logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

కోనరావుపేట మండలంలో వడగళ్ల వాన బీభత్సం... నేల వాలిన పంటలు... కూలిన చెట్లు... లేచిపోయిన ఇళ్ల‌ పైకప్పులు.. రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలంలో వడగళ్ళ వాన బీభత్సం సృష్టించింది. మర్రిమడ్ల, నిమ్మపల్లి గ్రామాల్లో అకాల వర్షం అన్నదాత నిలువునా ముంచింది. గాలివాన వడగళ్ళతో చేతికందే దశలో ఉన్న పంటలు నెలవాలాయి. కల్లాల్లో దాన్యం తడిసిపోయింది. రైతన్నకు తీరం నష్టాన్ని మిగిల్చింది. గాలివానకు చెట్లు కూలాయి, ఇళ్ల పైకప్పులు లేచిపోయాయి. నిమ్మపల్లి మర్రిమడ్ల గ్రామాల మధ్య రహదారిపై చెట్లు కూలడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు వెంటనే కూలిన చెట్లను తొలగించి ట్రాఫిక్ ను క్లియర్ చేశారు. పంట నష్టాన్ని చూసి రైతన్నలు ఆవేదనతో ఆందోళన చెందుతూ ప్రభుత్వం పంట నష్టాన్ని అంచనా వేసి ఆదుకోవాలని కోరుతున్నారు.

3 hrs ago
user_K.V.REDDY
K.V.REDDY
చిగురుమామిడి, కరీంనగర్, తెలంగాణ•
3 hrs ago

కోనరావుపేట మండలంలో వడగళ్ల వాన బీభత్సం... నేల వాలిన పంటలు... కూలిన చెట్లు... లేచిపోయిన ఇళ్ల‌ పైకప్పులు.. రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలంలో వడగళ్ళ వాన బీభత్సం సృష్టించింది. మర్రిమడ్ల, నిమ్మపల్లి గ్రామాల్లో అకాల వర్షం అన్నదాత నిలువునా ముంచింది. గాలివాన వడగళ్ళతో చేతికందే దశలో ఉన్న పంటలు నెలవాలాయి. కల్లాల్లో దాన్యం తడిసిపోయింది. రైతన్నకు తీరం నష్టాన్ని మిగిల్చింది. గాలివానకు చెట్లు కూలాయి, ఇళ్ల పైకప్పులు లేచిపోయాయి. నిమ్మపల్లి మర్రిమడ్ల గ్రామాల మధ్య రహదారిపై చెట్లు కూలడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు వెంటనే కూలిన చెట్లను తొలగించి ట్రాఫిక్ ను క్లియర్ చేశారు. పంట నష్టాన్ని చూసి రైతన్నలు ఆవేదనతో ఆందోళన చెందుతూ ప్రభుత్వం పంట నష్టాన్ని అంచనా వేసి ఆదుకోవాలని కోరుతున్నారు.

More news from తెలంగాణ and nearby areas
  • రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలోని శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో శంకర జయంతి మహోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. మహోత్సవాలు వైశాఖ శుద్ధ పాడ్యమి నుండి పంచమి వరకు ఐదు రోజులపాటు కొనసాగనున్నాయి. మహోత్సవాల్లో భాగంగా మొదటి రోజు స్వస్తి పుణ్యాహవాచనం నిర్వహించబడింది. అనంతరం మూలమూర్తులైన లక్ష్మీ గణపతి స్వామివారికి అధర్వశీర్ష పఠనంతో ఐదు రోజులపాటు అభిషేకాలు జరుగనున్నాయి. శ్రీ రాజరాజేశ్వర స్వామివారికి మహాన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకం నిర్వహించబడుతుంది. అలాగే రాజరాజేశ్వరి దేవి అమ్మవారికి దేవాలయ అర్చకులు ఆంతరంగికంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఉపనిషత్ భాష్య పారాయణం, వేద పారాయణాలు, ఇతర విశిష్ట పారాయణాలు కూడా నిర్వహించబడ్డాయి. ప్రతిరోజూ సాయంకాలం శంకర విజయము పై ప్రవచన కార్యక్రమాలు నిర్వహిస్తారు. మహోత్సవాల చివరి రోజు అయిన పంచమి నాడు సాయంకాలం వేద సదస్సు నిర్వహించబడుతుంది. అలాగే వైశాఖ మాస విశిష్టతను పురస్కరించుకుని వసంతోత్సవ పూజలు నిర్వహించి ఉత్సవాలను ఘనంగా ముగించనున్నారు.‌ ఈ కార్యక్రమాలు రాజన్న ఆలయం అభివృద్ధిలో భాగంగా ఆలయ అర్చకులు ఏకాంతంగా నిర్వహిస్తున్నారు.
