logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

ప్రస్తుతం ప్రజలు చైతన్యవంతులు ప్రతి విషయం పట్ల అవగాహన కలిగిన వారు అని నేను అనుకుంటున్నాను జగిత్యాల ఎమ్మెల్యే డా.సంజయ్ పాల్పడుతున్న చిల్లర కుట్రలను చూసి ఆశ్చర్యం వ్యక్తం చేసిన మాజీ R&B మంత్రి ప్రశాంత్ రెడ్డి 20 తారీకు జరగబోయే కేసీఆర్ మహాసభ ను ఆటంకాలు కలిగించుటకు మరియు రాబోయే ఎన్నికల్లో నేను ఎక్కడ ఉడి పోతాను తెలియక సంబంధించిన అధికారులకు ఎలాంటి సమాచారం లేకుండా నియంతగా పరిపాలనను కొనసాగిస్తున్నట్లు ప్రజలే గమనించి రాబోయే ఎన్నికల్లో గుణపాఠం చెప్తారని మేము ఆశిస్తున్నాము అంటున్న టిఆర్ఎస్ నాయకులు

10 hrs ago
user_అబ్దుల్ ముసవ్విర్
అబ్దుల్ ముసవ్విర్
కోరుట్ల, జగిత్యాల, తెలంగాణ•
10 hrs ago

ప్రస్తుతం ప్రజలు చైతన్యవంతులు ప్రతి విషయం పట్ల అవగాహన కలిగిన వారు అని నేను అనుకుంటున్నాను జగిత్యాల ఎమ్మెల్యే డా.సంజయ్ పాల్పడుతున్న చిల్లర కుట్రలను చూసి ఆశ్చర్యం వ్యక్తం చేసిన మాజీ R&B మంత్రి ప్రశాంత్ రెడ్డి 20 తారీకు జరగబోయే కేసీఆర్ మహాసభ ను ఆటంకాలు కలిగించుటకు మరియు రాబోయే ఎన్నికల్లో నేను ఎక్కడ ఉడి పోతాను తెలియక సంబంధించిన అధికారులకు ఎలాంటి సమాచారం లేకుండా నియంతగా పరిపాలనను కొనసాగిస్తున్నట్లు ప్రజలే గమనించి రాబోయే ఎన్నికల్లో గుణపాఠం చెప్తారని మేము ఆశిస్తున్నాము అంటున్న టిఆర్ఎస్ నాయకులు

More news from తెలంగాణ and nearby areas
  • రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలోని శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం లో శంకర జయంతి మహోత్సవాలు వైభవంగా నిర్వహించబడుతున్నాయి. ఈ మహోత్సవాలు వైశాఖ శుద్ధ పాడ్యమి నుండి పంచమి వరకు ఐదు రోజులపాటు కొనసాగనున్నాయి.మహోత్సవాల్లో భాగంగా మొదటి రోజు స్వస్తి పుణ్యాహవాచనం నిర్వహించబడింది. అనంతరం మూలమూర్తులైన లక్ష్మీ గణపతి స్వామివారికి అధర్వశీర్ష పఠనంతో ఐదు రోజులపాటు అభిషేకాలు జరుగనున్నాయి. శ్రీ రాజరాజేశ్వర స్వామివారికి మహాన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకం నిర్వహించబడుతుంది. అలాగే రాజరాజేశ్వరి దేవి అమ్మవారికి దేవాలయ అర్చకులు ఆంతరంగికంగా ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు.ఈ సందర్భంగా ఉపనిషత్ భాష్య పారాయణం, వేద పారాయణాలు, ఇతర విశిష్ట పారాయణాలు కూడా నిర్వహించబడుతున్నాయి. ప్రతిరోజూ సాయంకాలం శంకర విజయము పై ప్రవచన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. మహోత్సవాల చివరి రోజు అయిన పంచమి నాడు సాయంకాలం వేద సదస్సు నిర్వహించబడుతుంది. అలాగే వైశాఖ మాస విశిష్టతను పురస్కరించుకుని వసంతోత్సవ పూజలు నిర్వహించి ఉత్సవాలను ఘనంగా ముగించనున్నారు.ఈ కార్యక్రమాలు రాజన్న ఆలయం అభివృద్ధిలో భాగంగా ఆలయ అర్చకులు ఏకాంతంగా నిర్వహిస్తున్నారు.
