Shuru
Apke Nagar Ki App…
రోడ్డు ప్రమాదాలపై అవగాహనకు డెమో కార్యక్రమం వర్దన్నపేటలో పోలీసులు, అధికారులు కలిసి చైతన్యం... వర్దన్నపేట (వరంగల్ జిల్లా): ప్రజా పాలన - ప్రగతి ప్రణాళికలో భాగంగా వర్దన్నపేట మండలం కొత్తపల్లి క్రాస్ రోడ్డులోని జాతీయ రహదారి (NH-563) పై వర్దన్నపేట పోలీసులు రోడ్డు ప్రమాదాల నివారణపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా అధికారులు డెమో ప్రమాదాన్ని సృష్టించి, ప్రమాదం జరిగిన వెంటనే తీసుకోవాల్సిన జాగ్రత్తలు, బాధితులకు అందించాల్సిన ప్రాథమిక సహాయంపై ప్రజలకు వివరించారు. కార్యక్రమంలో ACP, CI, SIలతో పాటు హైవే, R&B మరియు MVI అధికారులు పాల్గొని యువతకు రోడ్డు భద్రతపై అవగాహన కల్పించారు.
Mediya wgl medical wgl
రోడ్డు ప్రమాదాలపై అవగాహనకు డెమో కార్యక్రమం వర్దన్నపేటలో పోలీసులు, అధికారులు కలిసి చైతన్యం... వర్దన్నపేట (వరంగల్ జిల్లా): ప్రజా పాలన - ప్రగతి ప్రణాళికలో భాగంగా వర్దన్నపేట మండలం కొత్తపల్లి క్రాస్ రోడ్డులోని జాతీయ రహదారి (NH-563) పై వర్దన్నపేట పోలీసులు రోడ్డు ప్రమాదాల నివారణపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా అధికారులు డెమో ప్రమాదాన్ని సృష్టించి, ప్రమాదం జరిగిన వెంటనే తీసుకోవాల్సిన జాగ్రత్తలు, బాధితులకు అందించాల్సిన ప్రాథమిక సహాయంపై ప్రజలకు వివరించారు. కార్యక్రమంలో ACP, CI, SIలతో పాటు హైవే, R&B మరియు MVI అధికారులు పాల్గొని యువతకు రోడ్డు భద్రతపై అవగాహన కల్పించారు.
More news from తెలంగాణ and nearby areas
- రాజన్న సిరిసిల్ల జిల్లా ఇందిరానగర్ లో రుణం చెల్లించలేదని బ్యాంక్ అధికారులు ప్రవర్తించిన తీరు సర్వత్రా ఆందోళనకు గురిచేస్తుంది. అనారోగ్యంతో రుణం చెల్లించలేని స్థితిలో ఉన్న వ్యక్తి పట్ల విచక్షణారహితంగా ప్రవర్తించారు. గోపాల్ అనే ఐకేఎఫ్ బ్యాంకులో రుణం తీసుకున్నారు. అనారోగ్యంతో కాలు కోల్పోయిన గోపాల్ సకాలంలో రుణం చెల్లించలేదు. దీంతో బ్యాంక్ అధికారులు ఇంటికి వెళ్లి అనారోగ్యంతో ఉన్న గోపాల్ బయటికి గెంటేసి ఇంటికి తాళం వేసి సీజ్ చేశారు. కట్టుబట్టలతో రోడ్డు మీద పడ్డ కుటుంబాన్ని చూసి స్థానికులు ఆవేదనతో ఆందోళన వ్యక్తం చేశారు. అనారోగ్యంతో ఉన్న వికలాంగుడని కనీస మానవత్వం లేకుండా ఎర్రటి ఎండలో బయటకు గెంటేయడంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కలెక్టర్ తో పాటు జిల్లా అధికారులు జోక్యం చేసుకొని విచక్షణారహితంగా ప్రవర్తించిన బ్యాంక్ అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని కోరారు.2
- చిగురుమామిడి మండలం లంబాడిపల్లిలో విషాదం చోటుచేసుకుంది. పొలం నుంచి వడ్ల లోడుతో వస్తున్న ట్రాక్టర్ అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో డ్రైవర్ కాటం కిషన్ రెడ్డి అక్కడికక్కడే మృతి చెందారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి వెళ్లి దర్యాప్తు చేస్తున్నారు. ధాన్యం తరలిస్తుండగా జరిగిన ఈ ప్రమాదం గ్రామంలో తీవ్ర విషాదాన్ని నింపింది. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.1
- lగన్నేరువరం: మండలం మైలారం గ్రామంలోని మున్నూరు కాపు సంఘం భవనంలో గురువారం హిందూ సమ్మేళన కమిటీ సభ్యులు సమావేశం నిర్వహించారు. ఈనెల 23న జరగనున్న హిందూ సమ్మేళన కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు తరలి రావాలి అవసరమైన ఏర్పాట్లపై చర్చించారు. కార్యక్రమానికి విస్తృత స్థాయిలో ప్రజలను ఆకర్షించేలా చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు. హిందువులందరూ కులమతాలకు అతీతంగా ఐక్యంగా ఉండాలని కమిటీ సభ్యులు పిలుపునిచ్చారు.1
- రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలోని శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం అనుబంధ ఆలయమైన శ్రీ భీమేశ్వర స్వామి వారిని తెలంగాణ రాష్ట్ర రైల్వే మరియు రోడ్డు భద్రత ఐజీపి దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.ఈసందర్భంగా ఆలయానికి చేరుకున్న ఐజిపి కి ఆలయ అర్చకులు,వేద పండితులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు.దర్శనం అనంతరం ఆలయ మండపంలో స్వామివారి శేషవస్త్రం కప్పి, లడ్డూ ప్రసాదాన్ని అందజేసి ఆశీర్వచనం ఇచ్చారు.వారి వెంట వేములవాడ డీఎస్పీ శ్రీనివాసులు, సీఐ వీరప్రసాద్,ఆర్.ఐ సురేష్, ఎస్సైలు,అలాగే ప్రోటోకాల్ ఏఈఓ జి. అశోక్ కుమార్,ఆలయ పర్యవేక్షకులు ఎన్. రాజేందర్, ఆలయ ఉద్యోగులు కూడా హాజరయ్యారు.1
- మునగాల, సూర్యాపేట జిల్లా: ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయంగా ప్రభుత్వం నిర్వహిస్తున్న 'ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక' కార్యక్రమంలో విషాదం చోటుచేసుకుంది. అధికారుల నిర్లక్ష్యం, రాజకీయ జోక్యం ఓ నిరుపేద మహిళను ఆత్మహత్యాయత్నానికి ప్రేరేపించింది. జిల్లా కలెక్టర్, ఎస్పీ సమక్షంలోనే బాధితురాలు పురుగుల మందు తాగడం స్థానికంగా తీవ్ర సంచలనం సృష్టించింది. అసలేం జరిగింది? మునగాల మండల కేంద్రంలో శుక్రవారం నిర్వహించిన ప్రజాపాలన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవర్, జిల్లా ఎస్పీ నరసింహ మరియు ఇతర మండల స్థాయి అధికారులు పాల్గొన్నారు. సభ జరుగుతుండగా, తాడ్వాయి గ్రామానికి చెందిన సునీత అనే మహిళ ఒక్కసారిగా అధికారుల ముందుకు వచ్చి తన వెంట తెచ్చుకున్న పురుగుల మందును తాగింది. దీన్ని గమనించిన పోలీసులు, సిబ్బంది వెంటనే ఆమెను అడ్డుకుని చికిత్స నిమిత్తం హుటాహుటిన కోదాడ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. బాధితురాలి ఆవేదన: తాడ్వాయి గ్రామాన్ని ప్రభుత్వం 'ఇందిరమ్మ ఇళ్ల పైలెట్ ప్రాజెక్ట్' కింద ఎంపిక చేసింది. బాధిత మహిళ సునీత తెలిపిన వివరాల ప్రకారం: తన పేరు మీద ఇందిరమ్మ ఇల్లు మంజూరైనప్పటికీ, అధికారులు కావాలని దాన్ని వేరొకరికి కేటాయించారు. కాంగ్రెస్ నాయకులు తమ రాజకీయ పలుకుబడిని ఉపయోగించి, అర్హులకు అందాల్సిన సంక్షేమ పథకాలను అడ్డుకుంటున్నారని ఆమె ఆరోపించారు. పలుమార్లు అధికారుల చుట్టూ తిరిగినా ఫలితం లేకపోవడంతో, కలెక్టర్ ముందే తనువు చాలించాలని ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. అధికారుల స్పందన: ఈ ఘటనపై జిల్లా కలెక్టర్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బాధితురాలికి మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు. ఇళ్ల కేటాయింపులో ఏవైనా అక్రమలు జరిగాయా అనే కోణంలో విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. రాజకీయ కారణాలతో అర్హులకు అన్యాయం జరుగుతోందన్న ఆరోపణల నేపథ్యంలో మండలంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది.1
