మహిళా రిజర్వేషన్ బిల్లుపై నిరసన – రాయపర్తిలో రాహుల్ గాంధీ దిష్టిబొమ్మ దహనం చేసిన బీజేపీ వరంగల్ జిల్లా:రాయపర్తి మండల కేంద్రంలో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ దిష్టిబొమ్మను దహనం చేశారు. మహిళల అభ్యున్నతి కోసం కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన 33 శాతం మహిళా రిజర్వేషన్ బిల్లును కాంగ్రెస్, ఇండీ కూటమి నేతలు అడ్డుకోవడాన్ని నిరసిస్తూ ఈ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా బీజేపీ రాయపర్తి మండల అధ్యక్షుడు నూనె అనిల్ యాదవ్ మాట్లాడుతూ, మహిళల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే విధంగా కాంగ్రెస్ పార్టీ వ్యవహరించిందని ఆరోపించారు. మహిళా రిజర్వేషన్ బిల్లును అడ్డుకోవడం దేశ చరిత్రలో నల్ల దినంగా నిలుస్తుందని పేర్కొన్నారు. మహిళలకు చట్టసభల్లో ప్రాతినిధ్యం కల్పించేందుకు ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తుండగా, కాంగ్రెస్ పార్టీ దానిని అడ్డుకుని మహిళా ద్రోహం చేసిందని విమర్శించారు. వెంటనే కాంగ్రెస్, ఇండీ కూటమి నేతలు క్షమాపణలు చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. మహిళా లోకం ఏకమై కాంగ్రెస్ పార్టీని దేశంలో నుండి తరిమికొట్టాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు వడ్లకొండ రవి, గడ్డం నరేందర్, రావుల అనిల్, మైస మహేందర్, మందపూరి రాజు, బూరుగు నవీన్, వీరబ్రహ్మం, గోరంట్ల ప్రభాకర్, చిర్ర నాగరాజు, పెండ్యాల గణేష్, మంచాల సుమన్ యాదవ్, బండారి దినేష్, జక్కుల సందీప్ యాదవ్, సిద్దు రాకేష్ తదితరులు పాల్గొన్నారు.
మహిళా రిజర్వేషన్ బిల్లుపై నిరసన – రాయపర్తిలో రాహుల్ గాంధీ దిష్టిబొమ్మ దహనం చేసిన బీజేపీ వరంగల్ జిల్లా:రాయపర్తి మండల కేంద్రంలో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ దిష్టిబొమ్మను దహనం చేశారు. మహిళల అభ్యున్నతి కోసం కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన 33 శాతం మహిళా రిజర్వేషన్ బిల్లును కాంగ్రెస్, ఇండీ కూటమి నేతలు అడ్డుకోవడాన్ని నిరసిస్తూ ఈ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా బీజేపీ రాయపర్తి మండల అధ్యక్షుడు నూనె అనిల్ యాదవ్ మాట్లాడుతూ, మహిళల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే విధంగా కాంగ్రెస్ పార్టీ వ్యవహరించిందని ఆరోపించారు. మహిళా రిజర్వేషన్ బిల్లును అడ్డుకోవడం దేశ చరిత్రలో నల్ల దినంగా నిలుస్తుందని పేర్కొన్నారు. మహిళలకు చట్టసభల్లో ప్రాతినిధ్యం కల్పించేందుకు ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తుండగా, కాంగ్రెస్ పార్టీ దానిని అడ్డుకుని మహిళా ద్రోహం చేసిందని విమర్శించారు. వెంటనే కాంగ్రెస్, ఇండీ కూటమి నేతలు క్షమాపణలు చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. మహిళా లోకం ఏకమై కాంగ్రెస్ పార్టీని దేశంలో నుండి తరిమికొట్టాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు వడ్లకొండ రవి, గడ్డం నరేందర్, రావుల అనిల్, మైస మహేందర్, మందపూరి రాజు, బూరుగు నవీన్, వీరబ్రహ్మం, గోరంట్ల ప్రభాకర్, చిర్ర నాగరాజు, పెండ్యాల గణేష్, మంచాల సుమన్ యాదవ్, బండారి దినేష్, జక్కుల సందీప్ యాదవ్, సిద్దు రాకేష్ తదితరులు పాల్గొన్నారు.
