logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో శంకర జయంతి మహోత్సవాలు...ఆలయ విస్తరణ పనుల నేపథ్యంలో ఏకాంతంగా ఉత్సవాలు నిర్వహిస్తున్న ఆలయ అర్చకులు రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలోని శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో శంకర జయంతి మహోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. మహోత్సవాలు వైశాఖ శుద్ధ పాడ్యమి నుండి పంచమి వరకు ఐదు రోజులపాటు కొనసాగనున్నాయి. మహోత్సవాల్లో భాగంగా మొదటి రోజు స్వస్తి పుణ్యాహవాచనం నిర్వహించబడింది. అనంతరం మూలమూర్తులైన లక్ష్మీ గణపతి స్వామివారికి అధర్వశీర్ష పఠనంతో ఐదు రోజులపాటు అభిషేకాలు జరుగనున్నాయి. శ్రీ రాజరాజేశ్వర స్వామివారికి మహాన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకం నిర్వహించబడుతుంది. అలాగే రాజరాజేశ్వరి దేవి అమ్మవారికి దేవాలయ అర్చకులు ఆంతరంగికంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఉపనిషత్ భాష్య పారాయణం, వేద పారాయణాలు, ఇతర విశిష్ట పారాయణాలు కూడా నిర్వహించబడ్డాయి. ప్రతిరోజూ సాయంకాలం శంకర విజయము పై ప్రవచన కార్యక్రమాలు నిర్వహిస్తారు. మహోత్సవాల చివరి రోజు అయిన పంచమి నాడు సాయంకాలం వేద సదస్సు నిర్వహించబడుతుంది. అలాగే వైశాఖ మాస విశిష్టతను పురస్కరించుకుని వసంతోత్సవ పూజలు నిర్వహించి ఉత్సవాలను ఘనంగా ముగించనున్నారు.‌ ఈ కార్యక్రమాలు రాజన్న ఆలయం అభివృద్ధిలో భాగంగా ఆలయ అర్చకులు ఏకాంతంగా నిర్వహిస్తున్నారు.

2 hrs ago
user_K.V.REDDY
K.V.REDDY
చిగురుమామిడి, కరీంనగర్, తెలంగాణ•
2 hrs ago

వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో శంకర జయంతి మహోత్సవాలు...ఆలయ విస్తరణ పనుల నేపథ్యంలో ఏకాంతంగా ఉత్సవాలు నిర్వహిస్తున్న ఆలయ అర్చకులు రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలోని శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో శంకర జయంతి మహోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. మహోత్సవాలు వైశాఖ శుద్ధ పాడ్యమి నుండి పంచమి వరకు ఐదు రోజులపాటు కొనసాగనున్నాయి. మహోత్సవాల్లో భాగంగా మొదటి రోజు స్వస్తి పుణ్యాహవాచనం నిర్వహించబడింది. అనంతరం మూలమూర్తులైన లక్ష్మీ గణపతి స్వామివారికి అధర్వశీర్ష పఠనంతో ఐదు రోజులపాటు అభిషేకాలు జరుగనున్నాయి. శ్రీ రాజరాజేశ్వర స్వామివారికి మహాన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకం

నిర్వహించబడుతుంది. అలాగే రాజరాజేశ్వరి దేవి అమ్మవారికి దేవాలయ అర్చకులు ఆంతరంగికంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఉపనిషత్ భాష్య పారాయణం, వేద పారాయణాలు, ఇతర విశిష్ట పారాయణాలు కూడా నిర్వహించబడ్డాయి. ప్రతిరోజూ సాయంకాలం శంకర విజయము పై ప్రవచన కార్యక్రమాలు నిర్వహిస్తారు. మహోత్సవాల చివరి రోజు అయిన పంచమి నాడు సాయంకాలం వేద సదస్సు నిర్వహించబడుతుంది. అలాగే వైశాఖ మాస విశిష్టతను పురస్కరించుకుని వసంతోత్సవ పూజలు నిర్వహించి ఉత్సవాలను ఘనంగా ముగించనున్నారు.‌ ఈ కార్యక్రమాలు రాజన్న ఆలయం అభివృద్ధిలో భాగంగా ఆలయ అర్చకులు ఏకాంతంగా నిర్వహిస్తున్నారు.

