logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

హుజురాబాద్ లో డంపింగ్ యార్డ్ రద్దుకై ఈనెల 22 నుంచి ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి పాదయాత్ర...బిజెపి నేతలు మద్దతు ఇవ్వాలని డిమాండ్ హుజురాబాద్ సమీపంలో సిర్సపల్లి శివారులో డంపింగ్ యార్డ్ రద్దుకై జేఏసీ ఆధ్వర్యంలో కొనసాగుతున్న నిరసన ఆందోళనకు సంఘీభావంగా ఈనెల 22 నుంచి పాదయాత్ర చేస్తానని ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి తెలిపారు. హైదరాబాదులో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఎన్ని కేసులు పెట్టినా డంపింగ్ యార్డ్ రద్దయ్యే వరకు తన పోరాటం ఆగదని స్పష్టం చేశారు. కేంద్ర మంత్రి బండి సంజయ్, ఎంపీ ఈటల రాజేందర్ మౌనం వీడి ప్రజలతో కలిసి పోరాటం చేయాలని కోరారు. ప్రజల ఉద్యమంలో ప్రతి ఒక్కరు భాగస్వాములు కావాలని కోరారు.

2 hrs ago
user_K.V.REDDY
K.V.REDDY
చిగురుమామిడి, కరీంనగర్, తెలంగాణ•
2 hrs ago
a9b67252-f92d-417e-baa3-17cdde514422

హుజురాబాద్ లో డంపింగ్ యార్డ్ రద్దుకై ఈనెల 22 నుంచి ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి పాదయాత్ర...బిజెపి నేతలు మద్దతు ఇవ్వాలని డిమాండ్ హుజురాబాద్ సమీపంలో సిర్సపల్లి శివారులో డంపింగ్ యార్డ్ రద్దుకై జేఏసీ ఆధ్వర్యంలో కొనసాగుతున్న నిరసన ఆందోళనకు సంఘీభావంగా ఈనెల 22 నుంచి పాదయాత్ర చేస్తానని ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి తెలిపారు. హైదరాబాదులో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఎన్ని కేసులు పెట్టినా డంపింగ్ యార్డ్ రద్దయ్యే వరకు తన పోరాటం ఆగదని స్పష్టం చేశారు. కేంద్ర మంత్రి బండి సంజయ్, ఎంపీ ఈటల రాజేందర్ మౌనం వీడి ప్రజలతో కలిసి పోరాటం చేయాలని కోరారు. ప్రజల ఉద్యమంలో ప్రతి ఒక్కరు భాగస్వాములు కావాలని కోరారు.

More news from తెలంగాణ and nearby areas
  • Post by Solanke Ravi
    4
    Post by Solanke Ravi
    user_Solanke Ravi
    Solanke Ravi
    Photographer నంగ్నూర్, సిద్దిపేట, తెలంగాణ•
    22 hrs ago
  • రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని రాజీవ్ నగర్ కు చెందిన కూన లక్ష్మీ అనే మహిళ ఈ నెల 13వ తేదీన హత్యకు గురికాగా పోలీసులు హత్య కేసును ఛేదించి నిందితుడి వివరాలను సిరిసిల్ల డిఎస్పి కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించి వెల్లడించారు. ఈ సందర్భంగా నాగేంద్ర చారి మాట్లాడుతూ.. ఒంటరిగా ఉంటున్న కూనలక్ష్మిని గమనించిన గడీల రాజు అనే వ్యక్తి మద్యానికి బానిసై జల్సాలకు డబ్బులు సరిపోనందున ఎలా అయినా డబ్బులు సంపాదించాలనుకుని కొంత కాలం నుండి రాజీవ్ నగర్ లో ఇంటిలో లక్ష్మీ ఒక్కతే ఉండడాన్ని గమనించి ఇంట్లోకి వెళ్లి కత్తెరతో హత్య చేసి 2000 రూపాయలు నగదు, రెండు చీరలు, బ్యాంకు పాసుబుక్కులు, రాజీవ్ ఆరోగ్యశ్రీ కార్డు, హ్యాండీక్యాప్డ్ సర్టిఫికెట్ లు తీసుకెళ్లినట్లు చెవులకు ఉన్న బంగారు పుల్లలు తీయడానికి ప్రయత్నించగా అవి రాకపోవడంతో తన వద్ద ఉన్న కత్తెరతో రెండు చెవులను కత్తిరించి ఇంటికి తీసుకుపోయి అవి కడిగే ప్రయత్నం చేయగా ఆ బంగారు పోగులు పడిపోయాయని తెలిపారు. సాంకేతికత ఆధారంగా నిందితుని పట్టుకోవడం జరిగిందని అతని వద్ద నుండి హత్యకు ఉపయోగించిన కత్తెర రెండు చీరలు బ్యాంకు పాసుబుక్కులు రాజీవ్ ఆరోగ్యశ్రీ హ్యాండీక్యాప్డ్ సర్టిఫికెట్లు 2000 రూపాయలను స్వాధీనం చేసుకోవడం జరిగిందని తెలిపారు.
