ఆహుతి కావడంతో ఓ కౌలు రైతు కన్నీరుమున్నీరవుతున్నాడు. బాసరకు చెందిన గోసుల రాజు రెండెకరాల్లో మొక్కజొన్న సాగు చేశాడు. పంట కోసి ఇంటికి వెళ్లి భోజనం చేసి వచ్చేలోపే పంటంతా బూడిదైంది. తోటి రైతులు నీళ్లు పోసి ఆర్పేలోపే భారీ నష్టం వాటిల్లింది. బాధితుడు పోలీసులను ఆశ్రయించి, నిందితులపై చర్యలు తీసుకోవాలని, తనను ఆదుకోవాలని వేడుకున్నాడు.
Solanke Ravi
కాలి బూడిదైన పంట.. రైతన్నకు మిగిల్చిన కన్నీళ్లు! కళ్లముందే కాలిబూడిదైన పంట చేతికొచ్చిన పంట కళ్లముందే అగ్నికి ఆహుతి కావడంతో ఓ కౌలు రైతు కన్నీరుమున్నీరవుతున్నాడు. బాసరకు చెందిన గోసుల రాజు రెండెకరాల్లో మొక్కజొన్న సాగు చేశాడు. పంట కోసి ఇంటికి వెళ్లి భోజనం చేసి వచ్చేలోపే పంటంతా బూడిదైంది. తోటి రైతులు నీళ్లు పోసి ఆర్పేలోపే భారీ నష్టం వాటిల్లింది. బాధితుడు పోలీసులను ఆశ్రయించి, నిందితులపై చర్యలు తీసుకోవాలని, తనను ఆదుకోవాలని వేడుకున్నాడు.
More news from తెలంగాణ and nearby areas
- Post by Solanke Ravi4
- హుస్నాబాద్ సబ్ స్టేషన్ సమీపంలో కరీంనగర్ రహదారి పై ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థులు బైఠాయించి రాస్తారోకో చేపట్టారు.500 రూపాయల ట్యూషన్ ఫీజు కడితేనే హల్ టిక్కెట్లు ఇస్తానని కళాశాల ప్రిన్సిపాల్ బెదిరించినట్లు ఆరోపిస్తూ ఆందోళన వ్యక్తం చేశారు. ప్రిన్సిపాల్ పై చర్యలు తీసుకొని హాల్ టిక్కెట్లు ఇప్పించాలని డిమాండ్ చేశారు.ఆందోళన చేస్తున్న విద్యార్థులకు పోలీసులు నచ్చ చెప్పడంతో ఆందోళన విరమించారు.1
- Post by నీరటి మహేందర్1
- కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలం లంబాడిపల్లి గ్రామంలో విషాద ఘటన చోటు చేసుకుంది. వరి కోసి పొలం నుండి వడ్లు జార గోడుతుండగా ట్రాక్టర్ ప్రమాదవశాత్తూ రోడ్డు క్రిందకు పొదల్లోకి దూసుకెళ్లి బోల్తా పడింది. దీంతో ట్రాక్టర్ కింద పడి డ్రైవర్ సీట్లో ఉన్న యువరైతు కాటం కిషన్ రెడ్డి అక్కడికక్కడే మృతి చెందారు. విషయం తెలుసుకొని అక్కడికి చేరుకున్న కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపించారు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు జెసిబి సహాయంతో మృతదేహాన్ని బయటకు తీశారు. ప్రమాదంపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. పంట చేతికందిన సమయంలో సంతోషించాల్సిన రైతు, ప్రమాదంలో ప్రాణాలు కోల్పోవడంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.2
- బెజ్జంకి మండలంలోని రైతు వేదికలో ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన మండల సభ గురువారం ముగిసింది. సమావేశం ప్రారంభానికి ముందు తెలంగాణ గేయాన్ని ఆలపించగా, అనంతరం మండల ప్రత్యేక అధికారి ప్రవీణ్ సీఎం సందేశాన్ని చదివి వినిపించారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న రైతు భరోసా, ఇందిరమ్మ ఇళ్లు, మహాలక్ష్మి, గృహ జ్యోతి, భువన చేయూత, పెన్షన్లు, కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ తదితర పథకాల అమలు తీరును అధికారులు వివరించారు. గ్రామ స్థాయిలో సమస్యలు, పరిష్కారాలపై సర్పంచులు, అధికారులు చర్చించారు. అంగన్వాడి ఐసిడిఎస్ ప్రాజెక్టు అధికారి భావన నాగరాణి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక స్టాల్ ఆకర్షణగా నిలిచింది. కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ పులి కృష్ణ, ఎంపీడీవో కడవెర్గు ప్రవీణ్, తహసిల్దార్ శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.1
- lగన్నేరువరం: మండలం మైలారం గ్రామంలోని మున్నూరు కాపు సంఘం భవనంలో గురువారం హిందూ సమ్మేళన కమిటీ సభ్యులు సమావేశం నిర్వహించారు. ఈనెల 23న జరగనున్న హిందూ సమ్మేళన కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు తరలి రావాలి అవసరమైన ఏర్పాట్లపై చర్చించారు. కార్యక్రమానికి విస్తృత స్థాయిలో ప్రజలను ఆకర్షించేలా చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు. హిందువులందరూ కులమతాలకు అతీతంగా ఐక్యంగా ఉండాలని కమిటీ సభ్యులు పిలుపునిచ్చారు.1
- రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలోని శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం అనుబంధ ఆలయమైన శ్రీ భీమేశ్వర స్వామి వారిని తెలంగాణ రాష్ట్ర రైల్వే మరియు రోడ్డు భద్రత ఐజీపి దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.ఈసందర్భంగా ఆలయానికి చేరుకున్న ఐజిపి కి ఆలయ అర్చకులు,వేద పండితులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు.దర్శనం అనంతరం ఆలయ మండపంలో స్వామివారి శేషవస్త్రం కప్పి, లడ్డూ ప్రసాదాన్ని అందజేసి ఆశీర్వచనం ఇచ్చారు.వారి వెంట వేములవాడ డీఎస్పీ శ్రీనివాసులు, సీఐ వీరప్రసాద్,ఆర్.ఐ సురేష్, ఎస్సైలు,అలాగే ప్రోటోకాల్ ఏఈఓ జి. అశోక్ కుమార్,ఆలయ పర్యవేక్షకులు ఎన్. రాజేందర్, ఆలయ ఉద్యోగులు కూడా హాజరయ్యారు.1
- Post by Solanke Ravi4