    1
    రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలోని శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం లో శంకర జయంతి మహోత్సవాలు వైభవంగా నిర్వహించబడుతున్నాయి. ఈ మహోత్సవాలు వైశాఖ శుద్ధ పాడ్యమి నుండి పంచమి వరకు ఐదు రోజులపాటు కొనసాగనున్నాయి.మహోత్సవాల్లో భాగంగా మొదటి రోజు స్వస్తి పుణ్యాహవాచనం నిర్వహించబడింది. అనంతరం మూలమూర్తులైన లక్ష్మీ గణపతి స్వామివారికి అధర్వశీర్ష పఠనంతో ఐదు రోజులపాటు అభిషేకాలు జరుగనున్నాయి. శ్రీ రాజరాజేశ్వర స్వామివారికి మహాన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకం నిర్వహించబడుతుంది. అలాగే రాజరాజేశ్వరి దేవి అమ్మవారికి దేవాలయ అర్చకులు ఆంతరంగికంగా ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు.ఈ సందర్భంగా ఉపనిషత్ భాష్య పారాయణం, వేద పారాయణాలు, ఇతర విశిష్ట పారాయణాలు కూడా నిర్వహించబడుతున్నాయి. ప్రతిరోజూ సాయంకాలం శంకర విజయము పై ప్రవచన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.
మహోత్సవాల చివరి రోజు అయిన పంచమి నాడు సాయంకాలం వేద సదస్సు నిర్వహించబడుతుంది. అలాగే వైశాఖ మాస విశిష్టతను పురస్కరించుకుని వసంతోత్సవ పూజలు నిర్వహించి ఉత్సవాలను ఘనంగా ముగించనున్నారు.ఈ కార్యక్రమాలు రాజన్న ఆలయం అభివృద్ధిలో భాగంగా ఆలయ అర్చకులు ఏకాంతంగా నిర్వహిస్తున్నారు.
    user_Satheesh gangu
    Satheesh gangu
    జర్నలిస్ట్ సిరిసిల్ల, రాజన్న సిరిసిల్ల, తెలంగాణ•
    44 min ago
  • కామారెడ్డి జిల్లాలో పెరుగుతున్న రోడ్డు ప్రమాదాల నేపథ్యంలో ప్రజలు తప్పనిసరిగా జాగ్రత్తలు పాటించాలని DSP విఠల్ రెడ్డి అన్నారు. పిట్లంలో నిర్వహించిన “అలైవ్ అరైవ్" కార్యక్రమంలో పాల్గొని ఆయన మాట్లాడారు. మద్యం సేవించి వాహనం నడపడం ప్రమాదాలకు ప్రధాన కారణమని తెలిపారు. ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ ధరించాలి, రాంగ్ రూట్ లో ప్రయాణించవద్దని సూచించారు. ట్రాఫిక్ నియమాలు పాటిస్తేనే ప్రమాదాలను తగ్గించవచ్చని అన్నారు.
    1
    కామారెడ్డి జిల్లాలో పెరుగుతున్న రోడ్డు ప్రమాదాల నేపథ్యంలో ప్రజలు తప్పనిసరిగా జాగ్రత్తలు పాటించాలని DSP విఠల్ రెడ్డి అన్నారు. పిట్లంలో నిర్వహించిన “అలైవ్ అరైవ్" కార్యక్రమంలో పాల్గొని ఆయన మాట్లాడారు. మద్యం సేవించి వాహనం నడపడం ప్రమాదాలకు ప్రధాన కారణమని తెలిపారు. ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ ధరించాలి, రాంగ్ రూట్ లో ప్రయాణించవద్దని సూచించారు. ట్రాఫిక్ నియమాలు పాటిస్తేనే ప్రమాదాలను తగ్గించవచ్చని అన్నారు.
