జగిత్యాలలో 20న కేసీఆర్ సభకు బిఆర్ఎస్ భారీగా సన్నాహాలు...జగిత్యాల జైత్రయాత్రతో రేవంత్ రెడ్డి పతనానికి నాంది పలుకుతామని మాజీమంత్రి జీవన్ రెడ్డి వెల్లడి కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన మాజీ మంత్రి జీవన్ రెడ్డి బిఆర్ఎస్ లో చేరిక కు ఈనెల 20న కేసీఆర్ నేతృత్వంలో జగిత్యాలలో నిర్వహించే భారీ సభకు బీఆర్ఎస్ విస్తృత ఏర్పాట్లు చేస్తుంది. జగిత్యాల జిల్లా వ్యాప్తంగా గ్రామాల వారిగా కార్యకర్తలను తరలించేందుకు జీవన్ రెడ్డి తో పాటు టిఆర్ఎస్ కు చెందిన ఎమ్మెల్యే ఎమ్మెల్సీలు పల్లా రాజేశ్వర్ రెడ్డి, కల్వకుంట్ల సంజయ్, ఎల్.రమణ సన్నాక సమావేశాలు నిర్వహిస్తున్నారు. లక్ష్మీపూర్ లో నిర్వహించిన సన్నాహక సమావేశంలో జీవన్ రెడ్డితో పాటు పల్లా రాజేశ్వర్ రెడ్డి ఎల్ రమణ జెడ్పీ మాజీ చైర్పర్సన్ దావ వసంత పాల్గొన్నారు. 20న జరిగే కెసిఆర్ సభ తెలంగాణకు మార్గదర్శకంగా నిలువబోతుందని మాజీ మంత్రి జీవన్ రెడ్డి తెలిపారు. గ్రామాలకు గ్రామాలే తరలి రావాలని కాంగ్రెస్ మోసాలను ప్రజలకు వివరించేందుకు కేసిఆర్ వస్తున్నారని తెలిపారు. జగిత్యాల నుంచే రేవంత్ రెడ్డి పతనం మొదలవుతుందని స్పష్టం చేశారు.
జగిత్యాలలో 20న కేసీఆర్ సభకు బిఆర్ఎస్ భారీగా సన్నాహాలు...జగిత్యాల జైత్రయాత్రతో రేవంత్ రెడ్డి పతనానికి నాంది పలుకుతామని మాజీమంత్రి జీవన్ రెడ్డి వెల్లడి కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన మాజీ మంత్రి జీవన్ రెడ్డి బిఆర్ఎస్ లో చేరిక కు ఈనెల
20న కేసీఆర్ నేతృత్వంలో జగిత్యాలలో నిర్వహించే భారీ సభకు బీఆర్ఎస్ విస్తృత ఏర్పాట్లు చేస్తుంది. జగిత్యాల జిల్లా వ్యాప్తంగా గ్రామాల వారిగా కార్యకర్తలను తరలించేందుకు జీవన్ రెడ్డి తో పాటు టిఆర్ఎస్ కు చెందిన ఎమ్మెల్యే ఎమ్మెల్సీలు పల్లా రాజేశ్వర్
రెడ్డి, కల్వకుంట్ల సంజయ్, ఎల్.రమణ సన్నాక సమావేశాలు నిర్వహిస్తున్నారు. లక్ష్మీపూర్ లో నిర్వహించిన సన్నాహక సమావేశంలో జీవన్ రెడ్డితో పాటు పల్లా రాజేశ్వర్ రెడ్డి ఎల్ రమణ జెడ్పీ మాజీ చైర్పర్సన్ దావ వసంత పాల్గొన్నారు. 20న జరిగే కెసిఆర్
సభ తెలంగాణకు మార్గదర్శకంగా నిలువబోతుందని మాజీ మంత్రి జీవన్ రెడ్డి తెలిపారు. గ్రామాలకు గ్రామాలే తరలి రావాలని కాంగ్రెస్ మోసాలను ప్రజలకు వివరించేందుకు కేసిఆర్ వస్తున్నారని తెలిపారు. జగిత్యాల నుంచే రేవంత్ రెడ్డి పతనం మొదలవుతుందని స్పష్టం చేశారు.
