logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

కరీంనగర్ లో ఆందోళనకు దిగిన ఆర్టీసీ కార్మికులు... సమస్యలు వెంటనే పరిష్కరించకుంటే సమ్మె తప్పదని హెచ్చరిక ఆర్టీసీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని, ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని డిమాండ్ చేస్తూ కరీంనగర్ లో ఆర్టీసీ కార్మికులు ఆందోళనకు దిగారు. ఆర్టీసీ కార్మికుల జేఏసీ ఆధ్వర్యంలో కరీంనగర్ 1 డిపో ముందు ఆర్టీసీ కార్మికులు ధర్నా చేశారు. నిరసనలో కార్మికులు పెద్ద సంఖ్యలో పాల్గొని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఆర్టీసీ ఆస్తులను ప్రైవేటుపరం చేసే దిశగా ప్రభుత్వం పని చేస్తోందని ఆరోపిస్తూ, “మా భూములు మాకే – మా ఆస్తులు మాకే” అంటూ నినాదాలు చేశారు. ఆర్టీసీ కార్పొరేషన్ రాష్ట్ర ప్రభుత్వానికి కాకుండా కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో పనిచేస్తోందని, అలాంటి పరిస్థితిలో ఆస్తులను అమ్మేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నించడం సరికాదని పేర్కొన్నారు. ఎలక్ట్రిక్ బస్సులను ప్రభుత్వ పరంగా కొనసాగించాలని, వాటి ద్వారా కేంద్ర ప్రభుత్వానికి లాభం చేకూర్చే విధంగా కాకుండా ప్రజా రవాణా బలోపేతానికి ఉపయోగించాలని డిమాండ్ చేశారు. ఆర్టీసీని పూర్తిగా ప్రభుత్వంలో విలీనం చేసి కార్మికుల హక్కులను కాపాడాలని, వారి సమస్యలను తక్షణమే పరిష్కరించాలని లేనిపక్షంలో రాష్ట్రవ్యాప్తంగా సమ్మెకు దిగుతామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు.

2 hrs ago
user_K.V.REDDY
K.V.REDDY
చిగురుమామిడి, కరీంనగర్, తెలంగాణ•
2 hrs ago

కరీంనగర్ లో ఆందోళనకు దిగిన ఆర్టీసీ కార్మికులు... సమస్యలు వెంటనే పరిష్కరించకుంటే సమ్మె తప్పదని హెచ్చరిక ఆర్టీసీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని, ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని డిమాండ్ చేస్తూ కరీంనగర్ లో ఆర్టీసీ కార్మికులు ఆందోళనకు దిగారు. ఆర్టీసీ కార్మికుల జేఏసీ ఆధ్వర్యంలో కరీంనగర్ 1 డిపో ముందు ఆర్టీసీ కార్మికులు ధర్నా చేశారు. నిరసనలో కార్మికులు పెద్ద సంఖ్యలో పాల్గొని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఆర్టీసీ ఆస్తులను ప్రైవేటుపరం చేసే దిశగా ప్రభుత్వం పని చేస్తోందని ఆరోపిస్తూ, “మా భూములు మాకే – మా ఆస్తులు మాకే” అంటూ నినాదాలు చేశారు. ఆర్టీసీ కార్పొరేషన్ రాష్ట్ర ప్రభుత్వానికి కాకుండా కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో పనిచేస్తోందని, అలాంటి పరిస్థితిలో ఆస్తులను అమ్మేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నించడం సరికాదని పేర్కొన్నారు. ఎలక్ట్రిక్ బస్సులను ప్రభుత్వ పరంగా కొనసాగించాలని, వాటి ద్వారా కేంద్ర ప్రభుత్వానికి లాభం చేకూర్చే విధంగా కాకుండా ప్రజా రవాణా బలోపేతానికి ఉపయోగించాలని డిమాండ్ చేశారు. ఆర్టీసీని పూర్తిగా ప్రభుత్వంలో విలీనం చేసి కార్మికుల హక్కులను కాపాడాలని, వారి సమస్యలను తక్షణమే పరిష్కరించాలని లేనిపక్షంలో రాష్ట్రవ్యాప్తంగా సమ్మెకు దిగుతామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు.

