చొప్పదండి ఎమ్మెల్యే వైఖరిని నిరసిస్తూ కొడిమ్యాల మండలంలో పలువురు కాంగ్రెస్ కు రాజీనామా.... జీవన్ రెడ్డితో కలిసి ఈనెల 20న బిఆర్ఎస్ లో చేరేందుకు సన్నాహాలు మాజీ మంత్రి జీవన్ రెడ్డి ఎఫెక్ట్ జగిత్యాల జిల్లాలో చూపుతుంది. కొడిమ్యాల మండలంలో పలువురు కాంగ్రెస్ నాయకులు మాజీ ప్రజా ప్రతినిధులు కాంగ్రెస్ రాజీనామా చేశారు. కొడిమ్యాల మండల కాంగ్రెస్ నాయకులు మాజీ సర్పంచ్ పిడుగు ప్రభాకర్ రెడ్డి తన అనుచరులతో కలిసి కాంగ్రెస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఆయనతో పాటు సుమారు 100 మందికి పైగా అనుచరులు రాజీనామా చేసినట్లు తెలిపారు. చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం వైఖరిని నిరసిస్తూ ఇచ్చిన హామీలను నిలబెట్టుకోకపోవడంతో కాంగ్రెస్కు గుడ్ బై చెప్పినట్లు ప్రకటించారు. ఎమ్మెల్యేగా గెలిపించేందుకు తాము స్వంత ఖర్చులతో పనిచేశామని, కానీ గెలిచిన తరువాత ఇచ్చిన వాగ్దానాలను పూర్తిగా విస్మరించారని ఆరోపించారు. ఎప్పుడూ వ్యక్తిగత ప్రయోజనాల కోసం అడగలేదని, ప్రజల కోసం, పార్టీ బలోపేతం కోసం కృషి చేసిన కార్యకర్తల కోసం మాత్రమే న్యాయం కోరినట్లు తెలిపారు. అయినప్పటికీ, పార్టీలో కష్టపడ్డ వారిని పక్కనపెట్టి, ఇతర పార్టీల నుంచి వచ్చిన వారికి ప్రాధాన్యం ఇస్తున్నారని విమర్శించారు. పూడూరు ఖాదీ భూమి వ్యవహారాన్ని ప్రస్తావిస్తూ, చేనేత కార్మికులకు న్యాయం చేస్తానని అప్పట్లో గెలవక ముందు ఇచ్చిన హామీని ఎమ్మెల్యే నిలబెట్టుకోలేదని, ప్రస్తుతం అదే వ్యక్తిని ప్రోత్సహిస్తున్నారని ఆరోపించారు. అధికారాన్ని అనుసరించి మారే వారికి ప్రాధాన్యత ఇవ్వడంతో పనిచేసిన కార్యకర్తలకు గుర్తింపు లేదని కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు తెలిపారు. భవిష్యత్తులో ఏ పార్టీలో చేరాలనే విషయంపై త్వరలోనే అనుచరులతో చర్చించి నిర్ణయం తీసుకుని వెల్లడించారు. ఈనెల 20న జగిత్యాలలో జరిగే కెసిఆర్ సభలో జీవన్ రెడ్డి తో కలిసి బిఆర్ఎస్ లో చేరే అవకాశం ఉందాని స్థానికులు తెలిపారు.