    2
    రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలోని శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో శంకర జయంతి మహోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. మహోత్సవాలు వైశాఖ శుద్ధ పాడ్యమి నుండి పంచమి వరకు ఐదు రోజులపాటు కొనసాగనున్నాయి. మహోత్సవాల్లో భాగంగా మొదటి రోజు స్వస్తి పుణ్యాహవాచనం నిర్వహించబడింది. అనంతరం మూలమూర్తులైన లక్ష్మీ గణపతి స్వామివారికి అధర్వశీర్ష పఠనంతో ఐదు రోజులపాటు అభిషేకాలు జరుగనున్నాయి. శ్రీ రాజరాజేశ్వర స్వామివారికి మహాన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకం నిర్వహించబడుతుంది. అలాగే రాజరాజేశ్వరి దేవి అమ్మవారికి దేవాలయ అర్చకులు ఆంతరంగికంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఉపనిషత్ భాష్య పారాయణం, వేద పారాయణాలు, ఇతర విశిష్ట పారాయణాలు కూడా నిర్వహించబడ్డాయి. ప్రతిరోజూ సాయంకాలం శంకర విజయము పై ప్రవచన కార్యక్రమాలు నిర్వహిస్తారు. మహోత్సవాల చివరి రోజు అయిన పంచమి నాడు సాయంకాలం వేద సదస్సు నిర్వహించబడుతుంది. అలాగే వైశాఖ మాస విశిష్టతను పురస్కరించుకుని వసంతోత్సవ పూజలు నిర్వహించి ఉత్సవాలను ఘనంగా ముగించనున్నారు.‌ ఈ కార్యక్రమాలు రాజన్న ఆలయం అభివృద్ధిలో భాగంగా ఆలయ అర్చకులు ఏకాంతంగా నిర్వహిస్తున్నారు.
    user_K.V.REDDY
    K.V.REDDY
    చిగురుమామిడి, కరీంనగర్, తెలంగాణ•
    21 min ago
  • రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలోని ప్రసిద్ధ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం అనుబంధ ఆలయమైన శ్రీ భీమేశ్వర స్వామి ఆలయంలో సినీ హీరోయిన్ అనన్య నాగళ్ల దర్శనం చేసుకున్నారు.ఈ సందర్భంగా ఆమె స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి, కోడె మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం స్వామివారి మండపంలో ఆలయ అర్చకులు, వేద పండితులు ఆమెకు ఆశీర్వచనం అందజేశారు.ఈ కార్యక్రమంలో దేవస్థానం డీఈవో భాస్కర శర్మ ఆమెకు లడ్డూ ప్రసాదాన్ని అందజేశారు.ఇక ‘లీసా’ సినిమా షూటింగ్‌ను కరీంనగర్‌లో పూర్తి చేసుకున్న సందర్భంగా, చిత్ర యూనిట్ సభ్యులు కూడా ఈ దర్శనంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో డీపీఓ సతీష్ రెడ్డి, వీడియో గ్రాఫర్, డైరెక్టర్ జోహార్, ప్రొడ్యూసర్ చందు, అలాగే ప్రొడ్యూసర్ బీరప్ప నేని శివ పాల్గొన్నారు.