More news from తెలంగాణ and nearby areas
  • ప్రజల సమస్యలను పరిష్కరించడానికి గ్రామాలకే స్వయంగా వస్తానని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ తెలిపారు. ధర్మారం మండల కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్‌లో సుమారు 2 కోట్లతో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలకు మంత్రి లక్ష్మణ్ కుమార్ జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్షతో కలిసి శంకుస్థాపన చేసి, ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. ధర్మారం మండలంలోని అన్ని గ్రామాల్లో మౌలిక సదుపాయాల కల్పనకు కృషి చేస్తున్నామని తెలిపారు. గ్రామాల అభివృద్ధికి ప్రత్యేక నిధులు ఇవ్వడానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారని చెప్పారు. విద్యార్థులకు సాంకేతిక విద్య అందించేందుకు ఎర్రగుంటపల్లిలో అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్ ఏర్పాటు చేస్తున్నట్లు మంత్రి వివరించారు. ధర్మారం మండల కేంద్రంలోని ఎస్టీ మినీ గురుకుల పాఠశాలను పదవ తరగతి వరకు అప్‌గ్రేడ్ చేసి, 75 శాతం ట్రైబల్ విద్యార్థులకు, 25 శాతం ఇతర వర్గాలకు సీట్లు కేటాయిస్తామని తెలిపారు. మండల కేంద్రంలో మినీ స్టేడియం ఏర్పాటు చర్యలు తీసుకుంటున్నామని, ఇది యువతకు క్రీడల్లో ప్రోత్సాహం కలిగిస్తుందని మంత్రి పేర్కొన్నారు. పార్టీలకు అతీతంగా నియోజకవర్గ అభివృద్ధి లక్ష్యంగా ముందుకు సాగుతున్నామని మంత్రి తెలిపారు. ప్రజలు తమ సమస్యల పరిష్కారం కోసం హైదరాబాద్ వెళ్లాల్సిన అవసరం లేకుండా వారంలో మూడు రోజుల పాటు నియోజకవర్గంలో పర్యటిస్తూ సమస్యలు పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని మంత్రి కోరారు. మొక్కజొన్న రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, అవసరమైతే ధర్మారం మండల కేంద్రంలో కూడా మక్కజొన్న కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేస్తామని తెలిపారు.
    1
    ప్రజల సమస్యలను పరిష్కరించడానికి గ్రామాలకే స్వయంగా వస్తానని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ తెలిపారు. ధర్మారం మండల కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్‌లో సుమారు 2 కోట్లతో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలకు మంత్రి లక్ష్మణ్ కుమార్ జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్షతో కలిసి శంకుస్థాపన చేసి, ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. ధర్మారం మండలంలోని అన్ని గ్రామాల్లో మౌలిక సదుపాయాల కల్పనకు కృషి చేస్తున్నామని తెలిపారు.
గ్రామాల అభివృద్ధికి ప్రత్యేక నిధులు ఇవ్వడానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారని చెప్పారు. విద్యార్థులకు సాంకేతిక విద్య అందించేందుకు ఎర్రగుంటపల్లిలో అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్ ఏర్పాటు చేస్తున్నట్లు మంత్రి వివరించారు. ధర్మారం మండల కేంద్రంలోని ఎస్టీ మినీ గురుకుల పాఠశాలను పదవ తరగతి వరకు అప్‌గ్రేడ్ చేసి, 75 శాతం ట్రైబల్ విద్యార్థులకు, 25 శాతం ఇతర వర్గాలకు సీట్లు కేటాయిస్తామని తెలిపారు.