చొప్పదండి ఎమ్మెల్యే వైఖరిని నిరసిస్తూ కొడిమ్యాల మండలంలో పలువురు కాంగ్రెస్ కు రాజీనామా.... జీవన్ రెడ్డితో కలిసి ఈనెల 20న బిఆర్ఎస్ లో చేరేందుకు సన్నాహాలు మాజీ మంత్రి జీవన్ రెడ్డి ఎఫెక్ట్ జగిత్యాల జిల్లాలో చూపుతుంది. కొడిమ్యాల మండలంలో పలువురు కాంగ్రెస్ నాయకులు మాజీ ప్రజా ప్రతినిధులు కాంగ్రెస్ రాజీనామా చేశారు. కొడిమ్యాల మండల కాంగ్రెస్ నాయకులు మాజీ సర్పంచ్ పిడుగు ప్రభాకర్ రెడ్డి తన అనుచరులతో కలిసి కాంగ్రెస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఆయనతో పాటు సుమారు 100 మందికి పైగా అనుచరులు రాజీనామా చేసినట్లు తెలిపారు. చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం వైఖరిని నిరసిస్తూ ఇచ్చిన హామీలను నిలబెట్టుకోకపోవడంతో కాంగ్రెస్కు గుడ్ బై చెప్పినట్లు ప్రకటించారు. ఎమ్మెల్యేగా గెలిపించేందుకు తాము స్వంత ఖర్చులతో పనిచేశామని, కానీ గెలిచిన తరువాత ఇచ్చిన వాగ్దానాలను పూర్తిగా విస్మరించారని ఆరోపించారు. ఎప్పుడూ
వ్యక్తిగత ప్రయోజనాల కోసం అడగలేదని, ప్రజల కోసం, పార్టీ బలోపేతం కోసం కృషి చేసిన కార్యకర్తల కోసం మాత్రమే న్యాయం కోరినట్లు తెలిపారు. అయినప్పటికీ, పార్టీలో కష్టపడ్డ వారిని పక్కనపెట్టి, ఇతర పార్టీల నుంచి వచ్చిన వారికి ప్రాధాన్యం ఇస్తున్నారని విమర్శించారు. పూడూరు ఖాదీ భూమి వ్యవహారాన్ని ప్రస్తావిస్తూ, చేనేత కార్మికులకు న్యాయం చేస్తానని అప్పట్లో గెలవక ముందు ఇచ్చిన హామీని ఎమ్మెల్యే నిలబెట్టుకోలేదని, ప్రస్తుతం అదే వ్యక్తిని ప్రోత్సహిస్తున్నారని ఆరోపించారు. అధికారాన్ని అనుసరించి మారే వారికి ప్రాధాన్యత ఇవ్వడంతో పనిచేసిన కార్యకర్తలకు గుర్తింపు లేదని కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు తెలిపారు. భవిష్యత్తులో ఏ పార్టీలో చేరాలనే విషయంపై త్వరలోనే అనుచరులతో చర్చించి నిర్ణయం తీసుకుని వెల్లడించారు. ఈనెల 20న జగిత్యాలలో జరిగే కెసిఆర్ సభలో జీవన్ రెడ్డి తో కలిసి బిఆర్ఎస్ లో చేరే అవకాశం ఉందాని స్థానికులు తెలిపారు.
- Post by Solanke Ravi4
- రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని రాజీవ్ నగర్ కు చెందిన కూన లక్ష్మీ అనే మహిళ ఈ నెల 13వ తేదీన హత్యకు గురికాగా పోలీసులు హత్య కేసును ఛేదించి నిందితుడి వివరాలను సిరిసిల్ల డిఎస్పి కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించి వెల్లడించారు. ఈ సందర్భంగా నాగేంద్ర చారి మాట్లాడుతూ.. ఒంటరిగా ఉంటున్న కూనలక్ష్మిని గమనించిన గడీల రాజు అనే వ్యక్తి మద్యానికి బానిసై జల్సాలకు డబ్బులు సరిపోనందున ఎలా అయినా డబ్బులు సంపాదించాలనుకుని కొంత కాలం నుండి రాజీవ్ నగర్ లో ఇంటిలో లక్ష్మీ ఒక్కతే ఉండడాన్ని గమనించి ఇంట్లోకి వెళ్లి కత్తెరతో హత్య చేసి 2000 రూపాయలు నగదు, రెండు చీరలు, బ్యాంకు పాసుబుక్కులు, రాజీవ్ ఆరోగ్యశ్రీ కార్డు, హ్యాండీక్యాప్డ్ సర్టిఫికెట్ లు తీసుకెళ్లినట్లు చెవులకు ఉన్న బంగారు పుల్లలు తీయడానికి ప్రయత్నించగా అవి రాకపోవడంతో తన వద్ద ఉన్న కత్తెరతో రెండు చెవులను కత్తిరించి ఇంటికి తీసుకుపోయి అవి కడిగే ప్రయత్నం చేయగా ఆ బంగారు పోగులు పడిపోయాయని తెలిపారు. సాంకేతికత ఆధారంగా నిందితుని పట్టుకోవడం జరిగిందని అతని వద్ద నుండి హత్యకు ఉపయోగించిన కత్తెర రెండు చీరలు బ్యాంకు పాసుబుక్కులు రాజీవ్ ఆరోగ్యశ్రీ హ్యాండీక్యాప్డ్ సర్టిఫికెట్లు 2000 రూపాయలను స్వాధీనం చేసుకోవడం జరిగిందని తెలిపారు.1
