Shuru
Apke Nagar Ki App…
మడికొండలో తేజస్వి సూర్య దిష్టిబొమ్మ దహనం.. కాంగ్రెస్ నిరసన హన్మకొండ జిల్లా:కాజీపేట మండలం మడికొండ చౌరస్తాలో కాంగ్రెస్ నాయకులు శుక్రవారం నిరసన చేపట్టారు. తెలంగాణ గౌరవాన్ని కించపరిచే వ్యాఖ్యలు చేసిన బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తూ ఆయన దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన నాయకులు, రాష్ట్ర ఏర్పాటును అవమానించేలా వ్యాఖ్యలు చేయడం అంగీకారయోగ్యం కాదని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
M D Azizuddin
మడికొండలో తేజస్వి సూర్య దిష్టిబొమ్మ దహనం.. కాంగ్రెస్ నిరసన హన్మకొండ జిల్లా:కాజీపేట మండలం మడికొండ చౌరస్తాలో కాంగ్రెస్ నాయకులు శుక్రవారం నిరసన చేపట్టారు. తెలంగాణ గౌరవాన్ని కించపరిచే వ్యాఖ్యలు చేసిన బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తూ ఆయన దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన నాయకులు, రాష్ట్ర ఏర్పాటును అవమానించేలా వ్యాఖ్యలు చేయడం అంగీకారయోగ్యం కాదని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
More news from తెలంగాణ and nearby areas
- కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన మాజీ మంత్రి జీవన్ రెడ్డి బిఆర్ఎస్ లో చేరిక కు ఈనెల 20న కేసీఆర్ నేతృత్వంలో జగిత్యాలలో నిర్వహించే భారీ సభకు బీఆర్ఎస్ విస్తృత ఏర్పాట్లు చేస్తుంది. జగిత్యాల జిల్లా వ్యాప్తంగా గ్రామాల వారిగా కార్యకర్తలను తరలించేందుకు జీవన్ రెడ్డి తో పాటు టిఆర్ఎస్ కు చెందిన ఎమ్మెల్యే ఎమ్మెల్సీలు పల్లా రాజేశ్వర్ రెడ్డి, కల్వకుంట్ల సంజయ్, ఎల్.రమణ సన్నాక సమావేశాలు నిర్వహిస్తున్నారు. లక్ష్మీపూర్ లో నిర్వహించిన సన్నాహక సమావేశంలో జీవన్ రెడ్డితో పాటు పల్లా రాజేశ్వర్ రెడ్డి ఎల్ రమణ జెడ్పీ మాజీ చైర్పర్సన్ దావ వసంత పాల్గొన్నారు. 20న జరిగే కెసిఆర్ సభ తెలంగాణకు మార్గదర్శకంగా నిలువబోతుందని మాజీ మంత్రి జీవన్ రెడ్డి తెలిపారు. గ్రామాలకు గ్రామాలే తరలి రావాలని కాంగ్రెస్ మోసాలను ప్రజలకు వివరించేందుకు కేసిఆర్ వస్తున్నారని తెలిపారు. జగిత్యాల నుంచే రేవంత్ రెడ్డి పతనం మొదలవుతుందని స్పష్టం చేశారు.4
- Post by Solanke Ravi4
- చిగురుమామిడి మండలం లంబాడిపల్లిలో విషాదం చోటుచేసుకుంది. పొలం నుంచి వడ్ల లోడుతో వస్తున్న ట్రాక్టర్ అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో డ్రైవర్ కాటం కిషన్ రెడ్డి అక్కడికక్కడే మృతి చెందారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి వెళ్లి దర్యాప్తు చేస్తున్నారు. ధాన్యం తరలిస్తుండగా జరిగిన ఈ ప్రమాదం గ్రామంలో తీవ్ర విషాదాన్ని నింపింది. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.1