More news from తెలంగాణ and nearby areas
  • రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలోని శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం లో శంకర జయంతి మహోత్సవాలు వైభవంగా నిర్వహించబడుతున్నాయి. ఈ మహోత్సవాలు వైశాఖ శుద్ధ పాడ్యమి నుండి పంచమి వరకు ఐదు రోజులపాటు కొనసాగనున్నాయి.మహోత్సవాల్లో భాగంగా మొదటి రోజు స్వస్తి పుణ్యాహవాచనం నిర్వహించబడింది. అనంతరం మూలమూర్తులైన లక్ష్మీ గణపతి స్వామివారికి అధర్వశీర్ష పఠనంతో ఐదు రోజులపాటు అభిషేకాలు జరుగనున్నాయి. శ్రీ రాజరాజేశ్వర స్వామివారికి మహాన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకం నిర్వహించబడుతుంది. అలాగే రాజరాజేశ్వరి దేవి అమ్మవారికి దేవాలయ అర్చకులు ఆంతరంగికంగా ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు.ఈ సందర్భంగా ఉపనిషత్ భాష్య పారాయణం, వేద పారాయణాలు, ఇతర విశిష్ట పారాయణాలు కూడా నిర్వహించబడుతున్నాయి. ప్రతిరోజూ సాయంకాలం శంకర విజయము పై ప్రవచన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. మహోత్సవాల చివరి రోజు అయిన పంచమి నాడు సాయంకాలం వేద సదస్సు నిర్వహించబడుతుంది. అలాగే వైశాఖ మాస విశిష్టతను పురస్కరించుకుని వసంతోత్సవ పూజలు నిర్వహించి ఉత్సవాలను ఘనంగా ముగించనున్నారు.ఈ కార్యక్రమాలు రాజన్న ఆలయం అభివృద్ధిలో భాగంగా ఆలయ అర్చకులు ఏకాంతంగా నిర్వహిస్తున్నారు.
    1
    రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలోని శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం లో శంకర జయంతి మహోత్సవాలు వైభవంగా నిర్వహించబడుతున్నాయి. ఈ మహోత్సవాలు వైశాఖ శుద్ధ పాడ్యమి నుండి పంచమి వరకు ఐదు రోజులపాటు కొనసాగనున్నాయి.మహోత్సవాల్లో భాగంగా మొదటి రోజు స్వస్తి పుణ్యాహవాచనం నిర్వహించబడింది. అనంతరం మూలమూర్తులైన లక్ష్మీ గణపతి స్వామివారికి అధర్వశీర్ష పఠనంతో ఐదు రోజులపాటు అభిషేకాలు జరుగనున్నాయి. శ్రీ రాజరాజేశ్వర స్వామివారికి మహాన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకం నిర్వహించబడుతుంది. అలాగే రాజరాజేశ్వరి దేవి అమ్మవారికి దేవాలయ అర్చకులు ఆంతరంగికంగా ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు.ఈ సందర్భంగా ఉపనిషత్ భాష్య పారాయణం, వేద పారాయణాలు, ఇతర విశిష్ట పారాయణాలు కూడా నిర్వహించబడుతున్నాయి. ప్రతిరోజూ సాయంకాలం శంకర విజయము పై ప్రవచన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.
మహోత్సవాల చివరి రోజు అయిన పంచమి నాడు సాయంకాలం వేద సదస్సు నిర్వహించబడుతుంది. అలాగే వైశాఖ మాస విశిష్టతను పురస్కరించుకుని వసంతోత్సవ పూజలు నిర్వహించి ఉత్సవాలను ఘనంగా ముగించనున్నారు.ఈ కార్యక్రమాలు రాజన్న ఆలయం అభివృద్ధిలో భాగంగా ఆలయ అర్చకులు ఏకాంతంగా నిర్వహిస్తున్నారు.
    user_Satheesh gangu
    Satheesh gangu
    జర్నలిస్ట్ సిరిసిల్ల, రాజన్న సిరిసిల్ల, తెలంగాణ•
    6 hrs ago
  • జయశంకర్ భూపాలపల్లి జిల్లా మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజీని ఉమ్మడి వరంగల్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ నాయకులు సందర్శించారు. మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, మాజీ ఎంపీ మాలోత్ కవిత, మాజీ ఎమ్మెల్యేలు ఆరూరి రమేష్, వినయ్ భాస్కర్, గండ్ర వెంకటరమణ రెడ్డి, తాటికొండ రాజయ్య, శంకర్ నాయక్, పుట్ట మధు తదితరులు బ్యారేజీలో కుంగిన పిల్లర్లను పరిశీలించారు. ఈ సందర్భంగా ఎర్రబెల్లి దయాకర్ రావు మాట్లాడుతూ రేవంత్ రెడ్డి ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టును నిర్లక్ష్యం చేస్తోందని విమర్శించారు. మరమ్మతులు చేపట్టకుండా రైతులను ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆరోపించారు. సన్న వడ్లకు బోనస్, రైతు బంధు కూడా అమలు కావడం లేదని అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుతో రాష్ట్రానికి నీటి భరోసా లభించిందని, ప్రపంచ స్థాయి ప్రాజెక్టుగా గుర్తింపు పొందిందని తెలిపారు. ఈ ప్రభుత్వంపై ప్రజలు, అధికారులు నమ్మకం కోల్పోయారని, త్వరలోనే ప్రజలు బుద్ధి చెబుతారని వ్యాఖ్యానించారు.