- పార్లమెంట్ లో బిజెపికి చెందిన ఎంపీ తేజస్వి సూర్య చేసిన వ్యాఖ్యలు రాజకీయ దుమారం రేపుతున్నాయి. నిరసన ఆందోళనలతో ఎంపీ పదవి నుంచి తొలగించి, దేశద్రోహం కేసు పెట్టాలని కాంగ్రెస్ కార్యకర్తలు డిమాండ్ చేస్తున్నారు. ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ పిలుపు మేరకు కరీంనగర్లో కాంగ్రెస్ కార్యకర్తలు తేజస్వి సూర్య దిష్టిబొమ్మ దహనం చేశారు. నగర కాంగ్రెస్ అధ్యక్షులు అంజన్ కుమార్ ఆధ్వర్యంలో జరిగిన నిరసన ఆందోళనలో కాంగ్రెస్ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని యంపి.తేజస్వి సూర్య తెలంగాణ ప్రజలకు వెంటనే క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. బిజెపి నుండి సస్పెండ్ చేయాలని కోరారు. తెలంగాణ ఉద్యమకారుల త్యాగాలను అవమానపరిచే విధంగా మాట్లాడడం దుర్మార్గమని అంజన్ కుమార్ తో పాటు పలువురు నాయకులు మండిపడ్డారు. తెలంగాణ రాష్ట్రంలోని నాలుగున్నర కోట్ల పౌరులను పాకిస్థాన్ వాదులతో పోల్చడం తీవ్రమైన అభ్యంతరకర వ్యాఖ్యలుగా పరిగణిస్తున్నామని తెలిపారు. తేజస్వి సూర్య వెంటనే క్షమాపణలు చెప్పకపోతే ఆయనపై దేశద్రోహం కేసు పెట్టాలని పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేస్తామని హెచ్చరించారు.2
- చిగురుమామిడి మండలం లంబాడిపల్లిలో విషాదం చోటుచేసుకుంది. పొలం నుంచి వడ్ల లోడుతో వస్తున్న ట్రాక్టర్ అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో డ్రైవర్ కాటం కిషన్ రెడ్డి అక్కడికక్కడే మృతి చెందారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి వెళ్లి దర్యాప్తు చేస్తున్నారు. ధాన్యం తరలిస్తుండగా జరిగిన ఈ ప్రమాదం గ్రామంలో తీవ్ర విషాదాన్ని నింపింది. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.1
- Post by Solanke Ravi4
- lగన్నేరువరం: మండలం మైలారం గ్రామంలోని మున్నూరు కాపు సంఘం భవనంలో గురువారం హిందూ సమ్మేళన కమిటీ సభ్యులు సమావేశం నిర్వహించారు. ఈనెల 23న జరగనున్న హిందూ సమ్మేళన కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు తరలి రావాలి అవసరమైన ఏర్పాట్లపై చర్చించారు. కార్యక్రమానికి విస్తృత స్థాయిలో ప్రజలను ఆకర్షించేలా చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు. హిందువులందరూ కులమతాలకు అతీతంగా ఐక్యంగా ఉండాలని కమిటీ సభ్యులు పిలుపునిచ్చారు.1
- రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలోని శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం అనుబంధ ఆలయమైన శ్రీ భీమేశ్వర స్వామి వారిని తెలంగాణ రాష్ట్ర రైల్వే మరియు రోడ్డు భద్రత ఐజీపి దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.ఈసందర్భంగా ఆలయానికి చేరుకున్న ఐజిపి కి ఆలయ అర్చకులు,వేద పండితులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు.దర్శనం అనంతరం ఆలయ మండపంలో స్వామివారి శేషవస్త్రం కప్పి, లడ్డూ ప్రసాదాన్ని అందజేసి ఆశీర్వచనం ఇచ్చారు.వారి వెంట వేములవాడ డీఎస్పీ శ్రీనివాసులు, సీఐ వీరప్రసాద్,ఆర్.ఐ సురేష్, ఎస్సైలు,అలాగే ప్రోటోకాల్ ఏఈఓ జి. అశోక్ కుమార్,ఆలయ పర్యవేక్షకులు ఎన్. రాజేందర్, ఆలయ ఉద్యోగులు కూడా హాజరయ్యారు.1