మండల కేంద్రంలో మినీ స్టేడియం ఏర్పాటు చర్యలు తీసుకుంటున్నామని, ఇది యువతకు క్రీడల్లో ప్రోత్సాహం కలిగిస్తుందని మంత్రి పేర్కొన్నారు.
పార్టీలకు అతీతంగా నియోజకవర్గ అభివృద్ధి లక్ష్యంగా ముందుకు సాగుతున్నామని మంత్రి తెలిపారు. ప్రజలు తమ సమస్యల పరిష్కారం కోసం హైదరాబాద్ వెళ్లాల్సిన అవసరం లేకుండా వారంలో మూడు రోజుల పాటు నియోజకవర్గంలో పర్యటిస్తూ సమస్యలు పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు.
ప్రభుత్వం ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని మంత్రి కోరారు. మొక్కజొన్న రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, అవసరమైతే ధర్మారం మండల కేంద్రంలో కూడా మక్కజొన్న కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేస్తామని తెలిపారు.
    user_K.V.REDDY
    K.V.REDDY
    చిగురుమామిడి, కరీంనగర్, తెలంగాణ•
    1 hr ago
  • సాధన సురుల ఇంద్రజాల విన్యాసాలు... గన్నేరువరం మండల కేంద్రంలో పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో సాధనసురుల ఇంద్రజాల విన్యాసాలు. సాధన సూర్యుల విన్యాసాలలో శత్రువుల నుండి మనం ఎలా రక్షించుకోవాలో కర్రతో కళాకారులు చేసిన విన్యాసాలు. అలాగే మట్టి తో మాణిక్యాలు తయారు చేసి రాళ్లతో దేవుళ్లను తయారు చేసి ప్రజలను ఆశ్చర్యపరుస్తున్న ఇంద్రజాల విన్యాసాలకు మండల కేంద్రంలో చప్పట్ల కేరింతల మధ్యన విన్యాసాలు చేశారు చివరిలో దయ్యం గెటప్తో అందర్నీ ఆశ్చర్యపరిచారు..
    1
    సాధన సురుల  ఇంద్రజాల విన్యాసాలు...
గన్నేరువరం మండల కేంద్రంలో పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో  సాధనసురుల ఇంద్రజాల విన్యాసాలు.
సాధన సూర్యుల విన్యాసాలలో శత్రువుల నుండి మనం ఎలా రక్షించుకోవాలో కర్రతో కళాకారులు చేసిన విన్యాసాలు. అలాగే మట్టి తో మాణిక్యాలు తయారు చేసి రాళ్లతో దేవుళ్లను తయారు చేసి ప్రజలను ఆశ్చర్యపరుస్తున్న ఇంద్రజాల విన్యాసాలకు మండల కేంద్రంలో చప్పట్ల కేరింతల మధ్యన విన్యాసాలు చేశారు చివరిలో దయ్యం గెటప్తో అందర్నీ ఆశ్చర్యపరిచారు..
    user_Vodnala thirupthi
    Vodnala thirupthi
    గన్నేరువరం, కరీంనగర్, తెలంగాణ•
    23 hrs ago
  • రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలోని ప్రసిద్ధ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం అనుబంధ ఆలయమైన శ్రీ భీమేశ్వర స్వామి ఆలయంలో సినీ హీరోయిన్ అనన్య నాగళ్ల దర్శనం చేసుకున్నారు.ఈ సందర్భంగా ఆమె స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి, కోడె మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం స్వామివారి మండపంలో ఆలయ అర్చకులు, వేద పండితులు ఆమెకు ఆశీర్వచనం అందజేశారు.ఈ కార్యక్రమంలో దేవస్థానం డీఈవో భాస్కర శర్మ ఆమెకు లడ్డూ ప్రసాదాన్ని అందజేశారు.ఇక ‘లీసా’ సినిమా షూటింగ్‌ను కరీంనగర్‌లో పూర్తి చేసుకున్న సందర్భంగా, చిత్ర యూనిట్ సభ్యులు కూడా ఈ దర్శనంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో డీపీఓ సతీష్ రెడ్డి, వీడియో గ్రాఫర్, డైరెక్టర్ జోహార్, ప్రొడ్యూసర్ చందు, అలాగే ప్రొడ్యూసర్ బీరప్ప నేని శివ పాల్గొన్నారు.