- వరంగల్ జిల్లా:రాయపర్తి మండల కేంద్రంలో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ దిష్టిబొమ్మను దహనం చేశారు. మహిళల అభ్యున్నతి కోసం కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన 33 శాతం మహిళా రిజర్వేషన్ బిల్లును కాంగ్రెస్, ఇండీ కూటమి నేతలు అడ్డుకోవడాన్ని నిరసిస్తూ ఈ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా బీజేపీ రాయపర్తి మండల అధ్యక్షుడు నూనె అనిల్ యాదవ్ మాట్లాడుతూ, మహిళల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే విధంగా కాంగ్రెస్ పార్టీ వ్యవహరించిందని ఆరోపించారు. మహిళా రిజర్వేషన్ బిల్లును అడ్డుకోవడం దేశ చరిత్రలో నల్ల దినంగా నిలుస్తుందని పేర్కొన్నారు. మహిళలకు చట్టసభల్లో ప్రాతినిధ్యం కల్పించేందుకు ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తుండగా, కాంగ్రెస్ పార్టీ దానిని అడ్డుకుని మహిళా ద్రోహం చేసిందని విమర్శించారు. వెంటనే కాంగ్రెస్, ఇండీ కూటమి నేతలు క్షమాపణలు చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. మహిళా లోకం ఏకమై కాంగ్రెస్ పార్టీని దేశంలో నుండి తరిమికొట్టాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు వడ్లకొండ రవి, గడ్డం నరేందర్, రావుల అనిల్, మైస మహేందర్, మందపూరి రాజు, బూరుగు నవీన్, వీరబ్రహ్మం, గోరంట్ల ప్రభాకర్, చిర్ర నాగరాజు, పెండ్యాల గణేష్, మంచాల సుమన్ యాదవ్, బండారి దినేష్, జక్కుల సందీప్ యాదవ్, సిద్దు రాకేష్ తదితరులు పాల్గొన్నారు.1
- వర్దన్నపేట (వరంగల్ జిల్లా): ప్రజా పాలన - ప్రగతి ప్రణాళికలో భాగంగా వర్దన్నపేట మండలం కొత్తపల్లి క్రాస్ రోడ్డులోని జాతీయ రహదారి (NH-563) పై వర్దన్నపేట పోలీసులు రోడ్డు ప్రమాదాల నివారణపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా అధికారులు డెమో ప్రమాదాన్ని సృష్టించి, ప్రమాదం జరిగిన వెంటనే తీసుకోవాల్సిన జాగ్రత్తలు, బాధితులకు అందించాల్సిన ప్రాథమిక సహాయంపై ప్రజలకు వివరించారు. కార్యక్రమంలో ACP, CI, SIలతో పాటు హైవే, R&B మరియు MVI అధికారులు పాల్గొని యువతకు రోడ్డు భద్రతపై అవగాహన కల్పించారు.1
- ఎంపీ కడియం కావ్యగారు మాట్లాడుతూ ఉమెన్ రిజర్వేషన్ గత కాంగ్రెస్ హయాంలోనే జరిగింది 2004లో కూడా అమలు చేయాలని నరేంద్ర మోడీని ప్రశ్నించడం జరిగింది1