    1
    జయశంకర్ భూపాలపల్లి జిల్లా మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజీని ఉమ్మడి వరంగల్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ నాయకులు సందర్శించారు. మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, మాజీ ఎంపీ మాలోత్ కవిత, మాజీ ఎమ్మెల్యేలు ఆరూరి రమేష్, వినయ్ భాస్కర్, గండ్ర వెంకటరమణ రెడ్డి, తాటికొండ రాజయ్య, శంకర్ నాయక్, పుట్ట మధు తదితరులు బ్యారేజీలో కుంగిన పిల్లర్లను పరిశీలించారు.
ఈ సందర్భంగా ఎర్రబెల్లి దయాకర్ రావు మాట్లాడుతూ రేవంత్ రెడ్డి ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టును నిర్లక్ష్యం చేస్తోందని విమర్శించారు. మరమ్మతులు చేపట్టకుండా రైతులను ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆరోపించారు. సన్న వడ్లకు బోనస్, రైతు బంధు కూడా అమలు కావడం లేదని అన్నారు.
కాళేశ్వరం ప్రాజెక్టుతో రాష్ట్రానికి నీటి భరోసా లభించిందని, ప్రపంచ స్థాయి ప్రాజెక్టుగా గుర్తింపు పొందిందని తెలిపారు. ఈ ప్రభుత్వంపై ప్రజలు, అధికారులు నమ్మకం కోల్పోయారని, త్వరలోనే ప్రజలు బుద్ధి చెబుతారని వ్యాఖ్యానించారు.
    user_M D Azizuddin
    M D Azizuddin
    జర్నలిస్ట్ వర్ధన్నపేట, వరంగల్, తెలంగాణ•
    9 hrs ago
  • మహిళల విషయంలో కాంగ్రెస్ పార్టీ అనుసరించిన వైఖరి అమానుషమని బిజెపి జన్నారం మండల అధ్యక్షులు మధుసూదన్ రావు అన్నారు. రాష్ట్రవ్యాప్త ఆందోళనలో భాగంగా బిజెపి జన్నారం మండల నాయకులు కార్యకర్తలు శనివారం సాయంత్రం జన్నారం మండల కేంద్రంలోని బస్టాండ్ వద్దనున్న ప్రధాన రహదారిపై ఆందోళన చేశారు. మహిళా సాధికారిత బిల్లు విషయంలో కాంగ్రెస్ పార్టీ అవలంబించిన తీరు సరికాదన్నారు. ఈ కార్యక్రమంలో బిజెపి నాయకులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో బిజెపి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
    1
    మహిళల విషయంలో కాంగ్రెస్ పార్టీ అనుసరించిన వైఖరి అమానుషమని బిజెపి జన్నారం మండల అధ్యక్షులు మధుసూదన్ రావు అన్నారు. రాష్ట్రవ్యాప్త ఆందోళనలో భాగంగా బిజెపి జన్నారం మండల నాయకులు కార్యకర్తలు శనివారం సాయంత్రం జన్నారం మండల కేంద్రంలోని బస్టాండ్ వద్దనున్న ప్రధాన రహదారిపై ఆందోళన చేశారు. మహిళా సాధికారిత బిల్లు విషయంలో కాంగ్రెస్ పార్టీ అవలంబించిన తీరు సరికాదన్నారు. ఈ కార్యక్రమంలో బిజెపి నాయకులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో బిజెపి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
    user_P.G. Murthy
    P.G. Murthy
    జన్నారం, మంచిర్యాల, తెలంగాణ•
    5 hrs ago
  • భీమ్‌గల్ పోలీస్ స్టేషన్‌లో అక్రమాల ఆరోపణలు… పీపుల్ మీడియా ప్రజా సమాచార పత్రిక తెలంగాణ స్టేట్ నిజాంబాద్ డిస్టిక్ బాల్కొండ కాంసెన్సు మున్సిపల్ భీంగల్ పరిధిలో సిబ్బంది తీరుపై విమర్శలు భీమ్‌గల్ సర్కిల్ పరిధిలోని ఓ పోలీస్ స్టేషన్‌లో కొందరు సిబ్బంది వ్యవహారంపై తీవ్ర ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. జీతం కంటే ‘గీత’కే ప్రాధాన్యత ఇస్తూ, మధ్యవర్తులతో కుమ్మక్కై సమాచారాన్ని లీక్ చేస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. గత