    1
    రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలోని ప్రసిద్ధ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం అనుబంధ ఆలయమైన శ్రీ భీమేశ్వర స్వామి ఆలయంలో సినీ హీరోయిన్ అనన్య నాగళ్ల దర్శనం చేసుకున్నారు.ఈ సందర్భంగా ఆమె స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి, కోడె మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం స్వామివారి మండపంలో ఆలయ అర్చకులు, వేద పండితులు ఆమెకు ఆశీర్వచనం అందజేశారు.ఈ కార్యక్రమంలో దేవస్థానం డీఈవో భాస్కర శర్మ ఆమెకు లడ్డూ ప్రసాదాన్ని అందజేశారు.ఇక ‘లీసా’ సినిమా షూటింగ్‌ను కరీంనగర్‌లో పూర్తి చేసుకున్న సందర్భంగా, చిత్ర యూనిట్ సభ్యులు కూడా ఈ దర్శనంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో డీపీఓ సతీష్ రెడ్డి, వీడియో గ్రాఫర్, డైరెక్టర్ జోహార్, ప్రొడ్యూసర్ చందు, అలాగే ప్రొడ్యూసర్ బీరప్ప నేని శివ పాల్గొన్నారు.
    user_Satheesh gangu
    Satheesh gangu
    జర్నలిస్ట్ సిరిసిల్ల, రాజన్న సిరిసిల్ల, తెలంగాణ•
    38 min ago
  • వరంగల్ జిల్లా నర్సంపేట: తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత నాయకత్వంలో ఈ నెల 25న ఉదయం 10 గంటలకు జరగనున్న నూతన పార్టీ ఆవిష్కరణ సభను విజయవంతం చేయాలని తెలంగాణ రాష్ట్ర జాగృతి నాయకుడు డాక్టర్ బోడా అనిల్ కుమార్ నాయక్ పిలుపునిచ్చారు. మహిళల సాధికారత, యువత అభివృద్ధి, ఆర్థిక-సామాజిక-రాజకీయ స్థితిగతుల మెరుగుదలే తమ ప్రధాన లక్ష్యమని తెలిపారు. ఈ కార్యక్రమానికి నర్సంపేట ప్రాంతానికి చెందిన మహిళలు, యువత పెద్ద సంఖ్యలో తరలి రావాలని కోరారు. ఈ సందర్భంగా యువ మహిళలతో కలిసి పోస్టర్లను ఆవిష్కరించారు.
    1
    వరంగల్ జిల్లా నర్సంపేట:
తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత నాయకత్వంలో ఈ నెల 25న ఉదయం 10 గంటలకు జరగనున్న నూతన పార్టీ ఆవిష్కరణ సభను విజయవంతం చేయాలని తెలంగాణ రాష్ట్ర జాగృతి నాయకుడు డాక్టర్ బోడా అనిల్ కుమార్ నాయక్ పిలుపునిచ్చారు.
మహిళల సాధికారత, యువత అభివృద్ధి, ఆర్థిక-సామాజిక-రాజకీయ స్థితిగతుల మెరుగుదలే తమ ప్రధాన లక్ష్యమని తెలిపారు. ఈ కార్యక్రమానికి నర్సంపేట ప్రాంతానికి చెందిన మహిళలు, యువత పెద్ద సంఖ్యలో తరలి రావాలని కోరారు.