    1
    రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని రాజీవ్ నగర్ కు చెందిన కూన లక్ష్మీ అనే మహిళ ఈ నెల 13వ తేదీన హత్యకు గురికాగా పోలీసులు హత్య కేసును ఛేదించి నిందితుడి వివరాలను సిరిసిల్ల డిఎస్పి కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించి వెల్లడించారు. ఈ సందర్భంగా నాగేంద్ర చారి మాట్లాడుతూ.. ఒంటరిగా ఉంటున్న కూనలక్ష్మిని గమనించిన గడీల రాజు అనే వ్యక్తి మద్యానికి బానిసై జల్సాలకు డబ్బులు సరిపోనందున ఎలా అయినా డబ్బులు సంపాదించాలనుకుని కొంత కాలం నుండి రాజీవ్ నగర్ లో ఇంటిలో లక్ష్మీ ఒక్కతే ఉండడాన్ని గమనించి ఇంట్లోకి వెళ్లి కత్తెరతో హత్య చేసి 2000 రూపాయలు నగదు, రెండు చీరలు, బ్యాంకు పాసుబుక్కులు, రాజీవ్  ఆరోగ్యశ్రీ కార్డు, హ్యాండీక్యాప్డ్ సర్టిఫికెట్ లు  తీసుకెళ్లినట్లు చెవులకు ఉన్న బంగారు పుల్లలు తీయడానికి ప్రయత్నించగా అవి రాకపోవడంతో తన వద్ద ఉన్న కత్తెరతో రెండు చెవులను కత్తిరించి ఇంటికి తీసుకుపోయి అవి కడిగే ప్రయత్నం చేయగా ఆ బంగారు పోగులు పడిపోయాయని తెలిపారు. సాంకేతికత ఆధారంగా నిందితుని పట్టుకోవడం జరిగిందని అతని వద్ద నుండి హత్యకు ఉపయోగించిన కత్తెర రెండు చీరలు బ్యాంకు పాసుబుక్కులు రాజీవ్ ఆరోగ్యశ్రీ హ్యాండీక్యాప్డ్ సర్టిఫికెట్లు 2000 రూపాయలను స్వాధీనం చేసుకోవడం జరిగిందని తెలిపారు.
    user_Satheesh gangu
    Satheesh gangu
    జర్నలిస్ట్ సిరిసిల్ల, రాజన్న సిరిసిల్ల, తెలంగాణ•
    20 hrs ago
  • వరంగల్ జిల్లా:వర్ధన్నపేట మండలం కొత్తపల్లి క్రాస్ రోడ్డు జాతీయ రహదారిపై పోలీసులు రోడ్డు ప్రమాదాల నివారణపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ప్రమాదం జరిగినప్పుడు ప్రాణాలను ఎలా కాపాడుకోవాలో వివరిస్తూ ‘డెమో యాక్సిడెంట్’ చేసి ప్రత్యక్షంగా చూపించారు. ఈ కార్యక్రమంలో ఏసీపీ అంబటి నరసయ్య, సీఐ , ఎంవీఐ అధికారులు పాల్గొని వాహనదారులకు రహదారి భద్రతా సూచనలు అందించారు. యువత ట్రాఫిక్ నిబంధనలు తప్పకుండా పాటించాలని, అజాగ్రత్త వల్ల జరిగే ప్రమాదాలపై అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. ప్రతి ఒక్కరూ రహదారి భద్రతపై అవగాహన కలిగి ఉండాలని ఈ సందర్భంగా కోరారు.