- జనగాం జిల్లా అగ్నిమాపక వారోత్సవాల్లో భాగంగా స్టేషన్ ఘన్పూర్ మున్సిపల్ కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో అగ్నిప్రమాదాల నివారణపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఫైర్ ఆఫీసర్ నరేందర్ ఆధ్వర్యంలో సిబ్బంది పాల్గొన్నారు. ఆసుపత్రి సిబ్బంది, రోగులకు అగ్నిప్రమాదాల నివారణ చర్యలు వివరించారు. అత్యవసర పరిస్థితుల్లో ఫైర్ ఎస్టింగిషర్ వినియోగ విధానాన్ని ప్రాక్టికల్‌గా చూపించారు. ప్రమాదాల నివారణకు ముందస్తు జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించాలని సూచించారు.1
- జగిత్యాల : జగిత్యాల జిల్లాలో రోడ్డు ప్రమాదాలను తగ్గించి ప్రజలకు సురక్షిత ప్రయాణాన్ని కల్పించాలనే లక్ష్యంతో నిర్వహిస్తున్న “Arrive Alive” కార్యక్రమం విజయవంతంగా కొనసాగుతోంది. ఈ కార్యక్రమంలో భాగంగా శుక్రవారం ఉదయం 11-30 గంటల ప్రాంతంలో జిల్లా రవాణా శాఖ కార్యాలయం తాటిపల్లిలో జిల్లా రవాణా శాఖ అధికారి శ్రీనివాస్ ఆధ్వర్యంలో జగిత్యాల కు చెందిన సీనియర్ కంటి వైద్యులు డా. ముదస్సర్ తన సిబ్బందితో కలిసి వాహన డ్రైవర్లకు ఉచితంగా కంటి పరీక్షలు నిర్వహించారు. ఈ సందర్భంగా డిటిఓ శ్రీనివాస్ మాట్లాడుతూ.. జిల్లా వ్యాప్తంగా వాహన డ్రైవర్లకు ట్రాఫిక్ నియమాలపై అవగాహన కల్పించడంతో పాటు ఆరోగ్య పరిరక్షణపై కూడా దృష్టి సారిస్తున్నామని పేర్కొన్నారు.రోడ్డు ప్రమాదాలు ఎప్పుడు, ఎలా జరుగుతాయో ముందుగా ఊహించలేమని, కాబట్టి నివారణ చర్యలు అత్యంత కీలకమని స్పష్టం చేశారు. చిన్న నిర్లక్ష్యాలే పెద్ద ప్రమాదాలకు దారితీస్తాయని, అలాంటి సంఘటనల వల్ల కుటుంబాలకు తీరని నష్టం కలుగుతుందని అన్నారు. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం నిర్దేశించిన మేరకు వాహన డ్రైవర్లకు ఉచితంగా కంటి పరీక్షలు నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఇంకా, ఎంవిఐ లు అభిలాష్, ప్రమీల, షేక్ రియాజ్, రామారావు, కార్యాలయం ఉద్యోగులు, సిబ్బంది పాల్గొన్నారు. కంటి పరీక్షల అనంతరం, డా. ముదస్సర్ ప్రస్తుత ఎండాకాలంలో వాహన డ్రైవర్లతో పాటుగా చిన్నపిల్లలు, వృద్దులు కంటి జాగ్రతల కోసం టీబీసుకోవలసిన జాగ్రత్తలు వివరించారు.1
- రాజన్న సిరిసిల్ల జిల్లా ఇందిరానగర్ లో రుణం చెల్లించలేదని బ్యాంక్ అధికారులు ప్రవర్తించిన తీరు సర్వత్రా ఆందోళనకు గురిచేస్తుంది. అనారోగ్యంతో రుణం చెల్లించలేని స్థితిలో ఉన్న వ్యక్తి పట్ల విచక్షణారహితంగా ప్రవర్తించారు. గోపాల్ అనే ఐకేఎఫ్ బ్యాంకులో రుణం తీసుకున్నారు. అనారోగ్యంతో కాలు కోల్పోయిన గోపాల్ సకాలంలో రుణం చెల్లించలేదు. దీంతో బ్యాంక్ అధికారులు ఇంటికి వెళ్లి అనారోగ్యంతో ఉన్న గోపాల్ బయటికి గెంటేసి ఇంటికి తాళం వేసి సీజ్ చేశారు. కట్టుబట్టలతో రోడ్డు మీద పడ్డ కుటుంబాన్ని చూసి స్థానికులు ఆవేదనతో ఆందోళన వ్యక్తం చేశారు. అనారోగ్యంతో ఉన్న వికలాంగుడని కనీస మానవత్వం లేకుండా ఎర్రటి ఎండలో బయటకు గెంటేయడంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కలెక్టర్ తో పాటు జిల్లా అధికారులు జోక్యం చేసుకొని విచక్షణారహితంగా ప్రవర్తించిన బ్యాంక్ అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని కోరారు.2