    user_Narmala Swapna
    Narmala Swapna
    Tour operator నాగారెడ్డిపేట్, కామారెడ్డి, తెలంగాణ•
    21 hrs ago
  • సాధన సురుల ఇంద్రజాల విన్యాసాలు... గన్నేరువరం మండల కేంద్రంలో పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో సాధనసురుల ఇంద్రజాల విన్యాసాలు. సాధన సూర్యుల విన్యాసాలలో శత్రువుల నుండి మనం ఎలా రక్షించుకోవాలో కర్రతో కళాకారులు చేసిన విన్యాసాలు. అలాగే మట్టి తో మాణిక్యాలు తయారు చేసి రాళ్లతో దేవుళ్లను తయారు చేసి ప్రజలను ఆశ్చర్యపరుస్తున్న ఇంద్రజాల విన్యాసాలకు మండల కేంద్రంలో చప్పట్ల కేరింతల మధ్యన విన్యాసాలు చేశారు చివరిలో దయ్యం గెటప్తో అందర్నీ ఆశ్చర్యపరిచారు..
    1
    సాధన సురుల  ఇంద్రజాల విన్యాసాలు...
గన్నేరువరం మండల కేంద్రంలో పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో  సాధనసురుల ఇంద్రజాల విన్యాసాలు.
సాధన సూర్యుల విన్యాసాలలో శత్రువుల నుండి మనం ఎలా రక్షించుకోవాలో కర్రతో కళాకారులు చేసిన విన్యాసాలు. అలాగే మట్టి తో మాణిక్యాలు తయారు చేసి రాళ్లతో దేవుళ్లను తయారు చేసి ప్రజలను ఆశ్చర్యపరుస్తున్న ఇంద్రజాల విన్యాసాలకు మండల కేంద్రంలో చప్పట్ల కేరింతల మధ్యన విన్యాసాలు చేశారు చివరిలో దయ్యం గెటప్తో అందర్నీ ఆశ్చర్యపరిచారు..
    user_Vodnala thirupthi
    Vodnala thirupthi
    గన్నేరువరం, కరీంనగర్, తెలంగాణ•
    22 hrs ago
  • ప్రజల సమస్యలను పరిష్కరించడానికి గ్రామాలకే స్వయంగా వస్తానని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ తెలిపారు. ధర్మారం మండల కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్‌లో సుమారు 2 కోట్లతో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలకు మంత్రి లక్ష్మణ్ కుమార్ జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్షతో కలిసి శంకుస్థాపన చేసి, ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. ధర్మారం మండలంలోని అన్ని గ్రామాల్లో మౌలిక సదుపాయాల కల్పనకు కృషి చేస్తున్నామని తెలిపారు. గ్రామాల అభివృద్ధికి ప్రత్యేక నిధులు ఇవ్వడానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారని చెప్పారు. విద్యార్థులకు సాంకేతిక విద్య అందించేందుకు ఎర్రగుంటపల్లిలో అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్ ఏర్పాటు చేస్తున్నట్లు మంత్రి వివరించారు. ధర్మారం మండల కేంద్రంలోని ఎస్టీ మినీ గురుకుల పాఠశాలను పదవ తరగతి వరకు అప్‌గ్రేడ్ చేసి, 75 శాతం ట్రైబల్ విద్యార్థులకు, 25 శాతం ఇతర వర్గాలకు సీట్లు కేటాయిస్తామని తెలిపారు. మండల కేంద్రంలో మినీ స్టేడియం ఏర్పాటు చర్యలు తీసుకుంటున్నామని, ఇది యువతకు క్రీడల్లో ప్రోత్సాహం కలిగిస్తుందని మంత్రి పేర్కొన్నారు. పార్టీలకు అతీతంగా నియోజకవర్గ అభివృద్ధి లక్ష్యంగా ముందుకు సాగుతున్నామని మంత్రి తెలిపారు. ప్రజలు తమ సమస్యల పరిష్కారం కోసం హైదరాబాద్ వెళ్లాల్సిన అవసరం లేకుండా వారంలో మూడు రోజుల పాటు నియోజకవర్గంలో పర్యటిస్తూ సమస్యలు పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని మంత్రి కోరారు. మొక్కజొన్న రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, అవసరమైతే ధర్మారం మండల కేంద్రంలో కూడా మక్కజొన్న కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేస్తామని తెలిపారు.