    1
    వరంగల్ జిల్లా:వర్ధన్నపేట మండలం కొత్తపల్లి క్రాస్ రోడ్డు జాతీయ రహదారిపై పోలీసులు రోడ్డు ప్రమాదాల నివారణపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ప్రమాదం జరిగినప్పుడు ప్రాణాలను ఎలా కాపాడుకోవాలో వివరిస్తూ ‘డెమో యాక్సిడెంట్’ చేసి ప్రత్యక్షంగా చూపించారు.
ఈ కార్యక్రమంలో ఏసీపీ అంబటి నరసయ్య, సీఐ , ఎంవీఐ అధికారులు పాల్గొని వాహనదారులకు రహదారి భద్రతా సూచనలు అందించారు. యువత ట్రాఫిక్ నిబంధనలు తప్పకుండా పాటించాలని, అజాగ్రత్త వల్ల జరిగే ప్రమాదాలపై అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. ప్రతి ఒక్కరూ రహదారి భద్రతపై అవగాహన కలిగి ఉండాలని ఈ సందర్భంగా కోరారు.
    user_M D Azizuddin
    M D Azizuddin
    జర్నలిస్ట్ వర్ధన్నపేట, వరంగల్, తెలంగాణ•
    1 hr ago
  • జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలంలో కాంగ్రెస్ పార్టీకి మరో ఎదురుదెబ్బ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన మాజీ జెడ్పీటీసీ పిడుగు ప్రభాకర్ రెడ్డి సహా కీలక కాంగ్రెస్ నాయకులు పలువురు మాజీ సర్పంచ్‌లు, మాజీ ఎంపీటీసీలు, వార్డు సభ్యులు రాజీనామా చొప్పదండి కాంగ్రెస్ ఎమ్మెల్యే మేడిపెల్లి సత్యం వైఖరికి నిరసనగా రాజీనామా ఎమ్మెల్యే మేడిపెల్లి సత్యం గెలుపుకై శాయశక్తులా కృషి చేశాం కొడిమ్యాల మండలానికి ఇచ్చిన ఏ ఒక్క హామీ ఎమ్మెల్యే నెరవేర్చలేదు సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీలో ఎమ్మెల్యే అనుచరులు స్కాంకు పాల్పడుతున్నారు అన్ని తెలిసినా ఎమ్మెల్యే సత్యం ఆయన అనుచరులకే వంత పాడుతున్నారు పూడూర్ ఖాదీ బోర్డు ల్యాండ్ ఏమైందో ఎమ్మెల్యే సత్యం చెప్పాలి అంటూ నిలదీసిన కాంగ్రెస్ నాయకులు
    1
    జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలంలో కాంగ్రెస్ పార్టీకి మరో ఎదురుదెబ్బ
కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన మాజీ జెడ్పీటీసీ పిడుగు ప్రభాకర్ రెడ్డి సహా కీలక కాంగ్రెస్ నాయకులు
పలువురు మాజీ సర్పంచ్‌లు, మాజీ ఎంపీటీసీలు, వార్డు సభ్యులు రాజీనామా
చొప్పదండి కాంగ్రెస్ ఎమ్మెల్యే మేడిపెల్లి సత్యం వైఖరికి నిరసనగా రాజీనామా
ఎమ్మెల్యే మేడిపెల్లి సత్యం గెలుపుకై శాయశక్తులా కృషి చేశాం
కొడిమ్యాల మండలానికి ఇచ్చిన ఏ ఒక్క హామీ ఎమ్మెల్యే నెరవేర్చలేదు
సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీలో ఎమ్మెల్యే అనుచరులు స్కాంకు పాల్పడుతున్నారు
