logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

లంబాడిపల్లిలో వడ్లు జారకొడుతుండగా ట్రాక్టర్ బోల్తా...యువరైతు కాటం కిషన్ రెడ్డి మృతి కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలం లంబాడిపల్లి గ్రామంలో విషాద ఘటన చోటు చేసుకుంది. వరి కోసి పొలం నుండి వడ్లు జార గోడుతుండగా ట్రాక్టర్ ప్రమాదవశాత్తూ రోడ్డు క్రిందకు పొదల్లోకి దూసుకెళ్లి బోల్తా పడింది. దీంతో ట్రాక్టర్ కింద పడి డ్రైవర్ సీట్లో ఉన్న యువరైతు కాటం కిషన్ రెడ్డి అక్కడికక్కడే మృతి చెందారు. విషయం తెలుసుకొని అక్కడికి చేరుకున్న కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపించారు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు జెసిబి సహాయంతో మృతదేహాన్ని బయటకు తీశారు. ప్రమాదంపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. పంట చేతికందిన సమయంలో సంతోషించాల్సిన రైతు, ప్రమాదంలో ప్రాణాలు కోల్పోవడంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.‌

2 days ago
user_K.V.REDDY
K.V.REDDY
చిగురుమామిడి, కరీంనగర్, తెలంగాణ•
2 days ago
828eadde-f408-4d3b-9b1b-a0ce9fd3c2d5

లంబాడిపల్లిలో వడ్లు జారకొడుతుండగా ట్రాక్టర్ బోల్తా...యువరైతు కాటం కిషన్ రెడ్డి మృతి కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలం లంబాడిపల్లి గ్రామంలో విషాద ఘటన చోటు చేసుకుంది. వరి కోసి పొలం నుండి వడ్లు జార గోడుతుండగా ట్రాక్టర్ ప్రమాదవశాత్తూ రోడ్డు క్రిందకు పొదల్లోకి దూసుకెళ్లి బోల్తా పడింది. దీంతో ట్రాక్టర్ కింద పడి డ్రైవర్ సీట్లో ఉన్న యువరైతు కాటం కిషన్ రెడ్డి అక్కడికక్కడే మృతి చెందారు. విషయం తెలుసుకొని అక్కడికి చేరుకున్న కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపించారు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు జెసిబి సహాయంతో మృతదేహాన్ని బయటకు తీశారు. ప్రమాదంపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. పంట చేతికందిన సమయంలో సంతోషించాల్సిన రైతు, ప్రమాదంలో ప్రాణాలు కోల్పోవడంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.‌

  • user_THONIGANDLA NAVEEN
    THONIGANDLA NAVEEN
    హవేలీఘనాపూర్, మెదక్, తెలంగాణ
    😤
    1 day ago
More news from తెలంగాణ and nearby areas
  • రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలోని శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం లో శంకర జయంతి మహోత్సవాలు వైభవంగా నిర్వహించబడుతున్నాయి. ఈ మహోత్సవాలు వైశాఖ శుద్ధ పాడ్యమి నుండి పంచమి వరకు ఐదు రోజులపాటు కొనసాగనున్నాయి.మహోత్సవాల్లో భాగంగా మొదటి రోజు స్వస్తి పుణ్యాహవాచనం నిర్వహించబడింది. అనంతరం మూలమూర్తులైన లక్ష్మీ గణపతి స్వామివారికి అధర్వశీర్ష పఠనంతో ఐదు రోజులపాటు అభిషేకాలు జరుగనున్నాయి. శ్రీ రాజరాజేశ్వర స్వామివారికి మహాన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకం నిర్వహించబడుతుంది. అలాగే రాజరాజేశ్వరి దేవి అమ్మవారికి దేవాలయ అర్చకులు ఆంతరంగికంగా ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు.ఈ సందర్భంగా ఉపనిషత్ భాష్య పారాయణం, వేద పారాయణాలు, ఇతర విశిష్ట పారాయణాలు కూడా నిర్వహించబడుతున్నాయి. ప్రతిరోజూ సాయంకాలం శంకర విజయము పై ప్రవచన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. మహోత్సవాల చివరి రోజు అయిన పంచమి నాడు సాయంకాలం వేద సదస్సు నిర్వహించబడుతుంది. అలాగే వైశాఖ మాస విశిష్టతను పురస్కరించుకుని వసంతోత్సవ పూజలు నిర్వహించి ఉత్సవాలను ఘనంగా ముగించనున్నారు.ఈ కార్యక్రమాలు రాజన్న ఆలయం అభివృద్ధిలో భాగంగా ఆలయ అర్చకులు ఏకాంతంగా నిర్వహిస్తున్నారు.