ఈ సందర్భంగా యువ మహిళలతో కలిసి పోస్టర్లను ఆవిష్కరించారు.
    user_Mediya wgl medical wgl
    Mediya wgl medical wgl
    Doctor రైపర్తి, వరంగల్, తెలంగాణ•
    36 min ago
  • Devi
    5
    Devi
    user_Devi
    Devi
    బచ్చన్నపేట, జనగాం, తెలంగాణ•
    3 hrs ago
  • జయశంకర్ భూపాలపల్లి జిల్లా మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజీని ఉమ్మడి వరంగల్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ నాయకులు సందర్శించారు. మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, మాజీ ఎంపీ మాలోత్ కవిత, మాజీ ఎమ్మెల్యేలు ఆరూరి రమేష్, వినయ్ భాస్కర్, గండ్ర వెంకటరమణ రెడ్డి, తాటికొండ రాజయ్య, శంకర్ నాయక్, పుట్ట మధు తదితరులు బ్యారేజీలో కుంగిన పిల్లర్లను పరిశీలించారు. ఈ సందర్భంగా ఎర్రబెల్లి దయాకర్ రావు మాట్లాడుతూ రేవంత్ రెడ్డి ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టును నిర్లక్ష్యం చేస్తోందని విమర్శించారు. మరమ్మతులు చేపట్టకుండా రైతులను ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆరోపించారు. సన్న వడ్లకు బోనస్, రైతు బంధు కూడా అమలు కావడం లేదని అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుతో రాష్ట్రానికి నీటి భరోసా లభించిందని, ప్రపంచ స్థాయి ప్రాజెక్టుగా గుర్తింపు పొందిందని తెలిపారు. ఈ ప్రభుత్వంపై ప్రజలు, అధికారులు నమ్మకం కోల్పోయారని, త్వరలోనే ప్రజలు బుద్ధి చెబుతారని వ్యాఖ్యానించారు.
    1
    జయశంకర్ భూపాలపల్లి జిల్లా మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజీని ఉమ్మడి వరంగల్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ నాయకులు సందర్శించారు. మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, మాజీ ఎంపీ మాలోత్ కవిత, మాజీ ఎమ్మెల్యేలు ఆరూరి రమేష్, వినయ్ భాస్కర్, గండ్ర వెంకటరమణ రెడ్డి, తాటికొండ రాజయ్య, శంకర్ నాయక్, పుట్ట మధు తదితరులు బ్యారేజీలో కుంగిన పిల్లర్లను పరిశీలించారు.
ఈ సందర్భంగా ఎర్రబెల్లి దయాకర్ రావు మాట్లాడుతూ రేవంత్ రెడ్డి ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టును నిర్లక్ష్యం చేస్తోందని విమర్శించారు. మరమ్మతులు చేపట్టకుండా రైతులను ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆరోపించారు. సన్న వడ్లకు బోనస్, రైతు బంధు కూడా అమలు కావడం లేదని అన్నారు.
కాళేశ్వరం ప్రాజెక్టుతో రాష్ట్రానికి నీటి భరోసా లభించిందని, ప్రపంచ స్థాయి ప్రాజెక్టుగా గుర్తింపు పొందిందని తెలిపారు. ఈ ప్రభుత్వంపై ప్రజలు, అధికారులు నమ్మకం కోల్పోయారని, త్వరలోనే ప్రజలు బుద్ధి చెబుతారని వ్యాఖ్యానించారు.