అన్ని తెలిసినా ఎమ్మెల్యే సత్యం ఆయన అనుచరులకే వంత పాడుతున్నారు
పూడూర్ ఖాదీ బోర్డు ల్యాండ్ ఏమైందో ఎమ్మెల్యే సత్యం చెప్పాలి అంటూ నిలదీసిన కాంగ్రెస్ నాయకులు
    user_అబ్దుల్ ముసవ్విర్
    అబ్దుల్ ముసవ్విర్
    కోరుట్ల, జగిత్యాల, తెలంగాణ•
    20 min ago
  • Post by Boke saikumar Boke saikumar
    1
    Post by Boke saikumar Boke saikumar
    user_Boke saikumar Boke saikumar
    Boke saikumar Boke saikumar
    Security Guard Sirikonda, Nizamabad•
    4 hrs ago
  • రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కులగణన ప్రక్రియ నేతకాని సామాజిక వర్గంలో పెను మంటలు రేపింది. ఉత్తర తెలంగాణ జిల్లాల్లో ప్రధాన శక్తిగా ఉన్న నేతకానీలను జనాభా లెక్కల్లో విస్మరించడంపై ఆ సామాజిక వర్గ నేతలు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తుతున్నారు. ఈ వివక్షను నిరసిస్తూ నేతకాని విద్యార్థి సంఘం (TNMVS OUJAC) రాష్ట్ర అధ్యక్షులు సాయిని ప్రసాద్ నేత ప్రభుత్వానికి ఘాటు హెచ్చరికలు జారీ చేశారు. ​"మా ఉనికిని తుడిచేస్తారా?" - ఆగ్రహం వ్యక్తం చేసిన సాయిని ప్రసాద్ ​కులగణన నివేదికల్లో నేతకాని కులానికి కనీస గుర్తింపు ఇవ్వకపోవడంపై ఓయూ వేదికగా జరిగిన సమావేశంలో సాయిని ప్రసాద్ నేత మాట్లాడారు. ఆయన మాటల్లోని ముఖ్యాంశాలు ​కుట్ర పూరిత వివక్ష: "తెలంగాణ గడ్డపై 12 లక్షల జనాభా కలిగిన మా సమాజాన్ని లెక్కల్లో చూపకపోవడం వెనుక పెద్ద కుట్ర దాగి ఉంది. ఇది కేవలం సాంకేతిక లోపం కాదు, నేతకానీల గొంతు నొక్కే ప్రయత్నం." ​40 నియోజకవర్గాల్లో పంజా: రాష్ట్రవ్యాప్తంగా 40 అసెంబ్లీ నియోజకవర్గాల్లో నేతకాని ఓటర్లు గెలుపోటములను నిర్ణయించే స్థాయిలో ఉన్నారని, తమను తక్కువ అంచనా వేస్తే ప్రభుత్వానికి పుట్టగతులు ఉండవని ఆయన హెచ్చరించారు. ​తొత్తుల పాలన: ప్రభుత్వం కొన్ని సామాజిక వర్గాలకు మాత్రమే కొమ్ముకాస్తూ, అత్యంత వెనుకబడిన నేతకానీలను విస్మరించడం దారుణమని ఆవేదన వ్యక్తం చేశారు. ​ఉద్యమ కార్యాచరణ సిద్ధం ​ప్రభుత్వ వైఖరికి నిరసనగా రాష్ట్రవ్యాప్తంగా దశలవారీగా ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని నాయకులు ప్రకటించారు. గ్రామస్థాయి నుంచి రాజధాని వరకు నేతకాని బిడ్డలంతా ఏకతాటిపైకి వచ్చి తమ అస్తిత్వాన్ని కాపాడుకోవాలని పిలుపునిచ్చారు.