    1
    రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలోని శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం లో శంకర జయంతి మహోత్సవాలు వైభవంగా నిర్వహించబడుతున్నాయి. ఈ మహోత్సవాలు వైశాఖ శుద్ధ పాడ్యమి నుండి పంచమి వరకు ఐదు రోజులపాటు కొనసాగనున్నాయి.మహోత్సవాల్లో భాగంగా మొదటి రోజు స్వస్తి పుణ్యాహవాచనం నిర్వహించబడింది. అనంతరం మూలమూర్తులైన లక్ష్మీ గణపతి స్వామివారికి అధర్వశీర్ష పఠనంతో ఐదు రోజులపాటు అభిషేకాలు జరుగనున్నాయి. శ్రీ రాజరాజేశ్వర స్వామివారికి మహాన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకం నిర్వహించబడుతుంది. అలాగే రాజరాజేశ్వరి దేవి అమ్మవారికి దేవాలయ అర్చకులు ఆంతరంగికంగా ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు.ఈ సందర్భంగా ఉపనిషత్ భాష్య పారాయణం, వేద పారాయణాలు, ఇతర విశిష్ట పారాయణాలు కూడా నిర్వహించబడుతున్నాయి. ప్రతిరోజూ సాయంకాలం శంకర విజయము పై ప్రవచన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.
మహోత్సవాల చివరి రోజు అయిన పంచమి నాడు సాయంకాలం వేద సదస్సు నిర్వహించబడుతుంది. అలాగే వైశాఖ మాస విశిష్టతను పురస్కరించుకుని వసంతోత్సవ పూజలు నిర్వహించి ఉత్సవాలను ఘనంగా ముగించనున్నారు.ఈ కార్యక్రమాలు రాజన్న ఆలయం అభివృద్ధిలో భాగంగా ఆలయ అర్చకులు ఏకాంతంగా నిర్వహిస్తున్నారు.
    user_Satheesh gangu
    Satheesh gangu
    జర్నలిస్ట్ సిరిసిల్ల, రాజన్న సిరిసిల్ల, తెలంగాణ•
    19 hrs ago
  • వరంగల్ జిల్లా వర్ధన్నపేట మున్సిపాలిటీ పరిధిలోని డీసీ తండాలో మిషన్ భగీరథ పైపు పగిలిపోవడంతో పెద్దఎత్తున నీరు వృథాగా పారిపోతుండటమే కాకుండా తాగునీరు కలుషితం అవుతోందని తండావాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పగిలిన పైపు కారణంగా నీటి సరఫరా అంతరాయం ఏర్పడటంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఈ సమస్యను పలుమార్లు సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లినప్పటికీ ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని స్థానికులు అసంతృప్తి వ్యక్తం చేశారు. రోజురోజుకూ పరిస్థితి విషమిస్తున్నప్పటికీ అధికారులు స్పందించకపోవడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు తక్షణమే స్పందించి పగిలిన పైపును మరమ్మత్తు చేసి, నీటి వృథాను అరికట్టడంతో పాటు స్వచ్ఛమైన తాగునీరు అందించేలా చర్యలు చేపట్టాలని తండావాసులు డిమాండ్ చేస్తున్నారు.
    1
    వరంగల్ జిల్లా వర్ధన్నపేట మున్సిపాలిటీ పరిధిలోని డీసీ తండాలో మిషన్ భగీరథ పైపు పగిలిపోవడంతో పెద్దఎత్తున నీరు వృథాగా పారిపోతుండటమే కాకుండా తాగునీరు కలుషితం అవుతోందని తండావాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పగిలిన పైపు కారణంగా నీటి సరఫరా అంతరాయం ఏర్పడటంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.