కొన్ని రోజులుగా ఈ వ్యవహారం బహిరంగంగానే కొనసాగుతున్నట్లు సమాచారం. కొందరు సిబ్బంది బ్రోకర్ల నుంచి లాభాలు పొందుతూ వారికి అనుకూలంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఇటీవల ఓ కేసులో మధ్యవర్తిత్వం చేసి పరిష్కారం చేస్తామని చెప్పిన ఘటన బయటపడడంతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చినట్లు తెలుస్తోంది. పోలీస్ స్టేషన్‌లో రైటర్‌గా పనిచేస్తున్న మహిళతో పాటు జమాదార్ హోదాలో ఉన్న ఇద్దరు వ్యక్తులు స్టేషన్‌కు వచ్చే వ్యక్తులు, నమోదయ్యే కేసులు, ఫిర్యాదుదారుల వివరాలు, అధికారులతో జరిగిన చర్చలు వంటి సమాచారాన్ని మధ్యవర్తులకు చేరవేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఈ సమాచారం ఆధారంగా మధ్యవర్తులు లావాదేవీలు జరుపుతూ, సంబంధిత సిబ్బందికి లాభాలు చేకూరుస్తున్నారనేది బహిరంగ రహస్యమని స్థానికులు చెబుతున్నారు. ఈ పరిస్థితుల కారణంగా పోలీస్ స్టేషన్ ప్రతిష్ఠ దెబ్బతింటోందని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఫిర్యాదు చేయాలంటే రైటర్‌కు డబ్బులు ఇవ్వాల్సి వస్తోందని కూడా ఆరోపిస్తున్నారు. ఈ వ్యవహారంపై జిల్లా స్థాయి ఉన్నతాధికారులు దృష్టి సారించి, నిజానిజాలు వెలికితీసి తగిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.
    2
    భీమ్‌గల్ పోలీస్ స్టేషన్‌లో అక్రమాల ఆరోపణలు…
పీపుల్ మీడియా ప్రజా సమాచార పత్రిక తెలంగాణ స్టేట్ నిజాంబాద్ డిస్టిక్ బాల్కొండ కాంసెన్సు మున్సిపల్ భీంగల్ పరిధిలో
సిబ్బంది తీరుపై విమర్శలు
భీమ్‌గల్ సర్కిల్ పరిధిలోని ఓ పోలీస్ స్టేషన్‌లో కొందరు సిబ్బంది వ్యవహారంపై తీవ్ర ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. జీతం కంటే ‘గీత’కే ప్రాధాన్యత ఇస్తూ, మధ్యవర్తులతో కుమ్మక్కై సమాచారాన్ని లీక్ చేస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి.
గత కొన్ని రోజులుగా ఈ వ్యవహారం బహిరంగంగానే కొనసాగుతున్నట్లు సమాచారం. కొందరు సిబ్బంది బ్రోకర్ల నుంచి లాభాలు పొందుతూ వారికి అనుకూలంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఇటీవల ఓ కేసులో మధ్యవర్తిత్వం చేసి పరిష్కారం చేస్తామని చెప్పిన ఘటన బయటపడడంతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చినట్లు తెలుస్తోంది.
పోలీస్ స్టేషన్‌లో రైటర్‌గా పనిచేస్తున్న మహిళతో పాటు జమాదార్ హోదాలో ఉన్న ఇద్దరు వ్యక్తులు స్టేషన్‌కు వచ్చే వ్యక్తులు, నమోదయ్యే కేసులు, ఫిర్యాదుదారుల వివరాలు, అధికారులతో జరిగిన చర్చలు వంటి సమాచారాన్ని మధ్యవర్తులకు చేరవేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఈ సమాచారం ఆధారంగా మధ్యవర్తులు లావాదేవీలు జరుపుతూ, సంబంధిత సిబ్బందికి లాభాలు చేకూరుస్తున్నారనేది బహిరంగ రహస్యమని స్థానికులు చెబుతున్నారు.
ఈ పరిస్థితుల కారణంగా పోలీస్ స్టేషన్ ప్రతిష్ఠ దెబ్బతింటోందని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఫిర్యాదు చేయాలంటే రైటర్‌కు డబ్బులు ఇవ్వాల్సి వస్తోందని కూడా ఆరోపిస్తున్నారు. ఈ వ్యవహారంపై జిల్లా స్థాయి ఉన్నతాధికారులు దృష్టి సారించి, నిజానిజాలు వెలికితీసి తగిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.