- జీవితమరణ సరిహద్దుల్లో నిలిచిన వేళ 108 అంబులెన్స్ సిబ్బంది చూపిన అప్రమత్తత, మానవత్వం ఓ తల్లి, శిశువుకు కొత్త జీవితం అందించింది. బయ్యారం మండలం నామాలపాడు గ్రామానికి చెందిన ఒడిశా కార్మికురాలు రశ్మిత (20)కు గురువారం అర్ధరాత్రి అకస్మాత్తుగా పురిటి నొప్పులు రావడంతో కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. వెంటనే 108 సేవలకు సమాచారం ఇవ్వడంతో అంబులెన్స్ మెరుపువేగంతో చేరుకుంది. ఆసుపత్రికి తరలిస్తుండగానే నొప్పులు ఒక్కసారిగా తీవ్రరూపం దాల్చాయి. పరిస్థితి అత్యంత కీలకంగా మారిన వేళ మెడికల్ టెక్నీషియన్ శ్రీను, పైలట్ ఉపేందర్ అప్రమత్తంగా వ్యవహరించి అంబులెన్స్‌ను రోడ్డు పక్కన నిలిపారు. క్షణక్షణం కీలకమవుతున్న పరిస్థితుల్లో ధైర్యంగా ముందడుగు వేసి, అంబులెన్స్‌లోని డెలివరీ కిట్ సహాయంతో సురక్షితంగా ప్రసవం నిర్వహించారు. వారి సమయస్ఫూర్తి ఫలితంగా రశ్మిత పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. ఇదే సమయంలో ఎమర్జెన్సీ రెస్పాన్స్ కేర్ ఫిజిషియన్ డాక్టర్ కాసిరెడ్డి ఫోన్ ద్వారా నిరంతరం సూచనలు అందిస్తూ కీలక పాత్ర పోషించారు. అనంతరం తల్లికి ఐవీ ఫ్లూయిడ్స్ అందించి, శిశువుకు ఆక్సిజన్ ఇచ్చి, ఇద్దరినీ సురక్షితంగా మహబూబాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం తల్లి, శిశువు క్షేమంగా ఉన్నారని వైద్యులు వెల్లడించారు. అత్యవసర సమయంలో ప్రాణాల విలువను కాపాడుతూ అద్భుత సేవ అందించిన EMT శ్రీను, పైలట్ ఉపేందర్‌లపై స్థానికులు, ఆసుపత్రి సిబ్బంది ప్రశంసలు కురిపిస్తున్నారు.1
- అసలే పేదరికం...ఆపై అమాయకత్వం...నలుగురు మహిళలను మోసం చేసింది దివ్యాంగురాలైన మాయలేడి... ఐదు కోట్ల ఆస్థి ఉందని నలుగురు మహిళలను నమ్మించి తన వెంట తిప్పుకుంది. వారి అమాయకత్వాన్ని సొమ్ముచేసుకుని ఉడాయించింది. అడ్రస్ లేకుండా పోయిన మాయలేడి చేతిలో మోసపోయిన మహిళలు ఆవేధనతో ఆందోళన చెందుతున్నారు. తమకు జరిగిన మోసాన్ని బయటకు చెప్పుకోలేక కుమిలిపోతున్నారు. పేరు శైలజారెడ్డి. అసలు పేరు, అడ్రస్ ఎక్కడో స్పష్టంగా తెలియదు. దివ్యాంగురాలైన ఆమే, నలుగురు అమాయకులైన మహిళలను మోసం చేసి ధర్మపురిలో వదిలేసి పారిపోయింది. తిరుపతి రైల్వే స్టేషన్ లో మంచిర్యాలకు వెళ్ళాల్సిన మహరాష్ట్రకు చెందిన లక్ష్మి, మంచిర్యాలకు చెందిన రమాదేవిని శైలజారెడ్డి అలియాస్ మాయలేడి పరిచయం చేసుకుంది. చదువురాని ఆ ఇద్దరు మహిళలను మాయమాటలతో నమ్మించి అక్కున చేర్చుకుంది. అక్కడి నుంచి మంచిర్యాలకు వచ్చిన ఆ ముగ్గురు మరో ఇద్దరు మహిళలను కమాన్ పూర్ కు చెందిన మణెమ్మ, సిద్దిపేటకు చెందిన