    1
    ప్రజల సమస్యలను పరిష్కరించడానికి గ్రామాలకే స్వయంగా వస్తానని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ తెలిపారు. ధర్మారం మండల కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్‌లో సుమారు 2 కోట్లతో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలకు మంత్రి లక్ష్మణ్ కుమార్ జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్షతో కలిసి శంకుస్థాపన చేసి, ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. ధర్మారం మండలంలోని అన్ని గ్రామాల్లో మౌలిక సదుపాయాల కల్పనకు కృషి చేస్తున్నామని తెలిపారు.
గ్రామాల అభివృద్ధికి ప్రత్యేక నిధులు ఇవ్వడానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారని చెప్పారు. విద్యార్థులకు సాంకేతిక విద్య అందించేందుకు ఎర్రగుంటపల్లిలో అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్ ఏర్పాటు చేస్తున్నట్లు మంత్రి వివరించారు. ధర్మారం మండల కేంద్రంలోని ఎస్టీ మినీ గురుకుల పాఠశాలను పదవ తరగతి వరకు అప్‌గ్రేడ్ చేసి, 75 శాతం ట్రైబల్ విద్యార్థులకు, 25 శాతం ఇతర వర్గాలకు సీట్లు కేటాయిస్తామని తెలిపారు.
మండల కేంద్రంలో మినీ స్టేడియం ఏర్పాటు చర్యలు తీసుకుంటున్నామని, ఇది యువతకు క్రీడల్లో ప్రోత్సాహం కలిగిస్తుందని మంత్రి పేర్కొన్నారు.
పార్టీలకు అతీతంగా నియోజకవర్గ అభివృద్ధి లక్ష్యంగా ముందుకు సాగుతున్నామని మంత్రి తెలిపారు. ప్రజలు తమ సమస్యల పరిష్కారం కోసం హైదరాబాద్ వెళ్లాల్సిన అవసరం లేకుండా వారంలో మూడు రోజుల పాటు నియోజకవర్గంలో పర్యటిస్తూ సమస్యలు పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు.
ప్రభుత్వం ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని మంత్రి కోరారు. మొక్కజొన్న రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, అవసరమైతే ధర్మారం మండల కేంద్రంలో కూడా మక్కజొన్న కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేస్తామని తెలిపారు.
    user_K.V.REDDY
    K.V.REDDY
    చిగురుమామిడి, కరీంనగర్, తెలంగాణ•
    1 hr ago
  • అదిలాబాద్ మార్కెట్ యార్డ్ లో మక్కల కొనుగోళ్లను ప్రారంభించిన మున్సిపల్ చైర్ పర్సన్ బండారి అనూష సతీష్.
    1
    అదిలాబాద్ మార్కెట్ యార్డ్ లో మక్కల కొనుగోళ్లను ప్రారంభించిన మున్సిపల్ చైర్ పర్సన్ బండారి అనూష సతీష్.