    1
    రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కులగణన ప్రక్రియ నేతకాని సామాజిక వర్గంలో పెను మంటలు రేపింది. ఉత్తర తెలంగాణ జిల్లాల్లో ప్రధాన శక్తిగా ఉన్న నేతకానీలను జనాభా లెక్కల్లో విస్మరించడంపై ఆ సామాజిక వర్గ నేతలు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తుతున్నారు. ఈ వివక్షను నిరసిస్తూ నేతకాని విద్యార్థి సంఘం (TNMVS OUJAC) రాష్ట్ర అధ్యక్షులు సాయిని ప్రసాద్ నేత ప్రభుత్వానికి ఘాటు హెచ్చరికలు జారీ చేశారు.
​"మా ఉనికిని తుడిచేస్తారా?" - ఆగ్రహం వ్యక్తం చేసిన సాయిని ప్రసాద్
​కులగణన నివేదికల్లో నేతకాని కులానికి కనీస గుర్తింపు ఇవ్వకపోవడంపై ఓయూ వేదికగా జరిగిన సమావేశంలో సాయిని ప్రసాద్ నేత మాట్లాడారు. ఆయన మాటల్లోని ముఖ్యాంశాలు
​కుట్ర పూరిత వివక్ష: "తెలంగాణ గడ్డపై 12 లక్షల జనాభా కలిగిన మా సమాజాన్ని లెక్కల్లో చూపకపోవడం వెనుక పెద్ద కుట్ర దాగి ఉంది. ఇది కేవలం సాంకేతిక లోపం కాదు, నేతకానీల గొంతు నొక్కే ప్రయత్నం."
​40 నియోజకవర్గాల్లో పంజా: రాష్ట్రవ్యాప్తంగా 40 అసెంబ్లీ నియోజకవర్గాల్లో నేతకాని ఓటర్లు గెలుపోటములను నిర్ణయించే స్థాయిలో ఉన్నారని, తమను తక్కువ అంచనా వేస్తే ప్రభుత్వానికి పుట్టగతులు ఉండవని ఆయన హెచ్చరించారు.
​తొత్తుల పాలన: ప్రభుత్వం కొన్ని సామాజిక వర్గాలకు మాత్రమే కొమ్ముకాస్తూ, అత్యంత వెనుకబడిన నేతకానీలను విస్మరించడం దారుణమని ఆవేదన వ్యక్తం చేశారు.
​ఉద్యమ కార్యాచరణ సిద్ధం
​ప్రభుత్వ వైఖరికి నిరసనగా రాష్ట్రవ్యాప్తంగా దశలవారీగా ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని నాయకులు ప్రకటించారు. గ్రామస్థాయి నుంచి రాజధాని వరకు నేతకాని బిడ్డలంతా ఏకతాటిపైకి వచ్చి తమ అస్తిత్వాన్ని కాపాడుకోవాలని పిలుపునిచ్చారు.
    user_తుడుం జితేందర్
    తుడుం జితేందర్
    Local News Reporter జన్నారం, మంచిర్యాల, తెలంగాణ•
    6 hrs ago
  • హుజురాబాద్ సమీపంలో సిర్సపల్లి శివారులో డంపింగ్ యార్డ్ రద్దుకై జేఏసీ ఆధ్వర్యంలో కొనసాగుతున్న నిరసన ఆందోళనకు సంఘీభావంగా ఈనెల 22 నుంచి పాదయాత్ర చేస్తానని ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి తెలిపారు. హైదరాబాదులో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఎన్ని కేసులు పెట్టినా డంపింగ్ యార్డ్ రద్దయ్యే వరకు తన పోరాటం ఆగదని స్పష్టం చేశారు. కేంద్ర మంత్రి బండి సంజయ్, ఎంపీ ఈటల రాజేందర్ మౌనం వీడి ప్రజలతో కలిసి పోరాటం చేయాలని కోరారు. ప్రజల ఉద్యమంలో ప్రతి ఒక్కరు భాగస్వాములు కావాలని కోరారు.