ఈ సమస్యను పలుమార్లు సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లినప్పటికీ ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని స్థానికులు అసంతృప్తి వ్యక్తం చేశారు. రోజురోజుకూ పరిస్థితి విషమిస్తున్నప్పటికీ అధికారులు స్పందించకపోవడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఇప్పటికైనా అధికారులు తక్షణమే స్పందించి పగిలిన పైపును మరమ్మత్తు చేసి, నీటి వృథాను అరికట్టడంతో పాటు స్వచ్ఛమైన తాగునీరు అందించేలా చర్యలు చేపట్టాలని తండావాసులు డిమాండ్ చేస్తున్నారు.
    user_M D Azizuddin
    M D Azizuddin
    జర్నలిస్ట్ వర్ధన్నపేట, వరంగల్, తెలంగాణ•
    2 hrs ago
  • లక్షెట్టిపేట మండలంలోని వెంకట్రావుపేట గ్రామంలో అవతార్ మెహర్ బాబా 30 వ వార్షికోత్సవాన్ని భక్తులు ఘనంగానే వివరించ నిర్వహించారు. మెహర్ బాబా సందర్భంగా వారు శనివారం సాయంత్రం వెంకట్రావు పేట గ్రామంలోనీ మెహర్బాబా సెంటర్ నుండి అన్ని వీధుల గుండా మెహర్ బాబా శోభాయాత్రను నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళలు నృత్యాలతో మెహర్ బాబా భక్తి గీతాలు పాడారు. ఈ కార్యక్రమంలో మెహర్ బాబా భక్తులు, తదితరులు పాల్గొన్నారు.
    1
    లక్షెట్టిపేట మండలంలోని వెంకట్రావుపేట గ్రామంలో అవతార్ మెహర్ బాబా 30 వ వార్షికోత్సవాన్ని భక్తులు ఘనంగానే వివరించ నిర్వహించారు. మెహర్ బాబా సందర్భంగా వారు శనివారం సాయంత్రం వెంకట్రావు పేట గ్రామంలోనీ మెహర్బాబా సెంటర్ నుండి అన్ని వీధుల గుండా మెహర్ బాబా శోభాయాత్రను నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళలు నృత్యాలతో మెహర్ బాబా భక్తి గీతాలు పాడారు. ఈ కార్యక్రమంలో మెహర్ బాబా భక్తులు, తదితరులు పాల్గొన్నారు.
    user_P.G. Murthy
    P.G. Murthy
    జన్నారం, మంచిర్యాల, తెలంగాణ•
    18 hrs ago
  • భీమ్‌గల్ పోలీస్ స్టేషన్‌లో అక్రమాల ఆరోపణలు… పీపుల్ మీడియా ప్రజా సమాచార పత్రిక తెలంగాణ స్టేట్ నిజాంబాద్ డిస్టిక్ బాల్కొండ కాంసెన్సు మున్సిపల్ భీంగల్ పరిధిలో సిబ్బంది తీరుపై విమర్శలు భీమ్‌గల్ సర్కిల్ పరిధిలోని ఓ పోలీస్ స్టేషన్‌లో కొందరు సిబ్బంది వ్యవహారంపై తీవ్ర ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. జీతం కంటే ‘గీత’కే ప్రాధాన్యత ఇస్తూ, మధ్యవర్తులతో కుమ్మక్కై సమాచారాన్ని లీక్ చేస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. గత కొన్ని రోజులుగా ఈ వ్యవహారం బహిరంగంగానే కొనసాగుతున్నట్లు సమాచారం. కొందరు సిబ్బంది బ్రోకర్ల నుంచి లాభాలు పొందుతూ వారికి అనుకూలంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఇటీవల ఓ కేసులో మధ్యవర్తిత్వం చేసి పరిష్కారం చేస్తామని చెప్పిన ఘటన బయటపడడంతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చినట్లు తెలుస్తోంది. పోలీస్ స్టేషన్‌లో రైటర్‌గా పనిచేస్తున్న మహిళతో పాటు జమాదార్ హోదాలో ఉన్న ఇద్దరు వ్యక్తులు స్టేషన్‌కు వచ్చే వ్యక్తులు, నమోదయ్యే కేసులు, ఫిర్యాదుదారుల వివరాలు, అధికారులతో జరిగిన చర్చలు వంటి సమాచారాన్ని మధ్యవర్తులకు చేరవేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఈ సమాచారం ఆధారంగా మధ్యవర్తులు లావాదేవీలు జరుపుతూ, సంబంధిత సిబ్బందికి లాభాలు చేకూరుస్తున్నారనేది బహిరంగ రహస్యమని స్థానికులు చెబుతున్నారు. ఈ పరిస్థితుల కారణంగా పోలీస్ స్టేషన్ ప్రతిష్ఠ దెబ్బతింటోందని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఫిర్యాదు చేయాలంటే రైటర్‌కు డబ్బులు ఇవ్వాల్సి వస్తోందని కూడా ఆరోపిస్తున్నారు. ఈ వ్యవహారంపై జిల్లా స్థాయి ఉన్నతాధికారులు దృష్టి సారించి, నిజానిజాలు వెలికితీసి తగిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.