    user_AlluriMahesh
    AlluriMahesh
    Local News Reporter Adilabad Urban, Telangana•
    3 hrs ago
  • క్రమశిక్షణ, సమయపాలన ప్రతి పోలీసుకు తప్పనిసరి శారీరక దృఢత్వం, ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ అవసరంచట్టం అందరికీ సమానం — ఏఆర్ డీఎస్పీ రంగా నాథ్ మెదక్ జిల్లా పోలీస్ కార్యాలయ ప్రాంగణంలో ఈ రోజు నిర్వహించిన పరేడ్ కార్యక్రమానికి ఏఆర్ డీఎస్పీ శ్రీ రంగా నాథ్ గారు హాజరై గౌరవ వందనం స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన పోలీస్ సిబ్బందికి క్రమశిక్షణ, సమయపాలన, శారీరక దృఢత్వం మరియు ఆరోగ్య పరిరక్షణపై పలు సూచనలు చేశారు. ప్రతి పోలీసు ప్రతిరోజూ వ్యాయామం చేయాలని, విధుల పట్ల నిర్లక్ష్యం చేయకుండా బాధ్యతతో పనిచేయాలని సూచించారు. శారీరక దృఢత్వంతో పాటు మానసిక ధైర్యం, చట్టాలపై అవగాహన కూడా అవసరమని పేర్కొన్నారు. చట్టం అందరికీ సమానంగా అమలులో ఉండేలా కృషి చేయాలని, చట్టవ్యతిరేక కార్యకలాపాల్లో పాల్గొనే వారికి ఎలాంటి మినహాయింపులు ఉండవని హెచ్చరించారు. విధులను నిర్వర్తించే సమయంలో చెడు అలవాట్లకు దూరంగా ఉండి, ప్రజలకు సమర్థవంతమైన సేవలు అందించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మెదక్ రూరల్ సీఐ జర్జ్, ఆర్ఐ లు శైలందర్, రామకృష్ణ, ఎసై లు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
    1
    క్రమశిక్షణ, సమయపాలన ప్రతి పోలీసుకు తప్పనిసరి
శారీరక దృఢత్వం, ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ అవసరంచట్టం అందరికీ సమానం — ఏఆర్ డీఎస్పీ రంగా నాథ్
మెదక్ జిల్లా పోలీస్ కార్యాలయ ప్రాంగణంలో ఈ రోజు నిర్వహించిన పరేడ్ కార్యక్రమానికి ఏఆర్ డీఎస్పీ శ్రీ రంగా నాథ్ గారు హాజరై గౌరవ వందనం స్వీకరించారు.
ఈ సందర్భంగా ఆయన పోలీస్ సిబ్బందికి క్రమశిక్షణ, సమయపాలన, శారీరక దృఢత్వం మరియు ఆరోగ్య పరిరక్షణపై పలు సూచనలు చేశారు. ప్రతి పోలీసు ప్రతిరోజూ వ్యాయామం చేయాలని, విధుల పట్ల నిర్లక్ష్యం చేయకుండా బాధ్యతతో పనిచేయాలని సూచించారు.
శారీరక దృఢత్వంతో పాటు మానసిక ధైర్యం, చట్టాలపై అవగాహన కూడా అవసరమని పేర్కొన్నారు. చట్టం అందరికీ సమానంగా అమలులో ఉండేలా కృషి చేయాలని, చట్టవ్యతిరేక కార్యకలాపాల్లో పాల్గొనే వారికి ఎలాంటి మినహాయింపులు ఉండవని హెచ్చరించారు.
విధులను నిర్వర్తించే సమయంలో చెడు అలవాట్లకు దూరంగా ఉండి, ప్రజలకు సమర్థవంతమైన సేవలు అందించాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో మెదక్ రూరల్ సీఐ జర్జ్, ఆర్ఐ లు శైలందర్, రామకృష్ణ, ఎసై లు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
    user_మెదక్ న్యూస్
    మెదక్ న్యూస్
    హవేలీఘనాపూర్, మెదక్, తెలంగాణ•
    4 hrs ago
  • హైదరాబాదు బయలుదేరిన ఉద్యమకారులు ఉద్యమ కళాకారులు రాజన్న సిరిసిల్ల జిల్లా నుండి హైదరాబాదులో జరుగు ఉద్యమకారుల ఉద్యమ కళా కారుల సదస్సుకు తరలి వెళ్లారు. రాజన్న సిరిసిల్ల జిల్లా నుండి హైదరాబాదుకు వెళ్ళిన వారిలో రాష్ట్ర కన్వీనర్ యెల్ల పోశెట్టి రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షులు బొజ్జ కనకయ్య ఉత్తర తెలంగాణ కన్వీనర్ బొడ్డు రాములు రాజన్న సిరిసిల్ల జిల్లా ఉద్యమ కళా కారుల జిల్లా అధ్యక్షులు వారాల దేవయ్య జిల్లా ఉపాధ్యక్షులు కనపర్తి హనుమాన్లుజిల్లా కార్యదర్శి మానువాడ లక్ష్మీనారాయణ మొగులోజి లక్ష్మీరాజం.దొంగరి లక్ష్మీరాజం. జిల్లా నాయకులు బొడ్డు నారాయణ.సిరిసిల్ల. శంకర్ పుల్కం లచ్చన్న దుమ్మా లక్ష్మీరాజం ఎర్ర రవి రాజా మామిండ్ల సత్తయ్య మెరుపుల గంగాధర్ బిల్లా వెంకట్ నర్సయ్య ఛావనపల్లి లక్ష్మీనారాయణ నల్లగొండ శ్రీనివాస్ మునిగంటి లక్ష్మీపతి తదితర కళాకారులు 60 మంది వరకు పాల్గొన్నారు.