- హన్మకొండ జిల్లా:కాజీపేట మండలం మడికొండ చౌరస్తాలో కాంగ్రెస్ నాయకులు శుక్రవారం నిరసన చేపట్టారు. తెలంగాణ గౌరవాన్ని కించపరిచే వ్యాఖ్యలు చేసిన బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తూ ఆయన దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన నాయకులు, రాష్ట్ర ఏర్పాటును అవమానించేలా వ్యాఖ్యలు చేయడం అంగీకారయోగ్యం కాదని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.1
- జగిత్యాల : జగిత్యాల జిల్లాలో రోడ్డు ప్రమాదాలను తగ్గించి ప్రజలకు సురక్షిత ప్రయాణాన్ని కల్పించాలనే లక్ష్యంతో నిర్వహిస్తున్న “Arrive Alive” కార్యక్రమం విజయవంతంగా కొనసాగుతోంది. ఈ కార్యక్రమంలో భాగంగా శుక్రవారం ఉదయం 11-30 గంటల ప్రాంతంలో జిల్లా రవాణా శాఖ కార్యాలయం తాటిపల్లిలో జిల్లా రవాణా శాఖ అధికారి శ్రీనివాస్ ఆధ్వర్యంలో జగిత్యాల కు చెందిన సీనియర్ కంటి వైద్యులు డా. ముదస్సర్ తన సిబ్బందితో కలిసి వాహన డ్రైవర్లకు ఉచితంగా కంటి పరీక్షలు నిర్వహించారు. ఈ సందర్భంగా డిటిఓ శ్రీనివాస్ మాట్లాడుతూ.. జిల్లా వ్యాప్తంగా వాహన డ్రైవర్లకు ట్రాఫిక్ నియమాలపై అవగాహన కల్పించడంతో పాటు ఆరోగ్య పరిరక్షణపై కూడా దృష్టి సారిస్తున్నామని పేర్కొన్నారు.రోడ్డు ప్రమాదాలు ఎప్పుడు, ఎలా జరుగుతాయో ముందుగా ఊహించలేమని, కాబట్టి నివారణ చర్యలు అత్యంత కీలకమని స్పష్టం చేశారు. చిన్న నిర్లక్ష్యాలే పెద్ద ప్రమాదాలకు దారితీస్తాయని, అలాంటి సంఘటనల వల్ల కుటుంబాలకు తీరని నష్టం కలుగుతుందని అన్నారు. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం నిర్దేశించిన మేరకు వాహన డ్రైవర్లకు ఉచితంగా కంటి పరీక్షలు నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఇంకా, ఎంవిఐ లు అభిలాష్, ప్రమీల, షేక్ రియాజ్, రామారావు, కార్యాలయం ఉద్యోగులు, సిబ్బంది పాల్గొన్నారు. కంటి పరీక్షల అనంతరం, డా. ముదస్సర్ ప్రస్తుత ఎండాకాలంలో వాహన డ్రైవర్లతో పాటుగా చిన్నపిల్లలు, వృద్దులు కంటి జాగ్రతల కోసం టీబీసుకోవలసిన జాగ్రత్తలు వివరించారు.1
- గజ్వేల్ లో ఈతకెళ్లి యువకుడి మృతి సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండలం గజ్వేల్ ఏప్రిల్ 16, గజ్వేల్ పట్టణానికి చెందిన యువకుడు కొలిచెలిమా మధు వయసు 25 సంవత్సరాలు ఎండలు బగ్గు మంటున్న కారణంగా పట్టణంలో గల స్విమ్మింగ్ పూల్ లో ఈతకెళ్లి మృత్యువాత పడ్డాడు, కుటుంబ సభ్యులు బంధువులు వెళ్లి స్విమ్మింగ్ పూల్ యాజమాన్యాన్ని ప్రశ్నించగా ఎవరు స్పందించడం లేదు. అందుచేత అందరూ కలిసి మాకు న్యాయం కావాలని పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద ధర్నాకు దిగారు. మాకు న్యాయం కావాలని కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు.4