    2
    భీమ్‌గల్ పోలీస్ స్టేషన్‌లో అక్రమాల ఆరోపణలు…
పీపుల్ మీడియా ప్రజా సమాచార పత్రిక తెలంగాణ స్టేట్ నిజాంబాద్ డిస్టిక్ బాల్కొండ కాంసెన్సు మున్సిపల్ భీంగల్ పరిధిలో
సిబ్బంది తీరుపై విమర్శలు
భీమ్‌గల్ సర్కిల్ పరిధిలోని ఓ పోలీస్ స్టేషన్‌లో కొందరు సిబ్బంది వ్యవహారంపై తీవ్ర ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. జీతం కంటే ‘గీత’కే ప్రాధాన్యత ఇస్తూ, మధ్యవర్తులతో కుమ్మక్కై సమాచారాన్ని లీక్ చేస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి.
గత కొన్ని రోజులుగా ఈ వ్యవహారం బహిరంగంగానే కొనసాగుతున్నట్లు సమాచారం. కొందరు సిబ్బంది బ్రోకర్ల నుంచి లాభాలు పొందుతూ వారికి అనుకూలంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఇటీవల ఓ కేసులో మధ్యవర్తిత్వం చేసి పరిష్కారం చేస్తామని చెప్పిన ఘటన బయటపడడంతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చినట్లు తెలుస్తోంది.
పోలీస్ స్టేషన్‌లో రైటర్‌గా పనిచేస్తున్న మహిళతో పాటు జమాదార్ హోదాలో ఉన్న ఇద్దరు వ్యక్తులు స్టేషన్‌కు వచ్చే వ్యక్తులు, నమోదయ్యే కేసులు, ఫిర్యాదుదారుల వివరాలు, అధికారులతో జరిగిన చర్చలు వంటి సమాచారాన్ని మధ్యవర్తులకు చేరవేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఈ సమాచారం ఆధారంగా మధ్యవర్తులు లావాదేవీలు జరుపుతూ, సంబంధిత సిబ్బందికి లాభాలు చేకూరుస్తున్నారనేది బహిరంగ రహస్యమని స్థానికులు చెబుతున్నారు.
ఈ పరిస్థితుల కారణంగా పోలీస్ స్టేషన్ ప్రతిష్ఠ దెబ్బతింటోందని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఫిర్యాదు చేయాలంటే రైటర్‌కు డబ్బులు ఇవ్వాల్సి వస్తోందని కూడా ఆరోపిస్తున్నారు. ఈ వ్యవహారంపై జిల్లా స్థాయి ఉన్నతాధికారులు దృష్టి సారించి, నిజానిజాలు వెలికితీసి తగిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.