    2
    హైదరాబాదు బయలుదేరిన ఉద్యమకారులు ఉద్యమ కళాకారులు రాజన్న సిరిసిల్ల జిల్లా నుండి హైదరాబాదులో జరుగు ఉద్యమకారుల ఉద్యమ కళా కారుల సదస్సుకు తరలి వెళ్లారు.  రాజన్న సిరిసిల్ల జిల్లా నుండి హైదరాబాదుకు వెళ్ళిన వారిలో రాష్ట్ర కన్వీనర్ యెల్ల పోశెట్టి రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షులు బొజ్జ కనకయ్య ఉత్తర తెలంగాణ కన్వీనర్ బొడ్డు రాములు రాజన్న సిరిసిల్ల జిల్లా ఉద్యమ కళా కారుల జిల్లా అధ్యక్షులు వారాల దేవయ్య జిల్లా ఉపాధ్యక్షులు కనపర్తి హనుమాన్లుజిల్లా కార్యదర్శి మానువాడ లక్ష్మీనారాయణ మొగులోజి లక్ష్మీరాజం.దొంగరి లక్ష్మీరాజం. జిల్లా నాయకులు బొడ్డు నారాయణ.సిరిసిల్ల. శంకర్ పుల్కం లచ్చన్న దుమ్మా లక్ష్మీరాజం ఎర్ర రవి రాజా మామిండ్ల సత్తయ్య మెరుపుల గంగాధర్ బిల్లా వెంకట్ నర్సయ్య ఛావనపల్లి లక్ష్మీనారాయణ నల్లగొండ శ్రీనివాస్ మునిగంటి లక్ష్మీపతి తదితర కళాకారులు 60 మంది వరకు పాల్గొన్నారు.
    user_Satheesh gangu
    Satheesh gangu
    జర్నలిస్ట్ సిరిసిల్ల, రాజన్న సిరిసిల్ల, తెలంగాణ•
    8 hrs ago
  • కామారెడ్డి జిల్లా ఎస్పీ కార్యాలయంలో ప్రత్యేక ఆపరేషన్ నిర్వహించారు. ఈ సందర్భంగా అధికారులతో భద్రతా అంశాలపై సమీక్ష నిర్వహించారు. రోడ్డు ప్రమాదాలను తగ్గించేందుకు రోడ్ సేఫ్టీ అవగాహన కార్యక్రమం నిర్వహించి, ట్రాఫిక్ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని సూచించారు. అదేవిధంగా CPR అవగాహన కార్యక్రమం నిర్వహించారు. గుండె ఆగిన సందర్భాల్లో ఎలా స్పందించాలి, ప్రాణాలను ఎలా కాపాడాలి అనే విషయాలను సిబ్బందికి వివరించారు.
    1
    కామారెడ్డి జిల్లా ఎస్పీ కార్యాలయంలో ప్రత్యేక ఆపరేషన్ నిర్వహించారు. ఈ సందర్భంగా అధికారులతో భద్రతా అంశాలపై సమీక్ష నిర్వహించారు. రోడ్డు ప్రమాదాలను తగ్గించేందుకు రోడ్ సేఫ్టీ అవగాహన కార్యక్రమం నిర్వహించి, ట్రాఫిక్ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని సూచించారు. అదేవిధంగా CPR అవగాహన కార్యక్రమం నిర్వహించారు. గుండె ఆగిన సందర్భాల్లో ఎలా స్పందించాలి, ప్రాణాలను ఎలా కాపాడాలి అనే విషయాలను సిబ్బందికి వివరించారు.