- Post by Boke saikumar Boke saikumar1
- పార్లమెంటులో ఎంపీ తేజస్వి సూర్య చేసిన వ్యాఖ్యలపై చర్యలు తీసుకోవాలని మంత్రి పొన్నం ప్రభాకర్ రాసిన లేఖ పై రాష్ట్ర డిజిపి శివధర్ రెడ్డి స్పందించారు. లీగల్ ఒపీనియన్ తీసుకుంటున్నామని కరీంనగర్లో చెప్పారు. అసెంబ్లీలో, పార్లమెంటులో చేసిన వ్యాఖ్యలపై చర్యలు తీసుకునే అవకాశం తమకు లేదని డిజీపి స్పష్టం చేశారు. కరీంనగర్ లో పర్యటించిన డీజీపీ, అరైవ్ అలైవ్ కార్యక్రమంలో పాల్గొని పోలీసులకు నగర ప్రజలకు దిశా నిర్దేశం చేశారు. సిపి గౌస్ ఆలం ఆద్వర్యంలో పోలీస్ హెడ్ క్వార్టర్ లో మొక్కలు నాటారు. అరైవ్ అలైవ్ ప్రాధాన్యతను వివరిస్తూ జిల్లా స్థాయి అవగాహన సదస్సు నిర్వహించి బెలూన్ ఏగురేశారు. రోడ్డు ప్రమాదాల్లో రాష్ట్రంలో 1 లక్షా 74 వేల మంది మృతి చెందారని, డిసెంబర్ నుంచి చేపడుతున్న అవగాహన కార్యక్రమాలతో గడిచిన మూడు మాసాల్లో 330 మృతి కేసులు తగ్గాయని చెప్పారు. అన్ని విభాగాల భాగస్వామ్యంతో క్షేత్ర స్థాయిలో రోడ్ సేఫ్టీ కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని, అవగాహన కార్యక్రమాల అనంతరం రోడ్ సేఫ్టీ పై కఠిన చర్యలు చేపట్టడం జరుగుతుందన్నారు. సామాజిక, ప్రజా సమస్యగా ఉన్న రోడ్ సేఫ్టీని ప్రతి ఒక్కరు పాటించాలని కోరారు. గ్రామాల్లో విలేజ్ రోడ్డు సేఫ్టీ కమిటీలు ఏర్పాటు చేశామని, మైనర్లు డ్రైవింగ్ చేస్తే కఠిన చర్యలు చేపడుతామని చెప్పారు. రోడ్డు సేఫ్టీ పై ప్రత్యేకంగా మీడియా ప్రాధాన్యత ఇవ్వాలని డిజిపి శివధర్ రెడ్డి కోరారు.4
- రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలోని శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం లో గురువారం మాస శివరాత్రి సందర్భంగా విశేష పూజా కార్యక్రమాలు ఘనంగా నిర్వహించబడ్డాయి.ఈ సందర్భంగా ఉదయం స్వామివారికి మహన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకం శాస్త్రోక్తంగా నిర్వహించారు. అనంతరం పరివార దేవతలకు ప్రత్యేక అర్చనలు నిర్వహించారు. సాయంత్రం మహా లింగార్చన కార్యక్రమంలో భాగంగా 365 జ్యోతులను వెలిగించి భక్తి శ్రద్ధలతో పూజలు చేశారు. ఈ కార్యక్రమాలను ఆలయ ప్రధాన అర్చకులు ఈశ్వర్ గారు, సురేష్ గారి ఆధ్వర్యంలో అర్చకులు, వేద పండితులు ఏకాంతంగా నిర్వహించారు.1
- హన్మకొండ జిల్లా ఐనవోలు మండలం పున్నెలు క్రాస్ రోడ్డు జాతీయ రహదారిపై మామునూర్ ఏసిపి వెంకటేష్ ఆధ్వర్యంలో శుక్రవారం రోడ్డు ప్రమాదాలపై అవగాహన కల్పించేందుకు డెమో కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రమాదం జరిగినప్పుడు తీసుకోవాల్సిన ప్రాథమిక జాగ్రత్తలు, వెంటనే చేపట్టాల్సిన చర్యలపై ప్రజలకు అవగాహన కల్పించారు. రోడ్డు భద్రతా నియమాలను తప్పనిసరిగా పాటించాలని అధికారులు సూచించారు.ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బందితో పాటు పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు.1