    user_Raja Bangaari
    Raja Bangaari
    Artist భీమ్‌గల్, నిజామాబాద్, తెలంగాణ•
    21 hrs ago
  • అగ్నిమాపక వారోత్సవాలను పురస్కరించుకొని ఆదివారం నాడు స్థానిక ఫైర్ స్టేషన్ నుండి డీఎఫ్ఓ వేణు జండా ఊపి ర్యాలీ ప్రారంభించారు వాహనాల ర్యాలీని కొత్త బస్టాండ్ మీదుగా ఆటోనగర్ చేరుకుంది ఎన్ డి ఆర్ ఎఫ్ అగ్నిమాపక శకటాలు ఈ ర్యాలీలో పాల్గొన్నాయి కొత్త బస్టాండ్ మీదుగా ఆటోనగర్ చేరుకొని అక్కడినుండి మళ్లీ పోలీస్ స్టేషన్ చేరుకున్నాయి డీఎఫ్ఓ వేణు ఎస్ ఎఫ్ ఓ వెంకటేష్ ఎస్ ఎఫ్ ఓ ప్రశాంత్ అగ్నిమాపక శాఖ సిబ్బంది పాల్గొన్నారు ఈ సందర్భంగా ప్రజలలో అగ్ని ప్రమాదాల నివారణ భద్రత చర్యలపై అవగాహన కల్పించారు ఈ కార్యక్రమంలో ఎల్ ఎఫ్ ఎఫ్ ప పి నరసయ్య ఎఫ్ ఎఫ్ టి ఎండి కలలుద్దీన్ ఎఫ్ ఎఫ్ ఫరీద్ ఖాన్ ఎఫ్ ఎఫ్ ఎన్ నరేష్ కే సురేష్ హెచ్ జి ఎఫ్ ఎఫ్ ఎం స్వామి హెచ్ జి ఎఫ్ ఎఫ్ ఎం ప్రదీప్ హెచ్ జి ఎఫ్ ఎఫ్ ఎస్ నాగరాజు హెచ్ జి ఎఫ్ ఎఫ్ యు వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు
    1
    అగ్నిమాపక వారోత్సవాలను పురస్కరించుకొని ఆదివారం నాడు స్థానిక ఫైర్ స్టేషన్ నుండి డీఎఫ్ఓ వేణు జండా ఊపి ర్యాలీ ప్రారంభించారు వాహనాల ర్యాలీని కొత్త బస్టాండ్ మీదుగా ఆటోనగర్ చేరుకుంది ఎన్ డి ఆర్ ఎఫ్ అగ్నిమాపక శకటాలు ఈ ర్యాలీలో పాల్గొన్నాయి కొత్త బస్టాండ్ మీదుగా ఆటోనగర్ చేరుకొని అక్కడినుండి మళ్లీ పోలీస్ స్టేషన్ చేరుకున్నాయి డీఎఫ్ఓ వేణు ఎస్ ఎఫ్ ఓ వెంకటేష్ ఎస్ ఎఫ్ ఓ ప్రశాంత్ అగ్నిమాపక శాఖ సిబ్బంది పాల్గొన్నారు ఈ సందర్భంగా ప్రజలలో అగ్ని ప్రమాదాల నివారణ భద్రత చర్యలపై అవగాహన కల్పించారు ఈ కార్యక్రమంలో ఎల్ ఎఫ్ ఎఫ్ ప పి నరసయ్య  ఎఫ్ ఎఫ్ టి ఎండి కలలుద్దీన్ ఎఫ్ ఎఫ్ ఫరీద్ ఖాన్ ఎఫ్ ఎఫ్ ఎన్ నరేష్ కే సురేష్  హెచ్ జి ఎఫ్ ఎఫ్ ఎం స్వామి హెచ్ జి ఎఫ్ ఎఫ్ ఎం ప్రదీప్ హెచ్ జి ఎఫ్ ఎఫ్ ఎస్ నాగరాజు హెచ్ జి ఎఫ్ ఎఫ్ యు వెంకటేష్  తదితరులు పాల్గొన్నారు
    user_మెదక్ న్యూస్
    మెదక్ న్యూస్
    Medak, Telangana•
    1 hr ago
  • రాజా డాన్స్ స్టూడియో ఆధ్వర్యంలో పిల్లల కోసం ఏర్పాటు చేసిన కోచింగ్ సెంటర్ ఘనంగా ప్రారంభించబడింది. ఈ కార్యక్రమానికి పలువురు ముఖ్య అతిథులు హాజరై తమ శుభాకాంక్షలు తెలియజేశారు. కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షురాలు ఆంక్షరెడ్డి, పట్టణ అధ్యక్షులు రాజు, మాజీ ఎంపీపీ నైని యాదిగిరి, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ సర్దార్ ఖాన్, మార్కెట్ కమిటీ AMC డైరెక్టర్ వహీద్, జాకీర్‌తో పాటు గజ్వేల్ కౌన్సిలర్లు గుంటుకు లక్ష్మి శ్రీనివాస్, నక్క రాములు గౌడ్, ఎండి షకీల్ పాషా తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన అతిథులు చిన్నారులలో ప్రతిభను వెలికితీయడానికి ఇటువంటి డాన్స్ కోచింగ్ సెంటర్లు ఎంతో ఉపయోగపడతాయని పేర్కొన్నారు. నిర్వాహకులకు అభినందనలు తెలియజేస్తూ, భవిష్యత్తులో మరింత మంది పిల్లలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆకాంక్షించారు.