    user_Raja Bangaari
    Raja Bangaari
    Artist భీమ్‌గల్, నిజామాబాద్, తెలంగాణ•
    8 hrs ago
  • 7 రోజుల సంక్షేమ వారాన్ని సమర్థవంతంగా అమలు చేయాలి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా ఈ నెల 20వ తేదీ నుండి 26వ తేదీ వరకు 7 రోజుల పాటు సంక్షేమ వారాన్ని సమర్థవంతంగా నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు అన్నారు. శనివారం హైదరాబాద్ నుండి ఉన్నతాధికారులతో కలిసి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అన్ని జిల్లాల కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు, సంక్షేమ శాఖల అధికారులతో సంక్షేమ వారం నిర్వహణపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మాట్లాడుతూ 99 రోజుల ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కార్యాచరణలో భాగంగా ఈ నెల 20వ తేదీ నుండి 26వ తేదీ వరకు ప్రభుత్వ వసతి గృహాలు, గురుకుల పాఠశాలలు, ఆశ్రమ పాఠశాలలలో షెడ్యూల్డ్ కులములు, షెడ్యూల్డ్ తెగలు, వెనుకబడిన తరగతులు, మైనారిటీ గురుకులాలలో, విద్యాలయాలలో పారిశుద్ధ్య పనులు చేపట్టాలని తెలిపారు. విద్యార్థులకు క్విజ్, విద్య విశ్లేషణ, చిత్రలేఖనం, పెయింటింగ్ పోటీలు నిర్వహించాలని, వసతి గృహాలలో మరమ్మత్తు పనులను చేపట్టాలని తెలిపారు. విద్యార్థుల తల్లిదండ్రులు, ఉపాధ్యాయులతో సమావేశం నిర్వహించి వసతులపై చర్చించాలని సూచించారు. స్కిల్ డెవలప్మెంట్ కార్యక్రమాలు చేపట్టాలని, వేసవి శిబిరం, బడిబాట కార్యక్రమాలు నిర్వహించాలని, రైతు రిజిస్ట్రీ 100 శాతం పూర్తి చేయాలని తెలిపారు.జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ మాట్లాడుతూ ప్రభుత్వ ఆదేశాల ప్రకారం ఈనెల 20వ తేదీ నుండి 26వ తేదీ వరకు 7 రోజుల పాటు ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కార్యాచరణలో భాగంగా చర్యలు తీసుకుంటామని తెలిపారు. జిల్లాలోని ఎస్.సి., ఎస్.టి., బి.సి., మైనారిటీ గురుకులాలలో, వసతి గృహాలలో వంటగది, పారిశుధ్యం, మరమ్మత్తు పనులు చేపడుతామని, విద్యార్థులకు వివిధ విభాగాలలో పోటీలు నిర్వహిస్తామని, స్కిల్ డెవలప్మెంట్, విద్యార్థుల తల్లిదండ్రులు, ఉపాధ్యాయులతో సమావేశాలు నిర్వహిస్తామని తెలిపారు. వేసవి శిబిరాలు, బడిబాట కార్యక్రమాలను జిల్లాలో అధికారుల సమన్వయంతో పకడ్బందీగా చేపడతామని, రైతుల రిజిస్ట్రీ 100 శాతం పూర్తి చేసేందుకు అధికారుల సమన్వయంతో చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా సిపిఓ సురేష్ , గృహ నిర్మాణ శాఖాధికారి మాణిక్యం, డిడబ్ల్యుఓ హేమ భార్గవి, గిరిజన సంక్షేమ అధికారి నీలిమ, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు..
    1
    7 రోజుల సంక్షేమ వారాన్ని సమర్థవంతంగా అమలు చేయాలి
రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు
ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక  కార్యక్రమంలో భాగంగా ఈ నెల 20వ తేదీ నుండి 26వ తేదీ వరకు 7 రోజుల పాటు సంక్షేమ వారాన్ని సమర్థవంతంగా నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు అన్నారు. శనివారం హైదరాబాద్ నుండి  ఉన్నతాధికారులతో కలిసి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అన్ని జిల్లాల కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు, సంక్షేమ శాఖల అధికారులతో సంక్షేమ వారం నిర్వహణపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మాట్లాడుతూ 99 రోజుల ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కార్యాచరణలో భాగంగా ఈ నెల 20వ తేదీ నుండి 26వ తేదీ వరకు ప్రభుత్వ వసతి గృహాలు, గురుకుల పాఠశాలలు, ఆశ్రమ పాఠశాలలలో షెడ్యూల్డ్ కులములు, షెడ్యూల్డ్ తెగలు, వెనుకబడిన తరగతులు, మైనారిటీ గురుకులాలలో, విద్యాలయాలలో పారిశుద్ధ్య పనులు చేపట్టాలని తెలిపారు. విద్యార్థులకు క్విజ్, విద్య విశ్లేషణ, చిత్రలేఖనం, పెయింటింగ్ పోటీలు నిర్వహించాలని, వసతి గృహాలలో మరమ్మత్తు పనులను చేపట్టాలని తెలిపారు. విద్యార్థుల తల్లిదండ్రులు, ఉపాధ్యాయులతో సమావేశం నిర్వహించి వసతులపై చర్చించాలని సూచించారు. స్కిల్ డెవలప్మెంట్ కార్యక్రమాలు చేపట్టాలని, వేసవి శిబిరం, బడిబాట కార్యక్రమాలు నిర్వహించాలని,  రైతు రిజిస్ట్రీ 100 శాతం పూర్తి చేయాలని తెలిపారు.