    1
    రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలోని ప్రసిద్ధ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం అనుబంధ ఆలయమైన శ్రీ భీమేశ్వర స్వామి ఆలయంలో సినీ హీరోయిన్ అనన్య నాగళ్ల దర్శనం చేసుకున్నారు.ఈ సందర్భంగా ఆమె స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి, కోడె మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం స్వామివారి మండపంలో ఆలయ అర్చకులు, వేద పండితులు ఆమెకు ఆశీర్వచనం అందజేశారు.ఈ కార్యక్రమంలో దేవస్థానం డీఈవో భాస్కర శర్మ ఆమెకు లడ్డూ ప్రసాదాన్ని అందజేశారు.ఇక ‘లీసా’ సినిమా షూటింగ్‌ను కరీంనగర్‌లో పూర్తి చేసుకున్న సందర్భంగా, చిత్ర యూనిట్ సభ్యులు కూడా ఈ దర్శనంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో డీపీఓ సతీష్ రెడ్డి, వీడియో గ్రాఫర్, డైరెక్టర్ జోహార్, ప్రొడ్యూసర్ చందు, అలాగే ప్రొడ్యూసర్ బీరప్ప నేని శివ పాల్గొన్నారు.
    user_Satheesh gangu
    Satheesh gangu
    జర్నలిస్ట్ సిరిసిల్ల, రాజన్న సిరిసిల్ల, తెలంగాణ•
    4 hrs ago
  • వరంగల్ జిల్లా నర్సంపేట: తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత నాయకత్వంలో ఈ నెల 25న ఉదయం 10 గంటలకు జరగనున్న నూతన పార్టీ ఆవిష్కరణ సభను విజయవంతం చేయాలని తెలంగాణ రాష్ట్ర జాగృతి నాయకుడు డాక్టర్ బోడా అనిల్ కుమార్ నాయక్ పిలుపునిచ్చారు. మహిళల సాధికారత, యువత అభివృద్ధి, ఆర్థిక-సామాజిక-రాజకీయ స్థితిగతుల మెరుగుదలే తమ ప్రధాన లక్ష్యమని తెలిపారు. ఈ కార్యక్రమానికి నర్సంపేట ప్రాంతానికి చెందిన మహిళలు, యువత పెద్ద సంఖ్యలో తరలి రావాలని కోరారు. ఈ సందర్భంగా యువ మహిళలతో కలిసి పోస్టర్లను ఆవిష్కరించారు.
    1
    వరంగల్ జిల్లా నర్సంపేట:
తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత నాయకత్వంలో ఈ నెల 25న ఉదయం 10 గంటలకు జరగనున్న నూతన పార్టీ ఆవిష్కరణ సభను విజయవంతం చేయాలని తెలంగాణ రాష్ట్ర జాగృతి నాయకుడు డాక్టర్ బోడా అనిల్ కుమార్ నాయక్ పిలుపునిచ్చారు.
మహిళల సాధికారత, యువత అభివృద్ధి, ఆర్థిక-సామాజిక-రాజకీయ స్థితిగతుల మెరుగుదలే తమ ప్రధాన లక్ష్యమని తెలిపారు. ఈ కార్యక్రమానికి నర్సంపేట ప్రాంతానికి చెందిన మహిళలు, యువత పెద్ద సంఖ్యలో తరలి రావాలని కోరారు.
ఈ సందర్భంగా యువ మహిళలతో కలిసి పోస్టర్లను ఆవిష్కరించారు.
    user_Mediya wgl medical wgl
    Mediya wgl medical wgl
    Doctor రైపర్తి, వరంగల్, తెలంగాణ•
    4 hrs ago
  • Devi
    5
    Devi
    user_Devi
    Devi
    బచ్చన్నపేట, జనగాం, తెలంగాణ•
    6 hrs ago
  • వరంగల్ నగరంలోని శంభునిపేట బుడగ జంగాల కాలనీలో ఓ యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. బీహార్‌కు చెందిన యువకుడు స్థానికంగా అద్దె ఇంట్లో ఉంటూ కూలీ పని చేస్తుండగా, ఇద్దరి మధ్య జరిగిన గొడవలు హత్యకు దారితీసినట్లు సమాచారం. మరో వ్యక్తి గొంతు కోసి పరారైనట్లు తెలుస్తోంది. మిల్స్ కాలనీ పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు.