    user_M D Azizuddin
    M D Azizuddin
    జర్నలిస్ట్ వర్ధన్నపేట, వరంగల్, తెలంగాణ•
    4 hrs ago
  • ఎంపీ కడియం కావ్యగారు మాట్లాడుతూ ఉమెన్ రిజర్వేషన్ గత కాంగ్రెస్ హయాంలోనే జరిగింది 2004లో కూడా అమలు చేయాలని నరేంద్ర మోడీని ప్రశ్నించడం జరిగింది
    1
    ఎంపీ కడియం కావ్యగారు మాట్లాడుతూ ఉమెన్ రిజర్వేషన్ గత కాంగ్రెస్ హయాంలోనే జరిగింది 2004లో కూడా అమలు చేయాలని నరేంద్ర మోడీని ప్రశ్నించడం జరిగింది
    user_Meenakshi construction Civil c
    Meenakshi construction Civil c
    లింగాలఘన్‌పూర్, జనగాం, తెలంగాణ•
    23 hrs ago
  • ఆర్టీసీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని, ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని డిమాండ్ చేస్తూ కరీంనగర్ లో ఆర్టీసీ కార్మికులు ఆందోళనకు దిగారు. ఆర్టీసీ కార్మికుల జేఏసీ ఆధ్వర్యంలో కరీంనగర్ 1 డిపో ముందు ఆర్టీసీ కార్మికులు ధర్నా చేశారు. నిరసనలో కార్మికులు పెద్ద సంఖ్యలో పాల్గొని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఆర్టీసీ ఆస్తులను ప్రైవేటుపరం చేసే దిశగా ప్రభుత్వం పని చేస్తోందని ఆరోపిస్తూ, “మా భూములు మాకే – మా ఆస్తులు మాకే” అంటూ నినాదాలు చేశారు. ఆర్టీసీ కార్పొరేషన్ రాష్ట్ర ప్రభుత్వానికి కాకుండా కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో పనిచేస్తోందని, అలాంటి పరిస్థితిలో ఆస్తులను అమ్మేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నించడం సరికాదని పేర్కొన్నారు. ఎలక్ట్రిక్ బస్సులను ప్రభుత్వ పరంగా కొనసాగించాలని, వాటి ద్వారా కేంద్ర ప్రభుత్వానికి లాభం చేకూర్చే విధంగా కాకుండా ప్రజా రవాణా బలోపేతానికి ఉపయోగించాలని డిమాండ్ చేశారు. ఆర్టీసీని పూర్తిగా ప్రభుత్వంలో విలీనం చేసి కార్మికుల హక్కులను కాపాడాలని, వారి సమస్యలను తక్షణమే పరిష్కరించాలని లేనిపక్షంలో రాష్ట్రవ్యాప్తంగా సమ్మెకు దిగుతామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు.
    1
    ఆర్టీసీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని, ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని డిమాండ్ చేస్తూ కరీంనగర్ లో ఆర్టీసీ కార్మికులు ఆందోళనకు దిగారు. ఆర్టీసీ కార్మికుల జేఏసీ ఆధ్వర్యంలో కరీంనగర్ 1 డిపో ముందు ఆర్టీసీ కార్మికులు ధర్నా చేశారు. నిరసనలో కార్మికులు పెద్ద సంఖ్యలో పాల్గొని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
ఆర్టీసీ ఆస్తులను ప్రైవేటుపరం చేసే దిశగా ప్రభుత్వం పని చేస్తోందని ఆరోపిస్తూ, “మా భూములు మాకే – మా ఆస్తులు మాకే” అంటూ నినాదాలు చేశారు. ఆర్టీసీ కార్పొరేషన్ రాష్ట్ర ప్రభుత్వానికి కాకుండా కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో పనిచేస్తోందని, అలాంటి పరిస్థితిలో ఆస్తులను అమ్మేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నించడం సరికాదని పేర్కొన్నారు. ఎలక్ట్రిక్ బస్సులను ప్రభుత్వ పరంగా కొనసాగించాలని, వాటి ద్వారా కేంద్ర ప్రభుత్వానికి లాభం చేకూర్చే విధంగా కాకుండా ప్రజా రవాణా బలోపేతానికి ఉపయోగించాలని డిమాండ్ చేశారు. ఆర్టీసీని పూర్తిగా ప్రభుత్వంలో విలీనం చేసి కార్మికుల హక్కులను కాపాడాలని, వారి సమస్యలను తక్షణమే పరిష్కరించాలని లేనిపక్షంలో రాష్ట్రవ్యాప్తంగా సమ్మెకు దిగుతామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు.
    user_K.V.REDDY
    K.V.REDDY
    చిగురుమామిడి, కరీంనగర్, తెలంగాణ•
    2 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.