జిల్లా కలెక్టర్  ప్రతిమా సింగ్ మాట్లాడుతూ ప్రభుత్వ ఆదేశాల ప్రకారం ఈనెల 20వ తేదీ నుండి 26వ తేదీ వరకు 7 రోజుల పాటు ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కార్యాచరణలో భాగంగా చర్యలు తీసుకుంటామని తెలిపారు. జిల్లాలోని  ఎస్.సి., ఎస్.టి., బి.సి., మైనారిటీ గురుకులాలలో, వసతి గృహాలలో వంటగది, పారిశుధ్యం, మరమ్మత్తు పనులు చేపడుతామని, విద్యార్థులకు వివిధ విభాగాలలో పోటీలు నిర్వహిస్తామని, స్కిల్ డెవలప్మెంట్, విద్యార్థుల తల్లిదండ్రులు, ఉపాధ్యాయులతో సమావేశాలు నిర్వహిస్తామని తెలిపారు. వేసవి శిబిరాలు, బడిబాట కార్యక్రమాలను జిల్లాలో అధికారుల సమన్వయంతో పకడ్బందీగా చేపడతామని, రైతుల రిజిస్ట్రీ 100 శాతం పూర్తి చేసేందుకు అధికారుల సమన్వయంతో చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా సిపిఓ సురేష్ , గృహ నిర్మాణ శాఖాధికారి మాణిక్యం, డిడబ్ల్యుఓ హేమ భార్గవి, గిరిజన సంక్షేమ అధికారి నీలిమ,   సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు..
    user_మెదక్ న్యూస్
    మెదక్ న్యూస్
    Medak, Telangana•
    2 hrs ago
  • ఎక్స్‌సెలెన్షియా విద్యాసంస్థలు విద్యార్థుల సమగ్రాభివృద్ధిపై దృష్టి సారించాయని, కేవలం టాప్ ర్యాంకులు సాధించడమే కాకుండా, ప్రతి విద్యార్థి తన పూర్తి సామర్థ్యాన్ని చేరుకోవడమే అసలైన విద్యా లక్ష్యమని ప్రిన్సిపాల్ ఇన్ఫినిటమ్ నీరజా తెలిపారు. ఈ ఏడాది కూడా విద్యార్థుల అంకితభావం, ఉపాధ్యాయుల కృషితో రికార్డు స్థాయి ఫలితాలు సాధించినట్లు ఆమె శుక్రవారం శామీర్పేట్ లోని విద్యాసంస్థలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వెల్లడించారు. దేశ నిర్మాణం అంటే కొద్దిమంది టాపర్లతో కాదని, ప్రతి బిడ్డలోని ప్రతిభను వెలికితీయడం ద్వారానే సాధ్యమని ఆమె పేర్కొన్నారు.
    1
    ఎక్స్‌సెలెన్షియా విద్యాసంస్థలు విద్యార్థుల సమగ్రాభివృద్ధిపై దృష్టి సారించాయని, కేవలం టాప్ ర్యాంకులు సాధించడమే కాకుండా, ప్రతి విద్యార్థి తన పూర్తి సామర్థ్యాన్ని చేరుకోవడమే అసలైన విద్యా లక్ష్యమని ప్రిన్సిపాల్ ఇన్ఫినిటమ్ నీరజా తెలిపారు. ఈ ఏడాది కూడా విద్యార్థుల అంకితభావం, ఉపాధ్యాయుల కృషితో రికార్డు స్థాయి ఫలితాలు సాధించినట్లు ఆమె శుక్రవారం శామీర్పేట్ లోని విద్యాసంస్థలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వెల్లడించారు. దేశ నిర్మాణం అంటే కొద్దిమంది టాపర్లతో కాదని, ప్రతి బిడ్డలోని ప్రతిభను వెలికితీయడం ద్వారానే సాధ్యమని ఆమె పేర్కొన్నారు.
    user_Telangana news
    Telangana news
    మేడ్చల్, మేడ్చల్ మల్కాజ్‌గిరి, తెలంగాణ•
    19 hrs ago
  • రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలంలో వడగళ్ళ వాన బీభత్సం సృష్టించింది. మర్రిమడ్ల, నిమ్మపల్లి గ్రామాల్లో అకాల వర్షం అన్నదాత నిలువునా ముంచింది. గాలివాన వడగళ్ళతో చేతికందే దశలో ఉన్న పంటలు నెలవాలాయి. కల్లాల్లో దాన్యం తడిసిపోయింది. రైతన్నకు తీరం నష్టాన్ని మిగిల్చింది. గాలివానకు చెట్లు కూలాయి, ఇళ్ల పైకప్పులు లేచిపోయాయి. నిమ్మపల్లి మర్రిమడ్ల గ్రామాల మధ్య రహదారిపై చెట్లు కూలడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు వెంటనే కూలిన చెట్లను తొలగించి ట్రాఫిక్ ను క్లియర్ చేశారు. పంట నష్టాన్ని చూసి రైతన్నలు ఆవేదనతో ఆందోళన చెందుతూ ప్రభుత్వం పంట నష్టాన్ని అంచనా వేసి ఆదుకోవాలని కోరుతున్నారు.