    2
    హుజురాబాద్ సమీపంలో సిర్సపల్లి శివారులో డంపింగ్ యార్డ్ రద్దుకై జేఏసీ ఆధ్వర్యంలో కొనసాగుతున్న నిరసన ఆందోళనకు సంఘీభావంగా ఈనెల 22 నుంచి పాదయాత్ర చేస్తానని ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి తెలిపారు. హైదరాబాదులో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఎన్ని  కేసులు పెట్టినా డంపింగ్ యార్డ్ రద్దయ్యే వరకు తన పోరాటం ఆగదని స్పష్టం చేశారు. కేంద్ర మంత్రి బండి సంజయ్, ఎంపీ ఈటల రాజేందర్ మౌనం వీడి ప్రజలతో కలిసి పోరాటం చేయాలని కోరారు. ప్రజల ఉద్యమంలో ప్రతి ఒక్కరు భాగస్వాములు కావాలని కోరారు.
    user_K.V.REDDY
    K.V.REDDY
    చిగురుమామిడి, కరీంనగర్, తెలంగాణ•
    2 hrs ago
  • రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలోని శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం లో గురువారం మాస శివరాత్రి సందర్భంగా విశేష పూజా కార్యక్రమాలు ఘనంగా నిర్వహించబడ్డాయి.ఈ సందర్భంగా ఉదయం స్వామివారికి మహన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకం శాస్త్రోక్తంగా నిర్వహించారు. అనంతరం పరివార దేవతలకు ప్రత్యేక అర్చనలు నిర్వహించారు. సాయంత్రం మహా లింగార్చన కార్యక్రమంలో భాగంగా 365 జ్యోతులను వెలిగించి భక్తి శ్రద్ధలతో పూజలు చేశారు. ఈ కార్యక్రమాలను ఆలయ ప్రధాన అర్చకులు ఈశ్వర్ గారు, సురేష్ గారి ఆధ్వర్యంలో అర్చకులు, వేద పండితులు ఏకాంతంగా నిర్వహించారు.
    1
    రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలోని శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం లో గురువారం మాస శివరాత్రి సందర్భంగా విశేష పూజా కార్యక్రమాలు ఘనంగా నిర్వహించబడ్డాయి.ఈ సందర్భంగా ఉదయం స్వామివారికి మహన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకం శాస్త్రోక్తంగా నిర్వహించారు. అనంతరం పరివార దేవతలకు ప్రత్యేక అర్చనలు నిర్వహించారు. సాయంత్రం మహా లింగార్చన కార్యక్రమంలో భాగంగా 365 జ్యోతులను వెలిగించి భక్తి శ్రద్ధలతో పూజలు చేశారు.
ఈ కార్యక్రమాలను ఆలయ ప్రధాన అర్చకులు ఈశ్వర్ గారు, సురేష్ గారి ఆధ్వర్యంలో అర్చకులు, వేద పండితులు ఏకాంతంగా నిర్వహించారు.
    user_Satheesh gangu
    Satheesh gangu
    జర్నలిస్ట్ సిరిసిల్ల, రాజన్న సిరిసిల్ల, తెలంగాణ•
    22 hrs ago
  • హన్మకొండ జిల్లా:కాజీపేట మండలం మడికొండ చౌరస్తాలో కాంగ్రెస్ నాయకులు శుక్రవారం నిరసన చేపట్టారు. తెలంగాణ గౌరవాన్ని కించపరిచే వ్యాఖ్యలు చేసిన బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తూ ఆయన దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన నాయకులు, రాష్ట్ర ఏర్పాటును అవమానించేలా వ్యాఖ్యలు చేయడం అంగీకారయోగ్యం కాదని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
    1
    హన్మకొండ జిల్లా:కాజీపేట మండలం మడికొండ చౌరస్తాలో కాంగ్రెస్ నాయకులు శుక్రవారం నిరసన చేపట్టారు. తెలంగాణ గౌరవాన్ని కించపరిచే వ్యాఖ్యలు చేసిన బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తూ ఆయన దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన నాయకులు, రాష్ట్ర ఏర్పాటును అవమానించేలా వ్యాఖ్యలు చేయడం అంగీకారయోగ్యం కాదని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
    user_M D Azizuddin
    M D Azizuddin
    జర్నలిస్ట్ వర్ధన్నపేట, వరంగల్, తెలంగాణ•
    3 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.