Shuru
Apke Nagar Ki App…
రోడ్డు భద్రతపై అవగాహన కల్పించిన పోలీసులు.. వర్ధన్నపేటలో ‘డెమో యాక్సిడెంట్’ వరంగల్ జిల్లా:వర్ధన్నపేట మండలం కొత్తపల్లి క్రాస్ రోడ్డు జాతీయ రహదారిపై పోలీసులు రోడ్డు ప్రమాదాల నివారణపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ప్రమాదం జరిగినప్పుడు ప్రాణాలను ఎలా కాపాడుకోవాలో వివరిస్తూ ‘డెమో యాక్సిడెంట్’ చేసి ప్రత్యక్షంగా చూపించారు. ఈ కార్యక్రమంలో ఏసీపీ అంబటి నరసయ్య, సీఐ , ఎంవీఐ అధికారులు పాల్గొని వాహనదారులకు రహదారి భద్రతా సూచనలు అందించారు. యువత ట్రాఫిక్ నిబంధనలు తప్పకుండా పాటించాలని, అజాగ్రత్త వల్ల జరిగే ప్రమాదాలపై అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. ప్రతి ఒక్కరూ రహదారి భద్రతపై అవగాహన కలిగి ఉండాలని ఈ సందర్భంగా కోరారు.
M D Azizuddin
రోడ్డు భద్రతపై అవగాహన కల్పించిన పోలీసులు.. వర్ధన్నపేటలో ‘డెమో యాక్సిడెంట్’ వరంగల్ జిల్లా:వర్ధన్నపేట మండలం కొత్తపల్లి క్రాస్ రోడ్డు జాతీయ రహదారిపై పోలీసులు రోడ్డు ప్రమాదాల నివారణపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ప్రమాదం జరిగినప్పుడు ప్రాణాలను ఎలా కాపాడుకోవాలో వివరిస్తూ ‘డెమో యాక్సిడెంట్’ చేసి ప్రత్యక్షంగా చూపించారు. ఈ కార్యక్రమంలో ఏసీపీ అంబటి నరసయ్య, సీఐ , ఎంవీఐ అధికారులు పాల్గొని వాహనదారులకు రహదారి భద్రతా సూచనలు అందించారు. యువత ట్రాఫిక్ నిబంధనలు తప్పకుండా పాటించాలని, అజాగ్రత్త వల్ల జరిగే ప్రమాదాలపై అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. ప్రతి ఒక్కరూ రహదారి భద్రతపై అవగాహన కలిగి ఉండాలని ఈ సందర్భంగా కోరారు.
More news from తెలంగాణ and nearby areas
- రాజన్న సిరిసిల్ల జిల్లా ఇందిరానగర్ లో రుణం చెల్లించలేదని బ్యాంక్ అధికారులు ప్రవర్తించిన తీరు సర్వత్రా ఆందోళనకు గురిచేస్తుంది. అనారోగ్యంతో రుణం చెల్లించలేని స్థితిలో ఉన్న వ్యక్తి పట్ల విచక్షణారహితంగా ప్రవర్తించారు. గోపాల్ అనే ఐకేఎఫ్ బ్యాంకులో రుణం తీసుకున్నారు. అనారోగ్యంతో కాలు కోల్పోయిన గోపాల్ సకాలంలో రుణం చెల్లించలేదు. దీంతో బ్యాంక్ అధికారులు ఇంటికి వెళ్లి అనారోగ్యంతో ఉన్న గోపాల్ బయటికి గెంటేసి ఇంటికి తాళం వేసి సీజ్ చేశారు. కట్టుబట్టలతో రోడ్డు మీద పడ్డ కుటుంబాన్ని చూసి స్థానికులు ఆవేదనతో ఆందోళన వ్యక్తం చేశారు. అనారోగ్యంతో ఉన్న వికలాంగుడని కనీస మానవత్వం లేకుండా ఎర్రటి ఎండలో బయటకు గెంటేయడంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కలెక్టర్ తో పాటు జిల్లా అధికారులు జోక్యం చేసుకొని విచక్షణారహితంగా ప్రవర్తించిన బ్యాంక్ అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని కోరారు.2
- Post by Solanke Ravi4
- సాధన సురుల ఇంద్రజాల విన్యాసాలు... గన్నేరువరం మండల కేంద్రంలో పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో సాధనసురుల ఇంద్రజాల విన్యాసాలు. సాధన సూర్యుల విన్యాసాలలో శత్రువుల నుండి మనం ఎలా రక్షించుకోవాలో కర్రతో కళాకారులు చేసిన విన్యాసాలు. అలాగే మట్టి తో మాణిక్యాలు తయారు చేసి రాళ్లతో దేవుళ్లను తయారు చేసి ప్రజలను ఆశ్చర్యపరుస్తున్న ఇంద్రజాల విన్యాసాలకు మండల కేంద్రంలో చప్పట్ల కేరింతల మధ్యన విన్యాసాలు చేశారు చివరిలో దయ్యం గెటప్తో అందర్నీ ఆశ్చర్యపరిచారు..1