    1
    రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలంలో వడగళ్ళ వాన బీభత్సం సృష్టించింది. మర్రిమడ్ల, నిమ్మపల్లి గ్రామాల్లో అకాల వర్షం అన్నదాత నిలువునా ముంచింది. గాలివాన వడగళ్ళతో చేతికందే దశలో ఉన్న పంటలు నెలవాలాయి. కల్లాల్లో దాన్యం తడిసిపోయింది. రైతన్నకు తీరం నష్టాన్ని మిగిల్చింది. గాలివానకు చెట్లు కూలాయి, ఇళ్ల పైకప్పులు లేచిపోయాయి. నిమ్మపల్లి మర్రిమడ్ల గ్రామాల మధ్య రహదారిపై చెట్లు కూలడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు వెంటనే కూలిన చెట్లను తొలగించి ట్రాఫిక్ ను క్లియర్ చేశారు. పంట నష్టాన్ని చూసి రైతన్నలు ఆవేదనతో ఆందోళన చెందుతూ ప్రభుత్వం పంట నష్టాన్ని అంచనా వేసి ఆదుకోవాలని కోరుతున్నారు.
    user_K.V.REDDY
    K.V.REDDY
    చిగురుమామిడి, కరీంనగర్, తెలంగాణ•
    5 hrs ago
  • హైదరాబాదు బయలుదేరిన ఉద్యమకారులు ఉద్యమ కళాకారులు రాజన్న సిరిసిల్ల జిల్లా నుండి హైదరాబాదులో జరుగు ఉద్యమకారుల ఉద్యమ కళా కారుల సదస్సుకు తరలి వెళ్లారు. రాజన్న సిరిసిల్ల జిల్లా నుండి హైదరాబాదుకు వెళ్ళిన వారిలో రాష్ట్ర కన్వీనర్ యెల్ల పోశెట్టి రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షులు బొజ్జ కనకయ్య ఉత్తర తెలంగాణ కన్వీనర్ బొడ్డు రాములు రాజన్న సిరిసిల్ల జిల్లా ఉద్యమ కళా కారుల జిల్లా అధ్యక్షులు వారాల దేవయ్య జిల్లా ఉపాధ్యక్షులు కనపర్తి హనుమాన్లుజిల్లా కార్యదర్శి మానువాడ లక్ష్మీనారాయణ మొగులోజి లక్ష్మీరాజం.దొంగరి లక్ష్మీరాజం. జిల్లా నాయకులు బొడ్డు నారాయణ.సిరిసిల్ల. శంకర్ పుల్కం లచ్చన్న దుమ్మా లక్ష్మీరాజం ఎర్ర రవి రాజా మామిండ్ల సత్తయ్య మెరుపుల గంగాధర్ బిల్లా వెంకట్ నర్సయ్య ఛావనపల్లి లక్ష్మీనారాయణ నల్లగొండ శ్రీనివాస్ మునిగంటి లక్ష్మీపతి తదితర కళాకారులు 60 మంది వరకు పాల్గొన్నారు.
    2
    హైదరాబాదు బయలుదేరిన ఉద్యమకారులు ఉద్యమ కళాకారులు రాజన్న సిరిసిల్ల జిల్లా నుండి హైదరాబాదులో జరుగు ఉద్యమకారుల ఉద్యమ కళా కారుల సదస్సుకు తరలి వెళ్లారు.  రాజన్న సిరిసిల్ల జిల్లా నుండి హైదరాబాదుకు వెళ్ళిన వారిలో రాష్ట్ర కన్వీనర్ యెల్ల పోశెట్టి రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షులు బొజ్జ కనకయ్య ఉత్తర తెలంగాణ కన్వీనర్ బొడ్డు రాములు రాజన్న సిరిసిల్ల జిల్లా ఉద్యమ కళా కారుల జిల్లా అధ్యక్షులు వారాల దేవయ్య జిల్లా ఉపాధ్యక్షులు కనపర్తి హనుమాన్లుజిల్లా కార్యదర్శి మానువాడ లక్ష్మీనారాయణ మొగులోజి లక్ష్మీరాజం.దొంగరి లక్ష్మీరాజం. జిల్లా నాయకులు బొడ్డు నారాయణ.సిరిసిల్ల. శంకర్ పుల్కం లచ్చన్న దుమ్మా లక్ష్మీరాజం ఎర్ర రవి రాజా మామిండ్ల సత్తయ్య మెరుపుల గంగాధర్ బిల్లా వెంకట్ నర్సయ్య ఛావనపల్లి లక్ష్మీనారాయణ నల్లగొండ శ్రీనివాస్ మునిగంటి లక్ష్మీపతి తదితర కళాకారులు 60 మంది వరకు పాల్గొన్నారు.