    user_Narmala Swapna
    Narmala Swapna
    Tour operator నాగారెడ్డిపేట్, కామారెడ్డి, తెలంగాణ•
    21 hrs ago
  • ఆర్టీసీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని, ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని డిమాండ్ చేస్తూ కరీంనగర్ లో ఆర్టీసీ కార్మికులు ఆందోళనకు దిగారు. ఆర్టీసీ కార్మికుల జేఏసీ ఆధ్వర్యంలో కరీంనగర్ 1 డిపో ముందు ఆర్టీసీ కార్మికులు ధర్నా చేశారు. నిరసనలో కార్మికులు పెద్ద సంఖ్యలో పాల్గొని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఆర్టీసీ ఆస్తులను ప్రైవేటుపరం చేసే దిశగా ప్రభుత్వం పని చేస్తోందని ఆరోపిస్తూ, “మా భూములు మాకే – మా ఆస్తులు మాకే” అంటూ నినాదాలు చేశారు. ఆర్టీసీ కార్పొరేషన్ రాష్ట్ర ప్రభుత్వానికి కాకుండా కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో పనిచేస్తోందని, అలాంటి పరిస్థితిలో ఆస్తులను అమ్మేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నించడం సరికాదని పేర్కొన్నారు. ఎలక్ట్రిక్ బస్సులను ప్రభుత్వ పరంగా కొనసాగించాలని, వాటి ద్వారా కేంద్ర ప్రభుత్వానికి లాభం చేకూర్చే విధంగా కాకుండా ప్రజా రవాణా బలోపేతానికి ఉపయోగించాలని డిమాండ్ చేశారు. ఆర్టీసీని పూర్తిగా ప్రభుత్వంలో విలీనం చేసి కార్మికుల హక్కులను కాపాడాలని, వారి సమస్యలను తక్షణమే పరిష్కరించాలని లేనిపక్షంలో రాష్ట్రవ్యాప్తంగా సమ్మెకు దిగుతామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు.
    1
    ఆర్టీసీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని, ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని డిమాండ్ చేస్తూ కరీంనగర్ లో ఆర్టీసీ కార్మికులు ఆందోళనకు దిగారు. ఆర్టీసీ కార్మికుల జేఏసీ ఆధ్వర్యంలో కరీంనగర్ 1 డిపో ముందు ఆర్టీసీ కార్మికులు ధర్నా చేశారు. నిరసనలో కార్మికులు పెద్ద సంఖ్యలో పాల్గొని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
ఆర్టీసీ ఆస్తులను ప్రైవేటుపరం చేసే దిశగా ప్రభుత్వం పని చేస్తోందని ఆరోపిస్తూ, “మా భూములు మాకే – మా ఆస్తులు మాకే” అంటూ నినాదాలు చేశారు. ఆర్టీసీ కార్పొరేషన్ రాష్ట్ర ప్రభుత్వానికి కాకుండా కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో పనిచేస్తోందని, అలాంటి పరిస్థితిలో ఆస్తులను అమ్మేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నించడం సరికాదని పేర్కొన్నారు. ఎలక్ట్రిక్ బస్సులను ప్రభుత్వ పరంగా కొనసాగించాలని, వాటి ద్వారా కేంద్ర ప్రభుత్వానికి లాభం చేకూర్చే విధంగా కాకుండా ప్రజా రవాణా బలోపేతానికి ఉపయోగించాలని డిమాండ్ చేశారు. ఆర్టీసీని పూర్తిగా ప్రభుత్వంలో విలీనం చేసి కార్మికుల హక్కులను కాపాడాలని, వారి సమస్యలను తక్షణమే పరిష్కరించాలని లేనిపక్షంలో రాష్ట్రవ్యాప్తంగా సమ్మెకు దిగుతామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు.
    user_K.V.REDDY
    K.V.REDDY
    చిగురుమామిడి, కరీంనగర్, తెలంగాణ•
    1 hr ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.