    1
    వరంగల్ నగరంలోని శంభునిపేట బుడగ జంగాల కాలనీలో ఓ యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. బీహార్‌కు చెందిన యువకుడు స్థానికంగా అద్దె ఇంట్లో ఉంటూ కూలీ పని చేస్తుండగా, ఇద్దరి మధ్య జరిగిన గొడవలు హత్యకు దారితీసినట్లు సమాచారం. మరో వ్యక్తి గొంతు కోసి పరారైనట్లు తెలుస్తోంది. మిల్స్ కాలనీ పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు.
    user_M D Azizuddin
    M D Azizuddin
    జర్నలిస్ట్ వర్ధన్నపేట, వరంగల్, తెలంగాణ•
    3 hrs ago
  • జగిత్యాల ఎమ్మెల్యే డా.సంజయ్ పాల్పడుతున్న చిల్లర కుట్రలను చూసి ఆశ్చర్యం వ్యక్తం చేసిన మాజీ R&B మంత్రి ప్రశాంత్ రెడ్డి 20 తారీకు జరగబోయే కేసీఆర్ మహాసభ ను ఆటంకాలు కలిగించుటకు మరియు రాబోయే ఎన్నికల్లో నేను ఎక్కడ ఉడి పోతాను తెలియక సంబంధించిన అధికారులకు ఎలాంటి సమాచారం లేకుండా నియంతగా పరిపాలనను కొనసాగిస్తున్నట్లు ప్రజలే గమనించి రాబోయే ఎన్నికల్లో గుణపాఠం చెప్తారని మేము ఆశిస్తున్నాము అంటున్న టిఆర్ఎస్ నాయకులు
    1
    జగిత్యాల ఎమ్మెల్యే డా.సంజయ్ పాల్పడుతున్న చిల్లర కుట్రలను చూసి ఆశ్చర్యం వ్యక్తం చేసిన మాజీ R&B మంత్రి ప్రశాంత్ రెడ్డి 20 తారీకు జరగబోయే కేసీఆర్ మహాసభ ను ఆటంకాలు కలిగించుటకు మరియు రాబోయే ఎన్నికల్లో నేను ఎక్కడ ఉడి పోతాను తెలియక సంబంధించిన అధికారులకు ఎలాంటి సమాచారం లేకుండా నియంతగా పరిపాలనను కొనసాగిస్తున్నట్లు ప్రజలే గమనించి రాబోయే ఎన్నికల్లో గుణపాఠం చెప్తారని మేము ఆశిస్తున్నాము అంటున్న టిఆర్ఎస్ నాయకులు
    user_అబ్దుల్ ముసవ్విర్
    అబ్దుల్ ముసవ్విర్
    కోరుట్ల, జగిత్యాల, తెలంగాణ•
    14 hrs ago
  • లక్షెట్టిపేట మండలంలోని వెంకట్రావుపేట గ్రామంలో అవతార్ మెహర్ బాబా 30 వ వార్షికోత్సవాన్ని భక్తులు ఘనంగానే వివరించ నిర్వహించారు. మెహర్ బాబా సందర్భంగా వారు శనివారం సాయంత్రం వెంకట్రావు పేట గ్రామంలోనీ మెహర్బాబా సెంటర్ నుండి అన్ని వీధుల గుండా మెహర్ బాబా శోభాయాత్రను నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళలు నృత్యాలతో మెహర్ బాబా భక్తి గీతాలు పాడారు. ఈ కార్యక్రమంలో మెహర్ బాబా భక్తులు, తదితరులు పాల్గొన్నారు.