స్వరూపను చేరదీశారు. ఐదుగురు కలిసి గత కొద్దిరోజులుగా ప్రీ బస్ ప్రయాణంతో గుళ్ళు గోపురాలు తిరిగారు. దివ్యాంగురాలైన శైలజరెడ్డి తన తండ్రీ సుదర్శన్ రెడ్డి పేరిట బ్యాంక్ లాకర్ లో ఐదు కోట్లు ఉన్నాయని బ్యాంక్ పని అయిపోగానే నలుగురికి పది లక్షల చొప్పున క్యాష్ తోపాటు ఇళ్ళు కొనిస్తానని నమ్మించింది. అందుకు సంబందించి చెక్కుల రూపంలో 25 లక్షలు, 75 లక్షల నకిలీ చెక్కులు, బాండ్ పేపర్, బ్యాంక్ మేనేజర్ కు రాసిన లేఖ చూపించింది. చదువురాని అమాయకులైన మహిళలు నిజమే కావచ్చని నమ్మి ఆమె వెంట తిరిగారు. అటో లేదంటే కారు ఎంగేజ్ చేసుకుని తిరిగారు అందుకు కావాల్సిన ఖర్చుల కోసం నలుగురు మహిళల నుంచే వసూలు చేసింది. గత దీపావళి ముందు రెండు పెట్టెలు తీసుకొచ్చి అందులో డబ్బులు ఉన్నాయని నమ్మించి పూజలు సైతం చేయించిందట. వాటిని తెరవకుండా నలుగురు మహిళలను కావలిపెట్టేదట. ఇప్పటికే 15 మందికి ఇళ్ళు కొనిచ్చానని మీకు కూడా ఇళ్ళు కొనస్తానని నమ్మేలా తాళం చెవిల గుత్తి చూపించింది. ఇళ్ళు కావాలంటే ఖర్చుల క్రింద మనిషికి కొంత డబ్బులు వసూలు చేసి ఆ డబ్బులతో జల్సాలు చేసింది. అలా తిరుక్కుంటు తిరుక్కుంటు ధర్మపురికి చేరుకున్న ఐదుగురు గోదావరి తీరంలో గుడివద్ద రెండు పెట్టెలను పెట్టి ఇద్దరి అక్కడ ఉంచింది. ఒకరిని తన వెంట తీసుకుని వెళ్ళి సిరిసిల్లలో వదిలేసి పత్తాలేకుండా పారిపోయింది. ఓ రోజు గడిచినా శైలజారెడ్డి అలియాస్ మాయలేడి రాకపోయే సరికి అనుమానం వచ్చి నలుగురు మహిళలు కలిసి పెట్టెలను తెరిచిచూడగా అందులో చిత్తుకాగితాలు, తాళం చెవిల గుత్తి మాత్రమే లభించాయి. డబ్బులని, ఇళ్ళు కొనిస్తానని నమ్మించి గత 9 నెలలుగా తన వెంట తిప్పుకుని అందినకాడికి దండుకుని పారిపోయిందని ఆవేధనతో ఆందోళన చెందుతున్నారు. కుటుంబసమస్యలతో బయటకు వచ్చిన తమకు సాయం చేస్తానంటే నమ్మి ఆమెకు సేవ చేశామని అంటున్నారు మోసపోయిన మహిళలు. దివ్యాంగురాలు, పైగా మహిళ కావడంతో నమ్మి ఆమె వెంట తిరిగామని అంటున్నారు. ఇలా మోసం చేస్తుందని అనుకోలేదని ఆవేదన చెందుతున్నారు. నమ్మితే నట్టేట ముంచేలా చేసిందని అంటున్నారు. హైదారాబాద్ అని మాత్రమే అని చెప్పిందని చదువురానితాము పూర్తిగా అడ్రస్ కూడా కనుక్కోలేదని చెబుతున్నారు. మోసం చేసిన మాయలేడి ఫేక్ బ్యాంక్ మేనేజర్ కు రాసిన లేటర్ లు, ఫేక్ ఫోన్ నెంబర్ అందులో పొందుపర్చింది. అక్షరజ్ఞానం లేని అమాయకులైన మహిళలను మోసం చేసిన మాయలేడి ఆచూకిలేక ఆందోళన చెందుతున్నారు. పోలీసులకు పిర్యాదు చేసేందుకు నిరాకరించిన మహిళలు, దివ్యాంగురాలు ఇలా మోసం చేస్తుందని ఉహించలేదని, అలాంటి వారిపట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరుతు స్వగ్రామాలకు వెళ్ళిపోయారు. --------2