- జగిత్యాల : జగిత్యాల జిల్లాలో రోడ్డు ప్రమాదాలను తగ్గించి ప్రజలకు సురక్షిత ప్రయాణాన్ని కల్పించాలనే లక్ష్యంతో నిర్వహిస్తున్న “Arrive Alive” కార్యక్రమం విజయవంతంగా కొనసాగుతోంది. ఈ కార్యక్రమంలో భాగంగా శుక్రవారం ఉదయం 11-30 గంటల ప్రాంతంలో జిల్లా రవాణా శాఖ కార్యాలయం తాటిపల్లిలో జిల్లా రవాణా శాఖ అధికారి శ్రీనివాస్ ఆధ్వర్యంలో జగిత్యాల కు చెందిన సీనియర్ కంటి వైద్యులు డా. ముదస్సర్ తన సిబ్బందితో కలిసి వాహన డ్రైవర్లకు ఉచితంగా కంటి పరీక్షలు నిర్వహించారు. ఈ సందర్భంగా డిటిఓ శ్రీనివాస్ మాట్లాడుతూ.. జిల్లా వ్యాప్తంగా వాహన డ్రైవర్లకు ట్రాఫిక్ నియమాలపై అవగాహన కల్పించడంతో పాటు ఆరోగ్య పరిరక్షణపై కూడా దృష్టి సారిస్తున్నామని పేర్కొన్నారు.రోడ్డు ప్రమాదాలు ఎప్పుడు, ఎలా జరుగుతాయో ముందుగా ఊహించలేమని, కాబట్టి నివారణ చర్యలు అత్యంత కీలకమని స్పష్టం చేశారు. చిన్న నిర్లక్ష్యాలే పెద్ద ప్రమాదాలకు దారితీస్తాయని, అలాంటి సంఘటనల వల్ల కుటుంబాలకు తీరని నష్టం కలుగుతుందని అన్నారు. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం నిర్దేశించిన మేరకు వాహన డ్రైవర్లకు ఉచితంగా కంటి పరీక్షలు నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఇంకా, ఎంవిఐ లు అభిలాష్, ప్రమీల, షేక్ రియాజ్, రామారావు, కార్యాలయం ఉద్యోగులు, సిబ్బంది పాల్గొన్నారు. కంటి పరీక్షల అనంతరం, డా. ముదస్సర్ ప్రస్తుత ఎండాకాలంలో వాహన డ్రైవర్లతో పాటుగా చిన్నపిల్లలు, వృద్దులు కంటి జాగ్రతల కోసం టీబీసుకోవలసిన జాగ్రత్తలు వివరించారు.1
- హన్మకొండ జిల్లా:కాజీపేట మండలం మడికొండ చౌరస్తాలో కాంగ్రెస్ నాయకులు శుక్రవారం నిరసన చేపట్టారు. తెలంగాణ గౌరవాన్ని కించపరిచే వ్యాఖ్యలు చేసిన బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తూ ఆయన దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన నాయకులు, రాష్ట్ర ఏర్పాటును అవమానించేలా వ్యాఖ్యలు చేయడం అంగీకారయోగ్యం కాదని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.1
- హుజురాబాద్ సమీపంలో సిర్సపల్లి శివారులో డంపింగ్ యార్డ్ రద్దుకై జేఏసీ ఆధ్వర్యంలో కొనసాగుతున్న నిరసన ఆందోళనకు సంఘీభావంగా ఈనెల 22 నుంచి పాదయాత్ర చేస్తానని ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి తెలిపారు. హైదరాబాదులో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఎన్ని కేసులు పెట్టినా డంపింగ్ యార్డ్ రద్దయ్యే వరకు తన పోరాటం ఆగదని స్పష్టం చేశారు. కేంద్ర మంత్రి బండి సంజయ్, ఎంపీ ఈటల రాజేందర్ మౌనం వీడి ప్రజలతో కలిసి పోరాటం చేయాలని కోరారు. ప్రజల ఉద్యమంలో ప్రతి ఒక్కరు భాగస్వాములు కావాలని కోరారు.2
- రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని రాజీవ్ నగర్ కు చెందిన కూన లక్ష్మీ అనే మహిళ ఈ నెల 13వ తేదీన హత్యకు గురికాగా పోలీసులు హత్య కేసును ఛేదించి నిందితుడి వివరాలను సిరిసిల్ల డిఎస్పి కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించి వెల్లడించారు. ఈ సందర్భంగా నాగేంద్ర చారి మాట్లాడుతూ.. ఒంటరిగా ఉంటున్న కూనలక్ష్మిని గమనించిన గడీల రాజు అనే వ్యక్తి మద్యానికి బానిసై జల్సాలకు డబ్బులు సరిపోనందున ఎలా అయినా డబ్బులు సంపాదించాలనుకుని కొంత కాలం నుండి రాజీవ్ నగర్ లో ఇంటిలో లక్ష్మీ ఒక్కతే ఉండడాన్ని గమనించి ఇంట్లోకి వెళ్లి కత్తెరతో హత్య చేసి 2000 రూపాయలు నగదు, రెండు చీరలు, బ్యాంకు పాసుబుక్కులు, రాజీవ్ ఆరోగ్యశ్రీ కార్డు, హ్యాండీక్యాప్డ్ సర్టిఫికెట్ లు తీసుకెళ్లినట్లు చెవులకు ఉన్న బంగారు పుల్లలు తీయడానికి ప్రయత్నించగా అవి రాకపోవడంతో తన వద్ద ఉన్న కత్తెరతో రెండు చెవులను కత్తిరించి ఇంటికి తీసుకుపోయి అవి కడిగే ప్రయత్నం చేయగా ఆ బంగారు పోగులు పడిపోయాయని తెలిపారు. సాంకేతికత ఆధారంగా నిందితుని పట్టుకోవడం జరిగిందని అతని వద్ద నుండి హత్యకు ఉపయోగించిన కత్తెర రెండు చీరలు బ్యాంకు పాసుబుక్కులు రాజీవ్ ఆరోగ్యశ్రీ హ్యాండీక్యాప్డ్ సర్టిఫికెట్లు 2000 రూపాయలను స్వాధీనం చేసుకోవడం జరిగిందని తెలిపారు.1