    1
    లక్షెట్టిపేట మండలంలోని వెంకట్రావుపేట గ్రామంలో అవతార్ మెహర్ బాబా 30 వ వార్షికోత్సవాన్ని భక్తులు ఘనంగానే వివరించ నిర్వహించారు. మెహర్ బాబా సందర్భంగా వారు శనివారం సాయంత్రం వెంకట్రావు పేట గ్రామంలోనీ మెహర్బాబా సెంటర్ నుండి అన్ని వీధుల గుండా మెహర్ బాబా శోభాయాత్రను నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళలు నృత్యాలతో మెహర్ బాబా భక్తి గీతాలు పాడారు. ఈ కార్యక్రమంలో మెహర్ బాబా భక్తులు, తదితరులు పాల్గొన్నారు.
    user_P.G. Murthy
    P.G. Murthy
    జన్నారం, మంచిర్యాల, తెలంగాణ•
    3 hrs ago
  • నాటి ధరణి, నేటి భూభారతితో పరిష్కారం కాని భూసమస్యల పరిష్కారానికి ప్రభుత్వం వెంటనే టైమ్ బాండ్ ప్రోగ్రాం చేపట్టాలని ప్రజామిత్ర ప్రోగ్రెసివ్ డెమోక్రాటిక్ ఫ్రంట్ డిమాండ్ చేసింది. కరీంనగర్ లో ప్రజామిత్ర ప్రోగ్రెసివ్ డెమోక్రాటిక్ ఫ్రంట్ ఆధ్వర్యంలో భూ సమస్య బాధితులతో సమావేశం నిర్వహించారు. సమావేశంలో ప్రజామిత్ర ప్రోగ్రెసివ్ డెమోక్రాటిక్ ఫ్రంట్ వ్యవస్థాపక రాష్ట్ర అధ్యక్షులు కొరివి వేణుగోపాల్, ఉరుమల్ల విశ్వం, నల్లాల కనకరాజు, బోయినిపల్లి చంద్రయ్య పాల్గొని భూ సమస్యలపై ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో 18 లక్షల ఇల్లు, 9 లక్షల ప్లాట్లు నిషేధిత జాబితాలో ఉన్నాయని తెలిపారు. కరీంనగర్ శివారులో 4500 ప్లాట్ లు నిషేధత జాబితాలో ఉన్నాయని వాటి పరిష్కారానికి ప్రభుత్వం ప్రత్యేక సమయం కెటాయించాలని కోరారు.
    2
    నాటి ధరణి, నేటి భూభారతితో పరిష్కారం కాని భూసమస్యల పరిష్కారానికి ప్రభుత్వం వెంటనే టైమ్ బాండ్ ప్రోగ్రాం చేపట్టాలని ప్రజామిత్ర ప్రోగ్రెసివ్ డెమోక్రాటిక్ ఫ్రంట్ డిమాండ్ చేసింది. కరీంనగర్ లో ప్రజామిత్ర ప్రోగ్రెసివ్ డెమోక్రాటిక్ ఫ్రంట్ ఆధ్వర్యంలో భూ సమస్య బాధితులతో సమావేశం నిర్వహించారు. సమావేశంలో ప్రజామిత్ర ప్రోగ్రెసివ్ డెమోక్రాటిక్ ఫ్రంట్ వ్యవస్థాపక రాష్ట్ర అధ్యక్షులు కొరివి వేణుగోపాల్, ఉరుమల్ల విశ్వం, నల్లాల కనకరాజు, బోయినిపల్లి చంద్రయ్య పాల్గొని భూ సమస్యలపై ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో 18 లక్షల ఇల్లు, 9 లక్షల ప్లాట్లు నిషేధిత జాబితాలో ఉన్నాయని తెలిపారు. కరీంనగర్ శివారులో 4500 ప్లాట్ లు నిషేధత జాబితాలో ఉన్నాయని వాటి పరిష్కారానికి ప్రభుత్వం ప్రత్యేక సమయం కెటాయించాలని కోరారు.
    user_K.V.REDDY
    K.V.REDDY
    చిగురుమామిడి, కరీంనగర్, తెలంగాణ•
    32 min ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.