- lగన్నేరువరం: మండలం మైలారం గ్రామంలోని మున్నూరు కాపు సంఘం భవనంలో గురువారం హిందూ సమ్మేళన కమిటీ సభ్యులు సమావేశం నిర్వహించారు. ఈనెల 23న జరగనున్న హిందూ సమ్మేళన కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు తరలి రావాలి అవసరమైన ఏర్పాట్లపై చర్చించారు. కార్యక్రమానికి విస్తృత స్థాయిలో ప్రజలను ఆకర్షించేలా చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు. హిందువులందరూ కులమతాలకు అతీతంగా ఐక్యంగా ఉండాలని కమిటీ సభ్యులు పిలుపునిచ్చారు.1
- గజ్వేల్ లో ఈతకెళ్లి యువకుడి మృతి సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండలం గజ్వేల్ ఏప్రిల్ 16, గజ్వేల్ పట్టణానికి చెందిన యువకుడు కొలిచెలిమా మధు వయసు 25 సంవత్సరాలు ఎండలు బగ్గు మంటున్న కారణంగా పట్టణంలో గల స్విమ్మింగ్ పూల్ లో ఈతకెళ్లి మృత్యువాత పడ్డాడు, కుటుంబ సభ్యులు బంధువులు వెళ్లి స్విమ్మింగ్ పూల్ యాజమాన్యాన్ని ప్రశ్నించగా ఎవరు స్పందించడం లేదు. అందుచేత అందరూ కలిసి మాకు న్యాయం కావాలని పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద ధర్నాకు దిగారు. మాకు న్యాయం కావాలని కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు.4
- రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలోని శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం అనుబంధ ఆలయమైన శ్రీ భీమేశ్వర స్వామి వారిని తెలంగాణ రాష్ట్ర రైల్వే మరియు రోడ్డు భద్రత ఐజీపి దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.ఈసందర్భంగా ఆలయానికి చేరుకున్న ఐజిపి కి ఆలయ అర్చకులు,వేద పండితులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు.దర్శనం అనంతరం ఆలయ మండపంలో స్వామివారి శేషవస్త్రం కప్పి, లడ్డూ ప్రసాదాన్ని అందజేసి ఆశీర్వచనం ఇచ్చారు.వారి వెంట వేములవాడ డీఎస్పీ శ్రీనివాసులు, సీఐ వీరప్రసాద్,ఆర్.ఐ సురేష్, ఎస్సైలు,అలాగే ప్రోటోకాల్ ఏఈఓ జి. అశోక్ కుమార్,ఆలయ పర్యవేక్షకులు ఎన్. రాజేందర్, ఆలయ ఉద్యోగులు కూడా హాజరయ్యారు.1
- హన్మకొండ జిల్లా ఐనవోలు మండలం పున్నెలు క్రాస్ రోడ్డు జాతీయ రహదారిపై మామునూర్ ఏసిపి వెంకటేష్ ఆధ్వర్యంలో శుక్రవారం రోడ్డు ప్రమాదాలపై అవగాహన కల్పించేందుకు డెమో కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రమాదం జరిగినప్పుడు తీసుకోవాల్సిన ప్రాథమిక జాగ్రత్తలు, వెంటనే చేపట్టాల్సిన చర్యలపై ప్రజలకు అవగాహన కల్పించారు. రోడ్డు భద్రతా నియమాలను తప్పనిసరిగా పాటించాలని అధికారులు సూచించారు.ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బందితో పాటు పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు.1