- నల్గొండ నల్ల రిబ్బన్లతో రోడ్డెక్కిన కాంగ్రెస్ శ్రేణులు.. బీజేపీ ప్రభుత్వంపై వ్యతిరేక నినాదాలు... తెలంగాణను పాకిస్తాన్ విభజనతో పోల్చడం దుర్మార్గ రాజకీయమని మండిపడ్డ పున్న కైలాష్ నేత.! సోనియా గాంధీ ఇచ్చిన మాట నిలబెట్టి తెలంగాణ నాలుగు కోట్ల ప్రజల కల సాకారం చేసింది... బిజెపి తెలంగాణపై విషం చిమ్ముతుంది.. అనేకమంది బలిదానాలు పోరాటాలు, త్యాగాలను అవహేళన చేస్తుంది... ఖబర్దార్ బిజెపి నాయకుల్లారా! తెలంగాణలో బిజెపి పార్టీని భూస్థాపితం చేస్తాం అంటూ హెచ్చరిక.. మహిళా బిల్లు ముసుకులో బీజేపీ కాంగ్రెస్పై తప్పుడు ఆరోపణలు చేస్తూ చర్చలు పక్క ద్రోవ పట్టిస్తుంది... త్వరలో తెలంగాణలో బిజెపి గద్దెలు కూలుతాయని హెచ్చరిక... డిలిమిటేషన్ అంశంపై సీఎం రేవంత్ రెడ్డి లేవనెత్తిన ప్రశ్నలకు సమాధానం లేకే బీజేపీ డ్రామాలు చేస్తోందని విమర్శ... తేజస్వి సూర్య చేసిన వాక్యాలపై మోడీ తెలంగాణ ప్రజలకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్.. కార్యక్రమంలో ఎండి ముంతాజ్ అలీ, పేరిక వెంకటేశ్వర్లు, నోముల జనార్ధన్, కోమటిరెడ్డి అంజిరెడ్డి, వేముల గోపీనాథ్, అంబల హరీష్, పల్లా రవితేజతో పాటు పలువురు నేతలు పాల్గొన్నారు.1
- నల్గొండ: నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో సుభాష్ చౌరస్తా వద్ద ట్రాఫిక్ సిగ్నల్స్ గత కొన్ని నెలలుగా పని చేయడం లేదు. దీనివల్ల వాహనదారులు, పాదచారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ ప్రాంతంలో తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయని స్థానికులు తెలిపారు. అధికారుల వెంటనే స్పందించి సిగ్నల్స్ మరమ్మతు చేయాలని ప్రజలు కోరుతున్నారు.1
- వరంగల్ జిల్లా వర్ధన్నపేట పట్టణంలో జాతీయ రహదారిపై శనివారం పోలీసులు ‘అరైవ్–అలైవ్’ కార్యక్రమంలో భాగంగా రోడ్డు భద్రతపై వినూత్న రీతిలో అవగాహన కల్పించారు. హెల్మెట్ లేకుండా ద్విచక్ర వాహనాలు నడుపుతున్న వాహనదారులకు గులాబీ పూలు అందించి, భద్రతా నియమాల ప్రాముఖ్యతను వివరించారు. అలాగే కార్లలో ప్రయాణించే వారు తప్పనిసరిగా సీట్ బెల్ట్ ధరించాలని సూచించారు.ఈ కార్యక్రమంలో ఎస్సై సాయిబాబు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.1