    4
    రాజా డాన్స్ స్టూడియో ఆధ్వర్యంలో పిల్లల కోసం ఏర్పాటు చేసిన కోచింగ్ సెంటర్ ఘనంగా ప్రారంభించబడింది. ఈ కార్యక్రమానికి పలువురు ముఖ్య అతిథులు హాజరై తమ శుభాకాంక్షలు తెలియజేశారు. కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షురాలు ఆంక్షరెడ్డి, పట్టణ అధ్యక్షులు రాజు, మాజీ ఎంపీపీ నైని యాదిగిరి, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ సర్దార్ ఖాన్, మార్కెట్ కమిటీ AMC డైరెక్టర్ వహీద్, జాకీర్‌తో పాటు గజ్వేల్ కౌన్సిలర్లు గుంటుకు లక్ష్మి శ్రీనివాస్, నక్క రాములు గౌడ్, ఎండి షకీల్ పాషా తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మాట్లాడిన అతిథులు చిన్నారులలో ప్రతిభను వెలికితీయడానికి ఇటువంటి డాన్స్ కోచింగ్ సెంటర్లు ఎంతో ఉపయోగపడతాయని పేర్కొన్నారు. నిర్వాహకులకు అభినందనలు తెలియజేస్తూ, భవిష్యత్తులో మరింత మంది పిల్లలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆకాంక్షించారు.
    user_Gousuddin Md
    Gousuddin Md
    అంబర్‌పేట్, హైదరాబాద్, తెలంగాణ•
    15 hrs ago
  • రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలంలో వడగళ్ళ వాన బీభత్సం సృష్టించింది. మర్రిమడ్ల, నిమ్మపల్లి గ్రామాల్లో అకాల వర్షం అన్నదాత నిలువునా ముంచింది. గాలివాన వడగళ్ళతో చేతికందే దశలో ఉన్న పంటలు నెలవాలాయి. కల్లాల్లో దాన్యం తడిసిపోయింది. రైతన్నకు తీరం నష్టాన్ని మిగిల్చింది. గాలివానకు చెట్లు కూలాయి, ఇళ్ల పైకప్పులు లేచిపోయాయి. నిమ్మపల్లి మర్రిమడ్ల గ్రామాల మధ్య రహదారిపై చెట్లు కూలడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు వెంటనే కూలిన చెట్లను తొలగించి ట్రాఫిక్ ను క్లియర్ చేశారు. పంట నష్టాన్ని చూసి రైతన్నలు ఆవేదనతో ఆందోళన చెందుతూ ప్రభుత్వం పంట నష్టాన్ని అంచనా వేసి ఆదుకోవాలని కోరుతున్నారు.
    1
    రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలంలో వడగళ్ళ వాన బీభత్సం సృష్టించింది. మర్రిమడ్ల, నిమ్మపల్లి గ్రామాల్లో అకాల వర్షం అన్నదాత నిలువునా ముంచింది. గాలివాన వడగళ్ళతో చేతికందే దశలో ఉన్న పంటలు నెలవాలాయి. కల్లాల్లో దాన్యం తడిసిపోయింది. రైతన్నకు తీరం నష్టాన్ని మిగిల్చింది. గాలివానకు చెట్లు కూలాయి, ఇళ్ల పైకప్పులు లేచిపోయాయి. నిమ్మపల్లి మర్రిమడ్ల గ్రామాల మధ్య రహదారిపై చెట్లు కూలడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు వెంటనే కూలిన చెట్లను తొలగించి ట్రాఫిక్ ను క్లియర్ చేశారు. పంట నష్టాన్ని చూసి రైతన్నలు ఆవేదనతో ఆందోళన చెందుతూ ప్రభుత్వం పంట నష్టాన్ని అంచనా వేసి ఆదుకోవాలని కోరుతున్నారు.