- మాజీ మంత్రి జీవన్ రెడ్డి ఎఫెక్ట్ జగిత్యాల జిల్లాలో చూపుతుంది. కొడిమ్యాల మండలంలో పలువురు కాంగ్రెస్ నాయకులు మాజీ ప్రజా ప్రతినిధులు కాంగ్రెస్ రాజీనామా చేశారు. కొడిమ్యాల మండల కాంగ్రెస్ నాయకులు మాజీ సర్పంచ్ పిడుగు ప్రభాకర్ రెడ్డి తన అనుచరులతో కలిసి కాంగ్రెస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఆయనతో పాటు సుమారు 100 మందికి పైగా అనుచరులు రాజీనామా చేసినట్లు తెలిపారు. చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం వైఖరిని నిరసిస్తూ ఇచ్చిన హామీలను నిలబెట్టుకోకపోవడంతో కాంగ్రెస్కు గుడ్ బై చెప్పినట్లు ప్రకటించారు. ఎమ్మెల్యేగా గెలిపించేందుకు తాము స్వంత ఖర్చులతో పనిచేశామని, కానీ గెలిచిన తరువాత ఇచ్చిన వాగ్దానాలను పూర్తిగా విస్మరించారని ఆరోపించారు. ఎప్పుడూ వ్యక్తిగత ప్రయోజనాల కోసం అడగలేదని, ప్రజల కోసం, పార్టీ బలోపేతం కోసం కృషి చేసిన కార్యకర్తల కోసం మాత్రమే న్యాయం కోరినట్లు తెలిపారు. అయినప్పటికీ, పార్టీలో కష్టపడ్డ వారిని పక్కనపెట్టి, ఇతర పార్టీల నుంచి వచ్చిన వారికి ప్రాధాన్యం ఇస్తున్నారని విమర్శించారు. పూడూరు ఖాదీ భూమి వ్యవహారాన్ని ప్రస్తావిస్తూ, చేనేత కార్మికులకు న్యాయం చేస్తానని అప్పట్లో గెలవక ముందు ఇచ్చిన హామీని ఎమ్మెల్యే నిలబెట్టుకోలేదని, ప్రస్తుతం అదే వ్యక్తిని ప్రోత్సహిస్తున్నారని ఆరోపించారు. అధికారాన్ని అనుసరించి మారే వారికి ప్రాధాన్యత ఇవ్వడంతో పనిచేసిన కార్యకర్తలకు గుర్తింపు లేదని కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు తెలిపారు. భవిష్యత్తులో ఏ పార్టీలో చేరాలనే విషయంపై త్వరలోనే అనుచరులతో చర్చించి నిర్ణయం తీసుకుని వెల్లడించారు. ఈనెల 20న జగిత్యాలలో జరిగే కెసిఆర్ సభలో జీవన్ రెడ్డి తో కలిసి బిఆర్ఎస్ లో చేరే అవకాశం ఉందాని స్థానికులు తెలిపారు.2
- రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని రాజీవ్ నగర్ కు చెందిన కూన లక్ష్మీ అనే మహిళ ఈ నెల 13వ తేదీన హత్యకు గురికాగా పోలీసులు హత్య కేసును ఛేదించి నిందితుడి వివరాలను సిరిసిల్ల డిఎస్పి కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించి వెల్లడించారు. ఈ సందర్భంగా నాగేంద్ర చారి మాట్లాడుతూ.. ఒంటరిగా ఉంటున్న కూనలక్ష్మిని గమనించిన గడీల రాజు అనే వ్యక్తి మద్యానికి బానిసై జల్సాలకు డబ్బులు సరిపోనందున ఎలా అయినా డబ్బులు సంపాదించాలనుకుని కొంత కాలం నుండి రాజీవ్ నగర్ లో ఇంటిలో లక్ష్మీ ఒక్కతే ఉండడాన్ని గమనించి ఇంట్లోకి వెళ్లి కత్తెరతో హత్య చేసి 2000 రూపాయలు నగదు, రెండు చీరలు, బ్యాంకు పాసుబుక్కులు, రాజీవ్ ఆరోగ్యశ్రీ కార్డు, హ్యాండీక్యాప్డ్ సర్టిఫికెట్ లు తీసుకెళ్లినట్లు చెవులకు ఉన్న బంగారు పుల్లలు తీయడానికి ప్రయత్నించగా అవి రాకపోవడంతో తన వద్ద ఉన్న కత్తెరతో రెండు చెవులను కత్తిరించి ఇంటికి తీసుకుపోయి అవి కడిగే ప్రయత్నం చేయగా ఆ బంగారు పోగులు పడిపోయాయని తెలిపారు. సాంకేతికత ఆధారంగా నిందితుని పట్టుకోవడం జరిగిందని అతని వద్ద నుండి హత్యకు ఉపయోగించిన కత్తెర రెండు చీరలు బ్యాంకు పాసుబుక్కులు రాజీవ్ ఆరోగ్యశ్రీ హ్యాండీక్యాప్డ్ సర్టిఫికెట్లు 2000 రూపాయలను స్వాధీనం చేసుకోవడం జరిగిందని తెలిపారు.1