- చిగురుమామిడి మండలం లంబాడిపల్లిలో విషాదం చోటుచేసుకుంది. పొలం నుంచి వడ్ల లోడుతో వస్తున్న ట్రాక్టర్ అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో డ్రైవర్ కాటం కిషన్ రెడ్డి అక్కడికక్కడే మృతి చెందారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి వెళ్లి దర్యాప్తు చేస్తున్నారు. ధాన్యం తరలిస్తుండగా జరిగిన ఈ ప్రమాదం గ్రామంలో తీవ్ర విషాదాన్ని నింపింది. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.1
- రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలోని శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం అనుబంధ ఆలయమైన శ్రీ భీమేశ్వర స్వామి వారిని తెలంగాణ రాష్ట్ర రైల్వే మరియు రోడ్డు భద్రత ఐజీపి దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.ఈసందర్భంగా ఆలయానికి చేరుకున్న ఐజిపి కి ఆలయ అర్చకులు,వేద పండితులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు.దర్శనం అనంతరం ఆలయ మండపంలో స్వామివారి శేషవస్త్రం కప్పి, లడ్డూ ప్రసాదాన్ని అందజేసి ఆశీర్వచనం ఇచ్చారు.వారి వెంట వేములవాడ డీఎస్పీ శ్రీనివాసులు, సీఐ వీరప్రసాద్,ఆర్.ఐ సురేష్, ఎస్సైలు,అలాగే ప్రోటోకాల్ ఏఈఓ జి. అశోక్ కుమార్,ఆలయ పర్యవేక్షకులు ఎన్. రాజేందర్, ఆలయ ఉద్యోగులు కూడా హాజరయ్యారు.1
- Post by Shyam sunder Yadav Pulapally1
- హన్మకొండ జిల్లా:కాజీపేట మండలం మడికొండ చౌరస్తాలో కాంగ్రెస్ నాయకులు శుక్రవారం నిరసన చేపట్టారు. తెలంగాణ గౌరవాన్ని కించపరిచే వ్యాఖ్యలు చేసిన బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తూ ఆయన దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన నాయకులు, రాష్ట్ర ఏర్పాటును అవమానించేలా వ్యాఖ్యలు చేయడం అంగీకారయోగ్యం కాదని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.1
- హుజురాబాద్ సమీపంలో సిర్సపల్లి శివారులో డంపింగ్ యార్డ్ రద్దుకై జేఏసీ ఆధ్వర్యంలో కొనసాగుతున్న నిరసన ఆందోళనకు సంఘీభావంగా ఈనెల 22 నుంచి పాదయాత్ర చేస్తానని ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి తెలిపారు. హైదరాబాదులో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఎన్ని కేసులు పెట్టినా డంపింగ్ యార్డ్ రద్దయ్యే వరకు తన పోరాటం ఆగదని స్పష్టం చేశారు. కేంద్ర మంత్రి బండి సంజయ్, ఎంపీ ఈటల రాజేందర్ మౌనం వీడి ప్రజలతో కలిసి పోరాటం చేయాలని కోరారు. ప్రజల ఉద్యమంలో ప్రతి ఒక్కరు భాగస్వాములు కావాలని కోరారు.2
- lగన్నేరువరం: మండలం మైలారం గ్రామంలోని మున్నూరు కాపు సంఘం భవనంలో గురువారం హిందూ సమ్మేళన కమిటీ సభ్యులు సమావేశం నిర్వహించారు. ఈనెల 23న జరగనున్న హిందూ సమ్మేళన కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు తరలి రావాలి అవసరమైన ఏర్పాట్లపై చర్చించారు. కార్యక్రమానికి విస్తృత స్థాయిలో ప్రజలను ఆకర్షించేలా చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు. హిందువులందరూ కులమతాలకు అతీతంగా ఐక్యంగా ఉండాలని కమిటీ సభ్యులు పిలుపునిచ్చారు.1