    user_K.V.REDDY
    K.V.REDDY
    చిగురుమామిడి, కరీంనగర్, తెలంగాణ•
    18 hrs ago
  • జనగాం జిల్లా కోడకండ్ల మండల కేంద్రానికి చెందిన రైతు ఈదుల అరవింద్, బయ్యన్న వాగు రిజర్వాయర్ పరిధిలో జరుగుతున్న అక్రమాలపై అధికారులకు ఫిర్యాదు చేశారు. చింతలకుంట కట్టను ధ్వంసం చేసి రిజర్వాయర్ గర్భంలో మట్టి పోసి అక్రమంగా సాగు చేస్తున్నారని ఆరోపించారు. ఇట్టబోయిన నరేష్ అనే వ్యక్తి తన అధికార పలుకుబడితో రిజర్వాయర్ భూములపై అక్రమ పట్టాలు సృష్టించి, ప్రభుత్వ పథకాలను దుర్వినియోగం చేస్తున్నారని తెలిపారు. అలాగే తమ పట్టా భూమిని ఆక్రమించుకునేందుకు కోర్టుల ద్వారా వేధింపులకు గురిచేస్తున్నాడని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ వేధింపుల కారణంగా తమ వృద్ధ తండ్రి అనారోగ్యానికి గురయ్యారని పేర్కొన్నారు. అక్రమాలపై విచారణ జరిపించి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని, తమ కుటుంబానికి న్యాయం చేయాలని కోరారు.
    2
    జనగాం జిల్లా కోడకండ్ల మండల కేంద్రానికి చెందిన  రైతు ఈదుల అరవింద్, బయ్యన్న వాగు రిజర్వాయర్ పరిధిలో జరుగుతున్న అక్రమాలపై అధికారులకు ఫిర్యాదు చేశారు. చింతలకుంట కట్టను ధ్వంసం చేసి రిజర్వాయర్ గర్భంలో మట్టి పోసి అక్రమంగా సాగు చేస్తున్నారని ఆరోపించారు.
ఇట్టబోయిన నరేష్ అనే వ్యక్తి తన అధికార పలుకుబడితో రిజర్వాయర్ భూములపై అక్రమ పట్టాలు సృష్టించి, ప్రభుత్వ పథకాలను దుర్వినియోగం చేస్తున్నారని తెలిపారు. అలాగే తమ పట్టా భూమిని ఆక్రమించుకునేందుకు కోర్టుల ద్వారా వేధింపులకు గురిచేస్తున్నాడని ఆవేదన వ్యక్తం చేశారు.
ఈ వేధింపుల కారణంగా తమ వృద్ధ తండ్రి అనారోగ్యానికి గురయ్యారని పేర్కొన్నారు. అక్రమాలపై విచారణ జరిపించి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని, తమ కుటుంబానికి న్యాయం చేయాలని కోరారు.
    user_M D Azizuddin
    M D Azizuddin
    జర్నలిస్ట్ వర్ధన్నపేట, వరంగల్, తెలంగాణ•
    2 hrs ago
  • మహిళల విషయంలో కాంగ్రెస్ పార్టీ అనుసరించిన వైఖరి అమానుషమని బిజెపి జన్నారం మండల అధ్యక్షులు మధుసూదన్ రావు అన్నారు. రాష్ట్రవ్యాప్త ఆందోళనలో భాగంగా బిజెపి జన్నారం మండల నాయకులు కార్యకర్తలు శనివారం సాయంత్రం జన్నారం మండల కేంద్రంలోని బస్టాండ్ వద్దనున్న ప్రధాన రహదారిపై ఆందోళన చేశారు. మహిళా సాధికారిత బిల్లు విషయంలో కాంగ్రెస్ పార్టీ అవలంబించిన తీరు సరికాదన్నారు. ఈ కార్యక్రమంలో బిజెపి నాయకులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో బిజెపి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
    1
    మహిళల విషయంలో కాంగ్రెస్ పార్టీ అనుసరించిన వైఖరి అమానుషమని బిజెపి జన్నారం మండల అధ్యక్షులు మధుసూదన్ రావు అన్నారు. రాష్ట్రవ్యాప్త ఆందోళనలో భాగంగా బిజెపి జన్నారం మండల నాయకులు కార్యకర్తలు శనివారం సాయంత్రం జన్నారం మండల కేంద్రంలోని బస్టాండ్ వద్దనున్న ప్రధాన రహదారిపై ఆందోళన చేశారు. మహిళా సాధికారిత బిల్లు విషయంలో కాంగ్రెస్ పార్టీ అవలంబించిన తీరు సరికాదన్నారు. ఈ కార్యక్రమంలో బిజెపి నాయకులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో బిజెపి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
    user_P.G. Murthy
    P.G. Murthy
    జన్నారం, మంచిర్యాల, తెలంగాణ•
    19 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.