    user_Satheesh gangu
    Satheesh gangu
    జర్నలిస్ట్ సిరిసిల్ల, రాజన్న సిరిసిల్ల, తెలంగాణ•
    14 hrs ago
  • వరంగల్ జిల్లా:రాయపర్తి మండల కేంద్రంలో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ దిష్టిబొమ్మను దహనం చేశారు. మహిళల అభ్యున్నతి కోసం కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన 33 శాతం మహిళా రిజర్వేషన్ బిల్లును కాంగ్రెస్, ఇండీ కూటమి నేతలు అడ్డుకోవడాన్ని నిరసిస్తూ ఈ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా బీజేపీ రాయపర్తి మండల అధ్యక్షుడు నూనె అనిల్ యాదవ్ మాట్లాడుతూ, మహిళల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే విధంగా కాంగ్రెస్ పార్టీ వ్యవహరించిందని ఆరోపించారు. మహిళా రిజర్వేషన్ బిల్లును అడ్డుకోవడం దేశ చరిత్రలో నల్ల దినంగా నిలుస్తుందని పేర్కొన్నారు. మహిళలకు చట్టసభల్లో ప్రాతినిధ్యం కల్పించేందుకు ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తుండగా, కాంగ్రెస్ పార్టీ దానిని అడ్డుకుని మహిళా ద్రోహం చేసిందని విమర్శించారు. వెంటనే కాంగ్రెస్, ఇండీ కూటమి నేతలు క్షమాపణలు చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. మహిళా లోకం ఏకమై కాంగ్రెస్ పార్టీని దేశంలో నుండి తరిమికొట్టాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు వడ్లకొండ రవి, గడ్డం నరేందర్, రావుల అనిల్, మైస మహేందర్, మందపూరి రాజు, బూరుగు నవీన్, వీరబ్రహ్మం, గోరంట్ల ప్రభాకర్, చిర్ర నాగరాజు, పెండ్యాల గణేష్, మంచాల సుమన్ యాదవ్, బండారి దినేష్, జక్కుల సందీప్ యాదవ్, సిద్దు రాకేష్ తదితరులు పాల్గొన్నారు.
    1
    వరంగల్ జిల్లా:రాయపర్తి మండల కేంద్రంలో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ దిష్టిబొమ్మను దహనం చేశారు. మహిళల అభ్యున్నతి కోసం కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన 33 శాతం మహిళా రిజర్వేషన్ బిల్లును కాంగ్రెస్, ఇండీ కూటమి నేతలు అడ్డుకోవడాన్ని నిరసిస్తూ ఈ కార్యక్రమం నిర్వహించారు.
ఈ సందర్భంగా బీజేపీ రాయపర్తి మండల అధ్యక్షుడు నూనె అనిల్ యాదవ్ మాట్లాడుతూ, మహిళల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే విధంగా కాంగ్రెస్ పార్టీ వ్యవహరించిందని ఆరోపించారు. మహిళా రిజర్వేషన్ బిల్లును అడ్డుకోవడం దేశ చరిత్రలో నల్ల దినంగా నిలుస్తుందని పేర్కొన్నారు.
మహిళలకు చట్టసభల్లో ప్రాతినిధ్యం కల్పించేందుకు ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తుండగా, కాంగ్రెస్ పార్టీ దానిని అడ్డుకుని మహిళా ద్రోహం చేసిందని విమర్శించారు. వెంటనే కాంగ్రెస్, ఇండీ కూటమి నేతలు క్షమాపణలు చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.
మహిళా లోకం ఏకమై కాంగ్రెస్ పార్టీని దేశంలో నుండి తరిమికొట్టాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు వడ్లకొండ రవి, గడ్డం నరేందర్, రావుల అనిల్, మైస మహేందర్, మందపూరి రాజు, బూరుగు నవీన్, వీరబ్రహ్మం, గోరంట్ల ప్రభాకర్, చిర్ర నాగరాజు, పెండ్యాల గణేష్, మంచాల సుమన్ యాదవ్, బండారి దినేష్, జక్కుల సందీప్ యాదవ్, సిద్దు రాకేష్ తదితరులు పాల్గొన్నారు.
    user_M D Azizuddin
    M D Azizuddin
    జర్నలిస్ట్ వర్ధన్నపేట, వరంగల్, తెలంగాణ•
    12 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.